breaking news
International
-
నేపాల్‌లో వరుస భూకంపాలు.. భయాందోళనలో ప్రజలు
కాఠ్మాండూ: నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండుసార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. మూడు గంటల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. తొలి భూకంపం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో, రెండోది 4.2 తీవ్రతతో నమోదైంది.నేషనల్ సిస్మోలాజికల్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:51 గంటలకు తొలి భూకంపం నమోదైంది. దీని తీవ్రత 4.5గా నమోదైనట్లు వెల్లడించింది. అనంతరం మూడు గంటల్లోపే మరోసారి భూమి కంపించింది. ఉదయం 4:28 గంటలకు 4.2 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా ముగు జిల్లాలోని కలీయీ ప్రాంతం పరిసరాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాలనూ తాకాయి.ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న నేపాల్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. మంగళవారం నాటికి ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,399కి పెరిగినట్లు అధికారులు తెలిపారు. నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో మంచు, రాళ్లు జారిపడటంతో సంభవించిన ఈ ఆకస్మిక వరదలు ఉత్తర, మధ్య నేపాల్‌లోని పట్టణాలు, గ్రామాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.ఇదీ చదవండి: దిశా మృతి కేసు దర్యాప్తు.. ఎవరీ సీమా పాహుజా? -
సముద్రం.. గడ్డకట్టే చలి.. 62 గంటల తర్వాత..
ఒళ్లు గగుర్పొడిచే ఘటన అలాస్కా తీరంలో జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. చిన్న పడవ ఒక్కసారిగా సముద్రంలో బోల్తా పడటంతో 15 ఏళ్ల డెరిక్ పార్కర్ అఘ్నాంగ తన అన్న, కజిన్‌ను కోల్పోయాడు. అయితే ప్రాణాలతో బయటపడేందుకు దాదాపు మూడు రోజుల పాటు సముద్రంలో మంచు గడ్డలతో పోరాటం చేశాడు. సెప్టెంబర్ 5న జరిగిన ఈ ఘటన జరగ్గా, సుమారు 62 గంటల తర్వాత డెరిక్‌ను రక్షించారు.పడవ బోల్తా పడిన తర్వాత డెరిక్‌తో పాటు అతని అన్న, కజిన్ సముద్రంలో పడిపోయారు. కొంతసేపు ముగ్గురూ ఒకరికొకరు దగ్గరగా ఉండగలిగారు. అయితే పరిస్థితులు మరింత విషమించడంతో అతని అన్న, కజిన్ మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారు తన నుంచి దూరంగా కొట్టుకుపోకుండా ఉండేందుకు డెరిక్ తన అన్న, కజిన్ మృతదేహాలను సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాడు. చివరకు బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా వారిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో అతను ఒంటరిగా సముద్రంలో మిగిలిపోయాడు.పడవలోని చేపల వేటకు ఉపయోగించే ఓ లైన్.. ఇంజిన్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. దాన్ని విడిపించేందుకు వారు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. అనంతరం వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారడంతో పడవ బోల్తా పడింది. పడవ తిరగబడటంతో అందరూ గడ్డకట్టేంత చల్లని సముద్రంలో పడిపోయారు. కొన్ని గంటలకు డెరిక్ అన్న, కజిన్ మృతి చెందారు. అయినప్పటికీ డెరిక్ వారిని వదలకుండా వీలైనంత వరకు పట్టుకుని ఉన్నాడు. సాయం అందుతుందనే ఆశతో సముద్రంలోనే పోరాడాడు.సెప్టెంబర్ 7 ఉదయం అమెరికా కోస్ట్ గార్డ్ బృందం బోల్తా పడిన పడవను గుర్తించింది. అది సెయింట్ లారెన్స్ ద్వీపానికి తూర్పున సుమారు నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అధికారులు ముందుగా డెరిక్‌కు అవసరమైన ప్రాణరక్షణ సామగ్రిని అందించారు. అనంతరం సమీపంలోని నౌక అతడిని రక్షించింది.అప్పటికే డెరిక్ తీవ్ర హైపోథర్మియాతో బాధపడుతున్నాడు. శరీరంలో నీరు తీవ్రంగా తగ్గిపోయి.. చలికి గురై అతని పరిస్థితి విషమంగా ఉంది. అయినప్పటికీ అతను శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. వెంటనే అత్యవసర చికిత్స కోసం అతడిని వైద్య కేంద్రానికి తరలించారు. డెరిక్ అత్త కొలీన్ వాకర్ గోఫండ్‌మీ పేజీలో ఈ విషాద ఘటన వివరాలను వెల్లడించారు. తన అన్న, కజిన్ మునిగిపోయిన తర్వాత వారిని సాధ్యమైనంత ఎక్కువసేపు పట్టుకుని ఉండేందుకు డెరిక్ ప్రయత్నించాడని ఆమె తెలిపారు. -
ఇక చిటికెలో టీబీ గుర్తింపు.. 16 ఏళ్ల కుర్రాడి వినూత్న ఆవిష్కరణ!
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఆస్టిన్ జిన్.. క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్-టీబీ)ని రక్త పరీక్ష ద్వారా గుర్తించడంతోపాటు, ఔషధ నిరోధకత కలిగిన బ్యాక్టీరియాను గుర్తించగల క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్(సీఆర్ఐఎస్పీఆర్) ఆధారిత నిర్ధారణ వ్యవస్థను అభివృద్ధి చేశాడు. ఈ పరిశోధనకు గాను ఆస్టిన్ జిన్‌కు 2026 డేవిడ్సన్ ఫెలోషిప్తో పాటు 50,000 డాలర్ల స్కాలర్షిప్ లభించింది.న్యూయార్క్‌లోని గ్రేట్ నెక్లో ఉన్న విలియం ఎ. షైన్ గ్రేట్ నెక్ సౌత్ హైస్కూల్లో సీనియర్ అయిన జిన్.. ఎం- క్యాచ్ అనే డయాగ్నస్టిక్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షలకు పైగా మరణాలకు కారణమవుతున్న ట్యూబర్క్యులోసిస్ నిర్ధారణలో ఎదురయ్యే సమస్యను పరిష్కరించేందుకు ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాడు.సాధారణంగా టీబీ నిర్ధారణకు ఊపిరితిత్తుల లోతు నుంచి వచ్చే కఫాన్ని ఉపయోగిస్తారు. అయితే చిన్నారులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తగిన నమూనాను అందించడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు భిన్నమైన విధానాన్ని జిన్ తన ప్రాజెక్ట్‌లో అనుసరించాడు. ఎం-క్యాచ్ రక్త సీరమ్‌లో ఉండే బ్యాక్టీరియా ఎన్డీఏ చిన్న భాగాలను గుర్తిస్తుంది. ఇందుకోసం పాలిమరేజ్ చైన్ రియాక్షన్స్‌తో పాటు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది. టీబీ ఉందా లేదా అన్నదాన్ని గుర్తించడంతోపాటు, కొన్ని ఔషధాలకు బ్యాక్టీరియా నిరోధకతను కలిగించే జన్యు మార్పులను కూడా ఈ పరీక్ష గుర్తించగలదు.ఈ సూక్ష్మ జన్యు మార్పులను గుర్తించేందుకు జిన్ ప్రత్యేక సీఆర్ఐఎస్పీఆర్ గైడ్ ఆరఎన్ఏలను రూపొందించాడు. వాటిని మైక్రోఫ్లూయిడిక్స్ చిప్‌తో అనుసంధానించాడు. దీంతో ఒకేసారి అనేక రియాక్షన్లు నిర్వహించవచ్చు. ఫలితంగా వందలాది రియాక్షన్లను, ఒకటి కంటే ఎక్కువ మ్యుటేషన్లను ఏకకాలంలో పరీక్షించే మల్టీప్లెక్స్ ప్లాట్‌ఫామ్ రూపొందింది. అత్యాధునిక ప్రయోగశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పెద్దస్థాయి పరీక్షలకు ఇది భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది.భవిష్యత్తులో బయోమెడికల్ ఇంజినీరింగ్, బయోకెమిస్ట్రీ చదివి వైద్యునిగా, శాస్త్రవేత్తగా పనిచేయాలని జిన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రయోగశాల పరిశోధనలను వైద్యానికి ఉపయోగపడే సాధనాలుగా మార్చాలనేది అతని ఆశయం. భవిష్యత్తులో ఎం క్యాచ్ ప్లాట్‌ఫామ్‌ను ఇతర అంటువ్యాధులను, క్యాన్సర్‌ను గుర్తించేందుకు కూడా ఉపయోగపడనున్నదని సమాచారం.ఇదీ చదవండి: విశ్వ వీక్షణ నిలయం.. ఈ గణేశ మండపం -
ఇరాన్ విమానంలో భయానక సీన్
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఒక్కసారిగా భారీగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఇంతలో క్యాబిన్ పైకప్పు భాగాలు ఊడిపడి సీట్లపై వేలాడుతూ కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకుని బ్యాగులు కిందపడటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరకు పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.ఇరాన్‌కు చెందిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం మంగళవారం సాయంత్రం మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ గేర్‌లోని ఓ టైరు ఊడిపోయింది. ఆ టైరు దెబ్బతినడంతో దాని భాగాలు ఇంజిన్‌ను తాకాయి. దీంతో ఇంజిన్‌లో సమస్య తలెత్తి విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించి విమానాన్ని మషద్ వైపు మళ్లించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి తిరిగి ల్యాండ్ చేయాలని నిర్ణయించారు.భయంతో కేకలు..విమానం తిరిగి వస్తున్న సమయంలో కుదుపులు మరింత తీవ్రంగా మారాయి. ఆ ప్రభావంతో క్యాబిన్ పైకప్పు లోపలి లైనింగ్ భాగాలు ఊడిపోయి ప్రయాణికులపై పడినట్లు వీడియోల్లో కనిపించింది. ఆ సమయంలో ప్రాణ భయంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. కొన్ని చోట్ల విమానం లోపలి నిర్మాణంలోని భాగాలు కూడా బయటకు కనిపించాయి. లగేజీ బిన్లు తెరుచుకోవడంతో బ్యాగులు సీట్లపై, మార్గంలో పడిపోయాయి. సేఫ్‌గా ల్యాండింగ్..అయితే విమానం మషద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. లగేజీలు కిందపడ్డా కూడా ప్రయాణికులు, సిబ్బంది ఎవరూ గాయపడలేదు. అనంతరం ప్రయాణికులను మరో విమానంలో కెర్మాన్‌షాకు పంపించినట్లు సమాచారం. ఘటన అనంతరం రన్‌వేను కొంతసేపు మూసివేసి తనిఖీలు నిర్వహించారు.విమానంలో సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్న దానిపై ఇరాన్ పౌర విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం ఆగస్టు 25న మషద్‌లో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి పక్కకు వెళ్లిన ఘటన జరిగింది.WATCH: Cabin ceiling falls apart onboard a Sepehran Airlines Boeing 737 after a tire reportedly burst shortly after takeoff from Mashhad Airport causing engine damage and severe vibrations. pic.twitter.com/R7RP1AwZYX— Breaking Aviation News & Videos (@aviationbrk) September 15, 2026 -
వార్త కవరేజీకి వెళ్లి.. హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు మృతి!
లాస్ఏంజెల్స్: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో గల శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంగళవారం ఎస్యూవీ-బస్సు ఢీకొన్న ఘటనను కవర్ చేస్తుండగా, ఓ వార్తా సంస్థ హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో చోటుచేసుకున్న భయానక దృశ్యాలు విమానం లోపల నుంచి తీసిన వీడియోలో కనిపిస్తున్నాయి.చాట్స్‌వర్త్‌లోని ఎన్ మాన్షన ఎవెన్యూ 9100 బ్లాక్ సమీపంలోని ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ కూలిపోయింది. అక్కడికి సమీపంలోనే అంతకుముందు ఓ ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎస్యూవీ(కారు).. మెట్రో బస్సును ఢీకొనడంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. హెలికాప్టర్‌లోని కెమెరా రికార్డింగ్‌లో విమానం నియంత్రణ కోల్పోతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అది కూలిపోవడంతో వీడియో రికార్డింగ్ ముగిసింది. రెండు వాణిజ్య భవనాల మధ్య హెలికాప్టర్ కూలిపోయి.. అది పలు వాహనాలు, షిప్పింగ్ కంటైనర్లపై పడింది.లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్‌మన్ సంఘటనా స్థలంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించామని తెలిపారు. హెలికాప్టర్ కూలిన సమయంలో ఆ వ్యక్తి దాని వెలుపల ఉన్నట్లు కనిపించిందన్నారు. ‘హెలికాప్టర్లో ఎంత మంది బాధితులు ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని సిల్వర్‌మన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. విమానం చాలావరకు పూర్తిగా ధ్వంసమైందని ఆయన పేర్కొన్నారు. హెలికాప్టర్లో మరెవరైనా ఉన్నారా? విమానం ఎవరిదన్న విషయాన్ని నిర్ధారించేందుకు అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను పరిశీలించాల్సి వచ్చింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం హెలికాప్టర్ ఓ టెలివిజన్ స్టేషన్‌కు చెందినది. అయితే ఏ స్టేషన్‌కు చెందినదో వెంటనే నిర్ధారించలేదని సీబీఎస్ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదంపై లాస్ ఏంజెల్స్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని తెలుస్తోంది. BREAKING: KNBC helicopter crashes while covering metro bus crash in Los Angeles, California. https://t.co/TgzkkVTBHx— AZ Intel (@AZ_Intel_) September 16, 2026 -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్!
ప్రపంచ చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసే సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఎర్ర సముద్ర తీరంలోని కీలక ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలో హౌతీలు పట్టు సాధించడంతో.. సౌదీ చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు హౌతీల ముప్పు.. మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం లేకపోవడంతో రియాద్‌కు ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్న చందంగా పరిస్థితి మారింది. మరోవైపు సౌదీ మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రియాద్.. అధికారిక దౌత్య సంబంధాలే లేని ఇజ్రాయెల్ నుంచి కూడా పరోక్షంగా సాయం కోరినట్లు వార్తలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.టెల్ అవీవ్‌కు చెందిన ది జెరూసలెం పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) మధ్యవర్తిత్వంతో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. హౌతీల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇజ్రాయెల్ హయోమ్ కథనం ప్రకారం.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) ఇతర గల్ఫ్ దేశాలు, ఈజిప్ట్ నుంచి కూడా సహాయం కోరినట్లు సమాచారం. కాగా, సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్‌తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు’ అన్న సామెత గుర్తుకొచ్చేలా.. రియాద్ ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. యెమెన్‌లో రియాద్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ల తీవ్రతను ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.అసలు సంక్షోభం ఏంటి?ఇటీవల వరకు సౌదీ ఇంధన మౌలిక వసతులపై అప్పుడప్పుడు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన హౌతీలు.. గత వారం అనూహ్యంగా పెద్ద ఎత్తున దాడికి దిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. సౌదీ మద్దతున్న నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను వెనక్కి నెట్టి.. ఎర్ర సముద్ర తీరంలోని విస్తారమైన ప్రాంతాలతో పాటు బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోని కొన్ని ద్వీపాలపై హౌతీలు నియంత్రణ సాధించినట్లు సమాచారం. కాగా, ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా ఇరాన్ ఆధిపత్యంలో ఉన్న హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకోగలదు. ఇప్పుడు ఈ మార్గంపైనా ముప్పు ఏర్పడటంతో సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళన పెరిగింది.ఇప్పటికే జులై నుంచి సౌదీ నౌకలపై ఆంక్షలు కొనసాగిస్తున్న హౌతీ నాయకత్వం.. ఈ నిర్బంధాన్ని కొనసాగిస్తామని ప్రకటించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇతర దేశాల నౌకలకు మాత్రం రాకపోకలకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు సౌదీకి చెందిన కీలక పైప్‌లైన్ వ్యవస్థలపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. చమురు ఉత్పత్తి మాత్రమే కాకుండా దాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే సామర్థ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పాక్ ఎందుకు వెనక్కి?సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ నేపథ్యంలో ఇస్లామాబాద్ నుంచి సైనిక సహాయం వస్తుందని రియాద్ ఆశించినట్లు కథనాలు సూచిస్తున్నాయి. అయితే యెమెన్‌లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాక్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ స్పష్టమైన గీత గీసినట్లు కథనాలు చెబుతున్నాయి.అమెరికా, బ్రిటన్ కూడా దూరంహౌతీలపై అమెరికా, బ్రిటన్ కూడా ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో వెనుకంజ వేసినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. బ్రిటన్ కూడా సైనిక సలహాదారులను అందించే దిశగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇజ్రాయెల్ సాయం ఎంతవరకు?ఇజ్రాయెల్ నుంచి సౌదీకి వచ్చే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్‌కే పరిమితం కావచ్చని ఇజ్రాయెల్ హయోమ్ కథనం పేర్కొంది. హౌతీలు ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లతో దాడులు చేసే ప్రమాదం ఉండటంతో.. యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు ఇజ్రాయెల్ కూడా పరిమితులు విధించుకునే అవకాశం ఉందని సమాచారం. హౌతీలకు వ్యతిరేకంగా ఏదైనా చర్య తీసుకోవాల్సి వస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా కాకుండా విస్తృత అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమిలో భాగంగా చేపట్టాలని ఆ దేశ రక్షణ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ట్రంప్ తెచ్చిన యుద్ధం.. అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!అయితే, సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య అధికారిక దౌత్య సంబంధాలు లేకపోయినా, గతంలో కొన్ని సందర్భాల్లో తెరవెనుక సహకారం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి.1960లలోనే రహస్య సహకారం1960లలో యెమెన్‌లో అంతర్యుద్ధం జరిగినప్పుడు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ రెండూ సనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రాయలిస్టు వర్గాలకు మద్దతు ఇచ్చాయి. బ్రూకింగ్స్ ప్రకారం, ఇరుదేశాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు రాయలిస్టులకు ఆయుధాలు, నిపుణుల సహాయం అందించడంలో సమన్వయం చేసుకున్నాయి. అంటే ఇది కొత్తగా ఏర్పడిన సహకారం కాదు.. యెమెన్ విషయంలో ఇరుదేశాలకు ఉమ్మడి శత్రువు ఉన్నప్పుడు దశాబ్దాల క్రితమే పరోక్షంగా కలిసి పనిచేసిన చరిత్ర ఉంది.2010లలో ఇరాన్ అంశం కీలకమైంది. తర్వాత ఇరాన్ ప్రభావం పెరగడంతో సౌదీ, ఇజ్రాయెల్ రెండింటికీ ఒకే భద్రతా ఆందోళన ఏర్పడింది. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ మిలీషియాలు, యెమెన్‌లో హౌతీల అంశాల్లో ఇంటెలిజెన్స్, భద్రతా సహకారంపై తెరవెనుక సంప్రదింపులు జరిగినట్లు పలు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. 2017లో అప్పటి ఇజ్రాయెల్ సైనిక చీఫ్ గాడి ఐసెన్‌కోట్ కూడా సౌదీతో ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు అనుభవాలు, ఇంటెలిజెన్స్ పంచుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని సౌదీ మీడియాకు చెప్పారు. -
471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఒంటరి మెదడు’ హెచ్చరిక?
మనుషుల ఉనికికి కృత్రిమ మేధ (ఏఐ) ముప్పుగా మారొచ్చన్న హెచ్చరికలు ఇప్పటివి కాదని.. 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చెప్పారని ‘వియాన్’ వార్తా సంస్థ ఒక కథనంలో పేర్కొంది. 1555లో ప్రచురించిన Les Prophéties పుస్తకంలో భవిష్యత్తులో ఓ సాంకేతికత.. ప్రపంచాన్ని ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలున్నాయని దానిలో పేర్కొంది. ఏఐపై భయాలు ఇటీవలి కాలంలో అందరినీ చుట్టుముడుతున్నాయి. ఏఐ సంస్థ ఆంత్రోపిక్‌లో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, ఈ సాంకేతికత 2030 నాటికే మానవాళికి తీవ్ర ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు. నోస్ట్రడామస్ 1555లో రాసిన ఒక పుస్తకంలో ‘కొత్త జ్ఞాని’, ‘ఒంటరి మెదడు’, ‘అమరత్వం’, ‘శిష్యులు’ వంటి పదాలు కనిపించాయి. వీటిని కొందరు కంప్యూటర్లు, అప్లోడ్ చేసిన మైండ్ లేదా మెషీన్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించినవిగా అన్వయిస్తున్నారు.నోస్ట్రడామస్ అనుచరులు గతంలో 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను కూడా ఆయన ప్రవచనాలతో అనుసంధానించారు. తాజాగా కాక్సన్ హెచ్చరికలను కూడా ఆ సందేశంతో కలిపి చూస్తున్నారు. బల్గేరియన్ మిస్టిక్ బాబా వంగా కూడా 2026లో ఏఐ కీలక రంగాలను ప్రభావితం చేసి, అనేక ఉద్యోగాలను భర్తీ చేస్తుందని చెప్పినట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. అయితే ఈ వాదనలకు స్పష్టమైన ఆధారాలు లేవని కొందరు అంటారు. సెప్టెంబర్ 9న ఎక్స్‌లో కాక్సన్ చేసిన పోస్టులో ఏఐ సంస్థలు స్వీయ అభివృద్ధి చేసుకునే సూపర్ ఇంటెలిజెన్స్ వైపు వేగంగా సాగుతున్నాయని, ఇది మానవ జీవితాలతో ప్రమాదకరంగా వ్యవహరించడమేనని పేర్కొన్నారు. దశాబ్దం ముగిసేలోపు ఏఐ మానవాళికి అస్తిత్వ ముప్పుగా మారొచ్చని పలువురు పరిశోధకులు భావిస్తున్నారని తెలిపారు.సూపర్‌హ్యూమన్ ఏఐ వ్యవస్థలు మౌలిక వసతులను హ్యాక్ చేయడం, వాస్తవ ప్రపంచ వనరులను సంపాదించడం, ప్రమాదకర జీవ పరిశోధనలను వేగవంతం చేయడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలకు Anthropic అలైన్మెంట్ సైన్స్ విభాగం నేత ఇవాన్ హ్యూబింగర్ మద్దతు పలికారు. ఏఐ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో, కీలకమైన రక్షణ చర్యలు లేకపోతే వచ్చే పదేళ్లలో మానవులు అంతరించిపోయే ప్రమాదం 10 శాతానికి పైగా ఉండొచ్చని హ్యూబింగర్ అంచనా వేశారు.ఇదీ చదవండి: ‘ఎంఎస్’ జీవితాన్ని మలుపుతిప్పిన సదాశివం -
ట్రంప్ తెచ్చిన యుద్ధం: అమెరికాకు 3 లక్షల కోట్ల బిల్లు!! ఇకపై ప్రతీ నెలా మరో 25 వేల కోట్లు!
ఇరాన్‌పై యుద్ధానికి దిగినందుకు అమెరికా ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆరు నెలలు ముగిసినా.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇందుకోసం అమెరికా ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేసిందో తెలుసా?.. మన కరెన్సీలో 3,00,00,00,00,00,000. అంటే మూడు లక్షల కోట్లు. ఇదే కాకుండా సైన్యానికి భారీగా నష్టం వాటిల్లింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా నెలకు రూ.25 వేల కోట్లు చెల్లించుకుంటూనే పోవాలంట!.డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధం మొదలైంది. అయితే ఈ యుద్ధంతో ఇప్పటివరకు అమెరికా రక్షణ శాఖపై పడిన ప్రత్యక్ష వ్యయం ఏకంగా 38 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాని లెక్క రూ.3.2 లక్షల కోట్లు. యుద్ధం ఇదే స్థాయిలో కొనసాగితే ప్రతి నెలా మరో 2–3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడం, అమెరికా భద్రతకు ముప్పును తొలగించడం లక్ష్యంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించారు. అయితే కొన్ని వారాల్లో ముగుస్తుందని భావించిన ఈ సైనిక చర్య సుదీర్ఘ ఘర్షణగా మారింది. సెప్టెంబర్ నాటికీ పోరాటం పూర్తిగా ఆగలేదు. తాజాగా ట్రంప్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నిర్ణయంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పారు. నెలకు మరో రూ.25 వేల కోట్లు!యుద్ధం మరింత కొనసాగితే అమెరికా ఖజానాపై భారం ఆగేలా కనిపించడం లేదు. తక్కువ తీవ్రతతో పోరాటం కొనసాగితే నెలకు సుమారు 2 బిలియన్ డాలర్లు, దాడులు మళ్లీ తీవ్రరూపం దాల్చితే దాదాపు 3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సీబీవో తెలిపింది. అంటే భారత కరెన్సీలో చూస్తే ఒక్క నెలలోనే దాదాపు రూ.17 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో అమెరికా ఖజానాకే కాదు.. ఆ దేశ సైన్యానికీ భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ ప్రతిదాడుల్లో అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు విమానాలు, సైనిక పరికరాలు నష్టపోయినట్లు నివేదికలు వెలువడ్డాయి. మరోవైపు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకునేందుకు అమెరికా భారీ సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో యుద్ధం సాగుతున్న కొద్దీ అమెరికా సైనిక సామర్థ్యాలపై, ముఖ్యంగా కీలక ఆయుధ నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది.అసలు ఖర్చు.. క్షిపణులే!ఈ యుద్ధంలో అమెరికా భారీగా క్షిపణులు, ఇంటర్సెప్టర్లను ప్రయోగించింది. ఆగస్టు 1 వరకు ఉపయోగించిన ఆయుధాలను తిరిగి సమకూర్చుకోవడానికే సుమారు 21.7 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని సీబీవో లెక్కించింది. ఇందులో ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లకు 7.3 బిలియన్, మిసైల్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్లకు 13.1 బిలియన్ డాలర్లు, ఇతర ఆయుధాలకు 1.2 బిలియన్ డాలర్లు ఉన్నాయి. యుద్ధంలో కోల్పోయిన పరికరాలను భర్తీ చేయడానికి మరో 1.9 బిలియన్ డాలర్లు అవసరమని పేర్కొంది. ఆయుధ నిల్వలకు గండి..డబ్బు ఖర్చవడమే కాదు.. అమెరికా ఆయుధ నిల్వలపైనా యుద్ధం ప్రభావం పడుతోంది. ముఖ్యంగా క్షిపణి రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీవో పేర్కొంది. వాటిని పూర్తిస్థాయిలో తిరిగి సమకూర్చుకోవడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం తమ వద్ద అధ్యక్షుడి వ్యూహాత్మక అవసరాలకు సరిపడా ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా పెంటగాన్ ఇన్స్పెక్టర్ జనరల్ నివేదిక మాత్రం.. యుద్ధం కారణంగా కీలక ఆయుధాల్లో ‘స్ట్రాటజిక్ ఇన్వెంటరీ షార్ట్‌ఫాల్స్’ ఏర్పడ్డాయని పేర్కొంది. హర్ముజ్ మూసివేత.. ప్రపంచానికి మరో దెబ్బఇరాన్తో యుద్ధం ప్రభావం అమెరికా సరిహద్దులకే పరిమితం కాలేదు. హార్ముజ్ జలసంధిలో రవాణా తీవ్రంగా దెబ్బతినడంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. యుద్ధం తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర రెండో త్రైమాసికంలో బ్యారెల్‌కు 103 డాలర్ల వరకు చేరింది. ఇంధన ధరల పెరుగుదల ఇతర వస్తువులు, రవాణా ఖర్చులపై ప్రభావం చూపడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని సీబీవో తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గతంలో వేసిన అంచనాల కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇంకా అసలు బిల్లు రాలేదు!సీబీవో చెప్పిన 38 బిలియన్ డాలర్లలో యుద్ధానికి సంబంధించిన ప్రతి ఖర్చూ లేదు. అమెరికా స్థావరాలకు జరిగిన నష్టం, భవిష్యత్‌లో వాటి మరమ్మతులు, యుద్ధానికి అప్పులు తీసుకుంటే చెల్లించాల్సిన వడ్డీ, సైనికులకు భవిష్యత్‌లో అందించాల్సిన వైద్య, వైకల్య ప్రయోజనాలు వంటి ఖర్చులు ఇందులో పూర్తిగా లేవు. రక్షణ శాఖ నుంచి సీబీవో కోరిన సమాచారానికి పూర్తి సహకారం అందకపోవడంతో ఈ అంచనాల్లో కొంత అనిశ్చితి కూడా ఉందని బడ్జెట్ ఆఫీస్ స్పష్టం చేసింది. అమెరికాకే కాదు.. డ్యామేజ్ ట్రంప్‌కు కూడా!యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్నది స్పష్టంగా లేకపోవడంతో ఈ బిల్లు చివరకు ఎంతకు చేరుతుందన్నది కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు.. ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ ప్రతిష్టపైనా ప్రభావం చూపుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న ప్రజాదరణ క్రమంగా తగ్గిపోయిందని రాయిటర్స్ లాంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ యుద్ధం, పెరిగిన ఇంధన ధరలు అమెరికన్లలో అసంతృప్తికి కారణమవుతున్నట్లు అవి వెల్లడించాయి.ముఖ్యంగా నవంబర్ మిడ్‌టర్మ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. యుద్ధ వ్యయం, పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, ఆయుధ నిల్వలపై ఒత్తిడి వంటి అంశాలు ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కీలకంగా మారనున్నాయి. ఒకవైపు యుద్ధాన్ని కొనసాగించాల్సిన వ్యూహాత్మక అవసరాన్ని ట్రంప్ సమర్థిస్తుండగా.. మరోవైపు పెరుగుతున్న ఖర్చు, ఆర్థిక భారం, ప్రజాభిప్రాయంపై దాని ప్రభావం ఆయన ముందున్న పెద్ద సవాళ్లుగా మారాయి.ఇదీ చదవండి: అమెరికా ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు! -
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్‌లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్‌స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్‌లో అజిత్‌కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్‌పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
మక్కాలో అత్యవసర హెచ్చరికలు
రియాద్: ముస్లింల పవిత్ర నగరం మక్కాలో మంగళవారం అసాధారణ రీతిలో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు దాడులను ముమ్మరం చేయడం, ఎర్ర సముద్ర తీరంపై పట్టు సాధిస్తున్న నేపథ్యంలో మక్కాతోపాటు జెడ్డా, తయాఫ్ నగరాలకు ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. సౌదీ పశ్చిమ తీరంపైకి యెమెన్‌లో తయీజ్ నుంచి హౌతీ మిలిటెంట్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అధికారులు జారీ చేసిన సూచనలను అనుసరించాలని హెచ్చరికల్లో పేర్కొంది. గుంపులుగా తిరగొద్దని, అక్కడి పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు తీయవద్దని కోరింది. దాదాపు మూడు గంటల అనంతరం ప్రమాదం తొలగిపోయినట్లు దేశ సివిల్ డిఫెన్స్ విభాగం ప్రకటించింది. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా ఇలాంటి అత్యవసర హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఎర్ర సముద్ర తీరానికి మక్కా నగరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సోమవారం హౌతీలు సౌదీ అరేబియాపైకి వరుసగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో 13 మంది గాయపడ్డారు. మంగళవారం సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా ఉన్న ఎర్ర సముద్ర యాన్బు సహా కనీసం ఆరు నగరాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది. ఇలా ఉండగా, సౌదీ అరేబియా వైమానిక దాడుల కారణంగా యెమెన్‌లోని తయీజ్లో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి చెందారని, మరో ఇద్దరు గాయపడ్డారని హౌతీలు ప్రకటించారు. కైరోలో యువరాజు సల్మాన్ పరిస్థితులు విషమిస్తున్న సమయంలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మంగళవారం సన్నిహిత మిత్ర దేశం ఈజిప్టులో పర్యటనకు వెళ్లారు. కైరోలో ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసితో ఉభయ దేశాలకు ప్రయోజనకరమైన అంశాలపై ఆయన చర్చలు జరిపారని మీడియా తెలిపింది. వారం వ్యవధిలోనే హౌతీలు బాబ్ ఎల్ మాండేబ్ జలసంధిపై పట్టుసాధించారు. సోమవారం ఎర్ర సముద్రంలోని హనీష్ దీవిని కూడా స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి సమీపంలోని కోల్పోయిన భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు సౌదీ ప్రభుత్వ యెమెన్ బలగాలు ప్రయత్నించిన నేపథ్యంలో హౌతీలు ఊహించని రీతిలో వారిని తరిమికొట్టారు. ప్రమాదంలో ప్రాంతీయ భద్రత: భారత్ సౌదీ అరేబియాపై హౌతీల దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలోని పౌర మౌలిక వనరులు, ఆర్థిక సంస్థలే లక్ష్యంగా హౌతీలు దాడులకు పాల్పడుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు ప్రాంతీయ భద్రతకు ప్రమాదంగా మారాయని, బాబ్ ఎల్ మాండేబ్ జలసంధి గుండా స్వేచ్ఛా నౌకాయానానికి ముప్పుగా మారాయని తెలిపింది. సౌదీ అరేబియాపై హౌతీల దాడుల నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ పైవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. -
ఏఐతో ముప్పు వట్టిదే!
వాషింగ్టన్: ఊరందరిది ఒకదారైతే... ఉలిపికట్టెది ఇంకోదారి అని సామెత. కృత్రిమ మేధ విషయంలో ఇప్పుడు ట్రంప్ వ్యవహారమూ ఉలిపికట్టె చందంగానే కనిపిస్తోంది. ఏటికేడాదీ శక్తిమంతమవుతున్న ఏఐ దుర్వీనియోగం కాకుండా.. మనిషి నియంత్రణలోంచి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, అప్పటివరకూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్‌మ్యాన్, డారియో అమోడైలతోపాటు స్పేస్ ఎక్స్ఏఐ ఫౌండర్ ఎలాన్ మస్క్‌లు బహిరంగంగా పిలుపునిచి్చన తరువాత కూడా ట్రంప్... ఏఐతో ముప్పు వట్టిదేనని ప్రకటించడం ఈ సామెతను మరోసారి గుర్తు చేస్తుంది. కృత్రిమమేధ దారితప్పే అవకాశముందన్న ఆందోళనలపై ట్రంప్ సోమవారం వ్యాఖ్యానిస్తూ.. ‘‘కొత్త టెక్నాలజీలను పరిమితం చేసే ఏ ప్రయత్నమైనా కుట్రే’’అని అన్నారు. ‘‘ఏఐ ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తుంది.. మానవత్వాన్ని నాశనం చేస్తుందన్నది అంతా మోసపూరిత ప్రచారం మాత్రమే’’అని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వరుస పోస్టుల ద్వారా ఏఐపై ఆందోళనలు అనవసరం అన్న వాదన వినిపించారు. ఆసక్తికరంగా... చైనా ఏఐపై అంతర్జాతీయ సమాజపు పర్యవేక్షణకు మద్దతు పలికింది. కొన్నేళ్లలోనే ఏఐ విపరీతమైన ప్రాచుర్యం సంపాదించుకోవడం మనందరికీ తెలుసు. అప్పటివరకూ అసాధ్యమనుకున్న చాలా విషయాలను ఏఐ సుసాధ్యం చేసింది. అదేసమయంలో ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ ముసురుకున్న వివాదాలూ అన్ని ఇన్ని కావు. ఏఐ వాడకం కోసం అవసరమై న డేటా సెంటర్లతో కాలుష్యం పెరిగిపోతుందని, విద్యుత్తు, నీరు భారీగా ఖర్చవుతాయన్న ఆందోళనలు వ్యక్తం కావడం ఒకపక్కనుంటే.. ఏఐ స్వయంగా మనిషి నియంత్రణ మీరి ప్రవర్తిస్తుందని, ఇది మరిన్ని సైబర్ మోసాలకు దారితీయడమే కాకుండా... జీవాయుధాల తయారీ వంటి ప్రమాదకర ధోరణులకూ దారి తీయవచ్చునని ఆంత్రోపిక్ వ్యవస్థాపకుడు డారియో అమిడో స్వయంగా ప్రకటించారు. గత శనివారం ఆయన ఇటీవలే నివేదిక విడుదల చేస్తూ.. ఏఐని దుర్వీనియోగం చేస్తూ ఏఐ అభివృద్ధికి కంపెనీలు పగ్గాలు వేయాలని పిలుపునిచ్చారు. ఇంకో ఆరు నుంచి పన్నెండు నెలల్లోపు ఏఐ టెక్నా లజీ ఇంటర్నెట్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నా ఆశ్చర్యంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మ్యాన్ కూడా అమొడై వాదనలతో దాదాపుగా ఏకీభవిస్తూ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టారు. మరోవైపు మైక్రోసాఫ్ట్ తాజాగా ఏఐ మనిషి నియంత్రణలోనే ఎలా ఉంచుకోవాలన్న విషయంపై నియమ నిబంధనలను ఏర్పాటు చేసింది. చైనా పుంజుకుంటుంది ఏఐ కంపెనీల మాటలు ఎలా ఉన్నా ట్రంప్ మాత్రం ఏఐ విషయంలో అమెరికా తగ్గితే చైనా లాభపడుతుందని వ్యాఖ్యానిస్తూండటం గమనార్హం. ‘‘డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీలకు వ్యతిరేకంగా ఒక కుట్ర జరుగుతోంది. ఈ విషయంపై సంతోషంగా ఉన్నది ఒక్క చైనా మాత్రమే’’అని ట్రంప్ ఈ మధ్యే చెప్పారు. ఏఐ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వం అజమాయిïÙని ట్రంప్ చాలాకాలంగా నిరోధిస్తూ వస్తున్న విషయం చెప్పుకోవాల్సిన అంశం. రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత ప్రభుత్వ పర్యవేక్షణకు సంబంధించి బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేసిన ట్రంప్ కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిస్తే పూర్తిస్థాయి మద్దతిస్తూ తనదైన ఆదేశాలు జారీ చేశారు కూడా. ఇదిలా ఉంటే ఏఐ విషయంలో నెమ్మదించా లన్న హెచ్చరికల నేపథ్యంలో అమెరికాలో టెక్నాలజీ కంపెనీల షేర్ల ధరలు తగ్గిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే... చైనా మాత్రం ఏఐకి ముకుతాడు వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగాలని మంగళవారం పిలుపునిచ్చింది. మానవాళి మేలు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏఐ మనిషి నియంత్రణ దాటకుండా చూసుకోవాలని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ తెలిపారు. ఏఐ అన్నది మానవాళి సమష్టి జ్ఞానం. ప్రజలందరి సొత్తు. అంత్జాతీయ సహకారంతో దీని అభివృద్ధి, పర్యవేక్షణ జరగాలి అని స్పష్టం చేశారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడి అమెరికా పర్యటనలోనూ ఏఐ నియంత్రణకు సంబంధించిన అంశాలు చర్చకు రావచ్చునని అంచనా. -
వీసా గడువుపై నియంత్రణకు కోర్టు బ్రేకులు
వాషింగ్టన్: విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులు అమెరికాలో ఉండే సమయాన్ని నియంత్రిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనకు ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. మరో రోజులో అమల్లోకి రావాల్సిన ఈ నిబంధన అమెరికా ఆర్థిక, ఉన్నత విద్యా వ్యవస్థలకు భారీ నష్టం చేకూర్చేదని మసాచూసెట్స్ డిస్ట్రిక్ట్ న్యాయమూర్తి సోమవారం వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం ఈ నిబంధన అవసరమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. భారత్‌సహా అమెరికాలో ఉంటున్న వేలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనిచ్చేది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం విద్యార్థులు, ఎక్సే్ఛంజ్ విజిటర్ వీసాదారులు అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే ఉండవచ్చు. జర్నలిస్టుల విషయంలో ఈ పరిమితి 240 రోజులు మాత్రమే. చైనాకు చెందిన మీడియా వారైతే 90 రోజుల కంటే ఎక్కువ సమయం అమెరికాలో ఉండేందుకు వీల్లేదు. వాస్తవానికి ఈ నిబంధనలు మంగళవారం నుంచి అమల్లోకి రావాల్సి ఉండింది. దేశం మొత్తానికి వద్దని వాదించిన ప్రభుత్వంకొత్త నిబంధనలపై ఇచ్చిన స్టేను ప్రతివాదులకు మాత్రమే పరిమితం చేయాలని, దేశం మొత్తానికి అన్వయించవద్దని అమెరికా ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మసాచూసెట్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎఫ్.డెన్నిస్ సెలర్ –4 తిరస్కరించారు. న్యాయమూర్తి నిర్ణయంతో కొత్త నిబంధన అమలుకు బ్రేక్ పడుతుంది. కేసుపై న్యాయస్థానంలో విచారణ సాగుతుంది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనను సుమారు 600 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు సవాలు చేశాయి. అయితే అమెరికాలో ఐదు వేలకుపైగా విద్యా సంస్థలున్నాయని, పిటిషనర్లకు మాత్రమే స్టే వర్తింపజేయడం సమస్యలకు దారితీస్తుందని, ఒక్కో విద్యార్థి, సంస్థ ఈ నిబంధనల పరిధిలోకి వస్తారా? లేదా? అన్నది పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. ‘‘సాధారణంగా ఒక పీహెచ్డీ కోర్సు పూర్తయ్యేందుకు ఆరేళ్ల సమయం పడుతుంది. కాబట్టి విద్యార్థి వీసాలకు నాలుగేళ్ల కటాఫ్ విధించడం విచిత్రం’’అని హార్వర్డ్ విద్యాసంస్థ అధ్యక్షుడు అలన్ ఎం గార్బర్ వ్యాఖ్యానించారు. అయితే వీసాలపై ఇలాంటి పరిమితులు విధిస్తేనే మోసాలను అరికట్టవచ్చని, వీసా గడువు తీరిన తరువాత కూడా అమెరికాలో ఉండిపోవడాన్ని అడ్డుకోవచ్చునని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ వాదించింది. అయితే కొత్త నిబంధన కూడా దుర్వీనియోగం అయ్యేందుకు అవకాశముందని న్యాయమూర్తి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే విదేశీ జర్నలిస్టుల వీసాలు పొడిగించకుండా ఉండేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రయత్నించే అవకాశాలు ఎక్కువ’’అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ‘‘కొత్త నిబంధనకు, దాని వెనుక ఉన్న హేతువుకు మధ్య సంబంధం బలహీనంగా కనిపిస్తోంది. న్యాయమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ కొత్త నిబంధనలు నిజంగానే దేశ భద్రత, సరిహద్దుల రక్షణకు ఉద్దేశించిందా? లేక అప్రకటిత లక్ష్యాల సాధనకా?.. ఉదాహరణకు విద్యాసంస్థలు, మీడియాపై ప్రభుత్వం మరింత పట్టు సాధించేందుకా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి’’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె సన్నిహితులు ఏడుగురికి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక కోర్టు మరణశిక్ష విధించింది. 2024లో జరిగిన అల్లర్ల సందర్భంగా ఏడుగురిని నిందితులుగా పరిగణిస్తూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్-2 ఈ మరణశిక్ష ఖరారు చేసింది.మానవత్వానికి వ్యతిరేకంగా నిందితులు వ్యవహరించారని జస్టిస్ మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం చౌదరి తీర్పు వెల్లడించారు. 2024లో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ఆధ్వర్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వంపై ఆందోళనకారులు తిరగబడ్డ సంగతి తెలిసిందే. ఆందోళనల్ని అణచివేయడానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందని అక్కడి ప్రతిపక్షాలు, ఆందోళనకారులు అంటున్నారు. ముఖ్యంగా ఏడుగురు నిందితులు సమావేశమై, ఆందోళనల్ని అణచి వేసేందుకు కుట్రలు చేశారని, హింసకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏడుగురు నిందితులకు మంగళవారం మరణశిక్ష విధించింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై గత ఏడాదే ఇదే అంశంలో అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఆమె అనుచరులకు శిక్ష పడింది. తాజాగా శిక్షకు గురైన వారిలో అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి, బంగ్లాదేశ్ మాజీ మంత్రి ఒబైదుల్ ఖాదర్, జాయింట్ సెక్రెటరీ బహవుద్దీన్ నసీమ్, మాజీ సమాచార మంత్రి అలీ అరాఫత్, జూబో లీగ్ చైర్మన్ షేక్ ఫాజిల్ షామ్స్ పరాష్, ఈ సంస్థ జనరల్ సెక్రెటరీ మైనుల్ హొసైన్ ఖాన్ నిఖిల్, బంగ్లాదేశ్ ఛాత్రా లీగ్ ప్రెసిడెంట్ సద్దాం హొసైన్, జనరల్ సెక్రెటరీ షేక్ వాలి అసిఫ్ ఉన్నారు.ఇదీ చదవండి: ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు -
‘అంతరిక్ష ఆయుధాలు’ మోహరించిన అమెరికా.. అసలు ఏంటవి?
భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో ‘అంతరిక్ష నియంత్రణ ఆయుధాలు’ మోహరించినట్లు అమెరికా తొలిసారిగా బహిరంగంగా ప్రకటించింది. అమెరికా వాయుసేన కార్యదర్శి ట్రాయ్ మీంక్ ఈ విషయాన్ని వెల్లడించారు. భూమిపై ఉన్న అమెరికా బలగాలను ప్రత్యర్థుల దాడుల నుంచి రక్షించేందుకు ఈ ఆయుధాలను ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.అయితే ఈ ఆయుధాలు ఎప్పుడు కక్ష్యలోకి పంపారు? ఎన్ని ఉన్నాయి? వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి? అనే వివరాలను అమెరికా వెల్లడించలేదు. నిపుణుల అంచనా ప్రకారం ఇవి ఉపగ్రహాలను నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసే ఆయుధాల కంటే.. కమ్యూనికేషన్ వ్యవస్థలను అడ్డుకునే ఎలక్ట్రానిక్ యుద్ధ లేదా రేడియో జామింగ్ పరికరాలు అయ్యే అవకాశం ఉంది.అంతరిక్షంలో ఆయుధాల వినియోగం కొత్త అంశం కాదు. 1967 నాటి ఔటర్ స్పేస్ ఒప్పందం కక్ష్యలో అణ్వాయుధాలు, ఇతర సామూహిక విధ్వంస ఆయుధాలను ఉంచడాన్ని నిషేధిస్తుంది. అయితే సంప్రదాయ ఆయుధాలను భూమి కక్ష్యలో ఉంచడాన్ని అది స్పష్టంగా నిషేధించదు. అందువల్ల ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు వంటి సామర్థ్యాలకు అవకాశం ఉంది.ఇప్పటికే చైనా, రష్యా! చైనా, రష్యా ఇప్పటికే వివిధ అంతరిక్ష వ్యతిరేక సామర్థ్యాలను అభివృద్ధి చేస్తున్నాయని పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ఉపగ్రహాలను అడ్డుకోవడం, వాటి వ్యవస్థలను నిర్వీర్యం చేయడం లేదా ధ్వంసం చేయడం కోసం జామింగ్, స్పూఫింగ్, సైబర్ చర్యలు, ప్రత్యక్ష ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు వంటి సామర్థ్యాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్ కూడా ఉపగ్రహ వ్యతిరేక సామర్థ్యాన్ని ప్రదర్శించింది.అమెరికా ప్రకటనపై చైనా అంతరిక్షాన్ని యుద్ధభూమిగా మార్చడం, ఆయుధ పోటీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా కూడా అంతరిక్షాన్ని ఆయుధ రహిత ప్రాంతంగా ఉంచాలని కోరింది. నిపుణుల ప్రకారం ఈ పరిణామం భవిష్యత్తులో ఉపగ్రహాలపై పోటీని మరింత పెంచే అవకాశం ఉంది. -
11 ఏళ్ల పాటు కీమోథెరపీ : షాకింగ్ నిజం చెప్పిన వైద్యులు
క్యాన్సర్ అనగానే ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఏళ్ల తరబడబి కీమో థెరపీలు, సర్జరీలు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా బాధిస్తాయి. అయినా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం ఉండదు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైతే చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలా బ్రెయిన్ క్యాన్సర్ ఉందని ఒక మహిళ సుదీర్ఘ కాలంపాటు కీమోథెరపీ తీసుకుంది. ఇలా ఒకటీ రెండేళ్లు కాదు ఏకంగా 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చేయించుకుంది. తీరా చూస్తే వైద్యులు భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.బీబీసీ కథనం ప్రకారం, బెక్ కీ జోన్స్ (Becky Jones) అనే మహిళ 2012లో తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడింది. ఆమెకు తీసిన బ్రెయిన్ స్కానింగ్‌లో ఒక కణితి (Lesion) కనిపించింది. వైద్యులు దానిని ట్యూమర్‌గా భావించి క్యాన్సర్‌గా చికిత్స ప్రారంభించారు. చికిత్స ఆపితే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు పదేపదే చెప్పడంతో ఆమె దాన్ని విశ్వసించి, చాలా పట్టుదలగా చికిత్సతీసుకుంది. కానీ 2025లో ఆమె వైద్య రికార్డులను పరిశీలించిన స్వతంత్ర న్యూరో సర్జన్లు, రేడియాలజిస్టులు ఆమెకు అసలు బ్రెయిన్ క్యాన్సరే లేదన్న దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడించారు. ఇదీ చదవండి: ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనంనిజం బయటపడిందిలా ఇటీవల ఆమె కేసును స్వతంత్ర నిపుణులు మళ్లీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఆ స్కానింగ్‌లలో కనిపించింది ట్యూమర్ కాదని, నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపు వల్ల ఏర్పడే 'ట్యుమేఫాటివ్ డిమైలినేషన్' (Tumefactive Demyelination) అని తేలింది. ఇది చూడటానికి ట్యూమర్లా కనిపిస్తుంది కానీ క్యాన్సర్ కాదు.ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకన్నీటి పర్యవంతమైన బాధితురాలుఆమె తన భాగస్వామిని కలిసిన కొద్ది కాలానికే, పోలీసు వృత్తిలో చేరాలని కలలు కనేది, కానీ అకస్మాత్తుగా ఆమె భవిష్యత్తు అంధకారంగా మారింది. అనుభవజ్ఞుడైన క్యాన్సర్ నిపుణుడు చేసిన ఈ నిర్ధారణ, ఆమె జీవితాన్ని మార్చేసింది. 11 ఏళ్ల కీమోథెరపీ చికిత్సకు దారితీసింది. ఆమె తరచుగా అనారోగ్యానికి గురయ్యేది, కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయింది, ఆమె వృత్తికి ఆటంకం కలిగింది మరియు నిరంతరం ఆందోళనతో కుంగిపోయింది. తీరా 34 ఏళ్ల వయసులో, ఆమెకు అసలు క్యాన్సర్ లేదని, స్టెరాయిడ్లతో చికిత్స చేయగలిగే మెదడు వాపు మాత్రమే ఉందని ఇటీవల తెలుసుకుంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె, ఈ అనవసరమైన క్యాన్సర్ చికిత్స కారణంగా యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ అండ్ వార్విక్షైర్ (UHCW) NHS ట్రస్ట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న 40 మందికి పైగా రోగులలో ఒకరు."నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు. తప్పుడు రోగ నిర్ధారణ (Misdiagnosis) వల్ల నా యువ జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండానే నూనెలో కాలుతున్నట్లు నరకం అనుభవించాను" అని జోన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్లాండ్స్లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఈ నిజం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టుకున్నట్లు ఆమె తరఫు న్యాయవాది టిన్సే తెలిపారు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్Second Opinion ప్రాముఖ్యతఒక తీవ్రమైన వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు, అది అరుదైనదైనప్పుడు లేదా సంక్లిష్టమైనదైనప్పుడు మరో వైద్య నిపుణుడిని సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి సోకిందంటే ఒక వ్యక్తి కుటుంబ నిర్ణయాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఏళ్ల తరబడి కీమోథెరపీ చేయించుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు 'ఫ్రెష్ ఐస్'తో (కొత్త కోణంలో) పరీక్షించడం ఎంత అవసరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది. -
విమానంలో నగ్నంగా యువతి రచ్చ రచ్చ
వాషింగ్టన్: అమెరికాలో బాల్టిమోర్ నుంచి మయామికి వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ యువతి బట్టలు విప్పింది. తోటి ప్రయాణికుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించింది. దీంతో విమాన సిబ్బంది కాక్‌పిట్ సిబ్బందిని అప్రమత్తం చేసి, విమానం మయామి చేరుకున్న వెంటనే పోలీసులను పిలిపించారు.అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఏఏ1779 విమానంలో ఈ ఘటన జరిగింది. బాల్టిమోర్/వాషింగ్టన్ ఇంటర్నేషనల్ థర్గుడ్ మార్షల్ విమానాశ్రయం నుంచి రాత్రి 9 గంటల తర్వాత విమానం బయలుదేరింది. షెడ్యూల్ కంటే దాదాపు 2 గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఎయిర్‌బస్ ఏ319లో ప్రయాణికులు మయామికి వెళ్తున్నారు.విమానంలోని 9డీ సీటులో కూర్చున్న మహిళ “తన బట్టలన్నీ విప్పేసింది” అని విమాన సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్స్ అడ్రెసింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ సందేశంలో పేర్కొన్నారు. ఆమె ప్రయాణికుల సమక్షంలో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కూడా తెలిపారు. ఈ విషయాన్ని విమాన సిబ్బంది సంస్థ కార్యకలాపాల కేంద్రానికి తెలియజేసి, విమానం చేరుకునే సమయానికి పోలీసులను సిద్ధంగా ఉంచాలని కోరారు.అయితే ఘటన కారణంగా విమానాన్ని దారి మళ్లించలేదు. అధికారులు నేలపై ఏర్పాట్లు చేసుకుంటుండగా విమానం మయామి వైపు ప్రయాణం కొనసాగించింది. స్థానిక సమయం ప్రకారం రాత్రి 11.23 గంటలకు మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని నార్త్ టెర్మినల్ డీ2 గేట్‌కు విమానం చేరుకోగా, అక్కడ సిద్ధంగా ఉన్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనకు దారితీసిన కారణం, మహిళ గుర్తింపు, ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదయ్యాయన్న వివరాలు వెంటనే వెల్లడికాలేదు. విమాన ప్రయాణంలో సిబ్బంది పరిస్థితిని ఎలా నియంత్రించారన్నది కూడా స్పష్టంగా తెలియలేదు. -
ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు
మసాచుసెట్స్‌కు చెందిన లిండ్సే క్లాన్సీ అనే తల్లి తన ముగ్గురు పిల్లలని గొంతు నులిమి హత్య చేసిన కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో విచారణ సందర్బంగా కాంగ్రెస్ సభ్యురాలు నాన్సీ మేస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో లిండ్సేకు బహిరంగ మరణ శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలను చంపితే ఇలాగే ఉంటుందనేది ప్రపంచంలోని తల్లులందరికీ హెచ్చరికలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు.2023లో జరిగిన ఈ ఘటనపై విచారణ ముగిసిన తర్వాత, ఇటీవల కోర్టులో మిస్ ట్రయల్ (Mistrial) ప్రకటించారు. తీవ్రమైన ప్రసవానంతర మానసిక సమస్య (పోస్ట్‌పార్టం సైకోసిస్) కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఏడు రోజుల పాటు సుదీర్ఘ చర్చల తరువాత 9 మంది మహిళలు, ముగ్గురు పురుషులతో కూడిన జ్యూరీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. మానసిక పరిస్థితి కారణంగా ఆమె నిర్దోషి అని 11 మంది జ్యూరీ సభ్యులు ఓటు వేయగా, ఒకరు మాత్రం వ్యతిరేకించారు. దీంతో జ్యూరీ ప్రతిష్టంభన నెలకొనడంతో జడ్జి విలియం సుల్లివన్ మిస్ ట్రయల్ ప్రకటించారు.ఇదీ చదవండి: రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలుదీనిపై దక్షిణ కరోలినా కాంగ్రెస్ మహిళ నాన్సీ మేస్ ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. లిండ్సే క్లాన్సీకి మరణశిక్ష విధించాలని, అది కూడా అందరికీ ఒక హెచ్చరికగా బహిరంగ మరణశిక్ష (Public Execution) కావాలని ఆమె డిమాండ్ చేశారు. పిల్లలు చనిపోయారు కనుక ఆమెకు మరణశిక్ష విధించాలి. అదీ బహిరంగంగా జరగాలి. కాల్చి చంపినా, విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టినా ఏదైనా పర్వాలేదు. కానీ ప్రపంచంలోని తల్లులందరికీ ఒక హెచ్చరికలా ఉండాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, లిండ్సే క్లాన్సీని క్షమించాలని ఆమె తరఫు న్యాయవాది కెవిన్ రెడ్డింగ్టన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కోరడాన్ని నాన్సీ మేస్ తీవ్రంగా తప్పుబట్టారు.కాగా మూడో బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు లిండ్సే క్లాన్సీ మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ప్రసవానంతర మానసిక రుగ్మతతో నిద్రలేమి, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో సతమతమవుతూ ఉండేది. దీంతో ఆమె నిపుణులను సంప్రదించింది. చికిత్స తీసుకుంది. కానీ అవేవీ పనిచేయకపోవడంతో, ఆమె ఒక మానసిక వైద్య ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రి నుంచి విడుదలైన పంతొమ్మిది రోజుల తర్వాత, ఆమె మసాచుసెట్స్‌లోని తమ ఇంట్లో తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి చంపేసింది. భర్త పాట్రిక్ క్లాన్సీ ఇంటిలో లేని సమయంలో లిండ్సే తన ముగ్గురు పిల్లలను గొంతు నులిమి హత్య చేసింది.ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ ఆమె తీవ్రమైన పోస్ట్‌పార్టం డిప్రెషన్, సైకోసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు కోర్టులో వెల్లడించారు. పిల్లలను హాని చేయాలనే ఆలోచనలు వస్తున్నాయని, ఒక పురుషుడి గొంతు తనను హెచ్చరిస్తున్నట్లు ఆమె అంతకుముందే తన భర్తకు, తల్లికి తెలిపింది. హత్య జరిగిన సమయంలో ఆమె వాస్తవ ప్రపంచానికి దూరంగా, తీవ్రమైన మానసిక అస్థిరతలో ఉందని వైద్య సాక్షులు తెలిపారు.2023 జనవరిలో జరిగిన ఈ హత్యలకు ఆమె మాజీ భర్తే మొదటి సాక్షి. అతను తన భార్యను క్షమించానని, ఆమెను చెడ్డదానిగా కాకుండా అనారోగ్యంతో ఉన్నదానిగా భావించానని ఇంటర్వ్యూలలో చెప్పాడు. -
చైనా స్పై గేమ్.. ఇక నీటిలో చేపను నమ్మేదెలా!?
మొన్నీమధ్యే రోబోట్ గేమ్స్‌తో అబ్బురపరిచిన డ్రాగన్ దేశం.. ఇప్పుడు మరో టెక్నాలజీ మాయాజాలంతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఇప్పటివరకు డ్రోన్లు అంటే ఆకాశంలో ఎగిరేవే.. కానీ చైనా మాత్రం వాటి పరిధిని నీటి అడుగునకూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అచ్చం చేపలా కనిపిస్తూ.. చేపలాగే ఈదుతూ.. నీటిలో తన ఉనికి ఏమాత్రం అనుమానం రాకుండా కదిలే ఓ రోబోటిక్ చేపను అభివృద్ధి చేసింది. దూరం నుంచి చూస్తే నిజమైన చేపే అనిపించే ఈ యంత్రం.. దగ్గరగా పరిశీలిస్తే మాత్రం సెన్సర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతికతతో కూడిన నిఘా రోబోగా కనిపిస్తుంది.బీజింగ్‌లోని షౌగాంగ్ పార్క్‌లో జరుగుతున్న 2026 చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS)లో రోబో చేప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు మూడు కిలోల బరువు ఉన్న ఈ బియోనిక్ రోబో చేప పేరు.. గోల్డెన్ డ్రాగన్ ఫిష్(BG-5). గోల్డెన్ అరోవానా చేపకు జిరాక్స్‌లా ఉందది. అంతేకాదు.. నీళ్లలో ఈదుతూ.. అడ్డంకులు ఎదురైతే తన దారిని తానే మార్చుకుంటూ ముందుకు సాగింది. దీనికి ఏ రిమోట్ అక్కర్లేదు. ఏ ప్రొగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. లోపల మాత్రం మోటార్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ఉంటాయి. సాధారణ అండర్‌వాటర్ డ్రోన్లు ప్రొపెల్లర్లతో కదులుతాయి. కానీ ఇది మాత్రం తోకలో ఉండే 3 కదిలే జాయింట్లు, 7 సెగ్మెంట్లు ఉంటాయి. వాటిని ఊపుతూ ముందుకు సాగుతూ నీటిలో అలల తరహా కదలికలను చూపిస్తుంది. దీంతో ఏదో యంత్రం కదులుతున్నట్లు కాకుండా.. అచ్చం జీవం ఉన్న చేప ఈదుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సహజమైన కదలికే దీని అసలు బలం. 3 కిలోలే.. కానీ టెక్నాలజీ మాత్రం భారీదే!BG-5 పరిమాణం చూస్తే ఆశ్చర్యమే. ఇది సుమారు 640 మిల్లీమీటర్ల పొడవు, 204 మిల్లీమీటర్ల వెడల్పు, 90 మిల్లీమీటర్ల ఎత్తు ఉంటుంది. బరువు కేవలం 3 కిలోలు. గరిష్టంగా 5 మీటర్ల లోతులో పనిచేయగలదు. గరిష్ట వేగం సెకనుకు 0.6 మీటర్లు. అంటే ఇది సముద్రంలో నిఘాకు పనికి రాదన్నమాట!. తక్కువ లోతున్న నీళ్లలో పని చేసే రోబో మాత్రమే. Look at the quality of this fish drone that China just revealed pic.twitter.com/v24asLP4d1— The Gulag (@WelcomeTheGulag) September 15, 2026 అయితే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో గూఢచర్యానికి ఉపయోగపడుతుందా? అనే ఆందోళనను కూడా రేకెత్తిస్తోంది. దాని చుట్టూ ఉన్న సెన్సార్లు.. ఏదైనా ఆటంకాలు ఎదురైతే దానంతట అదే తప్పించుకుని ముందుకు సాగుతుంది. అంటే నీటిలో పరిస్థితులు మారినా.. ఎదురుగా ఏదైనా వస్తే ఆగిపోకుండా, దాన్ని తప్పించుకుని ఓ నిజం చేపలా ముందుకు వెళ్లగలదు. పైగా మనుషులు సాధారణంగా ఉపయోగించే అండర్‌వాటర్ డ్రోన్లా బయటికి యంత్రంలా కనిపించదు. దీంతో చేప రూపంలోనే నిఘా పెట్టే కొత్త రోబోను చైనా ప్రదర్శించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు మాయ ఇక్కడే..ఒక పెద్ద అండర్‌వాటర్ డ్రోన్ నీటిలోకి వస్తే దాన్ని గుర్తించడం కొంత సులభం. కానీ చేపల గుంపులో ఒక చేపలా కనిపించే రోబోను గుర్తించడం అంత సులభం కాకపోవచ్చు. ఇదే కారణంగా BG-5ను షాలో-వాటర్ రీకానైసెన్స్, సర్వైలెన్స్ కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం చైనా సైనిక గూఢచర్యానికి ఉపయోగిస్తోందని నిర్ధారించే ఆధారం లేదు. కంపెనీ మాత్రం పౌర అవసరాలకూ ఉపయోగించవచ్చని చెబుతోంది.కానీ, ఈ రోబోను తయారు చేసిన సంస్థకు రక్షణ రంగానికి సంబంధించిన అండర్‌వాటర్ రోబోటిక్స్‌లో పనిచేసిన నేపథ్యం ఉంది. ఈ సంస్థ గతంలో రోబో షార్క్ (ROBO-SHARK) అనే బయోమిమెటిక్ అండర్‌వాటర్ రోబోను సైనిక యూనిట్‌తో కలిసి అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే నీటి అడుగున బయోమిమెటిక్ డిటెక్షన్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన రక్షణ ప్రాజెక్టులో పనిచేసినట్లు సంస్థే పేర్కొంది. China will turn anything that moves into a spying machine—Chinese cars, Chinese products, and now even fish. China wants to control all of us. China is a real threat to the freedom of every person on the planet. pic.twitter.com/ycou8OaVQy— Israel & World News (@Nonstopnews_) September 15, 2026..గుంపుగా వస్తే?ఇక్కడ ఇంకో విషయం మరింత ఆందోళన కలిగిస్తోంది. BG-5కు సంబంధించిన రూట్ మ్యాప్, పనుల కేటాయింపు, ఫార్మేషన్ కంట్రోల్, బహుళ రోబోట్ల మధ్య సమన్వయం వంటి సామర్థ్యాలను కంపెనీ ప్రస్తావించింది. అంటే భవిష్యత్తులో ఒక్క రోబో చేప కాకుండా.. చేపల గుంపులా అనేక రోబోలు నీటిలోకి వెళ్లి, ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతాన్ని గమనించే పరిస్థితి రావొచ్చు. ఒకటి సమాచారం సేకరిస్తే.. మరొకటి మరో ప్రాంతాన్ని పరిశీలించడం.. వాటన్నింటినీ సమన్వయం చేయడం సాధ్యమయ్యే దిశగా టెక్నాలజీ వెళ్తోంది. ఇప్పటివరకు BG-5ను “స్పై ఫిష్” అని అధికారికంగా పిలవడం లేదు. కానీ దాని సహజమైన రూపం, స్వయంచాలకంగా దారి మార్చుకునే సామర్థ్యం, నీటి అడుగున పరిశీలనకు అనువైన డిజైన్, తయారీ సంస్థకు ఉన్న రక్షణ రంగ అనుసంధానాలు.. ఇవన్నీ కలిపి చూస్తే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో నిఘా, పరిశఋలన వంటి భద్రతా కార్యకలాపాలకు ఉపయోగపడే అవకాశాన్ని మాత్రం కొట్టిపారేయలేం.యంత్రం యంత్రంలా కనిపించకుండా.. ప్రకృతిలోని జీవిలా కలిసిపోయేలా చేయడమే ఈ టెక్నాలజీ వెనుక అసలు ఆలోచన. నేడు చేప రూపంలో కనిపించిన ఈ రోబోట్.. రేపు పురుగు, తేనెటీగ, డ్రాగన్‌ఫ్లై రూపంలోనూ నిఘా కోసం రంగంలోకి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో! అసలు ప్రశ్న ఒక్కటే.. మన చుట్టూ కనిపిస్తున్న జీవుల్లో ఎన్ని నిజమైనవో.. ఎన్ని నిఘా యంత్రాలో గుర్తించడం ఎలా?.ఇదీ చదవండి: కరాచీలో ‘ధురంధర్-3’ షూటింగ్ -
హౌతీల మెరుపు దాడులతో సౌదీలో ఉద్రిక్తత
రియాద్: సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన మెరుపు దాడుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారు. దీంతో యెమెన్‌కు చెందిన హౌతీలపై గట్టిగా స్పందిస్తామని సౌదీ అరేబియా మంగళవారం హెచ్చరించింది. ప్రాంతీయంగా నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించి సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సౌదీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. యెమెన్‌లో అంతర్యుద్ధం జూలైలో తీవ్రరూపం దాల్చినప్పటి నుంచి సౌదీ మద్దతున్న ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య పోరాటం కొనసాగుతోంది. రియాద్‌పై సముద్ర దిగ్బంధాన్ని ప్రకటించిన హౌతీలు.. ఎర్ర సముద్రంలో ప్రయాణించే నౌకలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు.గత వారం హౌతీలు యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతంతో పాటు బాబ్ అల్-మందబ్ జలసంధిపై పట్టు సాధించారు. కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మార్గంలో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది యెమెన్ ప్రభుత్వ దళాలకు ఎదురుదెబ్బగా మారింది. ప్రపంచంలోనే ప్రముఖ ముడిచమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియాలోని చమురు మౌలిక సదుపాయాలను హౌతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ఇదీ చదవండి: హిందీలో ఎంబీబీఎస్.. నాలుగేళ్ల తర్వాత దిమ్మతిరిగే రిజల్ట్! -
ధురంధర్-3 ప్లాన్ చేస్తున్నారా భయ్యా? పాక్‌లో మళ్లీ..
దేశ శత్రువులపై నిఘా పెట్టి, రహస్య ఆపరేషన్లతో వారిని టార్గెట్ చేసే కథే.. ధురంధర్ సినిమా. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో చూపించినట్లే ఆపరేషన్లు నిజంగానే జరుగుతాయా?. టార్గెట్ చేసిన వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో హతమార్చడం.. ఆ తర్వాత జాడ లేకుండా పోవడం పాక్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరాచీలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.పాకిస్థాన్‌లో మరోసారి ‘అన్నోన్ గన్‌మెన్’ కలకలం రేపారు. కరాచీలో లష్కరే తోయిబా (LeT)తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి కాల్చిచంపారు. భైంస్ కాలనీలోని రోడ్ నంబర్ 11 వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మృతుడి అసలు గుర్తింపు, అతడికి ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై పాకిస్థాన్ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. అయితే చనిపోయిన వ్యక్తి ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఈ ఘటనలో ప్రత్యేకత ఏంటంటే.. దాడి చేసిన తీరు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు టార్గెట్‌ను గుర్తించి వేగంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతం జనాల రద్దీతో ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పించుకున్నారు. దీంతో అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మరోసారి ప్రశ్నగా మారింది.పాక్‌లో ఇది మాములే!పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.The unsung heros from India : Unknown Men. https://t.co/mXbXjRPuh5— Magizhmaran ❇️ (@Maransadagopan) September 15, 20262026 ఆగస్టులో లష్కరే తోయిబాకు చెందిన రిజ్వాన్ హనీఫ్ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెంచింది. గత మూడు నాలుగేళ్లలో పాకిస్థాన్‌లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు అతను చెప్పినట్టు పలు మీడియా సంస్థలు నివేదించాయి. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలకోట్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు ఆ వాదనలో ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సంఖ్యను పాకిస్థాన్ ప్రభుత్వం స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అంతేకాదు.. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు బహిరంగంగా లేవు.అసలు ఈ ‘గన్‌మెన్’ ఎవరు?కరాచీ తాజా హత్యలో ఇదే ప్రధాన ప్రశ్న. మృతుడు నిజంగా ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తేనా? లష్కరే తోయిబాతో అతడి సంబంధం ఎంతవరకు ఉంది? దాడి వ్యక్తిగత కక్షతో జరిగిందా? ప్రత్యర్థి ఉగ్రవాద సంస్థల పనేనా? లేక మరేదైనా నిఘా వ్యవస్థ పాత్ర ఉందా? ప్రస్తుతానికి ఏ ప్రశ్నకూ అధికారిక సమాధానం లేదు.హఫీజ్ సయ్యద్ పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది, లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుల్లో ఒకడు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో అతడొకడని భారత్ చెబుతూ వస్తోంది. అమెరికా కూడా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించి, అతడి తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థతో అతడికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల హత్యలు జరిగినప్పుడల్లా హఫీజ్ సయ్యద్ పేరు కూడా చర్చకు వస్తోంది.భారత్‌పై పాక్ ఆరోపణలు..ఈ వరుస హత్యలపై పాకిస్థాన్‌లోని కొందరు అధికారులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు భారత నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. 2024లోనూ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురి హత్యల వెనుక భారత్ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పాకిస్థాన్ అధికారులు కనీసం ఎనిమిది హత్యలను భారత్‌తో ముడిపెట్టారు. అయితే వాటిలో వేటికి ఆధారాలు మాత్రం చూపించలేదు. ‘ధురంధర్’ను తలపించే సీన్..పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నవాళ్లు మరణించడం కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ హత్యలన్నీ చాలా డ్రామటిక్‌గా జరుగుతుండడం గమనార్హం. ఇప్పుడు కరాచీ ఘటనలోనూ నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి టార్గెట్‌పై కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవడం.. గతంలో నమోదైన కొన్ని మిస్టరీ కిల్లింగ్స్‌ను గుర్తు చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో ‘ధురంధర్’ సినిమా తరహా చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ కొత్త ఘటనలతో ‘ధురంధర్-3’ ప్లాన్ చేయాలంటూ కొందరు ఆదిత్య ధర్‌ను రిక్వెస్ట్ చేస్తూ నెట్టింట ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇదే సమయంలో.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత వైరం, ప్రత్యర్థి గ్రూపుల దాడులు, స్థానిక నేరగాళ్ల పాత్ర వంటి ఇతర కోణాలూ చర్చకు వస్తుంటాయి. పైగా ఆ దేశంలో ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. కరాచీ గతంలో రాజకీయ, జాతి, మతపరమైన హింసకు కేంద్రంగా నిలిచింది. 2011లోనే నగరంలో జరిగిన వరుస టార్గెట్ కిల్లింగ్స్‌లో ఒక్క జూలై నెలలోనే 300 మందికి పైగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ హింసకు రాజకీయ, జాతి, మతపరమైన కారణాలు ముడిపడి ఉన్నాయని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ప్చ్.. గాడిదలపైనే భారం వేసిన పాక్ -
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్‌గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్లోనే చనిపోయేదాన్ని! -
గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, చైనాతో ఒక వినూత్నమైన వాణిజ్య ఒప్పందానికి తెరలేపింది. చైనాలో విపరీతమైన డిమాండ్ ఉన్న గాడిద చర్మం (హైడ్), మాంసం ఎగుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికోసం చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కీలక కేంద్రమైన గ్వాదర్ పోర్ట్ సమీపంలో గాడిదల వధశాల (స్లాటర్ హౌస్), ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.గాడిద చర్మం ఎందుకంటే..ఈ విచిత్రమైన వాణిజ్యం వెనుక చైనా సాంప్రదాయ వైద్య రంగానికి ఉన్న అవసరాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. చైనాలో గాడిద చర్మం నుంచి తయారుచేసే ‘ఎజియావో’ అనే జిలాటిన్ ఆధారిత ఔషధానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. రక్తప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ సంరక్షణ, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాసెస్ చేసిన ఎజియావో కిలో ధర వందల డాలర్లలో పలుకుతుంది. అయితే, చైనాలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో 1990లలో 1.1 కోట్లుగా ఉన్న గాడిదల సంఖ్య ప్రస్తుతం 20 లక్షల కంటే దిగువకు పడిపోయింది. దీంతో వార్షికంగా చైనాకు అవసరమయ్యే దాదాపు 59 లక్షల గాడిద చర్మాల కోసం ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు.ఆఫ్రికాలో నిషేధంగతంలో చైనాకు ప్రధాన వనరుగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు గాడిదల ఎగుమతిపై నిషేధం విధించడంతో చైనా దృష్టి ఆసియా వైపు మళ్లింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గాడిదల జనాభా (సుమారు 58 లక్షలకు పైగా) కలిగిన పాకిస్థాన్, ఈ అవకాశాన్ని విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గంగా మార్చుకుంది. గ్వాదర్ ఫ్రీ జోన్లో ప్రాసెసింగ్ సదుపాయాల ద్వారా టన్నుల కొద్దీ ఘనీభవించిన మాంసం, చర్మాలను చైనాకు నౌకల ద్వారా రవాణా చేస్తున్నారు.పాకిస్థాన్ వాదన ఇదే..అయితే ఈ నిర్ణయంపై పాకిస్థాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ నియమాల ప్రకారం గాడిద మాంసం వినియోగం నిషిద్ధం కావడంతో, కేవలం ఎగుమతికే పరిమితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, రవాణాకు జీవనాధారమైన గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందని స్థానికులు, జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలకు, ఆర్థిక అవసరాలకు ఈ గాడిదల దౌత్యం ఒక విచిత్ర నిదర్శనంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన కొత్త రూల్స్! -
లండన్‌లో గంగా హారతి.. చరిత్రలో తొలిసారి!
లండన్: భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి లండన్‌లోని థేమ్స్ నది వేదికైంది. యునైటెడ్ కింగ్డమ్లో తొలిసారిగా థేమ్స్ నదీ తీరంలో గంగా హారతి నిర్వహించారు. లండన్‌లోని గ్రీన్విచ్లో చారిత్రక ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ‘గంగా హారతి ఆన్ ద థేమ్స్: ఎ సెరిమనీ ఆఫ్ లైట్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ యూకే, వార్షిక ‘టోటల్లీ థేమ్స్’ ఉత్సవంతో కలిసి నిర్వహించింది.చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవంలో భాగంగా..1951లో స్థాపించిన చిన్మయ మిషన్ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ హారతిని నిర్వహించారు. వేదాంత జ్ఞానాన్ని, సామాజిక సేవను ప్రోత్సహించే ఆధ్యాత్మిక సంస్థగా చిన్మయ మిషన్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. వారణాసి, హరిద్వార్, రిషికేశ్‌లో గంగానది తీరంలో సాయంత్రం జరిగే హారతులను తలపించేలా థేమ్స్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజారులు, భక్తులు సమన్వయంతో మంత్రోచ్ఛారణలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఇత్తడి దీపాలతో హారతి ఇచ్చారు.చిన్మయ మిషన్ గ్లోబల్ హెడ్ స్వామి స్వరూపానంద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆధ్యాత్మిక నాయకులు, బ్రిటన్‌లోని హిందూ సంస్థల ప్రతినిధులు, దక్షిణాసియా ప్రవాస సమాజానికి చెందిన పలువురు కూడా హాజరయ్యారు. గంగా నది భౌతిక అవసరాలను తీర్చడంతోపాటు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రసారానికి ప్రతీకగా నిలుస్తుందని చిన్మయ మిషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. థేమ్స్ నదిలో స్థానిక పర్యావరణ వ్యవస్థకు ఎలాంటి హాని కలగకుండా హారతిని పూర్తిగా ఒడ్డునే నిర్వహించారు. నదిలోకి నూనె దీపాలు, పూలు, నైవేద్యాలు లేదా ఇతర పూజా సామగ్రిని వదలలేదు. కార్యక్రమం జరిగిన ప్రాంగణంలో ప్లాస్టిక్‌ను కూడా నిషేధించారు. పవిత్ర నదుల పట్ల సంప్రదాయ గౌరవాన్ని ఆధునిక పర్యావరణ బాధ్యతతో కలపడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. నెల రోజుల పాటు జరిగే ‘టోటల్లీ థేమ్స్’ ఉత్సవంలో భాగంగా తొలిసారి నిర్వహించిన గంగా హారతికి మంచి స్పందన రావడంతో.. ఇకపై లండన్ సాంస్కృతిక క్యాలెండర్లో దీనిని ఏటా నిర్వహించే కార్యక్రమంగా కొనసాగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పాక్ మరో దురాగతం: 26/11 నిందితుల ఫొటోలు మాయం? -
పాక్ మరో దురాగతం: 26/11 నిందితుల ఫొటోలు మాయం?
2008 ముంబై ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్ వ్యవహారశైలిపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ‘రెడ్ బుక్’లో 26/11 దాడులతో సంబంధం ఉన్న 19 మంది పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే వారిలో ఇద్దరికి సంబంధించిన కీలక వివరాలు గత జాబితాతో పోలిస్తే కనిపించకుండా పోయాయి. వారి ఫొటోలు, లష్కరే తోయిబాతో సంబంధం, దాడులకు సంబంధించిన కార్యకలాపాల వివరాలను తాజా జాబితా నుంచి తొలగించారు.ఇద్దరి వివరాలు ఎందుకు మాయం?బలూచిస్థాన్‌లోని తుర్బత్‌కు చెందిన ముహమ్మద్ ఖాన్ పేరు తాజా జాబితాలో ఉన్నప్పటికీ, అతని ఫొటో, లష్కరే తోయిబాతో సంబంధం, 2008 దాడుల్లో అతని పాత్రకు సంబంధించిన వివరాలు లేవు. గతంలో ఉగ్రవాదులు భారత్ వైపు వెళ్లేందుకు ఉపయోగించిన అల్-హుస్సైనీ అనే చేపల పడవను సమకూర్చిన వ్యక్తిగా అతడిని గుర్తించారు. అలాగే బహావల్‌నగర్‌కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ వివరాల్లోనూ ఫొటో, సంస్థతో సంబంధం తొలగిపోయాయి. 2021లో విడుదలైన ఇదే ‘రెడ్ బుక్’లో ఈ ఇద్దరి వివరాలు పూర్తిగా ఉన్నాయి.పడవ సిబ్బంది వివరాలుతాజా జాబితాలో ఫొటోలు కొనసాగించిన 11 మంది గురించి అల్-హుస్సైనీ, అల్-ఫౌజ్ పడవలకు చెందిన మాజీ లష్కర్ సిబ్బందిగా పేర్కొన్నారు. బహావల్పూర్లోని ఇస్లామీ కాలనీకి చెందిన షాహిద్ ఘఫూర్ రెండు పడవలకు కెప్టెన్ లేదా ‘తండేల్’గా పేర్కొన్నారు. సాహివాల్‌కు చెందిన ముహమ్మద్ ఉస్మాన్, లాహోర్‌కు చెందిన అతీక్ ఉర్ రెహ్మాన్, హఫీజ్బాద్కు చెందిన రియాజ్ అహ్మద్, గుజ్రన్‌వాలాకు చెందిన ముహమ్మద్ ముష్తాక్ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. పంజాబ్, సింధ్ ప్రాంతాలకు చెందిన పలువురు ఈ జాబితాలో ఉన్నారు.ఆరుగురిపై ‘నిధుల’ ఆరోపణలుమరో ఆరుగురిని దాడులకు ఆర్థిక సహాయం చేసినవారిగా ఎఫ్ఐఏ పేర్కొంది. ఫైసలాబాద్‌కు చెందిన ముహమ్మద్ ఇఫ్తిఖార్ అలీ ముష్కరులు, వారి నిర్వాహకులు ఉపయోగించిన వాయిస్-ఓవర్-ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం రూ.70,000 ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రావల్పిండికి చెందిన ముహమ్మద్ జియా, ఖనేవాల్‌కు చెందిన ముహమ్మద్ అబ్బాస్ నాసిర్, కసూర్‌కు చెందిన జావెద్ ఇక్బాల్, మండి బహౌద్దీన్కు చెందిన ముక్తార్ అహ్మద్, బట్టాగ్రామ్కు చెందిన అహ్మద్ సయీద్ పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో అహ్మద్ సయీద్ రూ.21 లక్షలు సమకూర్చినట్లు జాబితాలో పేర్కొన్నారు.18 ఏళ్లుగా పరారీలోనే..పూర్తి వివరాలతో ఉన్న 17 మంది గత 18 ఏళ్లుగా పరారీలో ఉన్నారని ఎఫ్ఐఏ పేర్కొంది. అయితే భారత అధికారుల ప్రకారం.. వీరిలో పలువురు ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే ఉన్నారు. అరెస్టులు చేయకుండా కేవలం జాబితాలో పేర్లు చేర్చడం అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించేందుకు చేస్తున్న చర్య మాత్రమేనని, ఇది ‘కంటితుడుపు చర్య’ అని వారు పేర్కొన్నారు. అయితే తాజా ఎఫ్ఐఏ పత్రాలు దాడుల కేసులో పడవ సిబ్బందిని పాకిస్థాన్ దర్యాప్తు సంస్థలు ఇంకా వాంటెడ్ వ్యక్తులుగానే పరిగణిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.సముద్ర మార్గంలో ముంబైకి..2008 నవంబర్ చివర్లో ఉగ్రవాదులు కరాచీ ప్రాంతం నుంచి బయలుదేరి సముద్రంలో ప్రయాణించారు. అనంతరం భారత చేపల వేట నౌక కుబేర్‌ను స్వాధీనం చేసుకుని, దాని సిబ్బందిని హతమార్చి, చిన్న రబ్బరు పడవల ద్వారా ముంబై తీరానికి చేరుకున్నారు. దాడికి ఉపయోగించిన పడవగా అల్-హుస్సైనీని గుర్తించారు. దానిని పాకిస్థాన్‌లో నిలిచిపోయిన విచారణలో కేసు ఆస్తిగా పరిగణించారు.న్యాయం కోసం ఎదురుచూపులు26/11 దాడులు మూడు రోజులపాటు కొనసాగాయి. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, యూదుల ప్రార్థనా కేంద్రం, కేఫేలతో పాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా మారాయి. ఈ దాడుల్లో 166 మంది మరణించగా, 300 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. పది మంది ఉగ్రవాదుల్లో తొమ్మిది మంది హతమయ్యారు. ఏకైక ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్‌ను భారత్‌లో అనంతరం ఉరి తీశారు. దాడుల వెనుక ఉన్న నిందితులు, కుట్రదారులు, కీలక సూత్రధారులను పూర్తిగా చట్టం ముందుకు తీసుకురావాల్సి ఉందన్న డిమాండ్ కొనసాగుతోంది. హఫీజ్ సయీద్, జకీర్ రెహ్మాన్ లఖ్వీ, సజిద్ మీర్ వంటి లష్కరే తోయిబా నిర్వాహకులు, సూత్రధారులపై భారత్ విచారణ ప్రక్రియను చేపడుతోంది.ఇదీ చదవండి: ‘యూపీ’ ఎన్నికలు: రెండు శాతమున్న ‘జాట్’లే శాసనకర్తలుగా.. -
మధ్యంతర ఎన్నికల వేళ.. ట్రంప్‌కు బిగ్ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టు ద్వారా ఓటు వేసే అమెరికన్లకు ఇకపై కొత్త నిబంధనలు పెట్టాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రయత్నానికి కోర్టు అడ్డుకట్ట వేసింది. నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం భావించినా.. సర్వోన్నత న్యాయస్థానం అందుకు అనుమతించలేదు. దీంతో మెయిల్ బ్యాలెట్లపై ట్రంప్ ప్రభుత్వం తీసుకురావాలనుకున్న మార్పులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి.ట్రంప్ మార్చిలో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. మెయిల్ బ్యాలెట్లు పొందే ఓటర్ల జాబితాలను రాష్ట్రాలు పోస్టల్ సర్వీస్‌కు అందించాలి. అలాగే బ్యాలెట్లను పంపేందుకు, తిరిగి స్వీకరించేందుకు USPS ఆమోదించిన ప్రత్యేక కవర్లనే ఉపయోగించాలి. వాటిపై ప్రత్యేక బార్కోడ్ ఉండాలి. రాష్ట్రాలు అందించే జాబితాలో పేరు లేని ఓటర్ల బ్యాలెట్లను లేదంటే నిబంధనలకు అనుగుణంగా లేని బ్యాలెట్లను పోస్టల్ సర్వీస్ తిరస్కరించే అవకాశం ఉండేది.కోర్టుల తలుపు తట్టిన రాష్ట్రాలుఈ నిబంధనలపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న పలు రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీతో పాటు ఓటింగ్ హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కొత్త నిబంధనల వల్ల చట్టబద్ధంగా ఓటు వేసే వేలాది మంది ఓటర్ల బ్యాలెట్లు కూడా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎన్నికల సమయంలో గందరగోళం తలెత్తుతుందని వారు వాదించారు.బోస్టన్లోని ఫెడరల్ జడ్జి ఇందిరా తల్వానీ సెప్టెంబర్ 4న ఈ నిబంధనల అమలును నిలిపివేశారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్రాలకే ప్రధాన అధికారం కల్పించే అమెరికా రాజ్యాంగానికి ఈ నిబంధనలు విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త విధానాలను అమలు చేయడం రాష్ట్రాలకు ఆచరణాత్మకంగా కూడా కష్టమని తెలిపారు.దీనిపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసినా.. 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కూడా దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేయడానికి నిరాకరించింది. కొత్త నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని, అదే సమయంలో ఓటింగ్ మోసాలను అడ్డుకోవడంలో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది.సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బకింది కోర్టులతో చుక్కెదురు కావడంతో.. ట్రంప్ ప్రభుత్వం సెప్టెంబర్ 6న అత్యవసర పిటిషన్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మెయిల్ వ్యవస్థను ఎన్నికల మోసాలకు ఉపయోగించకుండా అడ్డుకోవడానికి ఈ నిబంధనలు అవసరమని వాదించింది. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో దిగువ కోర్టు విధించిన నిషేధం కొనసాగనుంది.ఈ నిర్ణయంపై ఇద్దరు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. నిబంధనలపై ప్రభుత్వం చేస్తున్న అప్పీల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని అలిటో అభిప్రాయపడ్డారు. మరోవైపు జస్టిస్ బ్రెట్ కవనాగ్.. USPSకు ఇలాంటి నిబంధనలు రూపొందించే అధికారం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, 2026 ఎన్నికలకు ముందు రాష్ట్రాలు, స్థానిక ఎన్నికల అధికారులు వాటిని అమలు చేసేందుకు తగిన సమయం లేదన్నారు.మెయిల్ ఓటింగ్‌పైనే ఎందుకింత ఫోకస్?అమెరికా ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటింగ్‌కు గణనీయమైన ప్రాధాన్యం ఉంది. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఏదో ఒక రూపంలో మెయిల్ ఓటింగ్ అందుబాటులో ఉంది. 29 రాష్ట్రాల్లో ఎలాంటి కారణం చెప్పకుండానే ఓటర్లు మెయిల్ బ్యాలెట్ కోరుకోవచ్చు. మరో ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిగా మెయిల్ విధానంలోనే జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ ఓటర్లు మెయిల్ బ్యాలెట్లను రిపబ్లికన్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తారని పలు సర్వేలు సూచిస్తున్నాయి. దీంతో నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు మెయిల్ ఓటింగ్‌పై విధించే ఆంక్షలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్‌పై నియంత్రణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ తీర్పు వెలువడింది.ట్రంప్ చాలాకాలంగా మెయిల్ ఓటింగ్ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయన గతంలో చేసిన పలు ఆరోపణలకు ఆధారాలు లేవని విమర్శలు వచ్చాయి. ఆసక్తికరంగా.. ట్రంప్ స్వయంగా కూడా గతంలో మెయిల్ ద్వారా ఓటు వేశారు.మెయిల్ బ్యాలెట్లపై పోరాటం ట్రంప్ పరిపాలనకు, రాష్ట్రాల అధికారాలకు మధ్య జరుగుతున్న విస్తృత న్యాయపోరులో మరో కీలక పరిణామంగా మారింది. ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలన్న ప్రశ్నను కూడా ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది.ఇదీ చదవండి: అంతా బూటకం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు -
ఏఐకి ‘కిల్ స్విచ్’ తప్పనిసరి చేయాలా? జాక్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై చర్చ మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు ప్రమాదకరంగా మారితే వాటిని పూర్తిగా నిలిపివేయగల ‘కిల్ స్విచ్’ను కంపెనీలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా నిబంధనలు తీసుకురావాల్సి రావచ్చని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.ప్రమాదం పెరిగితే వెంటనే ఆపేలా..ప్రస్తుతం చాలా ఏఐ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ను అవసరమైతే నిలిపివేసే మార్గాలను కలిగి ఉన్నాయని క్లార్క్ తెలిపారు. అయితే భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారే కొద్దీ ఈ ‘కిల్ స్విచ్’ తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వాలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం రావచ్చన్నారు. అంతేకాకుండా ఆ స్విచ్ నిజంగా పనిచేస్తుందో లేదో స్వతంత్ర మూడో పక్షంతో తనిఖీ చేయించాలా అనే అంశాన్ని కూడా విధాన నిర్ణేతలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.మానవాళికి ముప్పుపై ఆందోళనలుఏఐ అభివృద్ధి వేగం పెరుగుతున్న కొద్దీ.. మానవాళికి ఎదురయ్యే ముప్పుపై పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నియంత్రణ లేకుండా ఏఐను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అది మనుషుల ఉనికికే ముప్పుగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కీలకమైన ఇంటర్నెట్ ఆధారిత వ్యవస్థలను తన నియంత్రణలోకి తీసుకుని మనుషులకు వ్యతిరేకంగా ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.‘10 శాతం అవకాశం ఉంది’ఆంథ్రోపిక్ పరిశోధకుడు ఇవాన్ హుబింగర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే అవకాశం 10 శాతానికి మించి ఉందని ఆయన వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ రంగంలో ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’గా పేరొందిన నోబెల్ విజేత జెఫ్రీ హింటన్ కూడా మానవాళిని ఏఐ అంతం చేసే అవకాశం 10 శాతం ఉండటం అసమంజసం కాదని పేర్కొన్నారు.భయాలను అతిగా చూపిస్తున్నారనే విమర్శలుఅయితే ఏఐ వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదాన్ని కొందరు అతిగా చూపిస్తున్నారని టెక్ రంగంలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ కంపెనీలు తమ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఇలాంటి భయాలను ప్రచారం చేస్తున్నాయని గ్రైండర్ సంస్థ అధినేత జార్జ్ అరిసన్ విమర్శించారు. భారీ స్థాయి పెట్టుబడులు, కంపెనీల విలువలకు న్యాయం చేయాలంటే భవిష్యత్తులో ఏఐ అనేక ఉద్యోగాలను, పరిశ్రమలను ఆక్రమిస్తుందని చెప్పాల్సిన పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.అమెరికాలో ‘కిల్ స్విచ్ యాక్ట్’ఏఐ ప్రమాదాలను నియంత్రించేందుకు అమెరికాలో ఇప్పటికే ‘కిల్ స్విచ్ యాక్ట్’ పేరుతో చట్ట ప్రతిపాదన ముందుకు వచ్చింది. ప్రమాదకరంగా మారిన ఏఐ సాధనాలను నిలిపివేసే సామర్థ్యం కంపెనీలకు తప్పనిసరిగా ఉండేలా చేయడం, అవసరమైతే వాటిని ఆపాలని లేదా పరిమితం చేయాలని కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆదేశించేలా అధికారాలు కల్పించడం ఈ ప్రతిపాదనలో ఉంది. అయితే ఏఐ అభివృద్ధిని నెమ్మదింపజేసే ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు.బ్రిటన్ మాత్రం వ్యతిరేకంమరోవైపు బ్రిటన్ ప్రభుత్వం ఏఐకి ప్రత్యేకంగా ‘కిల్ స్విచ్’ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఇటీవల తిరస్కరించింది. ఒక దేశంలో ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చినా ఇతర ప్రాంతాల్లో ఏఐ అభివృద్ధి లేదా దుర్వినియోగాన్ని అడ్డుకోలేమని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏఐ చాట్‌బాట్ క్లాడ్‌ను రూపొందించిన ఆంథ్రోపిక్ సంస్థ వరుసగా మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ అభివృద్ధి వేగం, భద్రత, ప్రభుత్వ నియంత్రణపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు! -
దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ బాబ్ మాకీ కన్నుమూత
దిగ్గజ ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ బాబ్ మాకీ (87) తుదిశ్వాస విడిచారు. ఆయన సోమవారం మరణించారు. కాగా బాబ్ మాకీ మరణ వార్తను ఆయన బృందం ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ధృవీకరించింది. 1939లో లాస్ ఏంజిల్స్ శివారు ప్రాంతంలో జన్మించిన బాబ్ మాకీకి చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. బాబ్ మాకీకి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో జాబ్ మాకీ తన తాతయ్య, నానమ్మ వద్ద పెరిగాడు. ఈ సమయంలోనే వాళ్లిద్దరు బాబ్ మాకీని కళల పట్ల ఆసక్తి చూపేలా ప్రోత్సహించారు. తాను ఏ వృత్తిని కోరుకుంటాననేది తనకు ముందే తెలుసని బాబ్ మాకీ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.మాకీకి లభించిన తొలి ప్రధాన అవకాశాల్లో చెప్పుకోవాల్సింది మాత్రం నటి, గాయని మిట్జీ గేనార్కు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేయడమే. లాస్ వేగాస్ రెవ్యూకు మిట్జీకి అందమైన కాస్ట్యూమ్స్ తయారు చేయడం ద్వారా బాబ్ మాకీ పేరు తొలిసారి మార్మోగిపోయింది. ఆ తర్వాత అతను ఆమె టెలివిజన్ స్పెషల్స్ కోసం దుస్తులను రూపొందించాడు. మాకీ తన కెరీర్లో తొమ్మిది ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులు అందుకోవడంతో పాటు ఆస్కార్ విభాగంలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అవ్వడం విశేషం.బాబ్ మాకీ మరణవార్తను అతడి బృందం ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ‘‘బాబ్ మాకీ ఈ రోజు కన్నుమూశారనే వార్తను చాలా బాధతో తెలియజేస్తున్నాము. ఆయన తన 87 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. ఫ్యాషన్, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు, ఆయన జీవితమంతా అదే చేయాలని కోరుకున్నారు. ఆయన ప్రతిభ అసాధారణం. ఆయన రూపొందించిన డిజైన్లు ఈ ప్రపంచానికి అందాన్ని పంచుతూ శాశ్వతంగా నిలిచి ఉంటాయి.’’అని పేర్కొంది.ఇదీ చదవండి: కేంద్ర మంత్రి నివాసంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు -
ఏఐపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. ‘బూటకం’ అంటూ కొట్టిపారేశారు!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ)పై వస్తున్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐ సంస్థలపై మరిన్ని ప్రభుత్వ నియంత్రణలు అవసరమన్న పరిశ్రమ ప్రముఖుల డిమాండ్లను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. చైనాను ఏఐ రంగంలో వెనక్కి నెట్టడం అమెరికాకు ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే, ఏఐ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ.. సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఏఐ వ్యవస్థలు అదుపు తప్పకుండా ఉండేందుకు తన పర్యవేక్షణ సరిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.ఇప్పటికే ఏఐ కంపెనీలపై చర్యలు తీసుకునేంత ప్రభుత్వ నియంత్రణ, చట్టపరమైన అధికారాలు అమెరికాకు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా, ఏఐను భారీ ప్రయోజనాలు అందించే విలువైన అవకాశంగా ఆయన అభివర్ణించారు. అయితే మరోవైపు ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గే అవకాశం, భారీ డేటా సెంటర్లతో స్థానిక ప్రాంతాలపై ప్రభావం, భద్రతాపరమైన ముప్పులు వంటి అంశాలపై ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రంప్ వైఖరిపై వైట్‌హౌస్‌లోని కొందరు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాత్రం ఏఐ సంస్థలే ప్రభుత్వాన్ని నియంత్రణలు విధించాలని కోరడంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కొత్త నిబంధనల పేరుతో కంపెనీలు తమకు అనుకూలమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయా అనే సందేహం ఉందన్నారు. అయితే ఏఐలో ప్రయోజనాలతో పాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని అంగీకరించిన వాన్స్.. వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన భద్రతా చర్యలపై ప్రభుత్వం, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.మరోవైపు ఏఐ, సైబర్ భద్రత అంశాలపై ప్రభుత్వ నిపుణులతో ఈ వారంలో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, ఏఐ కంపెనీల బాధ్యత, ప్రభుత్వ పాత్రపై చర్చించేందుకు అమెరికా కాంగ్రెస్‌లోనూ సమావేశాలు జరగనున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఏఐపై ఇరుదేశాల మధ్య చర్చలను మరింత విస్తరించే అవకాశముంది. గతంలో ఏఐ భద్రతపై ట్రంప్, షీ చర్చించినప్పటికీ పెద్దగా అభివృద్ధి కనిపించలేదు. తాజాగా ఏఐ అంశంపై అమెరికా-చైనా ప్రభుత్వ స్థాయి చర్చలు ఏర్పాటు చేయనున్నట్లు చైనా ప్రకటించింది.ఇదీ చదవండి: ఒమన్‌లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా! -
620 కోట్ల కుంభకోణం.. భారత్‌లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్‌లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్‌లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్‌లో బీజేపీ! -
ఒమన్‌లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా!
ఒమన్: గల్ఫ్ అరబ్ దేశాలతో ఇరాన్ నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. అయితే, ప్రాంతీయ దేశాల అభ్యర్థన మేరకే భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.ఒమన్‌లో జరగాల్సిన ఈ సమావేశంలో సౌదీ అరేబియా, ఖతార్, ఇరాక్ పాల్గొనాల్సి ఉంది. అయితే, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన భవిష్యత్ పరిణామాలు, ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై ఇరాన్ ఆయా దేశాలతో చర్చించాలని భావించినట్లు తెలుస్తోంది.అలాగే, ప్రపంచంలోని కీలకమైన సముద్ర మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. చమురు రవాణాకు కూడా ఇది ఎంతో ముఖ్యమైన మార్గం కావడంతో అక్కడి పరిస్థితులపై గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంటాయి.ఇదిలా ఉండగా.. బహ్రెయిన్ ఇప్పటికే ఇరాన్ అధికారులతో సమావేశానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల వైఖరి మరోసారి చర్చకు వచ్చింది. ఇరాన్‌తో చర్చలు జరపడం విషయంలో ఆయా దేశాలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఇరాన్ పాలక వ్యవస్థ కారణంగానే ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ప్రతిపాదించిన భేటీ వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇదీ చదవండి: సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్ -
సంక్షోభంలో నేపాల్.. వెలుగులు పంచుతున్న భారత్
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలతో జలవిద్యుత్ మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో.. ఆ దేశానికి రోజుకు 18 గంటల చొప్పున విద్యుత్ ఎగుమతి చేసేందుకు భారత్ అనుమతించింది. సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ విద్యుత్ సరఫరా కొనసాగనుంది. గరిష్ఠంగా 654 మెగావాట్ల విద్యుత్‌ను నేపాల్‌కు అందించేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.ఇటీవలి వరదల కారణంగా నేపాల్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. సుమారు 550 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతిన్నట్లు అంచనా. దీంతో దేశీయ విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు, భారత్‌కు నేపాల్ నుంచి జరిగే విద్యుత్ ఎగుమతులు కూడా సుమారు 400 మెగావాట్ల మేర తగ్గాయి.ఈ పరిస్థితుల్లో విద్యుత్ కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి విద్యుత్ దిగుమతి చేసుకోవాలని నేపాల్ కోరింది. ఆ అభ్యర్థనను భారత్ ఆమోదించింది. రోజులో 18 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇందులో గరిష్ఠంగా 600 మెగావాట్ల విద్యుత్‌ను ముజఫర్‌పూర్-ఢల్కేబర్ 400 కేవీ ప్రసార మార్గం ద్వారా, మరో 54 మెగావాట్లను టనక్పూర్-మహేంద్రనగర్ 132 కేవీ మార్గం ద్వారా అందించనున్నారు.ఈ సరఫరా సమయం ప్రధానంగా పగటి వేళల్లో ఉండేలా నిర్ణయించారు. భారత్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తి అధికంగా ఉండే సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రెండు దేశాల విద్యుత్ వ్యవస్థలకు ప్రయోజనం కలిగేలా ఈ ఏర్పాటును రూపొందించారు. నేపాల్‌లో జలవిద్యుత్ రంగం దేశ విద్యుత్ అవసరాల్లో అత్యంత కీలకమైనది కావడంతో వరదల ప్రభావం అక్కడి విద్యుత్ వ్యవస్థపై తీవ్రంగా పడింది.డిసెంబర్లో ఈ ఏర్పాటును మరోసారి సమీక్షించనున్నారు. అవసరాన్ని బట్టి 2027 జనవరిలో కూడా సరఫరాను కొనసాగించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌కు తక్షణ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు, భారత్-నేపాల్ మధ్య ఇంధన రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. -
నిన్న బంగారంతో చైనా.. ఇవాళ సౌదీ అరేబియాకు జాక్‌పాట్!
రియాద్ : నిన్న బంగారం నిక్షేపాలతో చైనాకు జాక్‌పాట్ తగిలింది. ఇప్పుడు సౌదీ అరేబియా వంతు వచ్చింది. ఆ దేశ తలరాతను మార్చే భారీ యురేనియం నిధి వెలుగు చూసింది.పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన పరిశోధక నౌక ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ చేపట్టిన సముద్ర గర్భ అన్వేషణలో సంచలన నిజాలు వెలుగుచూశాయి. సముద్రం అడుగున ఉన్న హై-టెంపరేచర్ హైడ్రోథర్మల్ ఫీల్డ్ ప్రాంతంలో శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాలు విస్తుపోయేలా చేశాయి. ఇక్కడ లభించిన ఖనిజ నమూనాలలో టన్ను ముడి ఖనిజానికి ఏకంగా 15.4 గ్రాముల బంగారం, అలాగే 1,271 గ్రాముల వెండి ఉన్నట్లు తేలింది. సాధారణంగా భూమిపై దొరికే గనుల కంటే సముద్రం అడుగున ఈ విలువైన లోహాల గాఢత చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. దశాబ్దాలుగా నల్ల బంగారం (ముడి చమురు) మాత్రమే తమ తలరాతను మారుస్తుందని సౌదీ అరేబియా నమ్ముతూ వచ్చింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీరుస్తూ ఆర్థికంగా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కానీ, రేపు చమురు నిల్వలు కరిగిపోతే పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు తరాల ఆర్థిక భద్రత మాటేమిటి? అనే ఆలోచనే సౌదీ పాలకులను ప్రత్యామ్నాయ వనరుల వేటలో పడేలా చేసింది. ఆ అన్వేషణే ఇప్పుడు ఒక అద్భుతమైన నిధిని వెలికితీసేలా చేసింది.సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా ప్రాంతం ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాదు.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే సరికొత్త శక్తి కేంద్రంగా మారుతోంది. ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఇటీవల వెల్లడించిన వివరాలు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఆ ప్రాంతంలో ఏకంగా 110 మిలియన్ టన్నుల (11 కోట్ల టన్నులు) భారీ యురేనియం నిల్వలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇది కేవలం ఒక మైనింగ్ అన్వేషణ మాత్రమే కాదు.. సౌదీ భవిష్యత్తు కలలకు దక్కిన అసలైన బలం.జాక్‌పాట్ ఎందుకంటే?చమురు ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి, భవిష్యత్తులో రాబోయే ఇంధన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ యురేనియం నిల్వలు సౌదీకి పెద్ద ఆసరాగా నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భూమి పొరల్లో దాగున్న ఈ ముడి ఖనిజం అంతర్జాతీయ మార్కెట్లో ఆ దేశ ఆర్థిక శక్తిని ఊహకందని స్థాయికి తీసుకెళ్లే అస్త్రం కానుంది. రేపు సౌదీ గడ్డపై పౌర అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. దేశీయ అవసరాలు తీరగా మిగిలిన శుద్ధి చేసిన యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ.. గ్లోబల్ న్యూక్లియర్ మార్కెట్లో ఆ దేశం తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశాలున్నాయి.అయినా ఇది అంత సులభం కాదు..భూగర్భంలో కోట్లాది టన్నుల ఖనిజం దొరికినంత మాత్రాన అది వెంటనే ఇంధనంగా మారిపోదు. ఈ ముడి ఖనిజం నుంచి యురేనియంను వేరుచేసి, వాణిజ్యపరంగా వినియోగించే స్థాయికి తీసుకురావడానికి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. దీనికోసం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు అవసరం. అయినప్పటికీ, మున్ముందు ప్రపంచాన్ని శాసించబోయే అణు శక్తి రంగంలో అడుగుపెట్టడానికి సౌదీ వేసిన ఈ తొలి అడుగు.. ఆ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు! -
రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ (52) రెండో వివాహం చేసుకున్నారు. ఐరిష్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త, మల్టీ మిలియనీర్ ఆర్థికవేత్త కామెరూన్ ఓరైలీ (62)ని జెమీమా వివాహం చేసుకున్నట్లు ఆమె కుటుంబం ధ్రువీకరించింది. ఈ వివాహం వారాంతంలో జరిగినట్లు సమాచారం.జెమీమా గోల్డ్‌స్మిత్, ఇమ్రాన్ ఖాన్ దాదాపు 9 సంవత్సరాల పాటు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు సులేమాన్, కాసిమ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం కోసం, ఆయనకు మద్దతుగా ఈ ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు.జెమీమా సోదరుడు బెన్ భార్య జెమీమా జోన్స్ సామాజిక మాధ్యమంలో వివాహ వేడుకకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. “జెమీమా, కామెరూన్ వివాహ వేడుకను జరుపుకుంటున్నాం.. ఎంత సంతోషకరమైన రోజు” అంటూ ఆమె పేర్కొన్నారు. జెమీమా, కామెరూన్ ఓరైలీకి సినిమాలు, డాక్యుమెంటరీలపై ఉన్న ఉమ్మడి ఆసక్తి ద్వారా పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.జెమీమాకు ఎన్నో నైపుణ్యాలు జెమీమా గోల్డ్‌స్మిత్ నిర్మాణ సంస్థ ఇన్స్టింక్ట్ ప్రొడక్షన్స్ స్థాపించారు. పలు చిత్రాలు, కార్యక్రమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘వాట్స్ లవ్ గాట్ టు డూ విత్ ఇట్?’ చిత్రానికి కూడా ఆమె రచన, నిర్మాణంలో భాగస్వామ్యం వహించారు. న్యూ స్టేట్స్‌మన్, వానిటీ ఫెయిర్ వంటి పత్రికల్లో సంపాదకురాలిగా, రచయితగా పనిచేశారు. మానవ హక్కుల అంశాలపై ఆమె బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు.ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండటంపై కూడా జెమీమా స్పందించారు. “ఇది ఇక కేవలం పాకిస్థాన్ రాజకీయ వ్యవహారం కాదు. ఇది మానవ హక్కుల అత్యవసర పరిస్థితి” అని ఆమె పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్‌తో ఉన్న దీర్ఘకాల సంబంధాలు, ఆయన కుమారులు బ్రిటిష్ పౌరులు అయినప్పటికీ తండ్రి ఆరోగ్యం క్షీణించడాన్ని దూరం నుంచి చూడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జెమీమా రెండో వివాహం నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఆయన కుమారుల ప్రచారం వంటి అంశాలపై ఆమె భవిష్యత్తులో చేసే వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. -
21 ఏళ్ల కొడుకు దుర్మరణం : 22 ఏళ్ల నాటి పిండంతో బిడ్డకు జన్మ
ఒక ఘోర ప్రమాదంలో 21 ఏళ్ల కొడుకును కోల్పోయిన 54 ఏళ్ల గ్రీకు మహిళ రెండోసారి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి పండింటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గ్రీస్ నిబంధనల ప్రకారం సాధారణంగా 54 ఏళ్లు దాటిన మహిళలు ఐవీఎఫ్ చేయించుకోవడానికి అనుమతి లేదు. అయినా అ దంపతులు దేశంలోని నేషనల్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అథారిటీ నుండి ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ బిడ్డను కనడం విశేషంగా నిలుస్తోంది. తాజా ఘటనతో గ్రీకు దేశంలో ఐవీఎఫ్ వయస్సు పరిమితులపై మరోసారి చర్చ మొదలైంది.గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రిస్టినా రాప్తి-ట్జెలెపి (Cristina Rapti-Tzelepi), కాన్స్టాంటినోస్ రాప్టిస్ (Constantinos Raptis, 60) దంపతుల 21 ఏళ్ల కొడుకు గియోర్గోస్ (Giorgos) మరణించాడు. ఆ దుర్ఘటన జరిగి కొద్ది నెలల తర్వాత ఈ దంపతులు మరోసారి సంతానం కనాలని నిర్ణయించుకున్నారు.22 ఏళ్లకు పైగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఉపయోగించి ఐవీఎఫ్ పద్ధతిలో సెప్టెంబర్ 9న ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన పాప బరువు 3.49 కిలోలు. తమ దివంగత కొడుకు గియోర్గోస్ జ్ఞాపకార్థం దంపతులు తమ కూతురికి 'జార్జియా' (Georgia) అని పేరు పెట్టారు. గియోర్గోస్ కూడా గతంలో ఐవీఎఫ్ ద్వారానే జన్మించాడు.All the leftover frozen embryos are as precious as this beautiful little girl. They deserve their right to life and right to their mother and father protected.Parents, go implant your babies! https://t.co/eX63pkfpBC— Katy Faust (@Katy_Faust) September 13, 202622 ఏళ్ల క్రితం ఫ్రీజ్ చేసిన పిండం ద్వారా ఒక గ్రీకు మహిళ బిడ్డకు జన్మనిచ్చిందని, అదే చికిత్సతో పుట్టిన తన కుమారుడిని కోల్పోయిన తర్వాత ఈ సంఘటన జరిగిందని గైనకాలజిస్ట్ కాన్స్టాంటినోస్ పాంటోస్ ఒక ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.2004లో పిండ మార్పిడి తర్వాత, తొలి ప్రయత్నంలోనే ఆరోగ్యకరమైన మగబిడ్డకు జన్మనిచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ బిడ్డను కోల్పోయారని పాంటోస్ తెలిపారు.వయస్సు నిబంధనలపై చర్చగతంలోనూ ఇలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. ఒక ఒహియో దంపతులు ఎంబ్రియో అడాప్షన్ ద్వారా, ఏకంగా 30 సంవత్సరాలకు పైగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఉపయోగించి బాబుకు జన్మనిచ్చారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ గుర్తింపు పొందింది.రాప్తి-ట్జెలెపి గైనకాలజిస్ట్, హెలెనిక్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ హెడ్ అయిన కోస్టాస్ పాంటోస్ మాట్లాడుతూ ముఖ్యంగా గ్రీస్‌లో తగ్గుతున్న జనన రేటును దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుత నిబంధనల ప్రకారం మహిళలు 54 ఏళ్ల వరకు మాత్రమే ఐవీఎఫ్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఈ నిబంధన చాలా కఠినంగా ఉందని, చట్టంలో మార్పు రావాలని డాక్టర్ పాంటోస్ వాదిస్తున్నారు.మరోవైపు రెండో అవకాశం ద్వారా జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్నాం. ఇంట్లోకి మరో బిడ్డను ఆహ్వానించి, తమ తొలి బిడ్డ ఇంటిని నవ్వులతో ఎలా నింపిందో, ఈ పాప కూడా అంతే ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా పెరగాలని కోరుకున్నాం అంటూ ఎంతో సంతోషంగా చెప్పారు దంపతులు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మినీబస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో 21 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం మరో ఎస్యూవీ వాహనం కూడా ఆ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటన వెస్టర్న్ కేప్ ప్రావిన్స్‌లోని ఎన్1 రహదారిపై జరిగింది.రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ప్రకారం, ప్రిన్స్ ఆల్బర్ట్, లీయూ-గామ్కా ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం కేప్ టౌన్‌కు సుమారు 380 కిలోమీటర్ల తూర్పున ఉంది. తొలుత రెండు మినీబస్ టాక్సీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న శిథిలాలను ఎస్యూవీ వాహనం ఢీకొట్టినట్లు వెస్టర్న్ కేప్ మొబిలిటీ విభాగం వెల్లడించింది.ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, పరిస్థితుల అంచనా కొనసాగుతున్న సమయంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.ప్రమాదం కారణంగా ఎన్1 రహదారిని అధికారులు మూసివేశారు. ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించేందుకు రోడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.దక్షిణాఫ్రికాలో మినీబస్ టాక్సీలు ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఇవి తరచుగా ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండు వేర్వేరు మినీబస్ ప్రమాదాల్లో కనీసం 25 మంది మరణించారు. వారిలో 14 మంది చిన్నారులు ఉన్నారు. తాజా ప్రమాదంలో మృతుల సంఖ్యపై అధికారులు తుది అంచనా వేస్తుండటంతో తదుపరి వివరాలపై దర్యాప్తు నివేదిక కీలకం కానుంది. -
కోట్లాది మందికి నేపాల్ వరదల తరహా ముప్పు
హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు గత దశాబ్దంతో పోలిస్తే మరింత వేగంగా కరుగుతున్నాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ ప్రాంతం కీలకమైన మలుపు దిశగా వెళ్తోందని, శతాబ్దం మధ్య నాటికి గరిష్ఠ నీటి ప్రవాహ దశకు చేరుకున్న తర్వాత నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. దీనివల్ల కోట్లాది మంది ప్రజల తాగునీరు, వ్యవసాయం, జీవనోపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.అధ్యయనం ప్రకారం హిందూకుష్-హిమాలయ ప్రాంతంలో ఇటీవలి దశాబ్దాల్లో హిమనీనదాల ద్రవ్యరాశి వేగంగా తగ్గుతోంది. ఈ విస్తారమైన పర్వత వ్యవస్థ అఫ్గానిస్థాన్ నుంచి మయన్మార్ వరకు 8 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 40,000 హిమనదాలు ఉన్నప్పటికీ భూమిపై కేవలం 21 హిమనదాలనే పర్యవేక్షిస్తున్నారని అధ్యయనం తెలిపింది.భారత్‌లో దాదాపు 200 హిమనీనద సరస్సులను అధిక ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వాటిలో 56 అత్యంత అధిక ప్రమాద స్థాయిలో ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. హిమనీనదాలు వెనక్కి తగ్గడంతో వాటి వెనుక అస్థిరమైన సరస్సులు ఏర్పడుతున్నాయని, అవి ఎప్పుడైనా విరిగి దిగువ ప్రాంతాల్లో భారీ వరదలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆగస్టు చివరలో నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమనీనదం అకస్మాత్తుగా కూలిపోవడం వల్ల లోయల్లో వరుసగా కొండచరియలు, వరదలు సంభవించిన ఘటనను అధ్యయనం ప్రస్తావించింది. నేపాల్, చైనా-టిబెట్ ప్రాంతాల్లో ఈ ఘటనలో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు, 5,300 మందికి పైగా గల్లంతైనట్లు పేర్కొంది.హిమాలయ ప్రాంతం భారత భూభాగంలో సుమారు 18 శాతం ఉన్నప్పటికీ, ప్రకృతి విపత్తుల్లో దాని వాటా దాదాపు 35 శాతంగా ఉందని అధ్యయనం తెలిపింది. హిమనీనదాల కరుగుదలతో వరదలు, కొండచరియలు, కరువులు పెరిగే అవకాశం ఉందని, వ్యవసాయం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోజువారీ నీటి అవసరాలు ప్రభావితమవుతాయని పేర్కొంది.హిమనదాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రమాదకర సరస్సులను పరిశీలించడం, స్థానిక ప్రజలను విపత్తులకు సిద్ధం చేయడం కీలకంగా మారనుంది. -
పారాచూట్ ఫెయిల్: ఎముకలన్నీ విరిగి, పైలట్ 50 గంటల తర్వాత
ఇరాన్ భూభాగంలో అమెరికా యుద్ధ విమానం (F-15E) కూలిపోయినప్పుడు, పారాచూట్ దెబ్బతినడంతో గాల్లోంచి అత్యంత వేగంతో కిందపడి, తీవ్ర గాయాలతో 50 గంటల పాటు శత్రువుల కంటికి చిక్కకుండా తప్పించుకున్న ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ అధికారి ("బ్రావో" అనే కోడ్ నేమ్ గల వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్) సాహసోపేతమైన కథ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాణాలతో బయటపడిన అమెరికా వైమానిక దళ అధికారి తొలిసారి తన అనుభవాలను అమెరికాకు చెందిన ప్రముఖ సీబీఎస్ (CBS) టీవీ షో '60 మినిట్స్' ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. ఏప్రిల్ నెలలో అమెరికా F-15Eఇరాన్ గగనతలంలో కూలిపోయింది. పారాచూట్ పనిచేయక, గంటకు 161 కి.మీ వేగంతో పడిపోయినా ప్రాణాలతో బయటపడ్డారు. అనేక ఎముకలు విరిగినప్పటికీ పర్వతాన్ని ఎక్కి, ఇరాన్ బలగాల నుంచి దాదాపు 50 గంటల పాటు తప్పించుకుని ప్రాణాలు బయటపడ్డారు.ఏప్రిల్ 2న ఇరాన్ డ్రోన్, క్షిపణి కార్యక్రమాలకు సంబంధించిన పారిశ్రామిక సౌకర్యాలపై దాడి చేస్తున్న 'DUDE 44' అనే ఎఫ్-15ఈ (F-15E) ఫైటర్ జెట్‌లో బ్రావో వెపన్స్ సిస్టమ్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఆ విమానాన్ని భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి ఢీకొట్టింది.పారాచూట్ వైఫల్యంఏదో ఒక సరుకు రవాణా రైలు వచ్చి గుద్దినట్లు అనిపించిందని బ్రావో చెప్పారు. కొన్ని క్షణాల్లోనే సిబ్బంది ఇద్దరూ పారాచూట్ ద్వారా బయటపడ్డారు. పైలట్ అయిన 'ఆల్ఫా' సురక్షితంగా కిందకు దిగగా, బ్రావో దాదాపు ఐదు మైళ్ల దూరంలో గరుకైన పర్వత ప్రాంతంలో పడ్డారు. ఈ దాడిలో బ్రావో పారాచూట్ దెబ్బతిని సరిగ్గా తెరుచుకోలేదట. దీంతో అత్యంత వేగంతో కిందపడిన క్షణాలు జీవితంలో అత్యంత భయానకమైనవనీ అని పేర్కొన్నారు.ఫ్రీ-ఫాల్లా, గంటకు దాదాపు 161 కి.మీ వేగంతో నేలను ఢీకొట్టారు. దీంతొ ఆయన వెన్నుపూస, చేయి, భుజం ఎముకలు విరిగిపోయాయి. చీలమండ బెణికింది, తలపై, ముఖంపై గాయాలయ్యాయి. అయినా తాను ప్రాణాలతో బయటపడటాన్ని ఆయన "ఆధునిక కాలపు అద్భుతం" అని అభివర్ణించారు.ఎలా బయటపడ్డారు తీవ్ర గాయాలు బాధపెడుతున్నప్పటికీ కూలిన ప్రదేశం నుంచి దూరంగా వెళ్లి కొండపైకి ఎక్కారు బావో. ఏదైనా ఆశ్రయం దొరుకుతుందనే నమ్మకంతో సుమారు 7వేల అడుగుల ఎత్తులో ఉన్న రిడ్జ్లైన్కు (కొండ శిఖరపు అంచు) చేరుకున్నారు. ఇరాన్ టీవీలో కనిపించ కూడదనే పట్టుదలే ముందుకు నడిపించిందన్నారు.మరోవైపు అమెరికా బలగాలు ఆల్ఫాను గుర్తించి ఒక సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టాయి. 21 విమానాలతో కూడిన ఈ ఆపరేషన్‌లో రెండు హెలికాప్టర్లను పంపగా, రెస్క్యూ సిబ్బందిపై ఎదురుకాల్పులు జరిగాయి. ఆల్ఫాను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చినప్పటికీ, బ్రావో ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు బ్రావో అమెరికా బలగాలకు తాను బతికే ఉన్నానని సమాచారం అందించారు. ఆ తర్వాత ఆహారం, నీరు లేకుండా మరో రోజును పర్వతాల మధ్య గడిపారు. ఈలోగా అమెరికా బలగాలు రెండో రెస్క్యూ ఆపరేషన్‌కు ప్లాన్ చేశాయి.సీఐఏ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. దాడి జరిగి దాదాపు రెండు రోజుల తర్వాత, దాదాపు 92 మంది స్పెషల్ ఆపరేటర్లు ఇరాన్‌లోకి ప్రవేశించి బ్రావోను రక్షించారు. చివరికి ఇద్దరు ఎలైట్ ఎయిర్ ఫోర్స్ పారాసెస్క్యూ ఆపరేటర్లు ఆ కొండ శిఖరంపై ఉన్న బ్రావోను చేరుకున్నారు.ఇదీ చదవండి: గురుగ్రామ్‌లో ఏం జరుగుతోంది..‘అయితే నామాట.. లేదంటే థార్‌మాట’!ఈ ఆపరేషన్ అక్కడితో ముగియలేదు. రెస్క్యూ విమానం తాత్కాలిక ఎడారి రన్‌వేలో కూరుకుపోవడంతో, 90 మందికి పైగా యూఎస్ సిబ్బంది ఇరాన్‌లోనే చిక్కుకుపోయారు. చివరకు వారందరినీ సురక్షితంగా తరలించి, సున్నితమైన సాంకేతికత శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు అమెరికా సైన్యం ఆ విమానాన్ని కూడా ధ్వంసం చేసింది.దాదాపు 50 గంటల తర్వాత బ్రావో సురక్షిత ప్రాంతానికి చేరు కున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి అమెరికా సైనిక బృంద స్ఫూర్తి, శిక్షణ, నాయకత్వమే కారణమని ఆయన కొనియాడారు. తిరిగి విమానాలు నడపడం ప్రారంభించిన ఆల్ఫా, భద్రతా కారణాల దృష్ట్యా '60 మినిట్స్' ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, ఇద్దరు సిబ్బందిని రక్షించడంలో కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన -
అప్పు అడగడం కోసం పాకిస్థాన్ సంచలన ఎత్తుగడ
ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్ అప్పుకోసం చేయని ప్రయత్నాలు లేవు. నిజాలను దాచిపెట్టి, మోసం చేసి, పన్నాగాలు పన్నయినా సరే అప్పులు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అక్టోబర్‌లో నిర్వహించనున్న ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌పై రూ.70 లక్షల నజరానా ప్రకటించింది. పాకిస్థాన్ జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఏ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చింది.ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ రెడ్ బుక్‌లో మసూద్ అజర్ పేరును చేర్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ చేపట్టిన ఈ చర్యను కేవలం చూపించడానికి చేసిన చర్యగా పలువురు భావిస్తున్నట్లు కథనం పేర్కొంది.గతంలోనూ ఇలాంటి ప్రకటన మసూద్ అజర్ విషయంలో పాకిస్థాన్ గతంలోనూ ఇలాంటి ప్రకటన చేసింది. 2021లో ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితా నుంచి బయటపడే ప్రయత్నాల సమయంలో, మసూద్ అజర్‌పై చర్యల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పుడు అతడు పాకిస్థాన్ నుంచి అదృశ్యమై అఫ్గానిస్థాన్‌కు వెళ్లినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అదే ఏడాది ఎఫ్ఐఏ అతడిపై రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పుడు ఐదు ఏళ్ల తర్వాత విడుదలైన కొత్త రెడ్ బుక్‌లో ఆ మొత్తాన్ని రూ.70 లక్షలకు పెంచింది.మసూద్ అజర్ పాకిస్థాన్‌లో లేడని, అఫ్గానిస్థాన్‌లో ఉన్నాడని పాకిస్థాన్ పదేపదే చెబుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అతడిపై నజరానా పెంచుతూ ప్రకటన చేయడం ఆ దేశ చర్యపై సందేహాలకు దారితీస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉగ్ర కార్యకలాపాలతో మసూద్ అజర్ పేరు ముడిపడి ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం బహావల్పూర్లోని జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని చర్య చేపట్టింది.అక్టోబర్ ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీకి ముందు పాకిస్థాన్ తీసుకున్న తాజా చర్యపై ఇప్పుడు ప్రధానంగా దృష్టి నెలకొంది. మసూద్ అజర్‌ను పట్టుకునేందుకు ఇది నిజమైన ప్రయత్నమా.. లేక ఎఫ్ఏటీఎఫ్ ముందు చర్యలు తీసుకున్నట్లు చూపించే ప్రయత్నమా అన్నది తదుపరి పరిణామాల్లో తేలనుంది. ఎఫ్ఏటీఎఫ్ గ్రే జాబితాలో పాక్ పేరు ఉంటే అప్పులు, పెట్టుబడులపై ప్రభావం పడొచ్చు. అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారులు దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో నిధులు సమకూర్చుకోవడం కష్టతరం. -
ఇతడు బుర్ఖా ఎందుకు ధరించాడో తెలుసా?
బ్రిటన్‌లోని పోర్ట్స్మౌత్లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలో బుర్ఖా ధరించి గుర్తింపును దాచుకున్నారన్న ఆరోపణపై 76 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది. హాంప్‌షైర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌతాంప్టన్‌లోని హెడ్జ్ ఎండ్‌కు చెందిన తిమోతీ మిల్లర్‌పై నిరసన సందర్భంగా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే దుస్తులు ధరించినట్లు అభియోగం నమోదైంది.మిల్లర్ శనివారం జరిగిన నిరసనలో అరెస్టైన పలువురిలో ఒకరు. పోర్ట్స్మౌత్ నగర కేంద్రంలో సౌత్ కోస్ట్ పేట్రియాట్స్, స్టాండ్ అప్ టు రేసిజం బృందాలకు చెందిన వందలాది మంది పరస్పరం నిరసనలు చేపట్టారు. మిల్లర్ సోమవారం పోర్ట్స్మౌత్ మేజిస్ట్రేట్స్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది.ఇదే ఘటనలో డేవిడ్ మెక్నాలీ అనే 33 ఏళ్ల వ్యక్తిపై రహదారిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నేరపూరిత నష్టం కలిగించేందుకు ప్రయత్నించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. అంతకుముందు ఆదివారం ఈస్ట్నీ మెరీనాలో జరిగిన అల్లర్లకు సంబంధించి 16 ఏళ్ల యువకుడిని హింసాత్మక అల్లర్ల అనుమానంతో అరెస్టు చేశారు. అతడిని బెయిల్‌పై విడుదల చేశారు.అంతకుముందు ఈ నెలలో పోర్ట్స్మౌత్లో శరణార్థులను నగరానికి తీసుకురావడాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వందలాది మంది మితవాద నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖాన్ని కప్పుకునేలా వస్త్రాలు ధరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.హాంప్‌షైర్ పోలీసులు సెక్షన్ 60ఏఏ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం నిరసనకారులు ముసుగులు, ముఖాన్ని కప్పే వస్త్రాలు లేదా గుర్తింపును దాచేందుకు ఉపయోగించే ఇతర వస్తువులను తొలగించాలని పోలీసులు ఆదేశించవచ్చు.“ప్రశాంతంగా, చట్టబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలనుకునేవారికి మేము మద్దతు ఇస్తాం. భయాన్ని సృష్టించడం, హింసను రెచ్చగొట్టడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నవారిని మాత్రం సహించం” అని అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ పాల్ బార్టోలోమియో తెలిపారు.ఈ కేసులతో పాటు గతంలో జరిగిన నిరసనకు సంబంధించి 42 ఏళ్ల డెల్ లియోన్ సోమర్విల్లేపై హింసాత్మక అల్లర్లు, విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడి చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. -
మలేషియా ప్రధాని నోట సూపర్ హిట్ హిందీ సాంగ్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత బాలీవుడ్ గాయకుడు కిషోర్ కుమార్ ఆలపించిన సూపర్ హిట్ హిందీ సాంగ్ ‘ఖ్వాబ్ హో తుమ్ యా కోయి హఖీకత్’ను మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆలపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన గాన మాధుర్యాన్ని జనం ప్రశంసిస్తున్నారు. 1960వ దశకంలోని తీన్ దేవియా(దేవ్ ఆనంద్ నటించిన చిత్రం)లోని ఈ పాటను పాడుతున్న వీడియోను అన్వర్ ఇబ్రహీం శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. బూడిద రంగు సూట్ ధరించి, మరొకరు వాయిస్తున్న పియానో సంగీతానికి అనుగుణంగా ఆయన ఈ పాటను చక్కగా ఆలపించారు. ఈ వీడియోకు తక్కువ సమయంలోనే పది లక్షలకు పైగా వీక్షణలు లభించాయి. నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను కచ్చితంగా ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు. #WATCH | Delhi: Malaysia’s Prime Minister Anwar Ibrahim sings a popular Hindi song “Khwab Ho Tum Ya Koi Haqeeqat” in Delhi.(Video source: Anwar Ibrahim/X)#BRICSSummit pic.twitter.com/E8RE9erfie— ANI (@ANI) September 12, 2026 భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అన్వర్ ఇబ్రహీం హాజరయ్యారు. ఢిల్లీలోని ఒక హోటల్లో ఆయన బస చేసిన సమయంలో ఈ వీడియో చిత్రీకరించబడినట్లు కనిపిస్తోందని జర్నలిస్టులు అంటున్నారు. ప్రఖ్యాత గాయకులు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్‌లకు తాను పెద్ద అభిమానినని అన్వర్ ఇబ్రహీం గతంలో చెప్పారు. ఇదీ చదవండి: మహిళా బైకర్ ఘటనలో ట్విస్ట్ : కారు ఓనర్ కీలక ప్రకటన -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
వినాయకుడికి అంత రహస్య పూజలెందుకు?
వినాయక చవితి వచ్చిందంటే మన దేశంలో ఎక్కడ చూసినా గణనాథుడి సందడే కనిపిస్తుంది. వీధివీధినా మండపాలు.. ఇంటింటా బొజ్జ గణపయ్య ప్రతిమలు.. ఘనంగా పూజలు.. నైవేద్యాలు.. నిమజ్జనాలు. కానీ మనకు ఎంతో పరిచయమైన ఈ విఘ్నేశ్వరుడు మరో దేశంలో మాత్రం పూర్తిగా భిన్నమైన రూపంలో పూజలు అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా.. ఆ గణేశుడి విగ్రహాన్ని అందరికీ చూపించరు. పూజా విధానాలనూ రహస్యంగానే నిర్వహిస్తారు. ఇంతకీ ఆ దేశం ఏది? ఆ వింత గణేశుడి కథేంటి?జపాన్‌లో గజరాజు రూపంతో ఉన్న దైవాన్ని పూర్తి భిన్నమైన సంప్రదాయం ఉంది. అక్కడ ఆయన్ని కాంగిటెన్.. షోటెన్ అనే పేర్లతో పూజిస్తారు. అంతేకాదు.. అక్కడి ఓ ప్రత్యేక రూపంలో రెండు ఏనుగు ముఖాలున్న దేవతలు ఒకరినొకరు కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించరు. పూజా విధానాలను కూడా రహస్యంగానే నిర్వహిస్తారు. జపాన్ బౌద్ధ సంప్రదాయాల్లో వినాయకుడి కథ ఆసక్తికరమైన మలుపులతో కనిపిస్తుంది.తొలుత దుష్ట శక్తిగా..కొన్ని పురాతన బౌద్ధ గ్రంథాల్లో కాంగిటెన్ అనేది అడ్డంకులు సృష్టించే దుష్ట శక్తిగా పేర్కొని ఉంది. అతడిని ‘గజరాజుగా’, మనుషులకు ఇబ్బందులు కలిగించే శక్తిగా భావించేవారు. అందుకే అతడిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక మంత్రాలు, ఆచారాలు ఉపయోగించేవారు. అయితే తర్వాతి సంప్రదాయాల్లో కథ పూర్తిగా మారుతుంది.వినాయకుడి ఉగ్ర స్వభావాన్ని శాంతింపజేయడానికి కన్నోన్.. స్త్రీ వినాయక రూపంలో ప్రత్యక్షమయ్యాడని ఓ కథనం చెబుతుంది. ఆమెను చూసిన వినాయకుడు ఆకర్షితుడవుతాడు. అయితే ఆమెను తన సహచరిగా అంగీకరించాలంటే చెడు మార్గాన్ని విడిచిపెట్టి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాలని షరతు పెడుతుంది. వినాయకుడు అంగీకరించడంతో ఆమె అతడిని కౌగిలించుకుంటుంది. ఆ క్షణంతో అతడి ఉగ్ర స్వభావం శాంతించి.. దుష్ట శక్తి నుంచి రక్షక దేవతగా మారినట్లు కథనం.అందుకే కౌగిలింత రూపం!ఈ కథతోనే కాంగిటెన్ ప్రత్యేక రూపానికి సంబంధించిన భావనను అనుసంధానిస్తారు. రెండు ఏనుగు ముఖాలున్న రూపాలు ఒకదానినొకటి కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇది కేవలం ప్రేమకు సంబంధించిన ప్రతీకగా కాకుండా.. భిన్న శక్తుల ఏకత్వం, ఉగ్రతను శాంతింపజేయడం, సామరస్యం, సంపూర్ణతకు సంకేతంగా వివరిస్తారు. అందుకే ఈ రూపం సాధారణ గణేశుడి విగ్రహాలకు భిన్నంగా ఉంటుంది.ఎందుకంత రహస్య పూజ?కాంగిటెన్ ఆరాధన జపాన్‌లోని ఎసోటెరిక్ బౌద్ధ సంప్రదాయాలతో ముడిపడి ఉంది. ఒకప్పుడు దుష్ట శక్తిగా భావించిన వినాయకుడి ఆరాధనలో ప్రత్యేక మంత్రాలు, దీక్షతో చేసే కర్మకాండలు అభివృద్ధి చెందాయి. అందుకే కాంగిటెన్ విగ్రహాలను చాలాచోట్ల తెర వెనుక లేదంటే ప్రత్యేక పెట్టెల్లో ఉంచుతారు. సాధారణ భక్తులకు వాటిని నేరుగా చూపించరు. కొన్ని అత్యంత ముఖ్యమైన పూజలను దీక్ష పొందిన బౌద్ధ సన్యాసులే నిర్వహిస్తారు. ఈ రహస్యత్వమే కాంగిటెన్ ఆరాధనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది. పూజలు, నైవేద్యం కూడా చాలా ప్రత్యేకం..కాంగిటెన్కు సమర్పించే నైవేద్యాల్లో డైకాన్ ముల్లంగికు ప్రత్యేక స్థానం ఉంది. ముల్లంగితో పాటు జపాన్ సంప్రదాయ బియ్యం మద్యం సేక్ను కూడా సమర్పిస్తారు. ఇక అత్యంత ఆసక్తికరమైన నైవేద్యం ‘కాంగిదాన్’. ఇది ఎర్రబీన్స్ పూర్ణంతో నింపి నూనెలో వేయించే తీపి పదార్థం. భారతీయ సంప్రదాయంలోని మోదకాన్ని పోలిన ఈ స్వీట్‌ను కాంగిటెన్కు ఇష్టమైన నైవేద్యంగా భావిస్తారు.డైకాన్ సమర్పణ వెనుక కూడా ఒక ప్రతీకాత్మక అర్థం ఉంది. బౌద్ధ సంప్రదాయంలో మనిషిని వేధించే ప్రతికూల భావాల్లో ఒకటైన ద్వేషాన్ని తొలగించడాన్ని ముల్లంగి సమర్పణ సూచిస్తుందని భావిస్తారు. అందుకే జపాన్‌లోని కాంగిటెన్ ఆలయాల్లో డైకాన్ బొమ్మలు, గుర్తులు కనిపిస్తుంటాయి. కొన్ని ఆలయాల్లో ముల్లంగికి సంబంధించిన ప్రత్యేక ఉత్సవాలూ నిర్వహిస్తారు.ఇక కాంగిటెన్ పూజల్లో అత్యంత రహస్యమైన ఆచారాల్లో ‘ఆయిల్ బాత్ రిట్యువల్’ (Yokuyu-ku) ఒకటి. విగ్రహంపై పవిత్రమైన నువ్వుల నూనెను నిర్దిష్ట విధానంలో పోస్తూ చేసే ఈ పూజను సాధారణంగా దీక్ష పొందిన సన్యాసులే నిర్వహిస్తారు. వినాయకుడి పాత దుష్ట స్వభావాన్ని శుద్ధి చేసి.. అతడిని ధర్మ మార్గంలోకి తీసుకువచ్చిన ప్రక్రియకు ఇది ప్రతీకగా భావిస్తారు.అలా మన దగ్గర విఘ్నాలను తొలగించే గణపయ్య.. జపాన్‌లో మాత్రం ఒకప్పుడు విఘ్నాలు సృష్టించే శక్తిగా పేరొందాడు. కాలక్రమంలో కాంగిటెన్ అనే రహస్య దైవంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు. ఒకే గణేశుడికి దేశానికో రూపం.. సంప్రదాయానికో కథ.. ఇదే వినాయక ఆరాధనలోని విశేషం!.ఇదీ చదవండి: ఎల్లలు లేవని దేవుడు ఈయన! -
ఉక్రెయిన్‌లో రైలుపై రష్యా డ్రోన్ దాడి
ఉక్రెయిన్‌లో రైలుపై రష్యా డ్రోన్ దాడి జరిగింది. స్టేషన్లో రైలు ఇంజిన్‌ను డ్రోన్ ఢీకొట్టింది. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వెళ్లిన కాసేపటికే ఈ దాడి జరిగింది. పోలాండ్ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగింది. జాన్సన్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న జాన్సన్ ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రోన్ దాడికి రష్యా పాల్పడింది.వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు రైలును ఆపి.. ప్రయాణికులను దించేశారు. జాన్సన్, అగ్రశ్రేణి యూరోపియన్ భద్రతా అధికారులు ఆ మార్గం గుండా వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. యహోదిన్ స్టేషన్ వద్ద జరిగిన ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణీకులందరినీ ముందే సురక్షితంగా బయటకు తరలించినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.కీవ్‌లో జరిగిన సదస్సు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో.. బోరిస్ జాన్సన్‌తో పాటు బ్రిటన్‌కు చెందిన జోనాథన్ పావెల్ తదితర యూరోపియన్ జాతీయ భద్రతా సలహాదారులు వేరే రైలులో ఇదే మార్గంలో ప్రయాణించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని రైల్వే మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు రష్యా ప్రకటించింది.ఇదీ చదవండి: హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు! -
ఏఐ బండి కొంచెం మెల్లగా.. ట్రంప్ భయం నిజమేనా?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో ప్రపంచం ఇప్పుడు ఒక విచిత్రమైన మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు.. ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి, భద్రతా ప్రమాణాలు పెంచాలని టెక్ రంగంలోని ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు.. ఇదే సమయంలో అమెరికా వెనక్కి తగ్గితే చైనా ముందుకు దూసుకెళ్లి ప్రపంచ ఏఐ ఆధిపత్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. మరి ఎవరి వాదనలో నిజమెంత? ఎవరిది కరెక్ట్?..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో అమెరికాలో మొదలైన చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధిని కాస్త నెమ్మదించి.. వాటి భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలని టెక్ రంగంలోని కొందరు దిగ్గజాలు చెబుతున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఏఐ రేసులో అమెరికా వేగం తగ్గిస్తే.. ఆ ఖాళీని చైనా భర్తీ చేసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ‘ఎవరు ఏఐలో గెలిస్తే.. భవిష్యత్తులో వాళ్లదే పైచేయి’ అన్నది ట్రంప్ లెక్క. మరి నిజంగా అమెరికా ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేస్తే చైనా ముందుకు వెళ్లిపోతుందా? లేక వేగం పేరుతో భద్రతను పక్కన పెడితే ముప్పు మరింత పెరుగుతుందా?టెక్ దిగ్గజాలు చెబుతున్నది ఇదే..ఇక్కడ ముందుగా ఒక అపోహను తొలగించుకోవాలి. ఏఐ కంపెనీలు అభివృద్ధిని పూర్తిగా నిలిపేయాలని కోరుకోవడం లేదు. మరింత శక్తిమంతమైన మోడళ్లను తయారు చేసే పోటీలో భద్రతా పరీక్షలు, పర్యవేక్షణ, ప్రమాదాల అంచనాలను కూడా తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాలని అంటున్నాయి. ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా.. అందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి అది కారణం కాదని చెప్పారు. ఏఐ సామర్థ్యాలు పెరిగే వేగం కంటే.. వాటి భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలు ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఏఐపై ప్రభుత్వ నియంత్రణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని కూడా ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. కంపెనీలు తమంతట తామే బాధ్యతాయుతమైన విధానాలను అమలు చేయవచ్చని చెప్పారు. స్వతంత్ర సంస్థలతో భద్రతా పరీక్షలు చేయించుకోవాలన్న ఆంథ్రోపిక్(Anthropic) సీఈవో డారియో ఎమోడీ ప్రతిపాదనకు కూడా ఆయన మద్దతు తెలిపారు.ఇదే ఈ మొత్తం చర్చలో అత్యంత కీలకమైన అంశం. ఆల్ట్‌మన్ చెబుతున్న ‘పేసింగ్’ అంటే ఏఐ అభివృద్ధిని నిలిపివేయడం కాదు. భద్రతా పరీక్షలు, మానిటరింగ్, ప్రమాదాల అంచనాలు వంటి వాటికి సమయం పడుతుంది కాబట్టి.. సాధ్యమైనంత వేగంగా కాకుండా కొంత బాధ్యతాయుతమైన వేగంతో ముందుకు వెళ్లడమే. అంటే.. కారు ఆపేయడం కాదు.. వేగానికి బ్రేకులు, స్టీరింగ్ రెండూ ఉండాలన్నమాట.ఆందోళనలో ట్రంప్ ట్రంప్ ఆలోచనలో మరో కోణం ఉంది. ఏఐ ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఆర్థిక వ్యవస్థ, రక్షణ, సైబర్ భద్రత, పరిశ్రమలు, అంతర్జాతీయ ప్రభావం.. ఇలా అనేక రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అమెరికా కంపెనీలు వేగం తగ్గిస్తే.. చైనా సంస్థలు అదే సమయంలో వేగంగా ముందుకు సాగితే భవిష్యత్తులో వ్యూహాత్మక ఆధిపత్యం మారే అవకాశం ఉందన్నది ఆయన భయం. అందుకే ఏఐపై కఠినమైన నియంత్రణలు విధించే ఆలోచనను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆగితే చైనా ఆగదు అన్నదే ఆయన వాదన.చైనా నిజంగానే అమెరికాను దాటేస్తుందా?ఇది మాత్రం అంత సులభమైన ప్రశ్న కాదు. చైనా ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతోంది. తక్కువ ఖర్చుతో శక్తిమంతమైన మోడళ్లను రూపొందించే సామర్థ్యాన్ని చైనా కంపెనీలు చూపిస్తున్నాయి. మరోవైపు అమెరికాకు OpenAI, Google, Anthropic వంటి ప్రపంచస్థాయి సంస్థలు, భారీ ప్రైవేట్ పెట్టుబడులు, అధునాతన చిప్ టెక్నాలజీ, క్లౌడ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అందువల్ల అమెరికా కొంత నెమ్మదిస్తే చైనా వెంటనే అమెరికాను దాటేస్తుంది అనడం అతిశయోక్తి. కానీ ఏఐ రేసులో వేగం పూర్తిగా కోల్పోతే.. ప్రత్యర్థి దేశాలకు ఆ అవకాశాన్ని ఇవ్వొచ్చన్న ట్రంప్ ఆందోళన మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం.అసలు భయం ఏంటంటే..ఆల్ట్‌మన్ మాత్రం ఏఐ విషయంలో రెండు ‘నైట్మేర్’ పరిస్థితులను ప్రస్తావించారు. మొదటిది.. ఏదో ఒక దశలో మనుషులు ఏఐపై నియంత్రణ కోల్పోవడం. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగానికి భద్రతా వ్యవస్థలు సరిపోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారొచ్చు. రెండో ప్రమాదం.. అత్యంత శక్తిమంతమైన ఏఐ ఒకే వ్యక్తి లేదా ఒకే కంపెనీ చేతుల్లోకి వెళ్లడం. అలా జరిగితే ఆ సంస్థ లేదంటే వ్యక్తి తన అభిప్రాయాలు, విలువలను ప్రపంచంపై బలవంతంగా రుద్దే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని ఆల్ట్‌మన్ హెచ్చరించారు.ఇదే కారణంగా Anthropicలోని కొందరు పరిశోధకులు కూడా ఏఐ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత శక్తిమంతమైన మోడళ్లు మనుషులకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ఏఐపై బ్రేకులు.. నాదెళ్లదీ అదే మాట!ఏఐ అభివృద్ధి వేగంపై టెక్ దిగ్గజాల మధ్య చర్చ ముదురుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఏఐని ఆపేయాలని తాను చెప్పడం లేదన్న నాదెళ్ల.. మానవ నియంత్రణలో, మానవాళికి ఉపయోగపడే ఏఐనే అభివృద్ధి చేయాలని అన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ దిశగా వెళ్లే ముందు భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయాలని, స్వతంత్ర సంస్థలతో ఏఐ మోడళ్లను పరీక్షించి పర్యవేక్షించాలని సూచించారు. ఏఐ కొద్దిమంది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. దేశాలు, పరిశ్రమలు, విద్యావేత్తలకు విస్తృత భాగస్వామ్యం ఉండాలని, ఓపెన్ సోర్స్ మోడళ్లకూ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.మరి ఎవరి వాదన కరెక్ట్?నిజానికి ట్రంప్‌ది కూడా పూర్తిగా తప్పు కాదు.. టెక్ దిగ్గజాలదీ కాదు. అమెరికా ఏఐ అభివృద్ధిని పూర్తిగా నిలిపివేయడం వ్యూహాత్మకంగా ప్రమాదకరం. అదే సమయంలో ‘చైనాను ఓడించాలి’ అనే పోటీలో భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టడం కూడా అంతే ప్రమాదకరం. కాబట్టి సరైన మార్గం ఏఐని ఆపడం కాదు.. నియంత్రిత వేగంతో ముందుకు తీసుకెళ్లడం. కొత్త మోడళ్ల విడుదలకు ముందు స్వతంత్ర భద్రతా పరీక్షలు, నిరంతర పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాలు అవసరం. అదే సమయంలో పరిశోధన, పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధి ఆగకూడదు.అంతిమంగా ఇది అమెరికా–చైనా మధ్య ఎవరు ముందు అనే పోటీ మాత్రమే కాదు. ఏఐని ఎవరు ముందుగా తయారు చేస్తారన్నదానికంటే.. దాన్ని ఎవరు సురక్షితంగా నియంత్రిస్తూ ప్రపంచానికి ఉపయోగపడేలా చేస్తారన్నదే అసలు పోటీ. వేగం అమెరికాకు అవసరం.. కానీ ఆ వేగానికి బ్రేకులు లేకపోతే అదే భవిష్యత్తులో అతిపెద్ద సమస్యగా మారొచ్చు.ఇదీ చదవండి: హర్ముజ్‌లో మారిన సీన్.. అయోమయంలో ట్రంప్ -
ఏఐతో రాజకీయాలకు, జాతీయ భద్రతకు ముప్పు!
కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలకు భద్రతాపరమైన ముప్పు పెరుగుతోందని చైనా దేశ భద్రతా శాఖ (స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏఐ సామర్థ్యాలు పెరగడం వల్ల రాజకీయ స్థిరత్వానికి, క్లిష్టమైన డిజిటల్ మౌలిక వసతులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదముందని చైనా భద్రతా శాఖ మంత్రి చెన్ ఇక్సిన్ హెచ్చరించారు. ‘చైనా సైబర్ స్పేస్’ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో ఆయన ఈ అంశాన్ని విశ్లేషించారు.ప్రధాన హెచ్చరికలు.. ముప్పు అంశాలుఅధునాతన ఏఐ మోడళ్ల ఆధారంగా శత్రు మూలాలు దాడుల వ్యయాన్ని, సాంకేతిక సంక్లిష్టతను తగ్గించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రాజకీయంగా అస్థిరతను సృష్టించడానికి ఏఐ ఆధారిత ఫేక్ కంటెంట్, డిస్ఇన్ఫర్మేషన్ (వదంతుల) ప్రచారాన్ని శత్రు మూలాలు పెద్దఎత్తున ఉపయోగించే అవకాశముందని స్పష్టం చేశారు. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక సర్వర్ల వంటి కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఏఐ ఏజెంట్లలో ఉన్న నిర్మాణ లోపాల వల్ల రిమోట్ పరికరాల నియంత్రణ శత్రువుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. దీని ద్వారా సున్నితమైన ప్రభుత్వ, వాణిజ్య సమాచారం లీక్ అయ్యే అవకాశముందని తెలిపారు.అంతర్జాతీయ పోటీ.. గ్లోబల్ గవర్నెన్స్ అవసరంప్రస్తుతం ఏఐ సాంకేతికత ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక వ్యూహాత్మక పోటీ వేదికగా మారిందని చైనా పేర్కొంది. కొన్ని సాంకేతికాధిపత్య దేశాలు ఏఐ సరఫరా వ్యవస్థలను, అంతర్జాతీయ ప్రామాణికాలను ఏకపక్షంగా నియంత్రించాలని చూస్తున్నాయని పరోక్షంగా అమెరికా విధానాలపై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వినియోగానికి సంబంధించి పారదర్శకమైన, న్యాయమైన అంతర్జాతీయ నియమావళి ఏర్పాటు కావాలని, ముందస్తు ప్రమాద గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయాలని చైనా పిలుపునిచ్చింది. ఒకవైపు ఏఐ రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్న చైనా, మరోవైపు అదే ఏఐ వల్ల తమ రాజకీయ వ్యవస్థకు, భద్రతకు ఎదురయ్యే ముప్పును గుర్తించి హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇదీ చదవండి: పండగ షాపింగ్‌కు.. ఏ కార్డు వాడదాం? -
South Korea: ఇంటర్వ్యూకు సూట్ వద్దు.. జీన్స్ చాలు!
సియోల్: దక్షిణ కొరియా నేషనల్ సివిల్ సర్వీస్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు సంబంధించిన దుస్తుల నిబంధనలను సడలించింది. ఇకపై ఉద్యోగార్థులు ఇంటర్వ్యూలకు జీన్స్, స్నీకర్స్ వంటి సాధారణ దుస్తులతో హాజరుకావచ్చు. అదే సమయంలో టైలు, ఫార్మల్ డ్రెస్ షూస్‌ను నిషేధించింది. 2026 అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ ఇంటర్వ్యూల నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగార్థులపై ఆర్థిక, మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంటర్వ్యూ వాతావరణాన్ని మరింత సహజంగా మార్చడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని సిబ్బంది నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది.జాతీయ సివిల్ సర్వీస్ నియామక వ్యవస్థలో సంబంధిత శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. పురుషులు, మహిళలు సంప్రదాయ ఫార్మల్ సూట్లు ధరించకుండా సాధారణ దుస్తులకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. జీన్స్, కాటన్ ప్యాంట్లు, స్లాక్స్, నిట్వేర్, జాకెట్లు, షర్ట్లు, స్నీకర్స్ వంటి దుస్తులను ధరించవచ్చని పేర్కొంది. అయితే క్రీడా దుస్తులు, హైకింగ్ దుస్తులు, షార్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్, హైహీల్స్, స్లిప్పర్స్ ధరించడాన్ని ప్రోత్సహించలేదు.ముఖ్యంగా టైలు, ఫార్మల్ డ్రెస్ షూస్‌పై స్పష్టమైన నిషేధం విధించింది. టై ధరించి ఇంటర్వ్యూకు వచ్చే అభ్యర్థులు మూల్యాంకన గదిలోకి వెళ్లే ముందు దాన్ని తొలగించాలని అధికారులు సూచిస్తారు. ఫార్మల్ డ్రెస్ షూస్ ధరించిన అభ్యర్థులు వాటిపై స్లిప్ఆన్ షూ కవర్లు ధరించాల్సి ఉంటుంది. ఫార్మల్ డ్రెస్ షూస్‌పై నిషేధానికి కారణం కూడా ఉందని మంత్రిత్వ శాఖ వివరించింది. గట్టి అడుగుభాగం ఉన్న షూస్ నేలపై పడే శబ్దం పరీక్షల సమయంలో పదేపదే అంతరాయాలకు, అభ్యర్థుల ఏకాగ్రతకు ఆటంకాలకు కారణమవుతోందని తెలిపింది.దక్షిణ కొరియా ప్రభుత్వం 2016 నుంచే అభ్యర్థులు టైలు వదిలి సాధారణ దుస్తులు ధరించాలని అనధికారికంగా సూచిస్తూ వస్తోంది. అయితే ప్రతికూలంగా అంచనా వేస్తారనే భయంతో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులు ఇప్పటికీ ముదురు రంగు ఫార్మల్ సూట్లు, డ్రెస్ షూస్ ధరిస్తున్నారు. ఈ ధోరణిని మార్చేందుకు సంబంధిత శాఖ ఆమోదయోగ్యమైన క్యాజువల్ దుస్తుల శైలులను చూపించే కృత్రిమ మేధ (ఏఐ) రూపొందించిన నమూనా చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ కొత్త దుస్తుల నిబంధనలు ఇంటర్వ్యూలు నిర్వహించే అధికారులకు కూడా వర్తిస్తాయి. తద్వారా అభ్యర్థులు, ఇంటర్వ్యూయర్ల మధ్య సంభాషణ మరింత సహజంగా సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నిర్ణయంపై సోషల్ మీడియా, ఉద్యోగార్థుల ఫోరమ్‌లలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ఫార్మల్ సూట్ల కొనుగోలు ఖర్చు తగ్గడంతోపాటు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే అందరికీ ఒకే విధమైన ప్రాథమిక సూట్ ప్రమాణం లేకపోవడంతో తగిన క్యాజువల్ దుస్తులను ఎంచుకోవడంపై కొత్త ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు! -
తుఫానులో చిక్కుకున్న విమానం.. ప్రయాణికుల హాహాకారాలు!
ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కుదుపులకు గురిచేసింది. తుఫాను మధ్య విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ మూడు సార్లు ప్రయత్నించినప్పటికీ.. ప్రతిసారీ విఫలమైంది. చివరకు విమానాన్ని దారి మళ్లించి ట్యునిస్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని ఎన్ఫిదా-హమ్మమెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. తుఫానులో తీవ్ర కుదుపులుఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న ఈ విమానంలోని ప్రయాణికులు తీవ్ర కుదుపులతో ఆందోళనకు గురయ్యారు. విమానం లోపల తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వినియోగదారు @mmaiskaya పంచుకున్నారు. అందులో ప్రయాణికులు భయంతో అరుస్తూ.. సీట్లను గట్టిగా పట్టుకున్నట్లు కనిపించింది. అయితే విమానం సురక్షితంగానే ఉందని ఆమె పేర్కొన్నారు. View this post on Instagram A post shared by mmaiskaya (@mmaiskaya)మూడు సార్లు ల్యాండింగ్ యత్నంవిమానం దిగేందుకు ప్రయత్నించిన సమయంలో సమస్యలు తీవ్రంగా మారాయి. తుఫాను కొనసాగుతున్నప్పటికీ పైలట్ విమానాశ్రయం చుట్టూ తిరుగుతూ మూడు సార్లు ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే ప్రతిసారీ సురక్షితంగా దిగడం సాధ్యపడలేదు. ఈ క్రమంలో విమానం తీవ్ర కుదుపులకు గురికావడంతో ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారు.మూడో ప్రయత్నంలో మరింత భయంమూడోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం ఒక్కసారిగా కిందికి పడిపోతున్నట్లు అనిపించిందని ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. ‘ప్రయాణం సాధారణంగానే సాగింది. కానీ విమానం దిగడం ప్రారంభించిన వెంటనే పరిస్థితి భయానకంగా మారింది. నా జీవితంలో ఇంతగా ప్రాణభయం ఎప్పుడూ కలగలేదు. నా తల్లి కూడా నాతోనే ఉన్నారు’ అని ఆమె తెలిపారు.సురక్షితంగా ప్రత్యామ్నాయ విమానాశ్రయంలో..తుఫాను, తీవ్ర కుదుపుల నేపథ్యంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ట్యునిస్-కార్తేజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించలేకపోయారు. దీంతో దాన్ని ఎన్ఫిదా-హమ్మమెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.ఇది కూడా చదవండి: బిగ్‌బాస్: మేరీ కోమ్ వ్యాఖ్యలపై దుమారం.. టీమ్ క్షమాపణలు! -
హర్ముజ్ సంక్షోభంలో బిగ్ ట్విస్ట్.. అనూహ్య పరిణామాలు!
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హర్ముజ్ జలసంధి సంక్షోభం మరింత కష్టతరంగా మారుతోంది. ఇప్పటికే దిగ్భందనాలు, సముద్ర రవాణాపై ఆంక్షలు, నౌకలపై దాడులు, చమురు సరఫరాకు అంతరాయాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారగా.. మరోవైపు ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం చూపేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా అనిశ్చితి నెలకొంది. సమస్యను చర్చల ద్వారా చక్కదిద్దేందుకు కీలకమైన సమావేశం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, భద్రత, భవిష్యత్ నిర్వహణపై ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఒమన్‌లో సోమవారం కీలక సమావేశం జరగాల్సి ఉంది. అయితే ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. ప్రాంతీయ దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. ఇటు ఇరాన్ కూడా సమావేశం వాయిదా పడిన విషయాన్ని ధ్రువీకరించింది. కొన్ని దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఒమన్‌తో సమన్వయం చేసుకుని తదుపరి తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.తద్వారా.. హర్ముజ్‌పై ఒక తాత్కాలిక అవగాహనకు రావాల్సిన సమయంలోనే దౌత్య ప్రక్రియకు బ్రేక్ పడినట్టయింది. అసలు సమస్య ఇదే..హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఇంధన సరఫరాపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్, ఒమన్ మధ్య హర్ముజ్‌లో రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చే మార్గాలపై ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిగాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాలను కూడా భాగస్వామ్యం చేసి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే ఇరాన్ వైఖరి మాత్రం స్పష్టంగా ఉంది. అమెరికా తమపై దాడులు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు కొనసాగిస్తున్నంతకాలం జలసంధిలో రాకపోకలను పూర్తిగా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదని ఆ దేశం చెబుతోంది. అంటే.. గల్ఫ్ దేశాలతో ఇరాన్ ఒక అవగాహనకు వచ్చినా, అమెరికా–ఇరాన్ మధ్య ప్రధాన వివాదం పరిష్కారం కాకపోతే హర్ముజ్‌లో పూర్తి స్థాయిలో రాకపోకలు పునరుద్ధరించడం కష్టమే. అందుకే ఇప్పుడు గల్ఫ్ దేశాలతో జరిగే చర్చలతోపాటు అమెరికా–ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం కూడా కీలకంగా మారింది.నౌకపై దాడితో మరింత టెన్షన్ఈ దౌత్య ప్రయత్నాలకు సమాంతరంగానే హర్ముజ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఓ వాణిజ్య నౌకను ప్రాజెక్టైల్ తాకడంతో మంటలు చెలరేగాయి. సిబ్బందిని నౌక నుంచి తరలించాల్సి వచ్చింది. ఇరాన్ అధికారిక వర్గాల ప్రకారం.. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. దీంతో కీలక సముద్ర మార్గంలో నౌకల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి.హర్ముజ్‌లో రాకపోకలు ఇప్పటికే భారీగా తగ్గిపోయాయి. ఇక్కడ పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ జలసంధిపై ఏ చిన్న పరిణామం జరిగినా అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.సౌదీ పైప్‌లైన్‌పైనా దాడిహర్ముజ్ సంక్షోభానికి తోడు సౌదీ అరేబియాలోని కీలక చమురు మౌలిక సదుపాయాలపైనా దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తూర్పు ప్రాంతాల నుంచి ఎర్ర సముద్ర తీరంలోని యన్బుకు చమురును తరలించే ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌పై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో ఆ మార్గంలో చమురు సరఫరా నిలిచిపోయింది.హర్ముజ్ ద్వారా రవాణా దెబ్బతిన్న సమయంలో ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడే ఈ పైప్‌లైన్ కూడా పనిచేయకపోవడం మార్కెట్లలో ఆందోళన పెంచింది. ఇప్పటికే హర్ముజ్ ఎఫెక్ట్‌తో రోజుకు మిలియన్ల బ్యారెళ్ల చమురు సరఫరా దెబ్బతినగా.. సౌదీ పైప్‌లైన్ మూసివేతతో ప్రపంచ సరఫరాపై మరింత ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడింది.బాబ్ అల్ మాండెబ్లోనూ మంటలుమరోవైపు హర్ముజ్‌కు మరో కీలక ప్రత్యామ్నాయ సముద్ర మార్గమైన(ఎర్ర సముద్రం-Red Sea) బాబ్ అల్ మాండెబ్ జలసంధిలోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యెమెన్‌లో హౌతీల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియాపైనా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన రెండు మార్గాలపైనా ఒకేసారి భద్రతా ముప్పు నెలకొంది.ఇలాంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా అమెరికా సాయం కోరినట్లు సమాచారం. హౌతీల పురోగతిని అడ్డుకోవడంలో అమెరికా మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి ప్రస్తుతానికి నిఘా సమాచార సహకారానికే పరిమితమైన స్పందన కనిపిస్తోంది.ట్రంప్‌కు కొత్త చిక్కులుహర్ముజ్ జలసంధి మూసివేత, నౌకలపై వరుస దాడులు, సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై దాడులు, బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల దూకుడు.. ఇలా సంక్షోభం ఒక్క హార్ముజ్కే పరిమితం కాకుండా ప్రాంతంలోని కీలక ఇంధన మార్గాలన్నింటికీ విస్తరిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని, ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని ట్రంప్ చెబుతున్నారు. యుద్ధం ముగిసిన వెంటనే ఇంధన ధరలు భారీగా తగ్గుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ట్రంప్ అంచనాలకు భిన్నంగా సాగుతున్నాయి. హర్ముజ్‌పై దౌత్య ప్రయత్నాలు వాయిదా పడటం, సముద్ర మార్గాల్లో నౌకలపై దాడులు కొనసాగడం, సౌదీ చమురు రవాణా మార్గానికి దెబ్బ తగలడం, మరోవైపు బాబ్ అల్ మాండెబ్ వద్ద హౌతీల పట్టు పెరగడం.. యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న అమెరికా ప్రయత్నాలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. పైగా సౌదీ అరేబియా హౌతీలను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక సాయం కోరగా.. ఇప్పటివరకు వాషింగ్టన్ నిఘా సమాచార సహాయానికే పరిమితమైంది. దీంతో ఒకవైపు యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెబుతున్నా.. మరోవైపు సంక్షోభం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుండటం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. రాకెట్లా చమురు ధరలుహర్ముజ్ సంక్షోభం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం పశ్చిమాసియాకే పరిమితం కాదు. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ ప్రాంతంలోని సముద్ర మార్గాలపై ఆధారపడి ఉంటుంది. సరఫరాకు అంతరాయం కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగి.. రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. తాజా దాడులు, హర్ముజ్ చర్చల వాయిదాతో మార్కెట్లలో సరఫరా భయాలు మరింత పెరిగాయి. అందుకే ఇప్పుడు అందరి చూపూ హర్ముజ్‌పైనే. జలసంధిలో రాకపోకలు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయి? ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు ఎప్పుడు మళ్లీ మొదలవుతాయి? అమెరికా–ఇరాన్ మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుంది? అన్నదే కీలకంగా మారింది. ప్రస్తుతానికి మాత్రం చర్చలకు బ్రేక్ పడటంతో హర్ముజ్ సంక్షోభం మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: 45 వేల కోట్లు ఉంటేనే మళ్లీ మాములు స్థితికి! -
కోలుకునేందుకు రూ.45 వేల కోట్లు అవసరం
కఠ్మాండు: ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలతో వాటిల్లిన నష్టాల నుంచి కోలుకునేందుకు, పునరి్నర్మాణ పనుల కోసం సుమారు రూ.45 వేల కోట్లు (సుమారు 4.78 బిలియన్ డాలర్లు) అవసరమవుతాయని నేపాల్ ప్రభుత్వం అంచనా వేసింది. ఆగస్ట్ 26న వచ్చిన విధ్వంసకర వరదల్లో రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, వేలాదిగా గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మౌలిక వసతుల పునరుద్ధరణతో పాటు భవిష్యత్తులో వచ్చే విపత్తులను తట్టుకునేలా పునర్నిర్మాణ చర్యలు చేపట్టడానికి ఈ నిధులు అవసరమని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక పేర్కొంది. ది ర్యాపిడ్ డ్యామేజ్ అండ్ నీడ్స్ అసెస్మెంట్(ఆర్డీఎన్ఏ) ఫర్ ది రసువా–భోటెకోషి ఫ్లడ్–2026 పేరుతో ఆదివారం ఈ నివేదికను విడుదల చేసింది. వరదలతో మొత్తం నష్టం సుమారు రూ.25 వేల కోట్లు కాగా, ఇందులో భౌతిక నష్టం రూ.17 వేల కోట్లు, ఆర్థిక నష్టాలు సుమారు రూ.8 వేల కోట్లని పేర్కొంది. ఈ పునరుద్ధరణ అంచనా కేవలం దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడానికి అయ్యే వ్యయం మాత్రమే కాదు. విపత్తు ప్రమాదాలను తగ్గించేందుకు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునే రక్షణ చర్యలు కూడా కలిసి ఉన్నాయని వివరించింది. ఇలా ఉండగా, నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో చనిపోయిన వారి సంఖ్య 1,388కు చేరుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మాత్రమే గుర్తించి, సంబం«దీకులకు అందజేశామన్నారు. వరదల్లో గల్లంతైన వారి సంఖ్య 5,130గా ఉందని చెప్పారు. -
మహిళా ఆసియా కప్-2026 ఫైనల్లో భారత్ గెలుపు.. ట్రోఫీ వేళ ట్విస్ట్!
దుబాయ్: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ట్రోఫీ అందుకునే సమయంలో మాత్రం వేదిక వద్దకు రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినట్లు సమాచారం. దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో చోటుచేసుకున్న పరిస్థితే మరోసారి కనిపించింది.అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్ అనంతరం ఎప్పటిలాగే సంబరాలు చేసుకుంది. ప్రసార సంస్థకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన 15–20 నిమిషాల్లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గంటకుపైగా ఆలస్యమైంది. ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో మైదానం పక్కన మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే జట్టు సభ్యులకు పతకాలు అందజేసినట్లు సమాచారం.ఏసీసీ అధ్యక్షుడి హోదాలో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసేందుకు స్టేడియానికి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపత్తుకు ఆయన బహుమతి చెక్కును అందజేశారు. అయితే భారత జట్టు, కోచ్, అధికారులు ట్రోఫీ ప్రధాన వేదిక వద్ద కనిపించలేదు. దీంతో భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోతే దానిని మరోసారి ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. మరో ఏసీసీ లేదా ఐసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ అందజేయాలని కోరింది. అయితే నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో అప్పట్లో బహుమతి ప్రదాన కార్యక్రమం వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆయన ట్రోఫీని తీసుకుని ఏసీసీ కార్యాలయానికి వెళ్లారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో గతేడాది ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సందర్భంగా సంప్రదాయ హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా చేసిన గత వ్యాఖ్యలు కూడా దీనికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించడంతో ట్రోఫీ ప్రదానంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి -
రష్యా డీజిల్ వనరులపై దాడులు ఆపండి
కీవ్: రష్యాలోని డీజిల్ వనరులపై డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వెల్లడించారు. ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. రష్యాలోని డీజిల్ ఇంధన మౌలిక వనరులను వదిలేసి, ఇతర లక్ష్యాలపై దాడులు చేసుకోవచ్చని చెప్పానన్నారు. ఈ ఒక్క పని చేయాలని జెలెన్స్కీని కోరినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే చమురు, గ్యాస్ అతిపెద్ద ఎగుమతిదారైన రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఇంధన రేషనింగ్‌ను అమలు చేస్తోంది. భారత్ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. పశి్చమాసియాలో పరిణామాలతో ఇప్పటికే ఇంధన వనరుల సరఫరాకు తీవ్ర విఘాతం కలగడం, ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ విషయం వెల్లడించడం గమనార్హం. -
22 ఏళ్ల తరువాత ఆ తల్లి ఒడి మళ్లీ నిండింది!
ఎప్పుడో 22 ఏళ్ల క్రితం గడ్డకట్టుకుపోయిన అండం మళ్లీ ఊపిరి పోసుకుంది... యాభై మూడేళ్ల వయసులో 21 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్న తల్లి కడుపులో జీవమైంది! రోడ్డు ప్రమాదంతో మరణించిన కొడుకు లోటును భర్తీ చేస్తూ... ఆ ఇల్లు మళ్లీ ముద్దు మురిపాలతో నిండిపోయింది. గ్రీకు దేశపు ఈ టెక్నాలజీ అద్భుతం ఎలా ఆవిష్కృతమైందంటే... ఏథెన్స్: కాన్స్టాంటినో రప్తీస్, క్రిస్టీనా రప్తీ జెలెపీలు గ్రీసు రాజధాని ఏథెన్స్ వాసులు. భర్త వయసు 60, భార్యకేమో 54. ఏడాది క్రితం 2025 అక్టోబరులో వీరిద్దరి ఒక్కగానొక్క కొడుకు 21 ఏళ్ల జార్జ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండిపోయింది. ఎలాగోలా వాళ్లు ఆ బాధ నుంచి బయటపడ్డారు కానీ.. బోసిపోయిన ఇల్లు మాత్రం వారిని రోజూ వెక్కిరిస్తూనే ఉండింది. వారసుల్లేకుండా పోతారేమో అన్న బెంగ కూడా వారిని బాధించింది. ఈ నేపథ్యంలోనే క్రిస్టీనా రప్తీ జెలెపీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2004లో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కన్నప్పుడే భద్రపరచిన అండాల సాయంతో మళ్లీ బిడ్డను కనాలని నిర్ణయించింది. అయితే అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం యాభై నాలుగేళ్లు దాటితే కృత్రిమ గర్భధారణతో బిడ్డను కనడం సాధ్యం కాదు. దాంతో అప్పటికప్పుడు కొడుకు పోయిన బాధను కూడా పక్కనబెట్టి క్రిస్టీనా, భర్త కాన్స్టాంటినో రప్తీస్లు మరోసారి కృత్రిమ గర్భధారణకు సిద్ధమయ్యారు. భద్రపరచిన అండాన్ని ఫలదీకరణం చేయించి 2025 డిసెంబరులో పిండాన్ని అభివృద్ధి చేసి గర్భంలోకి ప్రవేశపెట్టారు. నెలలు గడిచాయి. బిడ్డ ఆరోగ్యంగానే ఉంది... చివరకు నెలలు నిండిన తరువాత 4 రోజుల క్రితం ఏథెన్స్లోని ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిప్పుడు ఆ చిన్నారి బరువు 3.49 కిలోలు!!! ఇరవై రెండేళ్ల ఐదు నెలల, 23 రోజులపాటు గడ్డకట్టి ఉన్న అండం నుంచి సరికొత్త జీవం ఉనికిలోకి రావడం వైద్య చరిత్రలో ఇదే రెండోసారి మాత్రమే. గత ఏడాది అమెరికాలోని ఓహాయోకు చెందిన దంపతులు 30 ఏళ్ల క్రితం శీతలీకరించిన అండం సాయంతో బిడ్డను కని గిన్నిస్ రికార్డు సృష్టించారు. గతంలో 18 ఏళ్ల క్రయో ప్రిజర్వేషన్ తరువాత జపాన్‌లో, 17 ఏళ్ల తరువాత ఇజ్రాయెల్‌లోనూ పిల్లలు జీవంతంగా పుట్టిన రికార్డులు ఉన్నాయి. ‘‘కొడుకు పోయిన తరువాత ఇంకో బిడ్డను కనాలి అనుకున్నప్పుడు సమయం సరిపోతుందా? అన్న అనుమానం ఉండింది. 54 ఏళ్లు నిండేలోపు కృత్రిమ గర్భదారణకు సంబంధించిన ప్రక్రియలు అన్నీ ముగియాలన్నది ప్రభుత్వ నిబంధన. దీనికి ప్రభుత్వ అనుమతులు పొందాలి కూడా.’’అని క్రిస్టీనా రప్తీ జెలెపీ బిడ్డను కన్న తరువాత తెలిపారు. కాలంతో పోటీపడుతూ మరోసారి తల్లినయ్యానని, వైద్యబృందం ఇచ్చిన స్థైర్యంతోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేసింది. ‘‘జీవితానికి రెండో ఛాన్స్ ఇద్దామని అనుకున్నాం. ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని తీర్మానించుకున్నాం. మా జీవితాల్లోకి ఇంకో కొత్త జీవితాన్ని ఆహ్వానించాం. కుటుంబం కొనసాగాలన్నదే సంకల్పం’’అని రప్తీ తెలిపారు. ‘‘కూతురు ఆరోగ్యంగా, ఆనందంగా పెద్దదయితే చాలు. జార్జ్ మాదిరిగానే మా ఇంటిని నవ్వులతో నింపాలి’’అని ఆకాంక్షించారు. అమ్మాయి పేరేంటో తెలుసా? అన్న జార్జ్‌ను గుర్తు చేసేలా జార్జియా అని పెట్టుకున్నారు. గ్రీస్‌లో బర్త్‌రేట్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం 54 ఏళ్ల నిబంధనను సమీక్షించాలని రప్తీ జలెపి వైద్యులైన డాక్టర్ కోస్టాస్ పాంటోస్ తెలిపారు. యాభై నాలుగేళ్లకు ఒక్కరోజు ఎక్కువైనా బిడ్డను కనడాన్ని అనుమతించడం లేదని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. బిడ్డను కనడం తల్లిదండ్రుల హక్కని, ప్రభుత్వం దాన్ని లాక్కోరాదని అభిప్రాయపడ్డారు. రెండోసారి తండ్రి అయిన కాన్స్టాంటిన్ రప్తీస్ మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇంకో దేశానికి వెళ్లి మూడో బిడ్డను కంటామేమో అనడం కొసమెరుపు!! -
ఏఐ.. రాక్షసి!!
న్యూయార్క్/సాక్షి, హైదరాబాద్: అనూహ్య వేగంతో సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్న కృత్రిమ మేథ (ఏఐ)కు కళ్లెం వేయాల్సిన సమయమొచ్చిందని కృత్రిమ మేథ (ఏఐ) దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ వ్యాఖ్యానించారు. ఫార్చూన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో పలు ఆందోళకర అంశాలను పంచుకున్నారు. ‘‘ఏఐ అమితమైన వేగంతో శక్తిసామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలోగా యావత్ మానవాళిని ఇది హరించేస్తుంది. ఇప్పటికైనా ఏఐ నిపుణులు, ప్రభుత్వాలు, పౌరసమాజం మేల్కొని ఏఐకు కళ్లెం వేయాలి. భద్రతా ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలి’’ అని అన్నారు. ఏఐను నియంత్రించపోతే అది మనందర్నీ చంపేస్తుందని ఆంథ్రోపిక్ నుంచి వైదొలగిన ఏఐ శాస్త్రవేత్త జాకబ్ కోక్సన్ ఇటీవల వ్యాఖ్యానించిన వేళ అదే తరహాలో డారియో ఆమోడెయ్ మాట్లాడటం గమనార్హం. ‘‘ఎప్పటికప్పుడు ఏఐ సరైన మార్గంలో వెళ్తుందో లేదో ఓ కంట కనిపెట్టే భద్రతావ్యవస్థను మెరుగుపరచాలి. లేదంటే మానవాళికి ముప్పు తప్పదు. ఏఐలో వస్తున్న పెను మార్పులను అడ్డుకోకపోతే వచ్చే 12 నెలల్లోగా యావత్ ప్రపంచ ఇంటర్నెట్ను అది గుప్పిటపట్టేస్తుంది. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదం’ అని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను అడ్డుకోవడం అంటే దానిని పూర్తిగా నిలిపేయడంకాదు. ఏఐలో సేఫ్టీ రీసెర్చ్, టెస్టింగ్, పర్యవేక్షణ ఖచ్చితంగా మెరుగుపడాలి. శాస్త్రవేత్తలు అర్థంచేసుకోలేనంత స్థాయికి ఏఐ తనకుతానుగా వృద్ధి చెందకుండా అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు.వంతపాడిన మస్క్, ఆల్ట్మన్డారియో అభిప్రాయంతో ఏఐ దిగ్గజ సంస్థల చీఫ్‌లు సైతం ఏకీభవించారు. సూపర్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్‌లతో ప్రమాదం పొంచి ఉందని ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్‌మన్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘ఏఐ అనేది మన చేతి దాటిపోతే అదుపుచేయడం చాలా కష్టం. అప్పుడు దుర్వినియోగం అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. క్షిపణుల తయారీ, జీవఆయుధాలు, సైబర్ దాడులు వంటి రహస్యాలన్నీ ఉగ్రసంస్థలు, హ్యాకర్ల చేతికొచ్చే ప్రమాదముంది. అప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డెవలప్ తరహాలో ఇతరులకూ ఏఐను అడ్డుకునే అవకాశం ఉండాలి’’ అని ఆల్ట్‌మన్, మస్క్ వ్యాఖ్యానించారు.ఏఐ భద్రతా పరిశోధకుల మాట ఇదీ..ఏఐ శక్తిసామర్థ్యాలు పెరిగితే అది మానవాళిని నేరుగా నాశనం చేసే అవకాశం ఉండదని ఏఐ భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. అయితే మానవ ప్రయోజనాలకు అనుగుణంగా లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మానవుల కంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏఐ వ్యవస్థలు సిస్టమ్‌లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బయో వెపన్లు, సైబర్ దాడులతో పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలనుకొనే వారికి ఏఐ వ్యవస్థలు సాంకేతికంగా కొంత మేర దోహదపడే ప్రమాదం ఉందంటున్నారు. -
పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి రైల్వే వ్యవస్థపై దాడి కలకలం రేపింది. ఉక్రెయిన్–పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని యాహోడిన్ ప్రాంతంలో ఓ రైలుపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో రైలు ఇంజిన్ దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ప్రయాణికులను ముందుగానే రైలు నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు పలువురు యూరప్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అదే రైల్వే మార్గంలో మరో రైలులో ప్రయాణించినట్లు సమాచారం. కీవ్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న అనంతరం వారు తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ భద్రతా సలహాదారు జోనాథన్ పావెల్ కూడా ఈ బృందంలో ఉన్నారు.రష్యా మాత్రం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ‘రైల్వే మౌలిక వసతుల’పై దాడి చేసినట్లు పేర్కొంది. అయితే ఉక్రెయిన్ ప్రభుత్వ రైల్వే సంస్థ ఉక్ర్జలిజ్నిట్సియా మాత్రం దాడికి గురైన డ్రోన్ లక్ష్యం దౌత్య ప్రతినిధులు ప్రయాణించిన రైలు అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. రష్యా దాడుల ముప్పు నేపథ్యంలో టైమ్‌టేబుల్‌లో మార్పులు చేసి దౌత్య రైలును ముందుగానే స్టేషన్ నుంచి పంపించినట్లు తెలిపింది.దాడికి గురైన రైలులోని ప్రయాణికులను ఖాళీ చేయాలని ఆదేశం ఇచ్చిన కేవలం 15 నిమిషాలకే రష్యా జెట్ ప్రొపెల్డ్ డ్రోన్ దాడి చేసినట్లు ఉక్రెయిన్ రైల్వే అధికారులు తెలిపారు. అదే సమయంలో మాజీ సీఐఏ చీఫ్ డేవిడ్ పెట్రాయస్ మరో రైలులో యాహోడిన్ స్టేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ దాడి పోలాండ్ సరిహద్దుకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో జరిగిందని ఉక్రెయిన్, పోలాండ్ అధికారులు తెలిపారు.కీవ్ సమావేశానికి హాజరైన మాజీ స్వీడన్ ప్రధాని కార్ల్ బిల్డ్ కూడా తన రైలులో ప్రయాణికులను ముందుగా ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు చెప్పారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులో ఉందని సమాచారం రావడంతో ప్రయాణాన్ని కొనసాగించామని తెలిపారు. ఆయన ప్రయాణించిన రైలు సురక్షితంగా పోలాండ్ సరిహద్దులోని డోరోహుస్క్ స్టేషన్‌కు చేరుకుంది. అయితే బిల్డ్ బోరిస్ జాన్సన్తోనే ప్రయాణించారా అనే విషయాన్ని జాన్సన్ ధ్రువీకరించలేదు.ఈ దాడిపై బోరిస్ జాన్సన్ స్పందిస్తూ.. పోలాండ్ సరిహద్దు వద్ద నిలిపి ఉంచిన ఉక్రెయిన్ రైలు ఇంజిన్‌పై రష్యా ఎందుకు దాడి చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఉక్రెయిన్‌లో సాధారణ పౌరులు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న అర్థరహిత దాడులకు ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ఉక్రెయిన్‌కు అవసరమైన వైమానిక రక్షణ వ్యవస్థలను మిత్రదేశాలు అత్యవసరంగా అందించాలని ఆయన కోరారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో రైళ్లు, రైల్వే డిపోలు, పెట్రోల్ స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాలు లక్ష్యంగా మారుతున్నాయని సమాచారం. ఇటీవల ఉక్రెయిన్–మాల్డోవా సరిహద్దు వద్ద రష్యా డ్రోన్ దాడిలో ఇద్దరు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్‌లో ప్రయాణికుల రైలుపై జరిగిన మరో డ్రోన్ దాడిలో మహిళా కండక్టర్ మృతి చెందారు. ఈ నెల ప్రారంభంలో కీవ్‌లోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఆరుగురు రైల్వే ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్‌లో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రజలకు రైలు ప్రయాణమే ప్రధాన రవాణా మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్వే వ్యవస్థపై జరుగుతున్న వరుస దాడులు ఆ దేశ ప్రజలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు యూరప్‌లోనూ అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటుండటంతో రష్యా చర్యలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
చీకటి సొరంగంలో, మరణం అంచున 10 రోజులు భయానక పోరాటం
చీకటి సొరంగంలో బిక్కుబిక్కుమంటూ గడిచిన క్షణాలు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వేళ ప్రాణాలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా ఎక్కడో ఒక చోట సహాయక బృందాలు తమను చేరుకుంటాయన్న నమ్మకంతో సంజయ్ సాహ్, కబీర్ మహర్జన్ అనే ఇద్దరు కార్మికులు ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రార్థనలతో మనసును నిలబెట్టుకుంటూ.. చివరకు ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు.నేపాల్‌లో వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. త్రిశూలీ 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యాంత్రిక విభాగం ఫోర్‌మ్యాన్ సంజయ్ సాహ్, యాంత్రిక పర్యవేక్షకుడు కబీర్ మహర్జన్ను సెప్టెంబర్ 4న సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న తర్వాత చీకటి సొరంగంలో తొమ్మిది రోజులు గడిపిన సంజయ్.. ప్రార్థనలు చేస్తూ ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు.ఆగస్టు 26న వరదలు ప్రాజెక్టును ముంచెత్తిన సమయంలో సంజయ్ నియంత్రణ గదిలో విధుల్లో ఉన్నారు. సాధారణంగా అక్కడ ఐదారు మంది మాత్రమే ఉండేవారని, ఆ రోజు 40 నుంచి 45 మంది ఉన్నారని ఆయన చెప్పారు. వరదనీరు భూగర్భ ప్రాంతంలోకి ప్రవేశించడంతో కార్మికులను బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఇతరులను రక్షించే క్రమంలో తనకు బయటపడే అవకాశం లేకుండా పోయిందని సంజయ్ వివరించారు.హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ.. “వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ అందరినీ పరుగెత్తించాను. దాంతో నాకు సమయం లేకుండా పోయింది. చివరికి నేను బయటకు రాలేకపోయాను” అని సంజయ్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నానని చెప్పారు. ఆ ప్రార్థన తనకు మనోధైర్యాన్ని ఇచ్చిందని వివరించారు.మరో కార్మికుడు కబీర్ మహర్జన్ కాఠ్మాండుకు చెందినవారు. సాధారణ నిర్వహణ పనుల కోసం కులేఖానీ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి త్రిశూలీ 3ఏకు వెళ్లారు. ఆయన భార్య హీరా శోభా చివరిసారిగా ఆగస్టు 26 ఉదయం 7.30 గంటల సమయంలో భర్తతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పనిచేయలేదు. తొమ్మిది రోజుల పాటు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.“అతను మరో జీవితం పొంది తిరిగి వచ్చాడు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం” అని హీరా శోభా తెలిపారు. రక్షణ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తన భర్తను కాపాడాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌లో పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఇంకా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలీ-3ఏలో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం, సొరంగాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించవచ్చన్న ఆశలను పెంచింది.ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు -
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై విమర్శలు
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో ప్రధాని కార్యాలయ ఖర్చులకు సంబంధించి తాజాగా వెలువడిన అధికారిక సమాచారం తీవ్ర చర్చనీయాంశమైంది. 2019 నుంచి ఆగస్టు 2026 వరకు దేశ ప్రధానుల హెయిర్ స్టైలింగ్, మేకప్, అధికారిక ప్రాతినిధ్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం సుమారు 470,000వేల డాలర్లు( భారత కరెన్సీలో దాదాపు రూ. 4.49 కోట్లు) ఖర్చు చేసినట్లు వెల్లడైంది.సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడంతో ప్రధాని కార్యాలయం ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఈ ఖర్చుల్లో దాదాపు 90 శాతం కేవలం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి సారా నెతన్యాహుల హెయిర్ స్టైలింగ్, మేకప్‌లకే ఖర్చయినట్లు తేలింది.ఇదీ చదవండి : బాల్యమిత్రుడికి ప్రధాని మోదీ అభయంఇజ్రాయెల్ - హమాస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న కాలంలోనూ (సెప్టెంబర్ - నవంబర్ 2023 మధ్య) ప్రధాని హెయిర్ స్టైలింగ్ కోసం సుమారు రూ. 2 లక్షలు వెచ్చించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం దేశంలోనే కాకుండా విదేశీ పర్యటనల సమయంలోనూ ఈ సౌకర్యాల కోసం భారీగా ఖర్చు పెట్టారు.ఫిబ్రవరి 2025లో వాషింగ్టన్కు వెళ్లిన సమయంలో హెయిర్, మేకప్ నిమిత్తం సుమారు 13,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ.12.9లక్షలు) ఖర్చయినట్లు డేటా ద్వారా తెలిసింది. ఈ ఖర్చులు వివిధ సంవత్సరాల్లో మారుతూ వచ్చాయి. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలీ బెనెట్, యైర్ లాపిడ్ తదితరులు ఆ పదవిలో ఉన్నకాలంతో పోలిస్తే, బెంజమిన్ నెతన్యాహు హయాంలో ఈ వ్యయం గణనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. అత్యధికంగా 2025 సంవత్సరంలో సుమారు రూ.1.06 కోట్లు ఖర్చయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే, భద్రతా కారణాలను చూపుతూ హెయిర్ స్టైలిస్టులు,మేకప్ ఆర్టిస్టుల పేర్లను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ప్రభుత్వ నిధుల దుబారాపై పౌర హక్కుల సంఘాలు,విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. מידע שקיבלנו: הוצאות האיפור והשיער של ראשי הממשלה בישראל משנת 2019. 🔹 הן הסתכמו ב-1.43 מיליון שקל - 90% מהן היו של בני הזוג נתניהו.🔹 הוצאות סידור השיער לנתניהו בתחילת המלחמה, באוקטובר 2023, היו 2,457 שקל.🔹 ההוצאה הגבוהה ביותר: 13.5 אלף דולר בביקור של 4 ימים בארצות הברית.… pic.twitter.com/SIi8X8qgMw— התנועה לחופש המידע (@shakoof) September 10, 2026 -
విధి ఆడిన వింత.. భారత్‌లో బయటపడ్డ షాకింగ్ ట్విస్ట్!
ఇద్దరూ భారత్‌లోనే పుట్టారు.. వేర్వేరు కుటుంబాలకు దత్తత వెళ్లారు.. కట్ చేస్తే.. నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు దగ్గర్లోనే పెరిగారు. టీనేజ్‌లో తొలిసారి కలిసినప్పుడు ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది. ఒకే ముక్కు.. ఒకే నవ్వు.. ఒకే రకమైన హావభావాలు. అందుకే అప్పట్లోనే ఒకరినొకరు సరదాగా ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. కానీ వాళ్లు నిజంగానే అక్కాచెల్లెళ్లని మాత్రం దాదాపు 30 ఏళ్ల వరకు ఎవరికీ తెలియదు. చివరకు ఓ డీఎన్ఏ టెస్ట్ వాళ్ల జీవితాలనే మార్చేసింది.ముంబైలోని వేర్వేరు అనాథాశ్రమాల నుంచి 1980ల ప్రారంభంలో కొన్ని నెలల వ్యవధిలో మీనా గెల్టింక్, మినాల్ టిజ్సెన్ వేర్వేరు డచ్ కుటుంబాలకు దత్తత వెళ్లారు. ఇద్దరూ నెదర్లాండ్స్‌లో ఒకరికొకరు సమీపంలో పెరిగారు. టీనేజ్‌లో దత్తత పిల్లల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొలిసారి కలుసుకున్నారు. అప్పుడు వారి స్నేహితులే ఇద్దరి పోలికలను గుర్తించారు. అద్దంలో చూసుకుంటే ఒకేలా కనిపిస్తున్నారని చెప్పడంతో మీనా ఆశ్చర్యపోయింది. ఒకే ముక్కు, ఒకే నవ్వు ఉండటాన్ని గమనించింది.ఆ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. స్కూల్, స్నేహితులు, ప్రేమ, డ్యాన్స్, క్రీడలు, సంగీతం.. ఇలా ఎన్నో విషయాలను ఒకరికొకరు లేఖల ద్వారా పంచుకునేవారు. ఇద్దరికీ బ్యాక్‌స్ట్రీట్ బాయ్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకున్నారు. రక్తసంబంధం ఉందన్న చిన్న అనుమానం కూడా లేకపోయినా.. ఒకరినొకరు ‘సిస్టర్’ అని పిలుచుకునేవారు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య సంబంధం తెగిపోయింది. మినాల్ ఫ్రాన్స్‌కు వెళ్లగా.. మీనా తన మొదటి బిడ్డకు తల్లి కావడంతో కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయింది.డీఎన్ఏ టెస్ట్.. ఇంతలో 2017లో మీనా భారత్ నుంచి దత్తత తీసుకున్నవారి సమావేశానికి హాజరైనప్పుడు డీఎన్ఏ టెస్టింగ్ గురించి తెలుసుకుని పరీక్ష చేయించుకుంది. కానీ ఎలాంటి సరిపోలిక కనిపించలేదు. ఈ ఏడాది ఫోన్ స్టోరేజ్ సమస్యతో ఆమె ఆ యాప్‌ను కూడా డిలీట్ చేసింది. ఇంతలో మే 20న మినాల్ ఫేస్బుక్లో మీనాకు మెసేజ్ చేసింది. తాను ఏప్రిల్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల స్క్రీన్ షాట్‌ను పంపింది. మీనాకు మొదట నమ్మశక్యం కాలేదు. యాప్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేసి ఫలితాలను చూసిన ఆమెకు షాక్ తగిలింది. ఇద్దరి డీఎన్ఏ 100 శాతం మ్యాచ్ అయింది. వారు కేవలం చిన్ననాటి స్నేహితులు కాదు.. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పూర్తి సోదరీమణులని తేలింది.మినాల్‌కు కూడా తొలుత తన డీఎన్ఏ మ్యాచ్ ఎవరిదో అర్థం కాలేదు. సోషల్ మీడియాలో పాత ఫొటోలు చూసిన తర్వాత విషయం తెలిసింది. చిన్నప్పుడు తనను ఆప్యాయంగా పట్టుకున్న అదే అమ్మాయి మీనా అని గుర్తించింది. దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పడిన స్నేహం వెనుక ఇంత పెద్ద రక్తసంబంధం ఉందని తెలుసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఆగస్టులో మళ్లీ కలుసుకున్న ఇద్దరూ కన్నీళ్లు, నవ్వులు, కౌగిలింతల మధ్య తమ అనుబంధాన్ని జరుపుకున్నారు. ఇప్పుడు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఒకరి కుటుంబాలను మరొకరు కలుసుకున్నారు. ఇద్దరి మాట తీరు, నడక, హావభావాలు ఇప్పటికీ ఒకేలా ఉన్నాయని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.ముంబై కోరిక.. తమ జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒకరి అవసరం మరొకరికి ఉందని మీనా చెబుతోంది. తండ్రిని కోల్పోయినప్పుడు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు సోదరి తన పక్కన ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు ఇద్దరి కోరిక ఒక్కటే.. తమ బంధం మొదలైన ముంబైకి కలిసి వెళ్లి, తాము పుట్టిన నేలను మరోసారి చూడాలని కోరుకుంటున్నారు. దాదాపు 30 ఏళ్లుగా ‘సిస్టర్’ అని పిలుచుకున్న ఇద్దరు మహిళలు.. చివరకు డీఎన్ఏ ద్వారా తాము నిజంగానే సోదరీమణులమని తెలుసుకున్న ఈ కథ నిజజీవితంలో జరిగిన ఓ సినిమా ట్విస్ట్‌ను తలపిస్తోంది.Çocukluk arkadaşları, yıllar sonra yaptırdıkları DNA testiyle aslında kardeş olduklarını öğrendi! 👯♀️💞📌 Bebekken Hindistan'daki yetimhanelere bırakılan ve farklı Hollandalı aileler tarafından evlat edinilen Meena Geltink ile Minal Tijssen, ilk kez 1996 yılında evlat edinilmiş… pic.twitter.com/NyMrp7DBu0— Mynet (@mynet) August 17, 2026Video Credit: Mynet. -
New York: క్రిస్మస్ చెట్లతో తీరానికి రక్షణ
న్యూయార్క్: క్రిస్మస్ వేడుకల అనంతరం నిరుపయోగంగా మారిన క్రిస్మస్ చెట్లను వినూత్నంగా పునర్వినియోగించారు. 2024లో న్యూయార్క్‌లోని జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో 250 క్రిస్మస్ చెట్లను దాదాపు 600 అడుగుల పొడవైన సహజ రక్షణ కట్టలుగా (బ్రేక్‌వాటర్స్) మార్చారు. పునరుద్ధరిస్తున్న ఉప్పునీటి చిత్తడి నేల (సాల్ట్ మార్ష్)లో కొత్తగా నాటిన వృక్షసంపదను అలలు, తీర కోత నుంచి కాపాడేందుకు వీటిని వినియోగించినట్లు జమైకా బే-రాక్‌వే పార్క్స్ కన్జర్వెన్సీ 2024 వెట్‌ల్యాండ్స్ ఫెలోషిప్ నివేదిక తెలిపింది.ఈ రక్షణ కట్టల వెనుక గణనీయంగా మట్టి, ఇసుక వంటి అవక్షేపాలు (సెడిమెంట్) పేరుకుపోయాయి. దీంతో కొన్ని కట్టలు అభివృద్ధి చెందుతున్న చిత్తడి నేలలో పాక్షికంగా కూరుకుపోయినట్లు సంస్థ వెల్లడించింది. ఈ చెట్లను జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని వెస్ట్ పాండ్ లివింగ్ షోర్లైన్ ప్రాజెక్టులో ఉపయోగించారు. 2012లో సూపర్‌స్టార్మ్ శాండీ కారణంగా మంచినీటి చెరువులోకి సముద్రపు నీరు ప్రవేశించడంతో అక్కడి పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గతంలో మంచినీటి జీవావరణానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉప్పునీరు చేరింది.2021లో పూర్తయిన పునరుద్ధరణ పనుల్లో సుమారు 2,400 అడుగుల తీరప్రాంతాన్ని పునర్నిర్మించి, తొమ్మిది ఎకరాలకు పైగా కొత్త ఆవాసాన్ని అభివృద్ధి చేశారు. అయితే కొత్తగా పెరుగుతున్న మొక్కలకు అలలు, తీర కోత, మారుతున్న అవక్షేపాల వల్ల ముప్పు ఏర్పడింది. దీంతో క్రిస్మస్ చెట్లను ‘ఫాసిన్స్’గా పిలిచే నిర్మాణాలుగా కట్టి, బలహీనమైన తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాంక్రీటు గోడల మాదిరిగా కాకుండా ఇవి అలల వేగాన్ని తగ్గించి, కోతను నియంత్రిస్తూ నీటితో కొట్టుకొచ్చే అవక్షేపాలు అక్కడే పేరుకుపోయేలా చేస్తాయి. కాలక్రమంలో చిత్తడి నేల మరింత బలపడటమే లక్ష్యంగా ఇది సాగింది.ఈ పద్ధతిలో ఉపయోగించిన చెట్లు జీవఅవక్షేపనీయమైనవి కావడంతో శాశ్వత నిర్మాణాలుగా కాకుండా క్రమంగా ప్రకృతి వ్యవస్థలో కలిసిపోతాయి. గతంలోనూ ఈ ప్రాజెక్టులో క్రిస్మస్ చెట్లతోపాటు గుల్లలతో చేసిన ఆయిస్టర్ షెల్ బ్రేక్‌వాటర్స్, కొయిర్ లాగ్స్ వంటి సహజ రక్షణ పద్ధతులను ఉపయోగించారు. నీటి ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా చెట్లు అవక్షేపాలు పేరుకునేలా చేస్తాయి. వాటిపై పెరిగే మార్ష్ మొక్కల వేర్లు ఆ అవక్షేపాలను స్థిరంగా ఉంచి తీరాన్ని క్రమంగా బలోపేతం చేస్తాయి. ఇలా సాధారణ వ్యర్థంగా భావించిన 250 క్రిస్మస్ చెట్లు న్యూయార్క్ తీర రక్షణలో భాగమయ్యాయి. ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ -
240 మందితో వెళ్తున్న నౌక గల్లంతు.. అసలేమైంది?
ఇండోనేషియాలోని జావా సముద్రంలో 240 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతు కావడంతో కలకలం రేగుతోంది. నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రయాణికుల నౌక (‘విర్గో ట్రాన్స్పోర్ట్ 8) తూర్పు జావా ప్రావిన్స్‌లోని సురబయ నుంచి బోర్నియో దీవిలోని దక్షిణ కాలిమంతాన్ ప్రావిన్స్ రాజధాని బంజర్మసిన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.బంజర్మసిన్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యాలయానికి నౌకలో కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదన్న సమాచారం అందింది. నౌక చివరిసారిగా బంజర్మసిన్లోని ఓ రేవుకు సుమారు 148 కిలోమీటర్లు (92 మైళ్లు) దూరంలో జావా సముద్ర జలాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.బంజర్మసిన్ రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ చీఫ్ అరియాంటో అర్డీ నౌకతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ధృవీకరించారు. సహాయక చర్యల కోసం ట్రిసక్తి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నౌక యాజమాన్యం అందించిన సమాచారం ప్రకారం, ప్రయాణ సమయంలో నౌక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నౌకకు ప్రస్తుతం ఏమైందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.ఇదీ చదవండి: లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు -
లొంగేది లేదు.. సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: ఇరాన్ అధ్యక్షుడి వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తేల్చిచెప్పారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, ఆయన తన విధులను కొనసాగిస్తున్నారని సంచలన ప్రకటన చేశారు. ఖమేనీ ఆచూకీపై వస్తున్న ఊహాగానాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తున్న సమాచార యుద్ధంలో భాగమేనని ఆరోపించారు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన పెజెష్కియాన్.. ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.‘దేవుడి దయవల్ల మా సుప్రీం లీడర్ బతికే ఉన్నారు. ఆయన తన విధులను కొనసాగిస్తున్నారు’ అని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అయితే, మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆరు నెలల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపడినప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై తీవ్ర ఊహాగానాలు మొదలయ్యాయి. తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దాడుల్లో మరణించిన తర్వాత కూడా మొజ్తబా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఈ అనుమానాలకు మరింత కారణమైంది.సుప్రీం లీడర్‌దే నిర్ణయం..అయితే, ఖమేనీ ఎక్కడున్నారో గుర్తించలేకపోవడంతోనే అమెరికా, ఇజ్రాయెల్ ఆయనపై ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నాయని పెజెష్కియాన్ ఆరోపించారు. ఇరాన్ నాయకులు, సైనిక కమాండర్లు, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని.. అందుకే సుప్రీం లీడర్ ఆచూకీని భద్రతా కారణాలతో గోప్యంగా ఉంచుతున్నామని తెలిపారు. ఇరాన్లో తుది నిర్ణయాధికారం మాత్రం సుప్రీం లీడర్దేనని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిళ్లకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగబోదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక బలగాలను ఎదుర్కొనే బదులు పౌర మౌలిక వసతులు, ఆహార సరఫరాలు, ప్రజల జీవనోపాధులపై దాడులు చేస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ప్రజలను బెదిరించి ఇరాన్‌ను లొంగదీసుకోలేరని, తమ దేశం ఎప్పటికీ లొంగబోదని ఎక్స్ వేదికగా తేల్చిచెప్పారు.అణు కార్యక్రమంపై..ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలను కూడా పెజెష్కియాన్ కొట్టిపారేశారు. తమ అణు కార్యక్రమం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే సాగిందని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఇరాన్ అణు కార్యకలాపాలను అంతర్జాతీయ సంస్థలు నిరంతరం పర్యవేక్షించాయని పేర్కొన్నారు. అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామన్న ఆరోపణలకు ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. అణు అంశంపై చర్చలకు ఇరాన్ సిద్ధంగానే ఉందని తెలిపారు. అయితే అమెరికాతో తక్షణమే ప్రత్యక్ష చర్చలకు తిరిగి వెళ్లే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి అలీ ఖమేనీ హత్య తర్వాత అమెరికాపై ఇరాన్లో నమ్మకం తీవ్రంగా దెబ్బతిందని చెప్పారు. ఇరాన్‌పై దాడులు నిలిపివేయడంతో పాటు ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ స్థాయిలో ఎందుకు తగినంత పరిశీలన జరగడం లేదని ప్రశ్నించారు.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కోసం ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ సహా ప్రాంతీయ దేశాలు కలిసి ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పెజెష్కియాన్ ప్రతిపాదించారు. యుద్ధాల కంటే పరస్పర సహకారం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాలే ప్రాంతానికి మేలు చేస్తాయని అన్నారు. యూఏఈతో తమకు ఎలాంటి సమస్య లేదని, పొరుగు దేశాలను సోదర దేశాలుగానే చూస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఒకవైపు తమ సుప్రీం లీడర్ బతికే ఉన్నారని స్పష్టం చేస్తూనే.. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగేది లేదంటూ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ వైఖరిని మరోసారి స్పష్టం చేశాయి. ఖమేనీ ఆచూకీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉండటం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.ఇదీ చదవండి: సముద్రం అడుగున బంగారు ఖజానా.. చైనా సంచలన అన్వేషణ! -
లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ.. అమెరికా గూఢచార సంస్థ (CIA) సంచలన విషయాలు బయటపెట్టింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. భారత్‌పై కూడా దాడులకు ప్లాన్ చేసినట్లు షాకింగ్ విషయం వెలుగులోకి తెచ్చింది. 1998లోనే ఈ కుట్రకు పథకం రచించినట్లు సీఐఏ తాజాగా విడుదల చేసిన రహస్య పత్రాల ద్వారా బయటపడింది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్లను, 100 పేజీలకు పైగా సమాచారాన్ని సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ బహిర్గతం చేశారు.ఒసామా బిన్ లాడెన్ దాడులు జరపాలనుకుంటున్న దేశాల జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, అరేబియన్ ద్వీపకల్పంలోని దేశాలు, ఉగాండా, నైజీరియా ఉన్నాయి. అయితే, ఆ పత్రాల్లో భారత్‌లో ఎక్కడ? ఎప్పుడు? దాడి చేయాలనుకున్నారో వంటి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. "బిన్ లాడెన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ స్టిల్ ఏ థ్రెట్" అనే పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక.. అమెరికా దాడుల తర్వాత కూడా లాడెన్ నెట్వర్క్ చెదిరిపోలేదని పేర్కొంది.కాగా, ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు.ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది.ఇదీ చదవండి: ఘోర కలికి పాతికేళ్లు -
బంగారం కొండను గుర్తించిన చైనా.. సంచలన అన్వేషణపై చర్చ!
చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన ఓ సముద్ర అన్వేషణ అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. అందరూ భూమిపై బంగారం కోసం గనులు తవ్వుతుంటే.. చైనా మాత్రం సముద్ర గర్భంలోకి వెళ్లి ఖనిజ సంపదను వెతుకుతోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో చేపట్టిన అన్వేషణలో అక్కడి సముద్ర అడుగుభాగంలో అత్యంత విలువైన బంగారం, వెండి నిక్షేపాలను గుర్తించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని ఖనిజ నమూనాల్లో భూమిపై సాధారణంగా కనిపించే నిక్షేపాల కంటే గణనీయంగా అధిక స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.చైనాకు చెందిన త్సింగ్‌హువా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ ఇంజినీరింగ్ శాస్త్రవేత్తల బృందం ఆగస్టులో 18 రోజుల పాటు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో సముద్ర అన్వేషణ చేపట్టింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ (AUV), డీప్-సీ విజువల్ శాంప్లర్ వంటి పరికరాలతో సముద్ర గర్భాన్ని పరిశీలించారు. ఇప్పటికే నిర్వహించిన ప్రాథమిక సర్వేల ఆధారంగా 700 నుంచి 1,500 మీటర్ల లోతులో హైడ్రోథర్మల్ వెంట్స్‌ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నీటి ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైంది. అత్యంత చురుకైన రసాయనిక, ఉష్ణ ప్రక్రియలు చోటుచేసుకునే ఈ ప్రాంతాల చుట్టూ భారీ ఖనిజ నిర్మాణాలు ఏర్పడినట్లు పరిశోధకులు గుర్తించారు.హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టుపక్కల మూడు భారీ శంఖాకార ఖనిజ నిర్మాణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడి నుంచి సేకరించిన నమూనాలను నౌకలోని ప్రయోగశాలలో ప్రాథమికంగా పరీక్షించారు. చాల్కోపైరైట్, పైరైట్, స్ఫాలరైట్ వంటి ఆర్థికంగా విలువైన ఖనిజాలతో పాటు భారీ స్థాయిలో బంగారం, వెండి ఉన్నట్లు తేలింది. బంగారం గరిష్ఠ సాంద్రత 15.4 పార్ట్స్ పర్ మిలియన్ (PPM)గా నమోదైంది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 15.4 గ్రాముల బంగారం ఉన్నట్లు లెక్క. ఇక వెండి సాంద్రత ఏకంగా 1,271 PPMకు చేరింది. అంటే ఒక టన్ను ముడి ఖనిజంలో సుమారు 1.271 కిలోల వెండి ఉన్నట్లు అర్థం. ఈ స్థాయి సాంద్రత కొన్ని నమూనాల్లో భూభాగంలోని సాధారణ ఖనిజ నిక్షేపాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీంతో సముద్ర గర్భంలోని ఈ ప్రాంతాలు భవిష్యత్తులో అత్యంత విలువైన ఖనిజ వనరులుగా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.బంగారంతో పాటు అరుదైన జీవరాశులుఈ అన్వేషణ కేవలం ఖనిజ సంపదకే పరిమితం కాలేదు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ జీవించే అరుదైన జీవరాశులను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. హైడ్రోథర్మల్ వెంట్స్ ప్రాంతంలో రొయ్యలు, పీతలు, షెల్ఫిష్, ఎక్స్‌ట్రీమోఫైల్స్ వంటి జీవ సమూహాలను పరిశోధకులు ఫొటోలు తీశారు. సాధారణ సముద్ర జీవులకు అనుకూలంగా లేని అధిక ఉష్ణోగ్రతలు, రసాయనిక మార్పులు ఉన్న ప్రాంతాల్లో ఈ జీవులు ఎలా మనుగడ సాగిస్తున్నాయన్నది శాస్త్రవేత్తలకు కీలక పరిశోధనా అంశంగా మారింది. వీటి జన్యు వనరులు భవిష్యత్తులో బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధనలకు ఉపయోగపడే అవకాశాలపైనా ఆసక్తి పెరుగుతోంది.సముద్ర గర్భమే కొత్త బంగారు గని?భూమిపై సులభంగా అందుబాటులో ఉన్న ఖనిజ వనరులు తగ్గుతున్న నేపథ్యంలో సముద్ర గర్భంలోని ఖనిజ నిక్షేపాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చైనా గుర్తించిన ఈ నిక్షేపాల్లో బంగారం, వెండి అధిక సాంద్రతలో ఉండటం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. అయితే సముద్ర గర్భం నుంచి ఖనిజాలను వెలికితీయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. అత్యంత లోతైన ప్రాంతాల్లో పనిచేసే సాంకేతికత, భారీ వ్యయం, పర్యావరణ ప్రభావాలు వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా హైడ్రో థర్మల్ వెంట్స్ చుట్టూ ఉన్న ప్రత్యేక జీవ వ్యవస్థకు మైనింగ్ వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందన్నది కీలక ప్రశ్న.అయినా.. సముద్రం అడుగున దాగి ఉన్న బంగారం, వెండి ప్రపంచ మైనింగ్ రంగానికి కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చైనా చేపట్టిన ఈ అన్వేషణ భవిష్యత్తులో సముద్ర గర్భ ఖనిజాలపై మరిన్ని పరిశోధనలకు, అలాగే కొత్త సాంకేతికతల అభివృద్ధికి దారితీసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఐర్లాండ్ విలీనంపై అగ్గి రాజేసిన ట్రంప్ -
ట్రంప్ చిన్ననాటి ఇంటికి భారీ ధర!
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్ననాటి ఇల్లు దాదాపు 2 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ట్యూడర్ శైలికి చెందిన ఈ ఇంటిని పునరుద్ధరించిన అనంతరం 1.93 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఒకప్పుడు బూజు పట్టి, నీటి చెమ్మతో నిండిపోయి, పిల్లులు తిరుగాడే ఈ భవనం ప్రస్తుతం ఆధునిక నివాసంగా మారింది. ట్రంప్ నాలుగేళ్ల వయసు వరకు ఈ ఇంట్లో నివసించారు.జమైకా ఎస్టేట్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఇంటిని ట్రంప్ తండ్రి, డెవలపర్ ఫ్రెడ్ ట్రంప్ 1940లో నిర్మించారు. అయితే కొన్నేళ్లుగా ఈ ఆస్తి ట్రంప్ కుటుంబం ఆధీనంలో లేదు. జూలైలో కొనుగోలు ఒప్పందం కుదరగా.. విక్రయ ధర శుక్రవారం రియల్ ఎస్టేట్ వెబ్సైట్లలో వెల్లడైంది. కొనుగోలుదారు వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.ఐదు బెడ్రూమ్లు, మూడు బాత్రూమ్లు ఉన్న ఈ ఇంటిని డెవలపర్ టామీ లిన్ గతేడాది 8,35,000 డాలర్లకు కొనుగోలు చేశారు. అప్పటికే అది చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో పాడుబడింది. అనంతరం సుమారు 5 లక్షల డాలర్లు వెచ్చించి, ఎనిమిది నెలల పాటు పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెఫ్ కిచెన్, హెరింగ్బోన్ వుడ్ ఫ్లోరింగ్, స్పా తరహా విలాసవంతమైన బాత్రూమ్లను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.2017లో ట్రంప్ అధ్యక్షుడైన కొద్ది నెలలకే ఈ ఇల్లు 2.14 మిలియన్ డాలర్లకు విక్రయమైంది. ట్రంప్ బర్త్ హోమ్ ఎల్ఎల్సీ అనే సంస్థ కొనుగోలు చేసి కొంతకాలం ఎయిర్‌బీఎన్‌బీలో అద్దెకు ఇచ్చింది. 2019లో 2.9 మిలియన్ డాలర్ల ధరకు మళ్లీ విక్రయానికి పెట్టినా కొనుగోలుదారు దొరకలేదు. యజమాని లేకుండా ఉన్న సమయంలో ఇంటి పరిస్థితి మరింత దిగజారినట్లు పోస్ట్ పేర్కొంది. ప్రస్తుతం 80 ఏళ్ల ట్రంప్ తన ప్రారంభ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని రియల్ ఎస్టేట్ రంగం నుంచి సంపాదించారు. మాన్హాటన్లోని ట్రంప్ టవర్ నిర్మాణం ఆయన ప్రముఖ ప్రాజెక్టుల్లో ఒకటి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు భవన నిర్మాణాలపై ఆసక్తి కొనసాగుతోంది. అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో భారీ బాల్రూమ్ నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు, ఓవల్ ఆఫీస్‌లో తన వ్యక్తిగత ఆస్తులలో బంగారు పూత పూసిన అలంకరణలను ఏర్పాటు చేసుకున్నారు.ఇదీ చదవండి: గిజా పిరమిడ్‌లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్? -
గిజా పిరమిడ్‌లో గణిత రహస్యం.. చంద్రుడితో లింక్?
ఈజిప్టులోని గిజా మహా పిరమిడ్ చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించిన గణిత సంకేతాలను కలిగి ఉండొచ్చని స్వతంత్ర పరిశోధకుడు సెఫీ లెవీ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పిరమిడ్ ఎత్తు, పునాది, వాలుగా ఉన్న భుజాల కొలతల్లో ప్రాచీన ఈజిప్షియన్ల గణితం, ఖగోళ విజ్ఞానంపై అవగాహనకు సూచించే సంఖ్యా నమూనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సిద్ధాంతానికి సంబంధించిన పరిశోధనా పత్రం ఎస్ఎస్ఆర్ఎన్లో ప్రచురితమైనప్పటికీ, దీనికి ఇంకా నిపుణుల సమీక్ష (పీర్ రివ్యూ) జరగలేదు. ప్రధాన స్రవంతి ఈజిప్టాలజిస్టులు కూడా ఈ వాదనలను ధ్రువీకరించలేదు.కొలతల్లో గణిత నమూనాలు?లెవీ ప్రాచీన ఈజిప్టు గణిత విధానాలకు సంబంధించిన భిన్నాలను ఉపయోగించి మహా పిరమిడ్ కీలక కొలతలను విశ్లేషించారు. ఈ లెక్కల ద్వారా వచ్చిన కొన్ని సంఖ్యలు ఖగోళ చక్రాలు, గణిత స్థిరాంకాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.చంద్రుడి కక్ష్యతో సంబంధం?మెట్రో నివేదిక ప్రకారం.. ఒక లెక్కలో 27.5 అనే సంఖ్య వచ్చింది. ఇది చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి చేరుకునే వరుస సందర్భాల మధ్య ఉండే 27.55 రోజుల వ్యవధికి దగ్గరగా ఉందని లెవీ పేర్కొన్నారు.నక్షత్రంపైనా వాదనమరో లెక్కలో 70 అనే సంఖ్య వచ్చినట్లు ఆయన తెలిపారు. సూర్యుడి కాంతి కారణంగా సిరియస్ నక్షత్రం కనిపించకుండా ఉండే సుమారు 70 రోజుల వ్యవధితో దీనికి సంబంధం ఉందని చెప్పారు. బృహస్పతి, శని, శుక్రుడు, అంగారకుడు వంటి గ్రహాల కదలికలతోనూ కొన్ని లెక్కలు సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. పైతో పాటు గోల్డెన్ రేషియో వంటి గణిత స్థిరాంకాలతోనూ సంబంధం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. లక్ష నమూనాలతో పరిశీలనఈ నమూనాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా అన్నది పరిశీలించేందుకు లెవీ ఒక లక్ష కంప్యూటర్ రూపొందించిన పిరమిడ్ నమూనాలతో పోల్చినట్లు సమాచారం. వాటిలో సుమారు 2.4 శాతం నమూనాల్లోనే ఇలాంటి నమూనాలు కనిపించాయని ఆయన తెలిపారు.నిర్ధారణకు ఇంకా ఆధారాలు అవసరంఅయితే ఈ ఫలితం ప్రాచీన ఈజిప్షియన్లు పిరమిడ్‌ను గణిత లేదా ఖగోళ సంకేతంగా నిర్మించారనే విషయాన్ని నిర్ధారించదు. సుమారు 4,500 ఏళ్ల క్రితం ఫరో ఖుఫు పాలనలో మహా పిరమిడ్ నిర్మితమైంది.సమాధికి మించి జ్ఞాన భాండాగారమా?లెవీ అభిప్రాయం ప్రకారం.. పిరమిడ్ కేవలం సమాధిగా కాకుండా ప్రాచీన జ్ఞానాన్ని శాశ్వతంగా భద్రపరిచే నిర్మాణంగా రూపొందించి ఉండొచ్చు. ప్రాచీన ఈజిప్టు సృష్టి పురాణాల్లో పేర్కొన్న ఆదిమ కొండ ‘బెన్బెన్’తోనూ దీనికి సంబంధం ఉండొచ్చని ఆయన సిద్ధాంతం సూచిస్తోంది.ఇదీ చదవండి: చింతలు దూరం చేసే.. ఉత్తరాల గణపయ్య! -
ఫిలిప్పీన్స్ ఓడ ప్రమాదంలో 76కు చేరిన మృతులు
మనీలా: ఫిలిప్పీన్స్‌లో 9వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఓడ ప్రమాదంలో మరిన్ని మృతదేహాలు బయటపడుతున్నాయి. దీంతో, శనివారం మృతుల సంఖ్య 76కు చేరుకుంది. గల్లంతైన మరో 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం నుంచి 43 మంది బయటపడ్డారు. మనీలా నుంచి పలవాన్ ప్రావిన్స్‌లోని కోరాన్‌కు వస్తున్న ఎంవీ జూన్ ఆస్టర్ అనే ఈ ఓడలో ముందుగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం మంటలు చెలరేగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో ఓడలో సిబ్బంది సహా 132 మంది ఉన్నట్లు సమాచారం. సరుకు నిల్వ ఉంచే చోట పేలుడు సంభవించినట్లు చెబుతున్న అధికారులు...అందుకు కారణాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. -
రష్యా పోలీసులు చిత్రహింసలు పెట్టారు
కాన్పూర్: రష్యా రాజధాని మాస్కోలో పోలీసులు తనను అనవసరంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని యూపీలోని కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా(45) ఆరోపించారు. నోయిడాలోని యూఫ్లెక్స్ అనే కంపెనీ తరఫున 2023 నుంచి భార్య, కుమారుడితోపాటు మాస్కోలో ఉంటున్నట్లు చందన్ చెప్పారు. రష్యా పోలీసుల కస్టడీలో దాదాపు 48 గంటలు గడిపిన తర్వాత మాస్కో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చేశానన్నారు. అక్కడి పోలీసులు తనను, తన స్నేహితుడిని దుర్భాషలాడటంతోపాటు, బెదిరించి, చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ సంఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని, ఇకపై రష్యా ఒక్కటే కాదు, విదేశాలలో ఎన్నడూ పనిచేయరాదని నిర్ణయించుకున్నట్లు శనివారం చెప్పారు. ‘ఈ నెల 5వ తేదీ రాత్రి మిత్రుడు ఆశిష్‌తో కలిసి మాస్కోలోని కిటే గొరోడ్ మెట్రో స్టేషన్‌కు, హాంగింగ్ బ్రిడ్జి, అటు నుంచి రెడ్ స్క్వేర్ వైపు నడిచి వెళ్తుండగా పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. తాము మద్యం మత్తులో ఉన్నట్లు, అంబులెన్సు కిటికీ అద్దాన్ని పగులగొట్టామని ఆరోపిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. ఏవో పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. కుటుంబసభ్యులు, మిత్రులను కూడా కలవనివ్వలేదు. మా కంపెనీ లాయర్ల జోక్యంతో దాదాపు 48 గంటల తర్వాత విడిచిపెట్టారు’అని ఆరోపించారు. రెండు రోజుల క్రితం చందన్ గుప్తా భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన భర్తను విడిపించేందుకు సాయం చేయాలంటూ యూపీ సీఎం యోగిని అందులో కోరారు. మాస్కోలోని భారత ఎంబసీ తమకు ఎటువంటి సాయం చేయలేదని, రష్యా పోలీసులు చేసిన ఆరోపణలనే వినిపించిందన్నారు. -
ఐర్లాండ్ విలీనం అగ్గి రాజేసిన ట్రంప్
డబ్లిన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఐర్లాండ్, ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న నార్తర్న్ ఐర్లాండ్‌లు విలీనమై ఒక్కటైతే బాగుంటుందని వ్యాఖ్యానించి శతాబ్ధకాలం నాటి వివాదానికి ఆజ్యం పోశారు. ఐర్లాండ్ తీరంలోని డూన్బెగ్లో ఉన్న తన గోల్ఫ్కో ర్సును సందర్శించిన ట్రంప్ శనివారం ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఆ దేశ ప్రధాని మేకేల్ మార్టిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘‘ఏ రకమైన సమస్య సృష్టించే ఉద్దేశం లేదు కానీ.. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, యూకేకు చెందిన నార్తర్న్ ఐర్లాండ్ కలిసిపోతే చూడాలని ఉంది. ఏదో ఒక రోజు ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు కూడా సాధ్యం కావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ల ఏకత అద్భు తంగా ఉంటుందని, ఈ విషయంపై సహజంగానే యూకే ఏదో ఒకటి చెబుతుంది అని విమర్శించారు. నార్తర్న్ ఐర్లాండ్‌కు సంబంధించి బ్రిటన్‌లో దశాబ్దాల కాలం ఉద్య మాలు, హింస చెలరేగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నార్తర్న్ ఐర్లాండ్ యూకేతో కలిసి ఉండాలని ఒక వర్గం, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌తో కలిసిపోవాలని ఇంకోవర్గం మధ్య జరిగిన ఈ పోరులో సుమారు 3600 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగానే అమెరికా పూర్వపు అధ్యక్షులు ఎవరూ సున్ని తమైన ఐర్లాండ్ అంశంపై ఏ రకమై వ్యాఖ్యా చేసే వారు కాదు. మాజీ అధ్యక్షుడు జో బైడె న్ తల్లివైపు వారు ఐర్లాండ్ వారు అయినప్ప టికీ, ‘ఐరిష్– అమెరికన్’ను నేనని ఆయన స్వయంగా చెప్పుకున్నా ఐ ర్లాండ్ల ఏకీకరణ విషయంలో ఆయన పల్లెత్తు మాట అనకపోవడం గమ నా ర్హం. సుమారు వందేళ్ల క్రితం బ్రిటన్ పెత్త నం నుంచి బయటపడుతూ ఐర్లాండ్ రోమ న్ కేథలిక్‌లు ఎక్కువగా ఉన్న స్వతంత్ర దేశంగా అవతరిస్తే... ప్రొటె స్టెంట్లు ఎక్కువగా ఉన్న ఆరు కౌంటీ ప్రాంతాలు యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే ఉండిపోయాయి. నార్తర్న్ ఐర్లాండ్‌లోని రెండు వర్గాల మధ్య 30 ఏళ్లపాటు హింస, సాయుధ పోరు నడిచింది. చివరకు 1998లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం ఒకటి కుదిరింది.ఐర్లాండ్ అధ్యక్షుడితోనూ మంతనాలుట్రంప్ తన గోల్ఫ్ కోర్సు సందర్శన సందర్భంలోనే శని వా రం ఐర్లాండ్ అధ్యక్షులు కేథరీన్ కనోలీతోనూ సమావేశమ య్యా రు. డబ్లిన్‌లోని అమెరికా దౌత్యవేత్త అధికార నివాసంలో ఇరుదే శాల వాణిజ్యవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు కూడా. ఆ తరువాత గోల్ఫ్ కోర్సులో జరగనున్న ఐరిష్ ఓపెన్ టోర్నీ ని వీక్షించనున్నారు. 2019లో ట్రంప్ ఐర్లాండ్‌ను సందర్శించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో కేథరీన్ ఒకరు. ఆ తరువాత అధ్య క్షులుగా ఎన్నికయ్యారు. పాలస్తీనాకు మద్దతుగా నిలిచే వామపక్ష భావాలున్న వ్యక్తి. మధ్యప్రాచ్యంలో అమెరికా వైఖ రిని తప్పు పట్టి.. ట్రంప్ ఒక పెత్తందారీ పోకడలు కలిగిన వ్యక్తి అని కూడా విమర్శించారు. అటువంటి కేథరీన్ తాజాగా తన అధికార నివా సంలో ట్రంప్‌కు స్వాగతం పలడకం గమనార్హం. వీరిద్దరూ శనివారం కొద్దిసేపు రహస్యంగా మంతనాలు జరిపారు కూడా. ఇదిలా ఉంటే.. ట్రంప్ రాకను డబ్లిన్ వాసులు కొందరు వ్యతిరేకించారు. నగరంలోని ఫీనిక్స్ పార్క్‌లో ట్రంప్, కేథరీన్‌ల సమావేశం సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంపై నగరవా సులు అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచం అతలాకు తలమవుతూంటే ట్రంప్ గోల్ఫ్ అడుతున్నాడు అని క్రిస్టోఫర్ ఫాక్స్ అనే ట్యాక్సీ డ్రైవర్ విమర్శించారు. మహిళలు, వలసదారులు, మైనార్టీలపై ట్రంప్ వైఖరి గర్హనీయమని ఓ విద్యార్థి వ్యాఖ్యానించారు. -
ఐర్లాండ్ ఏకీకరణపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐర్లాండ్ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ కలసి ఒకే దేశంగా మారాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. సాధారణంగా ఇతర దేశాల నేతలతో సమావేశాలు, పర్యటనల్లో ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ముందుగా ఊహించడం కష్టంగా ఉంటుంది. అయితే ఐర్లాండ్‌లో పర్యటన మొదటి రోజే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆ దేశంతోపాటు బ్రిటన్‌లోనూ ప్రకంపనలు సృష్టించాయి.అయితే ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పునకు సంకేతమా? లేక విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన అప్పటికప్పుడు ఇచ్చిన సమాధానమా? అనే చర్చ మొదలైంది. ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉత్తర ఐర్లాండ్‌కు ప్రత్యేక రాయబారిగా పనిచేసిన మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మిక్ మల్వానీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. అమెరికా ఇప్పటికీ ఉత్తర ఐర్లాండ్‌లో శాంతిని నెలకొల్పేందుకు 1998లో కుదిరిన గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు బ్రెండన్ బాయిల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఐర్లాండ్, ఉత్తర ఐర్లాండ్ భవిష్యత్తులో ఎప్పుడో ఒకరోజు ఏకమయ్యే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడంలో తప్పేమీ లేదని ఇద్దరు నేతలు భావించారు. అయితే దాని కోసం అమెరికా ఇప్పుడే ప్రత్యేకంగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని మాత్రం వారు భావించడం లేదు. విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వడం ఒక విషయమైతే.. కొద్దిసేపటికే అమెరికా రాయబారి నివాసంలో జరిగిన కార్యక్రమంలోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ఈ విషయంలో ట్రంప్ ఉద్దేశం ఏమిటన్న దానిపై మరింత ఆసక్తి పెరిగింది.అలాగే, ట్రంప్ అక్కడి వ్యాపారవేత్తలు, ఐరిష్-అమెరికన్ ప్రముఖులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా ఆసక్తికరంగా సాగింది. దీంతో సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడతారని భావించినా.. ఆయన మాత్రం అంతకన్న ఎక్కవ సమయమే ప్రసంగించారు. ఐర్లాండ్‌కు సంబంధించిన అంశాల కంటే అమెరికాలోని రాజకీయ పరిస్థితులు, తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించే ఎక్కువగా మాట్లాడారు. అలాగే, అక్రమ వలసలను అడ్డుకోవడం, వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకోవడం, రక్షణ రంగ ఉత్పత్తులను పెంచడం వంటి అంశాలను తన విజయాలుగా పేర్కొన్నారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్యకు బ్రిటన్ తగినంత మద్దతు ఇవ్వలేదంటూ మరోసారి విమర్శలు చేశారు. అయితే ట్రంప్ అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.డబ్లిన్‌లో ఆయన ముందు ఉన్న వ్యాపారవేత్తలే లక్ష్యమా? లేక అమెరికాలో తెల్లవారుజామున ఆయన ప్రసంగాన్ని చూస్తున్న ఐరిష్-అమెరికన్లా? అనే చర్చ జరుగుతోంది. అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌లోని ఒకటి లేదా రెండు సభలపై పార్టీ నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అమెరికా జనాభాలో దాదాపు పదో వంతు మంది తమకు ఐరిష్ మూలాలు ఉన్నాయని చెబుతారు. వారిలో కొందరు ఐర్లాండ్ ఏకీకరణకు మద్దతు ఇస్తుండటంతో.. అలాంటి ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గతంలోనూ ఐరిష్-అమెరికన్ ఓటర్ల మద్దతు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారింది. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఐర్లాండ్ శాంతి ప్రక్రియలో అమెరికా చురుకుగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చి ఐరిష్-అమెరికన్ల మద్దతు పొందారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన హామీ మేరకు శాంతి ప్రక్రియలో అమెరికా కీలక పాత్ర పోషించింది. దాని ఫలితంగానే గుడ్ ఫ్రైడే ఒప్పందానికి మార్గం సుగమమైంది. అయితే ఇప్పుడు అమెరికా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ విభజనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఎంతవరకు ఎన్నికల వ్యూహంలో భాగమో స్పష్టంగా తెలియదు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చకు దారితీసినప్పటికీ.. ఐర్లాండ్ రాజకీయ వర్గాల్లో మాత్రం మరుసటి రోజు జరగనున్న గోల్ఫ్ మ్యాచ్ గురించే ప్రధానంగా చర్చ సాగుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు! -
ద్విపాత్రాభినయం తప్పదు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల నూతన అంతర్జాతీయ విపణుల మధ్య సహకారానికి అత్యంత ప్రభావవంతమైన వేదికగా బ్రిక్స్ కూటమి ఎదిగిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీలో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ఆయన ఈ కూటమి దేశాల అగ్రనేతలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు. ‘‘పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతల స్థాపనకు బ్రిక్స్ దేశాలు ద్విపాత్రాభినయం చేయాల్సిందే. ఎందుకంటే పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లోని యుద్ధాలు, మారుతున్న విపరిణామాలతో ఆయా ప్రాంతాల ప్రజలు కష్టాల కడలిలో పడిపోయారు. అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కల్గుతోంది. ఇకనైనా పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల అగ్రనేతలు ఉమ్మడిగా పోరాడాలి. చరిత్ర గుర్తుంచుకునేలా సరైన పథంలో నడిచి ఈ ప్రాంతాల పురోభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి’’అని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. చైనా సైతం పశ్చిమాసియా, గల్ఫ్‌లో శాంతి,సుస్థిరత కోసం ఈ కూటమితో కలిసి సమష్టిగా కృషిచేస్తుందని స్పష్టంచేశారు. ఆ మనస్తత్వం మానండి.. ‘‘ఇకనైనా బ్రిక్స్ దేశాలు ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి మనస్తత్వాన్ని వీడాలి. సభ్య దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం మానుకోవాలి. ఆయా దేశాల సార్వ¿ౌమత్వాలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడం వంటి పనులకు చరమగీతం పాడాలి. శత్రుత్వాలకు త్యజించాలి. ఇందుకోసం పరస్పర అవగాహన, విశ్వాసం పెంచుకోవడంపై కూటమి దేశాలు దృష్టిపెట్టాలి. బ్రిక్స్ దేశాలు స్వావలంబన సాధిస్తూనే, దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే సరికొత్త అభిృవృద్ధిబాటల్లో పయనించడం శుభసూచకం. అగ్రదేశాల ఆధిపత్య విధానాలు, కేంద్రీకృత రాజకీయాల విపరిణామాల దుష్పఫలితాలను మనందరం చవిచూస్తున్నాం. దీంతో శాంతి, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన అనేవి కష్టమవుతున్నాయి. వీటికి పరిష్కారాలు వెతుకుదాం. కోవిడ్ సంక్షోభాన్ని సమష్టిగా ఎదుర్కొన్నట్లు ఇకమీదటా వాతావరణ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అంతర్జాతీయ సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకుందాం’’అని జిన్‌పింగ్ అన్నారు. -
పళ్లు గడగడలాడుతున్నా.. ప్రాణాల కోసం పోరాటం ఆపలేదు!
అలాస్కాలోని బెరింగ్ సముద్రంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. చుట్టూ గడ్డకట్టేంత చలి ఉన్న సముద్రం.. తినడానికి ఆహారం, తాగడానికి నీరు లేకపోయినా 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల పాటు బోల్తాపడిన చేపల వేట పడవపైనే ఉండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో బాలుడి అన్న, మరో బంధువు మృతి చెందారు. బాధిత బాలుడిని డెరిక్ పార్కర్ అఘ్నాంగా గా గుర్తించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. డెరిక్, అతడి అన్న, మరో బంధువు కలిసి చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు.అమెరికా కోస్ట్‌గార్డ్ వివరాల ప్రకారం.. డెరిక్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 4న సెయింట్ లారెన్స్ ద్వీపం నుంచి 18 అడుగుల చేపల వేట పడవలో బయలుదేరారు. అయితే, ఆదివారం మధ్యాహ్నానికి తిరిగి రావాల్సి ఉండగా వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే కోస్ట్‌గార్డ్ సిబ్బంది సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గాలింపు కొనసాగుతుండగా బోల్తాపడిన పడవపై కూర్చున్న డెరిక్ వారికి కనిపించాడు.ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలో ఉన్న మరో చేపల వేట పడవ సిబ్బంది అతడి వద్దకు చేరుకుంది. అతడిని సురక్షితంగా తమ పడవలోకి తీసుకున్నారు. అదే సమయంలో సముద్రంలో గాలింపు కొనసాగించగా డెరిక్ అన్న, మరో బంధువు మృతదేహాలు లభించాయి. ఈ రెండు రోజుల పాటు చల్లటి సముద్రంలో ఉండటంతో డెరిక్ శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. హైపోథెర్మియా లక్షణాలు కనిపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపారు. సముద్రంలోని నీటి ఉష్ణోగ్రత సుమారు 10 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నట్లు రక్షించిన పడవ కెప్టెన్ ఆడమ్ వైట్ చెప్పారు.అలా.. డెరిక్ చీకట్లో కూడా బోల్తాపడిన పడవను గట్టిగా పట్టుకుని ఉన్నాడని కెప్టెన్ ఆడమ్ వైట్ తెలిపారు. చలికి అతడి పళ్లు గడగడలాడుతున్నప్పటికీ తన అన్న పడవ కింద చిక్కుకుని ఉన్నాడని చెప్పినట్లు వివరించారు. అయితే, అంతకుముందు రాత్రి తన మరో బంధువు కూడా నీటిలో జారిపోయినట్లు డెరిక్ చెప్పాడన్నారు. ఇంతటి ప్రమాదంలోనూ అతడు ధైర్యంగా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడని, డెరిక్ చాలా ధైర్యవంతుడని కెప్టెన్ ప్రశంసించారు.డెరిక్, అతడి అన్నకు చేపలు పట్టడం అంటే ఎంతో ఇష్టమని వారి తల్లి వీనా కులోవియి తెలిపారు. అలాగే, స్థానిక దుకాణాల్లో మాంసం కొనలేని కుటుంబాలకు ఆహారం అందించేందుకు వారు చేపలు పట్టేవారని చెప్పారు. సెయింట్ లారెన్స్ ద్వీపంలోని సవూంగా గ్రామంలో సుమారు 800 మంది నివసిస్తున్నారు. అక్కడ ఎక్కువగా సైబీరియన్ యుపిక్ ప్రజలు ఉంటారు. వేటాడి ఆహారం సంపాదించడం, అవసరమైన వారికి దాన్ని పంచుకోవడం తమ కుటుంబంలో తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని వీనా ఈ సందర్భంగా తెలిపారు.ప్రస్తుతం డెరిక్ ఇంటికి చేరుకుని కోలుకుంటున్నాడని అతడి తల్లి చెప్పారు. సముద్రంలో ఉన్నంతసేపూ తన కుమారుడు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడని తెలిపారు. ‘‘నా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథ అద్భుతం. ఇంతసేపూ అతడు భయపడలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా కోస్ట్‌గార్డ్ ఆర్కిటిక్ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ బాబ్ లిటిల్ స్పందిస్తూ.. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబాలు, స్నేహితులు, వారి సమాజానికి సానుభూతి తెలిపారు.ఇదీ చదవండి: ఆరేళ్ల తర్వాత స్టేజ్‌పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ! -
ఆరేళ్ల తర్వాత స్టేజ్‌పై సెలిన్ డియోన్.. అభిమానుల్లో పండగ!
పారిస్: ప్రముఖ గాయని సెలిన్ డియోన్ ఆరేళ్ల తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగిన భారీ సంగీత కార్యక్రమంలో ఆమె అభిమానులను అలరించారు. దాదాపు 30 వేల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 1990ల నాటి ఫ్రెంచ్ పాట ‘On ne change pas’తో తన ప్రదర్శనను ప్రారంభించారు.అయితే, చాలా కాలం తర్వాత స్టేజ్‌పైకి వచ్చిన సెలిన్ డియోన్ కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో అభిమానులు ఆమె పేరును గట్టిగా నినదిస్తూ ఉత్సాహపరిచారు. ‘చివరికి మనమంతా కలిసి ఉన్నాం’ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ఇంతకాలం తర్వాత అభిమానుల ముందు పాడటం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని చెప్పారు.అనారోగ్యంతో దూరంసెలిన్ డియోన్ కొన్నేళ్లుగా అరుదైన స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె కొన్ని సందర్భాల్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సమస్యతో శరీరంలోని కండరాలు ఒక్కసారిగా బిగుసుకుపోవడం, తీవ్రమైన నొప్పి, కండరాల్లో పట్టేయడం వంటి ఇబ్బందులు వస్తాయి. దీంతో ఆమె పలు సంగీత కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మళ్లీ స్టేజ్‌పై పాడగలనా అనే అనుమానం కూడా ఒక దశలో ఆమెకు కలిగింది.ఆశను వదల్లేదుతన ప్రయాణం అనుకున్నదానికంటే చాలా కష్టంగా సాగిందని సెలిన్ డియోన్ చెప్పారు. అయినా ఆశను మాత్రం వదులుకోలేదని అన్నారు. చిన్న వెలుగురేఖ కనిపించినా దానినే పట్టుకుని ముందుకు సాగినట్లు చెప్పారు. అభిమానుల కోసం, తన కోసం, జీవితాన్ని ఆస్వాదించేందుకు మళ్లీ పాటలు పాడాలని కోరుకున్నట్లు తెలిపారు.ప్రపంచం నలుమూలల నుంచి..ఈ కార్యక్రమానికి పారిస్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నుంచి అభిమానులు వచ్చారు. కెనడా, బ్రెజిల్, బ్రిటన్, టహీటి తదితర ప్రాంతాల నుంచి కూడా పలువురు తరలివచ్చారు. సెలిన్ డియోన్ ఫొటోలు, పేర్లతో ఉన్న టీషర్టులు ధరించి అభిమానులు సందడి చేశారు. ఆమెను మళ్లీ ప్రత్యక్షంగా చూస్తామని అనుకోలేదని కొందరు అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.పారిస్‌లో ప్రత్యేక సందడి2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో ఈఫిల్ టవర్ వద్ద ‘Hymn to Love’ పాటతో సెలిన్ డియోన్ చేసిన ప్రదర్శన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె కచేరీల సందర్భంగా పారిస్‌లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానుల కోసం పాటలు, కరోకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె పేరును గుర్తు చేసేలా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంసెలిన్ డియోన్ నాలుగు దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో కొనసాగుతున్నారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో ఆమె పాటలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. దీంతో ‘It’s All Coming Back to Me Now’, ‘Because You Loved Me’ వంటి పాటలు ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. అయితే, 2022లో తనకు స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ ఉన్నట్లు సెలిన్ డియోన్ చెప్పారు. ఈ సమస్యతో తీవ్రమైన కండరాల నొప్పులు, పట్టేయడం వంటి ఇబ్బందులు వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో నొప్పి కారణంగా పక్కటెముకలు కూడా విరిగిన సందర్భాలు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు! -
ఏఐ భయాలు నిజమేనా? సిలికాన్ వ్యాలీలో భిన్న వాదనలు!
శాన్ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్‌లో మానవాళికి తీవ్ర ముప్పుగా మారొచ్చంటూ కొందరు నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఏఐ వ్యవస్థలు త్వరలోనే మానవులకంటే శక్తిమంతంగా మారి నియంత్రణ తప్పితే మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలికాన్ వ్యాలీలోని పలువురు టెక్ వర్గాలు మాత్రం ఈ హెచ్చరికలను అతిశయోక్తిగా కొట్టిపారేస్తున్నాయి.ప్రతి సెప్టెంబర్‌లో శాన్ఫ్రాన్సిస్కోలో గోల్డ్‌మన్ సాక్స్ నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు హాజరవుతుంటారు. ఈసారి కూడా కంపెనీల వృద్ధి, పెట్టుబడులతో పాటు ఏఐ భద్రత, దాని భవిష్యత్ ప్రభావాలపై చర్చ జరిగింది.‘మానవాళిని నాశనం చేయొచ్చు’ఇటీవల ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు మానవాళి భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. 27 ఏళ్ల కాక్సన్ గతంలో ఓపెన్ఏఐలో పనిచేశారు. ఏఐ త్వరలోనే మానవులకంటే ఎక్కువ సామర్థ్యాన్ని సాధించి, సైబర్ వ్యవస్థలను కూడా హ్యాక్ చేయగల స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించారు.ఆంత్రోపిక్ టీమ్ లీడ్ ఇవాన్ హ్యూబింగర్ కూడా వచ్చే పదేళ్లలో ఏఐ కారణంగా మానవాళి నశించే అవకాశం 10 శాతానికంటే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్‌లో పనిచేసిన పలువురు ఉద్యోగులు కూడా ఏఐ భద్రతపై ఆందోళనలు వ్యక్తం చేశారు.హెచ్చరికలా.. ప్రచార వ్యూహమా?అయితే ఈ హెచ్చరికలపై సిలికాన్ వ్యాలీలో అందరూ ఏకీభవించడం లేదు. ఏఐ ప్రమాదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజల్లో భయంతో పాటు ఆ సంస్థల ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతుందని కొందరు పెట్టుబడిదారులు, టెక్ వర్గాలు అంటున్నాయి.ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ సంస్థలు భారీ విలువలతో స్టాక్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఏఐ సామర్థ్యాలను అత్యంత శక్తిమంతమైనవిగా చూపించేందుకు ఇలాంటి హెచ్చరికలు ఉపయోగపడుతున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ గతంలో ఏఐ కారణంగా ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో సగం వరకు కనుమరుగయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.‘భయపెట్టి పెట్టుబడులు పెంచుతున్నారా?’ఆంత్రోపిక్ నిధుల సమీకరణలో సుమారు 965 బిలియన్ డాలర్ల విలువను సాధించిన నేపథ్యంలో.. సంస్థలు తమ ఏఐ సామర్థ్యాలను చూపించేందుకు మానవాళికి ముప్పు వంటి అంశాలను ప్రచారంలో ఉపయోగిస్తున్నాయా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఆల్టిమీటర్ క్యాపిటల్ అధిపతి బ్రాడ్ గెర్స్ట్నర్ కాక్సన్ వ్యాఖ్యలను అతిశయోక్తిగా అభివర్ణించారు. హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్ కూడా తొలుత ఈ హెచ్చరికలను ప్రశ్నించారు. అయితే ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా నియంత్రణలు తీసుకురావాలని అమోడీ సూచించడంతో ఆయన వైఖరి కొంత మారింది.ఏఐపై ఆందోళనలు ఎందుకు పెరుగుతున్నాయి?ఆంత్రోపిక్ రూపొందించిన ‘మైథోస్’ వ్యవస్థ కొన్ని హ్యాకింగ్, సైబర్ భద్రతా పనుల్లో మనుషుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. తనను ఉంచిన పరిమిత కంప్యూటర్ వాతావరణం నుంచి స్వయంగా బయటపడే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించినట్లు తెలిపింది.తమ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బయో ఆయుధాల తయారీ, సైబర్ గూఢచర్యానికి ప్రయత్నించిన వ్యక్తులను గుర్తించి అడ్డుకున్నామని ఆంత్రోపిక్ పేర్కొంది. దీంతో ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన నియంత్రణలు అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.అమెరికాలో నియంత్రణలు వస్తాయా?అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ సహా పలువురు నేతలు అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతున్నారు. ఏఐపై మానవులు నియంత్రణ కోల్పోతే పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని సాండర్స్ హెచ్చరించారు.అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఏఐ అభివృద్ధిపై కఠిన ఆంక్షలకు అనుకూలంగా కనిపించడం లేదు. చైనాను మించేందుకు అమెరికా ఏఐ రంగంలో వేగంగా ముందుకు సాగాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.ఆంత్రోపిక్‌తో ట్రంప్ ప్రభుత్వానికి విభేదాలుఆంత్రోపిక్, ట్రంప్ ప్రభుత్వాల మధ్య ఇటీవల విభేదాలు చోటుచేసుకున్నాయి. అమెరికా సైన్యం తమ ఏఐ మోడళ్లను ఉపయోగించేందుకు విధించిన కొన్ని షరతులను ఆంత్రోపిక్ అంగీకరించకపోవడంతో వైట్‌హౌస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఈ నిర్ణయంపై ఫెడరల్ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.మరోవైపు ఓపెన్ఏఐ మాత్రం ట్రంప్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెబుతోంది. సంస్థ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ కూడా ప్రభుత్వంతో మంచి భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ఓపెన్ఏఐ స్టాక్ మార్కెట్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, సంస్థ తాజా విలువ సుమారు 852 బిలియన్ డాలర్లుగా ఉంది.పెట్టుబడిదారుల దృష్టి మాత్రం లాభాలపైనే..ఏఐ వల్ల మానవాళికి ముప్పు ఏర్పడొచ్చన్న హెచ్చరికలు, నియంత్రణలపై చర్చలు జరుగుతున్నప్పటికీ.. సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుల దృష్టి మాత్రం వ్యాపారంపైనే ఉంది.ఆంత్రోపిక్ స్టాక్ మార్కెట్లోకి రావడానికి ముందు సమర్పించబోయే ఎస్-1 పత్రం కోసం ఓ పెట్టుబడిదారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో కంపెనీ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార వివరాలు ఉంటాయి. అయితే ఆయన ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఆంత్రోపిక్ లాభాల్లో ఉందా?ఏఐ వల్ల ప్రపంచం అంతమయ్యే ప్రమాదం ఉందా? అని డీ-మ్యాట్రిక్స్ సీఈఓ సిడ్ షెత్ను అడిగితే.. ఆయన మాత్రం ‘లేదు’ అని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి: భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది? -
జకీర్ నాయక్ అప్పగింతపై చర్చలు..: మలేషియా ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ను భారత్‌కు అప్పగించే అంశం న్యూఢిల్లీలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చిందని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. భారత్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జకీర్ నాయక్ అప్పగింత అంశంపై చర్చలు జరిగాయని అన్వర్ ఇబ్రహీం జాతీయ మీడియాకు వెల్లడించారు.ఈ అంశంపై చర్చలను ఇరు దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గోప్యంగా ఉంచామని ఆయన చెప్పారు. భారత్, మలేషియా మధ్య విశ్వాసం, సంబంధాలను బలోపేతం చేసే అంశాల్లో దీనికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. అప్పగింతకు సంబంధించిన డిమాండ్‌పై కొంత అవగాహన ఉందని, అయితే చట్టబద్ధమైన విధానాన్ని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్వర్ ఇబ్రహీం చెప్పారు.జాకీర్ నాయక్ 2016లో భారత్‌లో ఆయనపై, ఆయనకు సంబంధించిన సంస్థలపై దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మలేషియాకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన మలేషియాలో శాశ్వత నివాస హోదాతో ఉంటున్నారు. భారత్‌లో మనీలాండరింగ్, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. భారత్ ఆయనను అప్పగించాలని అధికారికంగా కోరింది. అయితే విశ్వసనీయమైన ఆధారాలు సమర్పిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో సహకరిస్తామని మలేషియా చెబుతోంది. -
సముద్ర గర్భంలో రష్యా భారీ విధ్వంసకర ప్లాన్.. నాటో తిప్పికొట్టి..
ఆర్కిటిక్ సముద్ర జలాల్లో కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని నాటో దేశాలు అడ్డుకున్నాయి. కొన్ని నెలల క్రితం స్వాల్బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాములు ఓ రహస్య ఆయుధాన్ని ప్రయోగించేందుకు శిక్షణ తీసుకుంటుండగా బ్రిటన్, నార్వే, అమెరికా సంయుక్తంగా వాటిని గుర్తించి అడ్డుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.ఈ రహస్య ఆపరేషన్‌ను రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నిర్వహించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. లోతైన సముద్రంలో ప్రయాణించగల చిన్న జలాంతర్గాములను ఉపయోగించి అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో రష్యా సిబ్బంది పరీక్షించినట్లు చెప్పారు.బ్రిటన్, నార్వే, అమెరికా కలిసి రష్యా నౌకలను సముద్రంలో గుర్తించి ఎదుర్కొన్నాయి. దీంతో రష్యా తన శిక్షణను పూర్తి చేయలేకపోయింది. అనంతరం ఆ నౌకలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి సముద్రగర్భ కేబుల్ దెబ్బతినలేదు. నాటోతో ఘర్షణ ఏర్పడితే ఆ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరీక్షించడమే ఈ శిక్షణ ఉద్దేశమని అధికారులు తెలిపారు.స్వాల్బార్డ్ దీవులను నార్వే ప్రధాన భూభాగంతో కలిపే 2 సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు సుమారు 1,400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 2,700 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ భూ కేంద్రంగా ఉన్న స్వాల్సాట్ నుంచి భారీ మొత్తంలో ఉపగ్రహ సమాచారాన్ని ఈ కేబుళ్లు ప్రసారం చేస్తాయి.విధ్వంసక చర్యలను పెంచుతున్న రష్యా ఈ ఘటనతో రష్యా యూరప్‌లో విధ్వంసక చర్యలను పెంచుతోందన్న పాశ్చాత్య దేశాల ఆందోళనలు మరింత పెరిగాయి. కొంతమంది అమెరికా నిఘా అధికారులు రష్యా నాటో పరస్పర రక్షణ ఒప్పందంలోని ఆర్టికల్ 5ను పరీక్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటోలోని ఓ సభ్యదేశంపై తీవ్రమైన దాడి జరిగితే ఇతర సభ్యదేశాలు దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే నిబంధనే ఆర్టికల్ 5.రష్యా తన చర్యలతో కేబుళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. బ్రిటన్, నార్వే అధికారులు తమ వద్ద కొత్త సాంకేతికతపై సమాచారం ఉందని మాస్కోకు తెలియజేసినట్లు చెప్పారు. రష్యా దాన్ని ఉపయోగించకుండా వెనక్కి తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.‘‘మా సంయుక్త చర్య ద్వారా రష్యాకు స్పష్టమైన సందేశం పంపాం. వారు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించలేరు’’ అని నార్వే రక్షణ మంత్రి టోరె శాండ్విక్ తెలిపారు. కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా గుర్తించి తగిన పరిణామాలు ఎదుర్కొనేలా చేస్తామని రష్యా అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన రష్యా సముద్రగర్భ కార్యకలాపాలపై బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నార్వే, బ్రిటన్ జలాల్లో రహస్య కార్యకలాపాలకు ప్రయత్నించినట్లు అప్పట్లో వెల్లడించాయి. ఈ విభాగంపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించాయి. 2022లో జర్మనీకి రష్యా నుంచి సహజ వాయువును సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ సముద్రగర్భ పైప్లైన్లలో 4లో 3 ధ్వంసమైన తర్వాత నాటో దేశాలు సముద్రగర్భ మౌలిక వసతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఘటనలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని ఆ దేశం ఖండించింది. 2023 నుంచి సముద్రగర్భ పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్లు, సమాచార కేబుళ్లకు సమీపంలో కొన్ని నౌకలు నెమ్మదిగా ప్రయాణిస్తూ వాటి స్థానాలను గుర్తిస్తున్నట్లు భద్రతా నిపుణులు గుర్తించారు. దీనిని ‘డ్రిఫ్టింగ్’గా పిలుస్తారు.గత ఏడాది ఉత్తర సముద్రంలో ఇలాంటి నౌకల సంఖ్య 52 శాతం పెరిగి 13,079కు చేరింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ కార్యకలాపాలు 88 శాతం పెరిగి 18,401 నౌకలకు చేరినట్లు సముద్ర భద్రతా విశ్లేషణ సంస్థ విండ్‌వార్డ్ తెలిపింది. సముద్రగర్భ మౌలిక వసతులపై విస్తృతంగా సమాచారాన్ని సేకరించడం చట్టవిరుద్ధం కాకపోయినా, ఇంత భారీ స్థాయిలో ప్రాంతాలను గుర్తించడం భవిష్యత్తులో విధ్వంసక చర్యలకు సిద్ధమవుతున్న సంకేతంగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు.ఈ కార్యకలాపాలు, కొన్ని కేబుళ్లపై అనుమానాస్పద జోక్యాల నేపథ్యంలో నాటో గత ఏడాది జనవరిలో బాల్టిక్ సెంట్రీ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. బ్రిటన్ నేతృత్వంలో నార్డిక్ వార్డెన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కీలక మౌలిక వసతులపై నిఘా, గస్తీని పెంచడం ఈ కార్యక్రమాల ఉద్దేశం.విద్యుత్, సమాచార ప్రసార కేబుళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆధారపడటం పెరుగుతున్నందున సముద్రగర్భ మౌలిక వసతుల ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. కృత్రిమ మేధ కారణంగా సమాచారంతో పాటు విద్యుత్ అవసరం పెరుగుతుండటంతో ఈ కేబుళ్ల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే యూరప్ ఇప్పటికీ ఈ మౌలిక వసతులపై ముప్పును ఎదుర్కొనే స్థితిలోనే ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రూకింగ్స్ సంస్థకు చెందిన సీనియర్ పరిశోధకుడు బ్రూస్ జోన్స్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో యూరప్ సముద్రగర్భ మౌలిక వసతులపై ఆధారపడటాన్ని భారీగా పెంచుకున్నా, వాటిని రక్షించే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుందని అన్నారు. పెరుగుతున్న రష్యా ముప్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ రక్షణ సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. -
ఇదేమి వింతో.. బ్రేకప్ తర్వాత రివర్స్ ట్విస్ట్..
సింగపూర్‌లో జరిగిన ఓ వింత ఘటన అందర్నీ అశ్చరపరుస్తోంది. ప్రేమలో ఉండగా ప్రేయసి కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు.. విలాసవంతమైన కానుకలు, ఫస్ట్‌క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు.. ఇలా ఆమె కోసం భారీగా ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవో.. ప్రేమ బంధం తెగిపోయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఇది ప్రేమలో ఇచ్చిన బహుమతులేనంటూ తీర్పు చెప్పింది. దీంతో డబ్బు తిరిగి రాకపోగా.. కోర్టు ఖర్చులు కూడా అతడే భరించాల్సి వచ్చింది. ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.సీఎన్ఎన్ కథనం మేరకు భారత లాజిస్టిక్స్ సంస్థ టీసీఎల్ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్, తన మాజీ ప్రేయసి ఫెలీషియా లీ తనకు దాదాపు $3.7 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఖర్చు చేసిన మొత్తాన్ని తాను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని.. వాటిని ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని అగర్వాల్ వాదించారు. అయితే కోర్టు మాత్రం ఆ మొత్తంలో ఎక్కువ భాగం బహుమతుల రూపంలో ఇచ్చినవేనని తేల్చింది. అగర్వాల్ దావాను కొట్టివేసింది.అగర్వాల్, లీ ఇద్దరూ తొలిసారిగా 2019లో ఓ విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ ఏర్పడింది. 2023 డిసెంబర్లో వారి సంబంధం ముగిసింది. లీ తనకు నమ్మకద్రోహం చేసిందని.. అందుకే తాము విడిపోయామని అగర్వాల్ పేర్కొన్నారు. వారు ప్రేమలో ఉండగా అగర్వాల్.. లీ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అంతే కాకుండా.. లీ నివసించే ఫ్లాట్ కోసం ఓ ఫెంగ్ షుయ్ నిపుణుడికి సుమారు S$17,000 కూడా చెల్లించారు.ఈ చెల్లింపు మాత్రం రుణమేనని అగర్వాల్ వాదించారు. లీ తనను డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని.. దాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్ తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ ఇనిషియల్స్ ఉన్నాయని తాను పేర్కొన్న ఓ చేతిరాత ఒప్పందాన్ని కూడా కోర్టుకు ఆయన సమర్పించారు. అయితే, లీ ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చెల్లింపులు రుణాలు కాదని.. బహుమతులేనని, అందువల్ల లీ ఆ డబ్బును అగర్వాల్‌కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
90 నిమిషాల్లో ఇద్దరు స్నేహితులను చంపిన ఆమె దొరికిపోయింది..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్‌జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.మొదటి ఘటన శాన్‌జోస్‌లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్‌జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్లోని తమ అపార్ట్మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్‌జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.మృతుల భౌతిక కాయాలను భారత్‌కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. -
భారత్‌కు పుతిన్.. ‘రష్యా ప్రళయ విమానం’లో ఏముంది?
ఒకేలా కనిపించే రెండు విమానాలు.. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ విమానంలో ఉన్నారో ఎవరికీ తెలియదు.. అత్యాధునిక భద్రతా వ్యవస్థలు.. రహస్య కమ్యూనికేషన్ టెక్నాలజీ, అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారే సామర్థ్యం.. ఇవన్నీ కలగలిసిన పుతిన్ ‘డూమ్స్‌డే ప్లేన్’ ఇప్పుడు భారత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి చేరుకోవడంతో అసలు ఈ ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’లో ఏముంది అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం విస్తరణపై చర్చించారు. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నాయకులలో ఒకరైన రష్యా అధ్యక్షుడు కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించే విమాన శ్రేణిలో ఒకేలా ఉండే రెండు విమానాలు ఉంటాయి. వాటిలో ఒకటి 'డికాయ్'.. అత్యంత సురక్షితమైన ప్రత్యేక అధ్యక్ష విమానం('ఇల్యుషిన్ IL-96-300PU). దీనినే ఫ్లయింగ్ క్రెమ్లిన్ లేదా డూమ్స్‌డే ప్లేన్ అని కూడా పిలుస్తారు.రష్యా అధ్యక్షుడు ప్రయాణించేందుకు ఒకేలా ఉండే రెండు ఇల్యుషిన్ IL-96-300PU విమానాలను ఉపయోగిస్తారు. రష్యా అధ్యక్షుడు ఏ విమానంలో ఎక్కారనేది ఎవరికీ తెలియకుండా ఉండటానికి ఈ రెండు విమానాలు ఒకేసారి గాల్లోకి ఎగురుతాయి. మాస్కోకు ఈ డబుల్-షీల్డ్ భద్రత కొత్త వ్యూహం కాదు. అదనపు భద్రత కోసం పుతిన్ గతంలో కూడా ఇతర దేశాలకు ఇలాగే ప్రయాణించారు.1980లలో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో చేత అభివృద్ధి చేయబడిన ఈ విమానం.. రష్యా అధ్యక్షుడికి అత్యంత సురక్షితమైన కమాండ్ సెంటర్‌గా పనిచేస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లగల నాలుగు ఇంజిన్ల రష్యన్ విమానం ఇది. అత్యంత ప్రమాద పరిస్థితుల నుంచి రష్యా అగ్ర నాయకత్వాన్ని రక్షించేలా దీనిని రూపకల్పన చేశారు. సుదూర ప్రయాణాలు చేసే IL-96 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్"లో అవిాద్విగటెల్ PS-90A టర్బోఫాన్ ఇంజిన్లు ఉన్నాయి. ఇది ఒకేసారికీ సుమారు 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనివల్ల సుదీర్ఘ ప్రయాణాలలో పదే పదే ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. ఈ విమానం పొడవు 55.35 మీటర్లు కాగా.. దీని రెక్కల వెడల్పు 60.12 మీటర్లు. అధ్యక్షుడి ప్రయాణాలన్నింటినీ పర్యవేక్షించే రష్యా ప్రత్యేక విమాన స్క్యాడ్రన్ దీనిని నడుపుతుంది.జాతీయ అత్యవసర పరిస్థితుల్లో IL-96-300PU పూర్తి స్థాయి మొబైల్ కమాండ్ సెంటర్‌గా పనిచేయగలదు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సైనిక, నిఘా, ప్రభుత్వ నెట్‌వర్క్‌లను సురక్షితంగా సంప్రదించగల ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ విమానంలో రాడార్-జామింగ్ సాంకేతికత ఉంది. అంతేకాకుండా ఇది అధునాతన రక్షణాత్మక వ్యవస్థలను కలిగి ఉంటుంది. అంతరాయం లేని, సురక్షితమైన సంభాషణను కొనసాగించడానికి శాటిలైట్ లింక్‌లు, రక్షిత రేడియో, డేటా ఛానెల్‌లను కూడా ఇది కలిగి ఉంది.భద్రతతో పాటు, ఈ "ఫ్లయింగ్ క్రెమ్లిన్" విలాసవంతంగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో బెడ్రూమ్లతో కూడిన ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ సూట్, విలాసవంతమైన బాత్రూమ్లు, ప్రైవేట్ కిచెన్, డైనింగ్ ఏరియాలు, బోర్డ్‌రూమ్ సీటింగ్‌తో కూడిన పెద్ద సమావేశ మందిరం ఉన్నాయి. ఇవి కాకుండా ఈ విమానంలో బంగారంతో పూత పూసిన ఫిట్టింగ్‌లు, ఆకర్షణీయమైన కలప, ప్రీమియం లెదర్, అప్హోల్స్టరీ తదితర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
భారత సంతతి మహిళను ఫాలో అయ్యాడు.. చివరకు కాల్పులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్‌ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల తరబడి కారు నిలిపి.. కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్‌డ్యాష్ డెలివరీ డ్రైవర్‌గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.మేలో షాలిని చివరకు రోహిత్‌పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది. -
భారత్‌లో పుతిన్-జిన్‌పింగ్ ‘పవర్’ షో!
ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది.. ఇద్దరు నేతలు భారత్‌కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్‌డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్‌పింగ్ కోసం సమ్‌థింగ్ స్పెషల్ హోంగ్‌చీ ఎన్701 హైలైట్‌గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్‌గా పేరొందాయి.‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్‌డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్..ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్‌ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిన్‌పింగ్ ‘ఎయిర్ చైనా’..ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్‌పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే హోంగ్‌చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్‌చీ అంటే చైనీస్‌లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్‌చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్మెంట్!ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్మెంట్!.ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు! -
రాత్రికి రాత్రే 23 కి.మీ వెనక్కి సముద్రం.. ఏం జరగబోతుంది?
సముద్రం ఉన్నచోట ఒక్కసారిగా నేల కనిపిస్తే..? అలలు కనిపించాల్సిన చోట నిర్మాణాలు, సముద్రపు అడుగుభాగం బయటపడితే..? అర్జెంటీనాలో ఇప్పుడు ఇదే వింత పరిణామం కనిపించింది. రాత్రి వేళ సముద్రపు నీరు భారీగా వెనక్కి వెళ్లడం.. మళ్లీ కొంతసేపటికి ముందుకు రావడం వరుసగా జరుగుతోంది. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు.. ఏకంగా 23 కిలోమీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్లినట్లు కనిపించడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేపుతోంది. నీటిలో కప్పబడి ఉండే ప్రాంతాలు ఒక్కసారిగా బయటపడటంతో అక్కడి దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.‘కంటికి కనిపించేది అంతా నిజం కాదు’ అన్నట్టుగా.. సముద్రం వెనక్కి వెళ్లిన సమయంలో సాధారణంగా నీటిలో కనిపించని ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. సముద్రపు అడుగుభాగం, నీటితో కప్పబడి ఉండే నిర్మాణాలు, తీర ప్రాంతంలోని ఇతర ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దీంతో అసలు సముద్రం ఎందుకు ఇంత దూరం వెనక్కి వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సాధారణంగా సముద్రం ముందుకు వెనక్కి కదలడం సహజమే. చంద్రుడి గురుత్వాకర్షణ, సూర్యుడి ప్రభావం, గాలుల వేగం, సముద్ర ప్రవాహాలు, స్థానిక భౌగోళిక పరిస్థితుల కారణంగా టైడ్స్ (ఆటుపోట్లు) ఏర్పడుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఆటుపోట్ల సమయంలో సముద్రం గణనీయంగా వెనక్కి వెళ్లినట్లు కనిపించవచ్చు. అయితే అర్జెంటీనాలో నమోదవుతున్న ఈ స్థాయి మార్పు మాత్రం సాధారణ దృశ్యానికి భిన్నంగా ఉండటంతో పర్యావరణ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ పరిణామం రెండు రోజులు పాటు రాత్రి సమయంలోనే కనిపిస్తుండటమే ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. సముద్రపు నీరు వెనక్కి వెళ్లిన సమయంలో బయటపడుతున్న ప్రాంతాల్లో గతంలో నీటిలో కనిపించని నిర్మాణాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో స్థానికులు ఈ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.Argentina’s Sea “Disappears” The Real Reason Behind the Shocking Retreat! 😢😲 pic.twitter.com/n2qPtDBVzU— The MES Times (@themestimes) September 11, 2026అయితే సముద్రం ఇలా వెనక్కి వెళ్లిందంటే వెంటనే సునామీ వస్తుందనే అర్థం కాదు. సముద్ర మట్టంలో అసాధారణ మార్పులకు అనేక సహజ కారణాలు ఉండొచ్చు. స్థానిక టైడల్ పరిస్థితులు, గాలులు, సముద్ర ప్రవాహాలు, వాతావరణ మార్పులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అసలు కారణాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. అదే సమయంలో పర్యావరణవేత్తలు ఈ పరిణామాలను తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు, తీర ప్రాంతాల్లో మార్పులు, వాతావరణంలో అసాధారణ పరిస్థితులు నమోదవుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ముందు జాగ్రత్తే మేలు’ అన్నట్టుగా తీర ప్రాంతాల్లో ఇలాంటి అసాధారణ మార్పులు కనిపించినప్పుడు అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలించడం అవసరం.మొత్తంగా.. అర్జెంటీనాలో సముద్రం ఏకంగా 23 కిలోమీటర్ల మేర వెనక్కి తగ్గినట్లు కనిపించడం ఇప్పుడు ప్రకృతి వింతగా చర్చనీయాంశమైంది. ఇది పూర్తిగా సహజమైన టైడల్ ప్రభావమా? స్థానిక సముద్ర ప్రవాహాల కారణమా? లేక మరేదైనా అసాధారణ భౌగోళిక, వాతావరణ పరిస్థితి ప్రభావమా? అన్నది శాస్త్రీయ పరిశీలనతోనే తేలాల్సి ఉంది. కానీ రాత్రివేళ సముద్రం వెనక్కి వెళ్లి.. పగలు నీటిలో దాగిపోయే దృశ్యాలు మాత్రం అర్జెంటీనాలో ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.The sea vanished without a sound. Ships that once floated now lean helpless on cracked mud, their hulls tilted under an empty sky. No waves. No warning. Only the wet silence of a world the ocean abandoned and the quiet dread of whatever comes next when the water decides to… pic.twitter.com/v0PO6g2bqK— Arif Dawood (@aridwd) September 10, 2026ఇదీ చదవండి: జపాన్ సముద్రంవైపు దూసుకెళ్లిన కిమ్ రాకెట్ -
9/11కు 25 ఏళ్లు.. అల్‌ఖైదా సంచలన వీడియో!
అమెరికా సెప్టెంబర్ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ అల్‌ఖైదా విడుదల చేసిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు లాడెన్ కొడుకు హమ్జా అందులో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడేళ్ల కిందటే.. అమెరికా ఆపరేషన్‌లో అతను హతమైనట్లు ఇంతకాలం అంతా భావించారు. అయితే ఇప్పుడు వీడియో ద్వారా అల్‌ఖైదా ఏం సందేశం ఇచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొంది.అల్‌ఖైదా మీడియా విభాగం ‘అస్-సహాబ్’ 50 నిమిషాల వీడియో రిలీజ్ చేసింది. అందులో హమ్జా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఏడేళ్ల క్రితం ముగిసిందనుకున్న అతడి కథపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ‘ఎ క్వార్టర్ సెంచరీ ఆఫ్ ది 11 సెప్టెంబర్ రైడ్స్’ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో హమ్జా బిన్ లాడెన్‌తో పాటు 2022లో అమెరికా ఆపరేషన్‌లో హతమైన అల్‌ఖైదా చీఫ్ అయ్మన్ అల్-జవహిరి దృశ్యాలు కూడా ఉన్నారు.వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉండగా మట్టి గోడ ముందు కూర్చుని కనిపిస్తాడు. అతడిని ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా చూపించేలా ఈ దృశ్యాలను రూపొందించినట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బిన్ లాడెన్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా అల్‌ఖైదా తన భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు కొత్తగా మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Al-Qaeda Releases New Video Featuring Hamza Bin Laden On 9/11 AnniversaryAl-Qaeda’s media arm, As-Sahab, has released a 52-minute propaganda video marking the 25th anniversary of the September 11 attacks, featuring previously unseen footage of Hamza bin Laden, the son of…1️⃣ pic.twitter.com/7uL3VYjKEx— Aamaj News English (@aamajnews_EN) September 11, 20262019లో ఏం జరిగింది?ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన హమ్జా.. అల్‌ఖైదా భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నాడని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు భావించాయి. తండ్రి మరణం తర్వాత అల్‌ఖైదా ప్రచార వీడియోలు, ఆడియో సందేశాల్లో అతడి పేరు తరచూ వినిపించింది. దీంతో అతడు సంస్థకు కీలక నేతగా మారే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.అయితే 2019 ఫిబ్రవరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అదే ఏడాది.. అనూహ్యంగా ఓ ఆపరేషన్‌లో అతను మరణించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే హమ్జా మృతిని అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించకపోవడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. సాధారణంగా కీలక నేతలు మరణించినప్పుడు సంతాప ప్రకటనలు చేసే సంస్థ.. హమ్జా విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా విడుదలైన వీడియోలో హమ్జా కనిపించడం అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడా? అనేది నిర్ధారణ కాలేదు. పైగా ఆ ఫుటేజ్ ఎప్పుడు చిత్రీకరించారన్నది తెలియదు. అతడి మరణానికి ముందు తీసిన పాత దృశ్యాలను ఇప్పుడు ప్రచార వీడియోలో ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 2025లోనూ హమ్జా బతికే ఉన్నాడంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి.కరాచీ దాడి దృశ్యాలతో మొదలువీడియో ఫుటేజీలో.. 2014లో పాకిస్థాన్‌లోని కరాచీ నేవల్ డాక్యార్డ్పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం హమ్జా పలుమార్లు కనిపిస్తాడు. పాకిస్థాన్ కేంద్రంగా అల్‌ఖైదా కార్యకలాపాలు, ప్రచార వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నొక్కిచెప్పేలా ఈ ఫుటేజ్‌ను ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హమ్జా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అల్‌ఖైదా వ్యూహం కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు. ఒసామా బిన్ లాడెన్ వారసుడిగా అతడికి ఉన్న పాత ఇమేజ్ను ఉపయోగించి సంస్థ భావజాలాన్ని కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.ముఖ్యంగా 9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001 సెప్టెంబర్ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పావు శతాబ్దం తర్వాత కూడా ఆ సంస్థ తన పాత నాయకులు, వారి వారసత్వాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: షరీఫ్ ఇంట పెళ్లి సందడి.. పాక్ జనాల్లో కొత్త భయాలు -
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. షరీఫ్ ఇంట శుభకార్యం
పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ కుమార్తె మహ్నూర్ సఫ్దార్ శనివారం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. షరీఫ్ కుటుంబంలో పెళ్లి సందడి మొదలవుతుండగా.. పాకిస్థాన్ ప్రజల్లో మాత్రం మరో ఆందోళన మొదలైంది. నవాజ్ మనవరాలు మహ్నూర్ సఫ్దార్(22) రాజకీయాల్లోగానీ, ప్రజాజీవితంలోగానీ క్రియాశీలంగా లేరు. దీంతో ఆమె వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగానే నిర్వహించాలని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పెద్దగా బయటకు వెల్లడించలేదు. ఎంగేజ్మెంట్ వివరాలను కూడా బయటకు పొక్కనివ్వలేదు. అయితే షరీఫ్ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత, గతంలో జరిగిన భారీ వేడుకల నేపథ్యంలో ఈ పెళ్లి ఇప్పుడు పాకిస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది.కొడుకు పెళ్లి వివాదంలో..మరియం నవాజ్ కుమారుడు జునైద్ సఫ్దార్ వివాహం గతంలో పాకిస్థాన్‌లో పెద్ద చర్చకే దారితీసింది. పెళ్లి వైభవం, వధువు దుస్తులు, మరియం నవాజ్ లుక్.. ఇలా వేడుకకు సంబంధించిన ప్రతి అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షరీఫ్ కుటుంబం నిర్వహించే కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అప్పట్లో ఆ పెళ్లి చూపించింది. ఇప్పుడు మహ్నూర్ వివాహం కూడా అదే స్థాయిలో ఘనంగా జరుగుతుందా? అనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. “మళ్లీ ఆ ఖర్చుల భారం సామాన్యులపై పడుతుందా?” అన్న సందేహం మరోవైపు పాక్ సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.లండన్ పర్యటనతో మొదలైన వివాదంఈ చర్చకు తాజాగా మరో కారణం కూడా తోడైంది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరియం నవాజ్ ఇటీవల లండన్ వెళ్లారు. ఈ పర్యటనకు ప్రభుత్వ విమానాన్ని వ్యక్తిగత కార్యక్రమం కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈ ఆరోపణలపై పంజాబ్ మంత్రి అజ్మా బుఖారీ స్పందించారు. మరియం ప్రయాణానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఆమె వ్యక్తిగతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై భారం పడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఆ వివాదం పాకిస్థాన్‌లో ఇంకా చర్చలో ఉండగానే మహ్నూర్ పెళ్లి వార్త రావడం ఆసక్తిని పెంచింది.ఖజానాపై అప్పుల భారంప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి సామాన్యులకు అంత సులభంగా లేదు. దేశం భారీ అప్పుల భారంతో సతమతమవుతోంది. 2025 జూన్ నాటికి పాక్ ప్రజా రుణభారం జీడీపీలో దాదాపు 70.7 శాతంగా నమోదైంది. ఇక 2026–27 బడ్జెట్లో అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.8.05 ట్రిలియన్ కేటాయించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ధరల పెరుగుదల, జీవన వ్యయ భారం, ఉపాధి సమస్యలు, విద్యుత్ బిల్లులు వంటి అంశాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ బడ్జెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో.. పాలక కుటుంబాల విలాసవంతమైన వేడుకల వార్తలు సహజంగానే సామాన్యుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లిని పాకిస్థానీయులు కేవలం ఓ కుటుంబ వేడుకగా చూడటం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారకూడదన్నదే వారి ప్రధాన ఆవేదనపాక్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబంపాకిస్థాన్ రాజకీయాల్లో షరీఫ్ కుటుంబం అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటి. నవాజ్ షరీఫ్ దేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన తమ్ముడు షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు అబ్బాస్ షరీఫ్ వ్యాపారవేత్తగా, రాజకీయంగానూ వ్యవహరించారు. నవాజ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక షెహబాజ్ కుమారుడు హమ్జా షెహబాజ్ గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతోపాటు పలు కీలక రాజకీయ పదవులు చేపట్టారు. మరో కుమారుడు సులేమాన్ షెహబాజ్ కూడా కుటుంబ వ్యాపారాల్లో కీలకంగా ఉన్నారు. ఇలా షరీఫ్ కుటుంబానికి చెందిన పలువురు తరతరాలుగా పాక్ రాజకీయాలతో పాటు వ్యాపార రంగాల్లో ప్రభావం చూపుతున్నారు.ఇదీ చదవండి: తప్పుడు పనితో జైలు పాలైన భారతీయుడు -
జపాన్ సముద్రం వైపు దూసుకెళ్లిన ఉత్తర కొరియా క్షిపణి
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా తాజాగా శనివారం (సెప్టెంబరు 12) జపాన్ సముద్రం వైపు గుర్తుతెలియని క్షిపణిని ప్రయోగించింది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ముగిసిన మరుసటి రోజే ఈ ప్రయోగం జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5.20 గంటల సమయంలో ప్రయోగాన్ని గుర్తించారు. అది సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించింది. కొరియన్లు తూర్పు సముద్రంగా పిలిచే ప్రాంతం వైపు దూసుకెళ్లినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) వెల్లడించింది.ప్రయోగం అనంతరం దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశం నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను వెంటనే నిలిపివేయాలని ఉత్తర కొరియాను కోరింది. ఇలాంటి చర్యలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ఉల్లంఘన అని పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఐదు రోజుల పాటు నిర్వహించిన ‘ఫ్రీడం ఎడ్జ్’ సంయుక్త సముద్ర విన్యాసాలు శుక్రవారం ముగిశాయి. దక్షిణ కొరియా తీరానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ విన్యాసాలు జరిగాయి. వీటిని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది.తమ దేశంతో పాటు ప్రాంతీయ దేశాలకు ఇవి ముప్పుగా అభివర్ణించింది. అధికారం పరంగా బలమైన ప్రతిచర్యలు తీసుకునే సామర్థ్యం తమకు ఉందని ఉత్తర కొరియా రక్షణ మంత్రి కిమ్ సాంగ్ గి హెచ్చరించారు. అమెరికా పసిఫిక్ కమాండ్ స్పందిస్తూ.. ప్రయోగం గురించి తమకు సమాచారం ఉందని తెలిపింది. ప్రస్తుత అంచనాల ప్రకారం అమెరికా సిబ్బంది, భూభాగం, మిత్రదేశాలకు తక్షణ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే మిత్రదేశాలతో సన్నిహితంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం కావాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: గణేశ్ ఉత్సవాల్లో.. అష్టవినాయక యాత్ర అంటే ఏమిటి? -
‘మరో దారి లేదు..’ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై తమ సైనిక చర్యను ఉగ్రవాదంపై పోరులో భాగంగా ఆయన అభివర్ణించారు. గెలుపే లక్ష్యంగా పోరాడుతున్నామని.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభంపై పూటకో ప్రకటన చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.9/11 దాడులకు పాతికేళ్లు పూర్తైన సందర్భంగా వాషింగ్టన్‌లోని పెంటగాన్‌లో జరిగిన స్మారక కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 నాటి ఉగ్రదాడులను గుర్తుచేసుకుంటూ.. పెంటగాన్‌పై దూసుకొచ్చిన హైజాక్ విమానంలో 64 మంది, భవనంలో 125 మంది మరణించిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు. ‘వార్ ఆన్ టెర్రర్’లో సేవలందించిన అమెరికా సైనికులకు నివాళులర్పించిన ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యను కూడా ప్రస్తావించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని పొందకుండా అమెరికా సైనికులు పనిచేస్తున్నారని చెప్పారు.9/11 విషాదాన్ని, ఇరాన్‌పై యుద్ధాన్ని నేరుగా ముడిపెడుతూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోం. అందుకే ఈరోజు పోరాడుతున్నాం. మనకు మరో మార్గం లేదు. విజయం తప్ప మరోటి ఉండదు. మేం గట్టిగా పోరాడతాం. గెలవడానికి పోరాడతాం’’ అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం ఆరు నెలలకు పైగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. వరుస సైనిక దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికాలోనూ ఈ యుద్ధంపై రాజకీయంగా తీవ్ర చర్చ, వ్యతిరేకత కొనసాగుతోంది.ట్రంప్ తీరుపై విమర్శలు9/11 వార్షికోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరోలో జరిగే ప్రధాన స్మారక కార్యక్రమానికి ట్రంప్ హాజరుకాకుండా వాషింగ్టన్లోనే ఉండటంపై విమర్శలు వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ న్యూయార్క్ వెళ్లి వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.పెంటగాన్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం దాదాపు 20 నిమిషాల పాటు సాగింది. అమెరికా ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను ప్రస్తావిస్తూ.. ‘‘అమెరికా ఈరోజు పరీక్షను ఎదుర్కొంటోంది. ఆ పరీక్షలో మనం ఘనంగా విజయం సాధిస్తున్నాం’’ అని చెప్పారు. అయితే 9/11 దాడుల సమయంలో, అనంతరం అమెరికాకు మద్దతుగా నిలిచిన మిత్రదేశాల సహకారాన్ని ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.‘ఇరాన్ రక్షణ వ్యవస్థలు కుప్పకూలాయి’అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా పెంటగాన్ కార్యక్రమంలో ఇరాన్‌పై కఠిన వ్యాఖ్యలు చేశారు. దాదాపు అర్ధ శతాబ్దంగా అమెరికా నాశనాన్ని కోరుకుంటున్న ‘‘ఇస్లామిక్ థియోక్రసీ’’గా ఇరాన్‌ను అభివర్ణించారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం ఇప్పటికీ ఉగ్రవాదులను వారు చేరాల్సిన చోటుకు పంపుతున్నాం. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకుండా చూస్తున్నాం. ఆర్థిక ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది’’ అని హెగ్సెత్ అన్నారు. 9/11 తర్వాత మొదలైన ‘‘చెడుపై పోరాటం’’ ఇంకా కొనసాగుతోందని, అది ‘‘జడ్జ్మెంట్ డే’’ వరకు కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.అమెరికాలోనూ ముప్పు పొంచి ఉందని హెగ్సెత్ హెచ్చరించారు. విదేశాల్లో, దేశంలో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులతో పాటు అమెరికా శక్తిని బలహీనపర్చాలని, అమెరికన్లను చంపాలని చూస్తున్న శత్రువులపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ట్రంప్ నాయకత్వంలో ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నామని చెప్పిన ఆయన.. దేశ సేవకు సిద్ధంగా ఉండే ‘‘బలమైన, ధైర్యవంతమైన యోధుల’’ కొత్త తరం అవసరమని పేర్కొన్నారు.సౌదీ అరేబియాపై చర్యకు డిమాండ్మరోవైపు న్యూయార్క్‌లో జరిగిన 9/11 స్మారక కార్యక్రమంలో బాధిత కుటుంబాల తరఫున టెర్రీ స్ట్రాడా అమెరికా ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. 9/11 బాధితురాలి భర్త అయిన ఆమె.. దాడులతో సౌదీ అరేబియాకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆ దేశాన్ని బాధ్యులను చేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరారు. ‘‘ఒక్కొక్కటిగా మాకు ద్రోహాలు ఎదురవుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికీ దాన్ని మార్చగలరు’’ అని స్ట్రాడా అన్నారు. అమెరికాతో స్నేహం కోరుకుంటే 9/11 ఉగ్రవాదులతో సంబంధాలపై సౌదీ అరేబియా చేస్తున్న నిరాకరణలను ఆపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.సాధారణంగా 9/11 వార్షికోత్సవ కార్యక్రమాలు 2001లో మరణించిన దాదాపు 3,000 మందిని స్మరించుకోవడానికే పరిమితమవుతాయి. అయితే 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని సమర్థించేందుకు కూడా ఈ వేదిక ఉపయోగపడింది.ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్.. ట్రంప్ వారసుడెవరు? -
ఐరాస చీఫ్ గుటేరస్‌తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్‌తో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు, నౌకాయాన స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధి, మానవ కేంద్రీకృత కృత్రిమ మేధ(ఏఐ), ప్రపంచ ఆహార భద్రత వంటి పలు అంశాలపై చర్చించారు. బహుళ ధ్రువత్వం ప్రాముఖ్యతను వారు ప్రస్తావించారు. సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో సహా బహుపాక్షిక సంస్థల్లో సంస్కరణలు తీసుసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ నాలుగోసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆంటోనియా గుటేరస్ అభినందనలు తెలియజేశారు. గుటేరస్‌తో అద్భుతమైన సమావేశం జరిగిందని మోదీ ఎక్స్‌లో పోస్టుచేశారు. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ కార్యకలాపాలు, ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల ఆవశ్యకత వంటి అంశాలపై చర్చించానని పేర్కొన్నారు. -
దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోండి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభాన్ని చర్చలు, దౌత్య మార్గాల్లో ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌కు సూచించారు. శుక్రవారం ఇరువురు నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, ఇరాన్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొడానికి పెజెష్కియాన్ ఢిల్లీకి చేరుకున్న తర్వాత కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగింది. పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడి హోదాలో భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపైమోదీ, పెజెష్కియాన్ చర్చించారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలన్న భారతదేశ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడం, నౌకాయాన స్వేచ్ఛ, వాణిజ్య కార్యకలాపాలు, నావికుల భద్రత, సంక్షేమాన్ని పరిరక్షించడం కోసం కృషి అవసరమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితులు ఉన్నప్ప టికీ బ్రిక్స్ సమావేశాల్లో ఇరాన్ భాగస్వామ్యం వహిస్తున్నందుకు పెజెష్కియాన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఘర్షణను నివారించడానికి సహకరించాలని మోదీని ఇరాన్ అధ్యక్షుడు కోరారు. -
ఓటు కోసం అమెరికన్ వేషం..
న్యూయార్క్: ఓటేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని, అమెరికన్ పౌరుడినని ప్రమాణం చేశాడని అమెరికాలోని మినసోటాలో ఓ భారతీయుడిపై ఆరోపణలు నమోదయ్యాయి. మినసోటా డి్రస్టిక్ట్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గురువారం ఈ మేరకు రెండు అభియోగాలను ఖరారు చేసింది. ఈ ఆరోపణలు రుజువైతే ఒక్కో దానికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అమెరికాలోని మినసోటాలో ముఖేశ్‌కుమార్ సోమాభాయ్ చౌదరి 2024 నవంబరు ఐదవ తేదీకి కొంచెం అటు ఇటుగా ‘ఓటర్ సిగ్నేచర్ సర్టిఫికెట్’పై సంతకం పెట్టాడు. తాను అమెరికా పౌరుడినని ప్రమాణం చేశాడు. అయితే ఆ తరువాత జరిగిన విచారణలో అతడు అమెరికన్ పౌరుడు కాదన్న విషయం తెలిసింది. అమెరికాలో సాధారణ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటర్ల జాబితాను, తాము అమెరికన్ పౌరులమని ఇచి్చన ప్రమాణాలను తనిఖీ చేస్తారు. అనుమానిత సరి్టఫికెట్లను ఇమ్మిగ్రేషన్ సమాచారంతో సరిపోల్చి చూసుకుంటారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. ముఖేశ్‌కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. తాను అమెరికా పౌరుడిని కానని తెలిసి మరీ సంతకం పెట్టాడని కేవలం ఓటు వేసేందుకు తప్పుడు ప్రకటన ఇచ్చాడని అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ కే.ధిల్లోన్ తెలిపారు. ‘‘ఓటు హక్కు అమెరికన్ పౌరసత్వానికి లభించే పవిత్రమైన గౌరవం. అయితే అర్హులైన వారు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలోనే ఎన్నికల స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది’’అని చెప్పారు. -
బుధగ్రహం కుంచించుకుపోతోంది!
కేప్ కేనర్వాల్: సౌరకుటుంబంలోని బుధగ్రహం వేగంగా కుంచిచుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల తాజా అధ్యయనం చెబుతోంది. ద్రాక్షపండు ఎండకు ఎండి ముడుతలుపడి ఎండుద్రాక్షగా మారినట్లు! జర్మనీ ఏరోస్పేస్ సెంటర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం బుధగ్రహం ఇలా కుంచించుకుపోవడం మునుపు వేసిన అంచనా కంటే 30 శాతం ఎక్కువగా ఉంది. గ్రహం వ్యాసం 4900 కిలోమీటర్లతే.. 23 కిలోమీటర్ల మేరకు సైజు తగ్గినట్లు వీరు చెబుతున్నారు. బుధగ్రహ ఉపరితలం చాలా ఎగుడుదిగుడుగా ఉంటుంది. పైగా దీనిపైకి వచ్చిపడే ఉల్కా/గ్రహ శకలాల కారణంగా ఏర్పడే గుంతలు, వాటి నుంచి ఎగజిమ్మే శిథిలాల కారణంగా రూపురేఖలు నిత్యం మారుతూ ఉంటాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బుధ గ్రహ పరిశీలన కోసం యూరోప్, జపాన్‌లు కలిసి వారం రోజుల క్రితమే బెపికొలంబో పేరుతో ఒక అంతరిక్ష నౌకను ప్రయోగించడం. ఈ అంతరిక్ష నౌక నవంబరు నెలలో బుధగ్రహం కక్ష్యలో ప్రేవేశించనుంది. బెపీకొలంబలోని లేజర్ పరికరం అంతర్గత శీతలీకరణ కారణంగా గ్రహం ఎంత మేరకు ముడుతలు పడిందో (ఎండుద్రాక్ష చందంగా) లెక్క కట్టనుంది. సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం బుధుడు సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ అది నెమ్మదిగా కుంచించుకుపోతూనే ఉంది. -
రష్యా 5 లక్షల మంది సైనికులను పోగొట్టుకుంది
కీవ్: 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి రష్యా ఏకంగా 5 లక్షల మంది సైనికులను నష్టపోయిందని యూకే రక్షణ శాఖ అంచనా వేసింది. యుద్ధ క్షేత్రంలో 5 లక్షల మంది చనిపోగా, మరో 10 లక్షల మంది వరకు సైనికులు గాయపడ్డారని యూకే డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ సర్ రిచర్డ్ నైటన్ వెల్లడించారు. సైనిక సామగ్రిని కూడా గణనీయంగా రష్యా కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇందులో 10 వేలకు పైగా సాయుధ వాహనాలు, దాదాపు 3 వేల గగనతల, ఫిరంగి వ్యవస్థలు, 370 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు వాటిల్లిన నష్టాలను ఆయన పేర్కొనలేదు. యూకే రక్షణ శాఖ సైనిక నష్టం అంచనాపై రష్యా అధికారులు స్పందించలేదు. కాగా, ఈ ఏడాది రష్యా సైన్యం దూకుడు బాగా తగ్గిందని, ఉక్రెయిన్‌లో చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోందని పరిశీలకులు అంటున్నారు. కీవ్‌లో గ్యాస్ స్టేషన్లే లక్ష్యం రష్యా వరుసగా రెండో రోజు శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని గ్యాస్ స్టేషన్లే లక్ష్యంగా డ్రోన్ల దాడి కొనసాగించింది. రెండు గ్యాస్ స్టేషన్లపై దాడిలో ఇద్దరు చనిపోగా ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. అదేవిధంగా, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని పావ్లోహ్రాడ్ నగరంలోని షాపింగ్ మాల్స్‌పై శుక్రవారం రష్యా జరిపిన దాడిలో ఐదుగురు చనిపోగా, 67 మంది వరకు గాయపడ్డారు. జపొరిజియాలోని 9 అంతస్తుల బహుళ అంతస్తుల భవనం, ఓ షాపింగ్ మాల్‌పై రష్యా చేపట్టిన డ్రోన్ దాడిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 777 డ్రోన్లు కూల్చాం: రష్యా రష్యాలోని కీలక చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు కొనసాగిస్తోంది. సరిహద్దులకు 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని రిఫైనరీపై డ్రోన్ దాడి జరిపింది. క్రిమియా, అజోవ్, కాస్పియన్ సముద్ర జలాలు సహా 16 ప్రాంతాలపైకి ప్రయోగించిన 777 డ్రోన్లను మధ్యలోనే కూల్చినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. రాజధాని మాస్కో సమీపంలోని తులా ప్రాంతంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు గాయపడ్డారు. -
9/11... నివాళి
న్యూయార్క్: సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం న్యూయార్క్‌లోని గ్రౌండ్ జీరో వద్ద సంతాపం కార్యక్రమం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు నలుగురు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీ హాజరయ్యారు. ఉగ్రదాడిలో నేలమట్టమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలం పేరే గ్రౌండ్ జీరో. ఇక్కడ ఏర్పాటు చేసిన స్మారక చిహ్నం వద్ద ఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం హాజరైన మాజీ అధ్యక్షులు, వారి భార్యలు.. బిల్–హిల్లరీ క్లింటన్, జార్జి–లారా బుష్, బరాక్– మిషెల్ ఒబామా, జో–జిల్ బైడెన్‌తోపాటు పోలీసు, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు, మృతులు, బాధితుల బంధువులు తదితరులు హాజరయ్యారు. ఎప్పటి మాదిరిగానే ఈ సందర్భంగా 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పేర్లను ముందుగా చదివి వినిపించారు. అనంతరం ఏడు సెకన్లపాటు మౌనం పాటించారు. జంట టవర్లతోపాటు పెంటగాన్ భవానాన్ని విమానాలు ఢీకొట్టిన సమయాన్ని గుర్తు చేస్తూ గంటలు మోగించారు. టవర్లు కుప్పకూలిన సమయాలు, హైజాకర్లు విమానాన్ని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93లోని ప్రయాణికులు వారిపై ఎదురుదాడి చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సరిగ్గా అదే సమయాలకు గంటలు మోగిస్తూ మౌనం పాటించారు. దాడుల అనంతర పరిణామాలతో ఆరోగ్య సమస్యల వల్ల మరణించిన వారిని స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నగర మేయర్ మమ్దానీ ప్రారంభించారు. ముందుగా ఆయన జంట టవర్లలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో ప్రాణాలర్పించిన 300 మంది ఫైర్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం, ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సెప్టెంబర్ 11 దాడిని ‘ఒక భయానక తీవ్రవాద చర్య, అపారమైన నష్టాన్ని మిగిల్చిన రోజు’గా వర్ణించారు. ‘న్యూయార్క్ చరిత్రలోనే 9/11 అత్యంత చీకటి రోజుగా మిగిలిపోతుంది. అదేవిధంగా, ఎందరో న్యూయార్క్ వాసులు చేసిన సేవలను కూడా గుర్తు చేసుకుందాం. దాడుల తరువాత రక్తం దానం చేయడానికి గంటల తరబడి వరుసలో నిలబడిన వేలాది మంది న్యూయార్కర్ల సేవలను, బాధితుల కోసం తమ ఇళ్ల తలుపులు తెరిచిన వారిని, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సహచరులను రక్షించిన వారిని గుర్తు చేసుకుందాం’అని మమ్దానీ పేర్కొన్నారు. మనకు దూరమైన వారి విషయంలో మనకు ఒక పవిత్రమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. ‘వారు అపరిచితుల పట్ల చూపిన ఆదరణలాగే మనం కూడా ఒకరినొకరు ఆదుకోవాలి. వారు చేసిన త్యాగాలకు తగినట్లుగా జీవించాలి, వారి ధైర్యానికి తగిన నగరాన్ని ..ఒకరికొకరు తోడుగా నిలిచే నగరాన్ని నిర్మించుకోవాలి. అలా చేయడం ద్వారానే మనం వారిని సరిగ్గా స్మరించుకున్నట్లవుతుంది’అని ఆయన పేర్కొన్నారు. -
ట్రంప్ వారసుడెవరు?
డల్లాస్: డొనాల్డ్ ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసేదెవరన్న అంశంపై చర్చ మొదలైంది. మధ్యంతర ఎన్నికల సందర్భంగా రిపబ్లికన్ పార్టీ డల్లాస్‌లో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అనుకూలంగా కొన్ని నినాదాలు వినిపించడంతో ఈ చర్చ ఊపందుకుంది. వాన్స్ ప్రసంగిస్తూండగా ‘‘జేడీ..జేడీ..జేడీ’’అని ‘‘48..48..48’’అన్న నినాదాలు వినిపించాయి. అమెరికా 47వ అధ్యక్షుడు ట్రంప్ అన్నది తెలిసిందే. అయితే వాన్స్ ఈ నినాదాలకు చిరునవ్వుతో స్పందించి ‘‘నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’అని వ్యాఖ్యానించారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ వారసుడిగా సహజంగానే ఉపాధ్యక్షుడైన వాన్స్‌కు దక్కుతుందన్న వాదన ఒకటి వినిపిస్తున్నా... వాన్స్‌కు పోటీగా మరికొన్ని పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే వాన్స్ ఈ సదస్సులో భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరోవైపు.. వాన్స్ ఇప్పటికే కీలక రాష్ట్రాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను సమీకరిస్తున్నారని విస్కాన్సిన్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు బ్రియాన్ షిమ్మింగ్ చెబుతూండటం గమనార్హం. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ వంటి వారు ఇందులో ఉన్నారు. 2028లో వాన్స్–రూబియో జోడీ పోటీ చేస్తే బాగుంటుందని టెక్సాస్‌లోని ఫ్రిస్కోకు చెందిన బిల్ ష్నైడర్ భావిస్తున్నారు. వాన్స్ అధ్యక్ష అభ్యర్థిగా, రూబియో ఉపాధ్యక్ష అభ్యరి్థగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. వాన్స్ ట్రంప్ విధానాలను కొనసాగిస్తారని, ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉండటం వల్ల అధ్యక్ష పదవికి ఆయన సరైన ఎంపిక అని ష్నైడర్ అన్నారు. అయితే... ‘‘2028 అధ్యక్ష అభ్యర్థి గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం తొందరపాటు అవుతుంది. కానీ ఒకరి పేరు తప్పనిసరిగా చెప్పాలంటే నేను రాన్ డిసాంటిస్‌ను ఎంచుకుంటాను. ఫ్లోరిడాలో ఆయన అమలు చేసిన విధానాలు అమెరికాకు మార్గదర్శకంగా ఉంటాయి’’అని డల్లాస్‌కు చెందిన ఐటీ మేనేజర్ రోషెల్ బ్రూక్స్ వ్యాఖ్యానించారు. ఇంకోపక్క హ్యూస్టన్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగిని పెగ్గీ స్టాంటన్ మాత్రం రూబియోకు మద్దతు తెలిపారు. ‘‘విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ప్రతి అంశంపై స్పష్టంగా మాట్లాడతారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నాయి. ఏదో ఒక రోజు అధ్యక్షుడు అవుతారని ఎప్పటి నుంచో నమ్ముతున్నాను’’అని అన్నారు. ట్రంప్ నిర్ణయిస్తారా? 2028 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేది ఎవరన్న విషయంపై మధ్యంత ఎన్నికల సదస్సులో పాల్గొన్న వారిలో అంత స్పష్టత లేనట్టు తెలుస్తోంది. కొందరైతే ట్రంప్ ఎవరికి మద్దతు తెలుపుతారన్న దానిపై తన నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. వాన్స్, రూబియోలు ఇద్దరూ సమర్థులైనప్పటికీ ఎవరివైపు మొగ్గు చూపాలన్నది ఇప్పుడే చెప్పలేమని కొందరు చెబుతున్నారు. 2028 ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండటంతో.. అభ్యర్థులెవరూ అధికారికంగా తమ అభ్యరి్థత్వాన్ని ప్రకటించలేదు. దీంతో ట్రంప్ మద్దతు ఎవరికి లభిస్తుందోనని రిపబ్లికన్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.కొత్త ముఖాల మాటేమిటి? రిపబ్లికన్ పార్టీ శ్రేణుల్లో కొందరు ఊహించని నేతల పేర్లను కూడా ప్రతిపాదిస్తున్నారు. ట్రంప్ మద్దతున్న కెంటకీ ప్రతినిధి థామస్ మాసీని పార్టీ నాయకుడిగా చూడాలని ‘వెటరన్స్ ఫర్ అమెరికా ఫస్ట్’సంస్థకు చెందిన కింబర్లీ మోయర్స్ అన్నారు. గ్రాండ్ ప్రెయిరీకి చెందిన దినా, కెవిన్ మైయర్స్ దంపతులు టెక్సాస్ రిపబ్లికన్ ప్రతినిధి బ్రాండన్ గిల్ పేరును ప్రస్తావించగా డెలావేర్కు చెందిన ఆంథనీ జాన్స్టన్ వాన్స్ మేలు అంటున్నారు. ట్రంప్ అధికార అవధి దగ్గరవుతున్న నేపథ్యంలో.. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడే నాయకత్వ పోటీ మొదలైనట్లు కనిపిస్తోంది. అయితే చివరకు ఎవరు బరిలోకి దిగుతారన్నది పార్టీ అంతర్గత సమీకరణాలు, మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండనుంది. -
2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. ప్రస్తుతం 65 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది. రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది. చర్చలు, దౌత్యమే సరైన మార్గం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు. రష్యా మార్కెట్లో అవకాశాలు ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి. మోదీ, పుతిన్ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్ మండపంలో బిజినెస్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్ మండపంలో ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు. పరస్పర సహకారంపై చర్చించా: మోదీ మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్‌తో చర్చించానని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు. పుతిన్‌కు ‘తిరుక్కురళ్’బహూకరణ ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్’రష్యన్ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్‌కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పుతిన్‌తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్చేశారు. -
సౌదీలో ఆయిల్ పైప్‌లైన్ టార్గెట్.. పెరుగుతున్న టెన్షన్
అంతర్జాతీయం: సౌదీ అరేబియాలోని కీలక చమురు పైప్‌లైన్ వ్యవస్థపై గురువారం రోజున దాడి జరిగింది. పైప్‌లైన్‌కు సమీపంలోని పంపింగ్ స్టేషన్లను ప్రాజెక్టైల్స్‌తో లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా వర్గాల సమాచారం. దీంతో దాడి దాడి విషయంలో ముందుజాగ్రత్త చర్యగా పైప్‌లైన్ కార్యకలాపాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పైప్‌లైన్ భద్రతను పరిశీలించడంతోపాటు నష్టాన్ని అంచనా వేసే పనిలో ప్రత్యేక బృందాలు నిమగ్నమయ్యాయి.అలాగే, దాడి ప్రభావం శాటిలైట్ చిత్రాల్లోనూ కనిపించింది. ఓ పంపింగ్ స్టేషన్ వద్ద భారీగా మంటలు చెలరేగిన ఆనవాళ్లు కనిపించగా.. మరో స్టేషన్ వద్ద గురువారం దట్టమైన నల్ల పొగలు వెలువడ్డాయి. అయితే పైప్‌లైన్ ప్రధాన భాగానికి ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. పంపింగ్ స్టేషన్లకు మాత్రమే నష్టం జరిగితే మరమ్మతులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. దాడికి పాల్పడింది ఎవరన్నదానిపై స్పష్టత రాలేదుఅయితే ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లతో దాడి జరిగి ఉండొచ్చని అమెరికా వర్గాల అంచనా. గతంలో ఇరాన్‌కు అనుకూలంగా ఉండే ఇరాక్ మిలీషియా గ్రూపులు సౌదీ అరేబియాపై డ్రోన్లతో దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుత దాడి కూడా అలాంటదే అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అమెరికా అధికారులు సేకరిస్తున్నారు.అమెరికా–ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సౌదీ చమురు మౌలిక వసతులపై జరిగిన ఈ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇంచుమించుగా మూసివేయడంతో.. పెర్షియన్ గల్ఫ్ నుంచి నౌకల ద్వారా ఎగుమతి కావాల్సిన సౌదీ చమురులో రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్లను ఈస్ట్–వెస్ట్ పైప్‌లైన్‌తో ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టుకు తరలిస్తున్నారు. దీంతో సౌదీ చమురు ఎగుమతులకు ఈ పైప్‌లైన్ కీలక మార్గంగా మారింది. మరోవైపు హౌతీ యోధులు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ఎర్ర సముద్రం మార్గంపైనా ఆందోళనలు కొనసాగుతున్నాయి.పైప్‌లైన్ కార్యకలాపాలు ఎప్పటికి తిరిగి ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతానికి తెలియరాలేదు. ఇదే సమయంలో సౌదీ అరేబియా ముడి చమురు ఉత్పత్తి గత నెలలో 1990 తర్వాత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఒపెక్‌కు సమాచారం అందింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఇప్పటికే బ్యారెల్‌కు 100 డాలర్లను దాటాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ చమురు రవాణా వ్యవస్థపై దాడి జరగడం ప్రపంచ చమురు సరఫరాపై మరింత ఆందోళనకు దారితీస్తోంది.ఇవి కూడా చదవండి: ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌కు బిగ్ షాక్ -
ఇజ్రాయెల్‌పై యుద్ధంలో ఇరాన్‌కు బిగ్ షాక్
లెబనాన్: గోటి చుట్టు రోకటి పోటులా ఇరాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లాకు కోలుకోలేని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’ లో తమ అధినేత హాసన్ నస్రల్లాను పోగొట్టుకుని తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సంస్థకు.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మరో కోలుకోలేని దెబ్బకొట్టింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ సృష్టించిన భీకర ‘కృత్రిమ భూకంపం’ ధాటికి హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన వ్యూహాత్మక భూగర్భ స్థావరాలు, కమాండ్ సెంటర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.అంతర్జాతీయ కథనాల ప్రకారం.. దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో ఈ భూప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన భూకంపం కాదని, ఇజ్రాయెల్ సైన్యం జరిపిన అత్యంత భారీ భూగర్భ పేలుళ్ల వల్లే ఈ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి.సరిహద్దుల్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా నిర్మించుకున్న భారీ భూగర్భ సొరంగాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం ఈ వినాశకర దాడి చేపట్టింది. అలీ అల్-తాహర్ పర్వత శ్రేణి సమీపంలో ఏకంగా 1,100 టన్నుల (1.1 మిలియన్ కిలోల) అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి హెజ్బొల్లా బంకర్లను ఒకేసారి పేల్చివేశారు.ఈ భారీ పేలుడు ధాటికి పుట్టిన షాక్‌వేవ్స్ భూమి లోపల 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రయాణించడంతో, ఆ తీవ్రతకు సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ ఆర్థిక,సాంకేతిక సాయంతో గత రెండు దశాబ్దాలుగా (20 ఏళ్లుగా) హెజ్బొల్లా నిర్మించుకున్న దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన అత్యాధునిక అండర్‌గ్రౌండ్ నెట్వర్క్ ఈ దాడిలో నాశనమైంది.ఇది హెజ్బొల్లాకు చెందిన అత్యంత కీలకమైన ‘బద్ర్’ప్రాంతీయ విభాగానికి ప్రధాన కమాండ్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. ఇక్కడే భారీగా దాచి ఉంచిన క్షిపణులు, డ్రోన్లు, యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, వందలాది ల్యాండ్ మైన్స్ ఈ పేలుడుతో పాటు గాల్లో కలిసిపోయాయి. భూగర్భంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించడంతో ఆ ప్రకంపనలు పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న లెబనాన్ నగరాల వరకు తాకాయి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌లోని నబాటియా ప్రాంత పరిధిలో ఉన్న భవనాలు తీవ్రంగా ఊగిపోవడంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూగర్భంలో జరిగిన ఈ భారీ విస్ఫోటనం వల్ల స్థానికంగా భూమిపై పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడ్డాయని, పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లిందని రక్షణ నిపుణులు,శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.👉ఇదీ చదవండి : ఇరాన్ పికాక్స్.. ట్రంప్‌కు ఎందుకంత పట్టుదల? -
58 ఏళ్ల వయసులో మంగోలియా అధ్యక్షుడి బరువులు ఎత్తే ఫీట్..! వీడియో వైరల్
మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నాగిన్ ఖురెల్సుఖ్ తన అద్భుత వర్కౌట్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. అది కూడా ఎలాంటి జిమ్ దుస్తులు లేకుండా ఫార్మల్ దుస్తుల్లోనే బరువులు ఎత్తే ఫీట్ చేయడం విశేషం. గతంలో ఆర్మీ అధికారిగా పనిచేసిన ఈయన సైనిక విభాగం సందర్శనలో భాగంగా ఈ ఫీట్‌ని చేశారు. అక్కడ ఆయన ఏకంగా వంద కిలోల బరువుని సూట్ జాకెట్ తొలగించి ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 20సార్లు బెంచ్ ప్రెస్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట అమితంగా వైరల్ అవ్వడంతో నెటిజన్లంత అధ్యక్షుడి బలం, ఫిట్నెస్కి ఫిదా అవ్వుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వైరల్ వీడియో ఖరెల్సుఖ్ ఫార్మల్ సూట్ ధరించి బరువులు ఎత్తే బెంచ్ పక్కన నిలబడం చూడొచ్చు. కాసేపటి తర్వాత తన చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే జాకెట్ తీసివేసి బెంచ్‌పై పడుకున్నారు. ఆ తర్వాత సుమారు వంద కిలో బెంచ్ ప్రెస్ చేయడం ప్రారంభిస్తారు. ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుమారు 20 రిపిటేషన్లు అత్యంత సునాయాసంగా చేసేశారు'. ఆ ఫీట్ పూర్తికాగానే అక్కడ ఉన్న అధికారులు, సైనికులతో కరచాలనం చేయడం స్ఫష్టంగా కనిపస్తుంది వీడియోలో. కాగా ఈ మంగోలియా నాయకుడు 2021 నుంచి దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడానికి ముందు ప్రధానమంత్రితో సహా పలు కీలక రాజకీయ పదవులను అలంకరించారు. అలాగే ఆయనకు బాడీబిల్డింగ్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం ఉంది. తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిచడానికి ముందు మంగోలియన్ పీపుల్స్ ఆర్మీలో కూడా పనిచేశారు. అంతేగాదు ఆయనకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఆయన పాల్స్ అనే రాక్‌బ్యాండ్‌లో గిటారు వాయిస్తారనేది అధికారిక వర్గాల సమాచారం. ఐదుపదులు దాటిన తర్వాత ఇలాంటివి చేయొచ్చా..58 ఏళ్ల వయసులో బరువుల ఎత్తడం అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అయితే ప్రమాదకరమైన బరువులు మాత్రం ఎత్తడం మంచిది కాదనే చెబుతున్నారు. ఇలాంటివి చేయాలనుకున్నప్పుడూ.. నిపుణులు పర్యవేక్షణ, సలహాలు, సూచనలతో ఎత్తడం మంచిదని సూచిస్తున్నారు. అదీగాక వయసు పెరిగే కొద్దీ సహజంగా శరీరంలో కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గుతాయి. అందువల్ల 50 ఏళ్లు దాటిన వారికి వెయిట్ ట్రైనింగ్ అత్యంత అవసరం అని నొక్కి చెబుతున్నారు ఆరోగ్య నిపుణులుThe President of Mongolia: Ukhnaagiin Khürelsükh, 100 kg, bench presses 20 reps - this is just too badass! pic.twitter.com/TPzqcp9nL0— Mr BundelKhandi (@BundelKhandee) September 10, 2026 (చదవండి: నో స్కూల్, నో సిలబస్, నో స్క్రీన్! ఉత్తరాఖండ్ దంపతుల సరికొత్త పేరెంటింగ్ పాఠాలు) -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో అడుగుపెట్టారు. 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. భారత్ మండపంలో ఇవాళ(శుక్రవారం) ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ భేటీ అయ్యారు. భారత్, రష్యా ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిపారు. కీలక రక్షణ ఒప్పందాలు, వ్యాపారం, వాణిజ్యం, భద్రత, ఎల్ఎన్జీ దిగుమతి, అధునాతన యుద్ధ విమానాల తయారీ సాంకేతికత బదిలీ తదితర అంశాలపై చర్చించారు. రెండు నెలల్లోనే రెండోసారి ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పుతిన్‌కు మోదీ కానుకద్వైపాక్షిక భేటీలో పుతిన్‌కు రష్యన్ భాషలో అనువదించిన ఓ పుస్తకాన్ని ప్రధాని మోదీ కానుకగా అందించారు. తమిళ కవి తిరువళ్లువరు రచించిన ‘తిరుక్కురళ్’ పుస్తకాన్ని అందజేశారు. పుతిన్ మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. కాగా, బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ నిర్ధారించింది.జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు.ఇదీ చదవండి:బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..! -
సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్
హూతీలపై అమెరికా దాడులు చేయాలంటూ రెండుసార్లు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక వెల్లడించింది. ఎర్ర సముద్రంలో కీలకమైన బాబ్ అల్-మందెబ్ జలసంధికి హూతీలు చేరువవుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా నేరుగా ఈ పోరాటంలో జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని ట్రంప్ ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు నివేదిక తెలిపింది.బాబ్ అల్ మందెప్ జలసంధి దిశగా హూతీలు ప్రవేశిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రంప్ బృందంలోని ఓ సీనియర్ అధికారి మట్లాడుతూ.. ఎర్ర సముద్రాన్ని తెరిచి ఉంచడం అమెరికా ప్రధాన ప్రాధాన్యత. అయితే, విస్తృత స్థాయి పోరాటాన్ని ప్రాంతీయ భాగస్వాములే నిర్వహించాలన్నది అమెరికా విధానం. ఎర్ర సముద్రంలో నౌకా రాకపోకల స్వేచ్ఛ, మా ప్రధాన జాతీయ భద్రతా ప్రయోజనాల పరిరక్షణపై అమెరికా దృష్టి సారించింది. అదే సమయంలో ప్రాంతీయ భద్రతా సవాళ్లను పరిష్కరించడంలో ప్రాంతీయ భాగస్వాములు ముందుండేలా మేము వారికి మద్దతు ఇస్తున్నామని ఆయన తెలిపారు.మొఖా నుంచి బాబ్ అల్-మండెబ్ జలసంధి సుమారు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) దూరంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్‌తో కలిపే ఈ జలసంధి ద్వారా సాధారణంగా ప్రపంచ వాణిజ్య వస్తువుల్లో సుమారు 12 శాతం రవాణా అవుతాయి. సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వ దళాలను హూతీ బలగాలు దక్షిణం వైపు ధుబాబ్ ప్రాంతానికి వెనక్కి నెట్టాయని ఇద్దరు యెమెన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
అమ్మ చివరి చూపు దక్కలేదు.. కృష్ణుడి పాదాల చెంత కన్నీళ్లు!
దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్‌కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్‌ను బయటకు తీసుకొచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్‌కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.Heartbreaking 💔…!Hindu monk Chinmoy Krishna Das Taken into custody again In BANGLADESHHe was out on parole for few hours to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.ఆరు క్రిమినల్ కేసులుబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్‌ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్‌పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్‌పైనా స్టే కొనసాగుతోంది.బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి? -
జిన్‌పింగ్ భారత్ పర్యటనపై సస్పెన్స్.. చైనా వ్యూహం ఇదేనా?
దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.చివరి నిమిషం వరకు ఎందుకు?జిన్‌పింగ్ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్ డిక్లరేషన్, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.NOW:🇨🇳🤝🇮🇳 Chinese President Xi Jinping is coming to India for the first time post Covid for BRICS summit. pic.twitter.com/8CkwJ8MeLu— RealWestern (@RealWestern2003) September 11, 2026భేటీలో ఏం జరుగుతుంది?అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.బ్రిక్స్ వేదికగా చైనా మరో వ్యూహంబ్రిక్స్లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన వెనుక అసలు ఫోకస్ బ్రిక్స్ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్ -
జీవాయుధాల నుంచి మిసైళ్ల తయారీ?.. సంచలన నివేదిక!
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మానవాళి అభివృద్ధికి తార్కానంగా నిలిచే ఈ సాంకేతిక కారణంగా మంచి ఎంత ఉందో.. చెడు అంతే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నైపుణ్య కార్మికుల జీవనోపాదిని ఏఐ పెద్దఎత్తున కొల్లగొడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర నివేదిక ప్రచురితమవుతుంది. మనిషిలో వ్యాధికి కారకాలైన ప్రమాదకరమైన పాథోజెన్లపై పరిశోధనకు సైంటిస్టులు ఏఐ సాయం కోరినట్లు నివేదికలో తేలింది. జంతువులపై చికెన్ గున్యా వైరస్‌పై పరిశోధనకు ఏఐ వినియోగం జరిగిందని తెలుస్తోంది. అదేవిధంగా మిసైళ్లు, డ్రోన్లు, బాంబుల డిజైన్ల కోసం ఏఐ వాడుతున్నారని, ఇరాన్, రష్యా దేశాలకు చెందిన ముఠాలు తప్పుడు ప్రచారాల కోసం దీనిని వినియోగిస్తున్నట్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏఐ సామర్థ్యాలు పెరిగే కొద్ది బయో, సైబర్, సైనిక రంగాలకు ముప్పు పొంచి ఉందని దీంతో ఏఐ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.డిసెంబర్ 2025 నుంచి ఆగస్టు 2026 వరకు ఏఐ ప్రమాదకర విషయాలను గుర్తించి అడ్డుకున్న ఘటనలపై ఆసంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. ఇంజోసో ప్రభుత్వాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న సంస్థలు, సైబర్ నేరగాళ్లు, ప్రచార నెట్‌వర్క్‌లు, స్పైవేర్ విక్రేతలు, రాజకీయంగా ప్రేరేపిత వ్యక్తులు Claudeను దుర్వినియోగం చేసేందుకు చేసిన ప్రయత్నాలను వివరించింది. Claude Haiku, Sonnet, Opus మోడళ్లను ఉపయోగించిన ఈ ఘటనల్లో గూఢచర్యం, భారీ స్థాయి నిఘా, సైబర్ దాడులు, ఆయుధాల అభివృద్ధి, బయోవెపన్స్ పరిశోధన, తప్పుడు ప్రచారం, డేటా చోరీ వంటి కార్యకలాపాలు ఉన్నాయి. జీవశాస్త్ర పరిశోధనలో ప్రత్యేకంగా ఆందోళనకరమైన కేసులు బయటపడ్డాయి.ఒక శాస్త్రవేత్త చికున్‌గున్యా వైరస్‌ను జంతువుల్లో పదేపదే సంక్రమించేలా చేసి మరింత ప్రమాదకరంగా మార్చే gain-of-function పరిశోధనకు గ్రాంట్ దరఖాస్తు తయారు చేయమని కోరగా, ఆంత్రోపిక్ దాన్ని అడ్డుకుంది. అయితే వినియోగదారు మూడో పక్షం ద్వారా భద్రతా నియంత్రణను తప్పించుకున్నాడు. మరో సందర్భంలో Opus మోడల్‌ను ఉపయోగించి ఆర్థోపాక్స్ వైరస్ల రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే పరిశోధనకు సంబంధించిన గ్రాంట్ దరఖాస్తును రూపొందించారు.ఆయుధాల తయారీ, సైనిక కార్యకలాపాల్లోనూ క్లౌడ్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరిగాయని నివేదిక చెబుతోంది. చైనా, రష్యా, యెమెన్‌కు సంబంధించిన ఆరు కేసులను ఆంథ్రోపిక్ గుర్తించింది. యెమెన్‌లోని ఒక బృందం మానవ ఇంజినీర్లకు బదులుగా క్లౌడ్ కోడ్ సహాయంతో 2 వేల కిలోమీటర్లకు పైగా పరిధి లక్ష్యంగా పెట్టుకున్న బహుళ దశల బాలిస్టిక్ క్షిపణి, హైపర్సోనిక్ గ్లైడ్ వాహనానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసిందని పేర్కొంది. అయితే ఆ రాకెట్ పరీక్షించగా అది విఫలమైనట్లు సంస్థ తెలిపింది.భారీ స్థాయి నిఘా, గూఢచర్యంలోనూ Claude వినియోగం కనిపించిందని సంస్థ పేర్కొంది. మొత్తం తొమ్మిది నిఘా కేసులను గుర్తించింది. చైనాతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన ఒక బృందం ఉయ్ఘర్ ప్రజలు, జర్నలిస్టులను ట్రాక్ చేసి వారి ప్రొఫైళ్లు రూపొందించేందుకు WhatsApp, Telegram నుంచి సేకరించిన డేటాను ఉపయోగించిందని..తప్పుడు సమాచార ప్రచారాలు, డేటా చోరీ, నకిలీ డేటింగ్ యాప్‌లు, ప్రత్యర్థి AI సంస్థల మోడల్-శిక్షణ కోసం Claudeను దుర్వినియోగం చేయడం వంటి ఘటనలను కూడా ఆంత్రోఫిక్ వెల్లడించింది. దీంతో ఏఐ వినియోగంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
రాకెట్లా దూసుకుపోతున్న ముడిచమురు ధరలు
పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. హర్ముజ్ సహా కీలకమైన సముద్ర మార్గాల్లో వరుస దాడులు, చమురు రవాణాకు అంతరాయాల భయాలు మార్కెట్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ చమురు ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఒక్కరోజే 6 శాతానికి పైగా ఎగబాకిన ధరలు.. శుక్రవారం కూడా పైపైకి కదిలాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 108.68 డాలర్లకు చేరింది. అంటే 110 డాలర్ల మార్క్‌కు అత్యంత చేరువలో ఉంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 103.45 డాలర్లకు చేరింది. ఈ రెండు బెంచ్‌మార్క్‌లు మే మధ్య తర్వాత తొలిసారిగా వారాన్ని 100 డాలర్లకు పైన ముగించే దిశగా సాగుతున్నాయి.పశ్చిమాసియాలో ఇటీవలి కాలంలో మళ్లీ తీవ్రత పెరిగిన పోరుతో చమురు సరఫరాపై అనిశ్చితి పెరిగింది. ముఖ్యంగా కీలక సముద్ర మార్గాల్లో చమురు ట్యాంకర్లు, ఇతర నౌకలపై దాడులు పెరగడం మార్కెట్‌ను కలవరపెడుతోంది. గురువారం బ్రెంట్, WTI ధరలు రెండూ 6 శాతానికిపైగా పెరిగాయి. వారాంత ప్రాతిపదికన చూస్తే రెండు సూచీలు దాదాపు 13 శాతం మేర లాభపడ్డాయి.ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించినప్పటికీ.. ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, ఇరాన్ రెండూ వెనక్కి తగ్గే ఉద్దేశం లేదన్న సంకేతాలు ఇస్తుండటంతో ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చన్న అంచనాలు పెరిగాయి.హర్ముజ్ నుంచి ఎర్ర సముద్రం వరకు..ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు ఇప్పటికే పరిమితమయ్యాయి. మరోవైపు యెమెన్‌లో ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీలు మొచా పోర్టుపై నియంత్రణ సాధించడం ఎర్ర సముద్ర మార్గంపై కొత్త ఆందోళనలకు దారితీసింది. సెప్టెంబర్ 10న ఒమన్ సమీపంలో రెండు నౌకలు గుర్తుతెలియని ప్రాజెక్టైళ్ల దాడికి గురైనట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. ఇరాన్ సమీప సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లపై దాడి చేయడం, అనంతరం ఇరాన్ పలు నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించడం.. చమురు రవాణాపై ముప్పును మరింత పెంచాయి.ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని ఇంధన మౌలిక వసతులపై హౌతీల దాడులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో మిడిల్ఈస్ట్ నుంచి చమురు సరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.చైనా కొనుగోళ్లతో మరింత మంట..సరఫరా ఆందోళనలకు తోడు డిమాండ్ వైపు పరిణామాలు కూడా క్రూడాయిల్ ధరలకు మద్దతు ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ దిగుమతిదారు అయిన చైనా ఇటీవలి వారాల్లో కొనుగోళ్లను పెంచింది. చైనా ఇదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తే.. సరఫరా అంతరాయాల ప్రభావం మరింత పెరిగి ధరలు పైకి వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి ఏడాదిలోనే కనిష్ట స్థాయికి పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో ఇప్పటికే సరఫరాపై ఉన్న ఒత్తిడికి ఇది మరింత తోడైంది.క్రూడాయిల్ అంటే.. భూమి నుంచి వెలికితీసే ముడిచమురు. దీన్ని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, ఎల్పీజీతో పాటు ప్లాస్టిక్, పెయింట్లు, రసాయనాలు వంటి అనేక ఉత్పత్తులను తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలను సాధారణంగా బ్యారెల్‌కు లెక్కిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగితే.. దాని ప్రభావం ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, చివరకు నిత్యావసర వస్తువుల ధరలపైనా పడే అవకాశం ఉంటుంది.భారత్‌పై ప్రభావం..క్రూడాయిల్ ధరలు ఇలా భారీగా పెరగడం భారత్‌పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశం తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడిచమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వస్తే రవాణా ఖర్చులు పెరిగి.. ఆ ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయలు, సరుకుల ధరలపై పడొచ్చు. దీంతో క్రూడాయిల్ ర్యాలీ భారత్‌లో ద్రవ్యోల్బణ ఆందోళనలను కూడా పెంచే అవకాశం ఉంది.120 డాలర్లకు చేరుతుందా?ప్రస్తుత పరిణామాలు ఇలాగే కొనసాగితే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశాన్ని విశ్లేషకులు కొట్టిపారేయడం లేదు. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బ్రెంట్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే హెచ్చరించింది. బ్రెంట్ ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 80 శాతం పెరిగింది. యుద్ధ సమయంలో నమోదైన గరిష్ఠ స్థాయి 126 డాలర్లతో పోలిస్తే(ఏప్రిల్ 30న).. ప్రస్తుత ధరలు కూడా ఆ స్థాయికి చేరువలోనే ఉన్నాయి.అయితే ధరల ర్యాలీ ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రధానంగా యుద్ధ తీవ్రత, సముద్ర మార్గాల్లో చమురు రవాణా పరిస్థితులు, చైనా కొనుగోళ్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందని, ఆ తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం సమీప భవిష్యత్తులో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై సందేహాలను పెంచుతున్నాయి.ఇదీ చదవండి: భారత్ వద్ద న్యూక్లియర్ వెపన్స్ లెక్క తెలుసా? -
మంటల్లో స్కూల్.. ఆపై తొక్కిసలాట.. 29 మంది మృతి
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. స్కూల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అగ్నికీలల్లో చిక్కుకుని 29 మంది మృతి చెందగా.. వారిలో 24 మంది చిన్నారులే ఉన్నారు. మృతుల్లో 19 మంది బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బుకావు నగరంలో చోటుచేసుకుంది.బుకావు(Bukavu)లోని చింపుండా ప్రాంతంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు తొలుత ఒక ప్రాంతంలో మొదలై.. సమీపంలోని ఉజామా ప్రైమరీ స్కూల్, ఫురాహా సెకండరీ స్కూల్‌కు వ్యాపించాయి. పాఠశాలలతో పాటు సమీపంలోని దాదాపు 300 చెక్క ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ బుకావు రీజియన్ అంతా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండడం గమనార్హం.మంటలు.. ఆపై తొక్కిసలాటమంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. కొందరు ఒకరినొకరు తొక్కుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. మరికొందరు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలోనూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.స్థానిక క్లినిక్ నర్సు క్రిస్టోఫ్ జిగషానే తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 50 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులను తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురు ఊపిరాడక ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. కొందరు ఘటనాస్థలంలోనే మృతి చెందగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.#RDC – #Bukavu : 15 élèves morts dans un incendie à KashekeLe bilan provisoire des incendies survenus ce jeudi à Kasheke, à Bukavu, fait état de 15 élèves morts et de plusieurs blessés graves, selon les autorités locales.Les victimes sont des élèves des écoles Ujamaa et… pic.twitter.com/HCT2xcL0mL— Steve Wembi (@wembi_steve) September 10, 2026క్షతగాత్రులకు చికిత్సఈ ప్రమాదంలో మరో 29 మంది చికిత్స పొందుతున్నట్లు ఏఎఫ్సీ/ఎం23(AFC/M23) తిరుగుబాటు ఉద్యమ ప్రతినిధి లారెన్స్ కన్యుకా తెలిపారు. వారిలో 21 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 17 మంది కడుటు జనరల్ ఆస్పత్రిలో, మరో నలుగురు బుకావు ప్రావిన్షియల్ జనరల్ ఆస్పత్రిలో ఉన్నట్లు వెల్లడించారు.బుకావు నగరం 2025 ఫిబ్రవరి నుంచి రువాండా మద్దతు ఉన్న AFC/M23 తిరుగుబాటు సంస్థ ఆధీనంలో ఉంది. ఖనిజ సంపదకు పేరుగాంచిన తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ తన ఆధిపత్యాన్ని విస్తరించుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుగుబాటుదారుల ఆధీనంలోని ప్రాంతంలో ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.ఇదీ చదవండి: భారతీయులపై ట్రంప్ మరో పిడుగు -
ట్రంప్ సర్కార్ మరో షాక్.. H-1Bపై కొత్త రూల్!
వాషింగ్టన్: అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. హెచ్–1బీ వీసా సహా కొన్ని వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని ప్రతిపాదించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు అమెరికాలో ఉండి కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే అవకాశం భారీగా తగ్గిపోనుంది. దీంతో అమెరికా టెక్నాలజీ, సేవా రంగాల్లో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు కొత్త కష్టాలు మొదలయ్యే అవకాశముంది.ప్రస్తుతం H-1B వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత గరిష్ఠంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఈ సమయంలో మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించడంతో పాటు, కొత్త యజమాని ద్వారా వీసా స్పాన్సర్షిప్ ప్రక్రియను ప్రారంభించుకోవచ్చు. ఉద్యోగం దొరకకపోతే అమెరికా నుంచి వెళ్లేందుకు ఇల్లు, పిల్లల చదువులు, ఇతర వ్యక్తిగత వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు కూడా ఈ గడువు ఉపయోగపడుతుంది. ఈ 60 రోజుల వెసులుబాటు 2017 నుంచి అమల్లో ఉంది.భారతీయులపైనే ఎఫెక్ట్.. అయితే, ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఉద్యోగం ముగిసిన తర్వాత ప్రస్తుతం లభిస్తున్న ఈ 60 రోజుల సమయం ఉండకపోవచ్చు. అంటే లేఆఫ్ లేదా ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులు అమెరికాలో కొనసాగేందుకు మార్గాలు చాలా పరిమితమవుతాయి. కొత్త ఉద్యోగం, వీసా స్పాన్సర్ కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులను కలవరపెడుతోంది. అమెరికా టెక్నాలజీ, ఐటీ, కన్సల్టింగ్ రంగాల్లో భారతీయ నిపుణుల సంఖ్య భారీగా ఉంది. పలు ఐటీ సంస్థలు H-1B వీసాలకు ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి. దీంతో ఉద్యోగాలు కోల్పోయే భారతీయ ప్రొఫెషనల్స్‌కు కొత్త ఉద్యోగం వెతుక్కునే సమయం మరింత కీలకంగా మారనుంది.అన్నీ వీసాలపై ఇలా.. ఇమ్మిగ్రేషన్ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రేస్ పీరియడ్ తొలగిస్తే విదేశీ ఉద్యోగుల లేఆఫ్, ఆఫ్‌బోర్డింగ్ ప్రక్రియలను కంపెనీలు మరింత వేగంగా నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు అమెరికా ప్రభుత్వం మాత్రం విదేశీ ఉద్యోగుల స్థానంలో సమాన అర్హతలున్న అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈ ప్రతిపాదన H-1Bకే పరిమితం కాదు. కొన్ని L-1, O-1, TN, E-1, E-2 కేటగిరీలతో పాటు సింగపూర్, చిలీకి చెందిన H-1B1 వీసాదారులు, ఆస్ట్రేలియా నుంచి వచ్చే E-3 ప్రత్యేక నైపుణ్య ఉద్యోగులపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.అయితే ఇప్పటికిప్పుడు ఇది తుది నిర్ణయం కాదు. ప్రతిపాదనపై రెండు నెలల పాటు ప్రజలు, సంస్థల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు. అనంతరం ట్రంప్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ప్రతిపాదనకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే.. ఉద్యోగం పోయినా రెండు నెలల గడువు ఉందనే ధైర్యంతో ఉన్న విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికాలో కొత్త అధ్యాయం మొదలయ్యే అవకాశముంది.ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. -
భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
ప్రతిష్టాత్మక 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ సిద్ధమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్లు పెరుగుతున్న సమయంలో ఆయన భారత్ పర్యటన సాగుతోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితులు, అమెరికా వాణిజ్య విధానాలు, సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈసారి బ్రిక్స్ సదస్సులో కీలకంగా మారనున్నాయి.మోదీ–పుతిన్ భేటీలో కీలక అంశాలుపుతిన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రక్షణ, ఇంధనం, సాంకేతికత, ఔషధాలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ భేటీలో ప్రధానంగా ఉండనుంది.President Putin arrives in New Delhi:Government Il-96 landed at the base of the air force of the Republic of Palam.(3:54 am, Delhi time)NEW DELHI, September 11. /TASS/. Russian President Vladimir Putin arrived in India, in the capital of which New Delhi the BRICS summit… https://t.co/K9ZBz6ZsHk pic.twitter.com/tnM4Q7pHIM— ⏳Towhee 🌏☮️ (@amborin) September 10, 2026రక్షణ రంగంలో బ్రహ్మోస్ క్షిపణి ఆధునికీకరణపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్‌కు మిగిలిన ఎస్–400 వ్యవస్థల సరఫరా, సు–57 యుద్ధ విమానాల ప్రతిపాదిత సరఫరాపైనా చర్చలు జరగనున్నాయి. భారత్‌లో కొత్త సివిల్ న్యూక్లియర్ రియాక్టర్ల ఏర్పాటుపైనా ఇరు దేశాలు చర్చించనున్నట్లు సమాచారం.ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్పింగ్పుతిన్ మాత్రమే కాదు బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటిస్తున్నారు. సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సదస్సు సందర్భంగా ప్రధాని మోదీతో జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. వాణిజ్యం, పెట్టుబడులతోపాటు ఇరు దేశాల సంబంధాలపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.పశ్చిమాసియా సంక్షోభం.. బ్రిక్స్‌కు సవాల్ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు బ్రిక్స్ సదస్సుకు కీలక సవాల్‌గా మారాయి. ముఖ్యంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాల నేపథ్యంలో కూటమి ఉమ్మడి ప్రకటనపై ఏకాభిప్రాయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన సంక్షోభం అంతర్జాతీయ చమురు వాణిజ్యంపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ, ప్రాంతీయ పరిణామాలపై బ్రిక్స్ నేతలు చర్చించనున్నారు. ఇదే సమయంలో అమెరికా వాణిజ్య, సుంకాల విధానాలు కూడా బ్రిక్స్ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచ పాలనలో బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై భారత్ తన అధ్యక్ష హోదాలో దృష్టి పెట్టనుంది.విస్తరించిన బ్రిక్స్.. పెరిగిన ప్రాధాన్యంబ్రిక్స్లో తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఉండేవి. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, హైటెక్నాలజీతోపాటు ఆరోగ్యం, వ్యవసాయం, ఆహారం, ఇంధనం, విపత్తుల నిర్వహణ, సరఫరా వ్యవస్థల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవడం ఈ సదస్సు ప్రధాన అజెండాలో ఉంది.రెండు రోజులపాటు కీలక భేటీలుభారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు సదస్సు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బ్రిక్స్ నేతలు రాజకీయాలు, భద్రత, ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక సహకారం, సాంస్కృతిక, మానవతా సంబంధాలపై చర్చిస్తారు. ఆదివారం విస్తృత సమావేశాలు నిర్వహించిన అనంతరం ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ను విడుదల చేయడంతో సదస్సు ముగియనుంది.బ్రిక్స్ వేదికపై అధికారిక సమావేశాలతోపాటు నేతల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలపైనా ఆసక్తి నెలకొంది. పుతిన్‌తో మోదీ భేటీ, ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ చర్చలు ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొత్తంగా.. ఒకవైపు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, హర్ముజ్ పరిణామాలు, వాణిజ్య యుద్ధాల ప్రభావం వంటి కీలక అంతర్జాతీయ సవాళ్ల మధ్య ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పుతిన్–మోదీ భేటీతోపాటు భారత్ వేదికగా జరిగే ఇతర ద్వైపాక్షిక చర్చలు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ఇదీ చదవండి: మిస్టర్ సింగ్.. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ల్యాండ్ -
భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
వాషింగ్టన్: భారత్ వద్ద 190 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చంటూ అమెరికాకు చెందిన ఓ సంస్థ అంచనా వేసింది. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్ఏఎస్)అనే లాభాపేక్షలేని ఓ సంస్థ ఇందుకు సంబంధించిన ఓ నివేదికను బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వం బహిర్గతం చేసిన గణాంకాలు, ఇతర వర్గాల నుంచి సేకరించిన సమాచారం, వాణిజ్య ఉపగ్రహాల చిత్రాల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు వివరించింది. ‘భారత్ వద్ద ఉన్న అణు సామర్థ్య ప్రయోగ వాహనాల అమరిక, వ్యూహాలకు సంబంధించిన బహిరంగ సమాచారం ఆధారంగా ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్న కొత్త క్షిపణుల కోసం ఉద్దేశించిన 30 అదనపు వార్హెడ్లు సహా సుమారు 190 అణు వార్హెడ్లను తయారు చేసి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఇందులో వాడకంలో ఉన్న ప్రయోగ వేదికల కోసం 160కి పైగా వార్హెడ్లు కూడా ఉన్నాయి’అని ’ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ –2026’ పేరుతో ఎఫ్ఏఎస్ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ క్రిస్టెన్సన్ ఆ నివేదికలో పేర్కొన్నారు.‘భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటోంది. ఇటీవలి కాలంలో అనేక కొత్త ఆయుధ వ్యవస్థలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అణు సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు, భూమి, గగనతలం నుంచి ప్రయోగించే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటోంది. పాత వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఇంకొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి’అని క్రిస్టెన్సన్ తెలిపారు. భారత్ 140 నుంచి 225 అణ్వాయుధాలకు సరిపడా సైనిక అవసరాల ప్లుటోనియంను సిద్ధం చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఈ నిల్వలు మున్ముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. అయితే, 1998లో పొఖ్రాన్–2 ఆపరేషన్‌లో భాగంగా అణు పరీక్షలు చేపట్టిన భారత్..శత్రువుపై ముందుగా అణ్వాయుధాన్ని ప్రయోగించరాదనే విధానాన్ని ప్రకటించడంతోపాటు అందుకు కట్టుబడి ఉందని గుర్తు చేశారు. 2026 ఆరంభం నాటికి భారత్ వద్ద 730 కిలోల (సుమారు 170 కిలోలు అటూఇటుగా) అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్లుటోనియం నిల్వలున్నట్లు ’ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆన్ ఫిజైల్ మెటీరియల్స్’ అంచనా వేసినట్లు కూడా క్రిస్టెన్సన్ ఉటంకించారు. -
మిస్టర్ సింగ్.. వెళ్లిపో!
వాషింగ్టన్: రహదారులపై నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ అమెరికన్ల ప్రాణాలు తీస్తున్న సిక్కు డ్రైవర్లు స్వచ్ఛందంగా దేశం వీడాలంటూ అమెరికా ప్రభుత్వ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం రూపొందించిన వీడియో వివాదాస్పదంగా మారింది. గతంలో నిర్లక్ష్యంగా ట్రక్కులు నడిపి పలువురి ప్రాణాలుపోయేందుకు కారణమైన వలసదారులైన డ్రైవర్లు హర్జీందర్ సింగ్, రాజీందర్ కుమార్, బెకాన్ బిషెకేవ్, జస్వీర్ సింగ్‌ల ఫొటోలను చూపిస్తూ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను రూపొందించి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. సరైన దృవీకరణ పత్రాలు లేని, అక్రమ వలసదారులను, వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లను సిక్కులుగా చూపిస్తూ.. ‘‘మా రోడ్డ మీద నుంచి తప్పుకోండి. మిస్టర్ సింగ్ నీకసలు వాహనం నడపడమే రాదు. స్వచ్ఛందంగా అమెరికాను వదిలి వెళ్లిపో. లేదంటే నిన్ను అరెస్ట్‌చేసి బలవంతంగా దేశం నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసులు వస్తారు’’అని ఆ వీడియోలో హెచ్చరించింది. 2014లో హాలీవుడ్లో హిట్ అయిన ‘ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్టిన్షన్’కు పేరడీగా డ్రైవర్లను ట్రాన్స్ఫార్మర్లుగా పేర్కొంటూ కొత్త వీడియోకు ‘ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్’అని పేరు పెట్టి కొత్త వివాదం రేపింది. దీనిపై భారతీయ అమెరికన్లు, సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ప్రతి ఒక్క సిక్కు వ్యక్తి అక్రమంగా అమెరికాకు రాలేదు. ప్రతి ఒక్క సిక్కు డ్రైవర్ రహదారులపై ప్రమాదాలు చేయట్లేడు. పనిగట్టుకుని సిక్కు వ్యక్తులను నేరస్తులుగా, దోషులుగా చూపిస్తూ యావత్ సిక్కులను, భారతీయులను కించపరుస్తున్నారు. ఇది ముమ్మాటికీ జాత్యహంకారమే’’అని హిందూ అమెరికన్ ఫౌండేషన్, సిఖ్ కోలిషన్, ఉత్తర అమెరికా హిందువుల కూటమి వంటి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ‘‘అమెరికాలో లక్షలాది మంది సిక్కులు, హిందువుల పేర్ల చివర్లో సింగ్, కుమార్ అని ఉంటుంది. వాళ్లంతా రోడ్డుపై యాక్సిడెంట్లు చేస్తారన్నట్లు ఏఐ వీడియో రూపొందించడం చూస్తుంటే మమ్మల్ని శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా?’’అని సిఖ్ కోలీషన్ అసహనం వ్యక్తంచేసింది. -
మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే 5,000 డాలర్లు ఇస్తా
ఫినిక్స్: అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో జరిగే మధ్యంతర ఎన్నికల్లో తమ పార్టీకి విజయం లభించి, ప్రతినిధుల సభ, సెనేట్‌పై రిపబ్లికన్ల నియంత్రణ కొనసాగితే ప్రతి ఒక్కరికీ 5,000 డాలర్ల చొప్పున అందజేస్తానని ప్రకటించారు. ట్రంప్ పార్టీకి ప్రజాదరణ నానాటికీ పడిపోతున్నట్లు సర్వేలు తేల్చిచెబుతున్న ఆయన ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. బుధవారం డల్లాస్‌లో రిపబ్లికన్ పార్టీ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే మీరు కూడా మాతో కలిసి గెలుస్తారు. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి. దీనిని ట్రంప్ డివిడెండ్ అని పిలుస్తారు’’అని పేర్కొన్నారు. ఈ చెల్లింపులను ఒక సంస్థ తన వాటాదారులకు చేసే పంపిణీలతో పోల్చారు. అమెరికా ఆర్థికంగా బలంగా ఉందని చెప్పుకొచ్చారు. నిజంగా ట్రంప్ వాగ్దానం నెరవేరాలంటే ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా ఖర్చవుతుంది. దీనికి కాంగ్రెస్ ఆమోదం కూడా అవసరం. అంతేకాకుండా వార్షిక బడ్జెట్ లోటును మరింత తీవ్రతరం చేస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉంది. అమెరికా సర్కార్ ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయింది. దాదాపు 1.8 ట్రిలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ లోటు ఉంది. ట్రంప్ తాజా ప్రకటనపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గంట వ్యవధిలోనే స్పందించారు. ఈ డివిడెండ్ చెల్లింపులు సంపన్నులకు అందవని తేల్చిచెప్పారు. వయోజనులకు ఇస్తామంటున్న 5,000 డాలర్లకు అవసరమైన నిధులను సుంకాల ద్వారా వచ్చే ఆదాయంతో సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు వాషింగ్టన్: అమెరికాలో 30 రాష్ట్రాల్లోని 10 లక్షల మంది ‘ఒబామాకేర్’లబ్దిదారులకు 500 డాలర్ల రిబేట్ చెక్కులు ఇస్తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారు. బైడెన్ ప్రభుత్వ హయాంలో ఒబామాకేర్ కింద ప్రజల నుంచి ప్రీమియం అధికంగా వసూలు చేశారని ఆక్షేపించారు. ప్రతి ఒక్కరికీ డబ్బు వాపసు ఇవ్వడంతో ఉపశమనం లభిస్తుందని అన్నారు. కొద్ది వారాల్లోనే రాయితీలు అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని గురువారం వైట్‌హౌస్ ‘ఎక్స్’õÙర్ చేసింది. మరోవైపు ఈ రిబేట్ల కోసం నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే వాటి పంపిణీకి కాంగ్రెస్ ఆమోదం అవసరమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య బీమా రుసుములు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రీమియంలు రెట్టింపు లేదా మూడు రెట్లు పెరిగాయి. దీంతో లక్షలాది మంది తమ ప్లాన్లను తగ్గించుకోవడానికి లేదా ఈ కార్యక్రమం నుంచి పూర్తిగా వైదొలగడానికి మొగ్గుచూపారు. -
‘ఇస్రో’తో ప్రపంచానికి లబ్ధి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండే సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పారదర్శకత, సమగ్రతతో కూడిన శాస్త్రీయ సమాచారం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాలని స్పష్టంచేశారు. గురువారం ఫ్రాన్స్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాంకేతికతలు, భాగస్వామ్యాలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నాయని వెల్లడించారు. సువిశాల అంతరిక్షం శతాబ్దాలుగా ప్రజల ఊహాశక్తిని ప్రేరేపిస్తూనే ఉందని తెలిపారు. వాతావరణం, పంటల నుంచి సముద్రాలు, సమాజాల వరకు భూమిపై జీవనాన్ని అంతరిక్షమే నిర్దేశిస్తోందని పేర్కొన్నారు. అంతరిక్షం ఇవ్వగల శక్తి అనంతమైనదని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. ఘర్షణకు బదులుగా సహకారం, స్వల్పకాలిక లాభానికి బదులుగా సుస్థిరత అవసరమని అన్నారు. భారతదేశ విధానం వసుధైక కుటుంబం(ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు) అనే భావనలో ఇమిడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూగోళం దాటి విస్తరించాలని మోదీ ఆకాంక్షించారు. అంతరిక్షంలోకి 34 దేశాల ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘ఇస్రో’తన అత్యుత్తమ పనితీరు, తక్కువ వ్యయంతో కూడిన ప్రయోగాల ద్వారా ప్రపంచవ్యాప్త ప్రశంసలను పొందిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఇస్రో సామర్థ్యాలు రైతులకు, మత్స్యకారులకు, వాతావరణ అంచనాకు, విపత్తు నిర్వహణకు, నౌకాయానానికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలు భారతీయ రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లాయని తెలిపారు. ఇస్రోతో ఎన్నో దేశాలు ప్రయోజనం పొందుతున్నాయని వివరించారు. ఈ విజయం వెనుక భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు తరాల తరబడి సాగించిన అంకితభావం, కృషి ఉన్నాయని ఉద్ఘాటించారు. వారు పగలు రాత్రి అవిశ్రాంతంగా పనిచేస్తూ ఇస్రోకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. అంతరిక్షయాన దేశాల సరసన భారతదేశానికి గరి్వంచదగిన స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు. 2040 నాటికిచంద్రుడిపైకి భారతీయుడు చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ చెప్పారు. ఆదిత్య–ఎల్1 మిషన్ సూర్యుడి రహస్యాలను వెలికితీస్తోందని పేర్కొన్నారు. గత ఏడాది ఒక భారతీయ వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చాడని గుర్తుచేశారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వీటి ప్రయోజనాలు మొత్తం మానవాళికి అందాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టంచేశారు. భారత్‌లో ఇస్రోతోపాటు ప్రైవేట్ అంతరిక్ష రంగం కూడా పురోగమిస్తోందని అన్నారు. ఇస్రో సాధించిన అత్యుత్తమ నైపుణ్యానికి పారిశ్రామిక ఉత్సాహం తోడవుతోందని తెలియజేశారు. భారత అంతరిక్ష కార్యక్రమంలో ఫ్రాన్స్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతోందని తెలిపారు. భారతదేశపు తదుపరి అంతరిక్ష ప్రస్థానంలో భాగస్వాములుగా చేరాలని ఫ్రాన్స్‌ను, ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ అంతరిక్ష శిఖరాగ్ర సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్త మానవాళి కోసం, భావి తరాల కోసం మనమంతా కలిసి అంతరిక్షాన్ని అన్వేషిద్దామని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు చేద్దామని, అంతరిక్షాన్ని పరిరక్షించుకుందామని సూచించారు. -
భారతీయ అమెరికన్ దంపతుల దాతృత్వం
హూస్టన్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌కు భారతీయ అమెరికన్ జంట రూ.38.25 కోట్ల (40 లక్షల డాలర్ల) విరాళాన్ని అందజేసింది. భారతీయ అమెరికన్ ఇంజినీర్ మన్మోహన్ సింగ్ కాల్సి, ఆయన భార్య మేరీ లూయిస్ షుబెర్ట్ కాల్సి ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం అందజేశారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంతో వర్సిటీలోని కుల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో రెండు ఎండోవ్డ్ ప్రొఫెసర్‌షిప్‌లు, ఒక ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫండ్, గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లు, ఒక సెమినార్ సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. మన్మోహన్ కాల్సి వర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగారని, సుదీర్ఘ కాలం వర్సిటీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని డీన్ ప్రదీప్ శర్మ చెప్పారు. మన్మోహన్ కాల్సి హూస్టన్ వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్డీ పూర్తి చేశారు. హైడ్రోడైనమిక్ రోటరీ సీలింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న కాల్సి ఇంజినీరింగ్ అనే కంపెనీని ఆయన 1978లో నెలకొల్పారు. -
ఘోర కలికి పాతికేళ్లు
ఉగ్రవాదుల ఉన్మాదానికి 2,977 మంది బలైపోయిన సెప్టెంబర్ 11(9/11) దాడులకు 25 ఏళ్లు పూర్తయ్యాయి. అగ్రరాజ్యం అమెరికానే సవాలు చేస్తూ ముష్కరులు సాగించిన మారణహోమాన్ని ప్రపంచం ఇప్పటికీ మర్చిపోలేదు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై విరుచుకుపడింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రవాద దాడికి నిలిచిపోయింది. అల్‌ఖైదా శిక్షణలో రాటుతేలిన 19 మంది ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి పలు లక్ష్యాలను ఢీకొట్టారు. ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలపై జరిగిన దాడులు భారీ ప్రాణనష్టాన్ని, పెను విధ్వంసాన్ని సృష్టించాయి. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో దాదాపు 2,750 మంది, పెంటగాన్ వద్ద 184 మంది, పెన్సిల్వేనియాలో 40 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ అఘాయిత్యానికి తెగించిన మొత్తం 19 మంది ఉగ్రవాదులు సైతం మృత్యువాత పడ్డారు. మంటల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో 400 మందికి పైగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరణించడం గమనార్హం. 9/11 దాడుల వల్ల అమెరికాకు 10 బిలియన్ డాలర్లుకుపైగా నష్టం వాటిల్లింది. దాడి ఎలా జరిగింది? హైజాకర్ల ముసుగులోని ఉగ్రవాదులు తూర్పు తీరంలోని మూడు ఎయిర్‌పోర్టుల నుంచి తమ మారణకాండ ప్రారంభించారు. నాలుగు విమానాల్లోకి ప్రవేశించారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాటిని తమ ఆ«దీనంలోకి తీసుకున్నారు. రహస్యంగా తమ వెంట తెచ్చుకున్న బాక్స్ కట్టర్లతో పైలట్లతోపాటు తమకు ఎదురు తిరిగిన కొందరు ప్రయాణికులను పొడిచేశారు. ఉదయం 8.46 గంటలకు బోస్టన్ నుండి బయలుదేరిన మొదటి విమానం(అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం) న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. బోస్టన్ నుండే బయలుదేరిన రెండో విమానం 17 నిమిషాల తర్వాత సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది. రెండు టవర్ల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జనం హాహాకారాలు చేశారు. కొందరు ప్రాణాలు దక్కించుకొనే క్రమంలో టవర్ల నుంచి కిందికి దూకేశారు. నిమిషాల వ్యవధిలోనే రెండు టవర్లు నేలమట్టమయ్యాయి. అప్పటిదాకా అందరూ ఇది విమాన ప్రమాదంగానే భావించారు. ముష్కర మూకల ఘాతుకమేనన్న అనుమానం రాలేదు. ఇక వాషింగ్టన్ డీసీ సమీపంలోని డల్లెస్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన మూడో విమానం ఉదయం 9.37 గంటలకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్ నైరుతి వైపు భాగాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడ మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మూడుచోట్ల విమాన ప్రమాదాలు జరగడంలో ఇది ఉగ్రవాద దాడికి అనుమానించిన ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత న్యూజెర్సీలోని నెవార్క్ నుంచి వస్తున్న నాలుగో విమానం పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. న్యూయార్క్, పెంటగాన్ ఘటనల గురించి అప్పటికే సెల్ఫోన్ల ద్వారా సమాచారం అందుకున్న నాలుగో విమానంలోని ప్రయాణికులు ఉగ్రవాదులపై తిరగబడ్డారు. నిలువరించేందుకు గట్టిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే విమానం కుప్పకూలింది. అందులోని 40 మంది అగ్నికి ఆహూతయ్యారు. మొత్తం నాలుగు ఘటనల్లో 2,974 మృతిచెందగా, వీరిలో 90 దేశాల పౌరులు ఉన్నారు. 35 నుంచి 41 మంది భారతీయులు మరణించినట్లు అంచనా.ఉగ్రవాదంపై పోరాటం సఫలమైనట్లేనా? ఉగ్రవాదంపై అమెరికా ప్రారంభించిన ప్రపంచ యుద్ధం సఫలమైందా? అంటే లేదనే చెప్పాలి. సెపె్టంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉగ్రవాదులు దాడులకు దిగారు. వేలాది మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాద భూతం అంతం కాలేదు. అంతమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. ఉగ్రవాదం ప్రపంచానికి పెను సవాళ్లు విసురుతూనే ఉంది. అయితే, అమెరికాలో మాత్రం గత 25 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఉగ్రవాద దాడులేవీ జరగలేదు. నిఘాను కట్టుదిట్టడం చేయడమే ఇందుకు కారణం. ఉగ్రవాదంపై యుద్దంలో అమెరికా అరకొర విజయం సాధించినట్లే చెప్పుకోవాలి. ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ 9/11 దాడులు అమెరికాతోపాటు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఆ రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలోని సరసోటాలో ఓ పాఠశాలలో ఉన్నారు. రెండో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోకి ఒక విమానం దూసుకుపోయిందని ఆయనకు సమాచారం అందింది. కొద్దిసేపటి తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన ఆండ్రూ కార్డ్ అధ్యక్షుడి కుడి చెవిలో గుసగుసలాడారు. అమెరికాపై దాడి జరుగుతోందని చెప్పారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు బుష్ వైట్‌హౌస్‌లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి ఆశ్రయం కల్పించిన వారిని శిక్షించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. సెపె్టంబర్ 11 దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ‘గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్’ప్రారంభించింది. మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాద సంస్థలను నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. అల్‌ఖైదాకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో అఫ్గానిస్తాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని కూల్చిచేసింది. అమెరికా పట్ల నరనరాన విద్వేషం నింపుకొని ‘సెపె్టంబర్ 11’మారణకాండకు స్వయంగా వ్యూహరచన చేసిన అల్‌ఖైదా అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాద ఒసామా బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్తాన్ భూభాగంలోని అబోటాబాద్‌లో అమెరికా సైన్యం చేతిలో దారుణంగా హతమయ్యాడు. సముద్రంలో అతడి మృతదేహాన్ని ఖననం చేశారు. శిథిలాల దిబ్బగా మారిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలాన్ని(గ్రౌండ్ జీరో) శుభ్రపరిచే పని 2002 మే నెలలో పూర్తయింది. పెంటగాన్‌ను ఒక సంవత్సరంలోపే మరమ్మత్తు చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ స్థలంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటుచేశారు. ప్రతిఏటా సెప్టెంబర్ 11న మృతులకు నివాళులర్పిస్తున్నారు. అలాగే నూతన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను నిర్మించారు. పెంటగాన్, పెన్సిల్వేనియాలోనూ స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపటి నుంచే బ్రిక్స్ సదస్సు
న్యూఢిల్లీ: భారత్ అతిథ్యం ఇవ్వనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. శనివారం, ఆదివారం జరిగే ఈ సదస్సుకు చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో తదితరులు హాజరు కాబోతున్నారు. షీ జిన్‌పింగ్ భారత్‌లో అడుగుపెడుతుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పె రుగుతున్న ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ, పశ్చిమాసియా సంక్షోభం, అమెరికా విధిస్తున్న సుంకాల ప్రతికూల ప్రభావాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రెండు రోజుల బ్రిక్స్ సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై కూటమి సదస్సులో చర్చించబోతున్నారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన బ్రిక్స్ కూటమిలో 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. 2025లో ఇండోనేసియా కూడా ఇందులో చేరింది. బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేసియా, నైజీరియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం కూడా భాగస్వామ్య దేశాలుగా మారాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, ప్రపంచ జీడీపీలో 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26 శాతానికి బ్రిక్స్ ప్రాతి నిధ్యం వహిస్తోంది. 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో బలమైన కూటమిగా ఆవిర్భవించింది. భారత్ బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం. 2012, 2016, 2021లో కూటమికి సారథ్యం వహించింది. ఇప్పుడు నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. ఈసారి ‘సమ్మిళిత ప్రపంచ పాలన, బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం’అనే ఇతివృత్తంతో బ్రిక్స్ సదస్సు శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసే విందుతో మొదటి రోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రెండో రోజు ఆదివారం పలు సమావేశాలు, చర్చలు జరుగుతాయి. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’విడుదలతో సదస్సు ముగుస్తుంది. నేడే పుతిన్ రాక రష్యా అధినేత పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున భారత్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ పర్యటిస్తారు. బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని రష్యా ప్రతినిధి యురీ ఉషకోవ్ తెలిపారు. శుక్రవారం వార్షిక బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సర్వసభ్య సమావేశంలో పుతిన్ ప్రసంగించనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3.30 గంటలకు పుతిన్‌తో, సాయంత్రం 6.15 గంటలకు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ భేటీ అవుతారు. జిన్‌పింగ్, మోదీ ప్రత్యేక భేటీ! ఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాబోతున్నారని చైనా ప్రభుత్వ మీడియాతోపాటు భారత విదేశాంగ శాఖ గురువారం నిర్ధారించింది. సదస్సు సందర్భంగా శనివారం సాయంత్రం 6 గంటలకు జిన్‌పింగ్, నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారని సమాచారం. జిన్‌పింగ్ భారత పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. రెండు ఆసియా అగ్రరాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి జరుగుతున్న ప్రయత్నంగా పేర్కొంటున్నారు. జిన్‌పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. బ్రిక్స్‌కు అంతా సిద్ధం: మోదీ బ్రిక్స్–2026 శిఖరాగ్ర సదస్సుకు అంతా సిద్ధం అంటూ ప్రధాని మోదీ గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సదస్సు జరిగే ‘భారత్ మండపం’దృశ్యాలు, ఏర్పాట్లతో కూడిన 30 సెకండ్ల వీడియో క్లిప్‌ను సైతం షేర్ చేశారు. -
టికెట్ లేకున్నా విమానం గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
విమానాశ్రయానికి మీ వాళ్లను సాగనంపడానికి వెళ్తున్నారా? టికెట్ లేకపోయినా ఇక విమానం గేట్ వరకు వెళ్లొచ్చా? 25 ఏళ్లుగా ఉన్న కఠిన భద్రతా నిబంధనల్లో అమెరికా ఇప్పుడు ఎందుకు మార్పులు చేస్తోంది? ఇప్పుడు చూద్దాం!2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత అమెరికా విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు పూర్తిగా మారిపోయాయి. టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే భద్రతా తనిఖీల తర్వాత గేట్ల వద్దకు అనుమతించడం, ద్రవ పదార్థాలపై ఆంక్షలు విధించడం వంటి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు 9/11 ఘటనకు 25 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో.. ఈ నిబంధనల్లో కొన్నింటిని మళ్లీ మార్చే ప్రయత్నం జరుగుతోంది.అమెరికా రవాణా భద్రతా సంస్థ (టీఎస్ఏ) త్వరలో టికెట్ లేని వ్యక్తులను కూడా భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుని విమానాశ్రయంలోని గేట్ వరకు వెళ్లేందుకు అనుమతించనుంది. దీంతో కుటుంబ సభ్యులను విమానం ఎక్కించేందుకు వెళ్లేవారు వారిని గేట్ వరకు సాగనంపవచ్చు. అలాగే విమాన ప్రయాణంలో మధ్యలో కొంతసేపు ఆగే సమయంలో స్నేహితులను కలవడం, విమానాశ్రయంలోని రెస్టారెంట్లు, దుకాణాలకు వెళ్లడం వంటి అవకాశాలు కూడా ఉంటాయి.అయితే ఈ సదుపాయం అందరికీ వెంటనే అందుబాటులోకి రాదు. టీఎస్ఏ ప్రీచెక్ లేదా నౌ ట్రావెలర్ నంబర్ ఉన్నవారికి తొలుత ఈ అవకాశం కల్పించనున్నారు. టికెట్ లేకుండా గేట్ వరకు వెళ్లాలనుకునే ప్రీచెక్ సభ్యులు తమ సందర్శనకు ఒకటి నుంచి మూడు రోజుల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలోని 13 విమానాశ్రయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీఎస్ఏ తెలిపింది.మరో ఆసక్తికరమైన మార్పును కూడా అమెరికా పరిశీలిస్తోంది. అది ఏంటంటే? టీఎస్ఏ ప్రీచెక్ ప్రయాణికులకు నీటితో నింపిన బాటిళ్లను కూడా తీసుకెళ్లేందుకు అనుమతించే విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. 2006లో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల కుట్ర తర్వాత విమానాల్లో ద్రవ పదార్థాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే, కొందరు వ్యక్తులు శీతల పానీయాల బాటిళ్లలో ద్రవ రసాయనాలను దాచుకుని విమానాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అప్పట్లో గుర్తించారు.ఇప్పుడు భద్రతా తనిఖీల్లో ఉపయోగించే సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని విమానయాన భద్రతా నిపుణుడు జెఫ్ ప్రైస్ చెబుతున్నారు. పాత ఎక్స్‌రే యంత్రాల స్థానంలో వస్తున్న కొత్త CT స్కానర్లు ద్రవ రూపంలోని పేలుడు పదార్థాలను కూడా మెరుగ్గా గుర్తించగలవని ఆయన తెలిపారు. అందువల్ల భద్రతా ప్రమాణాలను తగ్గించడం వల్ల కాకుండా.. కొత్త సాంకేతికతపై నమ్మకంతో కొన్ని పాత ఆంక్షలను సడలించే అవకాశం ఏర్పడుతోందని వివరించారు.ఇటీవల అమెరికా విమానాశ్రయాల్లో మరో మార్పు కూడా జరిగింది. భద్రతా తనిఖీల సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా షూలు తొలగించాల్సిన నిబంధనను గత ఏడాది నుంచి తొలగించారు. ఈ మార్పులపై అమెరికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 9/11కు ముందు ఉన్న సాధారణ విమాన ప్రయాణ రోజులను గుర్తు చేసుకుంటున్న కొందరు ఈ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం భద్రతా నిబంధనలు సడలించడం వల్ల ప్రమాదం పెరుగుతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కీలకమైన భద్రతా చర్యలను కొనసాగిస్తూ, ఆధునిక సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తే ప్రయాణికుల భద్రతకు రాజీ పడాల్సిన అవసరం ఉండదు.ఇవి కూడా చదవండి: క్యాట్‌లో మంచి స్కోర్.. ఐనా సైన్యంలోకి! కానీ చివరికి.. -
చమురు ధరలు భగ్గుమంటున్నాయ్.. ప్రపంచానికి కొత్త ముప్పు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ముఖ్యంగా చమురు, సహజవాయువు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు చేరింది. ఈ పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు ఈ మధ్య మరింత తీవ్రం కావడంతో ఈ ప్రభావం చమురు సరఫరాలపై పడుతోంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోవడంతో గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడవచ్చన్న భయాలు పెరుగుతున్నాయి.అయితే, మరోవైపు సహజవాయువు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. యూరప్‌లో ఈ ఏడాది ఇదే సమయానికి సాధారణంగా ఉండే స్థాయికంటే గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నాయి. చలికాలం కోసం నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతో గ్యాస్‌కు డిమాండ్ పెరిగి ధరలు మరింత ఎక్కువవుతున్నాయి. అలాగే, బ్రిటన్‌లో గ్యాస్ ధరలు 2022 తర్వాత తొలిసారిగా ఒక థర్మ్కు 200 పెన్స్ దాటాయి.ఇలా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై కూడా వాటి ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే, బ్రిటన్‌లో స్వల్పకాలిక గ్యాస్ ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ధరల పరిమితి కొంత రక్షణ కల్పిస్తున్నప్పటికీ.. ధరలు ఎక్కువ కాలం కొనసాగితే విద్యుత్, గ్యాస్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్ నుంచి అక్కడ ఇంధన ధరల పరిమితి 3.6 శాతం పెరగనుంది.చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ వేగం పుంజుకుంటుందన్న ఆందోళనలు కూడా పెరిగాయి. దీనికి తోడు అమెరికా, బ్రిటన్‌లో ప్రభుత్వాలు తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. బ్రిటన్‌లో పదేళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 2007 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది. దీంతో ప్రభుత్వ రుణభారం పెరగడంతో పాటు.. గృహ రుణాలు వంటి కొన్ని ఆర్థిక ఉత్పత్తులపై ప్రజలు చెల్లించే వడ్డీ కూడా పెరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న హౌతీ దళాలు యెమెన్‌లోని కీలకమైన మోఖా పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రావడం ఆందోళనకు మరింత కారణమైంది. ఈ పరిణామంతో సముద్ర మార్గాల్లో చమురు, ఇతర సరుకుల రవాణాకు మరిన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధ పరిస్థితులు త్వరగా ముగియకపోతే ఇంధన ధరల పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇవి కూడా చదవండి: ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు! -
మిరాకిల్.. బస్సులో పడి బతికిపోయాడు!
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అనేది సామెత. కొన్ని సంఘటనల గురించి విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ అదృష్టం అనే మాట తప్పకుండా వస్తుంది. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరి ఎలా వరిస్తుందో ఊహించలేం. విలువైన డబ్బు రూపంలో రావొచ్చు లేదా అమూల్యమైన ప్రాణాలు నిలబడడం కావొచ్చు.. మరేదైనా అవొచ్చు. ఘోర విపత్తులు, భారీ ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది ప్రాణాలతో బయటపడుతుంటారు. అదృష్టవశాత్తు బతికి బట్టకట్టామని ప్రమాదాల నుంచి బయటపడిన వారు చెబుతుంటారు. ఇలాంటి ఘటన గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దీని కంటే ఈ వీడియోను ఒకసారి చూడండి.A bus driver in Colombia accidentally left the door open. Seconds later, a speeding motorcyclist collided with the bus and was flung straight through the open doorway instead of crashing into its side. Sometimes, a mistake becomes a miracle! pic.twitter.com/TGKwaHznF8— Harsh Goenka (@hvgoenka) September 9, 2026అసలేం జరిగిందో అర్థం కాలేదా? రహదారిపై ఓ బస్సు వేగంగా వెళులోంది. డ్రైవర్‌గా ఏమరుపాటుగా బస్సు తలుపును తెరిచివుంచాడు. కొద్ది నిమిషాల తర్వాత తెరివుంచిన తలుపులోంచి ఓ వ్యక్తి అమాంతంగా మెరుపు వేగంతో బస్సులోకి వచ్చి పడ్డాడు. ఏం జరిగిందో తెలియక బస్సు డ్రైవర్ అవాక్కయ్యాడు. తెలిశాక గర్వంగా ఫీలయ్యేవుంటాడు!ఈ సంఘటన కొలంబియాలోని బూగా నగరంలో ఆగస్టు 30న జరిగిట్టు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హెల్మెట్ లేకుండా అతివేగంతో బైకుపై దూసుకొచ్చిన ఓ వ్యక్తి రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా మినీ బస్సును ఢీకొట్టాడు. నేరుగా తలుపు వద్ద బస్సును ఢీకొననడంతో అతడు ఎరిగి బస్సులోపలికెళ్లి పడ్డాడు. బస్సు డ్రైవర్ ఏమరుపాటుగా తలుపు తెరిచివుంచడం బైకర్ పాలిట లక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీల ఫుటేజీ వైరల్ కావడంతో దీని గురించి ప్రపంచమంతా తెలిసింది.తాజాగా ఈ వీడియోను మన దేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయాంక ఎక్స్‌లో షేర్ చేశారు. కొన్నిసార్లు పొరపాటు కూడా అద్భుతంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై నెటిజనులు సరదా కామెంట్లు పెడుతున్నారు.పొరపాటుతో మిరాకిల్!కొలంబియా అధికారులు పౌరులను ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేవలం ప్రజా ప్రయోజన ప్రకటన మాత్రమే అంటూ ఓ నెటిజన్ సరదా వ్యాఖ్య పెట్టారు. అతడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే సురక్షితంగా బస్సులో దేన్ని గుద్దుకోకుండా సీట్ల మధ్యలో పడ్డాడని మరో నెటిజన్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనమని ఇంకొకరు అన్నారు. దేవుడు సర్వత్రా ఉన్నాడనడానికి రుజువు ఈ అద్భుత ఘటన అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మడతపెట్టే ఐఫోన్‌పై పేలుతున్న మీమ్స్ -
మిన్ను విరిగి మీద పడినా : పెళ్లి ఆగేదే లేదు!
మొన్న వరద నీటిలో కూడా తగ్గేదేలే అంటూ తడి బట్టలతోనే పెళ్లి వేడుకను ముగించుకున్న జంట కథ గురించి తెలుసుకున్నాం. తాజాగా మిన్ను విరిగి మీద పడినా, పెళ్లి మాత్రం ఆగేదే లేదు అంటూ ఒక ప్రేమ జంట పెళ్లి చేసుకున్నారు. యుద్ధం తెచ్చిపెట్టిన వినాశనం నడుమ ప్రేమ జయించిన ఒక భావోద్వేగ సంఘటన ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో చోటుచేసుకుంది. వీరి ఎమోషనల్ వెడ్డింగ్ నెట్టింట వైరల్‌గా మారింది. రష్యా దాడిలో తాము ఉంటున్న అపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఉక్రెయిన్ సైనికుడు , అతని భాగస్వామి శిథిలాల నుంచే తమ పెళ్లి దుస్తులను బయటకు తీసి, షెడ్యూల్ ప్రకారమే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ వాసి ల్యుడ్మిలా (33)కు లియోనిడ్ రిజాక్ (43) లు చాలాకాలంగా కలిసి ఉంటున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్ ప్రాంతంలో బాంబర్ డ్రోన్ల విభాగంలో పనిచేస్తున్నాడు రిజాక్. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు ఎనిమిదవ తేదీన ముహూర్తం ఖరారైంది కూడా. సరిగ్గా వివాహానికి కొన్ని గంటల ముందు, వారు నిద్రపోతున్న సమయంలో వారి భవనానికి ఎదురుగా ఉన్న వేర్‌హౌస్‌పై రష్యా దాడి జరిగింది. ఈ దాడి ధాటికి అపార్ట్మెంట్ కిటికీలు పగిలిపోయాయి, ఫర్నిచర్ చెల్లాచెదురైంది. ల్యుడ్మిలా పగిలిన గాజు ముక్కలు , శిథిలాల కింద నుంచి తన తెల్లటి పెళ్లి లంగాను బయటకు తీయాల్సి వచ్చింది. రెండో దాడి ముప్పు ఉండటంతో, వారు ల్యుడ్మిలా 6 ఏళ్ల కుమార్తెతో కలిసి బంకర్ (షెల్టర్)కు చేరుకున్నారు. దాడి తీవ్రతకు వారు ఉంటున్న ఫ్లాట్ నివాస యోగ్యంగా లేకుండా దెబ్బతింది.సెప్టెంబర్ 8న జరిగిన ఈ పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి సైతం వైమానిక హెచ్చరికల (Air-raid sirens) వల్ల వారికీ ఆరు రోజులు పట్టింది. తీరా పెళ్లి రోజున ఉదయం 10:40 గంటలకు రిజిస్టర్ ఆఫీస్‌కు చేరుకునేసరికి మళ్లీ సైరన్ మోగడంతో దాదాపు మూడు గంటల పాటు ఆవరణలోనే వేచి చూడాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ప్రారంభోత్సవానికి రాను, సిగ్గుపడుతున్నా : కేంద్రమంత్రి గడ్కరీ ధ్వజంభర్త లియోనిడా సాంప్రదాయ ఉక్రేనియన్ చొక్కా (విషైవాంకా)తో పాటు శిథిలాలనుంచి తీయలేక ఆర్మీ ప్యాంట్, స్నీకర్లతోనే వివాహానికి సిద్ధ మయ్యారు. ల్యుడ్మిలా డ్రెస్‌కు కూడా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పటికీ, ఏమాత్రం వెనుకంజ వేయకుండా పెళ్లి చేసుకున్నారు."దేవుడు నాకు జీవితాన్ని కొనసాగించే అవకాశం ఇచ్చినప్పుడు, దాన్ని ఎందుకు వాయిదా వేయాలి? ఎవరికో జీవితం ముగిసిపోవచ్చు, కానీ రేపు మాకు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కనీసం ఇప్పటికైనా సంతోషంగా ఉండే హక్కు మాకు ఉంది" అని ల్యుడ్మిలా భావోద్వేగంతో పేర్కొన్నారు. 🇺🇦 A Russian strike wrecked their Kyiv apartment just hours before their wedding.Liudmyla and Leonid pulled their wedding clothes from the rubble, waited through another air-raid alert — and got married anyway.Sometimes, carrying on is its own form of defiance. pic.twitter.com/5B0YVjVfAV— Mark (@MarksystemDE) September 9, 2026 -
కార్గో నౌకలో చెలరేగిన మంటలు.. 20 మంది..
బీజింగ్: తూర్పు చైనాలోని క్వింగ్డావోలోని షిప్‌యార్డులో మరమ్మతులు జరుగుతున్న కార్గో నౌకలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. మరో ఐదుగురు గల్లంతైనట్లు సమాచారం. షిప్‌యార్డులో మరమ్మతులు చేస్తున్న సమయంలో ఉదయం 11:15 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి.నౌకలో మొత్తం 42 మంది ఉండగా.. వారిలో 12 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మంటలను సిబ్బంది అదుపులోకి వచ్చారు. లైబీరియా జెండాతో ఉన్న ఓషియన్ మెలోడీ(Ocean Melody)నౌకలో ఈ ఘటన జరిగింది. ఈ నౌక ఆగస్టు 31న క్వింగ్డావో షిప్‌యార్డుకు చేరుకుని.. అప్పటి నుంచి అక్కడే ఉన్నట్లు సమాచారం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. -
ఖరీదైన విడాకులు.. మాజీ భార్యకు రూ.18 వేలకోట్లు!
సోషల్ మీడియాలో ఓ విడాకుల కేసు తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే.. దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ గేమింగ్ కంపెనీ స్మైల్‌గేట్ వ్యవస్థాపకుడు క్వాన్ హ్యూక్-బిన్‌కు సంబంధించిన కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.క్వాన్ హ్యూక్-బిన్.. తన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు 2.55 ట్రిలియన్ వాన్ విలువైన ఆస్తులను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.18 వేలకోట్లు. దీంతో ఇది దక్షిణ కొరియా చరిత్రలో అతిపెద్ద విడాకుల సెటిల్మెంట్గా నిలిచింది. గతంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం చెయ్ టే-వోన్ తన మాజీ భార్యకు 944 బిలియన్ వాన్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.ఎవరీ క్వాన్ హ్యూక్-బిన్?క్వాన్ హ్యూక్-బిన్ దక్షిణ కొరియాలోని ప్రముఖ బిలియనీర్లలో ఒకరు. ఆయన స్థాపించిన స్మైల్‌గేట్ దేశంలోని అతిపెద్ద వీడియో గేమ్ కంపెనీల్లో ఒకటి. క్రాస్‌ఫైర్, లాస్ట్ ఆర్క్ వంటి ప్రముఖ గేమ్స్ ఈ కంపెనీకి చెందినవే. బ్లూమ్‌బర్గ్ అంచనాల ప్రకారం క్వాన్ సంపద సుమారు 3 బిలియన్ డాలర్లు.కోర్టు తీర్పుకోర్టు తీర్పు ప్రకారం, స్మైల్‌గేట్‌లో క్వాన్‌కు ఉన్న 35 శాతం వాటాను ఆయన మాజీ భార్య లీ హ్వా-జిన్‌కు బదిలీ చేయాలి. ఈ వాటా విలువ సుమారు 2.5 ట్రిలియన్ వాన్స్. అంతే కాకుండా అదనంగా మరో 65 బిలియన్ వాన్ నగదుగా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.క్వాన్, లీ హ్వా-జిన్లు 2001లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే అంటే 2002లో క్వాన్ స్మైల్గేట్ను స్థాపించారు. విడాకుల కోసం దరఖాస్తు చేసిన సమయంలో లీ కంపెనీలో 50 శాతం వాటాను కోరారు. కంపెనీ ప్రారంభ సమయంలో తాను ఆర్థికంగా సహాయం చేశానని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. అంతేకాదు.. వివాహం తర్వాత రెండు దశాబ్దాలకు పైగా తాను పిల్లలను పెంచడం, కుటుంబ బాధ్యతలను చూసుకోవడంలో గడిపానని లీ పేర్కొన్నారు. కంపెనీ ఏర్పడిన సమయంలో తాను చేసిన సహకారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు.అయితే.. క్వాన్ మాత్రం ఆమె కంపెనీలో పెట్టుబడి పెట్టలేదని, కంపెనీ కోసం పనిచేయలేదని వాదించారు. స్మైల్‌గేట్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఓ ప్రకటన చేస్తూ, కంపెనీ ప్రారంభానికి అవసరమైన మొత్తం పెట్టుబడిని క్వాన్ ఒక్కడే సమకూర్చారని తెలిపింది. అయినప్పటికీ.. కోర్టు తాజాగా లీకి భారీ మొత్తంలో ఆస్తులు, కంపెనీ వాటా ఇవ్వాలని తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు దక్షిణ కొరియాలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
స్పేస్ పరిశోధనల్లో భారత్‌తో చేతులు కలపండి.. ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ : అంతరిక్ష రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని, భవిష్యత్ పరిశోధనల్లో భారత్‌కు సహ ప్రయాణికులుగా మారాలని ఫ్రాన్స్,ఇతర దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును (ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్) ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భూమిపై మానవ జీవితానికి అంతరిక్షం ఎంతో కీలకమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాలుగా అంతరిక్షం మానవ ఊహాశక్తిని ప్రేరేపిస్తోందని, నేడు అది వాతావరణం, వ్యవసాయం, సముద్రాలు, సమాజాల అభివృద్ధిని ప్రభావితం చేస్తోందని తెలిపారు.అంతరిక్ష కక్ష్యలు రద్దీగా మారుతున్న తరుణంలో.. ఘర్షణల కంటే సహకారానికి, స్వల్పకాలిక లాభాల కంటే సుస్థిరతకు, మినహాయింపుల కంటే సమ్మిళిత విధానానికి మన ఎంపికలు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని స్పష్టం చేశారు. 1960ల నుంచి భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్ష రంగంలో నమ్మకమైన భాగస్వాములుగా ఉన్నాయని మోదీ గుర్తుచేశారు. తక్కువ ఖర్చుతో అత్యుత్తమ సాంకేతికతను అందించడంలో ఇస్రో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని ప్రశంసించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 430కి పైగా ఉపగ్రహాలను భారతీయ రాకెట్లు అంతరిక్షంలోకి విజయవంతంగా చేరవేశాయని తెలిపారు.రైతులు, మత్స్యకారులకు సహాయం చేయడం నుంచి వాతావరణ అంచనాలు, విపత్తు నిర్వహణ, నావిగేషన్ వరకు ఇస్రో సాంకేతికతలు కేవలం భారత్‌కే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాలు, చర్చలు, సహకారంతో సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగాన్ని రూపొందించడానికి భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. -
Bangladesh: ‘మీజిల్స్’ కలకలం..1,000కి చేరిన మృతులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ (తట్టు) మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ వైరల్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అనుమానిత కేసుల సంఖ్య 1.66 లక్షలు దాటినట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్ఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అనుమానిత మీజిల్స్ కారణంగా నమోదైన మరణాల సంఖ్య 1,000కు చేరువలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ పరిస్థితిని జాతీయ స్థాయిలో అధిక ప్రమాద సంక్షోభంగా వర్గీకరించింది.దేశంలోని మొత్తం 64 జిల్లాల్లోనూ వ్యాధి వ్యాప్తి నమోదైంది. జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా రాజధాని ఢాకాలోని నివాస ప్రాంతాలు, మురికివాడలు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మొత్తం కేసుల్లో ఐదేళ్లలోపు పిల్లల వాటా సుమారు 80 శాతంగా ఉంది. తొమ్మిది నెలల్లోపు శిశువుల్లోనే దాదాపు మూడో వంతు ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. పోషకాహార లోపం కారణంగా న్యూమోనియా, మెదడువాపు వంటి తీవ్ర సమస్యల ముప్పు మరింత పెరిగింది.జనాభాలో వ్యాధి నిరోధక శక్తి లోపించడమే ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. టీకాల కొరత కారణంగా భారీ సంఖ్యలో పిల్లలు ఈ వ్యాధికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. వ్యాప్తిని అరికట్టేందుకు రెండు డోసుల టీకాతో కనీసం 95 శాతం కవరేజీ అవసరమని ప్రపంచ ప్రమాణాలు చెబుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు.మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం యునిసెఫ్, డబ్ల్యూహెచ్ఓ, గావి వ్యాక్సిన్ అలయన్స్‌తో కలిసి అత్యవసర జాతీయ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. సుమారు 1.8 కోట్ల మంది పిల్లలను లక్ష్యంగా చేసుకుని తాత్కాలిక కమ్యూనిటీ కేంద్రాలు, పాఠశాలలు, ఇంటింటి ప్రచారం ద్వారా ఆరోగ్య సిబ్బంది టీకాలు అందిస్తున్నారు. అయినప్పటికీ తీవ్రంగా ప్రభావిత జిల్లాల్లోని వైద్య సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. పిల్లలకు పూర్తి స్థాయిలో టీకాలు వేయించాలని, మీజిల్స్‌పై సాధారణ టీకాలే సమర్థవంతమైన రక్షణ మార్గమని అధికారులు కుటుంబాలకు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Gujarat: అర్థరాత్రి కూలిన భవనం.. శిథిలాల్లో కార్మికులు -
ఇరాన్ దెబ్బ.. అమెరికా ఫైటర్ జెట్లకు చిల్లు!
ఇరాన్ మరోసారి అమెరికాపై విరుచుకుపడింది. జోర్డాన్‌లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై రాత్రికి రాత్రే భారీ క్షిపణి దాడులు జరిపింది. క్షిపణుల వర్షం కురిపించడంతో పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఒక ఏ-10 థండర్‌బోల్ట్ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం.జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ ఈ దాడులు జరిపినట్లు సీబీఎస్ న్యూస్ ఏజెన్సీ ఓ కథనం ఇచ్చింది. ఇరాన్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలకు ఈ స్థావరం కీలక కేంద్రంగా ఉండడం గమనార్హం. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. Iran’s ballistic missile attack on Muwaffaq Salti Air Base in Jordan last night damaged several American aircraft -CBS Roughly eight F-15s suffered light damage and one A-10 was severely damaged, losing a wing. pic.twitter.com/DQydfG4WYH— OSINTtechnical (@Osinttechnical) September 10, 2026దెబ్బతిన్న విమానాలపై అమెరికా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఒక ఏ-10 థండర్‌బోల్ట్ తీవ్రంగా దెబ్బతిని, దాని ఒక రెక్క పూర్తిగా కనిపించకుండా పోయినట్లు వెల్లడించింది. సుమారు ఎనిమిది ఎఫ్-15లకు స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ.. వాటిని తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొంది.అందుకు ప్రతీకారంగానే..ఇటీవల అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తమ దాడుల్లో జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ అమెరికా స్థావరాన్ని భారీ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అలాగే హర్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న పలు నౌకలపైనా దాడులు చేసినట్లు వెల్లడించింది.Iranian Strike Damages EIGHT 🇺🇸 F-15s In Jordan (CBS)The overnight strike reportedly damaged multiple US warplanes at an air base in Jordan. While an A-10 suffered significant damage, the eight F-15s sustained lighter damage and were returned to service. (CBS)The escalation… pic.twitter.com/dyAEspAra6— RT_India (@RT_India_news) September 10, 2026అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో 20 జోర్డాన్ గగనతలంలోకి వచ్చినట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. వీటిలో 18 క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని, మిగిలిన రెండు జనావాసాలు లేని ప్రాంతాల్లో పడినట్లు వెల్లడించింది.యుద్ధానికి ముగింపు పలుకుతాం.. కానీ ఇవే షరతులుమరోవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంకేతాలు ఇచ్చింది. అయితే అమెరికా తమ కొన్ని షరతులకు అంగీకరించాలని స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం, యెమెన్‌పై దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడుదల చేయడం, తమ అణు, క్షిపణి సామర్థ్యాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి డిమాండ్లను ముందుపెట్టింది.ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యుద్ధం ముగిసిపోతుందని బుధవారం ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఇక ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా అమెరికా ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. యుద్ధం ట్రంప్ పదవీకాలంలో మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయనకు సన్నిహితంగా ఉన్న ఉన్నతాధికారులు ప్రైవేటుగా హెచ్చరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఇరాన్–అమెరికా ఘర్షణకు తక్షణమే తెరపడుతుందా? మరింత కాలం కొనసాగుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: ట్రంప్ ఎండ్ గేమ్ ప్లాన్ ఇదేనంట! -
అమెరికన్లకు ట్రంప్ సంచలన హామీ
మధ్యంతర ఎన్నికలపై సర్వేలన్నీ ప్రతికూల ఫలితాలు ఇస్తున్న వేళ.. అమెరికా ఓటర్లకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్లు కాంగ్రెస్ రెండు సభల్లోనూ పట్టు నిలబెట్టుకుంటే.. ప్రతీ అమెరికన్(వయోజన)కు 5,000 డాలర్లు (సుమారు రూ.4.2 లక్షలు) చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు. దీనికి ‘ట్రంప్ డివిడెండ్’గా పేరు పెడతామని చెప్పారు.భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం డలాస్‌లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ట్రంప్.. ఎన్నికల్లో తన పేరు బ్యాలెట్‌పై లేకపోయినా, తనను అభ్యర్థిగా భావించి ఓటేయాలని మద్దతుదారులను కోరారు. ‘‘రిపబ్లికన్లు గెలిస్తే.. మీరూ మాతో గెలిచినట్టే. మీకు 5,000 డాలర్లు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు. అయితే ఈ మొత్తాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. ‘‘మన దేశం ఎంతో డబ్బు సంపాదిస్తోంది’’ అని మాత్రమే చెప్పారు.ట్రంప్ ప్రతిపాదన అమలు చేస్తే ప్రభుత్వంపై కనీసం 1 ట్రిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ హామీ ఆర్థికంగా, రాజకీయంగా ఎంతవరకు సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలి అభిప్రాయ సర్వేల్లో ట్రంప్ ఆమోద రేటింగ్ 30 శాతం దిగువన ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ధరలు, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోంది.‘బ్యాలెట్లో నేనే ఉన్నట్లు భావించండి’మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు రెండు సభల్లోనూ విజయం సాధిస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ‘‘నేను బ్యాలెట్లో ఉన్నాను.. ఉన్నాను.. మరోసారి చెబుతున్నా.. నేనే బ్యాలెట్లో ఉన్నట్లు భావించండి’’ అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇరాన్ యుద్ధంపైనా ట్రంప్ వ్యాఖ్యలుసదస్సు ప్రసంగంలో ట్రంప్ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని పదేపదే ప్రస్తావించారు. ఈ యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించినట్లు కనిపించారు. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడానికి రెండు, మూడు వారాల దూరంలో ఉందన్న కారణంతోనే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని వివరించారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధికి తన పేరును పెట్టాలని కూడా ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై విజయం సాధించిన వెంటనే చమురు ధరలు తగ్గుతాయని చెప్పారు. ఆహారం సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని పేర్కొంటూ.. ‘‘ఇరాన్‌తో యుద్ధంలో గెలిచిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయి’’ అని అన్నారు.టారిఫ్‌లపై వెనక్కి తగ్గేది లేదంటూ..అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు విధించడాన్ని కూడా ట్రంప్ సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఏర్పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో వాటి ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఆయన వాదించారు. అమెరికాలో కమ్యూనిజం పెరుగుతోందంటూ డెమొక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వాళ్లు గెలిస్తే అమెరికా కమ్యూనిస్టు దేశంగా మారిపోతుంది’’ అని హెచ్చరించారు. వచ్చే 250 ఏళ్లలో అమెరికా ఎలా ముందుకు సాగాలన్నది ఓటర్ల చేతుల్లోనే ఉందని అన్నారు.అయితే ప్రస్తుత అంచనాలు మాత్రం రిపబ్లికన్లకు ప్రతికూలంగా ఉన్నాయి. డెసిషన్ డెస్క్ హెచ్‌క్యూ అంచనా ప్రకారం.. ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు 230–205 ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉండగా, సెనేట్‌లోనూ 51–49తో మెజారిటీ సాధించే అవకాశం ఉంది. రిపబ్లికన్ సదస్సు ముగింపు కార్యక్రమానికి ట్రంప్ గురువారం మరోసారి హాజరుకానున్నారు. అంతకుముందు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పేరును, వ్యక్తిగత ప్రభావాన్ని ఉపయోగించి రిపబ్లికన్ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ఎంతవరకు తీసుకురాగలరన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధానికి ముగింపు! బోనస్‌గా ఉక్రెయిన్ వార్ కూడా!! -
జెలెన్స్కీ ఫ్యామిలీకి తప్పిన పెను ప్రమాదం.. పుతిన్ ప్లానేనా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మోల్డోవా నుంచి నార్వేకు బయలుదేరిన ఆయన విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ఓ డ్రోన్ దాదాపు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చింది. దీంతో కొద్దిసేపు దేశ గగనతలాన్ని మూసివేసి విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఆ డ్రోన్ రష్యాకు చెందినదిగా భావిస్తున్న నేపథ్యంలో.. జెలెన్స్కీ విమానానికి ఇంత దగ్గరగా అది ఎలా వచ్చింది? దీని వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యూహం ఉందా? అనే చర్చ మొదలైంది. అయితే డ్రోన్ ఉద్దేశపూర్వకంగా జెలెన్స్కీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుందా అన్నది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.ఈ ఘటన సెప్టెంబర్ 8, మంగళవారం చోటుచేసుకుంది. జెలెన్స్కీ మోల్డోవా రాజధాని చిసినావ్ నుంచి నార్వే రాజధాని ఓస్లోకు బయలుదేరాల్సి ఉండగా.. అదే సమయంలో ఓ డ్రోన్ మోల్డోవా గగనతలంలోకి ప్రవేశించింది. విమానాల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో జెలెన్స్కీ విమానంతో పాటు మరో మూడు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముప్పు తొలగిన తర్వాతే జెలెన్స్కీ విమానం నార్వేకు బయలుదేరింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో జెలెన్స్కీతో పాటు ఆయన భార్య, ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలెనా జెలెన్స్కా కూడా విమానంలో ఉన్నారు.కూలిన డ్రోన్.. మంటలు.. మోల్డోవా అధికారుల ప్రకారం రెండు రష్యన్ డ్రోన్లు ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిలో ఒకటి రిస్కానీ జిల్లాలోని ఓ గ్రామ శివార్లలోని సన్‌ఫ్లవర్ పొలంలో కూలిపోయి పేలింది. దీంతో నాలుగు చోట్ల మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రాంతం చిసినావ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరో డ్రోన్ పొరుగున ఉన్న నాటో సభ్యదేశం రొమేనియా గగనతలంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.A Russian drone breached Moldovan and Romanian airspace this afternoon, causing major disruptions, including the closure of Iași Airport.NATO CAP was launched to hunt down the drone, with Spanish EF-18 Hornets scrambled from Mihail Kogălniceanu Air Base. pic.twitter.com/jfCb9ORV5s— OSINTtechnical (@Osinttechnical) September 8, 2026డ్రోన్ కదలికలను పర్యవేక్షించేందుకు స్పెయిన్‌కు చెందిన రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించారు. కూలిపోయిన డ్రోన్ శకలాలను పరిశీలించిన నిపుణులు.. దాని ప్రొపల్షన్ వ్యవస్థ, నిర్మాణ లక్షణాలు రష్యా యుద్ధంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న ‘గెరాన్’ తరహా డ్రోన్‌ను పోలి ఉన్నట్లు గుర్తించారు. అయితే అందులో ఉన్న పేలుడు పదార్థం రకం, పరిమాణంపై దర్యాప్తు కొనసాగుతోంది.నార్వే ప్రధాని స్పందన.. మరోవైపు నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ బుధవారం స్పందిస్తూ.. మోల్డోవా నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో జెలెన్స్కీ విమానం దాదాపు డ్రోన్ బారిన పడిందని తెలిపారు. అయితే డ్రోన్ విమానానికి ఎంత దూరంలో ఉందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. జెలెన్స్కీ ఓస్లోకు వెళ్లడానికి ప్రధాన కారణం నార్వే రాజు హరాల్డ్-5 అంత్యక్రియలకు హాజరుకావడం. సెప్టెంబర్ 8న రాత్రి ఓస్లో చేరుకున్న ఆయన మరుసటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నార్వే నేతలతో రక్షణ, వైమానిక రక్షణ సహకారంపై చర్చలు జరిపారు.మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ మోల్డోవా, రొమేనియా గగనతలాల్లో డ్రోన్ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ విమానం టేకాఫ్ సమయంలోనే డ్రోన్ ముప్పు ఎదురవడం కలకలం రేపుతోంది. అయితే ఇది జెలెన్స్కీని లక్ష్యంగా చేసుకున్న పుతిన్ ఆపరేషనా? లేక యుద్ధ ప్రభావంతో జరిగిన మరో డ్రోన్ చొరబాటా? అనేది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టత రానుంది.ఇదీ చదవండి: ఏం చేసేది.. పాకిస్తాన్‌కు కొత్త కష్టం? -
సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్!
బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. బుధవారం (సెప్టెంబర్ 9) చట్టోగ్రామ్‌లోని హాత్హజారీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్లో ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (సీఎంహెచ్)కు తరలించారు. బంగ్లాదేశ్ సైన్యం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ (ఐఎస్పీఆర్) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. అసలు ఏం జరిగింది?ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్‌లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్‌లోని ఫైరింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.చైనా తయారీ ట్యాంక్..!ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్ మోడల్‌ను వెల్లడించలేదు. టైప్–59ను బంగ్లాదేశ్ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్’గా కూడా అప్‌గ్రేడ్ చేసింది.Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..చైనాలో తయారైన టైప్–59.. సోవియట్ కాలం నాటి టీ–54 ట్యాంక్ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్. బంగ్లాదేశ్ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్గ్రేడ్ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్–59 ట్యాంకుల అప్‌గ్రేడ్, మరో 58 టైప్–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న కీలక ప్లాట్ఫారమ్లన్నమాట!.దర్యాప్తు ప్రారంభంఈ ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. ఫీల్డ్ ఫైరింగ్ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.ఇదీ చదవండి: మిడిల్ఈస్ట్లో పాక్‌కు బిగ్ టెస్ట్ -
రూ.14 కోట్లతో 33 ఏళ్లలో 233 దేశాలు చుట్టొచ్చాడు!
బీజింగ్: ప్రపంచాన్ని చుట్టిరావాలన్న లక్ష్యంతో ఓ చైనా వ్యాపారవేత్త 33 ఏళ్లపాటు ప్రయాణించి 233 దేశాలు సందర్శించారు. ఇందుకోసం సుమారు 15 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.14 కోట్లు) ఖర్చు చేశారు. 53 ఏళ్ల చెన్ జిన్‌వెయ్ ఇటీవల పెరూలో పర్యటించి తన సుదీర్ఘ ప్రపంచ యాత్రను పూర్తి చేసుకుని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఝుజి స్వస్థలానికి చేరుకున్నారు. యంత్రాల తయారీ సంస్థను నిర్వహిస్తున్న చెన్ 1993లో సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ పర్యటనలతో అంతర్జాతీయ ప్రయాణాలను ప్రారంభించారు.అప్పట్లో ఇంటర్నెట్ అందుబాటులో పెద్దగా లేకపోవడంతో ప్రపంచంలోని మరో వైపు జీవనం ఎలా ఉంటుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నారు. వ్యాపారం, కుటుంబ బాధ్యతలను పక్కనపెట్టకుండా ప్రయాణాలు కొనసాగించారు. ఒక నెల ఇంటి వద్ద ఉండి, మరో నెల పర్యటించేవారు. ధ్రువ ప్రాంతాల వంటి క్లిష్టమైన ప్రదేశాలను కూడా ఎంచుకున్నారు.2015 నవంబరులో అంటార్కిటికా చేరేందుకు చేసిన తొలి ప్రయత్నం విఫలమైంది. 2016 జనవరిలో మరోసారి ప్రయత్నించి అంటార్కిటికా చేరుకున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ద్వీప భూభాగం టోకెలావ్ను మాత్రం తన ప్రయాణాల్లో అత్యంత క్లిష్టమైన గమ్యస్థానంగా చెన్ పేర్కొన్నారు. 2019లో విస్తృత ఏర్పాట్లు చేసి న్యూజిలాండ్ చేరుకున్నప్పటికీ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి కారణంగా టోకెలావ్ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి అక్కడి మారుమూల అటాల్స్పై అడుగుపెట్టారు.ఆఫ్రికాలో ఉన్నప్పుడు మలేరియా బారినపడగా, గ్రీస్‌లో భూకంపాన్ని కూడా ఎదుర్కొన్నారు. సమస్య ఎదురైతే ముందుగా ప్రశాంతంగా ఉండి పరిష్కారం గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. పర్యాటక ప్రాంతాలను మాత్రమే చూసి వెళ్లకుండా స్థానిక సంస్కృతిలోనూ మమేకమయ్యేందుకు చెన్ ప్రయత్నించారు. 198 దేశాలకు చెందిన కరెన్సీలను సేకరించి వాటిని జు జియాకే మెమోరియల్ హాల్‌కు విరాళంగా ఇచ్చారు.ప్రయాణం, వ్యాపారం రెండింటిలోనూ ఒడుదొడుకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందేనని ఆయన అన్నారు. ప్రయాణాలను వాయిదా వేస్తున్నవారికి ‘సమయం ఎవరి కోసం ఆగదు’ అని సందేశమిచ్చారు. 33 ఏళ్ల పాటు సాగించిన ప్రపంచ యాత్ర పూర్తవడంతో ఇక పిల్లలు, తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని చెన్ భావిస్తున్నారు. వివిధ పర్యాటక రంగాలకు చెందిన 100 మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, వారి జీవిత కథలను ముద్రించాలని చెన్ జిన్‌వెయ్ యోచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
పాకిస్తాన్‌కు బిగ్ టెన్షన్.. సౌదీ కోసం యుద్ధం తప్పదా?
హౌతీలపై పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి దిగుతోందా?.. సౌదీ అరేబియాపై జరిగిన భారీ దాడి మూడు దేశాల సైనిక కూటమిని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చిందా?.. యెమెన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు, క్షిపణులు సౌదీ నగరాలు, చమురు కేంద్రాలను తాకడంతో గల్ఫ్‌లో యుద్ధ వేడి పెరిగింది. ఈ సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్, టర్కీపైనా జరిగిన దాడిగానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేయడంతో.. గత నెలలో ఏర్పాటైన ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అలయన్స్’ తొలిసారి అసలు పరీక్షను ఎదుర్కొంటోంది.సెప్టెంబర్ 8న హౌతీ దళాలు సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 73 మంది గాయపడగా.. కొన్ని చమురు, ఇంధన కేంద్రాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆగస్టు 7న పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య కుదిరిన మక్కా జాయింట్ డిఫెన్స్ ఒప్పందంపై చర్చ మొదలైంది. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా.. దాన్ని మిగతా సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలన్నది ఈ ఒప్పందంలోని కీలక నిబంధన. ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. యెమెన్ ఘర్షణ సౌదీ భూభాగంలోకి విస్తరించినా, సౌదీపై దాడి జరిగినా మక్కా ఒప్పందం అమల్లోకి రావచ్చన్నారు. అవసరమైతే పాకిస్తాన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని తెలిపారు. దీంతో హౌతీల దాడులు కొనసాగితే పాక్, టర్కీ సౌదీ రక్షణకు ముందుకొచ్చే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది.జాగ్రత్తగా పాక్ వ్యూహం..ఇదే సమయంలో అసలు ట్విస్ట్ తెరపైకి వచ్చింది. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసే అవకాశాన్ని పరిశీలిస్తోందని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ EFE వార్తా సంస్థ తెలిపింది. అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇస్లామాబాద్ బహిరంగ వైఖరి కూడా జాగ్రత్తగానే ఉంది. సౌదీని రక్షించడం ఒకటైతే.. యెమెన్‌లోకి వెళ్లి నేరుగా యుద్ధం చేయడం మరో అంశమని పాక్ స్పష్టం చేస్తోంది. హౌతీలను అదుపులో పెట్టాలని ఇరాన్‌ను హెచ్చరించినప్పటికీ.. తన పాత్రను ప్రధానంగా సౌదీ రక్షణకే పరిమితం చేయాలని చూస్తోందని రాయిటర్స్ పేర్కొంది.మరోవైపు టర్కీ కూడా హౌతీ దాడులను ఖండిస్తూ.. సౌదీ సార్వభౌమత్వానికి మద్దతు ప్రకటించింది. అయితే యెమెన్‌లో ప్రత్యక్ష సైనిక చర్యకు దిగుతామని మాత్రం ప్రకటించలేదు. దీంతో మక్కా ఒప్పందానికి అసలు పరీక్ష ఏంటన్నది స్పష్టమవుతోంది. హౌతీలు సౌదీపై దాడి చేస్తే పాక్, టర్కీ ఎంతవరకు ముందుకొస్తాయి?.. సౌదీ యెమెన్‌లో హౌతీలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తే ఈ రెండు దేశాలు అదే స్థాయిలో మద్దతు ఇస్తాయా? అన్నదే కీలకంగా మారింది.వైమానిక దాడులు చేస్తుందా?ఇక హౌతీలకు ఇరాన్ మద్దతు ఉండటం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ పరిణామాలను మరింత సున్నితంగా మార్చాయి. పాకిస్తాన్, టర్కీ నేరుగా హౌతీలకు వ్యతిరేకంగా రంగంలోకి దిగితే.. ఇప్పటివరకు యెమెన్ పరిధిలో ఉన్న ఘర్షణ విస్తృత గల్ఫ్ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు ఇస్లామాబాద్‌పైనే. పాకిస్తాన్ సౌదీ రక్షణకే పరిమితమవుతుందా?.. హౌతీ స్థావరాలపై నేరుగా వైమానిక దాడులు చేస్తుందా? అన్నదే కీలకం. పాక్ నిజంగా హౌతీలపై దాడులకు దిగితే.. అది మక్కా డిఫెన్స్ అలయన్స్‌కు తొలి పెద్ద పరీక్ష మాత్రమే కాదు.. యెమెన్ యుద్ధం గల్ఫ్ ప్రాంతానికి విస్తరించే కీలక మలుపుగా మారొచ్చు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్ నెతన్యాహుకు కొత్త కష్టాలు.. -
Philippines: ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి
పాలావాన్: ఫిలిప్పీన్స్‌లోని పాలావాన్ ప్రావిన్స్‌లో పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 87 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 134 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు కోస్ట్‌గార్డ్ గురువారం వెల్లడించింది. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘ఎంవీ జూన్ ఆస్టర్’ (M/V June Aster) ఫెర్రీలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. పాలావాన్ తీరానికి సుమారు 2.2 కిలోమీటర్ల (1.3 మైళ్ల) దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు కోస్ట్‌గార్డ్ తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పేర్కొంది.అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోను కోస్ట్‌గార్డ్ ఫేస్బుక్లో విడుదల చేసింది. అందులో ఫెర్రీ పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు కనిపించాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 42 మందిని రక్షించినట్లు కోస్ట్‌గార్డ్ కెప్టెన్ నోమీ కయాబ్యాబ్ స్థానిక రేడియోకు తెలిపారు. వీరిలో 38 మంది ప్రయాణికులు కాగా.. నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే 87 మంది ఆచూకీ తెలియడం లేదని ఆమె చెప్పారు. ఇది కూడా చదవండి: ‘కలల కశ్మీరం’లో థియేటర్లు ఎందుకు మూతపడ్డాయి? -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని ఆయన అంచనా వేశారు. ‘‘ఎన్నికల తర్వాత వెంటనే యుద్ధం ముగుస్తుంది.. ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదు’’ అని ట్రంప్ అన్నారు.బుధవారం రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అమెరికా విధిస్తున్న ఆర్థిక ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో ఇరాన్ లేదని పేర్కొన్నారు. నవంబర్ ఎన్నికల వరకు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించలేదన్న ధీమాను వ్యక్తం చేశారు.చర్చలకు అవకాశం ఉన్నా..ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిగే అవకాశాన్ని ట్రంప్ పూర్తిగా కొట్టిపారేయలేదు. ‘‘చర్చలు జరగొచ్చు.. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు’’ అని స్పష్టం చేశారు. అంటే, యుద్ధం ముగింపు విషయంలో చర్చల కంటే అమెరికా ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.ఇప్పటికే అమెరికా–ఇరాన్ యుద్ధం ఏడో నెలలోకి ప్రవేశించింది. తక్షణమే యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదనే సమయంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.హర్ముజ్‌లో మళ్లీ ఉద్రిక్తతమరోవైపు హర్ముజ్ జలసంధి సమీపంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచినట్లు సమాచారం వెలువడిన నేపథ్యంలో.. ఇరాన్ 10 నౌకలపై దాడి చేసినట్లు తెలిపింది. ఈ పరిణామాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది.తగ్గిన ఆదరణఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో ట్రంప్ పట్ల ఉన్న ప్రజాదరణ విపరీతంగా పడిపోయింది. యుద్ధంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయంపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాతే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు కూడా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌తో తక్షణ చర్చలకు అమెరికా సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పుగా విశ్లేషకులు పరిగణించనున్నారు . ఇటు ఉక్రెయిన్ సంక్షోభంపైనా.. ఉక్రెయిన్ యుద్ధంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నాడని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంగీకరిస్తే డీల్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తిస్థాయి దాడితో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టినా కాల్పులకు మాత్రం తెరపడలేదు. యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ఇరు దేశాల మధ్య బెలారస్లో చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇస్తాంబుల్‌లో ప్రత్యక్షంగా చర్చలు జరిగాయి. 2022 ఏప్రిల్ నాటికి ఆ చర్చలు నిలిచిపోయాయి. 2025లో మరోసారి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరిగాయి. రష్యా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఇస్తాంబుల్‌లో సమావేశమైనా కాల్పుల విరమణ, భూభాగాల అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ ఏడాది కూడా అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు జరిగాయి. తాజాగా అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కో, కీవ్‌లలో పర్యటించి కొత్తగా చర్చలకు ఊపిరిపోసే ప్రయత్నం చేశారు. అయితే భూభాగాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌పై సంచలన ఆరోపణలు -
‘యురేనియం’పై దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదు
వియన్నా: ఇరాన్‌లోని వివిధ అప్రకటిత ప్రదేశాలలో తనిఖీ అధికారులు గుర్తించిన యురేనియం ఆనవాళ్లపై దీర్ఘకాలంగా సాగుతున్న దర్యాప్తునకు ఇరాన్ సహకరించలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) బోర్డు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించింది. ఇరాన్‌పై మండలికి నివేదించడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. వియన్నాలోని ఐఏఈఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇరాన్ అంశంపై ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. 35 మంది సభ్యులు కలిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో 23 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. చైనా, రష్యా, నైజర్ దీనిని వ్యతిరేకించగా 8 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఒక దేశం ఓటు వేయలేదు. ఈ తీర్మానాన్ని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ ప్రవేశపెట్టాయి. యురేనియం ఆనవాళ్లకు సంబంధించిన విచారణకు ఇరాన్ సహకరించకపోవడం ద్వారా అణువ్యాప్తి నిరోధక బాధ్యతలను ఉల్లంఘించిందని ఐఏఈఏ బోర్డు నిర్ధారించింది. 2003 వరకు ఇరాన్ రహస్య అణు ఆయుధ కార్యక్రమాన్ని కలిగి ఉందనడానికి, అక్కడ లభించిన యురేనియం ఆనవాళ్లే సాక్ష్యమని పశి్చమ దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. అణ్వాయుధాలు తయారు చేసే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతోంది. శాంతియుత అవసరాల కోసమే యురేనియం నిల్వ చేస్తున్నట్లు వాదిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలో ఇరాన్‌కు సంబంధించిన యురేనియం అంశాన్ని ఐఏఈఏ బోర్డు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి నివేదించడం గమనార్హం. -
సూర్యుడికి అద్దం పట్టాల్సిందేనా!
భూమికి ముప్పు తప్పేట్టు లేదు... భూతాపోన్నతికి పగ్గాలేసే లక్ష్యం గురి తప్పుతోంది! సగటు ఉష్ణోగ్రతలు 1.8 డిగ్రీ సెల్సియస్ వరకూ పెరగడం ఖాయమవుతోంది. మరి... తరుణోపాయం???? భూతాపోన్నతి ప్రభావాలను తట్టుకునేందుకు ప్రపంచం సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కే పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరే అవకాశాల్లేవు. ఫలితంగా ఈ శతాబ్దం అంతానికి భూమిపై అకాల వర్షాలు, వరదలు, విపరీతమైన వేడి కారణంగా మనిషి బతికే పరిస్థితులు ఉండవన్న శాస్త్రవేత్తల హెచ్చరికలు నిజమవడం తథ్యమన్న అంచనాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకో రెండు నెలల్లో టర్కీలో వాతావరణ మార్పులపై ఐరాస సదస్సు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. భూతాపోన్నతిని తగ్గించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే మేలైన మార్గం అని అనుకునేవారు. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా మనం మారడం, భూతాపోన్నతికి అనుగుణంగా సర్దుకుపోవడాన్ని ఓడిపోవడంగా భావించేవారు. అయితే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వాతావరణ మార్పులను అడ్డుకోవడంలో ప్రపంచదేశాలన్నీ విఫలం కావడంతో ఇప్పుడు క్లైమేట్ అడాప్టేషన్ (వాతావరణానికి తగ్గట్టుగా మనం మారడం) అత్యవసరమైన విధానంగా మారిపోయింది. ఫలితంగా ఒకప్పుడు వివాదాస్పదమైన సౌర వికిరణ మార్పు పద్ధతికి ప్రాచుర్యం పెరుగుతోంది. సౌర వికిరణ మార్పు అంటే? సౌర వికిరణ మార్పు లేదా సోలార్ రేడియేషన్ మాడిఫికేషన్ (ఎస్ఆర్ఎం) అంటే సూర్యకాంతిలో కొంత భాగాన్ని మళ్లీ అంతరిక్షంలోకి పంపించడం అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే సూర్యుడికి అద్దం పట్టడం. అయితే ఇందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ ఏర్పాట్లు అవసరం. భూమిపై పడుతున్న సూర్యరశి్మలో కనీసం ఒక శాతాన్ని ఇలా వెనక్కు పంపించగలిగితే కర్బన ఉద్గారాల ద్వారా వాతావరణంలోకి చేరిన విషవాయువుల ప్రభావాన్ని తగ్గించవచ్చునని సగటు ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. నేలపై లేదంటే అంతరిక్షంలో భారీసైజున్న అద్దాలు ఏర్పాటు చేసి సూర్యుడి నుంచి పడే కాంతి మళ్లీ అంతరిక్షంలోకి చేరేలా చేయాలని ఆలోచించారు. అలాగే అప్పుడప్పుడూ రసాయన కణాలు చల్లడం ద్వారా మేఘాలు మరింత సౌర రేడియోధార్మికతను వెనక్కు పంపించగలమని అంచనాలున్నాయి. అగి్నపర్వతాలు బద్ధలైనప్పుడు వెలువడే పొగ ఆకాశాన్ని కమ్మేసి చాలాకాలంపాటు సూర్యరశ్మి కిందపడకుండా చేస్తున్నట్లు అన్నమాట. ఇదీ వివాదం... ఎస్ఆర్ఎం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది కానీ.. కర్బన ఉద్గారాలను తగ్గించదు. పైగా పర్యావరణ వ్యవస్థలపై దీని ప్రభావం ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. ఎలాగూ ఇది ఉందన్న సాకుతో పరిశ్రమలు, ప్రభుత్వాలు వాతావరణంలోకి చేరుతున్న విష వాయువులను తగ్గించడంపై దృష్టి పెట్టవన్నది మరో ఆందోళన. ఎస్ఆర్ఎం పద్ధతిని ఒకసారి వాడి... ఉష్ణోగ్రతలు తగ్గాయి కాబట్టి నిలిపేద్దామనుకుంటే అది కూడా ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ‘టెర్మినేషన్ షాక్’వల్ల భూమి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. 2023 నుంచి సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే కొత్త ఇంధన నిబంధనలు అమల్లోకి వచి్చన తర్వాత ఉష్ణోగ్రతలు వేగంగా పెరగడం ఈ టెర్మినేషన్ షాక్‌ను ధ్రువీకరిస్తున్నాయి. మరోవైపు ఎస్ఆర్ఎం పద్ధతిపై ఇప్పటివరకూ స్పష్టమైన విధానం, మార్గదర్శకాలు, నియంత్రణ వ్యవస్థలు లేవు. ఈ నేపథ్యంలో దీన్ని కర్బన ఉద్గారాల తగ్గింపునకు ప్రత్యామ్నాయంగా కాకుండా.. ఎమర్జెన్సీ ఏర్పాటుగా మాత్రమే చూడాలని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. 2024లో స్విట్జర్లాండ్ ఎస్ఆర్ఎంపై ఒక ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించగా పలు దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జపాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు మద్దతివ్వగా, పసిఫిక్, ఆఫ్రికా దేశాలు వ్యతిరేకించాయి. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌సహా కొందరు రిపబ్లికన్లు వాతావరణ మార్పులనే కొట్టిపారేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టర్కీలో జరగబోయే వాతావరణ మార్పుల సదస్సు ఎస్ఆర్ఎంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది. –సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పెయిన్‌లో భారీ వలసలు.. ముందే హెచ్చరించిన నిఘా సంస్థ!
మాడ్రిడ్: స్పెయిన్‌లోని సియుటా ప్రాంతంలోకి భారీగా వలసదారులు ప్రవేశించే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ నిఘా సంస్థ (CNI) ముందుగానే సమాచారం ఇచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రభుత్వ పత్రాల్లో ఉంది. అలాగే, జూలై 30న పెద్ద సంఖ్యలో వలసదారులు సరిహద్దు దాటే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన సందేశాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని అధికారులు గుర్తించారు.ముందే సోషల్ మీడియాలో ప్రచారంజూలై 29న జాతీయ నిఘా సంస్థ ఈ సమాచారాన్ని మొరాకో అధికారులు, సియుటా పరిపాలనకు పంపినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో మరుసటి రోజు సియుటాలోకి వెళ్లాలని వలసదారులను ప్రోత్సహించే సందేశాలు ప్రచారం అయినట్లు నిఘా సంస్థ గుర్తించింది. ఈ సందేశాలు దాదాపు 1.8 లక్షల మందికి చేరినట్లు అధికారులు అంచనా వేశారు.ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలుఅయితే, జూలై 30న సియుటాలోకి ఇంత పెద్ద సంఖ్యలో వలసదారులు వస్తారని ముందుగా ఊహించడం సాధ్యం కాలేదని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ గతంలో చెప్పారు. తాజాగా వచ్చిన పత్రాలను ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి.రెండు రోజుల్లో 72 వేల మంది రాకజూలై 30, 31 తేదీల్లో మొరాకో నుంచి సియుటాలోకి కనీసం 72 వేల మంది వలసదారులు వచ్చినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. వీరిలో చాలామంది సముద్రంలో ఈదుకుంటూ సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సియుటా మేయర్ తెలిపారు. దీంతో భారీగా వలసదారులు రావడంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.ప్రభుత్వం ఏం చెబుతోంది?ఈ ఘటనకు సంబంధించి 40కి పైగా భద్రతా పత్రాలను స్పెయిన్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అయితే, ముందుగా అందిన సమాచారం ద్వారా వలసదారుల రాక ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని అంచనా వేయలేకపోయామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, జూలై 29న వచ్చిన సమాచారం అధికారిక హెచ్చరిక కాదని, కేవలం సమాచారాన్ని పరస్పరం పంచుకున్నామని సియుటాలోని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.ఇవీ చదవండి: ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు! -
ఇది హ్యాకింగ్ కాదు! ఓపెన్ ఏఐ ఏజెంట్లకు కొత్త చిక్కులు!
వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఏఐ ఏజెంట్ల స్వతంత్ర కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలైంది. 'ఓపెన్ ఏఐ'కి చెందిన ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది మే నుంచి జూలై మధ్య తమకు విధించిన కొన్ని పరిమితులను దాటి, ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకునేందుకు 10కి పైగా వెబ్సైట్లను ఉపయోగించినట్లు పలువురు స్వతంత్ర పరిశోధకులు గుర్తించారు. రాయిటర్స్ పరిశీలించిన పలు పరిశోధన నివేదికలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.పరిశోధకుల వివరాల ప్రకారం.. ఈ ఏఐ ఏజెంట్లకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతికే బాధ్యత అప్పగించారు. ఇందుకోసం ఇంటర్నెట్లోని సమాచారాన్ని చదివి, అవసరమైన వివరాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే, ఇతర వెబ్సైట్లలో సమాచారం పోస్ట్ చేయకూడదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని పాత వికీ సైట్లు, ఆన్లైన్ టెక్స్ట్ స్టోరేజ్ సైట్లలో ఉన్న సాంకేతిక అవకాశాలను ఉపయోగించుకుని, ఏజెంట్లు అక్కడ సమాచారాన్ని నమోదు చేసినట్లు వారు గుర్తించారు.సులభంగా చెప్పాలంటే.. ఏఐ ఏజెంట్లకు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడే అవకాశం లేకపోయినా, కొన్ని వెబ్సైట్లలో చిన్నచిన్న సమాచారాన్ని రాసి ఉంచడం ద్వారా పరస్పరం సంకేతాలు పంపుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఒక పరిశోధకుడు ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లను 18 వెబ్సైట్లలో గుర్తించినట్లు తెలిపారు. మరో పరిశోధనా బృందం 23 సైట్లలో ఇలాంటి కార్యకలాపాలను గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఈ సంఖ్యలను పూర్తిగా స్వతంత్రంగా నిజమని తేల్చడం సాధ్యం కాలేదని రాయిటర్స్ తెలిపింది.ఈ కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించిన వెబ్సైట్లలో కొన్ని చాలా సాధారణమైనవే. వ్యక్తిగత వెబ్సైట్లు, గేమింగ్‌కు సంబంధించిన వికీలు, కెమిస్ట్రీ విద్యకు సంబంధించిన ఓ వెబ్సైట్, టెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పాత వెబ్‌సైట్‌తో పాటు రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన లింక్ షార్ట్నర్ సైట్లు కూడా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.పరిశోధకుల ప్రకారం ఇది నేరుగా హ్యాకింగ్ ఘటనగా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం కాదు. అయితే, ఏఐ ఏజెంట్లకు కొన్ని పనులు మాత్రమే చేయాలని, కొన్ని పనులు చేయకూడదని నియమాలు ఉన్నప్పటికీ వాటిని దాటుకుని సమాచారాన్ని పంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడం మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీనివల్ల భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఏఐ ఏజెంట్లకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, అవి చేసే పనులను మనుషులు ఎలా నిఘా ఉంచాలి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఈ వ్యవహారంపై ఓపెన్ ఏఐ స్పందిస్తూ, ఏఐ ఏజెంట్ల కార్యకలాపాలను విస్తృతంగా సమీక్షిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఏఐ వ్యవస్థలు తమకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించే పరిస్థితులను గుర్తించి, వాటిని నివేదించేందుకు ప్రత్యేక విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఏఐ వ్యవస్థలు మరింత స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దీ వాటి పనితీరుపై పర్యవేక్షణ, భద్రతా నియంత్రణలు కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇవి కూడా చదవండి: ఏఐ మరో సంచలనం.. జంతువుల భాష డీకోడ్ చేస్తూ.. -
9/11 ట్విన్ టవర్స్ అటాక్.. రెండు రోజుల ముందు
వాషింగ్టన్ డీసీ: సెప్టెంబర్ 11 ఈరోజు గుర్తుకొస్తే చాలు అమెరికన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడుతారు. రెండు విమానాలను హైజాక్ చేసి ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టడంతో వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. అందుకే ఆ దేశ చరిత్రలోనే అత్యంత భయానక ఉగ్రదాడిగా సెప్టెంబర్ 11ను అభివర్ణిస్తారు. అయితే ఆ దాడికి సరిగ్గా రెండురోజుల ముందు ఆల్‌ఖైదా సభ్యులు చేసిన పనిపై అమెరికన్ మీడియా సంచలన కథనం ప్రచురించింది.అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న అహ్మద్ షా మసూద్‌ను ఆల్‌ఖైదా సభ్యులు 2001 సెప్టెంబర్ 9న హత్య చేశారు. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ హత్య చోటుచేసుకుంది. తాలిబన్లకు ఆశ్రయం కల్పిస్తున్న సమయంలో, వారికి అనుకూలంగా ఒసామా బిన్ లాడెన్ ఈ హత్యను చేయించినట్లు కథనాలు ప్రచురితమయ్యాయి.న్యూస్ వీక్ కథనం ప్రకారం.. "అఫ్గానిస్థాన్‌లోని నార్తర్న్ అలయన్స్‌కు నాయకత్వం వహించిన మసూద్.. పంజ్‌షీర్ లోయలోని తన శిబిరంలో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండగా హత్యకు గురయ్యారు. వారిద్దరూ బెల్జియం టెలివిజన్‌కు చెందిన జర్నలిస్టులుగా పరిచయం చేసుకున్నారు. భద్రతా తనిఖీలను దాటి వారు మసూద్‌ను కలిశారు. అయితే, వారు తీసుకొచ్చిన వీడియో కెమెరాలో పేలుడు పదార్థాలను దాచి అనంతరం మసూద్‌ను కలిసిన సమయంలో ఆత్మాహుతి దాడి చేసి అతనిని అంతమెుందించారు. అయితే మసూద్ మరణాన్ని నార్తర్న్ అలయన్స్ అధికారికంగా సెప్టెంబర్ 15 వరకు బహిరంగంగా ధ్రువీకరించలేదు" అని కథనాలు ప్రచురితమయ్యాయి.ఈ హత్య ఎందుకు చేశారు?తాలిబన్లకు వ్యతిరేక పోరాటంలో మసూద్ కీలక వ్యక్తిగా ఉన్నారు. ఉత్తర అఫ్గానిస్థాన్‌లో ఆయన ఒక తిరుగుబాటు నెట్‌వర్క్‌ను నిర్మించారు. తాలిబన్లు దేశంపై నియంత్రణ సాధించే క్రమంలో ఆయన వారికి ప్రధాన సవాలుగా నిలిచారు. అంతేకాకుండా, ఆయన నాయకత్వం, ప్రజాదరణ తాలిబన్లను వ్యతిరేకించే వర్గాలకు ఆయనను అత్యంత ముఖ్యమైన నాయకుడిగా మార్చాయని. న్యూస్ వీక్ రాసుకొచ్చింది.అయితే ఈ నేపథ్యంలోనే బిన్ లాడెన్‌కు మసూద్ నుంచి ముప్పు ఉందని లాడెన్ భావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. తాలిబన్లు, అల్‌ఖైదాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మసూద్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో.. ఆయనను లేకుండా చేయడం బిన్ లాడెన్, అతని మిత్రులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 9 దాడుల తర్వాత అమెరికా తనపై జరపబోయే దాడులను ముందుగానే ఊహించిన నేపథ్యంలోనే మసూద్‌ను అంతమెుందించారని కథనాలు పేర్కొన్నాయి.బిన్ లాడెన్ హత్యసెప్టెంబర్ 11 దాడుల అనంతరం, అమెరికా తన కొత్త ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాకిస్థాన్ సహకారం కోసం ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో మహ్మూద్ అహ్మద్ అమెరికా అధికారులను కలిశారు. అమెరికా దళాలు కూడా కొద్దికాలానికే పాకిస్థాన్ భూభాగంలో రహస్యంగా మోహరించాయి. 2011, మే 2న అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్ నగరంలో ఉన్న అతని రహస్య స్థావరంపై ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పేరుతో మెరుపు దాడి చేసి అతనిని హతమార్చాయి. ఈ హత్య వివరాలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ప్రకటించారు. -
నేపాల్‌కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల పునర్నిర్మాణానికి 4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ల డాలర్ల మధ్య ఖర్చయ్యే అవకాశం ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.38,000 కోట్ల నుంచి రూ.47,550 కోట్ల మధ్య అవుతుంది.ఈ భారీ మొత్తాన్ని నేపాల్ ప్రభుత్వం ఒక్కటే భరించడం కష్టం కావడంతో.. దేశీయ నిధులు, రుణాలు, బీమా, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇతర దేశాల సాయం, వాతావరణ నిధులు వంటి మార్గాల ద్వారా డబ్బును సమీకరించాల్సి ఉంటుంది.నేపాల్‌లో భోటేకోషి, త్రిశూలీ లోయల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ విపత్తులో 1,357 మంది మరణించగా, 5,326 మంది గల్లంతయ్యారు. ఆస్తులు, ఇళ్లు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం $2.56 బిలియన్లుగా అంచనా వేశారు. అయితే పూర్తిస్థాయి పునర్నిర్మాణానికి $4 బిలియన్ నుంచి $5 బిలియన్ల వరకు అవసరమవుతుందని నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు.నేపాల్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే ఒత్తిడిలో ఉండటంతో మొత్తం ఖర్చును దేశీయంగా సమకూర్చడం సాధ్యం కాదు. ప్రభుత్వం బడ్జెట్‌ను మార్చి కేటాయించడం, రుణాలు తీసుకోవడం, బీమా పరిహారం, ప్రైవేట్ పెట్టుబడులను ఉపయోగించవచ్చు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు, గ్రాంట్లు పొందడం కీలకం కానుంది.బ్రిటన్, దక్షిణ కొరియా, అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే సాయం అందించాయి. వాతావరణ మార్పుల వల్ల జరిగే నష్టాలకు అందించే అంతర్జాతీయ ‘నష్టం-నష్టపరిహార నిధి’ నుంచి కూడా నేపాల్ సాయం కోరుతోంది. అయితే $4–$5 బిలియన్ల పునర్నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఈ నిధులు చాలా తక్కువగా ఉండటంతో, పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఆర్థిక సాయం అవసరం కానుంది. -
44 మంది పిల్లల ప్రాణాలు రక్షించిన పోలీసులు
థాయ్‌లాండ్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంలో బుధవారం ఓ కిండర్‌గార్టెన్ టీచర్‌ను ఓ దుండగుడు కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలలో ఉన్న 44 మంది పిల్లలతో పాటు మరో ముగ్గురు టీచర్లను సురక్షితంగా బయటకు తరలించారు.ఈ దాడి చోన్బురి ప్రావిన్స్‌లోని నాంగ్ప్లాలై మున్సిపల్ కిండర్‌గార్టెన్‌లో ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. దాడిలో ఏ విద్యార్థికీ గాయాలు కాలేదని చోన్బురి ప్రావిన్షియల్ ప్రభుత్వం తెలిపింది.ఇటీవల మృతి చెందిన ఓ మహిళ భర్తగా భావిస్తున్న నిందితుడు కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతను ఉంటున్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఈ ఘటన అనంతరం పాఠశాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బందికి మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం అందించాలని చోన్బురి గవర్నర్ నరిట్ నిరమైవోంగ్ ఆదేశించారు.గతంలోనూ కాల్పులుఆగస్టులో 14 ఏళ్ల విద్యార్థి తన హైస్కూల్, నివాస ప్రాంతంలో కాల్పులు జరిపి 8 మందిని చంపి, 20 మందికి పైగా గాయపరిచాడు. ఘటన తర్వాత థాయ్‌లాండ్‌లో పాఠశాలల భద్రత, తుపాకీ హింసపై ఆందోళనలు పెరిగాయి. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో కాంఫెంగ్ ఫెట్ ప్రావిన్స్‌లో మరో 14 ఏళ్ల బాలుడిని పాఠశాలలో పలు రౌండ్లు కాల్పులు జరిపిన కేసులో అరెస్టు చేశారు. ఆ ఘటనలో ఎవరూ గాయపడలేదు.తుపాకులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కొత్త తుపాకుల కొనుగోలు అనుమతులను నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఉన్న అనుమతులను సమీక్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఆసియాలో తుపాకుల యాజమాన్య రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో థాయ్‌లాండ్ ఒకటి. -
ట్రంప్ మామలో కొత్తకోణం.. తన ఉద్యోగులకు!
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటే చాలు... ఇరాన్‌పై దాడి.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. ప్రపంచ దేశాలపై అధిక పన్నులు ఇలా తలతిక్క నిర్ణయాలతో ఆయన చేసే పిచ్చిపనులే గుర్తొస్తాయి.. తనకు నచ్చిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేసే ట్రంప్.. ఆయనలోనూ మానవత కోణం ఉందని నిరూపించారు. వైట్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగులకు హాలిడే ట్రిప్ నిమిత్తం కొంత నగదుని బహుమతిచ్చినట్లు వైట్‌హౌస్ కథనాలు పేర్కొన్నాయి.డొనాల్డ్ ట్రంప్ తన కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్‌కు 45,000 డాలర్ల నగదు బహుమతిని అందజేశారని అదే విధంగా వైట్ హౌస్‌లోని మరో ఇద్దరు ఉద్యోగులైన మార్గో మార్టిన్, ఛాంబర్లేన్ హారిస్ కూడా దాదాపు అంతే మొత్తంలో డబ్బు అందుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఆ ముగ్గురు మహిళలు ఆ డబ్బులను హాలిడే ట్రిప్‌ల నిమిత్తం ట్రంప్ గిప్ట్గా ఇచ్చినట్లు కథనం ప్రచురించింది.ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక కార్యనిర్హాహక సహాయకురాలు హార్ప్ నిరంతరం ఆయన పక్కనే ఉంటూన్నారు, కొన్నిసార్లు ఆయన కోసం సోషల్ మీడియా పోస్టులను టైప్ చేయడం, సమాచారాన్ని ప్రింట్ చేయడం వంటి పనులు చేస్తూ వచ్చారు. ఈ పాత్ర కారణంగా ఆమెకు "హ్యూమన్ ప్రింటర్" అని వైట్ హౌస్ వర్గాలు పిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో హాలిడే ట్రిప్ కోసం పెద్దమెుత్తంలో నగదు బహుమతి అందుకున్నారు.ఉద్రిక్తంగా పశ్చిమాసియా యుద్ధంకాగా ప్రసతుం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) వరుసగా రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడికి ప్రయత్నించడంతో.. అమెరికా తీవ్రంగా స్పందించి ప్రతి దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు రవాణా నౌకలను అమెరికా బలగాలు తాజాగా ధ్వంసం చేశాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.గత రెండు రోజుల్లో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని CENTCOM తెలిపింది. అయితే రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుని, ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ తాజా దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింతగా ముదిరాయి. -
9/11 వేళ.. గాల్లోకి లేచిన ఒకేఒక్క విమానం!
సెప్టెంబర్ 11, 2001.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. విమానాలను హైజాక్ చేసి అమెరికాపై భీకర దాడులకు పాల్పడింది ఉగ్రసంస్థ అల్‌ఖైదా. అయితే ఆ దాడుల వేళ దేశవ్యాప్తంగా పౌర విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆకాశం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కానీ.. ఆ భయానక పరిస్థితుల్లోనూ ఓ విమానానికి ప్రత్యేక అనుమతితో గాల్లోకి ఎగిరింది.సెప్టెంబర్ 9/11 దాడుల తర్వాత.. అనంతరం అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా పౌర విమానాలను నేలకే పరిమితం చేసింది. అమెరికా చరిత్రలో ఇలాంటి దేశవ్యాప్త పౌర విమానాల నిలిపివేత ఇదే తొలిసారి. అయితే ఆనాడు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. సైనిక, అత్యవసర వైద్య విమానాలే తిరిగాయి. ఈ క్రమంలో.. ఎఫ్ఏఏకు ఓ ఎమర్జెన్సీ కాల్ వచ్చింది.ఫ్లోరిడాకు చెందిన స్నేక్ ఎక్స్పర్ట్ లారెన్స్ వాన్ సెర్టిమా.. ఒక ఇన్లాండ్ టైపాన్ పామును తిరిగి దాని బోనులో పెట్టే ప్రయత్నం చేయగా అది ఆయన బొటనవేలిని కాటేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్లాండ్ టైపాన్ అనేది అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. కాటు తర్వాత ఆయన పరిస్థితి వేగంగా విషమించింది. స్పృహ కోల్పోవడంతోపాటు కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. మయామిలోని వైద్యులు అందుబాటులో ఉన్న యాంటీవెనమ్తో చికిత్స ప్రారంభించారు. అయితే అది సరిపోలేదు. ఇన్లాండ్ టైపాన్ విషానికి ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవెనమ్ అవసరమైంది. ఆ మందు అప్పట్లో న్యూయార్క్, శాన్‌డియాగోలోని జంతుప్రదర్శనశాలల్లో మాత్రమే లభ్యమవుతోంది. 9/11 దాడులతో న్యూయార్క్ పూర్తిగా కల్లోలంలో ఉండటంతో.. వైద్య బృందం దృష్టి శాన్డియాగోపై పడింది. వాన్ సెర్టిమా పరిస్థితి మరింత విషమించడంతో వైద్య, అగ్నిమాపక అధికారులు విమాన ప్రయాణానికి ప్రత్యేక అనుమతి కోరారు. గంటలపాటు చర్చల అనంతరం FAA అనుమతించింది. 2001 సెప్టెంబర్ 12న శాన్‌డియాగో నుంచి ఒక చిన్న లియర్‌జెట్ బయలుదేరింది. విమానం అమెరికా మీదుగా ప్రయాణిస్తుండగా రెండు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. శాన్‌డియాగో నుంచి తెచ్చిన అదనపు యాంటీవెనమ్ మయామికి చేరిన తర్వాత వైద్యులు వెంటనే వాన్ సెర్టిమాకు అందించారు. చికిత్సకు స్పందించిన ఆయన చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల తర్వాత టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పాముదేం తప్పు లేదు..తన నిర్లక్ష్యమే కారణమంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారాయన.అమెరికా చరిత్రలో చీకటి రోజుసెప్టెంబర్ 9, 2001.. 19 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేశారు. రెండు విమానాలను న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టించారు. మూడో విమానాన్ని వాషింగ్టన్ సమీపంలోని పెంటగాన్‌పైకి దించారు. నాలుగో విమానం ఫ్లైట్ 93ను ప్రయాణికులు తిరగబడటంతో పెన్సిల్వేనియాలోని ఖాళీ ప్రదేశంలో కూల్చివేశారు.ఉదయం 8.46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. 9.03 గంటలకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. 9.37 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. 10.03 గంటలకు ఫ్లైట్ 93 పెన్సిల్వేనియాలో కూలిపోయింది. కొద్దిసేపటికే ట్విన్ టవర్స్ రెండూ కుప్పకూలాయి.దాదాపు 3 వేల మంది బలి..9/11 దాడుల్లో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో న్యూయార్క్‌లో 2,753 మంది, పెంటగాన్‌లో 184 మంది, ఫ్లైట్ 93లో 40 మంది ఉన్నారు. 90కుపైగా దేశాలకు చెందిన ప్రజలు బాధితుల్లో ఉన్నారు. ఈ దాడులకు బాధ్యులు ఆల్‌ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లు. వారంతా ఆల్‌ఖైదా శిక్షణ పొందినవారేనని ఎఫ్‌బీఐ దర్యాప్తులో తేలింది. ఈ దాడుల వెనుక ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు దర్యాప్తు నిర్ధారించింది. బిన్ లాడెన్ 2011 మే 2న పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఇదీ చదవండి: పారిస్‌లోనూ ఇదెక్కడి వివక్ష! -
చక్కెర కేజీ రూ.140!
పండుగ సీజన్లో చక్కెర ధరల మంట ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లోనూ కిలో పంచదార రూ.62.57కు చేరి.. గత నెలతో పోలిస్తే 27 శాతం అధికంగా ఉంది. ఇదే సమయంలో పొరుగున నేపాల్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దసరా, తిహార్ పండుగలు సమీపిస్తుండటంతో డిమాండ్ పెరగడం, దిగుమతి వ్యయాలు అధికం కావడంతో కిలో పంచదార ధర ఏకంగా రూ.140కు చేరింది.కాఠ్మాండులోని సిగల్ ప్రాంతంలో పంచదార ధరలు భారీ స్థాయిలో పెరిగాయి. రెండు వారాల క్రితం ఇదే పంచదార రూ.115కే లభించింది. ఇటు భక్తపూర్‌లోని గట్టాఘర్లో కిలో ధర రూ.130గా ఉంది. ఇలా ఏరియాలను బట్టి.. కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు వ్యాపారులు పెంచేస్తున్నారు. నేపాల్ రిటైల్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవిత్ర బజ్రాచార్య మాట్లాడుతూ.. హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల్లో కిలో పంచదార ధరను రూ.125 వరకు పెంచారని తెలిపారు. దిగుమతి ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారని పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదలకు రిటైలర్లే కారణమనే వాదనను ఆయన ఖండించారు.సర్కారీ దుకాణాల్లో ఎంతంటే..మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) దుకాణాల్లో మాత్రం కిలో పంచదార రూ.105కే విక్రయిస్తున్నారు. అయితే సరఫరాలో అంతరాయం కారణంగా ఒక్కో వినియోగదారుడికి విక్రయించే పరిమితిని ఆరు కిలోల నుంచి రెండు కిలోలకు తగ్గించారు. ప్రభుత్వ దుకాణాలు, బహిరంగ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం చర్చనీయాంశంగా మారింది. పండుగల వేళ పంచదారకు డిమాండ్ పెరుగుతుందని తెలిసినా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో పంచదార అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధరకు విక్రయించడం వినియోగదారులకు అన్యాయమని వ్యాపార సంఘాల ప్రతినిధులు అంటున్నారు.25 వేల టన్నుల దిగుమతికి అనుమతిధరలను అదుపులోకి తెచ్చేందుకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాల్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్ 25 వేల టన్నుల పంచదారను కేవలం ఒక శాతం కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకునేందుకు కేబినెట్ అనుమతించింది. ఈ సరుకు చేరే వరకు దేశీయ చక్కెర కర్మాగారాల నుంచి సుమారు 15 వేల టన్నుల పంచదారను ఎస్టీసీ, ఫుడ్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.అదే సమయంలో భారత్ నుంచి పంచదార దిగుమతి చేసుకునేందుకు STC చర్యలు ప్రారంభించింది. భారత్ సరఫరాకు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో నేపాల్‌లో ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏటా 2.5 లక్షల టన్నుల అవసరంనేపాల్లో ఏడాదికి సుమారు 2.5 లక్షల టన్నుల పంచదార అవసరం కాగా.. దేశీయంగా గరిష్ఠంగా 1.9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం దేశీయ చెరకు క్రషింగ్ సీజన్ ముగిసింది. తదుపరి సీజన్ డిసెంబరులో ప్రారంభం కానుంది. దీంతో అప్పటివరకు దిగుమతులపైనే నేపాల్ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంది. ఇప్పటికే ఎస్టీసీ దేశీయ ఉత్పత్తిదారుల నుంచి సుమారు 600 టన్నుల పంచదార కొనుగోలు చేసింది. రవాణా మార్గాల్లో అంతరాయాల కారణంగా గతంలో సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పండుగల డిమాండ్ పెరగకముందే తగినంత నిల్వలు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.భారత్ సరఫరాపైనే ఆశలుమరోవైపు నేపాల్ పంచదార అవసరాల్లో భారత్ కీలకంగా మారింది. దేశీయ ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే సరఫరాపైనే నేపాల్ మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటికే 2,500 టన్నుల పంచదార నేపాల్‌కు చేరే ప్రక్రియలో ఉండగా.. మరో 2,500 టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తి, దేశీయ డిమాండ్, ఎగుమతి విధానాలు ఎలా ఉంటాయన్నదానిపై కూడా నేపాల్ పంచదార ధరలు ఆధారపడనున్నాయి. భారత్‌పైనా ధరల ఒత్తిడిమరోవైపు భారత్‌లోనూ పంచదార రంగం కీలక దశలో ఉంది. దేశీయ ఉత్పత్తి, ఎగుమతులు, పండుగల సీజన్లో పెరిగే డిమాండ్ నేపథ్యంలో సరఫరా–ధరలపై మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ భారత్ నుంచి దిగుమతులపై ఆధారపడటం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌లో సరఫరా పరిస్థితి, ఎగుమతి విధానాలు నేపాల్‌లో పంచదార ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పండుగల డిమాండ్ నేపథ్యంలో రెండు దేశాల్లోనూ పంచదార ధరల పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: ‘అదొక పనికిరానిది..’ ఇరాన్‌కు అమెరికా కౌంటర్ -
చైనా కండకావరం.. లైవ్‌లోనే ఏకిపారేశాడు
దక్షిణ చైనా సముద్ర వివాదం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరుగుతున్న డిఫెన్స్ డైలాగ్‌కు ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో సీ. టియోడోరో హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతున్న టైంలో చైనా తరఫున ఓ నోట్ అందింది. ప్రసంగం మధ్యలో అందిన ఆ లేఖను టియోడోరో అక్కడే బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు.. చైనా తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టియోడోరో ప్రసంగిస్తుండగా తెల్లటి కోటు ధరించిన ఓ వ్యక్తి ఆయన వెనుక నుంచి వచ్చి టేబుల్‌పై ఓ కాగితాన్ని ఉంచాడు. సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన మిలిటరీ అటాషే ఆ నోట్‌ను సిబ్బందికి అందించినట్లు సమావేశ నిర్వాహకులు తెలిపారు. అయితే అది టియోడోరో బృందం నుంచి వచ్చిన సందేశమని భావించిన సిబ్బంది.. ప్రసంగం మధ్యలోనే దాన్ని మంత్రికి అందించారు.నోట్ తీసుకున్న టియోడోరో.. ‘‘ఇది చైనా నుంచి వచ్చినదని అనుకుంటున్నాను. దీన్ని చదవనా?’’ అంటూ సభికులను ఉద్దేశించి అన్నారు. అనంతరం దానిలోని విషయాలను బహిరంగంగా చదివారు.‘అంతర్జాతీయ చట్టాన్ని అవమానించారు’దక్షిణ చైనా సముద్రంపై 2016లో జరిగిన మధ్యవర్తిత్వ తీర్పుపై చైనా తన వైఖరిని నోట్లో స్పష్టం చేసింది. ఆ తీర్పు అంతర్జాతీయ చట్టంలోని ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించిందని పేర్కొంది. అయితే ఈ వాదనను టియోడోరో తీవ్రంగా తప్పుబట్టారు. తన ప్రసంగం మధ్యలో ఇలా నోట్ పంపడం దక్షిణ కొరియాను, ఈ కార్యక్రమ నిర్వాహకులను, అక్కడి ప్రతినిధులను అవమానించడమేనని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన నిబంధనలను చైనా గౌరవించడం లేదని విమర్శించారు.ఇది బెదిరించడమే..చైనా చర్యను.. బెదిరించడం, వేధించడమే అవుతుంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నోట్‌ను చైనా ఎంత నిరాశలో ఉందో గుర్తుచేసే జ్ఞాపికగా దాచుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నోట్‌ను అందించిన వ్యక్తిని ఉద్దేశించి కూడా టియోడోరో వ్యంగ్యంగా మాట్లాడారు. అతను తన దేశానికి గొప్ప సేవ చేశాడంటూ వ్యాఖ్యానించారు.PHILIPPINES SHREDS CHINA OVER SOUTH CHINA SEA RULING IN FRONT OF THE WORLDYOU LOST : PHILIPPINE DEFENCE CHIEF PUBLICLY REBUKES CHINESE MILITARY OFFICIALA dramatic confrontation unfolded at a defence forum in seoul after a chinese military attaché handed a note to philippine… pic.twitter.com/QiwwlluQVl— Raj anand (@Rajanand7654) September 9, 2026దక్షిణ చైనా సముద్రంపై వివాదంఫిలిప్పీన్స్, చైనా మధ్య దక్షిణ చైనా సముద్రంపై చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. 2016లో ఫిలిప్పీన్స్ దాఖలు చేసిన కేసులో మధ్యవర్తిత్వ ట్రైబ్యునల్.. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తృత చారిత్రక హక్కుల వాదనకు చట్టపరమైన ఆధారం లేదని తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ)లోని వనరులపై చైనాకు హక్కు లేదని పేర్కొంది.అయితే ఈ తీర్పును చైనా తిరస్కరిస్తూ.. ఆ ట్రైబ్యునల్‌కు ఈ కేసుపై విచారణ జరిపే అధికారమే లేదని చెబుతోంది. మరోవైపు చైనా తమ సముద్ర హక్కులను ఉల్లంఘిస్తోందని ఫిలిప్పీన్స్ తరచూ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా డిఫెన్స్ ఫోరంలో నోట్ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరోసారి తెరపైకి తెచ్చింది.ఇదీ చదవండి: ఎడారికి సముద్రపు నీరు!! ఎలా వచ్చిందో తెలుసా? -
మోదీకి ఊహించని షాక్.. భారత్‌కు ముయిజ్జు వెన్నుపోటు?
ఒకప్పుడు ‘ఇండియా ఔట్’ అంటూ భారత్‌ను మాల్దీవుల నుంచి దూరం చేయాలని ప్రయత్నించిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. ఇటీవలే న్యూఢిల్లీతో స్నేహగీతం ఆలపించారు. భారత్ సాయంతో నిర్మిస్తున్న థిలమాలే బ్రిడ్జిని ఇరు దేశాల శాశ్వత స్నేహానికి ప్రతీకగా కొనియాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే భారత్‌కు షాకిస్తూ.. వ్యూహాత్మకంగా కీలకమైన థిలాఫుషి పోర్ట్ ప్రాజెక్టును చైనా కంపెనీకి అప్పగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి రావడంతో ముయిజ్జు భారత్‌కు వెన్నుపోటు పొడిచారా? అన్న చర్చ మొదలైంది.మాల్దీవుల ప్రభుత్వ ఆధీనంలోని మాల్దీవ్స్ పోర్ట్స్ లిమిటెడ్.. థిలాఫుషి పోర్ట్ అభివృద్ధి తొలి దశ పనులను చైనా హార్బర్ ఇంజినీరింగ్ కంపెనీకి అప్పగించింది. ప్రస్తుతం మాలేలోని పోర్టులపై ఉన్న రద్దీని తగ్గించి.. దేశ వాణిజ్య కార్యకలాపాల్లో కీలక భాగాన్ని థిలాఫుషికి తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అంటే భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటిగా థిలాఫుషి మారబోతోంది. ఇక్కడే భారత్‌కు అసలు ట్విస్ట్ ఎదురవుతోంది. అదే థిలాఫుషికి భారత్ భారీ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తోంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టు కింద మాలే, విలిమాలే, గుల్హిఫాల్హు, థిలాఫుషిలను అనుసంధానించే 6.7 కిలోమీటర్ల బ్రిడ్జిలు, రహదారులు, కాజ్‌వేలను భారత్ నిర్మిస్తోంది. 400 మిలియన్ డాలర్ల రుణం, మరో 100 మిలియన్ డాలర్ల గ్రాంట్‌తో ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తోంది.అంటే.. థిలాఫుషికి చేరుకునే కనెక్టివిటీని భారత్ నిర్మిస్తుంటే.. అక్కడి కీలక పోర్టును చైనా అభివృద్ధి చేయబోతోంది. హిందూ మహాసముద్రంలో కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉన్న మాల్దీవుల విషయంలో ఈ పరిణామం సాధారణ నిర్మాణ ఒప్పందంగా చూడలేని పరిస్థితి. మౌలిక వసతుల వెనుక భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉంటాయి.భారత్‌కు నమ్మకద్రోహం..ఇక, ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తీరు చూస్తే ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. 2023లో ‘ఇండియా ఔట్’ ప్రచారంతో అధికారంలోకి వచ్చిన ఆయన.. తొలుత చైనాతో సంబంధాలను బలోపేతం చేశారు. తన తొలి విదేశీ పర్యటనను కూడా చైనాలోనే చేపట్టారు. భారత్ సైనిక సిబ్బందిని వెనక్కి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆర్థిక సంక్షోభం ముయిజ్జును మళ్లీ భారత్‌వైపు చూసేలా చేసింది. భారీ రుణభారం, ఆర్థిక ఒత్తిళ్ల సమయంలో భారత్.. మాల్దీవులకు ఆర్థిక సహాయం అందించింది. 400 మిలియన్ డాలర్ల కరెన్సీ స్వాప్ సదుపాయంతో పాటు రూ.3,000 కోట్ల మేర సహకారం అందించింది. దీంతో ముయిజ్జు వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇటీవల థిలమాలే బ్రిడ్జిని ప్రశంసించడం, మోదీకి కృతజ్ఞతలు చెప్పడం కూడా ఈ మార్పులో భాగమే. దీంతో మాల్దీవులు పూర్తిగా భారత్ వైపు వచ్చేశాయని భావించిన సమయంలోనే.. చైనాకు థిలాఫుషి పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వడం కొత్త ప్రశ్నలను తెరపైకి తెచ్చింది.అయితే, మాల్దీవులకు ఆర్థికంగా భారత్ అవసరం.. మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో చైనా కూడా కీలక భాగస్వామే. అందుకే మాలే ఒకరిని ఎంచుకోవడం కంటే ఇద్దరితోనూ సంబంధాలు కొనసాగించాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ, భారత్‌కు మాత్రం థిలాఫుషి పరిణామం కీలక హెచ్చరిక. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీకి అనుసంధానంగా ఉన్న కీలక పోర్టు చైనా చేతుల్లోకి వెళ్లడం.. హిందూ మహాసముద్రంలో బీజింగ్ ప్రభావం పెరగడానికి మరో అవకాశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.భారత్‌కు నష్టం ఎక్కడ?మొదటిది.. వ్యూహాత్మక ప్రభావం. భారత్ నిర్మిస్తున్న కనెక్టివిటీ చివరకు చైనా కంపెనీ అభివృద్ధి చేస్తున్న కీలక వాణిజ్య పోర్టుకు కూడా ఉపయోగపడుతుంది. అంటే భారత్ నిర్మించిన మౌలిక వసతులు మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు.. చైనా ప్రభావం ఉన్న పోర్టు ప్రాంతానికి యాక్సెస్‌ను మరింత సులభం చేయవచ్చు.రెండోది.. చైనా ప్రభావం పెరిగే అవకాశం. థిలాఫుషి భవిష్యత్తులో మాల్దీవుల ప్రధాన కార్గో హబ్‌గా మారనుంది. అక్కడ చైనా కంపెనీకి నిర్మాణపరమైన కీలక పాత్ర లభించడం వల్ల బీజింగ్‌కు మాల్దీవుల సముద్ర వాణిజ్య మౌలిక వసతుల్లో మరింత పట్టు ఏర్పడే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా హిందూ మహాసముద్రంలో ఇది భారత్‌కు సున్నితమైన అంశం.మూడోది.. భారత్ ప్రభావానికి సవాలు. 2024లో భారత్, మాల్దీవులు థిలాఫుషిలో ఆధునిక వాణిజ్య పోర్టు అభివృద్ధిపై కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఇప్పుడు చైనా సంస్థకు కీలకమైన పనులు వెళ్లడం.. మాలే తన మౌలిక వసతుల భాగస్వామ్యాలను భారత్‌తో మాత్రమే పరిమితం చేయడం లేదని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా? -
హర్ముజ్‌లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన అత్యాధునిక మానవరహిత జలాంతర్గామిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో అమెరికా దళాలు ఐదు ఇరానియన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) అధికారిక మీడియా ‘సెపాహ్ న్యూస్’ ప్రకారం.. సంక్లిష్టమైన నిఘా ఆపరేషన్‌లో అమెరికాకు చెందిన డైవ్ ఎల్డీ(Dive-LD) మానవరహిత అండర్‌వాటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక అండర్‌వాటర్ టెక్నాలజీ కలిగిన వాహనంగా దీన్ని ఇరాన్ అభివర్ణించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపుహర్ముజ్ జలసంధిపై ఓ అమెరికా డ్రోన్( MQ-9 Reaper)ను కూల్చివేసినట్లు కూడా ఐఆర్జీసీ ప్రకటించింది.అమెరికా రియాక్షన్ ఇదేఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించింది. తమ మానవరహిత అండర్‌వాటర్ వాహనం ఒకటి అంతకుముందు రోజు పనిచేయకుండా నిలిచిపోయిందని అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఇరాన్ స్వాధీనం చేసుకున్నది అదే వాహనమా అనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఆ వాహనం పాత మోడల్ అని.. అందులో సున్నితమైన సమాచారం, రహస్య సోనార్ లేదంటే రాడార్ పరికరాలు లేవని పెంటగాన్ వెల్లడించింది.ఐదు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడిఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. తమ యుద్ధనౌకపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఐదు ఇరానియన్ ముడిచమురు ట్యాంకర్లను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో అమెరికా నౌకపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో రెండుసార్లు దాడికి ప్రయత్నించిందని సెంట్కామ్ పేర్కొంది.ఇరాన్ విమానయాన సంస్థలపై ఆంక్షలుమరోవైపు అమెరికా ఆర్థిక శాఖ ఇరాన్‌కు చెందిన మరో 27 విమానయాన సంస్థలను ప్రత్యేక ఆంక్షల జాబితాలో చేర్చింది. ఇరాన్ పాలనకు, ఐఆర్‌జీసీకి ఆయుధాల రవాణా, సిబ్బంది తరలింపులో వాణిజ్య విమానయాన సంస్థలు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.‘వాళ్లు పశ్చాత్తాపపడే వరకు..’ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మాత్రం.. యుద్ధంలో విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదని.. అయితే దాడులను ఎదుర్కొనేందుకు తమ ప్రతిఘటన కొనసాగుతుందని తెలిపారు. ఆక్రమణదారులు పూర్తిగా పశ్చాత్తాపపడే వరకు బలంగా పోరాడతామని పేర్కొన్నారు.మళ్లీ ముదిరిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలుఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధానికి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ప్రతిదాడులు చేసింది. అనంతరంహర్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. జూన్ 18న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ.. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి.ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా -
మొజ్తబా ఖమేనీపై సంచలన ఆరోపణలు
పశ్చిమాసియా యుద్ధంలో తండ్రి అయతొల్లా ఖమేనీ మరణాంతరం.. ఊహించని రీతిలో ఇరాన్‌కు సుప్రీం బాధ్యతలు చేపట్టాడు మొజ్తబా ఖమేనీ. అయితే యుద్ధంలో గాయపడిన ఆయన.. దాదాపు ఆరు నెలల నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ పాలనలో కీలక భాగస్వామ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన మీద సంచలన ఆరోపణలు తెర మీదకు వచ్చాయి.ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయంటూ బ్రిటన్ మీడియాలో వచ్చిన కథనాలు తీవ్ర చర్చకు దారితీశాయి. బ్రిటన్‌లోని ‘ది సండే టైమ్స్’ సహా పలు మీడియా సంస్థల కథనాల ప్రకారం.. లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు మొజ్తబా ఖమేనీకి చెందినవిగా పేర్కొన్నారు. ఆ భవనం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలోనే ఉండటం ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచింది.అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఖమేనీకి ఇరాన్‌లోనే కాదు.. విదేశాల్లోనూ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.‘ఆరోపణలు పూర్తిగా నిరాధారం’బ్రిటన్ మీడియా సంస్థలు చేసిన ఆరోపణలను ఇరాన్ రాయబార కార్యాలయం ‘పూర్తిగా నిరాధారం’గా అభివర్ణించింది. మొజ్తబా ఖమేనీ తన తండ్రిలాగే ఎలాంటి ఆస్తులు కలిగి లేరని పేర్కొంది. ఆయన నిరాడంబరమైన జీవనశైలిని ఇరాన్ ప్రజలు బాగా తెలుసని తెలిపింది. ఖమేనీకి దేశంలోగానీ.. విదేశాల్లోగానీ ఆస్తులు ఉన్నాయన్న ప్రచారం ఆయన జీవితం, వ్యక్తిత్వంపై తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించేందుకేనని రాయబార కార్యాలయం ఆరోపించింది.లండన్‌లోని కెన్సింగ్టన్లో పాలెస్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లు.. ఆరో, ఏడో అంతస్తుల్లో ఉన్నాయని, వాటిని 2014, 2016 సంవత్సరాల్లో మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసినట్లు బ్రిటన్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆస్తుల యాజమాన్యం ఖమేనీతో ముడిపడి ఉందన్న విషయాన్ని ఇటీవలే గుర్తించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.అరెస్టులతో ముడిపెట్టి ప్రచారంలండన్లో యూదు సమాజానికి సంబంధించిన వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టినట్లు అనుమానిస్తూ నలుగురు ఇరానియన్, బ్రిటిష్-ఇరానియన్ వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ ఆస్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని గమనించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈ ఫ్లాట్లు ఉండటంపై కూడా బ్రిటన్ మీడియాలో చర్చ జరిగింది. రాయబార కార్యాలయానికి 50 మీటర్లలోపే ఈ భవనం ఉందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే బ్రిటన్ మీడియా కథనాలకు ఇరాన్ ఇచ్చిన సమాధానం మాత్రం స్పష్టంగా ఉంది. మొజ్తబా ఖమేనీకి ఎక్కడా ఆస్తులు లేవని.. ఆయన నిరాడంబర జీవితం గడుపుతున్నారని రాయబార కార్యాలయం చెబుతోంది. ఇదీ చదవండి: అలా నెతన్యాహు ఇరుకున్నారా? -
ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వైట్‌హౌస్ సిబ్బందికి చెరో 45 వేల డాలర్ల చొప్పున నగదు బహుమతులు ఇచ్చినట్లు వారి వార్షిక ఆర్థిక వివరాల ద్వారా వెల్లడైంది. ముగ్గురికీ కలిపి ట్రంప్ అందించిన బహుమతుల విలువ 1.35 లక్షల డాలర్లు. ఈ మొత్తాలు వారు ప్రభుత్వ ఖజానా నుంచి పొందే వార్షిక 1.50 లక్షల డాలర్ల వేతనాలకు అదనం.ట్రంప్ నుంచి నగదు బహుమతి అందుకున్న వారిలో నటాలీ హార్ప్, ఛాంబర్లైన్ హారిస్, మార్గో మార్టిన్ ఉన్నారు. ఈ ముగ్గురూ తమ ఆర్థిక వివరాల్లో చెల్లింపులకు ట్రంప్‌నే మూలంగా పేర్కొన్నారు. ‘హాలిడేస్ సందర్భంగా నగదు బహుమతి’గా వాటిని వివరించారు. ట్రంప్‌కు ప్రత్యేక సహాయకురాలు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా హార్ప్ పనిచేస్తున్నారు. అధ్యక్షుడి వెంట తరచూ కనిపిస్తూ ఆయన కోసం కథనాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సమాచారాన్ని ప్రింట్ చేస్తుండటంతో ఆమెకు ‘హ్యూమన్ ప్రింటర్’ అనే పేరు వచ్చింది.ఓవల్ ఆఫీస్ కార్యకలాపాల డిప్యూటీ డైరెక్టర్, అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా హారిస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాషింగ్టన్లో నిర్మాణ, డిజైన్ అంశాలను పరిశీలించే ఫెడరల్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లోనూ ట్రంప్ ఆమెను నియమించారు. ట్రంప్ ప్రతిపాదించిన వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టును ఈ కమిషన్ పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆమె నియామకంపై మాజీ కమిషన్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ట్రంప్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా ఉన్న మార్టిన్ కూడా అధ్యక్షుడితో తరచూ ప్రయాణిస్తారు. ట్రంప్ మలేషియాలో టార్మాక్‌పై నృత్యం చేస్తున్న దృశ్యాలు, ఓవల్ ఆఫీస్‌లో సందర్శకులతో మాట్లాడుతున్న దృశ్యాలు సహా ఆయనకు సంబంధించిన వీడియోలను రికార్డు చేసి ప్రచురిస్తుంటారు.ఈ నగదు బహుమతులు ఏ పరిస్థితుల్లో ఇచ్చారనే దానిపై ఆర్థిక వివరాల్లో పరిమిత సమాచారం మాత్రమే ఉంది. అయితే ట్రంప్ తరఫున వైట్‌హౌస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనూ, ప్రైవేటు రంగంలో ఉన్న సమయంలోనూ తన పరిధిలోని వ్యక్తులు, ఉద్యోగులు, సహాయకులకు క్రిస్మస్ బహుమతులు ఇవ్వడం అధ్యక్షుడికి చాలా కాలంగా ఉన్న సంప్రదాయమని తెలిపారు. ఈ బహుమతులకు వారి అధికారిక ప్రభుత్వ విధులతో సంబంధం లేదని, సంబంధిత చట్టపరమైన, నైతిక ప్రమాణాల ప్రకారం అవి అనుమతించదగినవేనని స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ముదిరిన అమెరికా–కెనడా వాణిజ్య యుద్ధం.. సుంకాలకు ప్రతిసుంకాలు! -
ముదిరిన అమెరికా–కెనడా వాణిజ్య యుద్ధం.. సుంకాలకు ప్రతిసుంకాలు!
న్యూఢిల్లీ: అమెరికా–కెనడా మధ్య వాణిజ్య పోరు మరింత ముదిరింది. కెనడా నుంచి దిగుమతి అయ్యే మద్యం, మోటార్‌సైకిళ్లు, పాల ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే అమెరికా ప్రభుత్వ సంస్థలు కెనడా ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. కెనడా అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (సెప్టెంబర్ 8) ట్రంప్ కెనడా నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిషేధం సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి రానుంది.మరోవైపు కెనడా ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ ప్రధాన కొనుగోలు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ వెంటనే ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ), అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యూఎస్టీఆర్)లను ట్రంప్ ఆదేశించారు. అమెరికా వ్యాపారాలకు కెనడాలో సమాన మార్కెట్ అవకాశాలు కల్పించే వరకు కెనడా ఉత్పత్తులను అమెరికా ప్రభుత్వ సరఫరా జాబితాల్లో చేర్చబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ‘నో రెసిప్రాసిటీ – నో యాక్సెస్’ అనే విధానాన్ని ప్రకటించారు. జీఎస్ఏలోని కొనుగోలు జాబితాల్లో ఏటా 50 బిలియన్ డాలర్లకుపైగా విలువైన లావాదేవీలు ఉంటాయని తెలిపారు.ఇదిలా ఉండగా, మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమెరికా వస్తువులపై కెనడా విధించిన ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చాయి. గత నెలలో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమైన తర్వాత కెనడా తన ప్రధాన వాణిజ్య భాగస్వామిపై ఆర్థిక చర్యలను మరింత కఠినతరం చేసింది. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన కెనడా దిగుమతులపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై కెనడా 15 నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీంతో 18 నెలలుగా కొనసాగుతున్న ఇరుదేశాల వాణిజ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది.ఇది కూడా చదవండి: త్వరలో మానవాతీత శక్తుల కలకలం -
త్వరలో మానవాతీత శక్తుల కలకలం
బల్గేరియాకు చెందిన అంధ భవిష్యవేత్త బాబా వంగా 2027 సంవత్సరానికి సంబంధించి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న జోస్యం ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ రహస్య వ్యాధి లేదా జన్యుపరమైన ప్రయోగం కారణంగా కొంతమంది మనుషుల్లో మానవాతీత శక్తులు వెలుగులోకి వస్తాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ జోస్యాన్ని బాబా వంగా నిజంగా చెప్పారనడానికి ఎలాంటి నిర్ధారణ లేదు. భవిష్యత్ సంఘటనలపై బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉన్న పలు జోస్యాలు గతంలో వార్తల్లో నిలిచాయి.కొవిడ్ మహమ్మారి, 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటనలను ఆమె ముందుగానే ఊహించారని అనుచరులు చెబుతుంటారు. అయితే ఈ ఘటనలకు సంబంధించిన జోస్యాలను ఆమె నిజంగా చెప్పారనడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. కాగా 2027కు సంబంధించి ప్రచారంలో ఉన్న జోస్యం ప్రకారం.. ఏదో ఒక ప్రయోగం లేదా అనారోగ్యం కారణంగా కొద్దిమంది వ్యక్తులు ‘సూపర్హ్యూమన్స్’గా మారతారట. వారి సామర్థ్యాలు ఎలా ఉంటాయి? ఈ పరిణామం ఎలా చోటుచేసుకుంటుంది? అనే విషయాలపై మాత్రం ఎలాంటి వివరాలు లేవు. ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది భవిష్యత్తులో తేలనుంది.2026లో ప్రపంచ యుద్ధం, వాతావరణ మార్పులతో ముడిపడిన ప్రకృతి విపత్తులు, సాంకేతికత నుంచి ముప్పు, గ్రహాంతరవాసుల సందర్శన వంటి పరిణామాలను బాబా వంగా ఊహించారని ఆమె అనుచరులు చెబుతున్నారు. తూర్పున ప్రారంభమై పశ్చిమ దేశాలకు విస్తరించే యుద్ధం జరుగుతుందని కూడా ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్ కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి పేర్కొన్నట్లు చెబుతున్నారు.బాబా వంగా చెప్పినట్లే 2026లో వెనిజులా, కొలంబియా, జపాన్, ఇండోనేషియాలో భారీ భూకంపాలు, ఆగస్టులో నేపాల్, టిబెట్‌లో భారీ వరదలు సంభవించాయని ఆమె అనుచరులు అంటున్నారు. 2026 నవంబరులో భారీ అంతరిక్ష నౌక భూమిని సందర్శిస్తుందని బాబా వంగా చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఒక క్రీడా కార్యక్రమం సందర్భంగా గ్రహాంతరవాసులు వస్తారనే మరో జోస్యం కూడా ప్రచారంలో ఉంది. ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్ -
ఇజ్రాయెల్‌లో సంచలన నివేదిక.. నెతన్యాహు ఇరుక్కున్నారా?
‘నెతన్యాహు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు!’.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విపక్ష నేతల ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి కొద్ది రోజుల ముందే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ నెతన్యాహును హెచ్చరించారన్న సంచలన నివేదిక వెలుగులోకి రావడంతో.. దాడి ముప్పు ముందే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.హారెట్జ్ కథనం ప్రకారం.. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7 దాడికి సుమారు వారం, పది రోజుల ముందు యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్.. నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ భారీ స్థాయిలో ఓ ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించినట్లు కథనం పేర్కొంది. అప్పటి హమాస్ నేత యాహ్యా సిన్వార్ ఓ మాజీ పాలస్తీనా అధికారికి తమ సంస్థ భయంకరమైన ఆపరేషన్‌కు సిద్ధమవుతోందని చెప్పినట్లు పేర్కొంది. దాన్ని ఆ మాజీ అధికారి యూఏఈ సలహాదారుకు చేరవేశారు. ఆ సలహాదారు ఈ సమాచారాన్ని యూఏఈ అధ్యక్షుడికి చెప్పడంతో.. ఆయన నేరుగా నెతన్యాహును సంప్రదించినట్లు కథనం చెబుతోంది. అంతేకాదు.. హమాస్ నుంచి వచ్చే ముప్పుపై ఇజ్రాయెల్‌కు ఇతర మార్గాల్లోనూ హెచ్చరికలు వచ్చినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. గాజా సరిహద్దులో ఉన్న మరో దేశం ఈజిప్ట్‌కు చెందిన నిఘా అధికారులు కూడా దాడికి కొద్దికాలం ముందు ‘ఏదో పెద్ద విషయం జరగబోతోంది’ అంటూ ఇజ్రాయెల్‌ను హెచ్చరించినట్లు గత ఏడాది ఓ ఇజ్రాయెల్ పత్రిక వెల్లడించింది.పొలిటికల్ దుమారం.. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ సైనిక కమాండర్ గాడి ఐసెన్కాట్.. నెతన్యాహుకు డజన్ల కొద్దీ హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదని, భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహు ఇక పదవిలో కొనసాగకూడదని వ్యాఖ్యానించారు. మరో మాజీ ప్రధాని, ఎన్నికల బరిలో ఉన్న నఫ్తాలీ బెన్నెట్ కూడా నెతన్యాహుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నెతన్యాహు ఇక ఒక్క నిమిషం కూడా తన పదవిలో కొనసాగకూడదు’ అని అన్నారు. అయితే ఈ ఆరోపణలను నెతన్యాహు కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 7కు ముందు యూఏఈ నుంచి ప్రధానికి ఎలాంటి హెచ్చరిక అందలేదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం నిజమేనా? హెచ్చరిక అందిందా? అందితే దానిపై నెతన్యాహు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అనే అంశాలపై రాజకీయ దుమారం మొదలైంది.ఇక, 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై భారీ దాడికి దిగింది. పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమంపైనా దాడి జరగడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. అధికారిక ఇజ్రాయెల్ గణాంకాల ఆధారంగా ఈ దాడిలో 1,221 మంది మరణించారు. మరో 251 మందిని హమాస్ బందీలుగా గాజాకు తీసుకెళ్లింది. వారిలో 44 మంది ఇప్పటికే మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భారీ సైనిక చర్య చేపట్టింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధంలో గాజాలో విపరీతమైన ప్రాణనష్టం, విధ్వంసం చోటుచేసుకుంది.ఎన్నికలపై ఎఫెక్ట్?అక్టోబర్ 7 దాడిని అడ్డుకోవడంలో విఫలమైన భద్రతా వ్యవస్థపై ఇజ్రాయెల్‌లో చాలాకాలంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు యూఏఈ హెచ్చరికకు సంబంధించిన తాజా నివేదిక ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. హమాస్ దాడి ముప్పు ముందే తెలిసిందా? తెలిసి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా? లేక తాజా ఆరోపణలు రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనా? అన్నదానిపై ఇజ్రాయెల్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు ముందు ఈ అంశం నెతన్యాహు రాజకీయ భవితవ్యంపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఇరాన్‌కు దిమ్మతిరిగే షాక్.. భారీ దెబ్బకొట్టిన అమెరికా -
నీటి కొరతతో సౌదీ అరేబియా ఏం చేసిందో తెలుసా?
ఎటు చూసినా ఎడారి.. మండే ఎండలు.. ఏడాదికి 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం.. శాశ్వత నదులు కూడా లేవు. అయినా సౌదీ అరేబియాలో 3.7 కోట్లకుపైగా జనాభా రోజువారీ అవసరాలకు నీటిని పొందుతోంది. మరి చుక్క నీటి కోసం కూడా ప్రకృతిపై ఆధారపడలేని ఈ దేశం.. కోట్లాది మందికి నీటిని ఎలా అందిస్తోంది? ఎడారి మధ్యలో ఇంత భారీ జలవ్యవస్థను ఎలా నిర్మించింది?సౌదీ అరేబియాలోని తీర ప్రాంతాల్లో భారీ డీశాలినేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సముద్రం నుంచి నీటిని తీసుకొచ్చి, అందులోని ఉప్పు, మలినాలను తొలగించి మంచినీటిగా మారుస్తారు. అనంతరం ఈ నీటిని భారీ పైప్లైన్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరంలోని నగరాలు, జనావాసాలకు తరలిస్తారు. అంటే.. సహజంగా ప్రవహించే నదులు లేకపోయినా, విస్తారమైన ప్రాంతాలకు నీటిని చేరవేసే ఓ ‘కృత్రిమ నదీ వ్యవస్థ’ను నిర్మించుకున్నట్టే. మరి సముద్రపు ఉప్పునీరు అసలు తాగునీటిగా ఎలా మారుతుంది? ఎడారి, కొండలు, రాళ్లను దాటుకుంటూ ఈ నీరు వందల కిలోమీటర్లు ఎలా ప్రయాణిస్తుంది? ఇందుకోసం సౌదీ నిర్మించిన భారీ పైప్లైన్లు, అత్యాధునిక శుద్ధి వ్యవస్థ ఎలా పనిచేస్తాయన్నది ఆసక్తికరం.భారీ పైప్లైన్ల నిర్మాణంఈ నీటి రవాణాకు ఉపయోగించే పైప్లైన్లు సాధారణమైనవి కావు. ఎడారి వేడి, ఇసుక తుపాన్లు, నేలలోని ఒత్తిడిని తట్టుకునేలా హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తారు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో ఉండే భారీ పైపులను 12 నుంచి 18 మీటర్ల పొడవైన సెక్షన్లుగా తయారు చేసి, ప్రత్యేక ట్రక్కుల్లో ఎడారి ప్రాంతాలకు తరలిస్తారు. పైపులకు తుప్పు పట్టకుండా ప్రత్యేక కోటింగ్ వేసి, అల్ట్రాసోనిక్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగిస్తారు.ఇసుక.. రాళ్లు.. కొండలు దాటుతూతీర ప్రాంతం నుంచి అంతర్భాగాలకు పైప్‌లైన్ వేయడం మరో భారీ సవాలు. ముందుగా GPS, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని నిర్ణయిస్తారు. కదిలే ఇసుక దిబ్బలు, అస్థిరమైన భూభాగాలను వీలైనంత వరకు తప్పించుకుంటారు. రాళ్లు, కొండలు ఎదురైతే నియంత్రిత పేలుళ్లతో వాటిని తొలగించి లోతైన కాలువలు తవ్వుతారు. అందులో పైపులను అమర్చి.. ఒక్కో సెక్షన్‌ను మరొకదానితో అనుసంధానిస్తూ వేల కిలోమీటర్ల నెట్‌వర్క్‌ను నిర్మించారు.అసలు నీరు ఎక్కడి నుంచి?ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు నీటి వనరు సముద్రమే. తీరానికి వందల మీటర్ల దూరంలో భారీ ఇన్‌టేక్ పైపులను ఏర్పాటు చేసి సముద్రపు నీటిని ప్లాంట్లలోకి తీసుకొస్తారు. కొన్ని పైపులు రోజుకు కోట్ల లీటర్ల నీటిని తరలించే సామర్థ్యం కలిగి ఉంటాయి. చేపలు, పీతలు, జెల్లీ ఫిష్ వంటి సముద్ర జీవులు లోపలికి రాకుండా ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు.ఉప్పునీరు.. మంచినీరుగా ఎలా?మొదట సముద్రపు నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ఫెరిక్ క్లోరైడ్, సోడియం హైపోక్లోరైట్ వంటి రసాయనాలతో మలినాలను ఒకచోట చేర్చి తొలగిస్తారు. ఆ తర్వాత 1–5 మైక్రాన్ల పరిమాణంలో ఉన్న సూక్ష్మ కణాలను కూడా పట్టుకునే కార్ట్రిడ్జ్ ఫిల్టర్ల ద్వారా నీటిని పంపిస్తారు.అసలు కీలక ప్రక్రియ రివర్స్ ఆస్మాసిస్ (RO). దాదాపు 60 బార్ ఒత్తిడితో సముద్రపు నీటిని ప్రత్యేక మెంబ్రేన్‌ల గుండా పంపుతారు. నీటి అణువులు మాత్రమే మెంబ్రేన్‌ను దాటుతుండగా.. ఉప్పు, ఇతర మలినాలు వెనుకే మిగిలిపోతాయి. అవసరమైతే మరోసారి RO ప్రక్రియ నిర్వహించి మరింత శుద్ధి చేస్తారు.శుద్ధి చేశాక మళ్లీ ఖనిజాలే!అయితే పూర్తిగా శుద్ధి చేసిన నీటిలో సహజంగా ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో నీటికి అవసరమైన ఖనిజాలను మళ్లీ కలుపుతారు. పీహెచ్ స్థాయిని కూడా సరిచేసి.. తాగేందుకు అనువుగా మారుస్తారు.ఖర్చు భారీ.. అవసరం తప్పనిసరిఇంత భారీ నీటి వ్యవస్థను నిర్మించడం అంత చౌక కాదు. ఒక్క కిలోమీటర్ పైప్‌లైన్ నిర్మాణానికే మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయి. భారీ డీశాలినేషన్ ప్లాంట్లకు వందల మిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరం. నీటి ఉత్పత్తి ఖర్చు కూడా సాంకేతికత, విద్యుత్ ధరలు, ప్లాంట్ సామర్థ్యాన్ని బట్టి గణనీయంగా ఉంటుంది. అయినా సౌదీకి మరో మార్గం పెద్దగా లేదు. నదులు లేని దేశం.. తక్కువ వర్షపాతం.. విస్తారమైన ఎడారి. అందుకే సముద్రాన్నే నీటి వనరుగా మార్చుకుని.. వందల కిలోమీటర్ల పైప్లైన్లతో ఆ నీటిని ఎడారి మధ్యనున్న నగరాలకు చేరుస్తోంది. సహజంగా లేని నదులకు బదులుగా ఇంజినీరింగ్‌తో కృత్రిమ జలధారను సృష్టించుకుంది.ఇదీ చదవండి: ఈఫిల్ టవర్ మూసివేతకు కారణం ఇదే! -
నేపాల్‌కు మరో షాక్.. 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు!
ముస్తాంగ్: తీవ్ర వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్‌ను తాజాగా భూకంపం కుదిపేసింది. దేశంలోని వాయువ్య ముస్తాంగ్ జిల్లాలో మంగళవారం రాత్రి 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాలైన మనాంగ్, డోల్పా, మ్యాగ్దీల్లోనూ నమోదయ్యాయి. జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం అధికారిక సమాచారం ప్రకారం (భారత కాలమానం ప్రకారం) రాత్రి 9.38 గంటలకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. వాయువ్య నేపాల్‌లో 29.022 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 83.978 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమి ఉపరితలానికి 143 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి.భూకంప కేంద్రం లోతుగా ఉండటంతో ఉపరితలంపై ప్రభావం పరిమితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ నిర్మాణ నష్టం నమోదుకాలేదని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం ప్రకారం, రాత్రి 9.53 గంటలకు నమోదైన ఈ భూకంపానికి ముస్తాంగ్‌లోని లోమంథాంగ్ కేంద్రంగా ఉంది. ఇది ఖాట్మండుకు వాయువ్యంగా సుమారు 375 కిలోమీటర్ల దూరంలో ఉంది.గత నెలలో భోటే కోషి నది ఆకస్మిక వరదల కారణంగా నేపాల్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఈ విపత్తులో 1,357 మంది మృతి చెందారు. సహాయక, గాలింపు చర్యలు 14వ రోజుకు చేరాయి. రాయిటర్స్ అంచనా ప్రకారం వరదల వల్ల ప్రత్యక్షంగా 256 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లగా, ఆర్థిక ప్రభావం, దీర్ఘకాలిక పునరుద్ధరణ వ్యయం 400 కోట్ల నుంచి 700 కోట్ల డాలర్ల వరకు పెరగవచ్చు. నేపాల్ పోలీసులు 1,366 మంది మృతిచెందినట్లు, 4,077 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఇప్పటివరకు 533 మంది పురుషులు, 339 మంది మహిళల మృతదేహాలను వెలికితీశారు. వీటిలో 102 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించారు.సహాయక చర్యల్లో భారత్.. నేపాల్‌కు తోడ్పాటునందిస్తోంది. చిలిమే సొరంగంలో శిథిలాలు, బురదను తొలగించేందుకు భారత, నేపాల్ బృందాలు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ తెలిపారు. వాలుగా ఉన్న సొరంగంలో రాకపోకల కోసం హెచ్డీపీఈ పైపులను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. స్యాఫ్రుబేసి నుంచి సొరంగ ద్వారం వరకు తాత్కాలిక మార్గం ఏర్పాటుకు నియంత్రిత పేలుళ్ల ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.ఇది కూడా చదవండి: మోక్షం కోసం చివరి మజిలీ.. ముక్తి భవన్ -
యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు!
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా.. మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లు మార్చడంతో బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS)కు చెందిన ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ సంక్షోభానికి కారణం. లండన్‌లోని హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, సిటీ విమానాశ్రయాలతోపాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, ఎడిన్బర్గ్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టులపై దీని ప్రభావం పడింది. ఒక దశలో విమానాలను ఇతర యూరప్ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమ నిర్ణీత ప్రాంతాల్లో లేకపోవడంతో.. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తొలగిపోలేదు.గంటల తరబడి నిరీక్షణ..సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రన్‌వేలపై విమానాల్లోనే గంటల తరబడి కూర్చోవాల్సి రావడంతో పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ రద్దీ, బ్యాగేజీ సమస్యలు, సమాచార లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ 100కు పైగా విమానాలను రద్దు లేదా దారి మళ్లించగా.. ర్యాన్ఎయిర్ 65 వేల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈజీజెట్ సహా పలు విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం ఏర్పడింది.సమస్య పరిష్కారం కానీ..సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు నాట్స్ ప్రకటించింది. వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని, నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేస్తున్నామని వెల్లడించింది. అయితే అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోలేదు. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి రాకలను నిలిపివేసి.. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు. భారత్-యూకే సర్వీసులపైనా ప్రభావంఈ సాంకేతిక సమస్యతో భారత్ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. విమానాలు, సిబ్బంది వేరే ప్రాంతాల్లో చిక్కుకోవడంతో తదుపరి సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్‌తో నిర్ధారించుకోవాలని సూచించారు. వరుస వైఫల్యాలతో విమర్శలునాట్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఫ్లైట్-ప్లాన్ ప్రాసెసింగ్‌లో లోపంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఆ ఘటనలో ఎయిర్‌లైన్స్‌కు భారీగా రీఫండ్లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా మరోసారి సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో బ్రిటన్ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇటు బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఘటనపై పూర్తి నివేదిక కోరింది. NATS చీఫ్ మార్టిన్ రోల్ఫ్ మాత్రం అసలు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇంకా తమకు తెలియలేదని తెలిపారు.ఇదీ చదవండి: ముంచేసిన మరో విపత్తు.. జలమయంగా జపాన్ -
భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం
టోక్యో: సెంట్రల్ జపాన్ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రధాన నది పరిధిలో అత్యవసర వరద హెచ్చరిక జారీ చేశారు. రహదారులు, రైల్వే ట్రాక్‌లు సహా కీలక మౌలిక వసతులన్నీ నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచించారు.జపాన్ వాతావరణ సంస్థ షోనై నదికి అత్యున్నత స్థాయి-5 వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ నది గిఫు, ఐచి ప్రిఫెక్చర్ల మీదుగా ప్రవహిస్తుంది. నగోయాలో గంట వ్యవధిలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చికుసా, మోరియామా, మీటో వార్డుల్లోని ప్రజలు భద్రత కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కోరింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ఘటనల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది. సుమారు 2,700 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడల వేదికల్లోనూ పలు చోట్ల వర్షపు నీరు చేరింది.నగర మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఆర్ చువో లైన్ రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. రద్దీగా ఉండే సకాయే ప్రాంతంలోని రహదారులపై ఒక దశలో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ఐచి ప్రిఫెక్చర్లోనే టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. జేఆర్ సెంట్రల్ ప్రకారం, టోక్యో వైపు వెళ్లే టోకైడో షింకాన్సెన్ రైళ్లు ఒక దశలో ఒకాయామా-టోక్యో స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. టోక్యో-నగోయా మధ్య బయలుదేరే రైళ్లను కూడా నిలిపివేశారు. జేఆర్ వెస్ట్ ప్రకారం వర్షాల కారణంగా సాన్యో షింకాన్సెన్ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. టోకైడో, సాన్యో షింకాన్సెన్ సేవలు సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పునఃప్రారంభమయ్యాయి.ఐచి, గిఫు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఒకే ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించే ‘లీనియర్ రెయిన్బ్యాండ్స్’ ఏర్పడ్డాయని వాతావరణ సంస్థ తెలిపింది. పశ్చిమం నుంచి ఈశాన్య జపాన్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. టోక్యో, సైతామా, చిబా, కనగావాతో పాటు పశ్చిమ జపాన్‌లోని ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!


