● నేడు శ్రీరామ నవమి
మహబూబాబాద్ రూరల్: జిల్లా వ్యాప్తంగా శ్రీరా మనవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించేందుకు ఆలయా ల్లో తగిన ఏర్పాట్లు చేశా రు. మానుకోట పట్టణంలోని గాంధీపార్కు ఎదుట రాములోరి కల్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ బాధ్యులు సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మశ్రీ రాధాకృష్ణమూర్తి, ఆలయ ప్రధాన అర్చకుడు ఎంవీ. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం జరగనుంది. గురువారం ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, కమిటీ సభ్యులు పరిశీలించారు.


