కృష్ణబిలం.. ఆపై నక్షత్రం!  | Astronomers discover a new kind of cosmic object a black hole star | Sakshi
Sakshi News home page

కృష్ణబిలం.. ఆపై నక్షత్రం! 

Aug 14 2026 5:33 AM | Updated on Aug 14 2026 5:33 AM

Astronomers discover a new kind of cosmic object a black hole star

సౌర కుటుంబం సైజు 

లక్ష సూరీళ్ల వెలుగు 

విశ్వంలో కొత్త ఖగోళ వస్తువు 

భూమితోపాటు ఎనిమిది గ్రహాలున్న మన సౌర కుటుంబానికి వెలుగునిచ్చే అతి పెద్ద నక్షత్రం మన సూరీడు! ఈ సహజ నక్షత్రం సైజు ఎంతో తెలుసా? భూమిలాంటి గ్రహాలు సుమారు 13 లక్షలు కలిపితే ఉండేంత! అంతటి సూరీడికి లక్ష రెట్లు పెద్దదైన ఖగోళ వస్తువును ఒక్కసారి ఊహించుకోండి???? కొంచెం అటుఇటుగా సౌర కుటుంబం ఒకమూల నుంచి ఇంకో మూల వరకూ ఉన్న వంద అస్ట్రనామికల్‌ యూనిట్ల సైజు! 

అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త రోహన్‌ నాయుడు అత్యాధునిక జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు సాయంతో మొట్టమొదటిసారి ఇలాంటి ఖగోళ వస్తువును గుర్తించారు. విశ్వ రహస్యాలు ఛేదించగల ఈ ఆవిష్కరణతో ఇప్పుడు ‘‘కృష్ణ బిల నక్షత్రం’’అన్న పదం ఖగోళ వస్తువుల జాబితాలోకి చేరింది!!!  విశ్వం మొత్తం 13.5 కోట్ల ఏళ్ల క్రితంనాటి మహా విస్ఫోటనంతో మొదలైందని సైన్స్‌ చెబుతుంది. ఆ తరువాత క్రమేపీ విస్తరించే క్రమంలో గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణ బిలాలు ఏర్పడ్డాయి. 

ఈ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు, మరెన్నో రహస్యాలను ఛేదించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఎంఐటీ శాస్త్రవేత్త రోహన్‌ నాయుడు చేసిన ప్రయత్నాల్లోనే సౌర కుటుంబం సైజున్న భారీ ఖగోళ వస్తువు ఉనికి స్పష్టమైంది. విశ్వం ఏర్పడ్డ కొన్ని లక్షల సంవత్సరాల కాలంలోనే ఈ ‘ఎంఓఎం–బీహెచ్‌1’కూడా పుట్టుకొచి్చందని అంచనా. మన సూర్యుడి కంటే కోట్ల రెట్లు ఎక్కువ వెలుగునిస్తూండటంతో నక్షత్రమేమో అనుకున్నారు కానీ లక్షణాలను నిశితంగా పరిశీలిస్తే... మునుపెన్నడూ చూడనిదని తెలిసింది. పోనీ కృష్ణ బిలమని అనుకుందామా అంటే ఆ ఛాయలు కూడా లేవు. దీంతో రోహన్‌ నాయుడు దీనికో కొత్త పేరు పెట్టారు.  కృష్ణ బిల నక్షత్రం అని!     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement