వాషింగ్టన్: అమెరికా గ్రీన్‌కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. పాత వెర్షన్‌లను ఉపయోగించి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 18 తర్వాత తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. శాశ్వత నివాసాన్ని నమో దు చేసుకోవడానికి లేదా హోదాను మార్చుకోవడానికి ఉద్దేశించిన కొత్త ఫారం ఐ–485 అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
ఇది సెపె్టంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పబ్లిక్ చార్జ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని స్పష్టంచేసింది. 2025 జనవరి 20 నాటి వెర్షన్ ఫారం ఐ–485ని తిరస్కరిస్తా మని పేర్కొంది. ఈ పాత వెర్షన్‌ను సెప్టెంబర్ 18కి ముందే పోస్ట్‌మార్క్ చేసినా లేదా ఎల్రక్టానిక్ పద్ధతిలో సమరి్పంచినా ఆమోదం పొందుతుందని తెలియజేసింది. గతంలో ట్రంప్ ప్రభుత్వం ‘పబ్లిక్ చార్జ్’నిర్వచనాన్ని విస్తరించింది. మెడికేడ్, ఫుడ్ స్టాంపులు, ప్రభుత్వం నుండి ఏదైనా ప్రయోజనాలను పొందుతున్న వారి వలసదార్ల గ్రీన్‌కార్డు దరఖాస్తులను తిరస్కరిస్తోంది.


