ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్‌ వార్నింగ్ | Trump vows to hit Iran hard after first exchanges of fire in a month | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవు.. ట్రంప్‌ వార్నింగ్

Aug 31 2026 11:11 PM | Updated on Aug 31 2026 11:11 PM

Trump vows to hit Iran hard after first exchanges of fire in a month

source: X

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత (ఆదివారం) మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్‌ జలసంధిలోని ఇరాన్‌ లారక్‌ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్‌ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారాస్థాయికి చేరినట్లైంది.

ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. ఇరాన్‌పై మరింత తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు.

ఇరాన్‌ ప్రతిదాడుల తర్వాత ట్రంప్‌ తన ట్రూత్‌ ఖాతాలో ఇరాన్‌లోని కీలక చమురు కేంద్రం 'ఖార్గ్ ద్వీపం' పేలిపోతున్నట్లు ఓ ఏఐ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే దీనిపై అమెరికాకు చెందిన ఓ కీలక అధికారి భిన్నంగా స్పందించాడు. అమెరికా ఖార్గ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోలేదని ఆయన తెలిపాడు.

ఖార్గ్ ద్వీపం యుద్ధానికి ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం నిర్వహించేది. ఒకవేళ అక్కడ దాడి జరిగితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇరాన్ అధ్యక్షుడి శాంతి స్వరం
జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడుల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్‌ శాంతి స్వరం వినిపించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కిర్గిజిస్థాన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ ఇంకా చర్చల ద్వారా ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని అన్నాడు. యుద్ధం కొనసాగడం ఎవరికీ ప్రయోజనం కలిగించదని పేర్కొన్నాడు.

చదవండి: అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్‌ ఎదురుదెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement