కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కోఎ డ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న భూక్య వాసు ఆదివారం ఆ కళాశాల సమీపంలోని కెనాల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతైన విషయం విధితమే. దీంతో ఆ విద్యార్థి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టింది. సాయంత్రం వరకు చేపట్టినా ఆచూకీ లభించలేదని ఆ కళాశాల హాస్టల్ జాయింట్ డైరెక్టర్ దయాకర్ సోమవారం రాత్రి తెలిపారు. కాగా, వాసు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ చిన్యాతండాకు చెందిన విద్యార్థి. ఇదిలా ఉండగా వీసీ ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ ఇస్తారి ఘటనాస్థలికి వచ్చారు. కాగా, నేడు ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది మరోసారి కెనాల్‌లో గాలింపు ప్రక్రియ చేపట్టనుంది.


