మత్తు పౌడర్‌ విక్రయదారులకు జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

మత్తు పౌడర్‌ విక్రయదారులకు జైలు శిక్ష

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

వరంగల్‌ లీగల్‌: మత్తు పౌడర్‌ తరలించిన నేరంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ఆర్‌.లక్ష్మణ్‌రావు, పూసల చైతన్యకుమార్‌, లింగాల సైదులుకు పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.రెండు లక్షల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి అపర్ణాదేవి బుధవారం తీర్పు వెలువరించారు. 2023 జనవరి ఒకటిన గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు తరలించేందుకు కారులో బయలు దేరారు. మార్గమధ్యలో హనుమకొండ అలంకార్‌ జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు వారు చిక్కారు. కారు తనిఖీ చేయగా కిలో అల్ప్రొజోమ్‌ మత్తు పౌడర్‌ దొరికింది. వెంటనే నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి విచారణ చేయగా నేరం రుజువైంది. నేరస్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.రెండు లక్షల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement