● జిల్లా వ్యవసాయశాఖ అధికారి సరిత
నర్సింహులపేట: ఎరువుల షాపు డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత హెచ్చరించారు. శనివారం మండలకేంద్రంలోని ఎరువుల షాపులను, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోరమాండల్ ఇంటర్నేషనల్ షాపులను ఆకస్మికంగా సందర్శించి స్టాక్ రిజిస్టర్, బిల్లులు, లైసెన్స్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడారు. ఎరువులను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా, బ్లాక్‌లో అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పారాక్వాట్ మందును నిషేధించామని, ఎరువుల డీలర్లు అమ్మితే చర్యలు తప్పవన్నారు. అనంతరం పామాయిల్, వరి పొలంను పరిశీలించారు. రసాయన ఎరువులను తగ్గించి, పశువుల ఎరువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


