breaking news
Ramdaan
-
రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!
ఓ అల్లాహ్ మేము 30దినాలు పాటించిన రమజాన్ రోజాలు, నమాజులు, సహరీ, ఇఫ్తార్లు ఇవన్నీ నీవు పెట్టిన భిక్షయే అల్లాహ్ అని ఆనంద భాష్పాలు రాల్చే శుభఘడియే ఈ ఈదుల్ ఫిత్ర్ పండుగ. ఈ పండుగను ప్రతీ ముస్లిమ్ కుటుంబం తమకున్నదాంట్లో గొప్పగా జరుపుకుంటుంది. అలాగే ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ ఆలింగనం చేసుకుని ప్రేమను చాటుకుంటారు. ఆ తర్వాత రకరకాల వంటకాలను చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆరగించి సంతోషంగా గడుపుతారు. ఈ రోజు స్పెషల్‌గా చేసేది షీర్ ఖుర్మా. ఈ రంజాన్ రోజు వివిధ రెసిపీలు ఎన్ని ఉన్నా.. ఈ షీర్ ఖుర్మా రెసిపీ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అసలు ఈ రోజు ఎందుకు దీన్ని చేస్తార?. రీజన్ ఏంటంటే..? పవిత్ర మాసంలో ఆనందంగా చేసుకునే డెజర్ట్, రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా ఎప్పటి నుంచి పండులో భాగమైంది?. ఇది ఎందుకు చేస్తారు అంటే. ఈ షీర్ కుర్మా ఐక్యత ఆధ్యాత్మిక సమృద్ధికి గుర్తుగా ఈ తీపి వంటకాన్ని ప్రతి ముస్లీ కుటుంబం తయారు చేయడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందులో వివిధ మాంసాహార రెసిపీలు ఉన్నప్పటికీ.. ఈ షీర్ కుర్మాదే అగ్రస్థానాంలో ఉంటుంది. ప్రతి ఒక్క ముస్లీం కుటుంబంలో తమకున్నంతలో ఈ షీర్ కుర్మాను తప్పనిసరిగా చేస్తారు. ఇన్నీ రెసిపీలు ఉన్నా ఈ షీర్ కుర్మాకే ఎందుకంత ప్రాధాన్యత వచ్చిదంటే.. షీర్ కుర్మా చరిత్ర.. ఈ షీర్ కుర్మా రెసిపీ వంటకం పర్షియన్ సామ్రాజ్యం నుంచి మన వంటకాల్లో భాగమయ్యింది. ఇక్కడ షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే పర్షియన్ భాషలో ఖర్జూరం. రంజాన్ మాసంలో ఖర్జూరాలు అత్యంత ప్రధానమైనవి. ఎందుకంటే..ఈదుల్ ఫిత్ర్ పర్వదినంనాడు ముహమ్మద్ ప్రవక్త (స) కొన్ని ఖర్జూరపు పండ్లు తిని నమాజుకోసం ఈద్గాహ్కు వెళ్లేవారు. అంతేగాదు ఇది కేవలం రంజాన్ కోసం తయారు చేసే వంటకమే కాదట..ఆ రోజు తీసుకున్నా స్పైసీ ఫుడ్ల నుంచి కాస్త ఉపశమనం కోసం చివరిగా ఈ తీపి వంటకాన్ని అందించేవారు. ఆ తర్వాత క్రమేణ ఇది లేకుండా రంజాన్ మెనూ ఉండనంతగా ఈ రెసిపీకి ప్రజాధరణ వచ్చింది. బ్రిటీష్ పాలన కంటే ముందే మన దేశంలో షీర్ కుర్మా చేసేవారట. ఉత్తర భారతదేశంలో 'సెవియన్' అని పిలిచే వెర్మిసెల్లికి భిన్నమైన రెసిపీ వంటకం ఈ షీర్ కుర్మా. మరో కథనం ప్రకారం అరబ్బులు వాణిజ్యం చేసే నిమిత్తం మన దేశంలోకి రావడం వల్ల ఈ రెసిపీని ఇక్కడకు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. దీని తయారీ కూడా ప్రాంతాల వారీగా చేసే విధానం కూడా మారుతుంటదని చెబుతున్నారు. మాములుగా వెర్మిసెల్లి, పాలు, ఖర్జురాలతో తయారు చేసుకునేవారు. కాలానుగుణంగా అన్ని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ప్రజల అభిరుచులకు అనుగుణంగా పిస్తా, బాదం, లవంగాలు, కుంకుమపువ్వు, రోజ్‌వాటర్ వంటి పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించారు. ఎక్కడ ఫేమస్ అంటే.. ఈ షీర్ ఖుర్మా ముఖ్యంగా హైదరాబాద్ ,లక్నో వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ నగరాల్లో క్రీమీ, రిచ్ డెజర్ట్‌లతో నెమ్మదిగా ఉడికించి, ఎండిన ఖర్జూరం, కొబ్బరి, బాదం, జీడిపప్పు మరియు పిస్తాతో అలంకరించి నోరూరించేలా అట్రెక్టివ్గా తయారు చేస్తారు. దీన్ని వేడిగా లేదా చల్లగా సర్వ్ చేస్తారు. ఖర్జూరాలు ఇక్కడ చక్కెర బదులుగా తీపిని అందించి షీర్‌కుర్మాకు ఒక విధమైన రుచిని అందిస్తాయి. అంతేగాదు ఈద్-ఉల్-ఫితర్‌లో షీర్ ఖుర్మాను సంతోషకరమైన ట్రీట్‌గా భావిస్తారు ముస్లీంలు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో ఉపయోగించే పాలు, నెయ్యి, ఖర్జురాల్లో ఎన్నో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇక పాలల్లో కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ఈ నెల రోజుల పాటు ఉపవాసాలతో శుష్కించిన శరీరాన్ని ఉపశమనంలా ఉంటుంది ఈ రెసిపీ. ఉపవాశం కారణంలో పొట్టలో వచ్చే, ఎసిడిటీల నుంచి ఈ తీపి వంటకం కాపాడుతుంది. సమ్మర్లో శరీరానికి చలువ చేస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది కూడా. మన సంప్రదాయాలకు అనుగుణంగా చేసే ఇలాంటి వంటకాలు ఆరోగ్యప్రదంగానూ సంతోషన్ని పంచేవిగానూ ఉంటాయి కదూ..! (చదవండి: Eid al Fitr 2024: ఓ అల్లాహ్ ..ఇదంతా నీవు పెట్టిన భిక్ష! కృతజ్ఞతలు తెలిపే శుభసయం..!) -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు... వైరల్
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం కావటంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపవాసం, ప్రార్థనలు, ఇఫ్తార్ల కోలాహలం కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అరుదైన దృశ్యం దర్శనమిస్తోంది. సెహ్రీ (ఉపవాసానికి ముందుగా అంటే సూర్యోదయానికి ముందుగా తీసుకునే భోజనం) కోసం ఓ సిక్కు వృద్ధుడు సాయం చేస్తున్నారు. సాధారణంగా సెహ్రీ కోసం లౌడ్ స్పీకర్లు లేదా ఇలా డప్పులతో చాటింపు వేయించటం మాములే. అలా చేసేవారిని షహర్ఖ్వాన్ అంటారు. ఈ పనిని ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే చేస్తుంటారు. మైనార్టీ తెగలకు చెందిన వారు ఈ పని చేయటం అరుదనే చెప్పొచ్చు. ఓ సిక్కు వ్యక్తి ఈ పని చేస్తుండటం, పైగా కశ్మీర్లో.. అది కూడా సమస్యాత్మక ప్రాంతం అయిన పుల్వామాలో కావటంతో ఇప్పుడు వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఆ వృద్ధుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఉపవాసానికి ముందు తెల్లవారుఝామున ఏదైనా తినడం లేదా త్రాగడాన్ని సెహ్రీ అంటారు.. రోజా(ఉపవాసం) ముగించిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. -
సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు
-
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ
-
గవర్నర్, సీఎం, బాబు శుభాకాంక్షలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కృపాకటాక్షాలు కలగాలని ఆకాం క్షించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూక్తులు ప్రతి తరానికి మార్గదర్శకాలని గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అహ్మదుల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి చిరంజీవి వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ముస్లింలకు వైఎస్ విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడం ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత అని చెప్పారు. నెలపాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా ఐకమత్యంతో మెల గడం, క్ర మశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆమె వ్యాఖ్యానించారు.