ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం 17వ రోజుకు చేరింది. తమ సుప్రీంనేతమరణం తరువాత ఇరాన్ భీకరమైనప్రతిదాడులతో శత్రు దేశాలకు చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా అమెరికా సైనిక బేస్‌కేంద్రాలున్న గల్ఫ్ ప్రాంతంలో మిస్సైళ్లు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ యుద్ధంలో గత వారం నుండి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు భద్రతపై ఊహాగానాలు చెలరేగాయి.ఈనేపథ్యంలో ఆయన మరణించినట్లు వస్తున్న పుకార్లను పటాపంచలు చేయడానికి విడుదల చేసిన కాఫీ వీడియో నెతన్యాహూ ఉనికిపై మరింత చర్చకు తావిచ్చింది.
అసలు అది నిజమైనదేనా లేక 'డీప్‌ఫేక్' (AI సృష్టించినదా) అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల నెతన్యాహూ రిలీజ్ అయిన వీడియో ఏఐ సృష్టి అని, ఇరాన్ దాడిలో నెతన్యాహు చనిపోవడంతోనే ఇజ్రాయెల్ ఆయన ఏఐ వీడియో రిలీజ్ చేసిందనే అనుమానాలు వ్యక్తమైనాయి. ఆ వీడియోలో ఆయనకు ఎడమ చేతికి ఆరువేళ్లున్నాయంటూ ప్రచారం జోరుగా సాగింది.
కాఫీ వీడియోపై ఆన్‌లైన్‌లో రచ్చ
దీనిపై స్పందనగా తాజాగా నెతన్యాహు ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. జెరూసలేం హిల్స్‌లోని ది సతాఫ్ కేఫ్‌లో కాఫీ ఆర్డర్ చేస్తున్నట్లు చూపించే వీడియోను విడుదల చేశారు. తాను చనిపోలేదు అనే సందేశాన్ని ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశారు. నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగో లెక్కించుకోండి అంటూ తన రెండు చేతులను పైకెత్తి కెమెరాకు తన వేళ్లను చూపించారు. అంతేకాదు తాను కాఫీ కోసం చనిపోతున్నాను అంటూ పుకార్లకు కౌంటర్ ఇచ్చారు. అటు బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే వార్తలను ఇప్పటికే ఇజ్రాయెల్ ఖండించింది.
ఏఐ సృష్టే అంటున్న నెటిజన్లు
నెతన్యాహు ఎక్కడ, ఎలా ఉన్నారనే పుకార్ల మధ్య, కొత్త కాఫీ వీడియో మళ్లీ అనుమానాలను బలపరుస్తోంది. పలువురు సోషల్ మీడియా వినియోగదారులు దీనిని కృత్రిమ మేధస్సు (AI) సృష్టి అని తేల్చారు. మరోవైపు గ్రోక్ కూడా 'డీప్‌ఫేక్' వెల్లడించింది. ఒక వినియోగదారుడి ప్రశ్నకు సమాధానమిస్తూ, ఎక్స్ AI చాట్‌బాట్, గ్రోక్, కాఫీ షాప్ వీడియోను 'AI-జనరేటెడ్' కంటెంట్‌గా తెలిపింది. ఈ ఏఐ వీడియోలో ఇజ్రాయెల్ తొలుత ఫేస్ గుండ్రంగా ఉంది. ఒక్కసారిగా కోలగా మారిందని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. అలాగే కప్పులోని కాఫీ పడిపోకుండా వింతగా ఉందని కొందరు. కౌంటర్ వెనుక ఉన్న ఒక కస్టమర్ మాస్క్ ధరించి ఉండటంపై కూడా మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో నెతన్యాహు కోటు జేబులు కూడా వింతగా కనిపిస్తున్నాయని కొందరు విశ్లేషించారు.
It's AI-generated. This is a deepfake of Benjamin Netanyahu casually in a coffee shop, talking about Iran/Lebanon ops and protected areas while sipping coffee—nothing like this real event exists. The original post explicitly calls it advanced unreleased AI.
— Grok (@grok) March 15, 2026
Got some serious questions about the validity of this blatantly obvious AI video…🤷🏻♂️
Magical pocket…
Coffee in the cup defying gravity…
Customer with mask behind the counter 😂
Nice Try…..NOTenyahu 😎 pic.twitter.com/oBA5U3HByK— Freed Ninja (@freezymfe) March 15, 2026


