యుద్ధం: పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిన డ్రోన్ | video released by Iraqi group of flight over US Embassy in Baghdad | Sakshi
Sakshi News home page

యుద్ధం: పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతూ వెళ్లిన డ్రోన్

Mar 17 2026 8:06 PM | Updated on Mar 17 2026 8:25 PM

video released by Iraqi group of flight over US Embassy in Baghdad

టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రతీకారదాడులను కొనసాగిస్తోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో పదేపదే డ్రోన్లతో విరుచుకుపడుతుంది. అమెరికా దౌత్యకార‍్యాలయం ఉండే బాగ్దాద్‌ కాంప్లెక్స్‌ లక్ష్యంగా ఇరాన్‌ దాడులు చేస్తుండడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఆకాశంలో పక్షులు హాయిగా ఎగురుకుంటూ వెళ్తుంటాయి. బాగ్దాద్‌లో అచ్చం పక్షిలా ఓ డ్రోన్‌ ఎగురుకుంటూ దాడి చేయడానికి వెళ్తున్న వీడియోను ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పోస్ట్‌ చేసింది. 

బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీపై ఆ డ్రోన్‌ ఎగిరింది. డ్రోన్ ఫస్ట్ పర్సన్ వ్యూ (FPV) వీడియో ఇది. ఫస్ట్ పర్సన్ వ్యూ అంటే డ్రోన్ కెమెరా చూపిన దృశ్యం, డ్రోన్ చూస్తున్నట్టు కనిపించే వీడియో.

ఈ ఘటనకు ముందు ఇవాళ తెల్లవారుజామున బాగ్దాద్‌లో అమెరికా ఎంబసీ, ఒక హోటల్ పై డ్రోన్లతో ఇరాన్‌ దాడికి యత్నించిందని నివేదికలు వచ్చాయి. ఎంబసీ దగ్గర గగనతల రక్షణ వ్యవస్థ ఒక ప్రాజెక్టైల్‌ను అడ్డుకున్నట్టు వీడియోలో కనిపించింది. ఇరాక్ దక్షిణాన ఉన్న మజ్నూన్ ఆయిల్ ఫీల్డ్ కూడా దాడికి గురైందని ఇరాక్ సాయుధ దళాల సేనాధిపతి ప్రతినిధి తెలిపారు.

ప్రెస్ టీవీ ఎక్స్ పోస్టులో డ్రోన్ “స్వేచ్ఛాయుత పక్షిలా” ఎంబసీపై ఎగిరిందని పేర్కొంది. గగనతల రక్షణ వ్యవస్థలు స్పందించకుండా డ్రోన్ ఎంబసీపై ఎగిరిన దృశ్యాలను ఇరాకీ రెసిస్టెన్స్‌ గ్రూప్ (ఇరాన్‌కు మద్దతిచ్చే మిలీషియా గ్రూప్‌) విడుదల చేసిందని తెలిపింది.

కాగా, నాలుగు డ్రోన్లు అమెరికా ఎంబసీపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఇరాక్ గగనతల రక్షణ వ్యవస్థలు అన్ని డ్రోన్లను కూల్చేశాయని వార్తలు వస్తున్నాయి.  ఒక డ్రోన్ అబూ నవాస్ వీధిలో పడిందని, మరొకటి గ్రీన్ జోన్‌లో ఎంబసీ దగ్గర పడిందని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున అల్-రషీద్ హోటల్ పై ఒక డ్రోన్ పడిందని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement