చెక్‌ | - | Sakshi
Sakshi News home page

చెక్‌

Apr 2 2026 8:28 AM | Updated on Apr 2 2026 8:28 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

అక్రమ రవాణాకు

ఆన్‌లైన్‌ ద్వారా ఇసుక బుకింగ్‌

సాక్షి, మహబూబాబాద్‌: ఇసుక అక్రమ రవాణా.. అవసరం ఉన్నవారికి ఇసుక అందకపోవడం.. అందినా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి చరమ గీతం పాడేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. మన ఇసుక వాహనం పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక బుకింగ్‌ నుంచి పంపిణీ వరకు అంతా పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బుకింగ్‌ ప్రక్రియ పారంభిస్తే కొందరు పోలీస్‌ అధికారులు, ఇసుక దందా చేసేవారికి ఇబ్బందిగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.

ఐదు మండలాల్లో ఇసుక

జిల్లా వ్యాప్తంగా పలు వాగుల్లో ఇసుక లభ్యమవుతున్నా.. ప్రధానంగా ఐదు మండలాల్లో ఇసుక లభ్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఆకేరు, మున్నేరు వాగుల పరివాహక ప్రాంతాల్లో ఇసుక లభిస్తుంది. ఇందులో నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడ, నెల్లికుదురు, డోర్నకల్‌ మండలాల్లో ప్రవహించే ఆకేరు వాగులో ఎక్కువ ఇసుక లభ్యత ఉంది.

అక్రమాలకు చెక్‌

ఇప్పటి వరకు జిల్లాలో లభించే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేవారు. జిల్లా నుంచి హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాలకు తరలించి ఎక్కువ మొత్తంలో సొమ్ము చేసుకునేవారు. ఈ ఇసుక అక్రమ వ్యాపారానికి కొందరు పోలీస్‌, రెవెన్యూ అధికారులతోపాటు పలువురు ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల ప్రజా ప్రతినిధులే తమ అనుచరులను పెట్టి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమ అనుచరుల ట్రాక్టర్లు మినహా ఇతరుల వాహనాలు నడపొద్దని అలా నడిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పాలసీ ద్వారా సామాన్యులు సైతం తమ అవసరాలకు కావాల్సిన ఇసుక తమ సొంత వాహనాల్లో తీసుకెళ్లే అవకాశం లభించనుంది.

పారదర్శకత కోసం కొత్త పాలసీ

ప్రతీ ఒక్కర వినియోగదారుకు ఇసుకను అందుబాటులోకి తేవడం కోసం ఈ కొత్త పాలసీ దోహదపడుతుంది. కూపన్ల పంపిణి, డబ్బుల చెల్లింపు అంతా ఆన్‌లైన్‌లోనే నమోదు అవుతుంది. ఈ పాలసీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– అనిల్‌ కుమార్‌, అదనపు కలెక్టర్‌, రెవెన్యూ

సురక్షిత సమాజ నిర్మాణానికి కృషి

ఇసుక వాహనం పేరుతో కొత్త వెబ్‌సైట్‌

పంచాయతీ కార్యదర్శి నుంచి తహసీల్దార్‌, ఎస్‌ఆర్‌ఓ వరకు

సమాచారం

అవసరాలకు అనుగుణంగా సరఫరా

అంతా ఆన్‌లైన్‌ ద్వారా..

ఇప్పటి వరకు అడ్డూ అదుపు లేకుండా సరఫరా అవుతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. ప్రధానంగా ఇందిరమ్మ లబ్ధిదారులు, ప్రైవేట్‌ గృహాల నిర్మాణం, ఇతర పనులకోసం వినియోగించే ఇసుక ఇలా మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో ఆయా అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్‌కు రేటు ఫిక్స్‌ చేశారు. అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకుంటే అది నేరుగా పంచాయతీ కార్యదర్శి లాగిన్‌కు, అక్కడి నుంచి తహసీల్దార్‌ లాగిన్‌కు ఆతర్వాత సాండ్‌ రీచ్‌ ఆఫీసర్‌(ఎస్‌ఆర్‌ఓ)కు లాగిన్‌ అవుతుంది. అక్కడి నుంచి వినియోగదారులు నేరుగా ఇసుక తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement