ఖతార్‌ విమానాల్లో స్వదేశానికి 1,600 మంది | 1600 Indians travel to India on 5 Qatar Airways flights amid airspace curbs | Sakshi
Sakshi News home page

ఖతార్‌ విమానాల్లో స్వదేశానికి 1,600 మంది

Mar 18 2026 4:14 AM | Updated on Mar 18 2026 4:14 AM

1600 Indians travel to India on 5 Qatar Airways flights amid airspace curbs

దోహా: ఖతార్‌ గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ మంగళవారం ఐదు ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ విమానాల ద్వారా సుమారు 1,600 మంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. రెండు విమానాలు ఢిల్లీ, ముంబై, కొచ్చి, తిరువనంతపురంలకు ఒక్కోటి చొప్పున విమానాలు వెళ్లాయని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

ఖతార్‌ ఎయిర్‌వేస్‌ పరిమిత సంఖ్యలో, నాన్‌ షెడ్యూల్డ్‌ విమాన సర్వీసులను మాత్రమే నడుపు తోందని వివరించింది. బుధవారం భారత్‌లోని తొమ్మిది గమ్యస్థానాలకు మరిన్ని విమానాలు నడుస్తాయని, సీట్లు బుక్‌ చేసుకోవాలని సూచించింది. సల్వా భూ సరిహద్దు దాటి సౌదీ అరేబియా మీదుగా భారత్‌ చేరుకోవాలనుకునే భారతీయ పౌరులకు తాత్కాలిక సౌదీ ట్రాన్సిట్‌ వీసాల జారీ కొనసాగుతోందని కూడా తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement