యశ్వంత్‌కు గోవా సీఎం అభినందన | - | Sakshi
Sakshi News home page

యశ్వంత్‌కు గోవా సీఎం అభినందన

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

మరిపెడ రూరల్‌ : తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన మౌంటైనర్‌ భూక్య యశ్వంత్‌ గోవాలో పర్వతరోహణ చేసిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను మంగళవారం మర్యాదప్వూకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్‌ను సీఎం అభినందించారు. యశ్వంత్‌ ప్రస్తుతం ‘హర్‌ శిఖర్‌ పర్‌ తిరంగా’ జాతీయ మిషన్‌లో భాగంగా గోవాలోని ‘సోన్సోగోర్‌’ ఎత్తైన పర్వతాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించడం సాహసంతో కూడిన అరుదైన విజయమన్నారు. దేశంలోని అతి ఎత్తైన పర్వత శిఖరాలను, ఏడు ఖండాల్లోని శిఖరాలను అధిరోయించాలనే లక్ష్యంతో శిఖరాగ్ర సమావేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందని సీఎం కొనియాడాడు. పిన్న వయసులో మౌంటైనర్‌ యశ్వంత్‌ చేసే ఈ ప్రయాణం దేశ యువతకు స్ఫూర్తిని ఇవ్వడంతోపాటు ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు.

ఇంటర్‌వర్సిటీ ఖోఖో టోర్నమెంట్‌కు కేయూ ఉమెన్‌ జట్టు

కేయూ క్యాంపస్‌: కర్నాటకలోని దేవనగరి యూనివర్సిటీలో ఏప్రిల్‌ 1 నుంచి 4వతేదీ వరకు జరగనున్న సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ ఖోఖో టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ ఉమెన్‌ జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య మంగళవారం తెలిపారు. ఈ జట్టులో జి. అఖిల, పి. శి రీష్మా, జి. పూజారాణి, కె. కావ్య,టి రజిత, ఇ. సమత, ఎం. నవ్య, బి. శైలజ, ఇ. శ్రీజ, ఎ. నందు, కె. సుమతి, కె నిష్మితా, కె. ఉషారాణి, ఎం. శిరీషా ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈజట్టుకు వరంగల్‌ ఎల్‌బీ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎ. రాజు కోచ్‌గా, ఖమ్మం డీజీటీడబ్ల్యూ ఆర్‌డీసీ ఫిజికల్‌ డైరెక్టర్‌ బి. రమ్య మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు.

పంటమార్పిడితో

నేల ఆరోగ్యం

హసన్‌పర్తి : పంటమార్పిడి విధానం అవలంబించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఏడీఆర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి అన్నారు. భీమారంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు పంటమార్పిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పత్తి పంట తర్వాత అపరాల పంట, నువ్వులు సాగు చేయాలన్నారు. వానాకాలంలో వరి, యాసంగిలో వరి కాకుండా ఆరుతడి పంటలైన పెసర, మినుములు, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేయడం ద్వారా మట్టిలో పోషకాలు సమతుల్యంగా ఉంటాయన్నారు. ఆదర్శ రైతు ఆదిరెడ్డి మాట్లాడుతూ కంది పంటకు మద్దతు ధర పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఆదిరెడ్డి, శాస్త్రవేత్త మాధవి, వ్యవసాయాధికారిణి అనురాధ, ఏఈఓలు భాస్కర్‌, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement