శాంతిదూత డొనాల్డ్‌ ట్రంప్‌!  | Japan Prime Minister Sanae Takaichi meets Us President Donald Trump | Sakshi
Sakshi News home page

శాంతిదూత డొనాల్డ్‌ ట్రంప్‌! 

Mar 20 2026 4:55 AM | Updated on Mar 20 2026 4:55 AM

Japan Prime Minister Sanae Takaichi meets Us President Donald Trump

జపాన్‌ ప్రధాని తకాయిచి ప్రశంస

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జపాన్‌ మహిళా ప్రధాని సనే తకాయిచి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ట్రంప్‌ను శాంతిదూతగా అభివరి్ణంచారు. హార్మూజ్‌ జలసంధిలో చమురు నౌకల రక్షణకు యుద్ధ నౌకలను పంపించడానికి జపాన్‌ ముందుకు రాలేదంటూ రుసరుసలాడుతున్న ట్రంప్‌ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయతి్నంచారు. అమెరికా అధ్యక్షుడితో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సంకేతాలిచ్చారు. తకాయిచి గురువారం వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు.

 పశ్చిమాసియా యుద్ధంపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తకాయిచి స్పష్టంచేశారు. తకాయిచి నాయకత్వాన్ని ట్రంప్‌ కొనియాడారు. ఆమె బహుళ ప్రజాదరణ కలిగిన శక్తివంతురాలైన నేత అంటూ ప్రశంసించారు. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు జపాన్‌ అందించే సాయంపై వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో జపాన్‌ సహకారాన్ని ట్రంప్‌ కోరుతున్నారు. షెడ్యూల్‌ ప్రకారం డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు ముందుకు ఆయన జపాన్‌ ప్రధానమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement