డోర్నకల్: నూతన పాలకవర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కోరారు. డోర్నకల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం 2026–27 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌పై సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో హాజరై మాట్లాడారు. మున్సిపల్ నిధులను సక్రమంగా వినియోగించి సత్ఫలితాలు రాబట్టాలని కోరారు. పాలకవర్గాలు మున్సిపల్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. అప్పుడే పాలనపై పట్టు వస్తుందని చెప్పారు. మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.52,96,85,000 ఆదాయం, రూ.52,92,20,000 వ్యయంతో బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొండేటి రాజకుమారి, వైస్‌చైర్మన్ మాదా లావణ్యశ్రీనివాస్, కమిషనర్ బి.నిరంజన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


