నెహ్రూసెంటర్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని డయాలసిస్ విభాగం టెక్నీషియన్ బుధవారం రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనిల్‌కుమార్ అనే వ్యక్తి డయాలసిస్ విభాగంలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఓ వైద్యుడి వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపాడు. బాధితుడికి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా డయాలసిస్ విభాగంలో జరిగిన ఘటన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చామని, విచారణ చేపడుతామని ఆయన తెలిపారు.


