ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు | Peter Schiff Warns Fed Has Lost Credibility As Investors Turn To Gold, Silver And Bitcoin, Check Out More Details | Sakshi
Sakshi News home page

ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు

Aug 23 2026 3:50 PM | Updated on Aug 23 2026 5:24 PM

Peter Schiff Warns of Rising Inflation Fears

అమెరికన్ స్టాక్ బ్రోకర్, ఆర్థిక వ్యాఖ్యాత, యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సీఈఓ 'పీటర్ షిఫ్' (Peter Schiff) తన ట్వీట్‌లో అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ (Fed)పై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న అనుమానాల గురించి పేర్కొన్నారు. బంగారం, వెండి, చమురు, బిట్‌కాయిన్ ధరలను ఉదాహరణగా తీసుకుని.. ప్రజలు తమ డబ్బును ద్రవ్యోల్బణం నుంచి కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు వెళ్తున్నారని ఆయన చెబుతున్నారు.

సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు డబ్బు విలువ తగ్గుతుందనే ఆందోళనతో కొంతమంది బంగారం వంటి ఆస్తులను సురక్షితమైన ఆస్తులుగా ఎంచుకుంటారు. ఇందులోనే పెట్టుబడులు పెడుతుంటారు.

షిఫ్ అభిప్రాయం ప్రకారం.. ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అమెరికా ప్రభుత్వ భారీ రుణభారం, అధిక వడ్డీ రేట్ల ప్రభావం వంటి కారణాల వల్ల అది కష్టంగా మారే అవకాశం ఉంది. అందుకే ఫెడ్ చివరికి ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అణచివేయడం కంటే కొంత ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని సహించాల్సి రావచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది ఫెడ్ అధికారిక ప్రకటన కాదు.. షిఫ్ చేసిన ఆర్థిక విశ్లేషణ మాత్రమే.

పెట్టుబడిదారులు తమ డబ్బును కాపాడుకునేందుకు తమకు నచ్చిన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కొందరు బంగారం, వెండి వైపు వెళ్తే, మరికొందరు బిట్‌కాయిన్ ఎంచుకోవచ్చు. మొత్తం మీద.. ఫెడ్ మీద నమ్మకం తగ్గుతున్న కొద్దీ, ద్రవ్యోల్బణం నుంచి తమ సంపదను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ప్రత్యామ్నాయ ఆస్తుల వైపు చూస్తున్నారని షిఫ్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement