మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది. కిమ్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 0.07 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశమైంది.
గెలుపొందిన సభ్యుల్లో 70 శాతం కొత్త వారు కావడం మరో విశేషం. వీరిలో కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ కూడా ఉన్నారు. కిమ్‌కు అత్యంత సన్నిహితుడు జో యోంగ్-వోన్‌కు కీలక పార్లమెంటరీ పదవికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత కిమ్ దక్షిణ కొరియాతో సంబంధాలను శత్రుత్వంగా నిర్వచించేలా రాజ్యాంగ సవరణ చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ప్రతిపక్షం లేకపోవడానికి కారణం
- ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కిమ్ కనుసన్నల్లోనే నడుస్తుంది.
- ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉంటాడు. పోటీ చేసేందుకు అభ్యర్ది కూడా ఉండడు.
- ఓటర్లు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం ఉన్నా, బహిరంగ ఓటింగ్ విధానం కావడంతో వ్యతిరేక ఓటు వేయడం ప్రమాదకరంగా ఉంటుంది.
మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు కిమ్ నియంతృత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయి. ఇక్కడ చీమ చిట్టుక్కుమన్నా, కిమ్‌కు తెలిసే జరగాలి. వ్యవస్థలన్నీ కిమ్ చేతుల్లోనే ఉంటాయి. పౌరులు తినే తిండి దగ్గరి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కిమ్ నియంత్రణలోనే ఉంటాయి. పౌర హక్కులు అనేవి ఉత్తర కొరియాకు వర్తించవు. అంతలా కిమ్ నియంతృత్వం కొనసాగుతుంది.


