హెచ్చరించిన విధంగానే ఇరాన్‌ దాడి | Saudi Arabia intercepts four missiles heading to Riyadh | Sakshi
Sakshi News home page

హెచ్చరించిన విధంగానే ఇరాన్‌ దాడి

Mar 18 2026 11:59 PM | Updated on Mar 19 2026 1:08 PM

Saudi Arabia intercepts four missiles heading to Riyadh

గంటల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. వార్నింగ్‌ ఇచ్చిన విధంగానే గల్ఫ్‌ దేశాలపై దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే వీటిని సౌదీ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంది.

సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రియాద్ వైపు ప్రయోగించబడిన నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు విజయవంతంగా అడ్డుకోబడ్డాయి.మిసైళ్లను అడ్డుకునే ప్రక్రియలో ఏర్పడిన శకలాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది.  

కాగా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, ఆ దేశ  కీలక సైనికాధికారి అలీ లారిజానీ, ఐఆర్‌జీసీకి చెందిన బసిజ్‌ పారామిలటరీ ఫోర్స్‌ కమాండర్‌ జనరల్‌ ఘోలమ్‌రెజా సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. 

తాజాగా అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు బుషేర్‌ ఫ్రావిన్స్‌లోని ఇరాన్‌ నేచురల్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ అయిన సౌత్‌ పర్స్‌పై కూడా దాడులు చేశాయి. వీటికి ప్రతీకారంగానే ఇరాన్‌ గల్ఫ్‌ దేశాల ఇంధన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement