క్షిపణులతో కిమ్‌ కవ్వింపులు | South Korea says North Korea fires around 10 ballistic missiles | Sakshi
Sakshi News home page

క్షిపణులతో కిమ్‌ కవ్వింపులు

Mar 15 2026 12:16 AM | Updated on Mar 15 2026 12:16 AM

South Korea says North Korea fires around 10 ballistic missiles

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి తన క్షిపణులకు పనిజెప్పారు. ఉత్తర సముద్ర జలాల్లో ఒకేసారి 10 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించి కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులను తీసుకొచ్చారు. ఉ.కొరియా కవ్వింపు చర్యలను పొరుగున ఉన్న వైరిదేశం దక్షిణకొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నవేళ కిమ్‌ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని దక్షిణకొరియా ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఉ.కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీప ప్రాంతం నుంచి శనివారం ఈ 10 బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించారని, అయితే అవి ఎంత దూరం ప్రయాణించాయనే వివరాలపై స్పష్టత లేదని ద.కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ప్రకటించారు.

ఉ.కొరియా దుందుడుకు చర్యలను నిశితంగా గమనిస్తున్నామని నిఘాతోపాటు సైనిక సన్నద్ధతతో ముందుకెళ్తున్నామని ద.కొరి యా ప్రకటించింది. ఇరాన్‌లో యావత్‌దేశంలోని సెక్యూరిటీ కెమె రాలను హ్యాక్‌ చేసి ఖమేనీ హత్యను అమెరికా సులభతరం చేసిన నేపథ్యంలో తమ దేశంలోనూ అమెరికా ఇదే పనిచేస్తోందా? అన్న అనుమానాలు సగటు దక్షిణ కొరియన్లలో ఎక్కువయ్యాయని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement