పాలిటెక్నిక్ కళాశాలలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి పూర్వ విద్యార్థులందరూ దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. వారందరినీ ఒకే వేదికపైకి తీసుకు వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. రూ.28 కోట్లతో నూతన భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఈవీ శ్రీనివాసరావు, అధ్యక్షుడు
ప్రిన్సిపాల్‌గా నాకు గర్వకారణం
సుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పాలిటెక్నిక్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేయడం గర్వకారణంగా ఉంది. మేధావుల నిలయంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కనులపండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
– డాక్టర్ బైరి ప్రభాకర్,
ప్రిన్సిపాల్


