లైబ్రరీలో ఎవరైనా పుస్తకం రెండు రోజులు ఆలస్యంగా ఇస్తారు. లేదా రెండు వారాలు! కానీ అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్‌లో ఓ వ్యక్తి మాత్రం ఏకంగా శతాబ్దం దాటాక రిటర్న్ చేశారు. అసలు ఏమైందంటే, 1894 సెప్టెంబర్‌లో తీసుకున్న మ్యాగజైన్ ను తాజాగా లైబ్రరీకి తిరిగి ఇచ్చారు. అంటే దాదాపు 132 ఏళ్ల తర్వాత! ఆ మ్యాగజైన్ ‘ది సెంచరీ ఇలస్ట్రేటెడ్ మంత్లీ’. ఇన్నేళ్లు అది తన ఇంట్లో ఎలా చేరిందో తనకే తెలియదని జాన్ అనే వ్యక్తి లైబ్రేరియన్లకు చెప్పారు. ఇటీవల లైబ్రరీలో పాత బకాయిల ఫైన్ మాఫీ చేస్తున్నారని తెలుసుకుని, వెంటనే మ్యాగజైన్ ను తిరిగి ఇచ్చేశారు.
లేకపోతే 48,220 రోజుల ఆలస్యానికి 12,055 డాలర్ల ఫైన్ పడేది! అదృష్టవశాత్తూ లైబ్రరీ ప్రస్తుతం ఓవర్‌డ్యూ ఫైన్లను నిలిపివేసింది. దీంతో జాన్ జేబుకు భారీ ఊరట! అయితే ఈ మ్యాగజైన్ ను మళ్లీ చదవడానికి షెల్ఫ్‌లో పెట్టలేదు. భవిష్యత్తులో దీనిని ప్రత్యేక ప్రదర్శనలో ఉంచే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి లైబ్రరీకి వచ్చిన ఈ లేట్ రిటర్న్ మరో అద్భుతంగా చరిత్రలో నిలిచిపోనుంది!


