సహయం చేస్తాం.. కానీ డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ | Ukraine Offers Technical Aid To Counter Iranian Shahed Drones, Requests Funding From US | Sakshi
Sakshi News home page

సహయం చేస్తాం.. కానీ డబ్బులు కావాలి: జెలెన్‌స్కీ

Mar 17 2026 3:01 AM | Updated on Mar 20 2026 7:40 PM

 volodymyr zelensky demands technology and funds

ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాహిద్  డ్రోన్ల కూల్చివేతకు సాంకేతికంగా సహయం అందేజేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అయితే దానికి ప్రతిగా తమకు డబ్బులివ్వాలని కోరారు

పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్‌ను ఇరాన్‌కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్‌ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.

కాగా ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఇరాన్‌ను డ్రోన్‌ దాడులను ఎదుర్కొవడానికి కావాల్సిన సహాయం చేస్తామని దానికి ప్రతీగా తమకు తగిన మెుత్తంలో డబ్బులివ్వాలని కోరారు. ఈనేపథ్యంలోనే డ్రోన్‌ దాడులు వాటిని ఎలా ఎదుర్కొవాలే అనే అంశం అంచనా వేయడానికి మూడు నిపుణుల బృందాలను పశ్చిమాసియా దేశాలకు పంపారు. అయితే తాము ఇరాన్‌తో యుద్ధం చేయడం లేదని ఇప్పుడు తమ దేశానికి డబ్బు అవసరం కనుక సాంకేతిక సాయం చేస్తున్నామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement