నాడు జలకళ..
● పాకాల ఏటిలో తేలిన రాళ్లు
గార్ల : మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు వానాకాలంలో చెక్‌డ్యాం పైనుంచి పొంగి ప్రవహిస్తూ కనువిందు చేసేది. కానీ ప్రస్తుతం వేసవికాలం ప్రారంభంలోనే ఏరు ఎండిపోయి రాళ్లు తేలి కనిపిస్తుంది. పాకాల ఏరు నాడు జలకళతో నిండుకుండలా మారగా, నేడు బండలు తేలి నీళ్లు లేక వెలవెలబోతోంది. పాకాల ఏటి పరివాహక ప్రాంతాల్లో రైతులు సాగుచేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. వేసవికాలంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోతే గార్ల మండలంలో పశువులు, మూగజీవాలు, ప్రజలకు తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం దాపురించింది. జిల్లా అధికారులు తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


