4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని.. | Scientists discovered 4 snakes curled together in a burrow for 38 million years | Sakshi
Sakshi News home page

4 పాములు.. అప్పుడు ఒకదానికొకటి చుట్టుకుని..

Aug 20 2026 7:47 PM | Updated on Aug 20 2026 8:03 PM

Scientists discovered 4 snakes curled together in a burrow for 38 million years

అమెరికాలోని వ్యోమింగ్‌,  వైట్ రివర్ ఫార్మేషన్‌లో శాస్త్రవేత్తలకు సుమారు 38 మిలియన్ సంవత్సరాల నాటి 4 పాముల శిలాజాలు లభించాయి. ఇవి ఒకదానికొకటి చుట్టుకుని, బొరియలాంటి ప్రదేశంలో కలిసి ఉన్న స్థితిలోనే శిలాజాలుగా మారాయి. ఈ కొత్త జాతికి హైబర్నోఫిస్ బ్రెయితాప్టి అని పేరు పెట్టారు.

వైట్ రివర్ ఫార్మేషన్‌లో లభించిన ఈ శిలాజాలను అగ్నిపర్వత బూడిద, మట్టి, వరద నీరు కలిసి వేగంగా కప్పివేయడంతో ఇంతకాలం చెక్కుచెదరకుండా ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా పాముల శిలాజాలు విడిపోయిన వెన్నెముక భాగాల రూపంలో మాత్రమే దొరుకుతాయి. కానీ ఇక్కడ పూర్తి అస్థిపంజరాలు లభించడం ప్రత్యేకత.

మూడు పాములు ఒకే చోట కలిసి ఉండటం వల్ల అవి చలికాలంలో ఒకే బొరిలో ఆశ్రయం పొందేవని, బహుశా కలిసి నిద్రాణ స్థితిలో ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, పాములు నిజంగానే నిద్రాణ స్థితిలో ఉన్నాయని నిర్ధారించడానికి శిలాజ ఆధారాలు సరిపోవని వారు చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ ద్వారా ప్రాచీన పాముల పరిణామక్రమంతో పాటు వాటి సామూహిక ప్రవర్తనపై కూడా కీలక సమాచారం లభించింది.

పాముల శరీరంలో తల నుంచి తోక వరకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఇందులో వందల సంఖ్యలో వెన్నుపూసలు ఉంటాయి. పాముల వెన్నెముకలో సాధారణంగా వందలాది వెన్నుపూసలు ఉంటాయి. ప్రతి వెన్నుపూసకు పక్కటెముకలు అనుసంధానమై ఉంటాయి. వెన్నెముక చాలా వంగేలా ఉండటం వల్ల పాములు మెలికలు తిరుగుతూ కదలగలుగుతాయి. పాములకు చేతులు, కాళ్లు లేకపోయినా వెన్నెముక మాత్రం ఉంటుంది.

ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవి.. 
కాగా, ఈ పాములు ప్రారంభ ఒలిగోసీన్ కాలానికి చెందినవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ ద్వారా ఉత్తర అమెరికాలోని చిన్న బొరియల్లో నివసించే పాముల చరిత్రపై కొత్త సమాచారం లభించింది. ఈ పాముల సమూహం గురించి శాస్త్రవేత్తలు 1986లోనే తొలిసారి వివరించారు. ఈ శిలాజాలు పాములు కలిసి ఆశ్రయం పొందిన ప్రదేశానికి సంబంధించినవి కావచ్చని సూచించారు. శిలాజాల వెన్నుపూసలు, పుర్రెను నిశితంగా పరిశీలించిన తర్వాత ఇవి గతంలో తెలిసిన ఒగ్మోఫిస్, కలమాగ్రాస్ పాముల నుంచి భిన్నమైనవని తేలింది. పరిణామ విశ్లేషణలో ఈ కొత్త పాము ఇతర బోయిడ్ పాములన్నింటికీ సోదర సమూహంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు.  

ఇదీ చదవండి: యువతి దుర్మరణం కేసులో ఎంపీ లింగమనేని కుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement