హనుమకొండ 16, జనగామ జిల్లాలో 12 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న సిబ్బంది (మెడికల్ టెక్నీషియన్లు) రోజూ ప్రాణాలతో పోరాడుతున్నారు. గోల్డెన్ అవర్ అంటే పుస్త కాల మాట కాదు, అ ది వీరు ప్రతిరోజూ రాసుకునే ‘ప్రాణరక్షణ గడియారం’. ఫోన్ గంట మోగగానే పరుగెడతారు. మార్గం కష్టమైనా, వర్షం వచ్చినా, అర్ధరాత్రి అయినా క్షతగాత్రుల పాలిట సంజీవనిగా మారి ప్రమాద స్థలానికి చేరే వేగమే వారి విజయం. ఒకవైపు రోగికి శ్వాస ఆగకుండా ఆక్సిజన్ ఇస్తూ, మరోవైపు రక్తస్రావం ఆపడానికి కట్లు కడుతూ తోబుట్టువుల్లా సేవలందిస్తారు. పక్కనే ఏడుస్తున్న బంధువులకు ధైర్యం చెప్పడం కూడా వారి పని. రోగిని అంబులెన్స్‌లో ఎక్కించగానే శ్వాస ఆగకుండా, మాటలతోనూ ప్రాణం పోసే ఈఎంటీలను దేవుళ్లుగా భావిస్తారు. ఇది ఈఎంటీల జీవితంలో రోజు రాసుకునే ఎపిసోడ్. జీపీఎస్ సాంకేతికతతో కాల్ వచ్చిన వెంటనే సమీప అంబులెన్స్‌కు సమాచారం చేరి, సగటున 12 నిమిషాల్లో ఘటనా స్థలికి చేరుకుని ‘గోల్డెన్ అవర్’ కాన్సెప్ట్ ద్వారా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఎక్కిస్తున్న ఈఎంటీలు
క్షతగాత్రులను లోయ నుంచి తీసుకొస్తున్న ఈఎంటీలు


