సెకండ్‌ కారు కొంటున్నారా..! | - | Sakshi
Sakshi News home page

సెకండ్‌ కారు కొంటున్నారా..!

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

ఖిలా వరంగల్‌ : సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో విక్రయిదారుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది. విక్రయదారులు సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలు పెట్టి డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చి కారు బుక్‌ చేసుకోవాలని కోరుతుంటారు. డబ్బు పంపి మోసపోతున్న ఉదంతాలు లేకపోలేదు. ఢిల్లీ, హైదరాబాద్‌, ఇతర జిల్లాల కార్లు చూపుతామంటారు. ప్రమాదం జరిగిన వాటికి మెరుగులద్ది కొనుగోలుదారులకు అంటగట్టి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు.

కనీస జాగ్రత్తలు తీసుకోవాలి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి సెకండ్‌ హ్యాండ్‌ కార్లు అంటూ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలుదారులు వాహన కొనుగోలు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీఏ, పోలీసు అధికారుల సూచిస్తున్నారు. సాధారణంగా కొత్త వాహనం కొంటే వాహనదారులు పక్కాగా రిజిస్టేషన్‌ చేయించుకుంటారు. దీనిలో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల కొనుగోలు చేసే సమయంలో వాటి రికార్డులు, ఆర్సీ బుక్‌, ఇన్సూరెన్స్‌, రోడ్డు టాక్స్‌ వంటి వాటిని చూడడం సర్వసాధారణం. అయితే ఆ వాహనం ఎవరి పేరున ఉంది? దాని పరిస్థితి ఏమిటో తెలుసుకోలేకపోతే ఇబ్బందులు తప్పవు.

హత్యలు, దోపిడీలకు వినియోగించిన

వాహనాలు అంటగట్టే అవకాశం..

కొంత మంది నేరగాళ్లు హత్యలు, దోపిడీలకు వినియోగించిన వాహనాలను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాల్లోకి తీసుకెళ్లి విక్రయిస్తారు. ఆ వాహనాలను కొనుగోలు చేసిన అమాయకులు చిక్కుల్లో పడే పరిస్థితి ఆక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రవాణాశాఖ వాహనాలకు సంబంధించిన డేటా అంత ఆన్‌లైన్‌లోనే పొందపర్చింది. వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్టీఏ, ట్రాఫిక్‌ ఆధికారులను సంప్రదించి కేసుల వివరాలు సేకరించి సెకండ్‌ వాహనాలు కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు.

ఇంజన్‌.. ఇంధనం..

ముందే టైర్లు చూసి ఇంజన్‌ పరిశీలించాలి. ఆయిల్‌ గేజ్‌ చూడాలి. ఇంజన్‌ ఆన్‌ చేసిన సమయంలో ఆయిల్‌ పైకి ఎగజిమ్మినా.. లీకై నా.. పొగ వచ్చినా ప్రమాదమే. ఇంజిన్‌ చుట్టూ బాటమ్‌కు కంపెనీ సీల్‌ ఉంటుంది. వీటికి ఏదైనా బిడింగ్‌, ప్యాచ్‌లు, టింకరింగ్‌ వంటివి చేశారా చూసుకోవాలి. ఇంజన్‌, ఛాసిస్‌, సంఖ్యత ఆర్‌సీలో పొందుపరిచిన నంబర్‌ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.

వీటిని పరిశీలించడం తప్పనిసరి..

కారు తీసుకోవడం కాదూ వీటిని అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. వీధిగా ధ్రువీకరణ పత్రం పొందాలి. ఆర్‌సీ, బీమా, కాలుష్య నివారణ ధ్రువీకరణ పత్రం, అఫిడవిట్‌ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్‌ఓసీ పొందిన 15 రోజులలోపు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహనం కాలపరిమితి 15 ఏళ్లు. వాహన మోడల్‌, కంపెనీ( ఇన్వాయిస్‌) ధరను బట్టి రోడ్‌ ట్యాక్స్‌ విధిస్తారు. వాహన అద్దాల చివరన కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి ఉంటారు. అవి లేకపోతే మార్చారని గ్రహించాలి.

జిల్లాలు: సెకండ్‌ హ్యాండ్‌

బైక్‌, కార్ల షోరూంలు

వరంగల్‌ 08

హనుమకొండ 28

జనగామ 02

జేఎస్‌ భూపాలపల్లి 01

ములుగు 01

మహబూబాబాద్‌ 02

కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలి..

సామాజిక మాధ్యమాల్లో చూడొద్దు

కారుపై కేసులు, ఫైన్లు పరిశీలన

తప్పని సరి

ఇంజన్‌ కండీషన్‌, మోడల్‌ను పరీక్ష చేయించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement