గంగారం: మండలంలోని మడగూడెంగ్రామంలో సోమవారం అకాల వర్షం కురిసింది. వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మక్కల రక్షణకు రైతుల పాట్లు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో పాటు వాతావరణం పూర్తిగా చల్లబడి ఈదురుగాలులు మొదలయ్యాయి. దీంతో రైతులు అప్రమత్తమై మహబూబా బాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసుకున్న మక్కల రాశులపై టార్పాలిన్లు కప్పుకున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన చెందుతూ తమ వ్యవసాయ ఉత్పత్తుల వద్ద కాపలా ఉన్నారు.


