ముస్లింలకు వైఎస్ విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు | YS Vijayamma Ramdaan Wishes to Muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్ విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు

Aug 9 2013 2:51 AM | Updated on May 25 2018 9:10 PM

ముస్లింలకు వైఎస్ విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు - Sakshi

ముస్లింలకు వైఎస్ విజయమ్మ రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడం ఈ పండుగకు ఉన్న ప్రత్యేకత అని చెప్పారు. నెలపాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్ ఒక ముగింపు వేడుక కాగా ఐకమత్యంతో మెల గడం, క్ర మశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement