మార్కెట్‌కు మూడు రోజుల సెలవు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు మూడు రోజుల సెలవు

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

వరంగల్‌: శ్రీరామ నవమిని పురస్కరించుకుని వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ‘శ్రీరామనవమి’(ప్రభుత్వ సెలవు), శనివారం యార్డుబంద్‌, ఆదివారం వారాంతపు సెలవు ఉన్నందున మార్కెట్‌లో క్రయవిక్రయాలు జరగవన్నారు. తిరిగి సోమవారం మార్కెట్‌ పునఃప్రారంభమవుతుందన్నారు. రైతులు, వ్యాపారులు, గుమస్తాలు, దడువాయిలు, కార్మికులు ఈ విషయం గమనించాలని ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్‌.మల్లేశం కోరారు.

దరఖాస్తుల గడువు

పొడిగింపు

న్యూశాయంపేట: వరంగల్‌ జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చే (ఈవీ స్కూటర్‌, ఈవీ ఆటో, సోలార్‌ యూనిట్స్‌) పథకాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువును వచ్చే నెల 2వ తేదీ వరకు పొడిగించినట్లు కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు సర్క్యూట్‌హౌస్‌ రోడ్డులోని తుషారా స్కూల్‌ ఎదుట ఉన్న కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

‘చీఫ్‌ డి మిషన్‌’గా

డీవైఎస్‌ఓ అశోక్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరగనున్న ఖేలో ఇండియా ఫస్ట్‌ ఎడిషన్‌ ట్రైబల్‌ క్రీడాపోటీలకు చీఫ్‌ డి మిషన్‌గా హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌ నియమితులయ్యారు. అశోక్‌కుమార్‌ ఎంపిక కావడంతో డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జేఎన్‌ స్టేడియంలోని డీఎస్‌ఏ ఆఫీస్‌లో ఆయనను అభినందించా రు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ బాధ్యత తనకు దక్కిన గౌరవమని, తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించా లని ఆకాంక్షించారు. డీవైఎస్‌ఓను అభినందించిన వారిలో కోచ్‌లు నరేందర్‌, శ్రీమన్నారాయణ, నవీ న్‌, రమేశ్‌, విష్ణువర్ధన్‌, శంకర్‌, దేవిక, ప్రభుదాస్‌, జయపాల్‌, డీఎస్‌ఏ సూపరింటెండెంట్‌ విజయశ్రీ, సిబ్బంది జ్యోతి, ప్రదీప్‌, మహేందర్‌రెడ్డి ఉన్నారు.

జువైనల్‌ హోంకు

బాల నేరస్తులు

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్‌లో ఎవరూ లేని సమయంలో ఓ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో బాల నేరస్తులపై పోక్సో కేసు నమోదు చేసి జువై నల్‌ హోంకు తరలించినట్లు కాటారం డీఎస్పీ ఎ. సూర్యనారాయణ, మహదేవపూర్‌ సీఐ ఎన్‌. వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 23న చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన బాల నేరస్తులను జువైనల్‌ కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్‌.. రిమాండ్‌ చేయగా వారిని వరంగల్‌లోని అబ్జర్వేషన్‌ హోంకు తరలించినట్లు వెల్లడించారు. వారి వెంట ఎస్సై కె. పవన్‌కుమార్‌ ఉన్నారు.

ఆయుర్వేద విద్యార్థులపై యువకుల దాడి

కాశిబుగ్గ: వరంగల్‌ లేబర్‌కాలనీలోని అనంతలక్ష్మి ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల రాత్రివేళ హాస్టల్‌ నుంచి బయటికి వచ్చారు. రోడ్డుపై ఉన్న ద్విచక్ర వాహనం విషయంలో స్థానిక యువకులకు, విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులను స్థానిక యువకులు మద్యంమత్తులో చితకబాదినట్లు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థులకు బలంగా గాయాలైనట్లు సమాచారం. అయితే ఈదాడి విషయంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ఈ ఘటన బుధవారం తమ దృష్టికి వచ్చిందని, వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement