పాకిస్తాన్‌లో పరువు హత్యలు.. | Incident in Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో పరువు హత్యలు..

Mar 17 2026 5:43 AM | Updated on Mar 17 2026 5:43 AM

Incident in Pakistan

భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో నరికి దారుణం 

లాహోర్‌: పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. పరువు పేరుతో ఓ వ్యక్తి భార్యను, ఐదుగురు సంతాన్ని గొడ్డలితో నరికి చంపాడు. సర్గోధా జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం ఉదయం ఘటన చోటుచేసుకుంది. మహ్మద్‌ యాసీన్‌ అనే వ్యక్తి అనుమానానికి బలైన వారిలో అతడి 45 ఏళ్ల భార్య, 15 ఏళ్ల కుమార్తె, ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు వయస్సున్న నలుగురు కుమారులు ఉన్నారు.

భార్యకు పొరుగూరికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నాడు. దీంతో, సంతానంలో కొందరు తనకు జన్మించిన వారు కాదని అనుమానం ఉందన్నాడు. అందుకే వారంతా నిద్రిస్తుండగా గొడ్డలితో నరికి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు యత్నించిన అతడు గాయపడ్డాడు.

Advertisement
 
Advertisement
Advertisement