వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంతో ప్రజలు ఆందోళనకు గురై ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలు గుతోందని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిఽధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నదని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, అలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేసి గందరగోళం సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్
సీపీ సన్‌ప్రీత్‌సింగ్


