● డీఏఓ సరిత
కేసముద్రం: పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే శారీరకశ్రమతోపాటు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మున్సిపాలిటీ పరిధి ధన్నసరి పీఏసీ ఎస్‌ను శనివారం ఆమె సందర్శించి, యూరియా నిల్వలు, డ్రోన్ ద్వారా పిచికారీ చేసే యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు మాన్యువల్‌గా పంటలకు మందులు పిచికారీ చేయడానికి బదులుగా, డ్రోన్లను వినియోగించాలని తద్వారా పురుగులు, తెగుళ్లను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ వెంకన్న, సాంకేతిక వ్యవసాయ అధికారి చాయారాజ్, ఏఈఓ దారావత్ రాజేందర్ పాల్గొన్నారు.


