ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు | Oil prices surge after Israeli strike on Iran South Pars gas field | Sakshi
Sakshi News home page

సౌత్‌ పార్స్‌పై దాడి తర్వాత ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు

Mar 19 2026 2:03 AM | Updated on Mar 19 2026 3:59 AM

Oil prices surge after Israeli strike on Iran South Pars gas field

ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్‌ఫీల్డ్‌పై ఇజ్రాయెల్‌ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్‌ బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం పెరిగి 108.66 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 2.5 శాతం పెరిగి  98.65 డాలర్లకు చేరింది. బ్రెంట్–WTI మధ్య ధర తేడా 2019 తర్వాత ఇదే అత్యధికం.  

కాగా, బుషెహర్ ప్రావిన్స్ తీరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్‌ఫీల్డ్ "సౌత్ పార్స్" సదుపాయాలు దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయెల్‌ చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని ఆయిల్–గ్యాస్ సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.

హెచ్చరించిన విధంగానే ఇరాన్‌ ఖతార్‌లోని రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.  

ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది.  రోజుకు 7–10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గినట్లు అంచనా. ఇది ప్రపంచ డిమాండ్‌లో 7–10 శాతం తగ్గుదల. చమురు–గ్యాస్ ధరలు ఎక్కువ కాలం ఇలాగే పెరుగుతూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా
అమెరికా ప్రభుత్వం ఇంధన సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు జోన్స్ యాక్ట్ నిబంధనలను 60 రోజుల పాటు సడలించింది. అలాగే, వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSAతో కొన్ని లావాదేవీలకు అనుమతి ఇచ్చింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement