breaking news
Mahabubabad
-
విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలి
గూడూరు: విద్యార్థులు సేవాభావాన్ని పెంపొందించుకోవాలని డీఐఈఓ మధర్గౌడ్, సర్పంచ్ రేగ సు జాత అన్నారు. మట్టెవాడలో గూడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల కార్యక్రమంలో విద్యార్థులు గ్రామీణ ప్రాంత జీవన విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పరుశురాములు, ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సారంగపాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిట్టిబాబు, శ్రీధర్‌సింగ్, రమేష్, సతీష్, రవికుమార్, సుధీర్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలపై అవగాహన అవసరం
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మహబూబాబాద్: ఎన్నికల సంఘం నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టరేట్లో ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్ఓలతో మ్యాపింగ్ పక్కా జరిపించాలన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలు లేకుండా ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, డీపీఓ హరిప్రసాద్, కమిషనర్ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, వివిధ పార్టీల నాయకులు మార్నెని వెంకన్న, సురేష్ నాయుడు, అజయ్‌సారథిరెడ్డి, సూర్నపు సోమయ్య, శ్యాంసుందర్‌శర్మ, బొమ్మ వెంకటేశ్వర్లు, ఫరీద్, రాజమౌళి పాల్గొన్నారు. టెన్త్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలి పదో తరగతి పరీక్షల్లో మెరుౖగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ అధికా రులతో పదో తరగతి పరీక్షలపై నిర్వహించిన సమీ క్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ పరీక్షలకు సుమారు 60 రోజుల సమయం మాత్రమే ఉందని ఆ సమయానికి తగ్గట్టుగా ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతీరోజు విద్యార్థులతో అ న్ని సబ్జెక్ట్‌లను చదివించి సాధన చేయించాలని తెలి పారు. విద్యార్థుల చేతి రాతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల వ్యక్తిగత మానసిక స్థితిగతులను నిత్యం పరిశీలించాలన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించి మెలకువలు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, ఏసీజీ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు పాల్గొన్నారు. -
జాతరకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం
వేగంగా గద్దెల పునరుద్ధరణ పనులు ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం గద్దెల చుట్టూ ఉన్న పాత గ్రిల్స్ తొలగించారు. అనంతరం గద్దెలపై సీసీ ఫ్లోర్లింగ్ చేపట్టారు. ఈ పనులను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. కాగా, గద్దెల పునరుద్ధరణ పనుల సందర్భంగా భక్తులను తల్లుల దర్శనాలకు అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. బయటి నుంచే దర్శించుకునేలా ఏర్పాటు చేశారు.ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర మంత్రి సీతక్క.. ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. మంగళవారం ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి దామోదర రాజనర్సింహ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్‌రెడ్డితోపాటు రాజకీయ పార్టీల నేతలను జాతరకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.మంత్రి దామోదర రాజనర్సింహకు జాతర ఆహ్వాన పత్రిక అందజేస్తున్న మంత్రి సీతక్క -
శాసీ్త్రయ దృక్పథం కోసం పోరాడాలి
వరంగల్: శాసీ్త్రయ దృక్పథం కోసం విద్యార్థులు పోరాడాలని జేఎన్‌యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రతినిధుల సభ నిర్వ హించారు. సభ ప్రారంభానికి ముందు పీడీఎస్‌యూ జెండాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ ఆవిష్కరించగా ఆహ్వాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్ ప్రారంభో పాన్యాసం చేశారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అమరవీర సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ మాట్లాడుతూ ప్రగతిశీల ఉద్యమాలకు ఆద్యం పొసిన విప్లవ విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ అని కొనియాడారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకురా లు దీపాలక్ష్మి అధ్యక్షతన ‘నూతన జాతీయ వి ద్యా విధానం–కర్తవ్యం’ అనే అంశంపై హెచ్‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వ విద్య అందరి ద్రాక్షలా మార్చడానికి ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు పి.మహేశ్, జేఎన్‌యూ నాయకుడు సౌరవ్, ఢిల్లీ నాయకుడు రోహిత్, తమిళనాడు ఆర్‌ఎస్‌వైఎఫ్ బా లరాజు, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ నేత ధీరజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె . భాస్కర్.ఎం.వినోద్, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, జన్నారాపు రాజేశ్వర, డి.శ్రీకాంత్, ఎం.నవీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. జేఎన్‌యూ ప్రొఫెసర్ వికాస్ వాజ్పాయ్ -
మరోసారి ఎగిరేది గులాబీ జెండే..
జనగామ : రాష్ట్రంలో బీఆర్ఎస్(గులాబీ) జెండా మరోసారి ఎగరబోతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని భ్రమరాంబ కన్వెన్షన్‌లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి తో కలిసి మాట్లాడారు. ఉద్యమంలో పాత్రలేని నేతలు పదేళ్లపాటు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బిడ్డకు ఎంపీ అనేక పదవులు అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తట్టా, పార పారేసి సీఎం రేవంత్‌రెడ్డి పంచన చేరారని పేరు ప్రస్తావించకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పది మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా, కార్యకర్తలే తమ బలమని పేర్కొన్నారు. సర్పంచ్ల విజయం పార్టీ కార్యకర్తల శ్రమతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రభుత్వం పోలీసులను పంపించి వేధిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి రూ.ఆరువేల కోట్ల ఒప్పందాల్లో రాహుల్‌కు మూటలు సర్దే పనికే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో 48 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. యాప్‌లో మాత్రమే యూరియా కనిపిస్తోంది.. షాపులో ఉండడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తొండలు వదిలే సమయం దగ్గరలోనే ఉందన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రజలు ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ● ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిచ్చి కూతలు మానుకోవాలని ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కడియానికి షాక్ ఇచ్చేందుకు అక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్ పూర్ పురపాలికల్లో గులాబీ పార్టీ గెలువబోతోందన్నారు. ● పార్టీలు మార్చే కడియం శ్రీహరి చరిత్రను త్వరలోనే బట్టబయలు చేస్తానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వంద పడకల ఆస్పత్రి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో ఆవిర్భవించిందన్నారు. ఇవి రాకుండా అడ్డుపడిన మొదటి వ్యక్తి కడియం అన్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఏడాది ఉండే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ● కాంగ్రెస్ నాయకుల్లారా.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను విమర్శిస్తారా అని శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తె లంగాణ లేదన్నారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు సమైక్య వాదుల చెప్పులు మోసే పరిస్థితి వచ్చేదన్నారు. జనగామ గులాబీ మయం.. కేటీఆర్ రాకతో జనగామ గులాబీ మయంగా మారింది. పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలుకగా, వేలాది మందితో భారీ ర్యాలీగా జనగామ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. కడియం శ్రీహరి ద్రోహం చేశారు కాంగ్రెస్ అంటే గుండా రాజ్యం యూరియా యాప్‌లో ఉంది.. షాపులో లేదు సీఎంకు తొండలు వదులుదాం సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ -
బతికొస్తావా..
నువ్వే ఆధారం కొడుకా..ఖిలా వరంగల్: కుటుంబంలో కుమారుడు ఉన్నాడంటే కొండంత అండ ఉన్నట్లేనని తల్లిదండ్రులు భావిస్తారు. ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం సాధించి తమను బాగా చూసుకుంటాడని మురిసిపోతారు. అయితే కొందరు యువకులు అమ్మనాన్నల కలలు, ఆశయాలను కాల రాస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడిపై ఆధారపడిన తల్లిదండ్రులు.. అతను బయటకు వెళ్తే తిరిరి వచ్చే వరకు ఎదురుచూస్తుంటారు. అలాంటి అందివచ్చిన కుమారుడు ఇక లేడు .. కనిపించని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ హృదయాలు బరువెక్కి పోయాయి. ప్రేమ విఫలమై తనవు చాలించిన తమ కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించారు. నువ్వే ఆధారం కొడుకా..బతికొస్తావా.. అంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యం పలువురిని కంటతడికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే..పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన మోదం రాజయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వంశీ (21) ఉన్నాడు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహాలు జరిగాయి. ఈ క్రమంలో వంశీ బొల్లికుంటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మామునూరులో స్నేహితులతో కలిసి అద్దెకుంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమించిన యువతి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటికి వెళ్లిన వంశీ.. తన తల్లిదండ్రులకు ఫొటో చూపించి ‘నా స్నేహితురాలు అమెరికా వెళ్తోంది.. బీటెక్ పూర్తికాగానే నన్ను కూడా అమెరికాకు పంపించాలి‘ అని తల్లిదండ్రులను కోరాడు. అయితే కష్టపడి ఇద్దరు అక్కల వివాహాలు చేసిన.. నిన్ను కూడా చిదివిస్తున్న.. చేతిలో చిల్లి గవ్వలేదు అమెరికాకు పంపించలేనని తండ్రి స్పష్టం చేశాడు. దీంతో వంశీ.. ప్రేమికురాలితో కలిసి తాను అమెరికాకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపంతోనే శనివారం ఉదయం ఇంటి నుంచి వరంగల్ మామునూరులోని రూమ్‌కు చేరుకున్నాడు. సోమవారం కాలేజీ వెళ్లాల్సి ఉండగా.. గదిలోనే మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ప్రేమ విఫలమై తనువు చాలించిన యువకుడి తల్లిదండ్రుల రోదన.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం -
వెనువెంటనే మరమ్మతులు
జాతరలో బస్సుల వైఫల్యాలకు తావు లేదు హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఆర్టీసీ బస్సుల వైఫల్యాలకు తావు లేకుండా టీ జీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు అన్ని చ ర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చే స్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రో జులపాటు జరిగే వనదేవతలు సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈ నెల 21 నుంచి టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక ఖరారు చేసింది. 2022లో జరి గిన జాతరలో 2,800 బస్సులు నడిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన క్రమంలో ఈసారి మ హిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. దీంతో 2024 జాతరలో 3,840 బస్సులు నడిపారు. ఈ జాతరలో భక్తులను వెనువెంటనే చేరవేయడానికి 4,860 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి బస్సులు సేకరిస్తున్నారు. ఈ నెల 21 నాటికి వరంగల్ రీజియన్‌కు బస్సులు చేరుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలు.. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు మార్గమధ్యలో ఫెయిలైనా, ఇతర మరమ్మతులు వచ్చినా భక్తులు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, బస్సులు నిలిచిపోకుండా ఉండేందుకు వెంటనే మరమ్మతులు చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు మొబైల్ టీంలు ఏర్పాటు చేయడంతో పాటు మార్గమధ్యలో ప్రత్యేకంగా మెయింటెనెన్స్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండి నాలుగు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లో సులువుగా చేరుకునేందుకు ద్విచక్రవాహనాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. జాతర రూట్లో మొత్తం 16 చేజింగ్, రిలీఫ్ మొబైల్ టీంలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక అధికారి, ఇద్దరు మెకానిక్‌లు ఉంటారు. అదేవిధంగా 11 రిలీఫ్ వ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మెకానిక్‌లతోపాటు టైర్లు, విడిభాగాలు అందుబాటులో ఉంటాయి. బస్సు మార్గమధ్యలో ఫెయిలైతే ఈ వ్యాన్‌కు సమాచారం అందించిన వెంటనే చేరుకుని మరమ్మతు చేసి పంపుతారు. వీటితో పాటు 12 డీజీటీలను అందుబాటులో ఉండేల కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో ఇద్దరు మెకానిక్‌లు, ఒక ఎలక్ట్రీ షియన్ ఉంటారు. ఆగిపోతే తక్షణమే రిపేర్ చేసేలా ఏర్పాట్లు అందుబాటులో 16 ఛేజింగ్, రిలీఫ్ టీంలు, 11 వ్యాన్లు, నాలుగు మెయింటెనెన్స్ క్యాంపులు ఈనెల 21 నుంచి మేడారానికి బస్సులు నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం, అధికారుల కసరత్తు -
వికారాబాద్–కాకినాడ టౌన్ ట్రైన్ రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా వికారాబాద్–కాకినాడ టౌన్ (07287) మధ్య ప్రయాణించే వీక్లి ఎక్స్‌ప్రెస్‌ను సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. ఆపరేషనల్ రీజన్స్‌తో జనవరి 19వ తేదీన ప్రయాణించే ఈ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వారు పేర్కొన్నారు. బాలుడి కిడ్నాప్ కేసు ఛేదనలో ముందడుగు.. ● నిందితులు కారు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తింపు కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఇటీవల కిడ్నాప్‌నకు గురైన బాలుడి కేసు ఛేదనలో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులకు క్లూ లభించినట్లు సమాచారం. హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన లావుడ్య కన్నా నాయక్ దంపతులు గత 27వ తేదీన రాత్రి జంక్షన్ ఆవరణలో తమ ఐదు నెలల బాలుడితో కలిసి నిద్రించారు. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి దుండుగులు బాలుడిని అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, క్రైం, టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల వడబోతలో లభించిన క్లూ.. పోలీసుల పది రోజులు ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు సమాచారం. బాలుడి కిడ్నాప్‌నకు నిందితులు కారు ను ఉపయోగించినట్లు పోలీసు బృందాలు నిర్ధారణ కు వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 11 గంటల సమ యం నుంచే అనుమానిత కారు నాలుగైదు రౌండ్లు కాజీపేట రైల్వే జంక్షన్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ కారులోనే బాలుడిని దాదాపు రాత్రి 2.30 గంటల సమయంలో తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు. నిందితులతో పాటు కారును గుర్తించడానికి పోలీసు బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలి
● డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: వరంగల్ డీసీసీబీని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆ బ్యాంకు పర్సన్ ఇన్చార్జ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సంబంధిత అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు నిర్వహణ తీరును సమీక్షించి డిపా జిట్లు, రుణాల రికవరీ అంశాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు పనితీరు మెరుగుపరుచుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఖాతాదారులు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో హనుమకొండ, జనగామ, జేఎస్ భూపాలపల్లి, వరంగల్ డీసీఓలు సంజీవ రెడ్డి, కోదండరాం, వాలునాయక్, నీరజ, డీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్, డీజీఎం అశోక్, తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ హసన్‌పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ మహిళలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు, తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్న వారు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, రేషన్, ఆధార్ కార్డులు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లతో 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వివరాలకు 9704056522 నంబర్లో సంప్రదించాలని రవి సూచించారు -
‘బంగారం’ వచ్చేస్తోంది!
గీసుకొండ : మేడారం వన దేవతలు సమ్మక్క, సారమ్మకు భక్తులు నైవేద్యంగా సమర్పించే ‘బంగారం’( బెల్లం) నిల్వలను వ్యాపారులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వ్యాపారులు పలు రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి బెల్లం తెప్పించి అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో వరంగల్ పాతబీట్ బజారు ప్రాంతంలో సుమారు 10 బెల్లం విక్రయించే హోల్ సేల్ షాపులు ఉండగా కొత్తగా మరి కొన్ని వెలుస్తున్నాయి. అలాగే, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, హనుమకొండ జిల్లాలోని వ్యాపారులు సైతం మహాజాతరకు బెల్లం రెడీ చేస్తున్నారు. పావు కిలో నుంచి 10 కిలోల వరకు.. మార్కెట్లో బెల్లం పావు , అర కిలో, కిలో, ఐదు, పది కిలోల చొ ప్పన లభిస్తున్నాయి. పది కిలో లకు మించి బెల్లం బుట్టలు ఉండవని వ్యాపారులు చెబుతున్నారు. కిలో బెల్లం ధర రూ. 40 నుంచి రూ.70 వరకు నాణ్యత, దిగుమతి చేసుకునే ప్రాంతం, దూరం ఆధారంగా ఉంటుందంటున్నారు. కస్తూరి రకం అధిక నాణ్యమైందని, కిలో రూ. 66 నుంచి రూ. 70 వరకు ధర పలుకుతోందని తెలిపారు. సమ్మక్క పున్నంతో ఇంటింటా పూజలు ఈ నెల 3వ తేదీన సమ్మక్క పున్నం ప్రారంభమైంది. ఈ నెల నుంచి ఫిబ్రవరి 1న రానున్న పౌర్ణమి వరకు భక్తులు ఇంటింటా సమ్మక్క పూజలు చేస్తారు. ముఖ్యంగా బుధ, గురు, శుక్ర వారాల్లో పల్లెల్లో సమ్మక్క పూజల సందడి కనిపిస్తుంది. ఆ రోజుల్లో వీలు కాని వారు ఆదివారం చేస్తారు. ఇంటి వద్ద పూజలు చేసిన తర్వాతే జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ పూజల్లో ఎత్తు బెల్లం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో వనదేవతల పూజల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. బరువు ఎక్కువగా ఉన్న వారు అమ్మవార్లకు కొంత బెల్లంతో పాటు పంచదార(చక్కెర)ను కూడా నైవేద్యంగా అందిస్తున్నారు. చక్కెర కిలో ధర ప్రస్తుతం రూ. 40 ఉంది. గతంలో రూ. రెండు ఎక్కువ ఉన్నా ఇటీవల తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో ..అంటే జనవరి 28, 29, 30 తేదీల్లో అమ్మవార్ల జాతర నిర్వహిస్తారు. జాతరలో భక్తులు వేల టన్నులు బెలాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించనున్నారు.దిగుమతి చేసుకునే రకం.. కిలో బెల్లం ధర మహారాష్ట్ర నాందేడ్ రకం రూ. 40 మహారాష్ట్ర పుణె రకం రూ. 42 కర్ణాటక కోలాపూర్ రకం రూ. 48 కర్ణాటక కస్తూరి రకం రూ. 66 మేడారం మహాజాతరకు దిగుమతి అవుతున్న బెల్లం పలు రాష్ట్రాల నుంచి వేల టన్నుల సరుకు తెప్పిస్తున్న వ్యాపారులు -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
బచ్చన్నపేట : అయ్యప్ప మాల విరమణ అనంతరం దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా కారు టైరు పగిలి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలానికి చెందిన సమ్మెట మహేశ్ (32) బైక్ మెకానిక్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మహేశ్, కొడకండ్లకు చెందిన అందె యాకయ్య అయ్యప్ప మాల ధరించారు. డిసెంబర్ 30న ఇద్దరూ శబరికి వెళ్లి మాల విరమణ చేసి మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పుణ్య క్షేత్రం వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. దీంతో మృతుడు మహేశ్‌తోపాటు భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు, అతడి స్నేహితుడు అందె యాకయ్య, భార్య మంజుల, కూతురు, అతడి చెల్లి.. కారులో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి పుణ్య క్షేత్రానికి వెళ్లారు. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యాకయ్య కారు నడుపుతుండగా మహేశ్ పక్కన కూర్చున్నాడు. ఈ క్రమంలో అలీంపూర్ గ్రామం దాటగానే కారు టైరు పగిలి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పక్కన కూర్చున్న మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మిగతా వారికి గాయాలుకాగా 108లో ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, మహేశ్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కారు బోల్తాపడి యువకుడి దుర్మరణం అయ్యప్ప మాల విరమణ రోజే మృతి.. -
తప్పులనొప్పుకోం..
మున్సిపల్ ఓటరు జాబితాపై రాజకీయ పక్షాల నిరసనసాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు రూపొందించిన ఓటరు జాబితాపై జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటరు ముసాయిదా జాబితాను మంగళవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రకటించారు. అయితే ఇందులో తప్పులు ఉన్నాయని జిల్లాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఇతర పార్టీల నాయకులు అభ్యంతరం తెలిపారు. జాబితా సవరిస్తేనే ఎన్నికలకు సహకరిస్తామని నాయకులు తేల్చి చెప్పారు. జాబితాలోని తప్పులు ఇలా.. ● మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఇక్కడ నివాసం ఉండేవారి పేర్లు కాకుండా నర్సింహులపేట మండలం పెద్దనాగారం, కేసముద్రం మండలంలోని పలుగ్రామాలు, వేమునూరు, కంబాలపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల పే ఓటరు జాబితాలో ఉన్నాయి. ● మహబూబాబాద్ పట్టణంలోని 22వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 500 మంది ఓటర్ల పేర్లు నమోదయ్యాయి ● మహబూబాబాద్‌లోని 23వ వార్డుల్లో ఇతర వార్డుల్లో నివాసం ఉండే 400 ఓట్లు కలిశాయి. ● మహబూబాబాద్ పట్టణంలోని 34వ వార్డులో గతంలో ఉన్న ఓట్లకు 280 ఓట్లు కోత పెట్టి వాటిని ఇతర వార్డుల్లో కలిపారు. ● మహబూబాబాద్ పట్టణంలోని 36 వార్డుల్లో అన్ని వార్డులకు చెందిన ఓటర్లు కలిశాయని రాజకీయ నాయకులు చెబుతున్నారు. ● కొన్ని వార్డుల్లో ఒకే ఇంటి నంబర్‌పై 50 నుంచి 150 ఓట్లు నమోదు కావడం గమనార్హం. ● గుమ్ముడూరు ప్రాంతం 29వ వార్డుల్లో 2020 నాటి ఓట్లు కాకుండా ఇప్పుడు పట్టణానికి మరోవైపు ఉండే 24వ వార్డు ప్రాంతానికి చెందిన సుమారు 400 ఓట్లు చేరాయి. దీంతో ఇరు ప్రాంతాల్లో ఒకే కౌన్సిలర్ ఎలా అభివృద్ధి చేస్తారు. ప్రజల సమస్యలు ఎలా పరిష్కరిస్తారని రాజకీయ నాయకులు ప్రశ్నించారు. రాజకీయ పార్టీల సూచనలు ఇలా.. ● 2020లో మహబూబాబాద్ పట్టణంతోపాటు విలీన పంచాయతీలు శనిగపురం, జమాండ్లపల్లి, ఈదులపూసపల్లి, బేతోలు, గాంధీపురం, అనంతారం, రజాల్పేట, ముత్యాలమ్మగూడెం మొదలైన గ్రామాల ఓటర్లను బౌగోళిక స్థితి ఆధారంగా వార్డులుగా విభజించారు. ఇందుకు అనుగుణంగా ఓటరు జాబితాను తయారు చేశారు. ఇప్పుడు అదే విధంగా జాబితా తయారు చేయాలి. ● చాలా ఇంటి నంబర్లలో బై నంబర్లు తప్పులుగా వేసి ఓటరు జాబితాను తయారు చేశారు. ఇలా కాకుండా అనుభవం ఉన్న ఉద్యోగుల పర్యవేక్షణలో పునర్ పరిశీలన చేసిన తర్వాతనే కొత్త జాబితాను రూపొందించాలి ● పాత జాబితాలో స్పష్టతవచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన ఓటర్లు, చేర్పుల మార్పులకు అవకాశం ఇవ్వాలి. ● ఈ ప్రక్రియ అంతా 8వ తేదీ వరకు పూర్తి చేసి 9వ తేదీన అన్ని రాజకీయ పార్టీలకు కాఫీ ఇవ్వాలి. అందరూ అంగీకరించిన తర్వాతనే 10వ తేదీ తుది జాబితాను ప్రకటించాలి. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేసిన సూచనలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి తుది జాబితాను తయారు చేసి ఇస్తామని ప్రకటించినట్లు ఆయా పార్టీల నాయకులు ‘సాక్షి’తో తెలిపారు. వార్డులతో పొంతన లేకుండా జాబితా సవరణ చేస్తేనే సహకరిస్తామన్న రాజకీయ పార్టీల నాయకులు తుది జాబితాకు ముందు సమావేశం నిర్వహించాలని డిమాండ్ రాజకీయ పార్టీల అభిప్రాయాలపై కలెక్టర్ సానుకూల స్పందనఓటర్లు వార్డు పరిధిలో ఉండేలా చూడాలి మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని వివిధ పార్టీల నాయకులు అజయ్సారఽథిరెడ్డి, సురేష్‌నాయుడు, సూర్నపు సోమయ్య, వెంకన్న, శ్యాంసుందర్‌శర్మ, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్‌కు వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక వార్డు ఓటర్ల పేర్లు మరో వార్డులో ఉన్నాయని.. సరిచేయాలని కోరారు. నాయకులు ఖలీల్, కుమార్, ఫరీద్, రాజమౌళి, రామారావు, సందీప్, వెంకన్న, సీతారాం నాయక్, యాకయ్య పాల్గొన్నారు. -
బ్యాంకుల సహకారంతో నేరాల నియంత్రణ
మహబూబాబాద్ రూరల్ : ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్, ఫిషింగ్ లింక్స్, క్యూఆర్ కోడ్ మోసాలు, ఆన్లైన్ లోన్, తక్షణ రుణాలపేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్ సూచించారు. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఏటీఎం భద్రత, బ్యాంకు సెక్యూరిటీ, కస్టమర్లకు అవగాహన అంశాలపై మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ సమావేశ మందిరంలో బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ ప్రొఫైల్స్ తయారీ, పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా, బ్యాంకులు, పోలీసు శాఖ మధ్య సమన్వయంతో సమాచారం పంచుకోవడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగులపై నిఘా, సున్నితమైన లావాదేవీల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన వెంటనే సంబంధిత ఖాతాలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏటీఎం సెంటర్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఏటీఎం వద్ద సరిపడా లైటింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే డోర్ లాకింగ్ సిస్టమ్, ఫైళ్ల భద్రత, బ్యాంకు లోపలి సెక్యూరిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. బ్యాంకు సెక్యూరిటీ గార్డులు, సిబ్బందికి భద్రతా విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. బ్యాంకు పని వేళలు ముగిసిన తర్వాత కూడా సెక్యూరిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో అడ్మిన్ డీఎస్పీ గండ్రతి మోహన్, మానుకోట డీఎస్పీ తిరుపతిరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నరేందర్, రూరల్, బయ్యారం సీఐలు సరవయ్య, రవికుమార్ పాల్గొన్నారు. ఎస్పీ డాక్టర్ శబరీష్ -
నేడు జిల్లా మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరికేసముద్రం: ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని జిల్లా రవాణా అధికారి జయపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేసముద్రంస్టేషన్ జెడ్పీ హైస్కూల్, పాలిటెక్నిక్ కళాశాలలో రోడ్డు భద్రతా వారో త్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుమీద ప్రయాణం చేసేటప్పుడు మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయొద్దని తెలిపారు. విద్యార్థులకు రోడ్డు భద్రతా అంశాలపై క్విజ్ పోటీలు ఏర్పాటు చేశారు. విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్, ఆర్టీఏ డైరెక్టర్ రావుల మురళీ పాల్గొన్నారు. ముద్ర లోన్ పేరిట సైబర్ మోసం డోర్నకల్: మండలంలోని తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు చిక్కి డబ్బు కోల్పోయాడు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ బంజర గ్రామానికి చెందిన చెవిటి రాముకు గుర్తు తెలియని వ్యక్తులు ముద్ర లోన్ ఇప్పిస్తామంటూ గత నవంబర్ నుంచి విడతలవారీగా రూ.96,000 తమ అకౌంట్‌కు బదిలీ చేయించుకున్నారు. కానీ, రుణం ఇవ్వకపోవడంతో తాను మోసపోయినట్లు ఆలస్యంగా గుర్తించిన రాము మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ నేరగాళ్ల అకౌంట్లోని రూ.16,000 నగదును హోల్డ్‌లో పెట్టారు. రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి మహబూబాబాద్ అర్బన్: పదో విద్యార్థులు తత్కాల్ స్కీమ్ కింద ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు అపరాధ రుసుం రూ.వేయితో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని డీఈఓ రాజేశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు జిల్లా ఏసీజీఈ మందుల శ్రీరాములును 98497 61012 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలను నియంత్రించాలి మహబూబాబాద్ అర్బన్: దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘బాల్య వివాహరహిత భారతదేశం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా చేయాలని న్యాయ సేవా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాజుకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగఽవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజుకృష్ణ మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ప్రకారం బాలికలకు 18 ఏళ్లు, పురుషులకు 21 ఏళ్లు పూర్తయితేనే వివాహం జరిపించాలని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగితే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098 కు కాల్ చేసిన సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఇతర న్యాయ సలహాలు సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ బాల్య వివాహాలు, అక్రమ రవాణా, ఫోక్స్ తదితరలపై రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శంచారు. కార్యక్రమంలో హెచ్ఎం పొడుగు నర్సయ్య, హాస్టల్ వార్డెన్ పద్మ, ఉపాధ్యాయులు చిట్టిబాబు, హరికృష్ణ పాల్గొన్నారు. -
ధాన్యం రాశులు
సాక్షి, మహబూబాబాద్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అయితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సివిల్ సప్లయీస్లోని పలువురు అ ధికారులు, కొన్ని రైస్ మిల్లుల యజమానుల మధ్య సమస్వయంతో రైతులను మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సకాలంలో కాంటాలు పెట్టకపోవడం, కాంటాలు పెట్టిన ధాన్యం రవాణా చేయకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉంచడం, కాంటాల్లో మోసం.. తరుగు పేరుతో డబ్బుల్లో కోత పెట్టిన విషయంపై రైతులు ఆందోళన చేయడం, కొనుగో లు కేంద్రాల్లో జాప్యం మూలంగా మరిపెడ మండలంలో రైతులు మృతి చెందిన సందర్భాలు ఉన్నా యి. వీటిని అధిగమించేందుకు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సివిల్ సప్లయీస్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలు సక్రమంగా పెట్టకుంటే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా వారితో అగ్రిమెంట్స్ రాయించుకున్నారు. ట్రాన్స్‌ఫోర్ట్ అధికారుల ను భాగస్వామ్యులను చేసి కాంటా పెట్టిన వెంటనే ధాన్యం మిల్లులకు తరలించేలా చూశారు. 2.12 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొనుగోళ్లు గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు లక్ష్యంలో సగం ధాన్యం కూడా రాని సందర్భాలున్నాయి. కానీ, ఈ వానాకాలంలో ఇప్పటి వరకే 2.12 లక్షలకు మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. వానాకాలం 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతుల నిల్వ, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావించారు. అయితే ఇప్పటి వరకు 2.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. మరో 30 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.రికార్డు స్థాయిలో వానాకాలం ధాన్యం దిగుబడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కాంటాలు పెట్టిన వెంటనే మిల్లులకు తరలింపు -
మున్సిపాలిటీ వద్దు.. గ్రామపంచాయతీ ముద్దు
● గాంధీ సెంటర్లో మహిళల ధర్నా ● మున్సిపల్ ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఆందోళనడోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక గాంధీ సెంటర్లో మహిళలు ధర్నా నిర్వహించారు. బంకట్సింగ్ తండా, ఎర్రమట్టి తండా, సిగ్నల్ తండాకు చెందిన గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో గాంధీ సెంటర్‌కు చేరుకుని రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. డోర్నకల్ మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత తాము ఉపాధి హామీ పనులకు దూరమయ్యామని, ఇంటి పన్నులు, పారిశుద్ధ్య సమస్యలు పెరిగాయని, అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ మారిందంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డోర్నకల్‌ను గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ నాలుగు గంటలపాటు రోడ్డుపై బైటాయించారు. తమ డిమాండ్ అమలు కాకపోతే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఎస్సై గడ్డం ఉమ, కాంగ్రెస్ నాయకులు మాదా శ్రీనివాస్, శీలం శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు మన్యుపాట్ని తదితరులు మహిళలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఆందోళన కొనసాగించడంతో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగిన తర్వాత కమిషనర్ నిరంజన్‌తోపాటు కాంగ్రెస్ నాయకుల అభ్యర్థన మేరకు కమిషనర్‌కు వినతిపత్రం అందించి ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలనే డిమాండ్ రావడం స్థానికంగా చర్చాంశనీయంగా మారింది. -
ఎగిరేది గులాబీ జెండే..
జనగామలో నిర్వహించిన భారీ ర్యాలీలో కేటీఆర్, గులాబీ శ్రేణులు ● కడియం ద్రోహం చేశారు.. కాంగ్రెస్ అంటే గూండా రాజ్యం ● బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్జనగామ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ -
మంత్రి శ్రీహరిని కలిసిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జీవాంజి దీప్తి సోమవారం పశు సంవర్థక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏషియన్ చాంపియన్ షిప్లో పాల్గొంటున్న సందర్భంగా ప్రాక్టీస్ గురించి మంత్రి, ఎమ్మెల్యేకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చినట్లు దీప్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో దీప్తి తల్లిదండ్రులు ధనమ్మ, యాదగిరి పాల్గొన్నారు. వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించాలి ● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్: వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడాపాఠశాల నిర్మాణానికి స్థలం గుర్తించి పనులు ప్రారంభించాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చారిత్రక వరంగల్ జిల్లాను విద్యనేకాకుండా క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలం కోరగా సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, రెసిడెన్షియల్ క్రీడాపాఠశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. హామీ ఇచ్చి ఆరునెలలు గడిచాయని, వెంటనే స్పందించి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, శాశ్వత క్రీడా పాఠశాల నిర్మాణ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. వీధికుక్క అడ్డు రావడంతో.. ● బైక్ అదుపు తప్పి ఆర్టీసీ డ్రైవర్ మృతి గీసుకొండ: వీధికుక్క అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం వద్ద చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని గంగదేవిపల్లికి చెందిన గూడ సంతోష్(40) హనుమకొండ ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పని నిమిత్తం బైక్‌పై నగరానికి వచ్చిన సంతోష్.. సాయంత్రం 4.30 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం రంగనాయకుల కుంట వద్దకు చేరుకోగానే వీధి కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్ అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. -
కంపెనీ బ్రాండ్లు మార్చేది మార్వాడీ వ్యాపారులే!
● స్థానిక వ్యాపార సంస్థలపై ఆరోపణలు సరికాదు ● వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయవరంగల్ చౌరస్తా : వరంగల్‌లోని మార్వాడీ వ్యాపారులు ప్రముఖ కంపెనీల బ్రాండ్ల పేర్లతో నకిలీ వస్త్రాలు అమ్ముతున్నారని వరంగల్ బట్టల వర్తక సంఘం అధ్యక్షుడు నమఃశివాయ తెలిపారు. ఈ మేరకు సోమవారం వరంగల్ బట్టల బజారు వర్తక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట స్థానిక మార్వాడీ వ్యాపారులు దుస్తులపై నకిలీ స్టిక్కర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. 60 సంవత్సరాల నుంచి వరంగల్ వర్తక, వ్యాపారులం నిజాయితీతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వాలకు అన్నీ రకాల పన్నులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ స్టిక్లర్లు వేసి బ్రాండ్ల పేరుతో అమ్మకాలు చేస్తున్న మార్వాడీ వస్త్ర వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్యదర్శి కోమాండ్ల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి అల్లాడి వీర ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట
కాజీపేట రూరల్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం కాజీపేట రైల్వే స్టేడియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో మొదటిసారి 58వ జాతీయస్థాయి సీనియర్స్ ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 79 జట్లతో 2 వేల మంది క్రీడాకారులు, టెక్నికల్ అఫీషియల్స్, అధికారులు పాల్గొంటున్నట్లు వివరించారు. పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. పోటీలు డే అండ్ నైట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడగా మారిన గ్రామీణ ఖోఖో పోటీలను మ్యాట్లపై నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే వారికి 7 రోజుల పాటు ఉచిత భోజనం, వసతి, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాస్‌యాదవ్, పోటీల నిర్వాహణ కమిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్, జిల్లా ఖోఖో సంఘ ఉపాధ్యక్షుడు కుసుమ సదానందం, సంయుక్త కార్యదర్శి ఎం.రమణ, రాజారపు రమేశ్, శ్రీనివాస్, తెలంగాణ ఖోఖో సంఘం రెఫ్రిజ్ బోర్డు కన్వీనర్ వి.సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం అధ్యక్షుడు జంగా రాఽఘవరెడ్డి -
మూడు షిఫ్ట్‌లు.. 24 గంటలు పహారా
హన్మకొండ అర్బన్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈనెల 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనున్న జాతర నిర్వహణకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర భారీస్థాయిలో అధికారులు, సిబ్బందిని కేటాయిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మొత్తం 660 మంది అధికారులను విధుల్లోకి దించుతున్నారు. జోనల్, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు విధులు కేటాయించారు. జోనల్, నోడల్ అధికారులు: జాతర ప్రాంగణాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి, వాటి పర్యవేక్షణ కోసం 95 మంది ఉన్నతస్థాయి అధికారులను నియమించారు. సిబ్బంది విభజన: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలనుంచి రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, నీటి సరఫరా, విద్యుత్ వంటి అన్ని శాఖల అధికారులకు విధులు కేటాయించారు.. పోలీస్ పహారా: ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భారీగా పోలీస్ బందోబస్తు ఉండనుంది. వీరు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత పర్యవేక్షిస్తారు. మూడు షిఫ్టుల్లో 24 గంటల సేవలు కోట్లాదిగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారులను మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు. మొదటి షిఫ్ట్: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 వరకు. రెండవ షిఫ్ట్: మధ్యాహ్నం 2నుంచి రాత్రి 10 వరకు. మూడవ షిఫ్ట్: రాత్రి 10 నుంచి మరుసటిరోజు ఉదయం 7 వరకు. విధులకు ఎంపికై న 660 మంది అధికారులకు, సిబ్బందికి మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజులపాటు మేడారంలోని హరిత హోటల్లో ప్రత్యేక శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. జాతరను విజయవంతం చేసి, భక్తులకు అమ్మవార్ల దర్శనం సులువుగా కలిగేలా చూడటమే లక్ష్యంగా యంత్రాంగం కదులుతోంది. వీరుకాక పోలీస్ శాఖ, ఎన్‌ఎస్‌స్, ఎన్సీసీ, ఇతర స్వచ్ఛంద, యువజన సంఘాల సేవలు అదనంగా వాడుకోనున్నారు. మేడారం జాతర విధులకు ఉమ్మడి జిల్లానుంచి 660 మంది అధికారులు మహా జాతరపై ములుగు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు జోనల్, నోడల్ అధికారులుగా 95 మంది నియామకం నేటినుంచి మూడు రోజులపాటు శిక్షణ 26న రిపోర్ట్ చేయాలని ఆదేశంఈసారి మేడారం జాతరకు సుమారు 2 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్ల నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం, అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జాతర తేదీలకు రెండు రోజుల ముందే, అంటే జనవరి 26 నాటికే అధికారులు తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని, విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
ఊరేగింపుగా వచ్చి.. సంధల్ సమర్పించి..
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో సోమవారం రాత్రి అన్నారం దర్గా యాకూబ్షావలి ఉర్సు ప్రారంభమమైంది. బోలేషావలి ఇంటి వద్ద మత పెద్దల ఆధ్వర్యంలో గంధం, సెంటు, రోజ్‌వాటర్, గులాబీ పూలను కలిపి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధం (సంధల్) తీసుకుని మేళతాళాల మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకున్నారు. అనంతరం గంధం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో యాకూబ్బాబాకు మత పెద్దలు, ముజావర్లు సలాం పాట నిర్వహించారు. ఉత్సవాల నేపథ్యంలో అన్నారం దర్గా పరిసర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. కాగా, అంతకుముందు మధ్యాహ్నం ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్.. మామునూరు ఏసీపీ వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా యాకూబ్షావలిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. గంధం ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ అమీద్ అహ్మద్, సూపరింటెండెంట్ ఎండి.ఫయాజ్, ఇన్స్పెక్టర్ రియాజ్, ముజావర్లు గౌస్‌పాషా, యాకూబ్‌పాషా, ఖాజాపాషా, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, గొడుగు భిక్షపతి, మోటపోతుల సారంగపాణి, గొడుగు వినయ్, గొడుగు రమేశ్, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ఉర్సులో విడిది చేస్తున్న భక్తులు, ఉత్సవాల్లో భాగంగా ఖవ్వాలీలో పాల్గొన్న భక్తులు ప్రారంభమైన అన్నారం దర్గా ఉర్సు భక్తిశ్రద్ధలతో బాబాకు మొక్కులు.. ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు దర్గా పరిసరాల్లో భక్తుల కోలాహలం -
భక్తుల రాకపోకలకు అంతరాయం ఉండొద్దు
ములుగు రూరల్: ‘ఇప్పుడే ఇలా ... మహా జాతరకెలా’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్ మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈ చేతన్, సీఐ సురేశ్‌కుమార్, ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఎస్పీ సుధీర్ ఆర్. కేకన్, జాతీయ రహదారుల శాఖ డీఆర్ కిరణ్ కుమార్ -
జాతర విధుల్లో పాల్గొనే సిబ్బందిపై పర్యవేక్షణ
హన్మకొండ: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లకు ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దిశానిర్దేశం చేశారు. జాతరలో భక్తుల రద్దీ దృష్ట్యా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సెఫ్టీ వార్డెన్లు కీలక పాత్ర పోషించాలన్నారు. జాతరలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.ణ ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణ తో వ్యవహరించేలా సిబ్బందికి అవగాహన కల్పించాలనిన్నారు. మద్యం సేవించి విధులకు హాజరు కాకుండా, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు పి.మహేశ్, కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య,డిపో మేనేజర్లు పి.అర్పిత, రవిచంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు పాల్గొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ -
విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి
కేయూ క్యాంపస్ : విద్యాకాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఐఎఫ్టీయూ) జాతీయ కార్యదర్శి, ప్రగతి శీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి. ప్రసాద్ అన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా సోమవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీడీఎస్‌యూ ఐదు దశాబ్దాలుగా దేశంలో సమాన విద్య విధానం కోసం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేర విద్యాకాషాయీకరణకు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందని విమర్శించారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభ దశలో ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను అంబానీ, అదానీలకు కట్టబెట్టేందుకే మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేర హతమారుస్తున్నారని ఆరోపించారు. డాలర్ సంపాదనకు భారతదేశం నుంచి అమెరికా సామ్రాజ్యావాదదేశానికి కొంతమంది విద్యార్థులు, మేధావులు వలసపోతున్నారన్నారు.అలాకాకుండా ఈదేశ అభివృద్ధిని కాంక్షించే పౌరులుగా ఇక్కడే పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. అధ్యక్షుడు సాదినేని వెంకటేశ్వర్రావు, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు వి. సంధ్య మాట్లాడుతూ అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు రాష్ట్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ పీడీఎస్‌యూ విద్యార్థుల హక్కులకోసం పనిచేస్తుందన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్, నాయకులు సౌరాన్, పంజాబ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ధీరధ్, ఏపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. భాస్కర్, ఎం. వినోద్ మాట్లాడారు. ఈసభలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భువనగిరి మధు, రాజేశ్వర్, డి. శ్రీకాంత్, మంద నవీన్, సంతోష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్. గౌతమ్, కుమార్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్‌లోని అబ్నూస్ ఫంక్షన్ హాల్లో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రతినిధుల మహాసభలు నిర్వహించనున్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి పి. ప్రసాద్ ఆర్ట్స్ అండ్ ౖ సెన్స్ కళాశాలలో పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలు పీడీఎస్‌యూ రాష్ట్ర మహసభలను పురస్కరించుకుని విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. హనుమకొండలోని ఏకశిల పార్కు నుంచి యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు. -
పొగమంచు అనుకుంటే పొరపాటే..
జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో కంకర తేలి, రోడ్డు గుంతలమయంగా మారి వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము లేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వెంట ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు దుమ్ముతో ఊపిరాడక అవస్థలు పడుతున్నారు. కాగా, రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి దుమ్ము సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
పంచాయతీల్లో కో–ఆప్షన్ సందడి
● అవకాశం కోసం పలువురి యత్నాలు ● పల్లెల్లో మొదలైన చర్చలు ● గ్రామాల అభివృద్ధికి పాటుపడే వారికి అవకాశంతొర్రూరు: పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల్లో తిరిగి రాజకీయ సందడి ఊపందుకుంది. ప్రతీ గ్రామ పంచాయతీ పాలకవర్గంలో అదనంగా మరో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులను నియమించాలి. సాధారణంగా మున్సిపాలిటీలు, మండల పరిషత్‌ల్లో మైనార్టీలకు ఈ పదవులు దక్కుతాయి. గ్రామ పంచాయతీల్లో నిబంధనలు భిన్నంగా ఉన్నాయి. పంచాయతీల అభివృద్ధికి మార్గదర్శకంగా సూచనలు, సలహాలు ఇచ్చే వారిని నియమించాల్సి ఉంది. వారి పాత్ర ఇలా.. కో–ఆప్షన్ సభ్యులకు గ్రామ సభల్లోనూ, పంచాయతీ సమావేశాల్లోనూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వార్డు సభ్యులతో సమానంగా ప్రొటోకాల్ ఉంటుంది. గ్రామాభివృద్ధికి సంబంధించి వీరిచ్చే సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఏదైనా అంశంపై తీర్మానం చేసేటప్పుడు ఓటు వేసే అధికారం ఉండదు. కేవలం పంచాయతీలకు సలహాదారులుగా వ్యవహరిస్తారు. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించి ప్రణాళికల రూపకల్పనలో వీరి పాత్ర కీలకం కానుంది. ఎంపిక.. గ్రామ పంచాయతీల పాలకవర్గంతో పాటు సమాన హోదా ఉండే కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. సభ్యుల్లో గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, జీఓలు, పాలనాపరమైన అంశాలపై పట్టు ఉన్న ఒక విశ్రాంత ఉద్యోగిని సభ్యుడిగా ఎంపిక చేయాలి. మరొకరు పంచాయతీ అభివృద్ధికి పాటుపడిన వారు, భారీగా విరాళాలిచ్చిన దాతలు లేదా గ్రామాభివృద్ధికి తోడ్పడే ఎన్నారైలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరి ఎంపికలో సర్పంచ్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం కీలకం కావడంతో పదవిని ఆశించే కొంత మంది ఆశావహులు అప్పుడే గ్రామాల్లో ముమ్మరంగా మంతనాలు ప్రారంభించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు సైతం తమకు అనుకూలమైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆదేశాలు రాగానే ఎంపిక చేస్తాం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పూర్తి చేస్తాం. పంచాయతీ చట్టంలో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యుల ఎంపికను పొందుపర్చారు. – హరిప్రసాద్, డీపీఓజిల్లా సమాచారం మండలాలు– 18 పంచాయతీలు–482 కో ఆప్షన్ సభ్యుల సంఖ్య–1,446 -
‘పది’లో లక్ష్యం చేరేనా?
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో గత ఏడాది జిల్లా రాష్ట్రంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఈ ఏడాది కూడా మొదటి స్థానం సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ఉత్తమ ఫలి తాలే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ, కార్యాచరణతో ముందుకు సాగాల్సిన సమయంలో డీఈఓ నిర్లక్ష్యం వల్ల సరైన ప్రణాళిక లేకపోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల సందర్శన, ప్రత్యేక తనిఖీలు లేవని చెప్పకనే చెబుతున్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో ఇలా.. పదో తరగతిలో ఫలితాల్లో 2022–23 విద్యాసంవత్సరంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 2023–24లో 12వ స్థానం లభించింది. 2024–25 విద్యాసంవత్సరంలో మొదటి స్థానం నిలిచింది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా ఎన్నో స్థానంలో ఉంటుందో అని విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. కాగా, జనవరి మాసం రావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్ మొదలైంది. వార్షిక పరీక్షలు మార్చి 14నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కఠిన పరీక్షలు ఎదుర్కొవాల్సిన పరి స్థితి నెలకొంది. 4,501 మంది విద్యార్థులు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,501 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయడానికి సిద్ధమవుతున్నారు. ఈమేరకు విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు సాయత్రం విద్యార్థులకు సబ్జెక్ట్‌ల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అల్పాహారం అమలు చేయడం లేదు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వంతో పాటు అటు విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కడుపునిండా ఆహారం, కంటినిండా నిద్రలేకపోతే పది ఫలితాల్లో ప్రథమ స్థానం ఎలా సాధ్యమవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది టెన్త్ ఫలితాల్లో జిల్లా నంబర్‌వన్ ఉపాధ్యాయులకు పరీక్షల ఫీవర్ మార్చి 14నుంచి ఎగ్జామ్స్ విద్యార్థులకు అల్పాహారం అందించడంలో నిర్లక్ష్యంప్రణాళిక ఉంటేనే సాధ్యం గతంలో డీఈఓ, కోఆర్డినేటర్లు, ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ ఐక్యంగా కష్టపడి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది. ప్రణాళిక సిద్ధం చేసుకొని చదువులో వెనుకబడిని విద్యార్థులను దత్తత తీసుకొని ప్రత్యేక కార్యాచరణతో ముందుగు సాగినం. పరీక్షలకు చాలా సమయం ఉంది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తే వారిలో మార్పు వస్తుంది. మళ్లీ మొదటిస్థానం సాధ్యమవుతుంది. –సంకా బద్రినారాయణ, రేవా జిల్లా అధ్యక్షుడుఉత్తీర్ణతశాతం పెంపునకు కృషివిద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం కన్నా ఈ విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నాం. –వి.రాజేశ్వర్, డీఈఓ -
అభ్యంతరాలు పరిష్కరిస్తాం
● మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ మహబూబాబాద్: ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై సమావేశం నిర్వహించారు. ఒక వార్డు ఓటర్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నారని, పోటీ చేసే అభ్యర్థి పట్టణమంతా ఓటర్ల కోసం తిరిగే విధంగా ఉందని, సవరణ చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కమిషనర్‌ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈసీఐ నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేస్తున్నామన్నారు. జాబితాపై వచ్చిన అభ్యంతరాలు అన్ని విధాలా పరిశీలించి ఎవరికి అన్యాయం జరగకుండా.. తుది జాబితా తయారు చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అన్ని విధాలా సహకరించాలన్నారు. ప్రతీ పార్టీ నుంచి ఇద్దరు నాయకులకు మాత్రమే అవకాశం కల్పించారు. సమావేశంలోటీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనపురం అంజయ్య, సురేష్, బీఆర్ఎస్ నుంచి మార్నేని వెంకన్న, సీపీఐ నుంచి అజయ్‌సారథిరెడ్డి, పెరుగు కుమార్, సీపీఎం నుంచి సూర్నపు సోమయ్య, బీజేపీ నుంచి శ్యాసుందర్ శర్మ, టీడీపీ నుంచి బొమ్మ వెంకటేశ్వర్లు, రాము పాల్గొన్నారు. -
నేటినుంచి విద్యుత్ ప్రజాబాట
● అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● సమస్యల గుర్తింపు, అప్పటికప్పుడు పరిష్కారం ● ప్రతి సెక్షన్లో వారానికి మూడు రోజులుహన్మకొండ : వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్న టీజీ ఎన్పీడీసీఎల్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి(మంగళవారం)నుంచి ప్రజాబాట ద్వారా వినియోగదారుల ముంగిటికి వెళ్లనుంది. పొలంబాట ద్వారా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు చేరుకుని నేరుగా రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ప్రతీ సోమవారం సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈ విధానాలు కొనసాగుతుండగానే కొత్తగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో.. ఆయా సెక్షన్ పరిధిలో ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో వినియోగదారులనుంచి సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తారు. గ్రామాల్లో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు, నగరాలు, పట్టణాల్లో కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. వీరి సమక్షంలో విద్యుత్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు తెలుసుకుంటారు. అప్పటికప్పుడు పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరిస్తారు. మిగతా వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరిస్తారు. సెక్షన్ స్థాయిల ఏఈల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎస్ఈ, డీఈ, ఏడీఈలు అందరూ ఒకేచోట పాల్గొనవద్దని ఆదేశాలున్నాయి. ఒక కార్యక్రమంలో ఎస్ఈ పాల్గొంటే మరో కార్యక్రమంలో డివిజన్ ఇంజనీర్, మరో కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పాల్గొంటారు. ఇలా సర్కిల్ పరిధిలోని ముగ్గురు ఉన్నతాధికారులు మూడు సెక్షన్లలో నిర్వహించే ప్రజా బాటలో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వీరితో పాటు ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు కూడా పాల్గొనే అవకాశముంది. నేటి (మంగళవారం)నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
అండగా ‘అమ్మ ఒడి’
● జిల్లాలో ఏడు అమ్మ ఒడి అంబులెన్స్‌ల సేవలు ● గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణానెహ్రూసెంటర్: గర్భిణులు సకాలంలో మెరుగైన వైద్యసేవలతో పాటు తగు జాగ్రత్తలు పాటిస్తేనే కాన్పు ప్రశాంతంగా జరుగుతుంది. అయితే గ్రా మీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు పట్టణాల్లో ఆస్పత్రులకు వచ్చేందుకు రవాణాపరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. ఇది గమనించిన ప్రభుత్వం.. గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు చేరవేర్చడం, బాలింతలను ఇంటికి తీసుకెళ్లేందుకు 102–అమ్మ ఒడి అంబులెన్స్‌లు ఉపయుక్తంగా మారాయి. ప్రైవేట్ వాహనాల ద్వారా వ్యయప్రయాసాలు పడకుండా అంబులెన్స్‌ల ద్వారా సురక్షిత ప్రయాణాలు సాగిస్తున్నారు. కాగా, జిల్లాలో ఏడు అమ్మ ఒడి వాహనాలు గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందిస్తున్నాయి. నెలనెలా.. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు, ప్రసవించిన తర్వాత బాలింతలను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి వైద్య పరీక్షలు పూర్తయ్యాక 102 అంబులెన్స్ ద్వారా సిబ్బంది చేరవేస్తున్నారు. నెలనెలా ఆస్పత్రికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలకు అన్ని వేళల్లో 102 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లాలో ఏడు అంబులెన్స్‌లు.. జిల్లాలో ప్రస్తుతం ఏడు 102అమ్మ ఒడి అంబులెన్స్‌లు గర్బిణులు, బాలింతలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు, తండాలు, గూడేలు అధికంగా ఉండడంతో మరికొన్ని అంబులెన్స్‌లను సమకూర్చడం ద్వారా ఇబ్బందులు తొలుగుతాయని ప్రజలు కోరుతున్నారు. ఇప్ప టి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, పల్లెలకు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఉచితంగా రవాణా సౌకర్యం గర్భిణులు, బాలింతలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, ప్రసవం కోసం వెళ్లేందుకు అమ్మ ఒడి అంబులెన్స్ ద్వారా రవాణా సౌకర్యం ఉంది. సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం, మెరుగైన వైద్యం అందుతుంది. ప్రతీ నెల ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా 102 సిబ్బంది చేరవేస్తారు. – షేక్ నజీరుద్దీన్, ప్రోగ్రాం మేనేజర్ నెల గర్భిణులు, బాలింతలు జూన్ (2025) 2,137 జూలై 2,120 ఆగస్టు 2,195 సెప్టెంబర్ 1,941 అక్టోబర్ 2,215 నవంబర్ 2,152 డిసెంబర్ 2,134 -
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదవుతున్న పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని గిరిజన సంక్షేమ శాఖ ఏసీఎంఓ రాములునాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఏసీఎంఓ రాములు నాయక్ పదో తరగతి పరీక్షలు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకొని, 60రోజుల పాటు విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులను సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు దత్తత తీసుకొని మెరుగుపర్చాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ కోటేశ్వరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్పీని కలిసిన ఎస్సైలు
మహబూబాబాద్ రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శబరీష్‌ను పదోన్నతి పొందిన ఎస్సైలు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఎస్సైలు షేక్.ఇమామ్, ఎల్.రవీందర్ సివిల్ ఎస్సైలుగా పదోన్నతి పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వారిని కేటాయించగా.. ఈమేరకు ఎస్పీ శబరీష్ అభినందించారు. రైతులకు సరిపడా యూరియా ఉంది డీఏఓ సరిత కురవి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు అఽధైర్యపడొద్దని డీఏఓ సరిత అన్నారు. సోమవారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవసరానికి అనుగుణంగా సకాలంలోయూరియా సరఫరా చేస్తామని తెలిపారు. అనవసరంగా యూరియాను నిల్వ చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సీరోలు ఏఓ చాయారాజ్ పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాలలో వసతులు కల్పించాలి నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు భవనం, వసతులు కల్పించాలని నర్సింగ్ విద్యార్థులు అన్నారు. ప్రభుత్వ కళాశాల ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. బిల్డింగ్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, నూతన బిల్డింగ్, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 240మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో సరిపడా తరగతి గదులు, ఇతర సౌకర్యాలు క ల్పించలేదన్నారు. అధికారులు, ప్రభుత్వం సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. శ్రేష్ట ప్రవేశ పరీక్షలో ఆల్ఇండియా ర్యాంక్ మహబూబాబాద్ అర్బన్: ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన పట్ల స్రవంతి ఆల్ ఇండియా 46వ ర్యాంక్ సాధించింది. పట్ల కృష్ణవేణి–రవి దంపతు కుమారై స్రవంతి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా ఆమె డిసెంబర్ 21న నిర్వహించిన శ్రేష్ట ప్రవేశ పరీక్ష రాయగా.. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. స్రవంతిని ఆమె తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, బంధుమిత్రులు అభింనదించారు. టీసీసీ పరీక్షల హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి మహబూబాబాద్ అర్బన్: టెక్నికల్ కోర్సు సర్టిఫికెట్ (టీసీసీ) పరీక్షల హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 10నుంచి 13వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో డ్రాయింగ్ లోయర్, జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో డ్రాయింగ్ హయ్యర్, ఫాతిమా హైస్కూల్లో టైలరింగ్ ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఆన్లైన్లో www.bse.telangana.gov.in అనే వెబ్సైట్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 9849761012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. -
సత్వరమే దరఖాస్తులు పరిష్కరించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ● ప్రజావాణిలో 72 వినతులు అందజేతమహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూ డా వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం సాధ్యం కానివి నివేదిక రూపంలో అందజేయాలన్నారు. 72 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● మానుకోట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన సుమలత తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని వినతి ఇచ్చారు. అలాగే మానుకోట పట్టణంలోని జగ్జీవన్‌రావు నగర్ కాలనీకి చెందిన కల్యాణి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతిలో కోరారు. ● సీరోలు మండలం కాంపల్లి గ్రామానికి చెందిన బి.ప్రవీణ్ పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో తనను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పట్టాలు ఇప్పించాలని వినతి అందజేశాడు. ● గూడూరు మండలం నాయక్‌పల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు స్రవంతి తనకు దివ్యాంగ పింఛన్ రావడం లేదని, మంజూరు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. -
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్..
బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట వద్ద జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన బోదాసు శ్రీకాంత్ (30) వ్యక్తి గత పనుల నిమిత్తం బైక్‌పై సిద్దిపేట జిల్లా చేర్యాలకు వెళ్లాడు. తిరిగి ఇంటికొస్తున్న క్రమంలో చుంచనకోట సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాంత్ ఎగిరి రోడ్డు పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు. బావి పక్కనే బైక్ ఉండడంతో గమనించిన చుట్టు పక్కల వారి సమాచారం మేరకు పోలీసులకు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చేర్యాల ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య రాణి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో పడమటికేశ్వాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎగిరి పక్కనే ఉన్న బావిలో పడి యువకుడి మృతి పడమటికేశ్వాపూర్‌లో విషాదం -
11 నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15 వరకు 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖోపోటీలు జరగనున్నాయి. ఈమేరకు కాజీపేట రైల్వే స్టేడియంలో ఏర్పాట్లను ఆదివారం తెలంగాణ స్టేట్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించి మాట్లాడారు. ఖోఖో పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది వరకు క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ, రైల్వే స్టేడియం ఇన్చార్జ్ దేవులపల్లి రాఘవేందర్, నిర్వాహకులు పాల్గొన్నారు. కేయూ క్రికెట్ విజేత వరంగల్ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించగా.. వరంగల్ జోన్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో వరంగల్ – ఖమ్మం జోన్ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. జట్టులో ఉదయ్ 32, శిశిరిక్ 16 పరుగులు చేశారు. వరంగల్ బౌలర్లలో నితిన్, దివిన్, ఇబ్రహీం, సిద్ధార్థ ఒక్కో వికెట్ పడగొట్టగా ప్రద్యుమ్నా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వరంగల్ జోన్ జట్టు తొమ్మిది ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించింది. బ్యాట్స్‌మన్ దివిన్ 77 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. తర్వాత బ్యాట్స్‌మన్ నితిన్ 28 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.రవికుమార్, డాక్టర్ బి.వెంకన్న హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో పీఈడీలు డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, కుమార్, అస్లాం, సందీప్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తుల విక్రయాలు ● మూడు దుకాణాల్లో రూ. 15 లక్షలకు పైగా వస్త్రాల సీజ్రామన్నపేట: నగరంలోని బట్టలబజారులో బ్రాండెడ్ పేరుతో నకిలీ దుస్తులు విక్రయిస్తున్న మూడు షాపుల్లో ఢిల్లీ, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 15 లక్షలకు పైగా విలువైన నకిలీ వస్త్రాలను సీజ్ చేశారు. ఢిల్లీకి చెందిన లెగ్గిన్ తయారుచేసే ఓ ప్రముఖ కంపెనీ వస్త్రాలను ఆ కంపెనీకి చెందిన ఒక అక్షరాన్ని కాపీ చేసి నకిలీ వస్త్రాలను విక్రయిస్తుండడంతో కంపెనీ ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్న షాపులపై దాడులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లో కూడా ఇలాంటి విక్రయాలు జరుగుతున్న విషయం గుర్తించి పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సహకారంతో మట్టెవాడ పోలీసులతో కలిసి శనివారం రాత్రి బట్టలబజారులో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రాజ్యలక్ష్మి, మహాభగవాన్, మంగళ్‌దీప్ ట్రేడర్స్ల్లో సుమారు రూ. 15 లక్షలకుపైగా విలువైన నకిలీ లెగ్గిన్ విక్రయాలు గుర్తించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతో వచ్చిన అడ్వకేట్ల బృంద సభ్యులు ఆ షాపుల్లో నకిలీ వస్త్రాలను సీజ్ చేయడంతోపాటు ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. -
చనిపోయి ఐదుగురికి పునర్జన్మ
కాజీపేట: తాను మరణిస్తూ.. ఐదుగురికి అవయవ దానం చేసి పునర్జన్మనిచ్చాడు మర్రి రమేశ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామానికి చెందిన మర్రి రమేశ్ (43) అనే రైల్వే ఉద్యోగి గత నెల 22న విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడగా బ్రెయిన్ డెడ్ అయ్యింది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యుల సూచన మేరకు భార్య రత్నకుమారితోపాటు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవదానం చేశారు. మృతుడి గుండె, రెండు కిడ్నీలు, రెండు నేత్రాలను దానం చేయడంతో ఐదుగురికి పునర్జన్మనిచ్చినట్లయ్యింది. ఆదివారం ప్రశాంత్‌నగర్ కాలనీలో మర్రి రమేశ్ సంస్మరణ సభ నిర్వహించారు. తెలంగాణ నేత్ర అవయవదాన శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పెండ్లి ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతిలోగా పనులు కావాలి
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగలోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో జాతర అభివృద్ధి పనుల పురోగతిపై ఆదివారం మేడారంలో సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల ఆలస్యంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రాకారం పీటీ బీం ఏర్పాటు, గద్దెల రాతి స్తంభాలపై బ్రాకెట్లను త్వరగా ఏర్పాటు చేయాలని, సివిల్ పనులు, క్యూలైన్ షెడ్ల నిర్మాణ పనులు జనవరి 12వ తేదీ వరకు పూర్తి చేయాలని, రహదారులకు ఇరువైపులా సైడ్‌బర్మ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 31 వరకు విద్యుత్ కాంతుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జాతర పరిసరాల్లో జోన్లు, సెక్టార్ల వారీగా సిబ్బందిని నియమించుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట వేసి, కనీవిని ఎరుగుని రీతిలో జాతర నిర్వహించాలని సూచించారు. పనులను పరిశీలిస్తూ ఆదేశాలు.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ధనసరి సీతక్క.. అధికారులతో కలిసి మేడారంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ల్యాండ్ స్కిప్పింగ్, ప్రధాన ఆర్చ్, హరిత హోటల్ సుందరీకరణ, రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. జంపన్నవాగులో లెవలింగ్ పనులను పరిశీలించి నీటినిల్వ లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారంలో ఆదివాసీ మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంబు చికెన్ క్యాంటీన్ ప్రారంభించారు. చికెన్ రుచి చూసి మహిళలను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఎస్పీలు శబరీష్, సిరిశెట్టి సంకీర్త్, ఏఎస్పీ మానన్ భట్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, మార్కెట్ చైర్ పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.కనీవిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహణ ఆదివాసీ సంప్రదాయానికి పెద్దపీట సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరైన మంత్రి సీతక్క, ఎంపీ బలరాంనాయక్, అధికారులు -
భార్య కాపురానికి రావడం లేదని..
