సరే.. మమ్మీ నువ్వే కాల్‌ చెయ్‌ | Telangana man dies in US road accident | Sakshi
Sakshi News home page

సరే.. మమ్మీ నువ్వే కాల్‌ చెయ్‌

Aug 27 2026 11:27 AM | Updated on Aug 27 2026 11:39 AM

Telangana man dies in US road accident

నిజామాబాద్‌అర్బన్‌: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన రాహుల్‌ చివరి సారిగా తన తల్లితో ఫోన్‌లో ఈనెల 24వ తేదీన ఉదయం 9గంటలకు మాట్లాడాడు. తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలోనే స్నేహితులు క్యాబ్‌లో రావడంతో ‘‘ఆఫీస్‌కు వెళ్తున్నానని, రేపు ఉదయం నువ్వే కాల్‌ చెయ్‌ మమ్మీ..’’ అంటూ ఫోన్‌ కట్‌చేశాడు. 

అవే రాహుల్‌ చివరి మాటలు అంటూ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. నవీపేట మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన నాగమణి, హరిబాబు జిల్లా కేంద్రంలోని గూపన్‌పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నాగమణి గృహిణి కాగా, హరిబాబు రైల్వేలో ఏఎస్సైగా పని చేసి రిటైర్‌ అయ్యారు. కొడుకు రాహుల్‌ నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. 

పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్న రాహుల్‌ అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. మే 5వ తేదీన తన చెల్లె పెళ్లికి ఇంటికొచ్చిన రాహుల్‌ అదే నెలలో 18వ తేదీన తిరిగి అమెరికాకు వెళ్లిపోయాడు. తన తల్లితో సోమవారం ఫోన్‌లో మాట్లాడిన కొద్దిసేపటికే రాహుల్‌ దుర్మరణం పాలయ్యాడు. చేతికొచ్చిన కొడుకు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుంబెలుబాదుకుంటున్నారు. తన కొడుకు మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని తండ్రి హరిబాబు రోదిస్తూ వేడుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement