అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు | Ajman announces 4 day Eid Al Fitr holiday for government employees | Sakshi
Sakshi News home page

అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు సెలవులు

Mar 18 2026 12:34 AM | Updated on Mar 18 2026 12:34 AM

Ajman announces 4 day Eid Al Fitr holiday for government employees

ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకుని అజ్మాన్‌ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజులు, ప్రైవేటు ఉద్యోగులకు మూడు రోజుల సెలవుగా పేర్కొంది. 

మానవ వనరుల విభాగం ప్రకటన ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 22 (ఆదివారం) వరకు కొనసాగుతాయి. వారికి అధికారిక పనులు మార్చి 23 (సోమవారం) తిరిగి ప్రారంభమవుతాయి. 

ప్రైవేటు ఉద్యోగుల విషయానికొస్తే.. వీరికి సెలవులు మార్చి 19 (గురువారం) నుండి మార్చి 21 (శనివారం) వరకు ఉంటాయి. వీరు మార్చి 22 (ఆదివారం) తిరిగి విధుల్లో చేరాల్సి ఉంటుంది.  

కొద్ది రోజుల క్రితమే యూఏఈ ఫెడరల్‌ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు​ ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది.

సాధారణంగా ఈద్ ఉల్ ఫితర్ ఖచ్చితమైన తేదీ చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ చంద్ర దర్శనాన్ని గుర్తించడానికి యూఏఈ చంద్ర దర్శన కమిటీ మార్చి 18న (29వ రోజు) సమావేశం కానుంది. చంద్రుడు కనిపిస్తే, ఈద్ మార్చి 19న (గురువారం) ప్రారంభమవుతుంది. లేక​పోతే, మార్చి 20న (శుక్రవారం) జరుపుకుంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement