మహబూబాబాద్ అర్బన్: క్రీడాపాఠశాలల్లో విద్యాభాస్యం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మానుకోట జిల్లా నుంచి 20 మంది విద్యార్థులు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవవారం ఉదయం క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి మాట్లాడుతూ.. తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి ప్రవేశానికి మూడో తరగతి చదువుతున్న బాలబాలికలకు 9 రకాల పోటీ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు ఈ నెల 27న హైదరాబాద్ హకీంపేట క్రీడా పాఠశాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
● పశుసంవర్ధక శాఖ జిల్లాఅధికారి
దంతాలపల్లి: రైతులు తమ పశువుల, గేదెల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామంలో బుధవారం పశువులు, గేదెలకు నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ వైద్యశిబిరంలో పాల్గొని సర్పంచ్ కారుపోతుల సాయిదుర్గతో కలిసి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి సోకడంవల్ల పశువుల్లో వచ్చే నష్టాల గురించి వివరించారు. ప్రభుత్వం పశువుల్లో సోకే వివిధ వ్యాధుల నుంచి కాపాడి పశు సంపదను పెంచే విధంగా బుధవారం జాగ్రత్తలు తీసుకుంటుందని రైతులకు గుర్తుచేశారు. మండలంలోని గ్రామాల్లో పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తమ పశువులకు ఎలాంటి వ్యాధి సోకినా దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి నౌసిని, సిబ్బంది వరలక్ష్మి, రాములు, వెంకన్న, రైతులు పాల్గొన్నారు.


