వసూళ్లు అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

వసూళ్లు అంతంతే..

Mar 27 2026 9:57 AM | Updated on Mar 27 2026 9:57 AM

మహబూబాబాద్‌: ఇంటి పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీలు తడబడుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో ఐదు రోజుల గడువు మాత్రమే ఉండడంతో.. వందశాతం వసూళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కాగా, పన్నుల వసూళ్లలో కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ జిల్లాలో మొదటిస్థానంలో ఉండగా మరిపెడ మున్సిపాలిటీ చివరిస్థానంలో ఉంది. పన్నుల వసూళ్లపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది. అయితే సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల అభివృద్ధి కుంటుడుతోంది.

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు..

రాష్ట్రవ్యాప్తంగా 131 మున్సిపాలిటీలు ఉండగా.. జిల్లాలోనే ఐదు ఉన్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు, డోర్నకల్‌లోని 15 వార్డుల్లో 10,869 మంది ఓటర్లు, తొర్రూరులోని 16 వార్డుల్లో 21,451మంది ఓటర్లు ఉన్నారు. కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 15,945 మంది ఓటర్లు, మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 13,687 మంది ఓటర్లు ఉన్నారు. 2025 –26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ నుంచి మార్చి 31 వరకు) ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా అఽధికారుల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక సంవత్సరం జిల్లా వెనుకబడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 75శాతం వసూలు చేయగా.. ఈసారి ఇప్పటి వరకు 60.88శాతానికే పరిమితమైంది. కేసముద్రం మున్సిపాలిటీ 68.57శాతం వసూలు చేసి జిల్లాలో టాప్‌లో ఉంది.

మున్సిపల్‌ ఎన్నికల కారణంతోనే..

ఈఏడాది ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికల జరగడం వల్ల పన్నుల వసూళ్లలో ఆలస్యమైనట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ మానుకోట పన్నుల వసూళ్లలో మాత్రం మూడో స్థానానికి పరిమితమైంది. కమిషనర్‌ రాజేశ్వర్‌ పన్నుల వసూళ్లలో శ్రద్ధ పెట్టడం లేదని అర్థమవుతోంది.

ఐదు రోజులు మాత్రమే..

ఈనెల 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కేవలం ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఆలోపు బిల్‌ కలెక్టర్‌లతో పన్నుల వసూళ్ల వేగం పెంచితేనే కొంతమేర అయినా లక్ష్యం సాధిస్తారు. లేకుంటే జిల్లా వెనుకబడుతుంది. కాగా, పన్నుల వసూలు కమిషనర్లకు సవాల్‌గా మారింది.

ఎన్నికల వల్లే పన్నుల

వసూళ్ల శాతం తగ్గింది

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికల వల్ల పన్నుల వసూళ్లు ఆలస్యమైంది. కానీ, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో పన్నుల వసూళ్ల వేగం పెంచాం. దాని వల్లే 60.88 శాతం వసూలు చేశాం. వేగం పెంచి వసూలు చేస్తాం.

– రాజేశ్వర్‌,

మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌

ఇంటి పన్నుల సేకరణలో మరిపెడ మున్సిపాలిటీ చివరి స్థానం

కేసముద్రం మున్సిపాలిటీ మెరుగు..

మానుకోట వెనుకడుగు

అధికారులు నిర్లక్ష్యంతో

కుంటుపడుతున్న అభివృద్ధి

ఐదు రోజులు మాత్రమే గడువు

పన్నులపైనే ఆధారం..

ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర ఖర్చులు పన్నుల వసూళ్లపైనే ఆధారపడి ఉంది. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను 143మంది పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే ఉన్నారు. సంఖ్య సరిపోవడం లేదు. కాగా, కార్మికుల సంఖ్య పెంచాలని సీడీఎంఏను కోరారు. అయితే సీడీఎంఏ మాత్రం ఇంటి పన్నులు పెంచుకుని అధిక ఆదాయం పొంది, కార్మికులను పెంచుకోవాలని వారికి వివరించింది. దీనిని బట్టి చూస్తే పన్నులపైనే అభివృద్ధి ఆధారపడి ఉంది.

మున్సిపాలిటీ గృహాల డిమాండ్‌ వసూలు శాతం

సంఖ్య (కోట్లలో) (కోట్లలో)

కేసముద్రం 6,440 1.05 0.72 68.57

తొర్రూరు 6,712 4.85 3.27 67.42

మానుకోట 22,970 6.80 4.14 60.88

డోర్నకల్‌ 3469 1.43 0.74 51.75

మరిపెడ 5619 2.09 0.92 44.02

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement