రామన్నపేట: వరంగల్ ములుగు రోడ్డులోని హేమ హ్యూందాయ్ కార్ షోరూంలో ఎక్స్‌టర్, వెర్నా నూతన కార్లను ఎస్‌బీఐ ఆర్‌ఎం అబ్దుల్ రహీం, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్ జి.రమేష్, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ యుగంధర్ శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ యుగంధర్ మాట్లాడుతూ.. న్యూ ఎక్స్‌టర్ కొత్త బోల్డ్ డిజైన్ స్పోర్టీ లుకింగ్, సేఫ్టీ ఫ్యూచర్లు, సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, డాస్ కెమెరా వంటి అధునాతన ఫ్యూచర్ల కలిగి ఉందని తెలిపారు. అలాగే వెర్నా ప్రీమియం డిజైన్, పవర్‌ఫుల్ పర్మామెన్స్, లెవెల్–2 అడాస్, బూట్ స్పేస్, 8 వే డైవర్ సీట్ అడ్జెస్ట్‌మెంట్ కలిగి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్, పృథ్వీ, మేనేజర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.


