మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్స్ సమీపంలో చోటుచేసుకుంది. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఒడ్డుగూడెం జీపీ పరిధిలోని నెహ్రూనగర్‌కు చెందిన బానోత్ శ్రీను, వినోద దంపతుల ఏకై క కుమారుడు మహేందర్ (23) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై మహబూబాబాద్ మీదుగా హైదరాబాద్ బయలుదేరాడు. ఈ సమయంలో ఆర్తి గార్డెన్స్ సమీపంలో ఎదురుగా ఓ గుర్తు తెలియని వాహనం.. బైక్‌ను ఢీకొని వెళ్లింది. స్థానికులు డయల్ 100కు కాల్ చేయగా ఘటనా స్థలికి చేరుకున్న ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గణపతి, నరేశ్ 108లో ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీ కరించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి శ్రీను ఫి ర్యాదు మేరకు టౌన్ ఎస్సై సూరయ్య కేసు నమోదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎల్.శ్రీనివాసరావు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
15 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరి మృతి..
నెహ్రూనగర్‌కు చెందిన బానోత్ శ్రీను కుటుంబంలో 15 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 15 రోజుల క్రితం శ్రీను తండ్రి భోజ్య గుండెపోటుతో మృతిచెందగా ప్రస్తుతం అతడి కుమారుడు మహేందర్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మహేందర్‌కు మరికొద్ది రోజుల్లో వివాహం చేయాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్రమంలో అతడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో స్థానికులు, బంధువులు బోరున విలపించారు.
మహబూబాబాద్ శివారులో ఘటన
15 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి


