డోర్నకల్: నానో యూరియాతో పంటలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని డీఏఓ సరిత తెలిపారు. మండలంలోని చిలుకోడు రైతువేదికలో మంగళవారం జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా టెలికాన్ఫరెన్స్‌లో పలువురు రైతులు అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ.. నానో యూరియా నేరుగా మొక్కలకు అంది ఎదుగుదల వేగంగా ఉంటుందని తెలిపారు. ఘన రూపంలో ఉండే యూరియా బస్తాల కంటే ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడకం తేలికగా ఉంటుందన్నారు. మామిడిపంట పూతదశలో వచ్చే తెగుళ్లను వెంటనే గుర్తించి మందులు పిచికారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ అనిల్‌కుమార్, ఏఈఓ అవినాష్, సెరికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


