రేగొండ: అప్పుల బాధతో బావిలో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని లింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దొంగల రవీందర్ (49) అప్పులు తెచ్చి ఇటీవల నూతన ఇల్లు నిర్మించాడు. బుధవారం భార్య, కొడుకుతో కలిసి పొలం దగ్గరకు వెళ్లాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.