మరిపెడ రూరల్: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం..మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన కలంచర్ల నవీన్(25)కు సూర్యాపేట జిల్లా పాలర్లపాడు గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కొంత కాలంగా కుటుంబంలో తగదాలు చోటు చేసుకోడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. మూడు రోజుల క్రితం అత్తారింటికి వెళ్లిన నవీన్.. భార్యను కాపురానికి పంపించాలని వేడుకోగా ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్.. ఇంటికొచ్చి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త.. చికిత్స పొందుతూ మృతి తాళ్లఊకల్ గ్రామంలో ఘటన -
గొర్రెల కాపరులపై హైనా దాడి?
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్ గ్రా మంలో హైనా దాడిలో పలువురు గొ ర్రెల కాపరులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బింగి అయిలయ్య, చిమ్మ సాయిలు, ఒగ్గు కొండయ్య, పైస బాల మల్లయ్య.. రోజూ మాదిరిగానే జీవాలను ఉదయం మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో కిట్టమ్మ కుంట ఏనె దగ్గర హైనాను పోలిన జంతువు ఒకే సారి దాడి చేసింది. వరుసగా వస్తున్న నలుగురుపై గంట వ్యవధిలో దాడి చేయగా వారికి పలు చోట్ల గాయాలయ్యాయి. క్షతగాత్రులను బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి పంపించారు. కాగా, ఆ జంతువు.. జీవాలపై కూడా దాడి చేసిందని గొర్రెల కాపరులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకర జంతువుల బెడద నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రామచంద్రాపూర్‌లో ఘటన భయాందోళనలో గ్రామస్తులు -
ఇప్పుడే ఇలా.. మహా జాతరకెలా?
మేడారం తల్లుల దర్శనం కోసం వస్తున్న భక్తులుములుగు రూరల్/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహా జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. భక్తుల తిరుగు ప్రయాణంలో మల్లంపల్లి జాతీయ రహదారిపై ఉన్న కెనాల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. జాతర సమయానికి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తేనే భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి. కాగా, ఇప్పుడే ట్రాఫిక్ ఇలా స్తంభించిపోతే.. మహా జాతరనాటికి పరిస్థితి ఎలా ఉంటుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసులు మేడారం పరిసరాల్లో వాహనాలను దారి మళ్లించడంతో కొత్తగా మేడారానికి వచ్చిన భక్తులు దారి తెలియక ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రం నుంచి మంత్రుల కవరేజ్ కోసం వచ్చిన మీడియా బృందాన్ని కూడా పోలీసులు నార్లాపూర్ చెక్ పోస్టు నుంచి అనుమతించకుండా కాల్వపల్లి మీదుగా మేడారానికి పంపించారు. దర్శనానికి ఒకే వరుసలో క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ఓ భక్తుడు అక్కడే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని యత్నించగా అతడిని పోలీసులు లాక్కెళ్లారు. -
కొడుకు పుట్టాడని..!
గీసుకొండ: కొడుకు పుట్టాడని ఓ కుటుంబం కాషాయ జెండాలను పట్టుకుని కాలినడకన వెళ్తోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం వరంగల్–నర్సంపేట రోడ్డులో నర్సంపేట వైపు వెళ్తున్న మహారాష్ట్రవాసులు ఆదివారం మధ్యాహ్నం ‘సాక్షి’కి తారసపడ్డారు. వారిని చూసి పలకరించగా తమ కుటుంబంలో సంతానం లేక దిగులు చెంది భద్రాద్రి రాముడికి మొక్కుకున్నామని, ఆ దేవుడు కరుణించడంతో కుమారుడు జన్మించారని పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాల కుమారుడితో రాముల వారిని దర్శించి కృతజ్ఞత తెలుపడానికి కాలినడకన వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే చాలాదూరం నడిచి వచ్చామని, మరో 150 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉందని తెలిపారు. మార్గమధ్యలో పలువురు తోచిన రీతిలో ప్రయాణ ఖర్చులకు నగదు సాయం చేశారు. మహారాష్ట్ర నుంచి భద్రాద్రి రాముడి సన్నిధికి కాలినడకన వెళ్తున్న కుటుంబం -
సైకిళ్లపై వెంకన్న దర్శనానికి..
చిల్పూరు: హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు సైకిళ్లపై వచ్చి ఆదివారం చిల్పూరులోని బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రవీందర్‌శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వారితో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అధికారులు జానకీరాం, కిశోర్, శ్రీనివాస్‌రెడ్డి, హరి, దీపక్, మణికంఠ, అశోక్, సురేశ్ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరిపెడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హాన్‌పురం గ్రామ శివారు సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండం బచ్చోడు గ్రామ శివారు బచ్చోడు తండాకు చెందిన ధరావత్ రవీందర్ (30) పని నిమిత్తం తన బైక్‌పై మరిపెడ మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బుర్హాన్‌పురం గ్రామ శివారు మలుపు వద్ద బైక్ అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నేటినుంచి పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలువిద్యారణ్యపురి: పీడీఎస్‌యూ రాష్ట్ర 23వ మహాసభలు ఈనెల 5, 6, 7 తేదీల్లో నిర్విహించనున్నారు. ఈనెల 5న ఉదయం 11 గంటలకు ఏకశిల పార్కు నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభ ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, పీడీఎస్‌యూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్, సాధినేని వెంకటేశ్వర్రావు, ఎం శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ నాయకురాలు సంధ్య, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు పి.మహేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాచర్ల బాలరాజు, ఐఎఫ్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్ ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్ర మహాసభల్లో భాగంగా ఈనెల 6,7 తేదీల్లో వరంగల్ అబ్నూస్ ఫంక్షన్ హాల్లో విద్యార్థి ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ● బుర్హాన్‌పురం శివారు హైవేపై ఘటన ● మృతుడు ఖమ్మం జిల్లా వాసి -
పుస్తకంలోనే అమూల్యమైన అంశాలు
హన్మకొండ కల్చరల్: పుస్తకం చదవడం వల్ల అమూల్యమైన అంశాలను తెలుసుకోవచ్చని, పుస్తకం భక్తి కావ్యాలు, నైతిక విలువలు నేర్పుతుందని కేయూ విశ్రాంతాచార్యుడు కొక్కొండ విజయబాబ అన్నారు. కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ భద్రకాళిరోడ్లోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మ య్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకం’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. కొక్కొండ విజయబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం కమిటీ సలహాదారు కొక్కొండ శంకరయ్య పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీడికంటి శ్రీనివాసమూర్తి పుస్తకసమీక్ష చేయగా అక్కెర కరుణాసాగర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మారెడోజు సదానందాచారి, ఎర్రోజు లక్ష్మణాచారి, డా క్ట ర్ పల్లేరు వీరస్వామి, చేపూరి శ్రీరాం, వేదిక సభ్యులు వెలుగు ప్రభాకర్, పాము భాస్కర్, సిద్దెంకి బాబు, బొల్లోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కేయూ విశ్రాంతాచార్యుడు విజయబాబు -
సౌకర్యాలు లేవు..
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సౌకర్యాలు లేక చదువుకోలేపోతున్నాం. విద్యార్థులకు అవసరమైన బిల్డింగ్, ల్యాబ్, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం, అధికారులు సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – జ్ఞానత్రిష, నర్సింగ్ విద్యార్థి అధికారుల దృష్టికి తీసుకెళ్లా..నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్‌లకు చెందిన 240 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సౌకర్యాలు, బిల్డింగ్, ల్యాబ్, తరగతి గదులకు సంబంధించిన విషయాలను అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లా. అధికారులు చెప్పిన బిల్డింగ్ ఖాళీ చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. – లీలా, కళాశాల ప్రిన్సిపాల్ -
రుచికరమైన భోజనాలు వండాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనాలు వండాలని డీఈఓ వి.రాజేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఆదివారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల్లో మధ్యాహ్నం వంటలు వండే చోట పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తాజా కూరగాయలతో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ఎక్కడైన లోపాల ఉంటే ఆ పాఠశాల కార్మికులపై చర్యలు తీసుకుంటా మన్నారు. వంటల పోటీల్లో కురవి మండలంలోని నేరడ మోడల్‌స్కూల్ ప్రథమ బహుమతి, కేసముద్రం జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం, మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాల తృతీయస్థానం సాధించిందన్నారు. వారికి బహుమతులు అందజేశారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్ఎం సిరినాయక్, మధ్యాహ్న భోజన జిల్లా ఇన్చార్జ్ గణేష్, న్యూట్రిషన్ నిపుణులు శ్రీనివాస్, దీప్తీ, రవీందర్ నాయక్ పాల్గొన్నారు. -
లూయిస్ బ్రెయిలీ జయంతి
మహబూబాబాద్: మహిళా శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. కొంత మంది అంధులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సబిత, జూనియర్ అసిస్టెంట్ హరీశ్, అంధులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శిగా భాస్కర్ గార్ల: గార్లకు చెందిన పాలడుగు భాస్కర్ సెంట్రల్ ఇండియా ట్రేడ్ యూని యన్ (సీఐటీయూ) జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నంలో నాలుగు రోజులుగా కొనసాగుతున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల్లో ప్రస్తుతం సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న భాస్కర్‌ను ఆదివారం జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మికుల వేతనాల పెంపుకోసం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరాటాల్లో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యంనర్సింహులపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున జిల్లాలోని నర్సింహులపేట మండల పరిధి జయపురం గ్రామానికి చెందిన క్రిడాకారిణి చందు లావణ్య ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించడంపై గ్రామస్తులు, వంగాల చారిటబుల్ ట్రస్ట్, క్రీడాకారులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంను కలిసిన సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను శనివారం రాత్రి హైదరాబాద్‌లో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, మధుసూదన్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి శుభా కాంక్షలు తెలిపారు. -
చకచకా ఏర్పాట్లు
‘పుర‘ పోరుకు అధికార యంత్రాంగం కసరత్తుమున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వేగం పెంచింది. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై రోజూ జిల్లా ఉన్నతాధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆరా తీస్తోంది. కాగా, షెడ్యూల్ ప్రకారం ఓటరు జాబితా తయారీ, ప్రచురణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం మున్సిపాలిటీ ముసాయిదాపై రాజకీయ పార్టీల నాయకులతో ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని ఎన్నికల నుంచి మినహాయించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏప్రిల్ తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు.నేడు రాజకీయ పార్టీలతో భేటీ... ‘గ్రేటర్’ ఎన్నికలు ఏప్రిల్ తర్వాతే?సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించింది. ఈనెల 10న పోలింగ్ కేంద్రాల వారీగా సవరించిన ఓటరు జాబితాను వెల్లడించేందుకు అధికార యంత్రాంగం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్న చర్చ శనివారం నుంచి జోరందుకుంది. అందుకు తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల లెక్కింపు.. కేంద్రాల గుర్తింపు గత నెల 30న ముసాయిదా జాబితా ప్రకటించగా.. ఈ నెల 10న తుది జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లోని వార్డుల్లో పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఓటరు జాబితా తయారీ, ప్రచురణ నోటిఫికేషన్లో భాగంగా మున్సిపాలిటీల వారీగా 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా, ఎస్సీ, ఎస్టీల జనాభా వివరాలు కూడా ఇచ్చారు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణనచేసి.. వీటి ఆధారంగానే రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంటుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న మహబూబాబాద్, నర్సంపేట, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ, జనగామ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి మున్సిపాలిటీలతోపాటు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలకు కూడా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. వసతులున్న చోటే పోలింగ్ కేంద్రాలు.. మౌలిక వసతులు ఉన్న వాటినే పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయనున్నారు. గత ఆగస్టులో కేంద్రాలను గుర్తించగా, తిరిగి అవి ఆయా వార్డుల పరిధిలోకి వస్తాయా రావా అనేది అధికారులు మరోసారి పరిశీలించి ఎంపిక చేయనున్నారు. వార్డుల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు కేంద్రాల ఏర్పాటుపైనే అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల 10న వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటరు ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. కేంద్రాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు 11న లేదా 20న నోటిఫికేషన్..? అధికారులకు సంకేతాలు పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు ముసాయిదా జాబితాఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయా మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య, 2011 లెక్కల ప్రకారం జనాభామున్సిపాలిటీ వార్డుల మొత్తం ఎస్టీలు ఎస్సీలు సంఖ్య జనాభా పరకాల 22 34,318 472 8,262 నర్సంపేట 30 51,086 4,397 7,110 వర్ధన్నపేట 12 13,732 3,980 2,470 జనగామ 30 52,408 1,694 8,335 స్టేషన్‌ఘన్‌పూర్ 18 23,483 962 6,663 భూపాలపల్లి 30 57,138 4,464 11,966 మహబూబాబాద్ 36 68,889 14,220 9,709 డోర్నకల్ 15 14,425 3,536 2,866 కేసముద్రం 16 18,548 3,754 2,418 మరిపెడ 15 17,685 7,635 3,062 తొర్రూరు 16 19,100 2,093 3,985 ములుగు 20 16,533 1,844 2,470 మొత్తం 260 3,87,345 49,051 69,316 -
బిల్డింగ్ సరిపోవడం లేదు..
నర్సింగ్ కళాశాలకు సంబంధించిన బిల్డింగ్ సరిపోవడం లేదు. ల్యాబ్, తరగతులకు ఇబ్బంది అవుతుంది. రెండు గదులు మాత్రమే ఉన్నాయి. నాల్గో బ్యాచ్ కూడా కళాశాలలో చేరడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ బిల్డింగ్, ఇతర సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె.డింపుల్, నర్సింగ్ విద్యార్థి బయట హాస్టల్లో ఉంటున్నాం..మాకు సరిపడా తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్ లేదు. బయట హాస్టల్లో ఉంటున్నాం. కిరాయి డబ్బులు మేమే చెల్లించుకుంటున్నాం. పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. సౌకర్యాలు లేకపోతే ఎలా చదువుకోవాలి. అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా సౌకర్యాలు కల్పించాలి. – శ్రీవల్లి, నర్సింగ్ విద్యార్థి -
నర్సింగ్ విద్యార్థుల గోస..
నెహ్రూసెంటర్: ప్రభుత్వ నర్సింగ్‌కళాశాల విద్యార్థులు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. 2022లో ప్రారంభమైన నర్సింగ్ కళాశాలలో నాలుగు బ్యాచ్‌లకు చెందిన 240 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, సొంత భవనం లేకపోవడంతో ల్యాబ్, పరీక్షలు, చదువుల కోసం ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ బిల్డింగ్ సరిపడకపోవడంతో బయట కిరాయి బిల్డింగ్‌లో ఉంటూ కిరాయి విద్యార్థులే చెల్లిస్తున్నారు. అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బిల్డింగ్, సౌకర్యాల విషయమై ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 240 మంది విద్యార్థులు.. రెండు గదులు కళాశాలలో 240 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ల్యాబ్, లైబ్రరీ వంటి సౌకర్యాలు లేవని తెలుస్తోంది. రెండు గదులతో కళాశాలను నడపాల్సి వస్తుంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో బిల్డింగ్ కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేటా యించలేదని విద్యార్థులు తెలుపుతున్నారు. కింద కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థుల ఆందోళన.. తాము చదువుకునేందుకు సరిపడా బిల్డింగ్, సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని కళాశాల విద్యార్థులు శనివారం కళాశాల ఆవరణ, కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్, అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించడం లేదని.. పరీక్షలు దగ్గరపడుతున్నా ల్యాబ్ సౌకర్యం వంటివి లేవని, పరీక్షలు ఎలా రాయాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. నర్సింగ్ కళాశాలకు కేటాయించిన బిల్డింగ్‌ను మెడిసిన్ విద్యార్థులకు అప్పగించారని, తమకు కూడా బిల్డింగ్, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కరమయ్యేంత వరకు నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. సరిపోని భవనం, గదులు హాస్టల్ బిల్డింగ్ లేక కిరాయికి ఉంటున్న విద్యార్థులు ల్యాబ్, పరీక్షలకు తప్పని ఇబ్బందులు భవనం కేటాయించాలని ఆందోళన -
గ్రామాల్లోనే యూరియా పంపిణీ
మరిపెడ రూరల్: ఇక నుంచి గ్రామాల్లోనే కౌంటర్ల ఏర్పాటు చేసిన దశల వారీగా రైతులకు యూరియా పంపిణీ చేయనున్నట్లు డీఏఓ బి. సరిత అన్నారు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలో పలు సెంటర్లలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఏఓ వీరసింగ్తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ రైతులకు సరిపడా యూరియా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పంపిణీ చేస్తున్న యూరి యాను రైతులు దశల వారీగా ఉపయోంచుకోవా లని ఆమె సూచించారు. అదేవిధంగా నానో యూ రియా వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పి ంచారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఆందోళన అవసరం లేదు.. నర్సింహులపేట: యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతీ రైతుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ బి.సరిత అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో రైతులకు యూరియా కూపన్ల పంపిణీ, యూరియా పంపిణీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. యాసంగి సీజన్లో ప్రతీ రైతుకు సరిపడా యూరియా ఉందన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన మేడారంభక్తజనంతో మేడారం పరిసరాలు కిక్కిరిశాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. తల్లులకు ఎదుర్కోళ్లు, యాటపోతులు, ఎత్తు బంగారం, పసుపు కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ సమ్మక్క గద్దె వద్ద భక్తులు..మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్ద బారులుదీరిన భక్తులుకిక్కిరిసిన జనంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం -
ఉత్సాహంగా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడి యంలో వెటరన్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దయాకర్ స్మారక రాష్ట్ర స్థాయి సీనియర్స్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు శని వారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీలను వీనస్ జువెల్లరీ అధి నేత రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్లో నిత్య సాధనతో ఆరోగ్యంగా ఉంటారనడానికి సీనియర్ క్రీడాకారులే నిదర్శనమన్నారు. వెటరన్ క్రీడాకారులను యువత ఆద ర్శంగా తీసుకోవాలన్నారు. వెటరన్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. హనుమకొండ డీవైఎస్ఓ అశోక్‌కుమార్, వెటరన్ సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉమ్మడి వరంగల్ బాల్బ్యాడ్మింట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి. వీరన్న, కార్పొరేటర్ గుండేటి నరేందర్ పాల్గొన్నారు. -
మహిళా విద్యతోనే సాఽధికారత
కేయూ క్యాంపస్: నాటి పరిస్థితుల్లో మహిళా విద్యతోనే సాధికారత సాధ్యమని సావిత్రిబాయి పూలే గుర్తించారని, సమాజ నిర్మాణంలో మహిళల కృషి అభినందనీయమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం కేయూలోని సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ అండ్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ బి. దీపాజ్యోతి అధ్యక్షతన సెనేట్ హాల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ మహిళా ఉద్యోగులు తమ సంపూర్ణ శక్తి, సామర్థ్యాలను విశ్వవిద్యాలయం అభివృద్ధికి వినియోగిస్తున్నారని కొనియాడారు. సావిత్రిబాయిపూలే గొప్ప సామాజిక సంస్కర్త అన్నారు. అనంతరం వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు మానసికంగా, భావోద్వేగపరంగా బలమైనవారన్నారు. నేటి తరం పురుషులు మహిళలకు సహకరిస్తుండడం అభినందనీయమన్నారు. మైత్రీ, గార్లి వంటి మహనీయ మహిళలను అందించిన దేశం భారతదేశమన్నారు. అదే కోవకు చెందిన మహిళా మూర్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. వివక్ష, అణిచివేత ఉన్నకాలంలో మహిళా విద్యతో చైతన్య నింపిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయిపూలే అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ కె. మమత, బీసీ సెల్ డైరెక్టర్ బొడిగ సతీష్, కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ, బి.సుకుమారి మాట్లాడారు. వర్సిటీ అభివృద్ధిలో మహిళాఉద్యోగులు కీలకం కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
హుండీల ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు శనివారం 60 హుండీలు ఏర్పాటు చేశారు. ఈఓ వీరస్వామి సమక్షంలో సమ్మక్క, సారలమ్మ ఒక్కొ గద్దైపె 25, గోవిందరాజు, పగిడిద్దరాజు ఒక్కొ గద్దైపె 5 హుండీలు ఏర్పాటు చేశారు. పూజారుల సమక్షంలో హుండీల తాళాలకు సీల్ వేశారు. భక్తులు కానుకలు వేసేందుకు హుండీలు ఏర్పాటు చేశామని ఈఓ వీరస్వామి తెలిపారు. తహసీల్దార్ సురేశ్‌బాబు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు, పూజారులు పాల్గొన్నారు. -
సులువుగా.. వేగంగా
హన్మకొండ : ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు నడపనున్న ఆర్టీసీ బస్‌లకు డీజిల్ కోసం ప్రైవేట్ బంకులను గుర్తించారు. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో జరగనున్న మహా జాతరకు టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 3,860 బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ బస్సులన్నింటికీ ఆర్టీసీ డిపోల్లో డీజిల్ నింపుకోవడం ఇబ్బందికరం. డిపోల్లో డీజిల్ నింపుకునేందుకు వరుస కట్ట డం ద్వారా బస్సులు ఆలస్యమై భక్తుల చేరవేతకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో భక్తులను వెనువెంటనే చేరవేసేందుకు బస్సులు అందుబాటులో ఉండాల్సిన అవసరముంది. ఈ క్రమంలో బస్సుల్లో సులువుగా డీజిల్ నింపుకునేందుకు ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించారు. రూట్ల వారీగా ఏడు ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించి వాటిలో డీజిల్ నింపుకునేలా ఆయా స్టేషన్ల యజమానులతో అవగాహనకు వచ్చారు. తద్వారా డిపోలలో ఉండే డీజిల్ బంకులపై భారం పడదు. బస్సులు వెనువెంటనే బయలుదేరే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే మేడారం రూట్లోని ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లలో ఆర్టీసీ బస్సులు డీజిల్ పోసుకునేలా కార్యాచరణ రూపొందించారు. ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లు ఇవే.. చెల్పూరులోని సునీత ఫిల్లింగ్ స్టేషన్, మల్లంపల్లిలోని హరికృష్ణ ఫిల్లింగ్ స్టేషన్, సూర్యచంద్ర ఫిల్లింగ్ స్టేషన్, భూపాలపల్లిలోని మణికంఠ ఫిల్లింగ్ స్టేషన్, జవహర్ నగర్‌లోని శ్రీ శ్రీనివాస సాయి ఫిల్లింగ్ స్టేషన్, చిన్నబోయినపల్లిలోని శ్రీ పాండు నిర్మల ఫిల్లింగ్ స్టేషన్, గోవిందరావు పేటలోని శారద ఫిల్లింగ్ స్టేషన్ యజమానులతో ఆర్టీసీ అధికారులు అవగాహన కుదుర్చుకున్నారు. జాతరలో ఆర్టీసీ బస్‌లకు ప్రైవేట్ బంకుల్లో డీజిల్ ఆయా యజమానులతో అధికారుల ఒప్పందం ఈ అవగాహనతో భక్తులను వెంటనే చేరవేయడానికి అవకాశం రూట్ల వారీగా ఏడు ఫిల్లింగ్ స్టేషన్ల గుర్తింపు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలోనే జాతరకు నడిచే బస్సులకు ఇంధనం కోసం ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లను గుర్తించాం. ఆర్టీసీ డిపోల్లో అన్ని బస్సులకు ఇంధనం నింపడం సాధ్యం కాదు. ఈ క్రమంలో బస్సులు నిలిచిపోకుండా ప్రైవేట్ ఫిల్లింగ్ స్టేషన్లలో డీజిల్ పోసుకునేలా ఏర్పాట్లు చేశాం. –దర్శనం విజయ భాను , ఆర్టీసీ ఆర్ఎం, వరంగల్ -
అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ కల్చరల్: అర్చక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు శనివారం హనుమకొండ హరిత హోటల్‌కు చేరిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎస్. హరీశ్, ఆగమ సలహాదారు గోవింద హరిని గంగు ఉపేంద్రశర్మ కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జీఓ 121 రద్దుతో సుమారు వెయ్యి మంది తాత్కాలిక దినసరి అర్చక ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు పొందుతున్న అర్చకులకు మూడు నెలల జీతాలు రాలేదని తెలుపగా.. డైరెక్టర్ హరీశ్ స్పందించి వేతనాలు వెంటనే అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హామీ ఇచ్చినట్లు ఉపేంద్రశర్మ తెలిపారు. రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీ శర్మ, ఇతర అర్చక సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ -
ఆకట్టుకున్న కథానాటిక పోటీలు
హన్మకొండ అర్బన్ : వరంగల్‌లో అజో విభో కందాళం, సహృదయ సాహిత్య–సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న 33వ సాహితీ–సాంస్కృతిక సదస్సు, కథానాటిక పోటీలు శని వారం మూడో రోజూ కొనసాగాయి. కార్యక్రమాల్లో భాగంగా సాహితీవేత్త విహారి అధ్యక్షతన హనుమ కొండలోని శ్రీహర్ష కన్వెన్షన్‌లో ఉదయం రామాచంద్రమౌళి కృషి సమాలోచన సదస్సు, సాయంత్రం హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నాటిక పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా రామాచంద్రమౌళి కథల్లోని విభిన్నత, కవిత్వం, తదితర అంశాలపై జగన్నాథ శర్మ, శివరామప్రసాద్, విజయకుమార్, లకీష్మ్కాంతారావు, రమాదేవి, సంతోష్‌కుమార్, అనిల్ ప్రసాద్ తదితర వక్తలు విశ్లేషించారు. కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కథానాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముందుగా శార్వాణి గిరిజన సాంస్కృతిక కళాక్షేత్రం శ్రీకాకుళం బృందం ప్రదర్శించిన ‘మాయాజాలం’ నాటిక తుపానుతో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను కళ్లకు కట్టారు. ఈ సందర్భంగా విశిష్ట అతిథి, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ అనుమాండ్ల భూమయ్య, ఆత్మీయ అతిథి అత్తలూరి సత్యనారాయణ, అంపశయ్య నవీన్ మాట్లాడుతూ సాహిత్యం, నాటకాలను సమన్వయం చేస్తూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న అజో విభో, సహృదయ సంస్థల సేవలను ప్రశంసించారు. కాగా, స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, ఉదయ్ భాగవతుల దర్శకత్వంలో ప్రదర్శించిన ‘శ్రీ మాత్రే నమః’ నాటిక కుటుంబ నిర్వహణలో మహిళ కష్టాలను ఆవిష్కరించింది. చివరిగా శ్రీ రమణ కళానిలయం గుంటూరు నాగేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మాతృత్వం’ నాటిక తల్లి ఆవేదనను అద్భుతంగా చూపించారు. సాహిత్య సంస్కృతి భావి తరాలకు తెలియాలి.. హన్మకొండ కల్చరల్: సాహిత్య సంస్కృతి భావితరాలకు తెలియాలని అజో విభో కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. అజో విభో కందాళం ఫౌండేషన్, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ వరంగల్ శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న సాహిత్య సాంస్కృతిక సదస్సులో భాగంగా శనివారం వెలువోలు నాగరాజ్యలక్ష్మి రచించిన అప్పాజ్యోసుల సత్యనారాయణ విరచిత పంచవటి పద్యకృతి పుస్తకావిష్కరణ, వరంగల్‌కు చెందిన కవి రామా చంద్రమౌళి కృషి సమాలోచన అంశంపై సదస్సు జరగగా సత్యనారాయణ మాట్లాడారు. -
ఒకే ఇంటి నంబర్‌పై 79 ఓట్లు
మహబూబాబాద్: ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపాలిటీ అధికారులు ఈనెల 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా ప్రదర్శించారు. కాగా 17వ వార్డులో ఇంటి నంబర్ 4–45పై 79 ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పొందుపరిచారని ఆ వార్డుకు చెందిన వివిధ పార్టీల నాయకులు సప్పిడి రంజిత్, యాకుబ్, శ్రీను తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ ఆ జాబితాలో ఇచ్చిన ఇంటినంబర్ ఆ వార్డు పరిధిలోనే లేదని అన్నారు. ఆ ఇంటి నంబర్‌పై ఇచ్చిన ఓటర్లలో కేవలం పది మంది మాత్రమే ఆ వార్డులో ఉన్నారని, మిగితా వారు లేరని తెలిపారు. జాబితాను సవరించాలని కోరారు. -
ప్రమాదాల నివారణకు కీలక అడుగు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర సందర్భంగా భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా విద్యుత్ శాఖ అధికారుల కీలక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మేడారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అటవీశాఖ బీట్ కార్యాలయం నుంచి తాడ్వాయి వెళ్లే దారిలో గట్టమ్మ వరకు మూడు కిలోమీటర్ల మేర 33/11 కేవీ విద్యుత్ లైన్‌కు ఏర్పాటు చేస్తున్న కవర్ కండక్టర్ల పనులు కొనసాగుతున్నాయి. జనసాంద్రత అధికంగా ఉండే ఈ ప్రాంతంలో సాధారణ కండక్టర్లకు బదులు కవర్ కండక్టర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కవర్ కండక్టర్ల ఏర్పాటు వల్ల చెట్లు విరిగిపడినా, కొమ్మలు తాగినా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ట్రిప్పింగ్ లాంటి సమస్యలు తగ్గుతాయని వివరించారు. ప్రత్యేకంగా మేడారం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు రాకపోకలు సాగించే దృష్ట్యా ఈ ఏర్పాట్లు ఎంతో అవసరమన్నారు. వర్షాకాలంలోనూ విద్యుత్ అంతరాయం లేకుండా కవర్ కండక్టర్ ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని తెలిపారు. 33/11 కేవీ విద్యుత్ లైన్‌కు కవర్ కండక్టర్ల ఏర్పాటు -
ఏజెన్సీ భూములపై అసెంబ్లీలో చర్చ
● ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ● అటవీ శాఖ పనులను అడ్డుకున్న గ్రామస్తులుకొత్తగూడ: రెవెన్యూ భూములను అటవీ శాఖకు అక్రమంగా బదిలీ చేసిన విషయంపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్సీ రవీందర్రావు చర్చించడంతో మండలంలో మళ్లీ చర్చమొదలైంది. మండలంలోని పొగుళ్లపల్లి గ్రామాన్ని ఆనుకుని గ్రామ కంఠం(రెవె న్యూ) భూమి 70 ఎకరాలు ఉంది. ఈభూమి గ్రామ అవసరాల కోసం ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. మండలానికి ఏకలవ్య గురుకుల నిర్మించడానికి ఎక్కడా ప్రభుత్వ భూమి లేకపోవడంతో గ్రామస్తులు 10 ఎకరాలను దానం చేస్తూ గ్రామసభ తీర్మానం ఇచ్చారు. దీంతో ఇక్కడ పాఠశాల నిర్మించారు. కాగా 2024 సెప్టెంబర్‌లో మిగతా 60 ఎకరా ల భూమి తమదంటూ అటవీ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి హద్దులు నాటుకున్నారు. వివరాలు పరిశీలించగా.. హైదరాబాద్ చుట్టూ నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డుకు తీసుకునే అటవీ భూమికి బదులుగా ఈభూమిని కేటాయించినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహనికి గురై న గ్రామస్తులు హద్దులను తొలగించారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులకు కాకుండా ఎక్కడో జరిగే పనులకు ఇక్కడి భూమి గ్రామసభ తీర్మానం లేకుండా, గ్రామస్తులకు తెలియకుండా ఎలా ఇస్తార ని ఆందోళనకు దిగారు. అప్పటి నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా రెండు రోజుల క్రితం అ టవీ శాఖ అధికారులు భూమి చుట్టూ రోడ్డు నిర్మించేందుకు యంత్రాలను దింపారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్సీ రవీందర్రావు అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్త చర్చ జరుగుతుంది. ఇది లా ఉంటే ఏజెన్సీ చట్టాల కు విరుద్దంగా జరిగిన భూ బదలాయింపు నిలిపి వే యాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భూ బదలాయింపు గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ రహస్యంగా జరిగిన భూ బదలాయింపు విషయాన్ని 2024 సెప్టెంబర్‌లోనే సాక్షి కథనం ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చింది. సాక్షి కథనంతో అన్ని వర్గాల ప్రజలు భూ బదలాయింపును నిలిపి వేసి భూమిని ఏజెన్సీ ప్రజల అభ్యున్నతి కోసం ఉపయోగపడేలా చూడాలని ఆందోళనలు చేశారు. దీంతో ఇన్ని రోజులు అధికారులు ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టడంతో చర్చనీయాంశంగా మారింది. -
చెక్ పవర్ వచ్చేదెన్నడో..?
● ఎదురుచూస్తున్న కొత్త సర్పంచ్‌లు ● చెక్ పవర్‌తోనే నిధులు డ్రా చేసే అవకాశం ● నేటికీ ఆదేశాలివ్వని ప్రభుత్వంతొర్రూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో జిల్లాలో గత నెల 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. జిల్లాలోని 18 మండలాలకు చెందిన 482 గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. అయితే వారికి చెక్ పవర్ రావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సుమారు రెండేళ్ల నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడంతో డిసెంబర్ 22 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ముగిసింది. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గత పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి పేరిట జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. ఆ అధికారాన్ని ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ పేరిట బదిలీ చేయాల్సి ఉంది. పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను అభివృద్ధి పనులు, ఇతరత్రా ఖర్చులకు డ్రా చేయాలంటే వారి సంతకాలు, ఆధార్, పాన్ కార్డు, ఫోన్ నంబర్, వేలి ముద్రల వివరాలు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇలా.. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వాటిని డ్రా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) అమల్లో ఉంది. నిధులు డ్రా చేసేందుకు డిజిటల్ కీ అవసరం లేకపోయినా గ్రామ పంచాయతీ కార్యదర్శి చెక్కు రాసి సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను ట్రెజరీ అధికారులకు పంపాల్సి ఉంటుంది. డిజిటల్ సంతకాలు సక్రమంగా ఉంటే బిల్లు పాసవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి.. గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులను విడుదల చేస్తోంది. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ఆ నిధులు అందుతాయి. పంచాయతీలకు కేటాయించే నిధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (పీఎఫ్ఎంఎస్) అనే ఆన్లైన్ పోర్టల్‌ను రూపొందించింది. సర్పంచ్, ఉప సర్పంచ్ వేలిముద్రల ఆధారంగా డిజిటల్ ‘కీ’ ని తయారు చేస్తారు. ఆ కీని ఉపయోగించి పనులు చేసిన వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులను నేరుగా చెల్లించే సదుపాయం ఉంది. గతంలో డిజిటల్ కీ తయారీ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుతం కీ బాధ్యతను ఏజెన్సీకి అప్పగిస్తారా.. లేక డీపీఎం, ఈ– పంచాయతీ ఆపరేటర్ల ద్వారా అమలు చేస్తారా.. అనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే చెక్ పవర్ బదిలీ చేస్తాం దాదాపు అన్ని గ్రామాల్లో నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారికి ఉన్న చెక్ పవర్.. సర్పంచ్, ఉప సర్పంచులకు బదిలీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పీఎఫ్ఎంఎస్, ఐఎఫ్ఎంఎస్కు సంబంధించిన డిజిటల్ కీ తయారీకి చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సర్పంచ్, ఉప సర్పంచులకు చెక్ పవర్ బదిలీ జరుగుతుంది. – వెంకటేశ్వర్లు, తొర్రూరు ఎంపీడీఓ -
ఈస్ట్‌జోన్ క్రికెట్ గోల్డ్ కప్ విన్నర్‌గా హనుమకొండ
కేయూ క్యాంపస్ : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. విన్నర్‌గా హనుమకొండ, రన్నరప్‌గా ఖమ్మం జట్లు నిలిచాయి. ఫైనల్లో హనుమకొండ, ఖమ్మం జట్లు తలపడగా నిర్ణీత 20 ఓవర్లలో హనుమకొండ మూడువికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఖమ్మం 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో హనుమకొండ గెలు పొంది చాంపియన్‌గా నిలిచింది. విన్నర్, రన్నరప్ జట్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బాధ్యుడు, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర జనరల్సెక్రటరీ గురువారెడ్డి, కేయూ మాజీ పీడీ ఎన్ఏ జయచందర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పెసరు విజయచందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపల్లి జయపాల్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీముద్దీన్ బహుమతులు ప్రదానం చేశారు. కాగా, ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్‌గా హనుమకొండకు చెందిన విష్ణుదాస్ శశాంక్, ఉత్తమ బౌలర్‌గా పెద్దపల్లికి చెందిన రాహుల్ ఎంపికయ్యారు. రన్నరప్‌గా ఖమ్మం జట్టు విజేతలకు ట్రోఫీల ప్రదానం -
పూజల పేరిట రూ. 55 లక్షలు దోపిడీ
ధర్మసాగర్: పూజల పేరిట ఓ పూజారి రూ.55 లక్షలు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన ఇటీవల హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో చోటు చేసుకో గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజలు చేస్తే డబ్బులు మూడింతలు అవుతాయని తనకు తెలిసి న ఓ వ్యక్తి చెప్పగా సదరు ఫామ్ హౌస్ యజమాని నమ్మాడు. దీంతో డిసెంబర్ 30న తన ఫామ్ హౌస్‌లో పూజలు చేయించాడు. ఈ క్రమంలో పూ జారి పూజలు చేస్తూ యజమానిని నమ్మించాడు. రూ.55 లక్షల నగదుకు కూడా పూజ చేస్తానని చెప్పి ఆ యజమానిని ఓ గదిలోకి పంపించి బెడం పెట్టా డు. ఈ క్రమంలో అర్ధగంట దాటినా బెడం తీయలేదు. పూజారి మాటలు కూడా వినపడ లేదు. కిటికీ నుంచి బయటకు వచ్చి చూడగా ఆ పూజారి కనిపించలేదు. దీంతో సదరు పూజారి డబ్బుతో ఉడాయించినట్లు తెలుసుకున్నారు. తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. బంధువుగా పరిచయం చేసుకున్నాడు.. జనగామ: జనగామ మండలం యశ్వంతపూర్‌కు చెందిన మారబోయిన రాములు డబ్బులు డ్రా చేసుకునేందుకు శనివారం పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపం ఎస్బీఐకి వెళ్లాడు. ఖాతా నుంచి రూ.50 వేలు డ్రా చేసుకున్న అనంతరం బయటకొచ్చాడు. ఈ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిని అడ్డగించి, తన బంధువునని పరిచయం చేసుకున్నాడు. అనంతరం టిఫిన్ చేద్దామని సమీపంలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ చేతులు కడుక్కోవాలని చెప్పడంతో రాములు హ్యాండ్‌వాష్ వద్దకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటన పై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం వరంగల్: గుర్తుతెలియని లారీ ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం కొత్తపేట క్రాస్ రోడ్ ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి ఎదుట జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన గౌని అనిల్‌గౌడ్(50), తన మిత్రుడు సతీశ్.. బైక్‌పై కొత్తపేట నుంచి ఆరెపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి ఎదుట ములుగు నుంచి వరంగల్ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని లారీ.. వెనుక నుంచి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు రోడ్డుపై పడిపోగా లారీ అనిల్ తలపై నుంచి వెళ్లడంతో ముఖం చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సతీశ్ తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే ఎదుట ఉన్న ఎన్ఎస్ఆర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరెపల్లి గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్ఆర్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటేందుకు ఏర్పాటు చేసిన క్రాసింగ్తోనే ఈప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. పలుమార్లు ఎన్‌హెచ్ అధికారులకు చెప్పినా రెండు ఆస్పత్రుల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఏనుమాముల ఎస్సై రాజు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం లారీని గుర్తించేందుకు ఆస్పత్రికి చెందిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సురేశ్ తెలిపారు. ● ఉనికిచర్లలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన జనగామలో ఘటన మరొకరికి తీవ్ర గాయాలు కొత్తపేట క్రాస్‌రోడ్‌లో ఘటన -
ఒగ్గు పదం.. డోలు పాదం
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురానికి చెందిన ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ ఒగ్గు రవి బృందం ఈ నెల26న ఢిల్లీ పరేడ్‌లో ప్రదర్శన ఇవ్వనుంది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి వీరికి ఆహ్వానం అందింది. ఈనెల 8న ఢిల్లీ వెళ్లి అక్కడే 25 వరకు రిహార్సల్స్ చేసి 26న ఢిల్లీ కర్తవ్యపథ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంతంలో మొదలైన వీరి ఒగ్గుడోలు విన్యాసం తొలిసారి ఢిల్లీ పరేడ్‌లో ఆకట్టుకోనుంది. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. మండలంలోని మాణిక్యాపురానికి చెందిన ఒగ్గు కథ పితామహుడు చుక్కా సత్తయ్య కథకు డోలు విన్యాసం తోడై అనేక ప్రదర్శనలతో దేశవిదేశాల్లో ఎన్నోసార్లు కళాకారులు డోలు విన్యాసాన్ని ప్రదర్శించారు. చుక్కా సత్తయ్య వారసత్వాన్ని అదే గ్రామానికి చెందిన చౌదరిపల్లి రవికుమార్ అలియాస్ ఒగ్గు రవి పుణికి పుచ్చుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. డోలు విన్యాసంలో ఓంకారం, సమ్మెట, పాంచ్‌పటాకా, తాండవం, శిఖరం, కోలాటం ఇలా అనేక రకాల డోలు విన్యాసాలతో పాటు దశావతారాలు, పోతరాజులు, శివసత్తులు, విష్ణురూపం, శివశక్తుల విన్యాసం వంటి అనేక ప్రదర్శనల్లో దాదాపు 5 వేల మంది యువకళాకారులకు శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో 26 ఏళ్లుగా ప్రదర్శనలు.. ఒగ్గు రవి, బృందం సుమారు 26 ఏళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్, తాజ్ ఉత్సవాలు, అంతర్జాతీయ వేదికలతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తమ ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా స్పెయిన్, మలేషియా, న్యూజిలాండ్, సింగపూర్, దోహ వంటి తదితర 12 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. కాగా, ఢిల్లీ పరేడ్‌లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు తెలంగాణ నుంచి 30 మంది కళాకారుల బృందం వెళ్తుండగా.. జనగామ జిల్లా నుంచి చౌదరిపల్లి రవికుమార్, మరికుక్కల అశోక్, గువ్వల మధు ఉన్నారు.విన్యాస శిక్షణకు న్యాయం జరిగింది.. ఎన్నో ఏళ్లుగా ఒగ్గుడోలు ప్రదర్శనలో ఉస్తాద్ ఒగ్గు రవి ఇచ్చిన శిక్షణకు న్యాయం జరిగింది. ఇంతటి అవకాశం కల్పించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా మా గురువైన ఒగ్గు రవి కష్టానికి తగిన ఫలితం దక్కింది. మేమంతా అక్కడ విన్యాసాలు చేయనుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది.ఆనందంగా ఉంది.. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసాల ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉంది. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చాం. కానీ, ఢిల్లీలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎదుట ప్రదర్శనలు ఇచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉంది. భారత ప్రభుత్వానికి, తెలంగాణకు రుణపడి ఉన్నాం. ఉపరాష్ట్రపతితో ఒగ్గుడోలు కళాకారులు (ఫైల్)అస్సలు ఊహించలే.. గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు విన్యాసానికి అవకాశం దక్కుతుందని అస్సలు ఊహించలే. ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. ఇలాంటి అవకాశం రావడం సంతోషం. భవిష్యత్‌లో మరెన్నో అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటున్నాం. – మరికుక్కల అశోక్, మాణిక్యాపురం, ఒగ్గుడోలు కళాకారుడు ●ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శన– ఒగ్గు, రవికుమార్, మాణిక్యాపురం (ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ జాతీయ పురస్కార గ్రహీత) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగంపెంచాలి గణతంత్ర వేడుకల్లో ఒగ్గుడోలు ప్రదర్శనకు ఓరుగల్లు కళాకారులు మాణిక్యాపురం కళాకారుడు ఒగ్గు రవి బృందానికి అందిన ఆహ్వానం జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపునకు అవకాశం 8న ఢిల్లీకి వెళ్లనున్న కళాకారుల బృందం.. 25వ తేదీ వరకు రిహార్సల్స్ -
మహిళపై బీఆర్ఎస్ కార్యకర్త దాడి..
కురవి: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదనే కోపం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నృత్యం చేసిందనే కారణంతో ఓ బీఆర్ఎస్ కార్యకర్త.. మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన సదరు మహిళ బానోత్ బుల్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండా(బీ) గ్రామంలో వార్డు సభ్యుడి స్థానానికి మాలోత్ మోహన్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. అయితే అదే వార్డులో ఉండే బుల్లి.. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించగా ఆ పార్టీ వారితో కలిసి నృత్యం చేసిందనే కోపంతో మోహన్.. ఆమైపె దాడికి పాల్పడ్డాడు. ఈ విషయమై బుల్లి గ్రామ పెద్దలకు చెప్పడంతో మోహన్‌ను పంచాయితీకి పిలిచినా రావడంలేదు. మళ్లీ బుల్లి పొలంలో పనిచేస్తున్న సమయంలో మోహన్ మరోసారి కొట్టడంతో మనస్తాపానికి గురై శుక్రవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే మహబూబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బుల్లి ఫిర్యాదు మేరకు మోహన్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. కాగా, బుల్లిని కాంగ్రెస్ నాయకుడు, సర్పంచ్ స్వరూప భర్త హరిలాల్ పరామర్శించారు. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం ఒకరిపై కేసు నమోదు -
గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే
హన్మకొండ: గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ముందుగా సావిత్రి బాయి పూలే చిత్ర పటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి బాలికల విద్యకు మార్గదర్శకురాలిగా నిలిచారన్నారు. సమాజం కోసం జీవించి, సమాజం కోసం చనిపోయిన వ్యక్తి మాత్రమే అసలైన సంఘ సంస్కర్త అని, ఆ ప్రమాణానికి పూర్తిగా సరిపోయిన తొలి వ్యక్తి సావిత్రిబాయి అన్నారు. ఆమె ఆశయాలు నేటి యువతరానికి మార్గదర్శకంగా మారాయన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈలు టి.సదర్ లాల్, కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, సీజీఎం రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్ , శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్, వాసుదేవ్, నాగ ప్రసాద్, వెంకట కృష్ణ, జయ రాజ్, కళాధర్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఉత్సవం.. ఉత్సాహం
రేపటి నుంచి అన్నారం దర్గా ఉర్సు ● మూడు రోజులపాటు నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం ● తరలిరానున్న వేలాది మంది భక్తులుపర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో యాకుబ్‌షావళి దర్గా ఉర్సు ఈనెల 5వ తేదీ నుంచి జరగనుంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలొచ్చి యాకుబ్‌షావళి దర్గా దర్శించుకోనున్నారు. మొదటి రోజు (సోమవారం) రాత్రి ఖవ్వాలి గేయాలాపన, గంధం ఊరేగింపు, రెండో రోజు (మంగళవారం) దీపారాధన, భక్తుల కు మహా అన్నదానం, మూడో రోజు (బుధవారం) ఖత్మల్ ఖురానాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ముస్లింలతో పాటు హిందువులు మొక్కులు చెల్లించుకుంటారు. కోళ్లు, యాటలతో కందూర్లు చేస్తారు. అన్నారం షరీఫ్ గంధం ఊరేగింపు కోసం భారీ పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశాం. మామునూరు ఏసీపీతోపాటు ఐదుగురు ఎస్సైలు, వంద మంది సిబ్బంది పాల్గొంటారు. ఉర్సు విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. రాజగోపాల్, సీఐ, పర్వతగిరి -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గంగారం : మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గంగారం ఫారెస్టు అధికారులు మంగీలాల్, కర్ణనాయక్, సతీష్ సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంగారం మండలంలోని మహదేవునిగూడ, జంగాలపల్లి, కామారం, దుబ్బగూడెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. వ్యవసాయ పనులు చేసుకునే వారు, పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు అటవీ ప్రాంతానికి వెళ్లొదని హెచ్చరించారు. గ్రామాల్లో ఏమైనా ఆనవాళ్లకు సంబంధించి గుర్తులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఒకే శాఖ.. ఒకే వేతనం అమలు చేయాలి
కాజీపేట అర్బన్ : అర్చకులకు ఒకే శాఖ..ఒకే వేతన విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా అర్చక, ఉద్యోగుల సదస్సును పాతర్లపాడు నరేష్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విశిష్ట అతిథిగా జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, ముఖ్య అతిథిగా రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ హాజరై మాట్లాడారు. జీఓ 577 ప్రకారం 686 దేవాలయాల్లోని 2,223 మంది అర్చకులకు దేవాదాయ శాఖ అధికారులు అన్యాయంగా విస్మరించారని జేఏసీ రాష్ట చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. జీఓ 121ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అర్చకులకు కనీస వేతం రూ.1,500లు కూడా అందడం లేదని అందులో నుంచి 12శాతం ఈఏఎఫ్ ద్వారా జీతాలు పొందుతున్న అధికారులు మాత్రం ట్రెజరీ వేతనాలు, పెన్షన్లు, హెల్త్ కార్డులు పొందుతున్నారని జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడు గ ట్టు శ్రీనివాసాచార్యులు, రవీంద్రాచార్యులు, వెల్ఫేర్ బోర్డు సభ్యులు కృష్ణమాచారి, శ్రావణ కుమారచారి, బ్రాహ్మణసేవా సంఘం కన్వీనర్ వల్లూరి పవన్‌కుమార్, జేఏసీ ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ, టక్కరి సత్యం, టీఎన్జీవోస్ నాయకులు ఆకుల రాజేందర్, సోమన్న తదితరులు పాల్గొన్నారు. అర్చక జేఏసీ నాయకులు -
హాస్టల్లో దాడి ఘటనపై విచారణ
కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ప్రభాకర్‌పై బయటి వ్యక్తి వచ్చి దాడి చేసిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. డీఎస్సీడీఓ విక్రం, ఏటీడీఓ హసీనా హాస్టల్‌కు వచ్చి బాధిత విద్యార్థితో పాటు సహచర విద్యార్థులు, సిబ్బందిని విచారించారు. దాడి ఘటన జరిగిన తీరుపై వివరాలు తెలుసుకుని విద్యార్థులు, సిబ్బంది వాంగ్మూలం తీసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని అధికారులు తెలిపారు. కాగా హాస్టల్లో విద్యార్థిపై దాడి చేసిన రోజు వార్డెన్ రాత్రి 9గంటల వరకు ఉన్నాడని, అదే సమయంలో వాచ్మెన్ బయటి వ్య క్తిని అడ్డుకొని బయటకు పంపాడని ఇద్దరి తప్పు లే దని చెప్పారు. విలేకరులు ఏదో రాశారని విద్యార్థులతో హాస్టల్ సిబ్బంది వాంగ్మూలం ఇప్పించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన వ్యక్తిపై కేసు హాస్టల్లో విద్యార్థి ప్రభాకర్‌పై దాడి చేసిన పాకాల గ్రామానికి చెందిన నవీన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
టికెట్ల జారీలో ఆగని అవినీతి!
● భద్రకాళి ఆలయ ఘటనపై సోషల్ మీడియాలో హల్చల్.. ● ఎక్కడా అవినీతి జరగలేదు: అసిస్టెంట్ కమిషనర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో మరోసారి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆలయ సిబ్బంది నకిలీ టికెట్ విక్రయించి రూ.లక్షల్లో కాజేసిన విషయం తెలిసిందే. నకిలీ టికెట్ల జారీని అరికట్టడానికి ఆన్లైన్ టికెట్లు జారీ చేయకుండా మాన్యువల్ టికెట్లు ఇస్తామని దేవాలయ అధికారులు గతంలో ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం వరకు రద్దీ ఎక్కుగా ఉండడంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని చూసిన ఆలయ సిబ్బంది మరోసారి ఆన్లైన్ ద్వారా టికెట్లు ద్వారా విక్రయించారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 31నుంచి జనవరి 2వ తేదీ వరకు సిబ్బంది టికెట్ జారీ చేయకుండా లడ్డూ, పులిహోర విక్రయించడం ఏంటని భక్తులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఆలయ అధికారుల నిఘా లోపంతోనే సిబ్బంది చేతివాటం మరింత పెరిగిందని కొంత మంది బాహాటంగా విమర్శిస్తున్నారు. ఆలయ పరిపాలన విభాగాధికారుల పర్యవేక్షణ వైఫల్యంతోనే సిబ్బంది చేతివాటం పెరిగిందనే ఆరోపణలున్నాయి. ఆలయ పూజారులు సైతం భక్తుల నెత్తిన శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేట్ పూజారులు కొల్లగొడుతున్నట్లుగా విమర్శలున్నాయి. అమ్మవారిని దర్శించుకున్న క్రమంలో దేవుడి బొట్టు పెట్టి అక్షింతలు వేయాలన్నా.. అమ్మవారి గాజులు కావాలన్నా.. ఆశీర్వదించాలన్నా.. చేతిలో సంభావన పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై దేవాలయ ఈఓ రామల సునీతను వివరణ కోరగా.. అవినీతి ఎక్కడా జరగలేదని, సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు ఆరోపణలు మాత్రమేనన్నారు. గురువారం మొత్తం తొమ్మిది లక్షలపై చిలుకు ఆదాయం సమకూరగా.. అందులో కేవలం ప్రసాదాల అమ్మకం ద్వారా సుమారు రూ.3.40 లక్షల ఆదాయం సమకూరిందని, అవినీతి జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. -
పొగమంచుతో జాగ్రత్త
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఉదయం వేళల్లో పొగమంచు పడు తుందని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ఎస్పీ శబరీష్ శుక్రవారం తెలిపారు. పొగమంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా ప్రయాణించడంతో పాటు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. పొగమంచు ఉన్న సమయంలో వేగం తగ్గించి వాహనం నడపాలని, హెడ్ లైట్లు, ఫాగ్ లైట్లు తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. వాహనాల మధ్య తగిన దూరం పాటించాలని, అనవసరంగా ఓవర్టేక్ చేయవద్దని, మద్యం తాగి వాహనం నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని సూచించారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని, పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
మహాజాతరలో మెరుగైన వైద్యసేవలు
ఎంజీఎం : మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పెషలిస్ట్ డాక్టర్లతో మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు అందించాల్సిన వైద్యసేవలపై హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సమన్వయ కర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ములుగు జిల్లాకు దగ్గరగా ఉన్న ములుగు, నర్సంపేట, భూపాలపల్లి మెడికల్ కాలేజీలు, అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులను జాతరలో వైద్యసేవల కోసం డిప్యూటేషన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వీరితో పాటు అన్ని ఉమ్మడి జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కమిటీలో చర్చించినట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ డీఎంహెచ్ఓలు సాంబశివరావు, అప్పయ్య, గోపాల్ రావు, మధుసూదన్, రవిరాథోడ్, మల్లికార్జున్, జనగామ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు, విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ : మహాజాతరకు వచ్చే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ రవాణా సౌకర్యంతో పాటు, వైద్యసేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,860 ప్రత్యేక బస్సులు నడపాలని వీటి ద్వారా 20లక్షలకు పైగా భక్తులు ప్రయాణిస్తారనే అంచనా వేశారు. అందుకు అవసమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో వచ్చే భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మేడారంలో ఆరుగురు డాక్టర్లు, సిబ్బందిచే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. నాలుగు అంబులెన్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇక్కడి వైద్య శిబిరంలో చికిత్స అందించనున్నారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ చంద్రారెడ్డి -
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్ /హన్మకొండ కల్చరల్ : నగరంలోని కాళోజీ కళాక్షేత్రం వేదికగా అజో విభో కందాళం, సహృదయ సాహిత్య, సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న సాహితీ–సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా కంటే ముందు సామాన్యులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించి, నేటి సమాజంలోని స్థితిగతులను విశ్లేషించి కళాత్మకంగా అందజేస్తున్నది రంగస్థల నాటకమేనని అజో విభొ కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజ్యోసుల సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఉదయం కోట్ల హనుమంతరావు కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. బీహెచ్. పద్మప్రియ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నటుడు, దర్శకుడు, అధ్యాపకుడిగా కోట్ల హనుమంతరావు ప్రస్థానంపై విశ్లేషణ జరిగింది. అనంతరం అలనాటి నాటక ప్రస్థానం–మేటి నటులు శ్రవ్య, దృశ్య కళారూప ప్రదర్శనను కందిమల్ల సాంబశివరావు ప్రదర్శించారు. సాయంత్రం కాళోజీ కళాక్షేత్రంలో జరిగిన నాటికల ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అభినయ ఆర్ట్స్, గుంటూరు వారి ‘సమయం’ నాటిక సమయ విలువను కుటుంబ నేపథ్యంతో ప్రభావవంతంగా ఆవిష్కరించింది. సభా కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న తడకమళ్ల రామచంద్రరావు నాటకం ఒక జీవ కళ అని, సమాజానికి దర్పణంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ విశిష్ట రంగస్థలం పురస్కారాన్ని కోట్ల హనుమంతరావుకి అందజేశారు. అనంతరం హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటిక తల్లి–కుమారుడి భావోద్వేగాలను హృద్యంగా చూపించింది. నేరెళ్ల వేణుమాధవ్ స్మృత్యర్థంగా పేరడి గురుస్వామి మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. చివరిగా మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక కుటుంబ వ్యవస్థలోని సంఘర్షణలను ప్రతిబింబించింది. ఈ కార్యక్రమంలో సహృదయ కార్యవర్గ సభ్యులు జి. గిరిజామనోహరబాబు, ఎన్వీఎన్ చారి, కుందావజ్జుల కృష్ణమూర్తి, మల్యాల మనోహరబాబు, న్యాలకొండ భాస్కర్‌రావు, లక్ష్మణమూర్తి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, జానపదటిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న, కవి రామాచంద్రమౌళి, రంగస్థల సంస్థల నిర్వహకులు ఆకుల సదానందం, రమేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
కమ్మేసిన మంచు.. కనిపించని రోడ్డు
● ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు ఖిలా వరంగల్ : వరంగల్ నగర రహదారులను శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 10గంటల వరకు రహదారులపై దట్టంగా మంచు పడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుడికి వెళ్లొస్తామని బయల్దేరి.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దంపతులు గుడికి వెళ్లొస్తామని ఇంటినుంచి బయల్దేరారు. ఇంతలో రోడ్డును కమ్మేసిన పొగ మంచు వారి ప్రాణాల మీదకు తెచ్చింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగశాయిపేటకు చెందిన గడ్డం రఘుమోహన్, రాజేశ్వరి బైక్‌పై భద్రకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించే పరిస్థితి లేదు. ఫోర్ట్ రోడ్డులోని వాల్‌మార్ట్ సమీపానికి చేరుగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దాని వెనుకలే వెళ్తున్న వీరు ట్రాక్టర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘనటలో ఇద్దరి తలతో పాటు ఇతర శరీర భాగాలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎంజీఎంకు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన మిల్స్‌కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుల వివరాలు సేకరించినట్లు సమాచారం. -
ఆటోను ఢీకొన్న లారీ
● ఒకరి మృతి చిల్పూరు : మండలంలోని నష్కల్ గ్రామ బస్ స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద గురువారం అర్ధరాత్రి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట బాపూజీ నగర్‌కు చెందిన గబ్బెట ఎల్లేష్ (45), ఎర్ర రాజు ఆటోలో కరుణాపురం చర్చికి వచ్చారు. తిరిగి అదే ఆటోలో అర్ధరాత్రి నష్కల్ స్టేజీ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వస్తున్న లారీ, ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఎల్లేష్ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని యువకుడు.. కమలాపూర్ : మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. శాయంపేట మండలం గట్ల కానిపర్తికి చెందిన కూనూరి రాజు (30) హుజూరాబాద్ వైపు నుంచి కమలాపూర్ వైపునకు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. కమలాపూర్ బస్టాండ్ వద్ద అదే వైపు వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ రాజు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతడు లారీ కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో రాజును వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు మృతి చెందాడని ధ్రువీకరించారు. బావిలో పడి యువతి.. గూడూరు : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువతి మృతిచెందింది. ఈ సంఘటన మండలంలోని తేజావత్ రాంసింగ్ తండా శివారు దొడ్డితండాలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్డితండాకు చెందిన గుగులోత్ అఖిల (18) పదోతరగతి వరకు చదివి ఇంటి వద్ద తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సహకరిస్తుంది. ఈ క్రమంలో మేకలను మేపడానికి వెళ్లిన అఖిల, వ్యవసాయబావి వద్ద మేస్తున్న మేకలను పక్కకు కొట్టబోయి, ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. తండ్రి గుగులోత్ సూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు. -
కొత్తూరు హైస్కూల్ తరలింపునకు యత్నం
● అడ్డుకున్న సమ్మయ్యనగర్ కాలనీవాసులువిద్యారణ్యపురి: హనుమకొండలోని గోపాల్పురం ప్రాంతంలో అద్దెభవనంలో ఉన్న కొత్తూరు ప్రభు త్వ హైస్కూల్‌ను సమీపంలోని సమ్మయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించాల ని డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ క్రమంలో కొత్తూరు ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం లచ్చిరాం నాయక్, ఉపాధ్యాయులు కలిసి ఆ పాఠశాలలోని విద్యార్థులను శుక్రవా రం తీసుకొని సమ్మయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. దీంతో ఆ కాలనీవాసులు వారిని అడ్డుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సమ్మయ్యనగర్‌లోని ఈ భూమిని ప్రాథమిక పాఠశాల కోసం ఇచ్చామని, ఇప్పుడు ఇక్కడ హైస్కూల్ ఏర్పాటుచేయడం సరికాదని అన్నారు. హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ మహేష్ అక్కడి వచ్చి సర్దిచెప్పినా వారు వినలేదు. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులను తీసుకొని హెచ్ఎం, ఉపాధ్యాయులు వెనుదిరిగారు. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగులో భక్తులు స్నానాలు చేసి, తల్లుల గద్దెల వద్ద పూజలు చేసి మొక్కులు సమర్పించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝా, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేశ్ గీతే బాబాసాహెబ్లతో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో మల్టీజోన్ ఐజీని గద్దెలపై స్వాగతం పలికారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీలు, ఎస్పీలను పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సమ్మక్క పూజారి కొక్కెర రమేశ్ అమ్మవార్ల కండువాలతో సన్మానించి బెల్లం, ప్రసాదం అందజేశారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఏఓ సరిత
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో డీఏఓగా సరిత శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఎం.విజయనిర్మల పదోన్నతిపై వరంగల్ ఆత్మ జాయింట్ డైరెక్టర్‌గా విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు ఆమె నూతన డీఏఓకు బాధ్యతలు అప్పగించారు. అధికారి సరిత మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. పంటల సాగు ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులకు యూరియా అందజేస్తామని చెప్పారు. సకాలంలో యూరియా పంపిణీ చేయాలి మహబూబాబాద్ రూరల్: రైతులకు యూరియా పంపిణీలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆత్మ మరిపెడ డివిజన్ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి బి.సరితను కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దరఖాస్తు చేసుకున్న వ్యవసాయ యంత్ర పరికరాలను త్వరితగతిన అందించాలని, యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, సీపీఐ నాయకులు పోలెపాక వెంకన్న, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, టెక్నికల్ ఏఓ జావీద్, సీరోలు ఏఓ ఛాయారాజ్ పాల్గొన్నారు, దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: గిరిజన, సాంఘిన సంక్షేమ, ఎంజేపీ, మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి పూర్తిస్థాయిలో, 6నుంచి 9వ తరగతుల్లో ఖాళీసీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. నాగేంద్రమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు మీసేవ కేంద్రాల్లో మాత్రమే రూ.100 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ఉయదం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 83338 00221, 040–23391598 నంబర్లలో సంప్రదించాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులుమహబూబాబాద్ రూరల్: ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా నుంచి 20మంది కవులు, రచయితలు శుక్రవారం గుంటూరుకు తరలివెళ్లారు. ఈ నెల 3,4,5 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ తెలి పారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో గజల్ శ్రీని వాస్ నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆరు వేదికల్లో అనే క సాహిత్య, సాంస్కృతిక కళా ప్రదర్శనలు, పుస్తక, కార్టూన్లు, ఆధ్యాత్మిక ప్రదర్శనలతో పాటు రాజకీ య, సినీ ప్రముఖులు పాల్గొంటుండగా దేశ, విదేశాల నుంచి వేలాది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక జి ల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ సమన్వయంలో కోటగిరి వెంకట నర్సయ్య, కస్తూరి పులేందర్, నాళ్లం శ్రీనివాస్, బొమ్మిడి వినోద్ రెడ్డి, బొడ్డుపల్లి వీరస్వామి, రేణిగుంట్ల లక్ష్మీకాంతారావు, బా ణాల వీరయ్య, తొట్ల వెంకటలక్ష్మి, రేణిగుంట్ల శ్రీదేవి, ఉషారాణి, కొంగ మమతాదేవి వెళ్లారు. ‘పింగిళి’లో కథా సర్టిఫికెట్ కోర్సు షురూ విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో ‘సృజనాత్మక రచన, కథ’ అంశంపై సర్టిఫికెట్ కోర్సును ముఖ్య అతిథిగా హైదరాబాద్ ప్రెస్ బ్యూరో డైరెక్టర్ కోటేశ్వర్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కథలు మానవ జీవి తాన్ని ప్రతిబింబింపజేస్తాయన్నారు. ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్రమౌళి, తెలుగు విభా గాధిపతి ఎస్.మధు, అధ్యాపకులు లక్ష్మీకాంతం, రామారత్నమాల, సునీత, రామాకృష్ణారెడ్డి, మాధవి, యుగేంధర్, రాజ్‌కుమార్ ఉన్నారు. -
హామీల అమలేది..?
● బయ్యారం పెద్దచెరువును పట్టించుకోని ప్రజాప్రతినిధులు ● పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ● ప్రస్తుతం ఊసెత్తని పాలకులు బయ్యారం: కాకతీయరాణి బయ్యామాంబ నిర్మించిన బయ్యారం పెద్ద చెరువును అభివృద్ధి చేయడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండుగుట్టల అందాల నడుమ ఉన్న బయ్యారం పెద్దచెరువు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని గత ప్రభుత్వంలో జిల్లా మంత్రిగా కొనసాగిన సత్యవతిరాథోడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. చెరువు అభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుగుట్టలే చెరువుకట్ట.. కాకతీయరాణి బయ్యామాంబ పాలనలో రెండుగుట్టల నడుమ బయ్యారం పెద్ద చెరువును నిర్మించారు. 16.2 అడుగుల నీటిసామర్థ్యం గల పెద్దచెరువు బయ్యారం, గార్ల మండలాల పరిధిలోని పలు గ్రామాల రైతులకు సాగునీటిని అందిస్తోంది. ఎక్కడ కరువు వచ్చినా.. చెరువు కింద మాత్రం పంటలు పండుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. కట్టపై శిలాశాసనం.. కాకతీయరాజుల వంశచరిత్ర ఆధారంగా అప్పటి కాకతీయరాణి బయ్యామాంబ బయ్యారం పెద్దచెరువు కట్టపై శిలాశాసనం ఏర్పాటు చేయించారు. ఈ శాసనంపై ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశచరిత్రను వివరించారు. కాకతీయుల వంశచర్రితను తెలిపే శాసనం బయ్యారం చెరువుకట్టపైనే ఉందని చరిత్ర తెలుపుతోంది. అలుగుల కనువిందు.. ప్రతీ వర్షాకాలంలో చెరువు నిండి అలుగుల నుంచి వచ్చే నీటి అందాలు చూపరులను ఆకట్టుకుంటాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు వర్షాలను బట్టి చెరువులో పూర్తిస్థాయి నీరు చేరుతుంది. అలుగుల ద్వారా వచ్చే నీటి అందాలను చూసేందుకు మండలంలోని పలు గ్రామాల వాసులతో పాటు మహబూబాబాద్, కురవి, గూడూరు, గార్ల, డోర్నకల్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికై నా బయ్యారం పెద్దచెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలి కోటగడ్డ పంచాయతీ పరిధిలో పచ్చనిచెట్లు, కనుచూపు మేర నీటితో కనపడే బయ్యారం పెద్దచెరువు వద్దకు ప్రతీ సీజన్లో పర్యాటకులు వస్తుంటారు. చెరువులో నీటిని నిల్వ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చెరువు కట్ట నుంచి అలుగుల వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. –కె.వరలక్ష్మి, సర్పంచ్, కోటగడ్డ -
పెరుగుతున్న మంత్రుల ఆస్తులు
● బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ హన్మకొండ : రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తగ్గి.. మంత్రుల ఆస్తులు పెరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దోచుకోవడం..దాచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కరప్షన్, కాంట్రాక్టులని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్‌లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ అంటోందని, రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో సలహాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు ఆర్.పి.జయంత్‌లాల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు, సండ్ర మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, కురిమిండ్ల సదానందం, అరణ్య రెడ్డి, మల్లికార్జున్, అభిషేక్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు
● ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల ● ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన ● ఈనెల 10న ఓటరు తుది జాబితా వెల్లడి ● సర్వం సిద్ధం చేస్తున్న యంత్రాంగంమహబూబాబాద్: త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదిని ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల చేశారు. ఈసీఐ (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు తొలుత ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్లు, ఇతర జాబితా తయారు చేసే పనిలో మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈనెల 10న ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తారు. కాగా, మున్సిపాలిటీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. మానుకోటలో 36 వార్డులు.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. గత మున్సిపల్ ఎన్నికల జాబితా ప్రకారం 57,828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితా ఆధారంగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఈసీఐ ఆదేశించింది. 01–10–2025 నాటి డేటా ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితా తయారు చేయాలని గైడ్ లైన్స్‌లో పొందుపర్చారు. వార్డుల వారీగా ఓటరు జాబితా.. డిసెంబర్ 29న విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. 30,31 తేదీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పీఎస్‌ల వారీగా వార్డుల జాబితా తయారు చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, ఆర్ఐ, మేనేజర్ టౌన్ ప్లానింగ్ అధికారులంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. పనులను కమిషనర్ టి.రాజేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. ● ఈనెల 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఆరోజు నుంచే అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమవుతుందని అధికారులు తెలి పారు. కాగా, ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. ● ఈనెల 5న మున్సిపాలిటీల పరిధిలోని రాజకీయ నాయకులతో ఓటరు జాబితా, పీఎస్‌లపై సమావేశం, 6న కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. ● ఈనెల 10న తుది ఓటరు జాబితా ప్రదర్శిస్తారు. అనంతరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మిగిలిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. తదుపరి రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియ అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మానుకోట మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ ఎస్టీకి కేటా యించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. పెరిగిన ఓటర్లు.. గత ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీలో 57,828 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం 65,851మంది ఓటర్లు ఉన్నారు. ఈమేరకు గతంలో కంటే 8,023 మంది ఓటర్లు పెరిగారు. దీంతో వార్డులు పెరగడం, పరిధి కూడా మారే పరిస్థితి ఉంది. దీంతో రిజర్వేషన్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. కాగా చైర్మన్ రిజర్వేషన్ బీసీకి కేటాయించాలని చాలామంది రాజకీయ నాయకులు ఆశిస్తున్నాయి. అయితే ఎస్టీకి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. -
ఐటీశాఖ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నా..
● జిల్లా అధికారులకు బెదిరింపు ఫోన్లు ● నిందితుడిపై కేసు నమోదు.. కోర్టులో హాజరుపర్చిన పోలీసులు భూపాలపల్లి అర్బన్ : ‘తెలంగాణ సెక్రటేరియట్‌కు చెందిన ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నా’ అంటూ వివిధ జిల్లాల అధికారులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాలడుతున్న వ్యక్తిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్ తాను రాష్ట్ర సచివాలయంలో జేసీని అని ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేసి వారి వివరాలు అడగడం, ఆదేశాలు ఇవ్వడం, సరిగా పని చేయకపోతే చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో జిల్లాకు చెందిన పలువురు అధికారులు, డీపీఆర్ఓ శ్రీనివాస్ ఇటీవల ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి రాజేంద్రప్రసాద్‌ను గుర్తించి శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ నరేష్కుమార్ తెలిపారు. కిలోన్నర గంజాయి స్వాధీనం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై వి.దీపిక శుక్రవారం తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో వాహనాల తనిఖీ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ముత్యాలమ్మగూడెం శివారులో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా అతడిని ఆపి పరిశీలించామని చెప్పారు. కాగా అతడి వద్ద కిలోన్నర ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గంజాయి విలువ రూ.75 వేలు ఉంటుందని, గంజాయి తరలిస్తున్న వ్యక్తి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం కాలనీకి చెందిన షేక్ జానీగా గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. అలాగే బైక్, సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని, అతడిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుట్కా పట్టివేత వరంగల్ క్రైం : నగరంలోని టైలర్ స్ట్రీట్‌లో గల బాలాజీ కిరాణా షాపు గోదాంలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు శుక్రవారం విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడి చేసి పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. సుమారు రూ.5 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వాహకుడు పవన్ ఉపాధ్యాయపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎస్సై సతీష్, క్రైం పార్టీ రావుఫ్, అశోక్ పాల్గొన్నారు. రేపు ‘బ్రహ్మం గారి పద్యశతకం’ పుస్తకావిష్కరణ హన్మకొండ కల్చరల్: కాకతీయ పద్యకవితా వేదిక వరంగల్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం ధ్యానమండపంలో హనుమకొండకు చెందిన విశ్రాంత భాషోపాధ్యాయుడు నర్సింగోజు లక్ష్మయ్య రచించిన ‘బ్రహ్మం గారి పద్య శతకము’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరుగుతుందని వేదిక అధ్యక్షుడు కంది శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. -
భక్తులకు ప్రశాంత దర్శనం కల్పించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడారాన్ని సందర్శించిన ఆయన మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారులతో జాతరలో ట్రాఫిక్, భక్తుల భద్రత ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు లక్షలాది ప్రజలు తరలివస్తారని, భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం సాఫీగా జరిగేలా బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత జాతరలో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఆయా జోన్లలో, సెక్టార్లలో తిరిగి పని చేయాలని సూచించారు. జాతరకు అవసరమైనంతమంది సిబ్బందిని జాతర విధులకు నియమించుకోవాలని చెప్పారు. జాతరలో భక్తుల భద్రత ఏర్పాటు విషయంపై బందోబస్తుకు వెనకాడొద్దని అధికారులను ఆదేశించారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతరకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో వాహనాల దారి మళ్లింపు విషయమై ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాన్నారు. సమావేశంలో రామగుండం, వరంగల్, కరీంనగర్ సీపీలు అంబర్ కిషోర్ ఝా, సన్‌ప్రీత్‌సింగ్, గౌస్ ఆలం, ఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, డాక్టర్ శబరీశ్, సంకీర్త్, మహేష్ గీతే బాబాసాహెబ్, డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, నార్లాపూర్, తాడ్వాయి ఎస్సైలు కమలాకర్, జగదీశ్ పాల్గొన్నారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సమష్టిగా జాతరను జయప్రదం చేయాలి మేడారంలో బందోబస్తుపై సమీక్ష -
మున్నేరు టు పాలేరు
సాక్షి, మహబూబాబాద్: మానుకోట జిల్లా మీదుగా ప్రవహించే మున్నేరు వాగుపై గార్ల మండలం దుబ్బగూడెంలో అడ్డుకట్ట వేసి నీటిని దారి మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డోర్నకల్ మండలం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరుకు నీటిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు నిధుల మంజూరు, కాల్వల భూసేకరణ పనిలో ఉన్నారు. అయితే వాగు దారి మళ్లిస్తే తమ ప్రాంతం ఎడారిగా మారుతుందని, భూమి ఇచ్చే ప్రసక్తే లేదని గార్ల రైతులు మొండికేస్తున్నారు. ప్రతీ ఏటా వృథాగా సముద్రంలో కలిసే నీటినే పాలేరుకు మళ్లిస్తున్నామని అధికారులు చెబుతుండగా.. రైతులు మాత్రం వినకుండా ఆందోళన బాట పట్టారు. పాలేరుకు ఇలా.. ఎగువన ఉన్న ములుగు, వరంగల్ జిల్లాల మీదుగా మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ప్రవహిస్తూ ఖమ్మం జిల్లా మీదుగా కృష్ణా నదిలో కలుస్తుంది. అయితే గార్ల మండలంలోని దుబ్గగూడెం వద్ద చెక్ డ్యాం నిర్మించి సుమారు 10 కిలోమీటర్ల మేరకు కాల్వలు తవ్వి డోర్నకల్ పట్టణం సమీపం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు కాల్వలో కలుపుతారు. ఇందుకోసం రూ.145 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కాల్వలు తవ్వడానికి 350 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. కాగా పనులు పూర్తయితే మున్నేరు వాగు ద్వారా 10 నుంచి 12 టీఎంసీల నీటిని పాలేరులోకి తరలించవచ్చు. భూములు ఇవ్వమంటున్న రైతులు.. మున్నేరు నీటిని పాలేరుకు తరలించే కాల్వల కోసం 350 ఎకరాల భూమి అవసరం. అయితే ఈ భూమి ఇవ్వం.. కాల్వ తవ్వవద్దని రైతులు ఆందోళన చేస్తున్నారు. మున్నేరు దారి మళ్లించడం ద్వారా గార్ల, డోర్నకల్ మండలాల్లోని రాంపురం, పాత దుబ్బతండా, కొత్త దుబ్బతండా, సత్యతండా, గుర్రాలకుంట తండా, అమ్మపాలెం, తహసీల్దార్ బంజర, సీతారాంపురంలోని ఎనిమిది చెక్ డ్యాంలతోపాటు, ఖమ్మం రూరల్ మండలం పొలిశెట్టిగూడెం సరిహద్దుల్లో ఉన్న రెండు చెక్ డ్యాంలు, డోర్నకల్ పట్టణ శివారులోని ఆనకట్టకు నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. దీంతో ఈ చెక్‌డ్యాంల నీటినే ఆధారంగా చేసుకొని సాగుచేసే సుమారు 5వేల ఎకరాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ భూములు తప్పని సరిగా ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వం ఎకరానికి రూ. 12లక్షలకు మించి ఇచ్చే అవకాశం లేదని ప్రచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి రూ. 20లక్షల నుంచి రూ. 40లక్షల మేరకు ధర పలుకుతోంది. ఇన్ని కారణాలతో అసలు భూమి ఇవ్వం, కాల్వల నిర్మాణాన్ని అడ్డుకుంటామని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భూ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకొని సర్వే చేయకుండానే వెనక్కి పంపించారు. వాగు దారి మళ్లించి పాలేరుకు నీటి తరలింపు గార్ల మండలం దుబ్బగూడెంలో చెక్‌డ్యాం నిర్మాణం మిగులు జలాలే తరలిస్తున్నామంటున్న అధికారులు కాల్వల నిర్మాణ భూసేకరణకు రైతుల ససేమిరా మా నీళ్లు మళ్లించొద్దని రైతులు, రైతు సంఘాల ఆందోళన -
అడవికి కొత్త అందాలు..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో ఎకో టూరిజం ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేలా అడవికి సరికొత్త అందాలు తీర్చిదిద్దారు. తాడ్వాయి – ఏటూరునాగారం అటవీ మార్గంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ ఆర్చ్తోపాటు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసి కర్రలతో అలంకరించారు. అదే విధంగా తాడ్వాయి – పస్రా మార్గంలో దుర్గం గుట్టను పర్యాటకులు సందర్శించి ఆహ్లాదం పొందేలా ఏర్పాట్లు చేశారు. తాగునీటి వసతి, గుట్టపై నుంచి అడవులను తిలకించేందుకు మంచెలు నిర్మించారు. వీటితోపాటు తాడ్వాయి హట్స్‌లో అచ్చం అడవి జంతువుల మాదిరి బొమ్మలను ఏర్పాటు చేశారు. తద్వారా మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులు ఈ అటవీ అందాలను వీక్షించే అవకాశం కల్పించారు. మేడారం జంక్షన్లకు నూతన కళ.. ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో పలు జంక్షన్లను బొమ్మలు, శిల్పాలతో అలంకరిస్తున్నారు. ఊర ట్టం స్తూపం వద్ద, హరిత హోటల్ క్రాస్, ఐలాండ్ ప్రదేశం, బస్టాండ్ ప్రదేశాల్లో జంక్షన్లు నిర్మిస్తున్నారు. ఇవి భక్తులకు ఆకర్షణీయంగా కనిపించేలా ప్రత్యేక శిల్పాలు, జంతువుల బొమ్మలతో పాటు ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించే బొ మ్మలు ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా జంక్షన్లు నిర్మిస్తున్నా రు. ఆదివాసీ సంప్రదాయాలు, జీవన విధానం ప్రతిబింబించేలా బొమ్మల రూపకల్పనతోపా టు లైటింగ్, మొక్కలతో జంక్షన్లు తీర్చిదిద్దితున్నారు. కాగా,జంక్షన్ల అలంకరణతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతితోపాటు సాంస్కృతిక వైభవం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ జంతువుల బొమ్మల ఏర్పాటు -
క్యాథ్‌లాబ్‌లో సాంకేతిక లోపం
ఎంజీఎం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలు రోగులకు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. గ్యాస్ట్రో, న్యూరో సర్జరీ, న్యూరోఫిజీషియన్ విభాగాలు ఉన్న ఈ ఆస్పత్రిలో కనీసం రోగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక లోపంతో క్యాథ్లాబ్ సేవలు కూడా రెండు రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో కార్డియాక్ ఓపీ ఉండే రోజులు కాకుండా.. మిగతా రోజుల్లో అవసరమున్న హృద్రోగులకు క్యాథ్‌లాబ్‌లో అంజియోగ్రామ్, స్టంట్ చికిత్సలు అందించేవారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మందిని గురువారం రాత్రి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సహకారంతో నిమ్స్‌కు తరలించారు. రూ.45 లక్షల మరమ్మతు నిధుల పెండింగ్.. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలోని క్యాథ్లాబ్ పరికరాన్ని మరమ్మతులు చేయించేందుకు ఏఏంసీ (సంవత్సర కాలం నిర్వహణ)ని ప్రభుత్వం సంవత్సరానికి రూ.30 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు క్యాథ్లాబ్ సర్వీస్ చేసే సదరు కంపెనీకి 6 నెలలకోమారు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 18 నెలలుగా కంపెనీకి రూ.45 లక్షల బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం పరికరం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరికరాన్ని మరమ్మతు చేయకపోవడంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనం ఓపీ సేవలకు మాత్రమే పరిమితమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్యాథ్లాబ్ పరికరాన్ని త్వరగా మరమ్మతు చేయాలని రోగులు కోరుతున్నారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో నిలిచిన అంజియోగ్రామ్ పరీక్షలు ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన రోగులను నిమ్స్‌కు తరలింపు 18 నెలలుగా ఏఎంసీ నిధులు చెల్లించని ప్రభుత్వం -
సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ తొలగిస్తాం
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: సత్ప్రవర్తనతో జీవిస్తే రౌడీషీట్ నుంచి పేరు తొలగిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కమిషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లతోపాటు అనుమానుతులపై ఉన్న షీట్లను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వు పత్రాలను అందజేశారు. సత్ప్రవర్తనతో జీవిస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించిన 19 మందిలో 5గురు రౌడీ షీటర్లు, 12 మంది అనుమానితులు, ఒకరు కేడీ, ఒకరు డీసీని రౌడీ షీట్ల నుంచి పేర్లను తొలగిస్తూ సీపీ ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం ఎలాంటి జీవితం గడుపుతున్నారని రౌడీ షీటర్లను అడిగి తెలుసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడడంతో మీపై రౌడీ షీట్లను ఓపెన్ చేశామని, ప్రస్తుతం మీ ప్రవర్తన బాగుందని విచారించిన అనంతరం షీట్లను తొలగించామని, భవిష్యత్‌లో ఇలాగే జీవించాలన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్‌రాజు, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సంజీవ్, మల్లయ్య పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్‌కు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ దోహదం
భవిష్యత్‌లో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. ఒక సబ్ స్టేషన్లో ఏదైనా లోపం తలెత్తినా, ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా మెయింటెనెన్స్ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేస్తాం. తద్వారా వినియోగదారులకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుంది. కర్నాటి వరుణ్ రెడ్డి , సీఎండీ , టీజీ ఎన్పీడీసీఎల్ -
ఇక.. ఇక్కట్లకు చెక్
హన్మకొండ : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ మెరుగైన, నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్ స్టేషన్లు, 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్ల అనుసంధానం చేస్తోంది. నిరంతర విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంటర్ లింకింగ్ ప్రక్రియ చేపట్టింది. దీని ద్వారా విద్యుత్ వ్యవస్థ బలోపేతం కానుంది. ఇందులో భాగంగా ఒక సబ్ స్టేషన్ నుంచి మరో సబ్ స్టేషన్ మధ్య విద్యుత్ లైన్లు అనుసంధానం చేస్తున్నారు. అదే విధంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఫీడర్ల మధ్య అనుసంధానం చేస్తున్నారు. దీంతో ప్రధాన లైన్లో సమస్య ఉత్పన్నమైతే వెంటనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు. 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు.. టీజీ ఎన్పీడీసీఎల్ వ్యాప్తంగా 16 సర్కిళ్ల పరిధిలో 269 ఇంటర్ లింకింగ్ పనులు చేపట్టాలని ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 164 పనులు పూర్తయ్యాయి. మిగతా 105 పనులు వేగంగా సాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 57 ఇంటర్ లింకింగ్ పనుల లక్ష్యం విధించుకోగా ఇప్పటి వరకు 27 పూర్తయ్యాయి. ఇంకా 30 పనులు జరుగుతున్నాయి. హనుమకొండ సర్కిల్లో మొత్తం 6 ఇంటర్ లింకింగ్ పనులకు ఒకటి మాత్రమే పూర్తి కాగా 5 పురోగతిలో ఉన్నాయి. వరంగల్ సర్కిల్లో మొత్తం 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 9 పూర్తికాగా 6 పనులు కొనసాగుతున్నాయి. జనగామలో 13 ఇంటర్ లింకింగ్ పనులకు 10 పూర్తయ్యాయి. మూడు పనులు సాగుతున్నాయి. భూపాలపల్లి సర్కిల్లో 15 ఇంటర్ లింకింగ్ పనులకు గాను 3 పూర్తి కాగా మరో 12 పనులు పురోగతిలో ఉన్నాయి. మహబూబాబాద్ సర్కిల్లో 8 ఇంటర్ లింకింగ్ పనులకు 4 పూర్తికాగా, మరో 4 పనులు పురోగతిలో ఉన్నాయి.ఇంటర్ లింకింగ్‌తో విద్యుత్ అంతరాయాలకు బ్రేక్.. ప్రకృతి వైపరీత్యాలు, నిర్వహణ సమయంలోనూ నిరంతర సరఫరా ఒక సబ్ స్టేషన్లో సరఫరా నిలిచిపోతే మరో సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్.. 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో వేగంగా కొనసాగుతున్న పనులు -
మరిన్ని విజయాలు సాధించాలి
హన్మకొండ: అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో టీజీ ఎన్పీడీసీఎల్ 2026లో మరిన్ని విజయాలు సాధించాలని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డిని కంపెనీ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంలు, జీఎంలు, అధికారులు, సంఘాలు, అసోసియేషన్లు నాయకులు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ వరదల సమయంలో సిబ్బంది తెగింపు అనిర్వచనీయమన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సి.ఈ లు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, వెంకటరమణ, అన్నపూర్ణ, సురేందర్, కె.మాధవరావు, ఎన్. శ్రవణ్ కుమార్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీ శ్రీకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
పులి పయనం ఎటు వైపు?
కొత్తగూడ: పులి అడుగులు రోజు ఓ చోట కనిస్తుండడంతో ఆ జంతువు పయనం ఎటు వైపునకు సాగిందని అధికారులు అంచనాకు రాలేక పోతున్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి బీట్ పరిధిలోని రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా పులి పయనాన్ని అంచనా వేయడం కోసం ఎఫ్డీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రేంజ్ అధికారులు అడవుల్లో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో పూనుగొండ్ల సెక్షన్ పరిధిలో కర్నె గండి అటవీ ప్రాంతంలో గురువారం పాదముద్రలు గుర్తించారు. దీంతో కర్నెగండి నుంచి రేణ్యతండా వైపుకు వెళ్లిందా..? లేక రేణ్యతండా నుంచి కర్నెగండి వైపునకు వచ్చిందా? అనే అంశం నిర్ధారించలేకపోతున్నారు. ఆరు నెలలుగా ఇక్కడే ఉందా? ఆరు నెలలుగా ఓటాయి, పూనుగొండ్ల సెక్షన్ పరిధి అటవీ ప్రాంతంలోనే పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఈ అడవిలో సంబంధిత అధికారులు జూపార్కుల్లో ఉన్న వన్య ప్రాణులను వదిలారు. ఈ వన్య ప్రాణులను వేటాడడం పులికి సులభమవుతుందని, సరిపోను ఆహారం లభించడంతో ఇక్కడే ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.ఆందోళన వద్దు.. జాగ్రత్తగా ఉండాలి అటవీ గ్రామాల ప్రజలు పులి సంచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి. అడవిలోకి సాదు జంతువులను మేతకు తీసుకెళ్లొద్దు. అలాగే, ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దు. పులి సంచారం గమనించినా.. జంతువులను వేటాడినట్లు గుర్తించినా వెంటనే సమాచారం అందించాలి. –చంద్రశేఖర్, ఎఫ్డీఓ అంతుచిక్కని టైగర్ సంచారం.. అడవులను జల్లెడ పడుతున్న అధికారులు పూనుగొండ్ల బీట్ పరిధిలో పులి అడుగులు గుర్తింపు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
పుట్టిన రోజే మృత్యుఒడికి.. లింగాలఘణపురం: పుట్టిన రోజే ఓ యువకుడు మృత్యుఒడికి చేరాడు. రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో కొత్త సంవత్సరం రోజు కుటుంబంతోపాటు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని గుమ్మడవెల్లి కాలనీకి చెందిన దడిగ రమణకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రవికుమార్(20) ఉన్నాడు. ప్రస్తుతం రవికుమార్ జనగామలో ఓ షాపులో పని చేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. కాగా, నవాబుపేటకు చెందిన ఓ యువకుడు గ్రామంలో తనతో కొందరు గొడవ పడుతున్నారని, మీ స్నేహితులను తీసుకుని రావాలని జీడికల్‌కు చెందిన మిత్రుడు నరేశ్‌కు ఫోన్ చేశాడు. దీంతో అతను జీడికల్ నుంచి తన ట్రాలీలో కొంత మంది స్నేహితులను తీసుకుని గుమ్మడవెల్లి కాలనీకి వచ్చాడు. ఇక్కడ రవికుమార్‌తో పాటు మరికొందరిని తీసుకుని నవాబుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత గుమ్మడవెల్లి బస్టాండ్ వద్ద వాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో రవికుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. కాగా, చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన కుమారుడు ప్రస్తుతం కుటుంబానికి ఆసరా అవుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తూ బాలుడు.. రఘునాథపల్లి: న్యూ ఇయర్ కేక్ కోసం వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో చోటుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. మండలంలోని శ్రీమన్నారాయణపురం గ్రామానికి చెందిన పరికిబండ రమ్య కుమారులు రంజిత్‌కుమార్, రాజ్‌కుమార్ (14) బుధవారం రాత్రి న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కొనుగోలు చేసేందుకు కాలినడకన నిడిగొండ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రఘునాథపల్లికి వెళ్లేందుకు వాహనాలను లిఫ్ట్ అడుగుతుండగా ఓ ద్విచక్రవాహనం వేగంగా వచ్చి రాజ్‌కుమార్‌ను ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. న్యూఇయర్ వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బైక్ చెట్టును ఢీకొన్న ప్రమాదంలో యువకుడు.. బచ్చన్నపేట : బైక్.. చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని సాల్వాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చీర్ల వెంకటేష్ (36) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు పాలు పితకడానికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ చెట్టును ఢీకొని గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్ ఘటనా స్థలికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు.న్యూ ఇయర్ వేళ తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. -
దర్గా వద్ద జెండా ఎత్తుతుండగా..
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి ● మరొకరికి తీవ్రగాయాలు ● కాళేశ్వరంలో ఘటనకాళేశ్వరం : మొక్కులు చెల్లించుకోవడానికి సంతోషంగా వచ్చిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దర్గాలో చోటు చేసుకుంది. ఎస్సై తమాషారెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఎం.ఏ. మజీద్ (32), మహమ్మద్ సమీరుద్దీన్‌తోపాటు మరికొంత మంది ముస్లింలు కాళేశ్వరంలోని మజీద్‌పల్లి దర్గా వద్ద మహ్మద్ షా వలీ జన్మదిన వేడుకల్లో (సందల్) పాల్గొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో దర్గా వద్ద జెండా ఎక్కించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇనుప పైపునకు జెండాను బిగించి పైకి ఎత్తుతున్న సమయంలో ఆ పైపు..పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న ఎం.ఏ. మజీద్, మహమ్మద్ సమీరుద్దీన్‌కు విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిని వెంటనే స్థానికులు మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఎం.ఏ.మజీద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమీరుద్దీన్‌ను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి కుమారుడు ఉన్నాడు. మృతుడి సోదరుడు మీర్జా అహ్మద్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కొత్త సంవత్సరం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. -
సీనియర్ వాలీబాల్ తెలంగాణ జట్టు హెడ్ కోచ్‌గా కృష్ణప్రసాద్
గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కోసరి కృష్ణప్రసాద్ మరోసారి జాతీయ వేదికపై తెలంగాణ జట్టుకు హెడ్ కోచ్‌గా మెరవనున్నారు. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరగనున్న సీనియర్ జాతీయ వాలీబాల్ తెలంగాణ జట్టుకు ఆయన హెడ్ కోచ్‌గా నేతృత్వం వహించనున్నారు. వాలీబాల్ క్రీడను గ్రామం నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లాలనే సంకల్పంతో పదేళ్లుగా తెలంగాణ వాలీబాల్ జట్టుకు సేవలందిస్తున్నారు. దీంతో రాబోయే జాతీయ పోటీల్లో తెలంగాణ జట్టు విజయం సాధించాలని గ్రామస్తులు, క్రీడాభిమానులు ఆకాంక్షించారు. అలాగే, కృష్ణప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, కృష్ణప్రసాద్ శిక్షణలో 80 మంది యువకులు, 45 మంది యువతులు పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఎస్టీ హాస్టల్లో విద్యార్థిపై దాడి ● అర్ధరాత్రి వచ్చి కొట్టిన బయటి వ్యక్తి ● కొడకండ్ల మండల కేంద్రంలో ఘటన ● వార్డెన్ పర్యవేక్షణాలోపంపై తల్లిదండ్రుల ఆగ్రహం కొడకండ్ల: జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర హాస్టల్లో ఓ విద్యార్థిని హాస్టల్‌కు సంబంధం లేని ఓ యువకుడు లోపలికి వచ్చి చితకబాదాడు. ఈమేరకు బాధిత విద్యార్థి గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బోడోనికుంట తండాకు చెందిన ధరావత్ ప్రభాకర్ అనే విద్యార్థి మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతూ ఎస్టీ హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రించేందుకు మంచాల వద్దకు వెళ్లాడు. 9వ తరగతి విద్యార్థులు బయటికి వెళ్లగా ఎందుకు వెళ్లారని, నిద్రించాలని ప్రభాకర్ వారికి సూచించి అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పాకాల గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మద్యం మత్తులో హాస్టల్ గదికి వచ్చి ప్రభాకర్‌ను కొట్టి బూతులు తిట్టి చంపేస్తానని బెదిరించాడు. ఈమేరకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. వార్డెన్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. ఎస్టీ హాస్టల్ వార్డెన్ మల్లునాయక్ విద్యార్థుల యోగక్షేమాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సొంత మండలంలో విధులు నిర్వర్తిస్తూ చుట్టపుచూపులా వచ్చిపోతుంటాడని, వార్డెన్ నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం పిల్లలను హాస్టల్లో ఉంచితే వారికి భద్రత కరువైందని, బయటి నుంచి వచ్చి విద్యార్థిని కొడితే కూడా పట్టించుకొనేవారే కరువయ్యారని ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ముగిసిన క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు కేయూ క్యాంపస్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈస్ట్‌జోన్ గోల్డ్ కప్ క్రికెట్ పోటీల లీగ్మ్యాచ్లు ముగిశాయి. గురువారం వరంగల్, సూర్యాపేట జట్లు తలపడగా వరంగల్ సాధించింది. ఈ క్రికెట్ పోటీలకు ముఖ్యఅతిథిగా హనుమకొండ రోహిణి ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్ రామ్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. కాగా, నేడు సెమీఫైనల్ మ్యాచ్‌లలో హనుమకొండ, కొత్తగూడె– భద్రాద్రి, పెద్దపల్లి –ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఆరెండు జట్లలో గెలిచిన జట్లు ఈనెల 3న ఫైనల్లో తలపడుతాయని నిర్వాహకులు తెలిపారు. -
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
● మానుకోట చుట్టూ ఐదు జాతీయ రహదారులు ● ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు ఎన్‌హెచ్‌లు ● కొనసాగుతున్న మూడు రహదారుల పనులు ● పూర్తయితే ప్రధాన పట్టణాలకు ప్రయాణం సులభంరహదారుల వలయంసాక్షి, మహబూబాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ పట్టణం ఏటేటా విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రంగా మారిన మానుకోట చుట్టూరా ఇప్పుడు ఐదు జాతీయ రహదారుల వలయం ఏర్పడుతోంది. ఈ రహదారులు దేశంలోనే ప్రధాన పట్టణాలతో అనుసంధానం అవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రయాణం సులభతరం అవుతుంది. నూతన సంవత్సరంలో పనులు పూర్తయి రహదారులన్నీ అందుబాటులోకి రావాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా నుంచి వెళ్తున్న ఐదు జాతీయ రహదారులు.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు వారధిగా ఉన్న మహబూబాబాద్ జిల్లా మీదుగా ఐదు జాతీయ రహదారులు వెళ్తాయి. హైదరాబాద్ నుంచి నకిరేకల్ మీదుగా జిల్లాలోని మరిపెడ ప్రాంతంలో పారంభమయ్యే 365 జాతీయ రహదారి జిల్లా కేంద్రం నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట మీదుగా ములుగు జిల్లాలోని మల్లంపల్లికి వెళ్తోంది. ఈ రహదారి అందుబాటులో ఉంది. జగిత్యాల నుంచి కరీంనగర్, వరంగల్ మీదుగా జిల్లాలోని తొర్రూరులో ప్రారంభమయ్యే 563 జాతీయ రహదారి మరిపెడ నుంచి ఖమ్మం జిల్లాలోని మరో జాతీయ రహదారికి అనుసంధానం అవుతుంది. ఇక హైదరాబాద్ గౌరవల్లి నుంచి జిల్లాలోని పెద్దవంగరలో ప్రారంభమయ్యే 930–పీ జాతీయ రహదారి జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్, బయ్యారం మీదుగా ఇల్లెందు, భద్రాద్రికొత్తగూడెం వెళ్తుంది. ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కోదాడ మీదుగా వచ్చే 365–ఏఏ జాతీయ రహదారి ఖమ్మం జిల్లా మీదుగా జిల్లాలోని సీరోలు మండలంలో ప్రారంభమై.. కురవి మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి–365తో అనుసంధానం అవుతుంది. ఈ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. అదే విధంగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే 163–జీ నాగ్‌పూర్ నుంచి జిల్లా మీదుగా విజయవాడ ద్వారా చైన్నె హైవేకు అనుసంధానం అవుతుంది. ఈ రోడ్డు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ప్రధాన మార్గం వెళ్తున్న మానుకోట జిల్లాకు అందుబాటులో ఉన్న రెండు జాతీయ రహదారులతో పాటు.. నిర్మాణంలో ఉన్న మూడు జాతీయ రహదారులు పూర్తి అయితే ప్రధాన పట్టణాలకు ప్రయాణం సులభతరం అవుతుంది. ప్రధానంగా జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, చైన్నెతో పాటు తిరుపతి, వేములవాడ, భద్రాచలం పుణ్యక్షేత్రాలకు ప్రయాణం సులభం అవుతుంది. అదే విధంగా జిల్లాలో పండించే తేజా రకం మిర్చి, పసుపు, సన్నరకం ధాన్యం, డిజైనింగ్ టైల్స్ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం, ఇతర ప్రాంతాల్లోని సరుకుల జిల్లాకు దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. -
సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరులో ఉన్న కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్స్లో ఈనెల 3 నుంచి 6 వరకు జరగనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఎంపికై ందని స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో జి.మోహన్‌దాస్, వి.శివరామ్, బి.వెంకటేశ్, కె. విశాల్ ఆదిత్య, కె.శ్రితిన్, జె.అనిరుధ్, కె.తులసినాఽథ్ ఉన్నారు. ఈ జట్టుకు హనుమకొండ వాగ్దేవి కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎ.నాగరాజు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. -
చేతులెత్తేసిన కాంట్రాక్టర్..
● రెండున్నర నెలలుగా కోడి గుడ్లకు దూరమైన అంగన్వాడీ పిల్లలు ● బ్లాక్ లిస్ట్‌లో కాంట్రాక్టర్ పేరు ● ఎట్టకేలకు మళ్లీ టెండర్ ప్రకటనమహబూబాబాద్: గతంలో శాఖల వారీగా కోడిగుడ్ల సరఫరాకు టెండర్ ప్రక్రియ ఉండేది. అయితే ప్రస్తుతం ఇంటిగ్రేడ్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా మొత్తానికి గుడ్ల సరఫరా కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆరుగురు దరఖాస్తు చేసుకోగా.. వారిలో ఎల్వన్లో గుడ్డు ధర రూ.5.33కు టెండర్ చేసిన జేబీ పౌల్ట్రీఫాం యజమానికి ఆమోదం తెలిపారు. అయితే ఆ ధరకు సరఫరా సాధ్యం కాదని సదరు కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. దీంతో అధికారులు ఆ కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకున్నారు. కాగా టెండర్ ప్ర క్రియ మధ్యలో నిలిచిపోవడంతో అంగన్వాడీ పిల్ల లు రెండున్నర నెలలుగా గుడ్డుకు దూరమయ్యారు. జిల్లాలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు.. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లులు 3,604మంది, ఏడు నెల నుంచి మూడుసంవత్సరాల లోపు పిల్లలు 20,295 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 16,181 మంది ఉన్నారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలకు (టీహెచ్ఆర్ కింద) నెలకు 16 గుడ్లు, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతీ నెల 25 గుడ్లు, గర్బిణులు, బాలింతలకు కూడా ప్రతీ నెల 25చొపున కోడి గుడ్లు ఇస్తున్నారు. రెండున్నర నెలలుగా బంద్.. ప్రతీ నెల అంగన్వాడీ కేంద్రాలకు 2,50,000 గుడ్లను కాంట్రాక్టర్ సరఫరా చేసేవారు. పాత కాంట్రాక్టర్ సరఫరా గడువు జూలై 2025తో ముగిసింది. అయితే, తన గడువు పెంచడంతో ఈఏడాది అక్టోబర్ 15 వరకు గుడ్ల సరఫరా చేశారు. ఆ తర్వాత నుంచి రెండున్నర నెలలుగా సరఫరా లేక పిల్లలు గుడ్డుకు దూరమయ్యారు. ఇంటిగ్రేడ్ కాంట్రాక్టర్ విధానం ప్రకారం టెండర్.. టెండర్ ప్రాసెస్‌కోసం సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఈఓ, డీడబ్ల్యూఓ, మైనార్టీశాఖ అధికారి, డీటీడీఓ అధికారులు ఉన్నారు. కాగా, గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 30నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చారు. కోళ్ల ఫాంల యజమానులు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం అదే నెల 13వ తేదీ నుంచి డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎట్టకేలకు టెండర్ పూర్తి.. ఎట్టకేలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఆరుగురు పౌల్ట్రీ ఫాం యజమానులు టెండర్ వేశారు. ఇందులో జేబీ పౌల్ట్రీఫాం యజమాని తన టెండర్లో ధర రూ 5.33 కు గుడ్డు సరఫరా చేస్తానని కోట్ చేశారు. దీంతో అధికారులు ఆయన టెండర్‌ను ఆమోదించారు. ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ ఆ ధరకు కోడి గుడ్లు సరఫరా చేయలేనని చేతులెత్తేశాడు. దీంతో ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాలకు సమస్య తలెత్తి గుడ్ల సరఫరా కావడం లేదు. మిగిలిన వాటికి తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి సరఫరా చేస్తున్నారు. కాగా స దరు కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఈఎండీ రూ.10లక్షలు ఆయనకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కమిటీకి తలనొప్పి.. కోడిగుడ్ల సరఫరా కమిటీకి తలనొప్పిగా మారింది. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కాగా టెండర్ ప్రక్రియ జరిగితేనే అంగన్వాడీ పిల ్లలకు గుడ్ల సరఫరా జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు నెలరోజుల సమయం పడుతుంది. ఆలోపు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. టెండర్ ప్రకటన విడుదల.. ఎట్టకేలకు డిసెంబర్ 31(బుధవారం)న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున జిల్లా కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో గుడ్ల సరఫరా ఇ–టెండర్ విడుదల చేశారు. జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠఽశాలలు, కళాశాలలకు కోడిగుడ్ల సరఫరా టెండర్ ప్రకటన విడుదల చే శారు. పౌల్ట్రీ ఫాం యజమానులు దరఖాస్తు చేసుకోవాలని ఆ టెండర్లో ఉంది. దాని ప్రకారం ప్రాసెస్ ఫీజు రూ.10,000, ఈఎండీ కింద రూ.9,96,363 డీడీ ఇవ్వాల్సి ఉంది. -
కలెక్టర్‌కు న్యూ ఇయర్ శుభాకాంక్షలు
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు గురువారం టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాగబ్రహ్మచారి, వెంకటేశ్వర్లు, సురేష్, ఉద్యోగులు పాల్గొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బందికి పతకాలు అభినందించిన ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవా పతకం /సేవా పతకాలకు ఎంపికయ్యారు. జిల్లా నుంచి ఉత్తమ సేవా పతకానికి కె.పూర్ణచందర్ (ఏఆర్ ఎస్సై), ఎన్.నాగేశ్వర రావు (హెడ్ కానిస్టేబుల్, డీసీఆర్బీ)ఎంపికయ్యారు. అలాగే సేవా పతకానికి వి.విజయప్రతాప్ (ఏఆర్ డీఎస్పీ), ఎండీ.అలీంహుస్సేన్ (మహబూబాబాద్ టౌన్ ఎస్సై), డి.రామయ్య (వీఆర్ ఎస్సై), పి.రాజు (దంతాలపల్లి ఎస్సై), జె.వెంకటేశ్వర్లు (ఏఆర్ ఎస్సై), ఎ.బుచ్చిరెడ్డి (ఏఆర్ ఎస్సై), జి.యాదగిరి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), జి.చక్రపాణి (ఏఆర్ హెడ్ కానిస్టేబుల్), టి.ఇందిర (డబ్ల్యూపీసీ, డీసీఆర్బీ) ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ పతకాలు సాధించిన అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ, భవిష్యత్‌లో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజల సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణమహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ చేతుల మీదుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు జాతీయ భద్రతా అవగాహన మాసోత్సవాలు జరుగుతాయన్నారు. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. మాసోత్సవాల తేదీల ప్రకారం తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. కార్యక్రమంలో ఎీస్పీ శబరీష్, ఆర్టీఓ జైపాల్‌రెడ్డి, ఎంవీఐ సాయిచరణ్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల తొర్రూరు రూరల్: తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు కమిషనర్ శ్యాంసుందర్ చెప్పారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఓటర్లు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ మేనేజర్ కట్టస్వామి, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. మద్యం విక్రయాల జోరు● మూడు రోజుల్లో రూ.17.58 కోట్ల అమ్మకాలు మహబూబాబాద్ రూరల్ : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరి మూడు రోజుల్లో రూ.17.58 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు గురువారం తెలిపారు. సోమవారం రూ.7.13 కోట్లు, మంగళవారం రూ.4.40 కోట్లు, బుధవారం రూ.6.05 కోట్ల మేరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు వరంగల్ పట్టణంలోని ఎకై ్సజ్ శాఖ డిపో నుంచి మద్యం వ్యాపారులు కొనుగోలు చేసిన నివేదికల ద్వారా తెలిసింది. -
విశాలంగా..సులభంగా..
● మేడారం క్యూలైన్ డిజైన్‌లో మార్పు ● భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలుఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని హంగులతో ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు క్యూలో ఇబ్బందులు పడకుండా అధికారులు ఎత్తు, వెడల్పు పెంచారు. ఈ సారి అధికారులు పెద్ద ఎత్తున క్యూలైన్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ద్వారా మ్యాపింగ్ చేయించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు నేరుగా క్యూలైన్ వద్దకు వెళ్లేలా మ్యాపింగ్ చేయించారు. మరొక దారి బస్టాండ్ నుంచి వచ్చే భక్తులు క్యూలైన్‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉన్న క్యూలైన్ మాదిరిగానే ఈ సారి కూడా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఎత్తు ఎక్కువగా, విశాలంగా ఉండేలా పందిళ్లను ఏర్పాటు చేసి లైన్లను మరిన్ని పెంచారు. దీంతో ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడకుండా విశాలంగా, విరివిరిగా దర్శనానికి వెళ్లేలా సులభమైన మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ దర్శనానికి కూడా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా.. మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను విశాలంగా చేయడంతో ఒకేసారి వేలాది మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసిపోకుండా వెంటవెంటనే దర్శనం చేయించే విధంగా ప్రవేశం, బయటకు వెళ్లే ప్రదేశాలను మరి ంత విస్తరిస్తున్నారు. దీంతో వేలాది మంది భక్తులు దర్శించుకొని ఒకేసారి బయటకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో క్యూలైన్లలో ఒత్తిడి, రద్దీ తగ్గనుంది. బెల్లం(బంగారం) కౌంటర్లు ఏవీ? అమ్మవార్లకు సమర్పించిన బంగారం (బెల్లం) ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు గద్దెల వద్ద పడిగాపులు పడుతున్నారు. బెల్లం ప్రసాదాన్ని స్వీకరించడానికే ఎక్కువ సమయం భక్తులు కేటాయించడంతో గద్దెల ప్రాంగణంలోనే భక్తులు నిలిచిపోవాల్సి వస్తోంది. దీంతో గంటల తరబడి భక్తులు గద్దెల చుట్టూ గుమికూడడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు గద్దెల వద్దకు వచ్చేందుకు ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తే భక్తుల రద్దీ ఉండదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి జాతరలోనైనా ప్రసాదం (బెల్లం) పంపిణీ కౌంటర్లను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని వనదేవతలను దదగురువారం భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. అనంతరం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం, గాజులు, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు పూజలు నిర్వహించినట్లు భక్తులు తెలిపారు. పూజారుల చేతుల మీదుగా నుదట బొట్టు పెట్టించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో వంటలు చేసుకుని భోజనాలు చేశారు. -
వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు బుధవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద భక్తులు స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద జంపన్న గద్దె వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను దర్శించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం ప్రాంతంలోని చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. -
మున్సి‘పాలిటిక్స్’
సాక్షి, మహబూబాబాద్: గ్రామ పంచాయతీ ఎన్ని కల సందడి ముగిసింది. ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్, ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో తమ బలం నిరూపించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్తోపాటు, బీజేపీ నాయకులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. పోటాపోటీగా సమావేశాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సంకేతాలు రావడంతో జిల్లాలోని ప్రధాన పార్టీల్లో సందడి మొదలైంది. మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల వారీగా పార్టీ నాయకులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మానుకోట నియోజకవర్గంలోని మహబూబాబాద్, కేసముద్రం అభ్యర్థుల ఎంపిక విషయంపై స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి రిజర్వేషన్ ఏదైనా కావచ్చు.. మీరు మాత్రం సిద్ధంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా కేసముద్రం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆశావహులు స్థానిక నాయకులు, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డితో కలిసి వెళ్లి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది. డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల అభ్యర్థుల ఎంపిక విషయంపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ముఖ్య కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తొర్రూరు మున్సిపాలిటీలో తమ వర్గం నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ నాయకులు ఝాన్సీరెడ్డి కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. బీఆర్ఎస్లో మొదలైన సందడి.. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరవేయడం కోసం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన కేటీఆర్ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం, అందరు కలిసికట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేయాలని జిల్లా నాయకులకు హితవు చెప్పారు. దీంతో తమ వర్గాలకు చెందిన నాయకులను కౌన్సిలర్లుగా బరిలో దింపి గెలిపించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఐదు మున్సిపాలిటీల నుంచి ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్లు ప్రచారం. ఇదులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రులు రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తమ అనుచరులతో మున్సిపల్ ఎన్నికల విషయంపై చర్చించినట్లు ప్రచారం. రిజర్వేషన్లపై చర్చ.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న అన్ని పార్టీల నాయకులు రిజర్వేషన్‌పై చర్చ జరుగుతోంది. అయితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా.. రొటేషన్‌లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠనే.. అదే విధంగా మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై సంక్రాంతి తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదలైన మున్సిపల్ ఎన్నికల సందడి వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికకు సమాయత్తం రిజర్వేషన్లకు అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా సమావేశాలు -
రైతులందరికీ యూరియా అందిస్తాం
దంతాలపల్లి: రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని తొర్రూరు ఆర్డీఓ గణేశ్ అన్నారు. మండల కేంద్రంలోని యూరియా పంపిణీ కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఎంత యూరియా నిల్వ ఉంది.. రైతులకు ఏ మేరకు అందుతుందనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. యూరియా విషయంలో రైతులను ఎవరు ఇబ్బంది పెట్టినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్‌కుమార్, ఏఓ వాహిని, తదితరులు ఉన్నారు. యూరియా పంపిణీని పరిశీలించిన ఏడీఏ బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదికలో యూరియా పంపిణీని బుధవారం ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ యూరియా అందిస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ దీపిక, ఏఓ రాజు, ఎస్సై తిరుపతి, ఇల్లెందు ఏఎంసీ వైస్‌చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేశాఖ వరాలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం (క్రూ లాబీ) కేంద్రంగా పని చేస్తున్న రన్నింగ్ స్టాఫ్ లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు న్యూ ఇయర్ కానుకగా వరాలు కురింపించారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయానికి కొత్తగా 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల సంఖ్యను పెంచుతూ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే అధికారులు, రైల్వే నాయకులు తెలిపారు. 16 మందికి గూడ్స్ లోకో పైలెట్ల నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వీరిలో ఏడుగురికి ప్యాసింజర్ లోకో పైలెట్‌గా పదోన్నతి కల్పిస్తూ 9 మందిని సికింద్రాబాద్ నుంచి ప్యాసింజర్ లోకో పైలెట్‌గా కాజీపేటకు బదిలీ చేసినట్లు తెలిపారు. కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం నుంచి పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ లోకో పైలెట్ల పోస్టుల ఇండెంట్ మంజూరు చేయాలని 3 ఏళ్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్చించి వినతి పత్రాలు అందజేసినట్లు రైల్వే నాయకులు తెలిపారు. గతంలో కాజీపేట నుంచి విజయవాడకు తరలించిన క్రూ లింక్‌లను లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లను తిరిగి కాజీపేటకు తీసుకురావాలని అనేక సార్లు డీఆర్ఎం, జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆశించినట్లుగా లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టుల కేటాయింపు జరగలేదని రైల్వే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న పోస్టులు ఇవ్వలేదు..కాజీపేట రైల్వే క్రూ లాబీలో ఉన్న ఖాళీ పోస్టులను మంజూరు చేయాలని అనేకసార్లు రైల్వే సికింద్రాబాద్ అధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. కాజీపేటలో డ్యూటీ చేసే వారికి కాజీపేటలోనే పదోన్నతి కల్పించాలి. బదిలీల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలి. మిగతా ఖాళీలను భర్తీ చేయాలి. – పాక రాజ్‌కుమార్, కాజీపేట రైల్వే సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ 130 మంది లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టులు మంజూరు 16 మందికి పదోన్నతులు 3 ఏళ్ల ఎదురు చూపులకు దక్కిన బదిలీల ఫలితం ఆనందంలో రైల్వే లోకో పైలెట్ల స్టాఫ్ -
కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
మహబూబాబాద్ రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ పరిశీలకులు పోట్ల నాగేశ్వరరావు, కూచన రవళిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశా రు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నా యకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు. అంకితభా వం, అనుభవం, ప్రజా సేవ కలిగిన వారిని గుర్తించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, అధికార ప్రతినిధులు తదితర కీలక పదవులను పార్టీ శ్రేణుల నుంచి దరఖాస్తులు స్వీకరించి భర్తీ చేయనున్నామని తెలిపారు. జిల్లా కార్యవర్గంలో మహిళలకు 20 నుంచి 30 శాతం మేరకు పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. వ్యక్తుల కోసం కాదని పార్టీ కోసం పని చేసే వారికి జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని కార్యకర్తలకు భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్లకాలంలో బలప్రయోగం ద్వారా ఎన్నికలు జరిగా యని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యయుతంగా, ఎలాంటి బలప్రయోగం లేకుండా జీపీ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమ, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనకయ్య, అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, మానుకోట, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, బానోత్ రాంబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
మేఘనారాణి, భావన మృతదేహాలను తీసుకొస్తాం
గార్ల: అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలోని అలబామ లోయలో కారు పడిన ఘటనలో మృతి చెందిన గార్ల, ముల్కనూరు గ్రామాలకు చెందిన మేఘనారాణి, భావన మృతదేహాలను త్వరలో ఇండియా తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడానని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. బుధవారం గార్ల, ముల్కనూరు గ్రామాలకు చెందిన మృతులు పుల్లఖండం మేఘనరాణి, కడియాల భావన ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించారు. మేఘనారాణి, భావన మృతదేహాలను అతి త్వరలో ఇండియాకు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి కోరన్నారు. దీంతో సీఎం రేవంత్.. ఇద్దరి యువతల మృతదేహాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మృతుల తల్లిదండ్రులు మాట్లాడుతూ అమెరికా లోని తానా స్వచ్ఛంద సహకారంతో మృతదేహాలను ఇండియాకు పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తమకు తెలిసిందన్నారు. సోమ, మంగళ వారాల్లో మృతదేహాలు గార్లకు రానున్నట్లు అమెరికాలోని తమ బంధువులు ఫోన్ ద్వారా తెలిపినట్లు వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఏఎంసీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దనియాకుల రామారావు, టి. కృష్ణగౌడ్, సర్పంచ్‌లు బానోత్ పార్వతి హథీరాం, గంగావత్ రాంసింగ్, సి.హెచ్. వెంకట్రావ్, భద్రు, బి. మోతీలాల్, మాజీ జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
అయ్యో.. అమ్మ!
● వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ● అక్కడికక్కడే దుర్మరణం..పరకాల బస్టాండ్‌లో ఘటన పరకాల: పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్తున్న బస్సు వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా పల్సాబ్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట రాధమ్మ(70) తన మనవరాలు ప్రసవించడంతో బంధువులతో కలిసి చెన్నాపూర్ బయలుదేరింది. పరకాల బస్టాండ్‌కు చేరుకుని భూపాలపల్లి వైపు వెళ్లే బస్సు ఎక్కడానికి ముందు బయట పండ్లు తీసుకునేందుకు వెళ్తోంది. ఈ సమయంలో వరంగల్– 2 డిపో బస్సు బస్టాండ్‌లోకి వెళ్లే క్రమంలో వృద్ధురాలిపై నుంచి దూసుకెళ్లగా అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు కేకలు వేస్తూ విగతజీవిగా మారిన వృద్ధురాలిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ బస్సుతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
పర్యాటకుల స్వర్గధామం ములుగు..
ఎస్ఎస్ తాడ్వాయి : ములుగు జిల్లా పర్యాటకుల స్వర్గధామమని, ప్రకృతి అందాలతోపాటు చారిత్రాత్మక నేపథ్యం కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో నెలవై ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఈ మేరకు బుధవారం తాడ్వాయి మండల కేంద్రంలో ఎకో టూరిజం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్‌లోని తాడ్వాయి వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రేంజ్, తాడ్వాయి హట్స్, రెండు సఫారీ వాహనాలను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. అధికారులతో కలిసి సఫారీ వాహనంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ రేంజ్లో పర్యటించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు తాడ్వాయి హట్స్‌ను ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ రహదారికి పక్కన 6 హట్స్, 18 కిలోమీటర్ల మేర సఫారీ చేయడానికి 2 వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌కు సుమారు 250 కిలోమీటర్లు, హనుమకొండకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను చూడడానికి పర్యాటకులు విచ్చేయాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఎఫ్డీఓ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
యువతి ప్రేమను తిరస్కరించిందని..
● మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య పర్వతగిరి: యువతి ప్రేమను తిరస్కరించిందని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమళ్ల గ్రామ శివారు కొత్తతండాకు చెందిన రామావత్ రాకేశ్ (19) కొద్ది రోజులుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె రాకేశ్ ప్రేమను తిరస్కరించింది. మూడు రోజుల క్రితం మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, రాకేశ్ తల్లి ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. రాకేశ్ మృతితో తండాలో విషాదం నెలకొంది. -
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశయాలు‘పారే నది. వీచే గాలి. మండే నిప్పు. రుతువులకు అనుగుణంగా మారే ఆకాశం. చర్యలకనుగుణంగా స్పందించే భూమి పంచభూతాలన్నింట్లో చలనం ఉంది. ఒక్క మనిషిలో తప్ప’ అని ఓ కవి అన్నట్లుగా రుతువులు మారుతున్నాయి. కాలాలు పరిగెడుతున్నాయి. మరి మనం ఎక్కడున్నాం? ఈ కొత్త వత్సరంలోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లా యువత ‘నూతన’ ప్రణాళికతో ముందుకు సాగాలి. విజయాన్ని బానిసగా మార్చుకోవాలి. – హన్మకొండ కల్చరల్యువత లక్ష్యం వైపు గురి పెట్టాలి. రాష్ట్రంలో త్వరలో పోలీస్ కానిస్టేబుల్, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల సాధించాలన్న లక్ష్యం ఏర్పరుచుకుని ఇప్పటినుంచే నిరంతరం ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పట్టుదలతో చదివి ఉద్యోగాలను సృష్టించుకోవాలి. మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించేలా ఎదగాలి. ఏఐ వచ్చాక ఉద్యోగాలన్నీ కృత్రిమ మేధతో నిండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలు ఎవరివ్వాలి. అలా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి. గతంలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ షోలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు రూ.కోటి గెలుచుకున్నాడు. ఏడాది తిరగకముందే మళ్లీ రూ.8 వేలకు మళ్లీ టీచర్‌గా ఉద్యోగంలో చేరాడు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఏ ఉపాధ్యాయుడు చెప్పని ఆర్థిక పాఠాలు ఎవరికి వారే నేర్చుకోవాలి. చాలా మంది శక్తికి మించిన ఖర్చు చేస్తూ.. ఈఎంఐల పేరిట జీవితాలను చిన్న చిన్న ఉద్యోగాలకు తాకట్టు పెడుతున్నారు. వీలైనంత పొదుపు చేస్తూ పెట్టుబడుల వైపు మళ్లితే భవిష్యత్ భద్రంగా ఉంటుంది. ‘గ్రంథాలయాల్లో మిడిల్ ఏజ్, ఓల్డేజ్ పీపుల్ మాత్రమే కనిపిస్తున్నారు. మరి యువతరం ఎక్కడుంది అని పరిశీలిస్తే.. నిద్ర మత్తులో, సెల్ఫోన్లలో, టీవీల ఎదుట మునిగిపోయింది’ అని ఓ మాజీ ఐపీఎస్ అధికారి దిగ్భాంతి వ్యక్తం చేశారు. యువత ఫోన్లను, సామాజిక మాధ్యమాలను కాస్త దూరం పెట్టి గ్రంథాలయాల వైపు చూడాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నవారంతా పుస్తకాలు చదివిన వారే. తల దించి నన్ను చూడు. తల ఎత్తుకునేలా నేను చేస్తాశ్రీ అంటుంది పుస్తకం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది యువత ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూ మోసపోతున్నారు. ఆన్లైన్ ఆర్థిక నేరాల్లో మోసపోతున్న వారు అత్యధికంగా యువకులు, ఉన్నత విద్యావంతులు. అధికారులే. సోషల్ మీడియాలో తెలియని లింకులు ఓపెన్ చేస్తూ.. ఇష్టారీతిన ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతున్నారు. డిజిటల్ యుగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవితాల్లో వెలుగులు నింపాలి సాక్షి, మహబూబాబాద్: ప్రపంచంలో అన్నింటి కన్నా విలువైనది కాలం. అందుకోసమే కాలం ఎవరికోసం ఆగదు. పాత సంవత్సరానికి వీడ్కోలు.. కొత్త సంవత్సరానికి స్వాగతం ప్రతీ ఏటా జరిగేదే. చిన్నతనంలో అమ్మానాన్నలతో, తర్వాత ఫ్రెండ్స్‌తో సంబురాలు జరుపుకుంటాం. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు. ఇతర వ్యాపారాలు ప్రారంభించే వారు.. మొదటి రోజు నుంచే ప్రణాళికతో శ్రమించాలి. విజయం తప్పక సాధిస్తారు. ప్రధానంగా ఆరోగ్య విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. – పి.శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్ కొత్త సంవత్సరం ప్రారంభమైన రెండో నెలలో ఇంటర్, మార్చిలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. జిల్లానుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకుంటారు. సిలబస్ పూర్తయి రివిజన్లు చేసుకోవాలి. పరీక్షలకు కొంత సమయమే ఉంది కాబట్టి మరోసారి రివిజన్లు చేసుకుంటూ షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. అప్పుడే చదివింది గుర్తుండి పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ బాల్య స్నేహితులు. ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. కానీ సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఆరాధ్యుడయ్యాడు. వినోద్ కాంబ్లీ అపరిచితుడుగా మారిపోయాడు. సచిన్ విజయానికి కారణం క్రమశిక్షణ. మంచి వ్యక్తిత్వం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఎప్పటికై నా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయని నేటి యువత గ్రహించాలి. వ్యాయామం మన ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇన్నిరోజులు బద్ధకంగా ఉన్నా కొత్త సంవత్సరంలోనైనా వ్యాయామం చేయాలన్న నిర్ణయం తీసుకుని అమలు చేయాలి. అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలి నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలి. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నా. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవాలి. నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త దనం సంతరించుకోవాలి. మొదలు పెట్టిన ప్రతీ పని విజయవంతం కావాలి. జిల్లా ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్(రెవెన్యూ), మహబూబాబాద్ ప్రణాళిక.. కార్యరూపం.. క్షేత్రస్థాయి శ్రమ అన్నింటినీ సమన్వయం చేసుకుంటే అద్భుత విజయం ఉమ్మడి వరంగల్ జిల్లా యువతలో నయా జోష్ -
కలర్స్ లేక కళావిహీనం..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క తల్లి కొలు వుదీరిన చిలకలగుట్టకు ప్రత్యేక ఉంది. జాతర సమయంలో అమ్మవారిని చిలకలగుట్టపై నుంచి డోలువాయిద్యాలతో పూజారులు అంగరంగవైభంగా మేడారంలోని గద్దైపెకి తీసుకొస్తారు. ప్రభు త్వ గౌరవ వందనాలతో సమ్మక్క తల్లికి స్వాగతం పలుకుతారు. ఇంత గొప్ప ప్రాచుర్యం కలిగిన చిలకల గుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన ఆదివాసీ చి త్రాలకు నేటి వరకూ రంగులు(కలర్స్) వేయలేదు. ఫలితంగా ఆ చిత్రాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ చిత్రాలకు రంగులు వేస్తారా? లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రహరీపై రంగులు వెలసిన ఆదివాసీ చిత్రాలు చిలకలగుట్ట ప్రహరీపై గత జాతరలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివాసీ చిత్రాలు ఏర్పాటు చేసి రంగులు వేశారు. రెండేళ్ల కాలంలో చిత్రాలు రంగులు వెలసిపోయి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. జాతర అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. ఆది వాసీ చిత్రాలకు రంగులు వేసేందుకు నిర్లక్ష్యం ఎందుకుని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో జాతర మేడారం జాతర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో నే జరుగుతుంది. కానీ ఆ శాఖ అధికారులు మా త్రం జాతరపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివాసీ సంస్కృతికి పెద్దపీట వేయాల్సిన అధికారులు జాతర నిర్వహణపై శ్రద్ధ చూపడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా చిత్రాలకు రంగులు వేయాలని కోరుతున్నారు.చిత్రాలకు రంగులు వేయడంలో నిర్లక్ష్యం మేడారం చిలకలగుట్ట ప్రహరీపై ఏర్పాటు చేసిన చిత్రాలకు నేటి వరకూ రంగులు వేయకపోవడం గిరిజన సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ప్రహరీపై గతంలో వేసిన చిత్రాల రంగులు వెలిసిపోయాయి. ఇప్పటికై నా స్పందించి వెంటనే చిత్రాలకు రంగులు వేయాలి. కొప్పుల రవికుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలగుట్ట ప్రహరీపై వెలిసిపోయి కనిపిస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల చిత్రాలు జాతర సమీపిస్తున్నా రంగుల ఊసేలేదు.. పట్టించుకోని గిరిజన సంక్షేమ శాఖ -
ఓటాయి ప్రాంతంలో పులి సంచారం
● తోడు కోసం జిల్లాలు దాటి తిరుగుతున్న టైగర్ కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ రేంజ్ పరిధిలోని ఓటాయి బీట్ అటవీ ప్రాంతంలో అధికారులు బుధవారం పులి ఆనవాళ్లు గుర్తించారు. ఇటీవల ములుగు జిల్లా పరిధిలో సంచరించిన పులి.. అక్కడ నుంచి తోడు కోసం వెతుకుతూ ఓటాయి బీట్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో పులి ఎదకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పులి అడవి మొత్తం తిరగడం సహజమని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, పులి.. ఓటాయి అటవీ ప్రాంతంలో ఆరు నెలల క్రితం జంగవానిగూడెం గ్రామానికి చెందిన రైతుకు చెందిన దుక్కిటెద్దును చంపింది. మళ్లీ రేణ్యతండా సమీప అటవీ ప్రాంతంలోని వాగులో పులి పాదముద్రలు గుర్తించి న పశువుల కాపరులు.. అటవీ శాఖ అధికా రులకు సమాచారం అందించగా వారు వెళ్లి పాదముద్రలు సేకరించారు. వీటి ఆధారంగా ఆడపులి అయి ఉండొచ్చనే అంచనాకు వ చ్చినట్లు సమాచారం. కాగా, సమీప గ్రామా ల రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
విద్యార్థులు.. గజగజ
మహబూబాబాద్ అర్బన్: రోజురోజుకూ చలి తీవత్ర పెరుగుతుండడంతో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాయంత్రం 4గంటల నుంచే చల్ల టి గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. అదేవిధంగా తెల్లవారుజాము నుంచే మంచు కురుస్తోంది. కాగా ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. గదులకు తలుపులు సరిగ్గా లేక, కిటికీలకు రెక్కలు లేక చలి నేరుగా గదిలోకి వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. సరైన దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నారు. ఉన్న కొద్దిపాటి దుప్పట్లతోనే సర్దుకుపోతున్నారు. చన్నీటి స్నానాలు.. జిల్లాలోని వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి తోడు దోమలు స్వైర విహారంతో వారికి కంటిమీద కునుకు లేకుండాపోతోంది. చలికి తోడు చన్నీళ్ల స్నానాలతో జలు బు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాలు, కేజీబీవీలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వేడి నీళ్లు లేకపోవడంతో చన్నీటి స్నానం చేయాలంటే జంకుతున్నారు. జిల్లాలో వసతి గృహాల వివరాలు.. జిల్లాలో 19 ఎస్సీ హాస్టళ్లలో 1,878మంది విద్యార్థులు ఉన్నారు. 34 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ హాస్టళ్లలో 8,861మంది, 14 బీసీ హాస్టళ్లలో 1,300మంది, 6 మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2,970మంది, 6 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 3,440మంది, 16ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6,059 మంది, 5 మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1,129మంది, 16 కస్తూర్బాగాంధీ విద్యాలయాల వసతి గృహాల్లో 3,391మంది, 8 మోడల్ స్కూల్ కళాశాలల వసతి గృహాల్లో 760మంది విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం కిటికీలు, తలుపుల మరమ్మతులకు రూ.లక్షలు నిధులు మంజూరయ్యాయి. కానీ నేటికీ మరమ్మతులు మాత్రం చేయించలేదు. విద్యార్థులు తమ బాధలను చెప్పుకుందామన్నా.. పలువురు హాస్టల్ వార్డెన్లు స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. స్థానికంగా ఉండని వార్డెన్లు.. ప్రభుత్వ నింబంధనల ప్రకారం సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు వసతి గృహాల్లోనే రాత్రి బస చేయాలి. కానీ పలు హాస్టళ్ల వార్డెన్లు రాత్రి వేళల్లో బస చేయకుండా వరంగల్, హనుమకొండ వంటి పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా మానుకోట జిల్లా కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో రాత్రి వేళ దొంగలు దూరి విద్యార్థుల ఫోన్లు, దుప్పట్లు, దుస్తులు, డబ్బులు ఎత్తుకెళ్తున్నారు. ఈ విషయంపై విద్యార్థులు వార్డెన్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. అలాగే పలు హాస్టళ్ల విద్యార్థులు రాత్రి వేళ మద్యం, సిగరెట్లు తాగుతున్నారు. బయటి నుంచి ఎవరు ఎప్పుడు వస్తున్నారో అర్థం కావడం లేదని, దీంతో చాలా మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తుకు బానిసలవుతున్నారని తోటి విద్యార్థులు చెబుతున్నారు. గిరిజన హాస్టల్లో నేలపై నిద్రిస్తున్న విద్యార్థులు రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత కిటికీలు, తలుపులకు రెక్కలు కరువు స్థానికంగా ఉండని వార్డెన్లు -
విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో జనగామ సర్కిల్ రఘునాథపల్లి సబ్ డివిజన్ నర్మెట సెక్షన్లో పనిచేస్తూ మృతి చెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ బానోత్ రాజు సతీమణి నీలకు న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీకి చెందిన బీమా రూ.25 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా నీలకు ఉద్యోగం కల్పించాలని సీఎండీని కోరగా సానుకూలంగా స్పందించారని విద్యుత్ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి .తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, ఎస్ఈలు, తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి మహాజాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, పీఓ చిత్రామిశ్రాతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తుల క్యూలైన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. మహాజాతరలో రెప్పపాటు సమయం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగొద్దన్నారు. భక్తులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా రహదారులకు ఇరువైపులా బోర్లు, చేతి పంపులు, రహదారుల జంక్షన్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతకుముందు కాల్వపల్లి –ఊరట్టం బీటీ నిర్మాణ పనులు, ఊరట్టం– కొండాయి రోడ్డు పనులు, గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో వెంకటేష్, డీఎస్పీ రవీందర్ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష -
గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో వేతనాలివ్వాలి
కాళేశ్వరం: రాష్ట్రంలోని అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రకారం దేవాలయాల నుంచి వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ అద్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. అర్చక, ఉద్యోగుల సమస్యలపై జనవరి 2న వరంగల్‌లో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి రావాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో తమ సమస్యలు 40శాతం పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యల పరిష్కార దిశగా రెండు దఫాలుగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు. ఆయన దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తామన్నారు. 121 జీఓను రద్దు చేసి 577 జీఓను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేవస్థానం సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, శరత్చంద్రతోపాటు అర్చక, ఉద్యోగులు పాల్గొన్నారు. అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ -
1న వరంగల్ మార్కెట్‌కు సెలవు
వరంగల్: ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం రోజు గురువారం (జనవరి 1, 2026)న గుమస్తా, దడవాయి, హమాలీ, వ్యాపారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ – ఇండస్ట్రీస్ కోరిక మేరకు వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం మంగళవారం ప్రకటనలో తెలి పారు. సెలవు నేపథ్యంలో మార్కెట్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవని తెలిపారు. శుక్రవారం మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. యార్డు బంద్ ఉన్నా 1వ తేదీన (గురువారం) జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తారని మల్లేశం తెలిపారు. పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ● తొమ్మిది మంది అరెస్ట్.. రూ.1,86,020 స్వాధీనం ● మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్హసన్పర్తి: గోపాలపురంలో నిర్వహిస్తున్న ఓ పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్, కేయూసీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. గోపాలపురంలోని చింతల రాజు ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్, కేయూ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాడుతున్న గోపాలపురానికి చెందిన చింతల రాజు, పిట్టల రామ్మోహన్, పిట్టల ప్రవీణ్, సీతంపేటకు చెందిన డి. వీరస్వామి, హనుమకొండ భవానీనగర్‌కు చెందిన గొట్టిముక్కుల రవికుమార్, హుస్నాబాద్‌కు చెందిన కారెపు శ్రీనివాస్, దేవన్నపేటకు చెందిన సూరం మల్లికార్జున్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కందారపు చంద్రమౌళి, భీమారానికి చెందిన లాలెల్లా శివప్రసాద్‌ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,86,020 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ మధుసూదన్ తె లిపారు. అలాగే, మూడు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు సీజ్ చేసినట్లు ఏసీపీ వివరించారు. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ బాబులాల్,ఎస్సై చందర్, వీరస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నకిలీ గన్‌తో బెదిరించి డబ్బుల డిమాండ్..● ఈ ఘటనలో నిందితుడి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు జనగామ రూరల్: నకిలీ గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై భరత్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఈనెల 28 తేదీన జనగామకు చెందిన మల్లిగారి సతీశ్ పట్టణంలోని ఓ లిక్కర్ మార్ట్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో రఘునాథపల్లి మండలం గబ్బెటకు చెందిన నిందితుడు ఇంజ ప్రశాంత్ నకిలీ గన్‌తో సతీ శ్ను బెదిరించి రూ. 5వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై బాధితుడు సతీశ్ ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టి మంగళవారం జనగామలో నిందితుడిని అరెస్ట్ చేసి అ తడి వద్ద నుంచి నకిలీ గన్ను స్వాధీనం చేసుకుని రి మాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కా గా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు కృష్ణ, సాగర్, చరణ్‌ను డీసీపీ, ఏసీపీ అభినందించారు. బావిలో పడి వ్యక్తి మృతి ఖిలా వరంగల్: చేద బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం ఆలస్యం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటకు చెందిన వీరసారపు గణేశ్‌కుమార్(40) ఎలక్ట్రీషియన్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన మద్యం సేవించి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం సాయంత్రం 6గంటల సమయంలో బయటకెళ్లి ఇంటికి రాలేదు. మంగళవారం ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని చేదబావిలో అతడి చెల్లికి చనిపోయి కనిపించాడు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతికి గల వివరాలు సేకరించి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని, ప్రమాదవశాత్తు కాలు జారి చేదబావిలో పడి మృతి చెంది ఉంటాడని మృతుడి భార్య సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
కామన్ మెస్‌లో అధిక బిల్లులు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కా మన్ మెస్‌లో బిల్లులు అధికంగా వచ్చాయని మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం తినకుండా ఆందోళన చేపట్టారు. ఒక్కో విద్యార్థికి జూలై బిల్లు రూ. 2,178, ఆగస్టులో రూ. 2,435 చొప్పున వేశారు. ఈ బిల్లులను ఈనెల 29న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ ప్రదర్శించారు. ఆగస్టులో 8 నుంచి 20వ తేదీ వరకు సెలవుల సందర్భంగా మెస్ నడపలేదని, 18 రోజులకే ఒక్కో విద్యార్థికి రూ. 2,435 బిల్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నెల మొత్తం ఒక్కో విద్యార్థికి రూ. రూ.2వేల వరకు రావాల్సిండగా 18 రోజులకే ఎక్కువ బిల్లు రావడం ఏమిటని, అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న హాస్టళ్లడైరెక్టర్ రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. జనవరి 3న రిజిస్ట్రార్ రామచంద్రం వద్ద ఈ బిల్లుల విషయంపై సమావేశం నిర్వహించి చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుపగా మధ్యాహ్నం 3 గంటలకు ఆందోళన విరమించి విద్యార్థులు భోజనం తిన్నారు. కాగా, కామన్ మెస్ వద్ద విద్యార్థులతో జనవరి 3న సమావేశం నిర్వహించనున్నట్లు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్ిపీ రాజ్‌కుమార్ మంగళవారం సర్క్యూలర్ జారీచేశారు. మెస్ బిల్లులు, మెస్‌లో మాల్‌ప్రాక్టీసెస్, టెండర్ నోటిఫికేషన్లపై చర్చించనున్నామని ఆయన పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థుల ఆందోళన రిజిస్ట్రార్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామన్న డైరెక్టర్ -
డెడ్‌లైన్ టెన్షన్..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం పనుల డెడ్‌లైన్ సమీపిస్తుడడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. డిసెంబర్ 31 లేదా జనవరి 5వ తేదీ కల్లా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, సీతక్క డెడ్‌లైన్ విఽధించిన విషయం తెలిసిందే. అలాగే, గద్దెల ప్రాంగణ పనులపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ వారంలో నాలుగు దఫాలుగా పనులను పరిశీలించి డెడ్‌లైన్ లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఏఈ నుంచి మొదలు.. కలెక్టర్ వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ క్రమంలో గద్దెల పునర్నిర్మాణ పనుల్లో కొన్ని పూర్తికాగా మరిన్ని డెడ్‌లైన్ నాటికి పూర్తయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. సాలహారం పనుల పూర్తిపై అనుమానాలు గద్దెల ప్రాంగణం చుట్టూ సాలహారం రాతి నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో డెడ్‌లైన్ నాటికి పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క వైపే ఈ పనులు పూర్తి కాగా మరో వైపు పిల్లర్ల స్థాయిలోనే ఉంది. ప్రహరీ నిర్మాణంతోపాటు 8 ఆర్చ్‌ల నిర్మాణం కోసం భారీ స్తంభాలను నిలిపారు. కానీ వాటిపై భీమ్‌లు నిలపడంతోపాటు ఆదివాసీ సంస్కృతి చిత్రాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఐరన్ గేట్లను కూడా అమర్చాల్సి ఉంది. ఈ పనులేవీ నేటి వరకు కాలేదు. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. అయితే రాళ్ల మధ్యలో సిమెంట్ పూతల పనులు ఇంకా పూర్తి కాలేదు. అమ్మవార్ల గద్దెల విసర్తణ పనుల్లో భాగంగా గద్దెల చుట్టూ కేవలం రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. పైన రాతి పిల్లర్లను నిలపడంతోపాటు గద్దెల చుట్టూ రాతి స్టోన్స్ డిజైన్ల ఏర్పాటు పనులు కూడా నేటి వరకూ కాలేదు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా పాయింట్ మంచెల పనులూ అంతే.. జాతరలో కవరేజ్ కోసం మీడియా పాయింట్ మంచెల నిర్మాణ పనులు ఇంకా స్లాబ్ స్థాయిలోనే జరుగుతున్నాయి. జాతరలో మీడియా కవరేజ్ కీలకం. గద్దెల పునర్నిర్మాణంలో భాగంగా మీడియా కవరేజ్, అధికారుల పర్యవేక్షణ కోసం సాలహారానికి అవతల వైపు రెండు, ఇవతల వైపు రెండు చొప్పున మీడియా పాయింట్ మంచెలు నిర్మిస్తున్నారు. ఈ పనులు ఒక మంచె రెండో స్లాబ్ వేయగా, మిగతా మూడు మంచెల నిర్మాణం పనులు మొదటి స్లాబ్ దిశలోనే కొనసాగుతున్నాయి. జాతరకు ముందుగా మంచెల నిర్మాణ పనులు పూర్తికావడం అనుమానంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతర గడువు సమీపిస్తున్న తరుణంలో చివరి నిమిషంలో తొందరపాటుతో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతరకు మిగిలింది 27 రోజులే. మేడారం జాతరకు ఇంకా 27 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. దీంతో భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం, బుధ, గురువారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలొస్తున్నారు. సంక్రాంతి సెలవుల సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి భక్తుల సంఖ్య లక్షల్లో పెరగనుంది. ప్రస్తుతం గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ మధ్యలో జీపీ సిమెంట్ పూయడంతో భక్తుల రద్దీ కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి నిరంతరం మేడారం పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు మహాజాతర నాటికి పూర్తయ్యేనా? -
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్‌లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మహబూబాబాద్: రైతులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం యూరియా పంపిణీపై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల ద్వారా అదనపు యూరియా అమ్మకాల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేనందున సవ్యంగా పంపిణీ చేయాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో రైతులకు యూరియా అందజేయాలన్నారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. యూరియా పంపిణీ విషయంలో పోలీసుల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కేంద్రాల వద్ద పక్కాగా క్యూలైన్లు, టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓ గణేష్, డీఏఓ విజయనిర్మల ఉన్నారు. యూరియా పంపిణీ పరిశీలనబయ్యారం: మండలంలో యూరియా పంపిణీని కలెక్టర్ ఆద్వైత్కుమార్సింగ్ మంగళవారం పరిశీలించారు. బయ్యారంలోని సొసైటీ, ఆగ్రోస్, కొత్తపేటలోని సొసైటీ ఎరువుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన ఆయన సిబ్బందితో మాట్లాడారు. యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ రాజు, సీఐ రవికుమార్ తదితరులు ఉన్నారు. -
ప్రాజెక్టు సర్వేకు వచ్చిన అధికారుల అడ్డగింత
గార్ల: మండలంలోని మున్నేరు ఏటి నీటిని పాలేరుకు తరలింపులో భాగంగా మంగళవారం కాల్వల నిర్మాణ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను దుబ్బగూడెం గ్రామంలో రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మున్నేరు నీటిని కాల్వల ద్వారా తన నియోజకవర్గం పాలేరుకు తరలిస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే పాలేరుకు నాగార్జునసాగర్, సీతా రామ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా సాగునీరు వస్తుందని, ఇంకా మున్నేరు నీటిని తరలించేందుకు ప్రయత్నించడం తగదన్నారు. దుబ్బగూడెం ప్రాంతంలో మున్నేరు ఏటిపై ప్రాజెక్టు కట్టి కాల్వల నిర్మాణం కోసం భూముల సర్వేకు వచ్చిన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులను అడ్డుకొని ఇక్కడి నుంచి పంపించామని చెప్పారు. కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి ప్రభుత్వంపై పోరాటాలు చే స్తామని రైతులు హెచ్చరించారు. మా నీళ్లు మాకు ఉపయోగపడకుండా, మా భూములను కోల్పోయి, పాలేరుకు నీళ్లు ఎందుకు ఇవ్వాలంటూ రైతులు అధి కారులను ప్రశ్నించారు. సర్వేను అడ్డుకున్న వారిలో సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాసరావు, రైతులు జాస్తి సత్యనారాయణ, జాస్తి సాగర్‌బాబు, జాస్తి రాజా, నాగేందర్‌బాబు, ఉదయ్‌కుమార్, సుజాత, వేజెళ్ల సుధాకర్, వై.పట్టాబి, బి. తేజ్యా, ఎన్.బాలు, బి.చందర్, కిషన్, వి.శ్రీను, బి.సరిలాల్ ఉన్నారు. కాల్వల కోసం తమ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన రైతులు -
100 రోజులు.. 41.28 టీఎంసీలు
నేటినుంచి యాసంగి పంటలకు సాగునీరు ● ఎల్ఎండీ నుంచి సరఫరాకు ఇరిగేషన్‌శాఖ సన్నద్ధం ● వారబందీ పద్ధతి అమలుసాక్షిప్రతినిధి, వరంగల్ : యాసంగి పంటలకు బుధవారం నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందనుంది. ఈ మేరకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌లో 9,48,114 ఎకరాల ఆయకట్టుకుగాను ఈ యాసంగిలో 5,29,726 ఎకరాలకు నీరివ్వాలని ఈ నెల 3న జరిగిన రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు 41.28 టీఎంసీల నీరు అవసరం ఉండగా.. వారబందీ (వారం రోజులు విడుదల, వారం రోజులు నిలుపుదల) పద్ధతిన స్థిరీకరించిన ఆయకట్టుకు నీటిని విడుదల చేయనున్నారు. వారం రోజులనుంచే హనుమకొండ, జనగామ, ములుగు, నర్సంపేట తదితర డివిజన్లలో అధికారులు నీటి విడుదల, నిర్వహణపై సమావేశాలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అతిథులుగా పాల్గొని పలు సూచనలు చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ఎల్ఎండీ నుంచి.. ఉమ్మడి వరంగల్‌లో నీటి లభ్యత ఉన్న జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల, ఎస్సారెస్పీ కాకతీయ కాలువ (దిగువ మానేరు), ఎస్సారెస్పీ స్టేజ్ – 2 ప్రాజెక్టులతో పాటు పాకాల, రామప్ప చెరువులు, లక్నవరం, మల్లూరువాగు, పాలెంవాగు ప్రాజెక్టుల నుంచి ఈ స్థిరీకరించిన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ నుంచి కాకతీయ కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌లోని ఎస్సారెస్పీ ఆయకట్టుకు విడుదల చేయనున్నారు. ‘స్కివం’ షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి నీటి విడుదలఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివం) మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం యాసంగి ఆయకట్టు సాగునీరు విడుదల చేస్తాం. ఎల్ఎండీ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు జోన్–1, జోన్–2లలో స్థిరీకరించిన ఆయకట్టుకు వారబందీ పద్ధతిన నీటి సరఫరా జరుగుతోంది. సాగునీరు వృథా కాకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. – పి.రమేష్, ఎస్ఈ, ఇరిగేషన్ సర్కిల్–2, కరీంనగర్ -
ప్రజలు సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నా రు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం (డిసెంబర్ 31), జనవరి ఒకటో తేదీన ఎలాంటి డీజే కార్యక్రమాలకు అనుమతిలేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షార్హులవుతారని, జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై కేకలు వేయడం, అతివేగంగా వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై క్రాకర్స్ కాల్చడం, కేకులు కట్ చేయడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించబోమని, ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కమిషన్ ఏర్పాటు చేయాలి తొర్రూరు: ఓసీల సమస్యల పరిష్కారానికి జాతీయస్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గోపు జయపాల్‌రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఓసీ జేఏసీ సమావేశం నిర్వహించారు. జనవరి 11న హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే ఓసీ ల సింహగర్జన బహిరంగ సభ పోస్టర్లను సంఘ నాయకులు ఆవిష్కరించారు. జేఏసీ నాయకుడు ముద్దం విక్రమ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. ఐదేళ్ల కాల పరిమితితో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ అర్హత మార్కులు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలన్నారు. సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ శ్రీనివాసరావు, నాయకులు నడిపల్లి వెంకటేశ్వరరావు, ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ రాజేందర్‌రెడ్డి, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, పొద్దుటూరి గౌరీశంకర్, తమ్మెర లక్ష్మీనరసింహరావు పాల్గొన్నారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అడిషనల్ సీపీ వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైం) శ్రీనివాస్ కుటుంబసమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని వారు కొనియాడారు. -
యూరియా కోసం రైతుల లొల్లి
కురవి: మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువుల దుకాణం వద్ద మంగళవారం యూరియా కోసం వచ్చిన రైతులు క్యూలో నిల్చొని పడిగాపులుపడ్డారు. కూపన్లు చేత పట్టుకుని రైతులు, మహిళా రైతులు క్యూలో బారులుదీరారు. యూరియా పంపిణీ సమయంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. యూరియా పంపిణీ వద్ద ఎలాంటి బందోబస్తు లేకపోవడంతో రైతులు ఒకరినొకరు నెట్టుకోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుల మధ్య లొల్లి జరగడంతో షాపు యజమాని యూరియా పంపిణీ చేయకుండా షాపు తలుపులు మూసివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏఓ నరసింహరావు ఎరువుల దుకాణం వద్దకు వచ్చి పరిశీలించారు. రైతుల మధ్య గొడవ జరగడంతో ఏఓ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, యూరియా పంపిణీ సక్రమంగా చేయాలని రైతులు కోరుతున్నారు. యూరియా కోసం క్యూ.. డోర్నకల్: మండలంలోని గొల్లచర్ల గ్రామ సమీపంలోని డోర్నకల్ పీఏసీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం యూరియా కోసం రైతులు క్యూ కట్టారు. గొల్లచర్ల, చిలుకోడు, వెన్నారం క్లస్టర్ల పరిధి రైతులు భారీ సంఖ్యలో పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ రాఘవరెడ్డి, సీఐ చంద్రమౌళి సమక్షంలో రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. యూరియా నమోదు కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ యాప్ పని చేయకపోవడంతో ఆఫ్‌లైన్ పద్ధతిన ఎరువులను పంపిణీ చేశారు. మరోవైపు డోర్నకల్‌లోనూ రెండు దుకాణాల్లో యూరియా పంపిణీ చేయగా.. బస్తాతో పాటు రూ.500 విలువైన ఇతర ఉత్పత్తులను అంటగట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చర్యలు
మహబూబాబాద్ రూరల్: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడం, పిల్లల రక్షణ, పునరావాసం, వారి హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తామని ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. బాలల భవిష్యత్‌ను కాపాడే దిశగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ పోస్టర్లను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మంగళవారం ఆవిష్కరించారు. జనవరి 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పోలీసు శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, చైల్డ్ లైన్ 1098 , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, షీ టీమ్స్, భరోసా కేంద్రం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర విభాగాలు సమన్వయంతో పని చేస్తాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ బాలుడు గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉన్నాడని, బాలల చిరునవ్వును కాపాడడమే ఆపరేషన్ స్మైల్ ప్రధాన లక్ష్యమన్నారు. బాల కార్మిక వ్యవస్థపై రాజీ పడేది లేదని, బాలకార్మికులను గుర్తించి రక్షించడం, బాధిత పిల్లలకు పునరావాసం కల్పించి పాఠశాలల్లో చేర్చడం, బాలల అక్రమ రవాణా, దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలు ఎవరైనా బాలకార్మికులు లేదా పిల్లలపై జరుగుతున్న అక్రమాలను గమనిస్తే వెంటనే చైల్డ్ లైన్ 1098 లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహన్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు అశోక్, డేవిడ్, చైల్డ్ లైన్, భరోసా, షీటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
వరంగల్ క్రైం: ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ స్మైల్ –12లో భాగంగా మంగళవారం కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పారిశ్రామిక ప్రాంతాలు, షాపుల్లో, ప్రమాదకర ప్రాంతాల్లో కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ద్వారా 339 బాలలను కాపాడి 26 ఎఫ్ఐఆర్లు, 160 ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వినోద, ఎన్సీఎల్పీ డైరెక్టర్ అశోక్ కుమార్, బాలల సంక్షేమ స మితి చైర్మన్లు ఉప్పలయ్య, వసుధ, సభ్యుడు పరికి సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారులు ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్. రవికాంత్, ఉమా, చైల్డ్ హె ల్ప్ లైన్ కోఆర్డినేటర్లు ఎస్. భాస్కర్, కల్పన, రవికుమార్, ఎస్సై సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. అధికారుల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి.. స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరును పోలీస్ ఉన్నతాధికారులు నిరంతం పర్యవేక్షించాలని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట డివిజన్ల సంబంధించిన పలు రికార్డులతోపాటు, గ్రీవెన్స్ ఫిర్యాదులు, రౌడీషీటర్ల వివరాలతో కూడిన ఫైళ్లను పరిశీలించి డీసీపీ దార కవితకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వరంగల్ ఏఎస్పీ శుభం, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా పాల్గొన్నారు. వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ -
నేడు కేయూ పాలకమండలి సమావేశం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించనున్నారు. 11 అంశాలను పాలకమండలి సమావేశంలో చర్చించనున్నారని సమాచారం. ప్రధానంగా కొంతకాలం క్రితం యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా 46 మంది అధ్యాపకులకు ఇంట ర్వ్యూలు నిర్వహించి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులకు సంబంధించి పాలకమండలి చర్చించి ఆమోదించనున్నారు. యూనివర్సిటీలో ఆరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు వెకెన్సీలుగా ఉన్నా యి. అయితే సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించేందుకు రాత పరీక్ష నిర్వహించాలా లేక సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలా అనే అంశం పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. సూపరింటెండెంట్లకు రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతులు కల్పించాలని యూనివర్సిటీ అధికారులు యోచించగా దానిని సూపరింటెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. కేయూలో రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల వెకెన్సీలు చూపుతున్నారని సమాచారం.అయితే అందులో వివిధ విభాగాల్లోని వెకెన్సీల భర్తీ విషయంలో రోస్టర్ ఫిక్స్ చేసే అంశంపై కూడా పాలకమండలిలో చర్చించనున్నారని తెలి సింది. కేయూ ఫార్మసీ కాలేజీలో ముగ్గురు రిటైర్డ్ ప్రొఫెసర్లకు సంబంధించి మూడు ఎండోమెంట్ల లెక్చర్ల ఏర్పాటునకు ఇటీవలే పలవురు యూనివర్సిటీకి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున డబ్బులు చెల్లించారు. ఎండోమెంట్ లెక్చర్ల ఏర్పాటుకు కూడా పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల విభాగంలోని కాన్ఫిడెన్షియల్ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలకమండలి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, ఉన్నత విద్యా కమిషనర్ శ్రీదేవసేన, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొనబోతున్నారు. అధ్యాపకుల పదోన్నతులకు ఆమోదం లభించే అవకాశం! -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట, వరంగల్ మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్–వికారాబాద్ (07460) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేట, వరంగల్‌కు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, రాయన్‌పాడ్, ఖమ్మం, వ రంగల్, కాజీపేట, సికింద్రాబాద్, లింగంపల్లిలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 9, 11వ తేదీల్లో వి కారాబాద్–పార్వతీపురం (07461) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 10వ తేదీన పార్వతీపురం–వికారాబాద్ (07462) వీక్లి ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట, వరంగల్ మీ దుగా ప్రయాణిస్తాయి. ఈ రైళ్లకు లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడు, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. జనవరి 8వ తేదీన సికింద్రాబాద్–పార్వతీపురం (07464) వీక్లి ఎక్స్‌ప్రెస్, జనవరి 9వ తేదీన పార్వతీపురం–సికింద్రాబాద్ (07465) వీక్లి ఎక్స్‌ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తుంది. ఈ రైలుకు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడ్, ఏలూరు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవాసల, విజయనగరం, బొబ్బిలిలో హాల్టింగ్ కల్పించారు. ఈ ప్రత్యేక రైళ్లకు సోమవారం నుంచి రిజర్వేషన్ టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. టిప్పర్ టైర్ల దొంగల అరెస్ట్ నర్సంపేట రూరల్ : టిప్పర్ టైర్లను అపహరిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట పీఎస్‌లో నిందితుల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. నర్సంపేట మండలం లక్నెపల్లికి చెందిన గొర్రె కృష్ణంరాజు గత నెల 10వ తేదీన గ్రామ శివారులోని ఇసుక డంప్ వద్ద టిప్పర్ నిలిపి ఉంచాడు. అర్ధరాత్రి దుండగులు ఆ టిప్పర్ నాలుగు టైర్లను అపహరించడంతో బాధితుడు నర్సంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం గురిజాల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సమయంలో బొలెరోలో నాలుగు టైర్లను గూడూరు నుంచి వరంగల్‌కు తరలిస్తుండగా పట్టుకుని టైర్లతోపాటు బొలెరో, బైక్‌ను స్వాధీనం చేసుకుని నలుగురు సోడా రాజశేఖర్, మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, బుడిగబోయిన ఉదయ్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు గూడ అరణ్, రవి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● భట్టుపల్లి రోడ్డులో ఘటన ఖిలా వరంగల్: రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న ఓ బైక్.. ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ మిల్స్‌కాలనీ పీఎస్ పరిధిలోని ఉర్సుగుట్ట భట్టుపల్లి రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లికి చెందిన ప్రవీణ్‌యాదవ్ (25) హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం బైక్‌పై వరంగల్ వెళ్లి పని పూర్తయిన అనంతరం సాయంత్రం భట్టుపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో రెడీమిక్స్ ప్లాంట్ వద్ద కరీమాబాద్‌కు చెందిన గొట్టె కుమారస్వామి బైక్‌పై రాంగ్రూట్లో వచ్చి ప్రవీణ్‌యాదవ్‌ను ఢీకొనగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిల్స్‌కాలనీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి బాషబోయిన ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. -
అభివృద్ధి అంతంతే..
నిర్మాణ దశలోనే కార్యాలయాలు.. సాక్షి, మహబూబాబాద్ : జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రారంభించింది. అయితే గతంలో ప్రారంభించిన పనుల పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఏడాదిలో పూర్తవుతాయని భావించిన ప్రభుత్వ కార్యాలయా ల భవనాల నిర్మాణాల్లో పురోగతి లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. మొదటి విడత 10,651 ఇళ్లు మంజూరు చేయగా.. ఇందులో 9,858 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.. కొత్త ఉద్యోగుల రాక.. గతంలో నిర్వహించిన గ్రూప్స్ నియామకాల ప్రక్రియ ఈ ఏడాది పూర్తి చేశారు. దీంతో జిల్లాకు 160 మంది గ్రూప్–4 ఉద్యోగులతో పాటు, గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల్లో ఎంపికై న ఉద్యోగులు కొలువుదీరారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత కొంత మేరకు తీరింది.శిలాఫలకాలకే పరిమితం.. కేసముద్రం ప్రాంతానికి మహర్దశ పట్టింది. మండల కేంద్రంగా ఉన్న కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. ప్రభుత్వ పాలిటెక్నినిక్ కళాశాల మంజూరు, రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ పట్టణంలో జూలై 8వ తేదీన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో పాటు, ఆరుగురు మంత్రులు రూ.400కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ ఏడాది కొత్తరేషన్ కార్డులు, పేదలకు సన్నబియ్యం మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మెడికల్ కళాశాల హాస్టల్ భవనం ప్రారంభం పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మొదటి స్థానం రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో నిర్మాణానికి అడుగులు!నూతనంగా ఏర్పడిన జిల్లాలో అనేక మార్పులు వచ్చాయి. ఈమేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణం సాగుతోంది. అయితే ఇందులో బాలికలు, బాలుర హాస్టల్ భవనాలను మాత్రం రాష్ట్రవైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఇక మున్సిపల్, పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయినా.. వినియోగంలోకి రాలేదు. కేసముద్రానికి మహర్దశ -
బతుకుదెరువుకు వెళ్లి దుర్మరణం..
● ముంబయిలో లింగాలఘణపురం వాసి మృతి ● 20 అంతస్తుల భవనంపై సీన్ బిల్లులు లెవల్ చేస్తుండగా ఘటన లింగాలఘణపురం: బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లిన జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన సుక్క సత్యనారాయణ (39) ఆదివారం రాత్రి 20 అంతస్తుల భవనంపై నుంచి పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సు మారు ఇరవై ఏళ్లుగా ముంబయిలో ఉంటున్న సత్యనారాయణ.. కూ లీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు వారీగా సత్యనారాయణ, రజిత దంపతులు తమ కుమారుడు చందుతో కలిసి ఘాట్కోపర్ ప్రాంతంలో ఒకే చోటకు సీన్ బిల్లలు పెట్టే పనికి వెళ్లారు. 20 అంతస్తులు భవనంపై సీన్ బిల్లులు పెట్టిన అనంతరం స త్యనారాయణ వాటిని లెవల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జరుగుతూ వెనుక ఉన్న ప్లంబింగ్ పైపులు వెళ్లే రంధ్రంలో పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రజిత, కుమారుడు చందు బోరున విలపించారు. ఇక తమకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించారు. ఇదిలా ఉండగా ఇరవై ఏళ్ల క్రితం ఇదే గ్రామానికి చెందిన దయ్యాల నర్సయ్య కూడా ముంబాయిలోనే కూలీ పని చేస్తూ దుర్మరణం చెందాడు. గ్రామాల్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ వివిధ ఘటనల్లో చనిపోతుండడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. -
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
జనగామ రూరల్: అన్ని రకాల పెండింగ్ బిల్లులను మంజూరు చేసి వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలో రెండు రోజులపాటు నిర్వంచిన రాష్ట్ర విద్యా సదస్సు సోమవారం ముగిసింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఎన్జీఓల జోక్యం నిరోధించాలని, శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్‌లు, (ఉన్నతి, ఎఫ్ఎల్ఎస్, లక్ష్య, ఎఫ్ఆర్ఎస్) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యా బోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ గురుకులాల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గాభవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్‌రెడ్డి, డి.సత్యానంద్, జి.నాగమణి, కె.రంజిత్ కుమార్, ఎస్.మల్లారెడ్డి, జి.శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్‌రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగుజయప్రకాశ్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ముగిసిన రాష్ట్ర విద్యాసదస్సు -
గ్రామాలకు నిధులు కేటాయించాలి
డోర్నకల్: గ్రామ పంచాయతీలుగా మారిన గిరిజన తండాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించాలని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 600 గిరిజన తండాలు, ఆవాసాలు ఉన్న డోర్నకల్ నియోజకవర్గంలో గిరిజనులు కష్టపడి సంపాదించిందంతా విద్య, వైద్యానికే ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తండా గ్రామపంచాయతీలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించి అదనపు ఆదాయం కల్పించాలని కోరారు. డోర్నకల్‌లో 50 పడకల, కురవిలో 30 పడకల ఆస్పత్రులు నెలకొల్పాలని, మున్సిపాలిటీల్లో ప్రమాదకరంగా మారిన కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా కోతులతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు మహాబూబాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి నాగేశ్వర్రావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సోమవారం యూరియా పంపిణీ, యాప్‌పై కలెక్టర్లు, అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు జిల్లాల్లో ఫర్టిలైజర్ యాప్ విజయవంతమైందన్నారు. యూరియా సరఫరాలో రైతులకు ఎలా ంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధి కారులను ఆదేశించారు. పంపిణీని కలెక్టర్లు ప ర్య వేక్షించాలన్నారు. ఎలాంటి సమస్యలు తలె త్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. పర్యవేక్షణ లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. వీసీ లో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, డీఏఓ విజయ నిర్మల ఉన్నారు. దివ్యాంగులకు వివాహ నగదు ప్రోత్సాహకం మహబూబాబాద్: దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందజేస్తోందని డీడబ్ల్యూఓ సబిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన దివ్యాంగులు వివాహం జరిగిన సంవత్సరంలోపే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాన్నారు. ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకంమహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని, పంట మార్పిడితో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాలను శాస్త్రవేత్తలు, అధికారుల బృందం సందర్శించి సోమవారం రైతులకు మిరప, కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలు, ఆయిల్ పామ్‌లో అంతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూడిద బూజు తెగులు, ఎండు తెగులు, తెల్లదోమ, పేను బంక, తదితర రసం పీల్చే వాటి నుంచి ఉద్యాన పంటలను సకాలంలో సంరక్షించుకోవాలని తెలిపారు. శాస్త్రవేత్తలు సురేష్, సాయికృష్ణనిఖిల్, ప్రశాంత్ ఉన్నారు. -
పంట పొలాల్లో పులి పాదముద్రలు
● పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన ములుగు రూరల్: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం పందికుంట పంట పొలాల్లో పులి సంచారం సోమవారం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ అధికారి డోలి శంకర్ మాట్లాడుతూ భూపాలపల్లి అటవీ ప్రాంతం నుంచి ములుగు మండలం జాకారం సమీపంలో ఆదివారం రాత్రి సమయంలో పెద్దపులి రోడ్డు దాటుతున్న సమయంలో 108 డ్రైవర్ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారని తెలిపారు. ములుగు, అబ్బాపూర్, జాకారం, పందికుంట బీట్లలో అటవీశాఖ అధికారులు బీట్ టీంలతో కలిసి పులి జాడను పరిశీలించారు. పందికుంట శివారులో మిర్చి తోటలో పులి పాదముద్రలు గుర్తించామన్నారు. మదనపల్లి, జగ్గన్నపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, పంచోత్కులపల్లి, రాయినిగూడెం, సర్వాపూర్ గ్రామ శివారులో పులి సంచరించే అవకాశం ఉందని తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లె కూలీలు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచించారు. పులి కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని, ఎవరైనా హాని తలపెడితే వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రజలకు చేరువలో పోలీసులు
● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్: జిల్లా ప్రజలకు పోలీసులు మరింత చేరువలో ఉంటూ సేవలు అందిస్తారని, నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదిక వివరాలను ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల కేసులు పెరిగాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసులు కూడా పెరిగాయన్నారు. గతంలోకన్నా 2025లో రౌడీషీట్లు కూడా ఎక్కువ ఓపెన్ చేశామని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. 2026లో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తగ్గించాలని నిర్ణయించుకున్నామని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. అన్యాయానికి గురైన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్లకు వచ్చి కేసులు పెట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాలపై జాగ్రత్త ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మోహన్, విజయ్ ప్రతాప్, ఎస్బీ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ ఉపేందర్ రావు, సీసీఎస్ సీఐ హతీరాం, పీసీఆర్ సీఐ శంకర్, సీఐలు మహేందర్ రెడ్డి, సర్వయ్య, చంద్రమౌళి, గణేష్, సత్యనారాయణ, రవికుమార్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సోమవారం మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాల ఎగరవేతకు చైనా మాంజా వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మా ంజాను ఎవరైనా విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరు..
మానుకోటకు మరో మణిహారంగా వస్తుందని భావించిన రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో మంజూరుపై ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. రూ.908కోట్లు మంజూరు కాగా.. నిర్మాణానికి భూమి చూపించలేదనే నెపంతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నష్కల్‌కు డిపో తరలివెళ్తుందనే ప్రచారం జరిగింది. దీంతో స్థానికులు జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం సమీపంలో 409.01 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే అధికారులకు లేఖ రాసింది. -
మున్సిపల్ ఓటరు జాబితా నోటిఫికేషన్ జారీ
జనగామ: మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణ, విడుదల నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ రాణి కుముదిని, ఎన్నికల పట్టికల తయారీకి సంబంధించి దశలవారీ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలు పాతవి ఉండగా వీటికితోడు కొత్తగా కేసముద్రం, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలుగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎన్నికలు జరగనున్నాయి. నేడు(మంగళవారం) 30వ తేదీన మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ డేటాను సమీకరించడం, 31న పోలింగ్‌స్టేషన్ వారీగా వార్డుల డేటా పునర్వ్యవస్థీకరణ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ వార్డుల వారీగా పోలింగ్‌స్టేషన్ జాబితాల తయారీ, జనవరి 1వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, 5వ తేదీన రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం, 6వ తేదీన ఎన్నికల అధికారుల సమావేశం, 10వ తేదీన తుది ఓటరు జాబితాల విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా నోటిఫికేషన్‌తో రాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగుపడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జనవరి 10న వార్డుల వారీగా ఓటరు జాబితా విడుదల నేటినుంచి ఓటరు జాబితాల సమీకరణ -
5లోగా విద్యుత్ పనులు పూర్తి
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం మహాజాతరలో చేపడుతున్న విద్యుత్ పనులన్నీ వచ్చే నెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మేడారంలో జరుగుతున్న విద్యుత్ పనులు పరిశీలించి మాట్లాడారు. గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. భక్తులకు ఎలాంటి విద్యుత్ అసౌకర్యం కలగకుండా ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. నార్లాపూర్లోని 33 /11 కేవీ సబ్‌స్టేషన్ సందర్శించి జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా కోసం మేడారం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన స్తంభాల ఏర్పాటు పనులను పరిశీలించి నిర్దేశిత సమయం కల్లా పూర్తి చేయాలన్నారు. మేడారం, వెంగళాపూర్, చింతల్ క్రాస్ రోడ్డు, నార్లాపూర్ పార్కింగ్ స్థలాలను పరిశీలించి విద్యుత్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం ఊరట్టం స్తూపం జంక్షన్, హరిత హోటల్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, కన్నెపల్లి రోడ్డు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ రాజుచౌహాన్, ఎస్ఈ ఆనందం, డీఈ నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మేడారంలో విద్యుత్ పనుల పరిశీలన -
ఆకట్టుకునేలా!
ఖానాపురం: పాకాల.. పచ్చందాలకు నెలవు. ఆ హ్లాదకర వాతావరణానికి నిలయం. పక్షుల కిలకిలరావాలు, సరస్సులోని నీటి అలల సవ్వడి, చిలకలగుట్ట అందాలు పర్యాటకులను కనువిందు చేస్తా యి. గతంలో అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్న పాకాలకు పర్యాటకులు తాకిడి అంతంత మాత్రంగా ఉండేది. అయితే అటవీ శాఖ ఇక్కడి ఆభయారణ్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులతో కొన్ని సంవత్సరాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్ శివారులోని పాకాల పర్యాటక ప్రాంతానికి ఉమ్మడి వరంగల్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తారు. సెలవు, ప్రతీ ఆదివా రాల్లో వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చి అందాల ను వీక్షిస్తూ ఉత్సాహంగా గడుపుతారు. వర్షాకాలంలో సరస్సు మత్తడి పరవళ్లలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతారు. మత్తడి పోసిన అన్నీ రోజులు పర్యాటకుల సంఖ్య భారీగానే ఉంటుంది. దీంతో పర్యాటకుల ద్వారా వచ్చిన నిధులతో పాటు అటవీశాఖ ఆధ్వర్యంలో వచ్చే నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. పాకాల.. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొంది వరంగల్ జిల్లా స్థాయిలో ఏకై క పర్యాటక ప్రాంతంగా పేరొందింది. నర్సంపేట నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాకాలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుత సంవత్సరం రూ.50 లక్షల వ్యయంతో గేట్ వద్ద నుంచి చివరి వరకు 1.5 కిలో మీటర్ల మేర సీసీ రోడ్డు, డార్మెటరీ మరమ్మతులు, ఈసీ భవన పునరుద్ధరణ, తూముల ఆధునికీకరణ, బటర్ ఫ్లైగార్డెన్ వద్ద సెల్ఫీ పాయింట్, ఆర్చ్‌లు, మూడు పెడల్బోట్స్, పార్కింగ్ స్థల అభివృద్ధి, బటర్‌ఫ్లై గార్డెన్ సమీపంలో ఫూల్ నిర్మాణం, రెండు బ్యాటరీ వాహనాలు, షెడ్ నిర్మాణం, ఓపెన్ ఎయిర్ క్యాంటీన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పాకాలకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గేట్ ఎంట్రీ, వాహనాల రుసుము, పర్యాటకుల హాజరుకు రుసుములను అటవీశాఖ ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. దీంతో 2024 సంవత్సరంలో 33,500 మంది పర్యాటకులు పాకాలను సందర్శంచడంతో రూ.18.50 లక్షల ఆదాయం సమకూరింది. 2025లో 44,500 మంది పర్యాటకులు సందర్శించడంతో రూ. 30.50లక్షల ఆదాయం సమకూర్చుకుంది. ప్రకృతి అందంతో పాటు పాకాలలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రముగ్ధులవుతున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోది. గత సంవత్సరం కంటే ప్రస్తుతం పెరగడంతోపాటు ఆదాయం కూడా రెట్టింపుగా పెరిగింది. పాకాల..వరంగల్ జిల్లాలో ప్రధాన పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అన్ని రకాల వసతులు అందుబాటులోకి తీసుకొస్తాం. ఉన్నతాధికారుల సహకారంతో నిధులు మంజూరయ్యాయి. దీంతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ పనులతో పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ప్రస్తుతం పర్యాటకుల సంఖ్య పెరిగింది. – పుప్పాల రవికిరణ్, ఎఫ్ఆర్వో, నర్సంపేట -
అమ్మానాన్నా.. మిమ్మల్నీ అమెరికా తీసుకెళ్తాం
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025గార్ల: ‘మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నో త్యాగాలు చేశారు. మా కలలకు రెక్కలు తొడిగి అమెరికా పంపించారు. అమ్మా నాన్నా.. మిమ్మల్ని త్వరలో ఇక్కడికి(అమెరికా) తీసుకొస్తాం. ఇక్కడ చూడదగిన ప్రదేశాలను తిప్పి చూపిస్తాం. మీక్కావాల్సినవన్నీ కొనిపెడతాం’ అని ఫోన్లో ఆ బిడ్డలు అంటే తల్లిదండ్రులు మురిసిపోయారు. చుట్టు పక్కల వాళ్లకు చెప్పి సంబురపడ్డారు. కానీ, ఆ సంబురం ఎక్కువ రోజులు నిలవలేదు. విదేశాలకు తీసుకెళ్తామని చెప్పిన ఆ ఆడబిడ్డలు విగతజీవులుగా ఇంటికి తిరిగి వస్తుండడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్వగ్రామాల్లో విషాదం.. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసమని ఆమెరికా పయనమయ్యారు. బాగా స్థిరపడ్డాక ఉన్న ఊరి కోసం, కన్నవారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అంతలోనే వారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. బాల్య స్నేహితులైన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరుకు చెందిన కడియాల భావన(24), గార్లకు చెందిన పుల్లఖండం మేఘనరాణి (24)అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటాన్ నగరంలో ఉంటూ ఇటీవల ఎంఎస్ పట్టా పొందారు. ఉద్యోగాల వేటలో మునిగిపోయిన వారిరువురు.. ఆదివారం ఆహ్లాదం కోసం రెండు కార్లలో 8 మంది స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలోని అలబామ హిల్స్ చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు లోయలో పడిపోవంతో భావన, మేఘనరాణి అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం తెల్ల వారుజామున మీ అమ్మాయిలు మృతిచెందారని అమెరికా నుంచి ఫోన్ రావడంతో మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గార్ల, ముల్కనూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మృతదేహాలు ఇండియాకు రావాలంటే వారం లేదా పది రోజులు పట్టే అవకాశం ఉందని మృతుల బంధువులు పేర్కొన్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత గార్ల, ముల్కనూరు గ్రామాల్లోని మృతుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు.కూతుళ్ల మాటలతో ఉప్పొంగిన తల్లిదండ్రులు.. కానీ వక్రించిన విధి.. కూలిన తల్లిదండ్రుల ఆశల సౌధాలు రోడ్డు ప్రమాదంలో విగతజీవులైన కూతుళ్లు గార్ల, ముల్కనూరులో విషాదఛాయలు -
వినతులు సత్వరమే పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ● ప్రజావాణిలో 86 అర్జీల స్వీకరణ మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా త్వరగా పరిష్కరించాలని, పరిష్కారం చేయలేనవి ఉంటే కారణాలతో కూడిన నివేదిక ఇవ్వాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేయాలన్నారు. ప్రజావాణిలో 86 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూరియా బస్తాలు ఇప్పించాలి ఇందిరానగర్ తండా జీపీ గతంలో కేసముద్రం మండలంలో ఉండగా ఇటీవల మానుకోట మండల పరిధిలోకి మార్చారు. దీంతో మండలం సమస్య వస్తుంది. మా భూములన్నీ కేసముద్రం మండల పరిధిలో ఉన్నాయి. మండలం సమస్యను సాకుగా చూపి అధికారులు యూరియా బస్తాలు ఇవ్వడం లేదు. సమస్యను పరిష్కరించి బస్తాలు ఇవ్వాలి. –డి.లాల్ సింగ్–మంగమ్మ దంపతులు, ఇందిరానగర్ కాలనీ జీపీ ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదు.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యింది. వెంటనే పాత ఇల్లు కూల్చివేసి నూతన ఇంటి నిర్మాణం చేపట్టాం. బేస్‌మెంట్‌తో పాటు బీమ్ల నిర్మాణం పూ ర్తయి ఆరు నెలలు అవుతున్నా బిల్లు రాలేదు. ఆధా ర్ నమోదు కాలేదని చెప్పడంతో.. హౌజింగ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా చేయడం లేదు. వెంటనే బిల్లు ఇస్తే మిగిలిన పనులు చేపడుతాం. –సట్ల మాధవి, భగత్‌సింగ్ నగర్‌కాలనీ, మానుకోట పట్టణం భూములు కబ్జా కాకుండా చూడాలిమాకు జిల్లా కేంద్రం శివారులోని హైమాగార్డెన్ వెనుక ఆరు ఎకరాల భూమి ఉంది. దానిని కొంత మంది ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే ఎకరం ఆక్రమణకు గురైంది. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. – ఆకుల లక్ష్మి -
విషాద యాత్ర
స్టేషన్‌ఘన్‌పూర్/జఫర్‌గఢ్ : విహారయాత్ర మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామాల్లో తీరని శోకం మిగిల్చింది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, మిట్టపల్లి గ్రామాల మధ్య సోమవారం తెల్లవారుజామున లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు జిల్లా వాసులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చెందిన చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్ (31) అక్కడికక్కడే మృతిచెందగా, స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, కొలిపాక క్రాంతి, ఉప్పుగల్లుకు చెందిన అజయ్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ మృతిచెందగా కొలిపాక క్రాంతికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులంతా కలిసి దైవదర్శనానికి.. జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన చిల్లర బాలకృష్ణ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో సొంతంగా ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో స్నేహితుడు రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ హోటల్ మేనేజ్మెంట్ రంగంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంద అజయ్ గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ముగ్గురు కలిసి స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన గట్టు రాకేశ్, క్రాంతి మరికొంత మంది స్నేహితులతో కలసి ఈనెల 24న విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దీంతో యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఉంటున్న రొయ్యల అనిల్ తన భార్య, కుమారుడితో కలిసి ఉప్పుగల్లుకు వచ్చి వారిని ఇంటి వద్ద వదిలేసి స్నేహితులతో కలిసి అదే రోజున బయలుదేరారు. మూడు కార్లలో సుమారు 15 మంది యువకులు ముందుగా ఒడిశాలోని పూరిజగన్నాథస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సింహాచలం, అరకు, వైజాగ్ తదితర ప్రదేశాలను సందర్శించారు. యాత్ర అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం జిల్లా తల్లాడ సమీపం వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొంది. దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు జనగామ జిల్లా వాసుల మృతి ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ఘటన స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల్లో విషాదంఘన్పూర్కు చెందిన గట్టు కరుణాకర్, పద్మ దంపతులకు ఒక కుమారుడు రాకేశ్, కూతురు సంతానం. కరుణాకర్ టైర్ల పంక్చర్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పదేళ్ల క్రితం కరుణాకర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో స్థానిక దాతల సహకారంతో ఖరీదైన వైద్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఏడేళ్ల క్రితం కరుణాకర్ భార్య పద్మ అనా రోగ్యంతో మృతిచెందింది. ప్రస్తుతం కరుణాకర్ కుమారుడు రాకేశ్ జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు ఆయిల్ మిల్లులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుడి వివాహం చేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. అదేవిధంగా జనవరి 3న అతడి పుట్టినరోజు ఉంది. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ యాత్రకు స్నేహితులతో వెళ్లి మృతిచెందడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కొలిపాక ఐలయ్య, లలిత దంపతుల కుమారుడు క్రాంతి స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వివాహం జరిగి ఆరునెలలే అవుతోంది. రోడ్డు ప్రమాదంలో క్రాంతి రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంట సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మేడారం జాతరపై పీఓ సమీక్ష
● పాల్గొన్న పూజారులు, ఆదివాసీ సంఘాలు ఏటూరునాగారం : జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరపై ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సోమవారం ఆదివాసీ సంఘాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ పూజారులతో సమీక్షించారు. జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, దీనికి అనుగుణంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని పూజారులు, ఆదివాసీ సంఘాలు, వడ్డెలను కోరారు. కోళ్లు, మద్యం, బెల్లం, కొబ్బరికాయల షాపుల కేటాయింపు విషయంలో వారి అభిప్రాయాలు సేకరించారు. ఆదివాసీ సంఘాల్లోని సమస్యలు, జాతర సమయంలో పూజారులకు ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఎక్కడ, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పీఓ తెలిపారు. కాగా, మేడారం గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని పూజారులు పీఓను కోరారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ఏపీఓ వసంతరావు, డీడీ జనార్ధన్, జీసీసీ డీఎం వాణి, ఎస్ఓ రాజ్‌కుమార్, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నేడు ముక్కోటి ఏకాదశి
మహబూబాబాద్ రూరల్: శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పూజా వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు జ రుపుకోనున్నారు. ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఆధారంగా జిల్లాలోని ఆలయాల్లో అర్చకులు ఉత్తర ద్వార దర్శనాల కు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయం, వేణుగోపాలస్వామి దేవాలయం, వెంకటేశ్వరబజార్లోని స్వయంభు వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాత బజార్‌లోని ఉమాచంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు జరగనున్నాయి. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి మహబూబాబాద్: పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డీటీఓ సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం జిల్లా అధ్యక్షుడు మైస నాగయ్య అధ్యక్షత వహించగా డీటీఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ, డీఏ, ఈహెచ్ఎస్ ఇతరత్రా సమస్యలు పరిష్కరించాలన్నారు. 2024 మార్చి తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు కూడా ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీటీఓ కార్యాలయం పరంగా పెన్షనర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏటీఓ రా మకృష్ణ, ఈశ్వర్, నాగేందర్, వెంకట్‌రెడ్డి, మహేందర్, సత్యనారాయణ, ప్రసాద్, సంకా బద్రినారాయణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.● ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు ● తెల్లవారుజామున 5 గంటల నుంచే దైవ దర్శనాలు -
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025 -
మల్లన్న ఆలయంలో నిలువు దోపిడీ
ఐనవోలు: ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తులను ఒగ్గు పూజారులు నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని భక్తుడు ఆరోపిస్తూ ఆలయ కార్యనిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రాంకుమార్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయానికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాడు. ముందుగా ఆలయం లోపల పట్నం వేయడానికి కౌంటర్ వద్ద రూ.300 టికెట్ కొనుక్కొని ఆలయం లోపల పట్నాలు వేసే ప్రదేశానికి వెళ్లాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఒగ్గు పూజారులు సామూహికంగా పట్నాలు వేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ అనే ఒగ్గు పూజారి రాంకుమార్‌రెడ్డి వద్దకు వెళ్లి టికెట్ తీసుకుని రూ.700 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఎందుకు ఇవ్వాలని ఒగ్గు పూజారిని భక్తుడు ప్రశ్నించడంతో పట్నం, పూజ మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భక్తుడు ఆగ్రహానికి గురై అధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆలయ సిబ్బంది మరో ఒగ్గు పూజారితో భక్తుడి పట్నం మొక్కులను పూర్తిచేయించారు. ఈ విషయంపై ఈఓ కందుల సుధాకర్‌ను వివరణ కోరగా ఇటీవల ఒగ్గు పూజారులు, కల్యాణకట్ట సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి భక్తుల వద్ద నుంచి కానుకలు ఆశించవద్దని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆదివారం భక్తుడితో అనుచితంగా ప్రవర్తించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒగ్గు పూజారిని 15 రోజులు ఆలయానికి రాకుండా ఆదేశాలు ఇచ్చానన్నారు. రెండు రోజుల్లో ఆలయ చైర్మన్‌తో కలిసి మరో సమావేశం ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. డబ్బులు ఇవ్వలేదని పూజ మధ్యలోనే వెళ్లిపోయిన ఒగ్గు పూజారి 15 రోజులు విధులకు రావొద్దని ఒగ్గు పూజారికి ఈఓ ఆదేశాలు -
తల్లులకు తనివితీరా మొక్కులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారమ్మకు భక్తులు తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు అప్పగించారు. మొదటి జంపన్నవాగు స్నానఘట్టాల షవర్ల కింద స్నానాలు ఆచరించారు. జంపన్నవాగు వద్ద కల్యాణ కట్టలో భక్తులు, చిన్నారులు పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగార, చీరసారె, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం, సంతాన భాగ్యం కలగాలని వనదేవతలను మనసారా వేడుకున్నారు. మేడారం ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. చోరీలు జరగకుండా భక్తులను అనౌన్స్మెంట్ ద్వారా అప్రమత్తం చేశారు. అమ్మవార్ల గద్దెలకు తాళాలు.. భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు సమ్మక్క, సారలమ్మ గద్దెలకు తాళాలు వేశారు. దీంతో భక్తులు అమ్మవార్ల గద్దెలను బయట నుంచే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వెళ్లి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మేడారం పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. 200 మంది పోలీసులు బందోబసు..్త అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల కోసం 200 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. గద్దెల ప్రాంగణం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న తరుణంలో భక్తులు అమ్మవార్లను ప్రశాంతంగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ముందస్తుగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షణలో ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు ఎస్పీ సదానందం, ఏఎస్పీ మనన్‌బట్, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైల బందోబస్తులో పాల్గొన్నారు.తల్లులకు మొక్కులు చెల్లిస్తున్న భక్తులు మేడారానికి వేలాదిగా తరలొచ్చిన భక్తులు జనసందడిగా మారిన గద్దెల ప్రాంగణం -
ఏటీఎంలలో చోరీ.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
వరంగల్ క్రైం: ఏటీఎంలలో డబ్బులు బయటకు రాకుండా ఇనుప రేకు అడ్డం పెట్టి చోరీలకు పాల్ప డుతున్న రాజస్తాన్‌కు చెందిన ఏడుగురు సభ్యులు అంతర్ ర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత తెలిపారు. వీరి నుంచి రూ.5.10 లక్షల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ఫోన్లు, నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు ఆదివారం కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా మాల్కిడా తాలుకాలోని ఖారెడా గ్రామానికి చెందిన ఆరిఫ్‌ఖాన్, బీజ్వాడ నారోక గ్రామానికి చెందిన సర్ఫరాజ్, మోరేడా గ్రామానికి చెందిన ఎం.ఆష్‌మహ్మద్, షాపుస్ఖాన, షారూఖాన, అస్లాంఖాన, మహావకార్డ్ గ్రామానికి చెందిన షారుక్‌ఖాన్ నిందితులు. వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్బీఐ ఏటీఎంలలో ఏర్పాటు చేసే మిషన్లకు సంబంధించి.. పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎం మిషన్లలోని లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యయనం చేశారు. ఏటీఎంలు్ తెరిచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారని తెలిపారు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు 7 ఏటీఎంలలో వీరు చోరీలకు పాల్పడి రూ.12.10 లక్షలను చోరీ చేసినట్లు తెలిపారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీకి పాల్పడ్డారని పేర్కొన్నారు. నగదు పోయిందని ఖాతాదారులు సంబంధిత బ్యాంకుల్లో ఫిర్యాదు చేశారు. బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్థ అయిన ఎఫ్ఎస్ఎస్ (ఫైనాన్సియల్ సాఫ్ట్వేర్ సెక్యూరిటీస్) లిమిటెడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు ఈ చోరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, క్రైం, కాజీపేట ఏసీపీలు సదయ్య, ప్రశాంత్‌రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఆదివారం ఉదయం కాజీపేట చౌరస్తాలోని పెర్టో కంపెనీకి చెందిన ఏటీఎంలలో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చారు. ఏటీఎం తలుపు తెరిచి దానికి స్టిక్కర్ అతికించిన ఐరన్ ప్లేట్ బిగిస్తుండగా.. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను విచారించగా చేసిన చోరీలను అంగీకరించారు. నిందితులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీసు ఉన్నతాధికారులతోపాటు సీసీఎస్ ఇన్‌న్‌స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్‌పాషా, కాజీపేట ఎస్సైలు నవీన్‌కుమార్, లవణ్ కుమార్, సీసీఎస్ ఎస్సై శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహేశ్వర్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు అందజేశారు. నగదు, రెండుకార్లు, ఐరన్ ప్లేట్లు, డూప్లికేట్ తాళాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత


