సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు | Sikh man awakening Muslims for sehri -suhur- in TRAL | Sakshi
Sakshi News home page

సెహ్రీ కోసం సిక్కు వృద్ధుడు

May 29 2018 8:52 AM | Updated on Mar 21 2024 5:16 PM

పవిత్ర రంజాన్‌ మాసం కావటంతో దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపవాసం, ప్రార్థనలు, ఇఫ్తార్‌ల కోలాహలం కనిపిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం అరుదైన దృశ్యం దర్శనమిస్తోంది. సెహ్రీ (ఉపవాసానికి ముందుగా అంటే సూర్యోదయానికి ముందుగా తీసుకునే భోజనం) కోసం ఓ సిక్కు వృద్ధుడు సాయం చేస్తున్నారు. సాధారణంగా సెహ్రీ కోసం లౌడ్‌ స్పీకర్లు లేదా ఇలా డప్పులతో చాటింపు వేయించటం మాములే. అలా చేసేవారిని షహర్‌ఖ్వాన్‌ అంటారు. ఈ పనిని ఇస్లాం మతానికి చెందిన వ్యక్తే చేస్తుంటారు. మైనార్టీ తెగలకు చెందిన వారు ఈ పని చేయటం అరుదనే చెప్పొచ్చు. ఓ సిక్కు వ్యక్తి ఈ పని చేస్తుండటం, పైగా కశ్మీర్‌లో.. అది కూడా  సమస్యాత్మక ప్రాంతం అయిన పుల్వామాలో కావటంతో ఇప్పుడు వీడియో వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో పలువురు ఆ వృద్ధుడిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.   

ఉపవాసానికి ముందు తెల్లవారుఝామున ఏదైనా తినడం లేదా త్రాగడాన్ని సెహ్రీ అంటారు.. రోజా(ఉపవాసం) ముగించిన తరువాత అంటే సూర్యాస్తమయం తరువాత తీసుకునే భోజనాన్ని ఇఫ్తార్‌ అంటారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement