వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ నూతన భవనాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్డులో ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ కార్యాలయంలో వరంగల్ రేంజ్ పోలీస్ అధికారులకు సంబంధించిన శాఖాపరమైన పరిపాలన కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. పోలీస్ అధికారులు సమస్యలపై రేంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, పరిపాలన పనితీరులో పారదర్శకంగా, బాధ్యతాయుత పని తీరు ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేశ్ కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేంధర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్‌స్పెక్టర్లు ఇతర రేంజ్ కార్యాలయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


