సాంకేతికతతో తగ్గిన విద్యుత్‌ అంతరాయాలు | - | Sakshi
Sakshi News home page

సాంకేతికతతో తగ్గిన విద్యుత్‌ అంతరాయాలు

Mar 31 2026 8:44 AM | Updated on Mar 31 2026 8:44 AM

హన్మకొండ: సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్‌ అంతరాయాలు తగ్గాయని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో సంస్థ పరిధిలోని 17 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్‌ అంతరాయాలు తగ్గించడంలో అవుటేజి మేనేజ్‌మెంట్‌ సిస్టం ఎంతో దోహపడుతుందన్నారు. స్కాడా కంట్రోల్‌ రూమ్‌ నుంచి అవుటేజి మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా సబ్‌ స్టేషన్లు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల అంతరాయాల లొకేషన్‌ తెలుసుకోవచ్చని, తద్వారా వేగంగా పునరుద్ధరణ చర్యలు చేపట్టొచ్చన్నారు. పొడవు లైన్లలో, అడవుల్లో కవర్డ్‌ కండక్టర్‌తో చెట్లు కొమ్మలు విరిగినా ఎలాంటి అంతరాయాలు ఉండవన్నారు. డైరెక్టర్లు వి.మోహన్‌ రావు, టి.మధుసూదన్‌, చీఫ్‌ ఇంజనీర్లు టి.తిరుమల్‌ రావు, టి.సదర్‌ లాల్‌, రాజు చౌహాన్‌, అశోక్‌, సురేందర్‌, జయవంత్‌ రావు చౌహాన్‌, అన్నపూర్ణ, వెంకట రమణ, జీఎంలు సామ్య నాయక్‌, శ్రీని వాస్‌, వేణు మాధవ్‌, వాసుదేవ్‌ పాల్గొన్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement