ఆగస్టు 21 నుంచి ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ సదస్సు | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 21 నుంచి ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ సదస్సు

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

కాశిబుగ్గ: తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 23వతేదీ వరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు బాధ్యులు తెలిపారు. సదస్సు సందర్భంగా బుధవారం ఎంజీఎంలో కాన్ఫరెన్స్‌ హాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రస్థాయిలో జరగనున్న ఈ సదస్సు కోసం ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు, నిపుణులు, పీజీ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నా రు. ఇందులో పాల్గొనే నిర్వాహక సభ్యులు, వైద్యులు ముందుగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని, ప్రస్తుతం ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సదస్సు చైర్మన్‌ పి. విజయ్‌చందర్‌రెడ్డి, సెక్రటరీ రాంకుమార్‌రెడ్డి, కోశాధికారి దిడ్డి శ్రవణ్‌కుమార్‌, వైద్యులు జె.వెంకటేశ్వర్లు, సుధీర్‌కుమార్‌, అశోక్‌, డాక్టర్‌ డి.మహేశ్వర్‌, క్రాంతికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement