ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా | US military began striking targets in Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టిన అమెరికా

Sep 1 2026 10:36 PM | Updated on Sep 1 2026 10:43 PM

US military began striking targets in Iran

source: X

ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు ప్రారంభించాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దాడులు ప్రారంభమైనట్లు అమెరికా వెల్లడించింది.

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని IRGC ఇటీవల దాడులకు ప్రయత్నించిందని అమెరికా పేర్కొంది. అలాగే ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా సైనికులపై కూడా IRGC దాడులకు ప్రయత్నించినట్లు తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే IRGC లక్ష్యాలపై అమెరికా సైనిక చర్య చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధి చుట్టూ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు తాజా దాడులతో మరింత పెరిగే అవకాశం ఉంది.

కాగా, అమెరికా-ఇరాన్ మధ్య దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఆదివారం మరోసారి దాడి-ప్రతిదాడులు జరిగాయి. తొలుత హర్ముజ్‌ జలసంధిలోని ఇరాన్‌ లారక్‌ దీవిపై అమెరికా దాడి చేయగా (ముగ్గురు చనిపోయారు).. ప్రతీకారంగా ఇరాన్‌ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. 

ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్ననే తీవ్ర దాడులు తప్పవని గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు.

చదవండి: ఉత్తరకొరియా బిగ్‌ వార్నింగ్‌.. ఇలాగైతే ప్రపంచం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement