మహబూబాబాద్
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 202
I
ఇచ్చేవారికే దిక్కులేదు..!
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ కార్యాలయంలో తాగునీటితోపాటు వివిధ అవసరాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోని మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతుండడంతో ఉద్యోగులు, సిబ్బంది ముక్కు మూసుకుని విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఉద్యోగులు ఒకటి, రెండుకు బయటకి పరుగులు తీయాల్సిందే. కనీసం కార్యాలయంలోని చేతి పంపు బోరు కూడా పనిచేయడంలేదు. ప్రజల అవసరాలకు, తాగునీటిని అందించాల్సిన కార్యాలయానికే నీటి సరఫరా లేకపోవడం ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదేవిషయంపై జిల్లా మిషన్ భగీరథ ఈఈ సురేందర్ ను వివరణ కోరగా రెడ్యాలలో రోడ్డు మరమ్మతు పనుల నేపథ్యంలో పైపులైన్ డ్యామేజ్ వల్ల కార్యాలయంతోపాటు పలు గ్రామాలకు నీటి సమస్య ఉందని తెలిపారు.


